గ్రామ కైఫియ్యత్తులు: గుంటూరు తాలూకా (మొదటి భాగము)/ముట్నూరు

ముట్నూరు

కై ఫియ్యతు మౌంజే ముట్నూరు సంతు పొంన్నూరు తాలూకె

రెపల్లె సర్కారు ముత్తు౯జాంన్నగరు రాజా భావఁన్నా

మాణిక్యారావు

పూర్వం త్రేతాయుగమంద్దు యీస్తలం దండకారణ్యములోనిది గన్కు శ్రీరామస్వామివారు శీతాలక్ష్మణ సమెతులై అరణ్యవాసమునకు వచ్చినప్పుడు శితామహాదేవి రజస్వరాలయినంద్ను యిక్కడ కొలను యెప౯రచి స్నానం చేయించ్చినారు గన్కు అయొక్క కొలన్కు శీతగుండ్డం అనే పేరు వచ్చింది. తదనంతరం ఆ ప్రదేశమంద్దు గ్రామం యెప౯డి రజస్వలాపురమనె అభిదానం యెప౯డ్డది. ప్రాయశహ తెనుగుభాషను ముట్నూరు అంట్టూ వుంన్నారు. యింద్కు దృష్టాంత్తం సదరహి గ్రామాన్కు దక్షిణ పాశ్వ౯ం పూర్వం అమ్మవారు స్నానఁ చెశ్ని శితగుఁడ్డాన్కి దక్షిణపుకట్ట మీదను జమ్మిచెట్టు మొదటను వక శిలయందు శితాంమ్మవారి పాదాలు బహుసుంద్దరంగ్గా యేప౯డి వున్నది. బహుమంది జనులు యీస్తలంలోకివచ్చి యీశిత గుండ్డం యందు స్నానంచేశి అమ్మవారి పాదాలు శెవించ్చి వెళ్ళుతూవుంన్నారు.———

ద్వాపరయుగము గడచి కలియుగ ప్రవేశమయి యుధిష్టర విక్రమ శకంబ్బులు గడచి శాలివాహన శకప్రవెశమయ్ని తర్వాతను స్వస్తిశ్రీ త్రిభువన చక్రవర్తి శ్రీమద్రాజాధి రాజదేవర విజయ రాజ్య సంవత్సరంబ్బులు శాలివాహనం ౧౦౫౬ (1135 AD) శకం మొదలుకొని గజపతి శింహ్వాసనస్థుడయ్ని గణపతి మహారాజులుంగ్గారు రాజ్యం చెశె యెడల విరి ప్రధానులయ్ని గొపరాజు రామంన్నగారు శా ౧౦౬౭ (1145 AD) శకమంద్దు బ్రాంహ్మణులకు గ్రామ మిరాశిలు నిణ౯యించ్చే యెడల యీ ముట్నూర్కు వెలనాటి కౌండిన్యసగోత్రులయ్ని ఆరాధ్యుల వార్కి మిరాశియిచ్చినారు.

తదనంతరం రెడ్లు ప్రభుత్వాన్కి వచ్చి రాజ్యం చెశెయడల ప్రోలయ వేమారెడ్డిగారి ప్రభుత్వం జర్గినమీదను అనపోతయ వేమారెడ్డిగారు ప్రభుత్వం చెశెటప్పుడు యీ గ్రామం తమ మేనమామ అయ్ని నాగ సేనాపతి పెరను యీగ్రామన్కు రాజనాగపురం అనె పెరు బెట్టి అగ్రహారం యిచ్చెను.

శ్లోకం (1) పౌరోహిత్యం పాచకత్వం ప్రభుత్వం జ్యోతిస్సారం హెమముద్రా పరిక్షా
సాముద్రాఖ్యం లేఖకం యాజమాన్యం ప్రొక్తంసద్భి: గ్రామ భోగాష్టకంహి.

అనే న్యాయం చాతను అష్టభోగ సహితంగ్గా యిచ్చెను.

తా॥ గ్రామ భోగములు ఎనిమిది - అందు (1) పురోహితము (2) వంటను చేయుట (3) గ్రామాధికారము (4) జ్యోతిశ్శాస్త్రవేత్తృత్వము (5) బంగారు నాణెముల పరీక్ష (6) హస్తసాముద్రము (7) వ్రాయసదనము (8) యాజమాన్యము లేక పెత్తందారీతనము—

శాసనంలు: పాయాద్వరాహవపుషః ప్పరమన్యపుంహైదంష్ట్రా జగంత్తి శిఖరెధరణిందధానా ।
శృంగాగ్ర భాగపరిచుంబ్బిత మెఘబింబ్బాసుం లక్ష్యమాణ సుపమేవ శశాంక్కరేఖా॥

తా॥ వరాహావతారుడైన పరమపురుషునియొక్క - ధరణీధరమైన దంష్ట్రకొమ్ముల యందు మేఘములుండిన చంద్రలేఖాకాంతివలె శోభించుచుండెను.

౨.శ్లో॥ లిలాద్యూత జితాంకుశధరకళాం మౌశౌద్వడంకిలితా
మాహిత్తున్ం యుగముంన్నమయ్య భుజయోరిదిన్ శ్లేషయంత్యా మిధః |
పార్వత్యాః కుచకుంభపారశ్వన్ యుగళేసత్ప్రేమలొ లెక్షణః
కాలక్షేపణ మింద్దుమోచన విదౌకాంక్షం శివః పాతువః ॥

తా॥ పార్వతీ పరమేశ్వరులు విలాసముగ నాడుకొనెడి యాటలో గెలుచుకొనబడినదియు, అంకుశకళను ధరించినదియునగు చంద్రకశను శిరసుపై దాచి పెట్టుకొనియెనని శివుడా పార్వతీదేవి గుంజుకొన బ్రయత్నించెడి రెండుచేతులు కౌగిలిని వదలించుకొనుచు తనకు స్పర్శసుఖము నొసగెడి యామె కుచకుంభములపై ప్రేమదృక్కుల బఱపుచు, ఆయం కుశకళవలెనున్న చంద్రకళను పార్వతికి జిక్కినదానిని విడిపించుకొన జూచెడివాడై మిమ్ము రక్షించుగాక :-

౩.శ్లో॥ తమె హరెతాంత్తవ పుష్పవంత్తా ।
రాకాసు పూర్వపరశైలభాజౌ |
రథాంగ్గలీలా మివదశన్ యంత్రా |
పురాపురారెః పృధివీరథస్య ॥


తా౹౹ పూర్వము త్రిపురాసుర సంహారకాలమున భూమిని రథముగ జేసికొనిన శివుని యొక్క యారథచక్రములకు వలెనున్న సూర్యచంద్రు లిర్వురును పున్నమ దినములలో - ప్రాక్పశ్చిమాద్రుల వెలుగొందెడివారై నీకు పుష్పములుగా శోభించుచు ఐహికాముష్మిక దుఃఖములను హరింతురుగాక!

౪.శ్లో॥ యన్మౌళౌనిహితం, చిరాయనిగమైద్వి౯ యంద్య యుద్యోగిభిశి
వ్యల్లక్ష్మికర పల్లవాదరగతం సంవ్వాహనై తా౯లితమ్ |
జాతాయత్రవియన్నది త్రిజగతి సంత్తాప నిర్వాపిణీ |
తస్మాదా విరభూత్ప దాన్మధురిపో వర్ణశ్చతుర్థీ ఽవరః

తా॥ ఏయది బలిచక్రవర్తి శిరమందుండెనో, ఏది మహాయోగులచే వేదవాక్యములతో గొని యాడబడియెనో, ఏదానిని లక్ష్మీదేవి సంవాహనాదులచే (కాళ్లొత్తుట) నిత్యము సేవించుచుండెనో, దేనినుండి ముల్లోకసంతాపమును, పాపమును హరించెడి గంగానది యుద్భ వించెనో యా విష్ణుమూర్తి పాదమునుండి నాల్గపదియైన శూద్రజాతి జన్మించెను.

౫.శ్లో॥ వినిమి౯తొ విశ్వస్వజాప్రయత్నాత్ప ర్వేషు వణె౯ష్వపి సారభూతః ।
లొకె మహప్రణతయాధ్రసిదః సస్యశ్వాన ఘోషశ్చ చతుర్ వన్న౯ః౹౹

తా॥ బ్రహ్మదేవుడు వర్ణములలో (అక్షరములలో) నాల్గవవర్ణములను అనగా ఘ, ఝ, ఢ, ధ, భ- అనువానిని సర్వవర్ణములలో మహాప్రాణములనియు శ్వాసములనియు, ఘోషములనియు నిర్మించెను. (ఇది వ్యాకరణ శాస్త్ర ప్రసిద్ధము) అట్లే చతుర్థ వర్ణము శూద్రపర్ణము సర్వవర్ణముల వారికి ప్రాణభూతమైనది.

{{

౬. శ్లో॥ తస్మాదభూద్వెమయ సైన్యనాదొ వంశస్య కత్తా౯ వర విక్రమశ్రీః |
పృధు ప్రతాపస్య భుజెనసారెగౌక్కా దసూర్యెణఘ గురై ని౯బధాః |

తా॥ ఆ విష్ణుపాదమునుండి - పెద్దవాడైన ప్రతాపరుద్రుని సైన్యనాధుడును ; విక్రమశీలుడునగు వేమయ్య అను నాతడు పుట్టెను - అ ప్రతాపరుద్రు భుజబలముచేత భూదేవి సారముగలదై ఆయన యందలి సుగుణములకు సంతసించి కోరిన కోరికలను ప్రసవించుచుండెను - ఇందు గౌః = అను శబ్దమునకు భూమి- ఆవు- అను రెండర్థములు గలవు - కావున ప్రతాపదుని పరిపాలనలో భూమి కామధేనువువలె కోరిన కోర్కెలనిచ్చు చుండెనని భావము ——

{{

2.శ్లో॥ సంగ్రామపార్ధన్ శరైర్విద్విభిన్నా యస్యారిచూడామణయోవిచేలుః
ఆక్రామతస్సంయధి రాజవంశా౯ ప్రతాపవంహ్నోరివ విస్ఫులింగాః |

తాః॥యుద్ధములో నర్జునునివంటి వాడైన యీ ప్రతాపవంతుడు శత్రురాజుల వంశములను తన ప్రతాపాగ్నిచే కాల్చుచుండగా పైకెగసిన మిణుగురులవలె - శత్రురాజుల కిరీటములందలి మణులు యుద్ధమున ప్రతాపముచే నెగురగొట్టబడినపై యటునిటు పడుచుండెను.


౮. శ్లో॥ పుత్ర స్తస్య భుజాదినిజిన్ ప్రోలక్షమాథిశ్వరొ
యస్యోదగ్రతర ప్రతాపరవిణా సంత్తావతావైరిణః |
విద్ధఁతేనచనిర్వ౯తిం జలని ధిధ్వీర్దీ పెష్వనూ వేషుచ
ఛాయావృక్ష సమాకులేషు సరితాలకూలేషు శైలేషుచ ॥

తా॥ ఆ వేమరాజ పరితాపముచే వైరిరాజులందరును సంతప్తులై సర్వులు ఆయనకు వశులైరి - ఆతని పుత్రుడు ప్రోలయరాజు - ఆ ప్రొలయ తన పరాక్రమముచే శత్రువులను పారద్రొలగా నా శత్రువులందరును - సముద్ర ద్వీపములందు, అడవిలోని నీటి పడియ లందును, వృక్షచ్ఛాయలందు, నదుల తీరములందు, పర్వతములందును తలలదాచుకొని యుండిరి.

౯. శ్లో॥ యత్కీతీ౯గానసమయే ఫణిసుంద్దరీణా (గా)
మాలొకితుంచ్చముఖ రాగమసంగ్గమూలం॥
శ్రోతుంచ గీతరచనం యుగపన్నదక్షా
నాగాధిఫొన సహతే నయన శృతిత్వం॥

తా॥ (సాధారణముగా పాములకు కన్నులే చెవులు ఇక దాని నాధారముగా గొని యీ కవి చమత్కరించుచున్నాడు. ఏమనగా ?) ఆ ప్రోలరాజుగారి కీర్తిని గానముచేయు నాగాంగనల ముఖములను రాగముచే నెఱ్ఱవారగా - ఆ గానమును వినవలయుననియు.- అదే సమయమున నా ముఖముల జూడవలయుననుకొన్న ఆదిశేషువు తనకుగల చక్షుశోత్ప్రత్వమును సహింపలేకపోయెను - అనగా పాతాళలోకము వఱకు ప్రోలరాజు కీర్తి వ్యాపించే సనియు - సహస్ర వదనునకుగూడ దానిని వినవేడుక గలిగెనని తాత్పర్యము -

శ్లో॥ (౯) సెంద్దోశ్రీరివ దొడ్డయాద్గుణనిధే జాన్ తాన్నమాంబ్బాతతః
శ్వాసితత్పురుషో త్తమస్యదయితా సాచక్రమేణాకృశి |
సాద్వి విరమసూత మాచనృపతిం శ్రీవేమ పృధ్వీపతిం
దొడ్డక్ష్మాభుజమంధకార రవినాం శ్రీ వల్ల భూపల్లభంః |

తా॥ పాలసముద్రము నుండి లక్ష్మి జనించినట్లు దొడ్డరాజు అనే పేరుగల వానికి అన్నమాంబ యుదయించెను - ఆమె పురుషోత్తముడయిన ప్రోలయకు భార్యయయ్యెను. ఆపతివ్రతయు-నుత్త మురాలగు అన్నమాంబ క్రమముగ మాచయ్య వేమయ్య దొడ్డయ్య అను వారిని సూర్యకాంతిని ధిక్కరించు రాజులను గనెను –

శ్లో॥ (౧౦) తేషాంసర్వగుణోత్తర స్పురపతే శ్రీశ్రీవేషభూమీశ్వరొ
హూమాద్రి ప్రతి మానదాననిరతో ధర్మప్రతిష్ఠాగురు :
యస్మి౯శాసతిపాక శాసననిభేసత్వా౯మహిమండలం
ప్రష్టంత్తి క్రతుభాగదాన నిరతా భూనిజ౯రా నిజ౯రా ॥

తా॥ ఆమువ్వురిలో వేమరాజు సర్వసుగుణోపేతుడు- మేరుపర్వతమునైన దానమీయ సమర్థుడు-ధర్మస్థాపకుడు- ఏవేమరాజు భూమిని సర్వమండలాలంకారముగ బాలించుచుండెనో ఆరాజు పరిపాలనా కాలమున యువకులు బ్రాహ్మణులందఱు యజ్ఞభాగములతో దేవతలను తృప్తి పఱచుచుండిరి.

శ్లొ౹౹ (౧౧) ప్రాదాద్పుణ్య తరంగణి ముభయతః కృష్ణాంచ్చ గొదావరిం
నిప్రేభ్య ః కిల వేమభూతలపతి స్సారాగ్రహారా౯ బహూనా౯ ॥
నైతచ్చిత్య్రమనస్య రాజసుకరం నిశ్చిమ దానం భువా
యెన బ్రాహ్మణ జాతి సూత్రసులభావృత్తిః కృతావణ్వ౯త ॥

రా॥ వేమరాజు కృష్ణా గోదావరియను ఉభయనదుల ప్రక్కగా ననేకా గ్రహారములను పుణ్యదినములలో దానమును జేసెను. ఇది యొక చిత్రముకాదు.ఏవేమరాజు పరిపాలనా సమయమున బ్రాహ్మణ మాత్రవృత్తి చాల సుఖకరమైనదిగా భావింపబడెనో అట్టి యారాజు భూమిని హద్దు లేనంతగా బ్రాహ్మణులకు దానమును జేసెను.

శ్లో॥ ౧౨, స్తంభా౯ కీతిన్ కృతే విస్వజింత్యకుశలా భూమీశ్వరా నీశ్వరా
నిశ్చిమాన్య కృతిర్వినిర్మల మతిశ్శే వేమపృధ్వీపతి ః 1
యేన శ్రీగిరి రస్యహోబళగిరి స్సోపానమార్గాంక్కితా
విఖ్యాతాం రచితా సనాతన యశస్సంబా-తలం భూతలే ॥

తా॥ కీర్తి కొఱకా వేమరాజు భూమికి స్తంభములవలెనున్న రాజుల జయించి ఇతురులొ నర్చిన పనులనన్నిటిని సంపూర్తి చేసి ప్రకాశించు చుండెను సనాతనమైన కీర్తి నార్జించుకొనిన యీభూలోకమందు ఏరాజు ( శ్రీగిరి పర్వతము లేక శ్రీ శైలము) అహోబిల క్షేత్రములకు సోపానముల నిర్మింపజేసెనో అతడే ప్రస్తుతరాజై ప్రకాశించుచుండెను.

శ్లో॥ ౧౩. వేమక్క్షితీ శోవృషమేకపాదం ఖంజప్రకారం కలికాలదోషాతి
చత్తాగ్రహార ద్విజ వేదశక్త్యాపద క్రమైరస్థలితంచకార

తా॥ ఆవేమరాజు- కలికాలదోషముచే నేకపాదముతో కుంటుచున్న ధర్మమను వృషభమును - సత్ప్రహ్మణుల కగ్రహారాది దానములిచ్చుటచే వారు వర్ణించెడి పదక్రమ (వేదములోని సంజ్ఞలు) ములతో నడువగల దానినిగ జేసెను——

శ్లో॥ ౧౪. ధర్మాత్మజోదాశరధిః పృధుశ్చాప్యు దీర్యమాణాని
యుగాంత్తరేషు। వితర్కయే వేమన రేశ్వరస్య
పుణ్యాని నామాని పురాతనాని ॥

తా॥ యుగాంతరములలోనున్న పుణ్యపురుషులగు శ్రీరాముడు, ధర్మరాజు-పృధు చక్రవర్తి అను రాజులు వేమరాజు పరిపాలనలో సర్వదా గుర్తుకు వచ్చుచునే యుండిరి.

శ్లో॥ ౧౫. శాకాబ్దే వర?తర్క భానుగణనాయుక్తొ శుభౌ తారణే
ఫాల్గుణ్యాము పరాగపుణ్య సమయె శ్రీవేమ భూమీశ్వరః|
పుణ్యార్థం నిజమాతులస్యకృతిన శ్శ్రీనాగ సేనాపతేః
గ్రామం ప్రావిశదష్టభోగ సహితం ముట్నూరినామాంక్కితం॥

తా॥ శాలివాహన శకం-'1265వ సంవత్సరమునకు సరియగు తారణ నామ సంవత్సర పాల్గుణ మాసములో వచ్చిన గ్రహణసమయమందా వేమరాజు- నాగ సేనాపతి అను పేరుగల తన మేమగారి సద్గతికై ముట్నూరు అను పేరుగల గ్రామమును అష్టభోగ సహితముగా దానించెను.

<poem>శ్లో ౧౬. దత్తం మాతుల పుణ్యాయచైక భాగంత్తు శాశ్వతం। కృత్వాగ్రామం తస్యనామ్నా రాజా నాగపు రంవ్యధాత్ ॥</poem

తా॥ తనమేమగారి పుణ్యార్థ మొక్క భాగమును విభజించి దానికాయన పేరుతో 'నాగపురము' అను నామము నొనరించెను.

శ్లో॥ ౧౭. ప్రాదాత్ మృత్యుంజయార్భాయ యావనాళకులాయచ I
కౌండిన్యముని గోత్రాయ సాష్టభోగైః పరార్థకం ॥

తా॥ మిగిలిన మూడుభాగముల పురమును అష్టభోగములతో గూడ ఆ వేమరాజు జొన్నలగడ్డ వంశీకుడును-కౌండిన్యస గోత్రీకుడైన మృత్యుంజయుడను బ్రాహ్మణునకు దానముగా నిచ్చెను.

అని యీ ప్రకారంగా స్వస్తి శ్రీ శాలివాహన శకవరుషంబ్బులు ౧౨౬౫ (1343 AD) అగు నెటి తారణనామ సంవత్సర ఫాల్గుణ శు 15లు చంద్రగ్రహణ కాలమంద్దు జ్నొలగడ్డ మృత్యుంజయార్యులుగార్కి శ్రీమతు అనపోత వెమరెడ్డింగారు తనమెనమామ యయిన నాగ సేనాపతి పెరను యీ ముట్నూర్కు రాజనాగపురం అనే అభిదానం చేశి అష్టభోగ సహితంగ్గా అగ్రహారం యిచ్చిరి గన్కు పయ్ని వాశ్ని మృత్యుంజయాలు౯ వెదశాస్త్ర శ్రొత విద్వజ్జన కోలాహలులై నిరంత్త రమున్ను బ్రాంహ్మణులకు అంన్నదానం చేస్తూ కొన్ని దినములు అనుభవించ్చి తర్వాతను యీయ్న పుత్రుడైన అనంత్త సోమయాజి తదనంత్త రం యీయ్న సుతుడు త్రియంబక దీక్షితులు ఆదనాగ్ని హూత్రం అవిచ్ఛన్నంగా జర్పుకొని శాలివాహన శక వరుషంబ్బులు ౧౪౩ఽ (1515 AD) శకమంద్దు శ్రీకృష్ణదెవరాయలు ప్రభుత్వంలో యీగ్రామాన్కి వుత్తర భాగమంద్దున చెర్వు తవ్వించ్చి యర్రచెరువు అని నామాంక్కితంచెశి యీశాన్య భాగమంద్దున బావి తవ్వించి పెద్దబావి అని నామాం క్కితముచెశి గ్రామ మధ్యమంద్దునను శివస్థళం కట్టించి రామలింగ్గస్వామి వార్ని ప్రతిష్టచేసి అర్చకత్వానుకు కౌశిక్క గోత్రుడయ్ని చెబ్రోలు రామాబొట్లు అనె పూజారిని నియామకంచెసి నైవెద్య దీపారాధన్కు కు౧ పొలం మాన్యం యిచ్చినారు. యీయ్న కోమారుడు రామకృష్ణ సోమయాజి యితని పుత్రు అయ్ని బైరవ సోమయాజులు యితని సుతుడు అంన్నభోట్లు యీయన కొమారుడు వెంక్కటభొట్లు విరి తనయులు భయిరవభొట్లు యీ పెద్దిభొట్లు భయిరవభొట్లు కొమారుడయిన లింగ్గంభొట్లు యితని కొడుకు అన్నంపూణ౯ బొట్లు యీయ్న తనయులు దక్షిణామూత్తి౯ - సోమయాజులు గారు వుదయించిరి గన్కు విరు మహ ప్రబలులై శాలివాహనం ౧౫౯౪ (1672 A. D.) అగునెటి పరిధావి నామ సంవ్వత్సర మందు గ్రామాన్కి దక్షిణ పాశ్వ౯ మంద్దున పూర్వకాలం నుంచ్చివున్న సిత గుండ్డం జలధిమట్టుకు తవ్వించ్చి గ్రామ మధ్య మయ్ని సోమవీధికి పశ్చిమ భాగ మంద్దున విష్ణుస్థలం కట్టించి గోపాలస్వామి విగ్రహాన్ని చేయించ్చి ప్రతిష్ట చేశి అచ౯ కత్వాన్కు భారద్వాజ గోత్రుడయ్ని పెద్దింటి నారాయణప్ప అనే వైఖానసుణ్ని పొంన్నూర్ నుంచ్చి తిస్కు వచ్చికు ౧ మాన్యం యిప్పించ్చి పండ్డుగ పర్వాలకు మొదలయ్ని వుత్సవాదులు జరిగిస్తూవుంన్న మీదట శాలివాహనము ౧౬౦౮ (1686 AD) క్రోధన సంవత్సరములో సుల్తానబ్బులహస౯ పాదుశహగారు తఖ్తుకు అధికారిఅయి రాజ్యం చేశెయడల వీరి దగ్గర అక్కంన్న మాదంన్న గారు ప్రధానత్వం చెస్తూ వుండ్డి పూర్వపు రాజులవలెనె అగ్రహరం జర్గించ్చిన పింమ్మట పుణ్యపల్లి గోత్రోద్భవులయ్ని కృష్ణాణి రఘుపతి మాణిక్యరాయినింగారి కొమారులయిన జంగ్గమయ్య మాణిక్యరాయునింగారు పయ్ని వ్రాశ్ని దక్షిణామూర్తిన్ సోమయాజులను కూడా తీస్కుని గోలకొండ్డ వెళ్ళి అక్కంన్న మాదంన్నగారి పరంగ్గా పాదుశహ వారి దర్శనంచేశి

ఫరమానా వ్రాయించ్కుని తిర్గి దేశంలోకి వచ్చి కృష్ణాగర్భమంద్దున మీకు రెడ్డిదత్తి అగ్రహరమైన ముట్నూరు వలన మాకు రాగల రుసుము సావరాలున్ను పట్టి పర్పు పంచ్చిపోతలు? రాగల రొఖ్కమున్ను మా సంస్థానములో పుత్రపౌత్ర పారంపర్యంగా మీకు శ్రీరామాప౯నంగ్గా యిస్తిమి గన్కు మీ పుత్రపౌత్ర పారంపర్యంగా అనుభవిస్తూ మమ్మును ఆశీర్వచ్నము చెస్తూ పుఁడ్డుము అని దాన పత్రికలు వ్రాయించ్చి యిప్పించినారు.శా ౧౬౧౧ (1689 AD) అగు నెటి విభవనామ సంవ్వత్సరములో ఆవరంగ్గళహపాదుశహ గారు తాలూకాలు దేశస్థుల తెరగడలు చేశి యిప్పించిరిగన్కు అక్కడనుంచి శ్రోత్రియమనీ కొద్ది గొప్ప శిస్తు యెప౯రచి పుచ్చుకొనిరి. అక్కడనుంచ్చి శకం ౧౬౪౧(1719 AD) ఆగునేటి విళంబ్బినామ సంవ్వ త్సరములో భొజ్జబహదరు గారు సుభా నుంచి వచ్చి వికారి సంవ్వ త్సరములో మాఘ శుద్ధ ౩ ఆదివారం ముట్నూరు ప్రవేశించ్చి హవేలీ కట్టించడాన్కు కన్యాలగ్న మంద్దు స్తంభప్రతిష్ట చేయించ్చి హవెలీ కట్టించ్చి తయారు అయ్ని తర్వాతను వక బావి తవ్వించ్చి హవెలీలో ప్రవేశించ్చి యీ మూత్తి౯ సోమయాజులు గారి యంద్దున చాలా ప్రీతి చేస్తూ తాలూకాలో ఆజ౯మశాతు మొదలయ్ని వాట్కి పంపించి దరియాప్తు పుచ్చుకుంటూ గ్రామం నూరువరహాల్కు శ్రోత్రియఁగ్గా యిప్పించ్చెను. అక్కడ నుంచ్చి తాలూకా జమీదాలు౯ మూడు వంట్లుగా పంచ్చుకొనిరి గన్కు యీ గ్రామం మాణిక్యారావు వారి వంట్టులో వచ్చినది గనుకు రమణయ్య మాణిక్యరాయినింగారు శ్రోత్రియంగా అగ్రహరం జర్గించినారు. అంత్తట మూత్తిన్ సోమయాజులు గారు గతించిన తర్వాతను తత్పుత్రుడైన విశ్వేశ్వర సోమయాజులు గారు యీయ్న అన్న కొమారుడయ్ని రామేశ్వర సోమయాజులు గారికి పయ్ని వ్రాశి రమణయ్యగారు వీరి తంమ్ములయి మల్లంన్నగారు ప్రభుత్వంచెశ్ని తర్వాతను వీరి తంమ్ములయ్ని శీతంన్నగారు పయ్ని వ్రాశ్ని సోమయాజులుగార్కి గ్రామంర్సుము నావ రాసులు సమెతు శ్రోత్రీయపు దానపత్రికలు వ్రాయించ్చి యిప్పించి నడిపించ్చినారు గన్కు యీప్రభుత్వములో గ్రామాన్కు పశ్చిమ భాగమంద్దున అగ్ని హోమంచెశి ఆ స్తలమందున వనం తోట వెయించ్చిరి. స్న ౧౧౬౦ (1750 AD) ఫసలి వచ్చె వర్కు శీతంన్నగారు ప్రభుత్వం చెశ్ని తర్వాతను ఆఫసలిలోనే ఫరాఁసువారు ప్రభుత్వానకు నచ్చి న్న ౧౧౬2 (1757 AD) వర్కు అధికారంచెసిరి గన్కు పయ్ని వాశ్ని పెద్దిభొట్లు సంత్తతివాడయ్ని శీతారాముడు విశ్వశ్వర సోమయాజులు రామేశ్వర సోమయాజులు తాను గ్రామపెత్తనం చేస్తూ రుధిరోద్గారి సంవ్వ త్సరంలో గ్రామాన్కు వాయువ్య భాగమంద్దు తన పెరిట గొప్ప చరువు వేయించెను. యితని తంమ్ముడయ్ని మత్యుంజయుడు యీచెరువుకు దక్షిణ భాగమంద్దున వ్యయనామ సంవత్సరములో వనంతోట వెయించ్చెను.

స్న ౧౧౬౦ (1750 AD) ఫసలీలగాయతు ౧౧౬౮ (1758 A D ) ఫసలీ వర్కు గోపాలమాణిక్యరాయినింగారు అధికారం చెశ్ని తర్వాతను పయ్ని వ్రాశి శీతన్న మాణిక్యరాయినిం గారి కొమారులయ్ని జంగ్గన్న మాణిక్య రాయిని ప్రభుత్వములో స్న౧౧౮౨ (1772 A౨) ఫసలీ విజయనామ సంవ్వత్సరం పర్యంత్తరం అగ్రహరపు సౌంజ్ఞనే శ్రోత్రియంగా జరుపుతూ వచ్చినారు.

అక్కడ నుంచి కోటమరాజు వెంక్కట పంత్తులు అనే అతను జంగ్గన్నగారి దగ్గర దివానుగిరి చేస్తూ వుండ్డి ఆగ్రహరీకుల మీది గిట్టమీచాతను శిస్తు పెంచ్చి బాలరాష్టు క్రింద తెచ్చి స్న ౧౧౮౬ (1776 AD) ఫసలీలో విశ్వేశ్వర సోమయాజులుగారు గతించ్ని పింమ్మట ఆ గ్రామం అలాయిదాగా, యిజారా యేప౯రచినారు గన్కు తదారభ్య యీవర్కు జంగ్గన్న మాణిక్యరాయినింగారు భావన్న మాణిక్యరాయినింగారు వీరికి పూర్వం నుంచ్చి జరుగుతూవుంన్న కు౬ పోలం సోమయాజులు గారికి సర్వదుంబ్బాలా నడిపిస్తూ వుంన్నారు.

యీ గ్రామంలో వుండె యినాములు — దఫా రాజా సీతన్న మాణిక్యరాయినింగారు యిచ్నిది. C J ౦ ౦ 5 yo o ౮॥ దపా C 3 శ్రీ రామలింగస్వామికి శ్రీ కేశవస్వామి వార్కి జొన్నలగడ్డ విశ్వేశ్వర సోమయాజులుగారికి. బాలకి సంగ్గన్నకు ౧౬౩ శకం యిచ్నిది కు రాజా రఘుపతిరాయుడు యిచ్నె యినాములు — నెతి వేంక్కట దీక్షితులు గారికి. శా ౧౬౮౫ శకం. స్న. ౧౧౭ జు ఫసలి పారవనామ సంవత్సరములో యిచ్నిది. తెరీజు జంగ్గన్న మాణిక్యారాయినింగారు యిచ్ని మాన్యాలు — ౧౨40 భాగవతుల అచ్చంన్న దీక్షితులుగారికి శకం ౧౬౯౦ (1768 A.D) సర్వధారినామ సంవత్సర వైశాఖ శుద్ధ ఏం స్నదు అయ్నిది. 3 అయ్ని O UO యీయ కౌమారుడు అయ్ని శివ్వంన్నకు శోధినామ సంవత్సర వైశాఖ శుద్ధ ౧౨ లు స్వదు. కుచ్చలుకు క్రోధినామ సంవత్సర పుష్య బ ౫ లు యీ శివ్వయ్య అవధానులు గారికి - దానపత్రికె వాశియిచ్నిది. ముట్నూరు ౦ u o సామవేదం తిరుమలాచాలు గారికి స్నదువున్నది. తారీఖు తెలియలేదు. మాన్యం 9 4౦ 2. 0 C O 1 0 58 తాడేపల్లి వెంక్కట నర్సావధానులు గారికి న్న ౦౧౯౧ (1781 A.D.) ఫసలి శభకృతు నామ సంవత్సర పుష్యశుద్ధ రాలు సదు మాన్యం పొంన్నపల్లి అన్నేశ్వర సోమయాజులు గార్కి స్నదు వున్నది. మాన్యం. ఆక్కిరెడ్డి పురుషో త్తమావధానులు గారికి న్నదు పరశురామప్రీతి అయింది. స్న ౧౧౯౨ (1782 AD) ఫసలి శుభకృతునామ సంవత్సరమునుంచి డుంబ్బాలాలు వున్నది. కంభంపాటి కృష్ణ సోమయాజులుగారికి స్నదు వున్నది. తారీఖు తెలియదు మాన్యం పాతికె. రామపురి గురువులయి సత్యబోధ స్వాములవారికి నవాబు పరమానా ప్రకారం రాజా జంగ్గన్నరావుగారు వ్రాయించిన స్నదు వున్నది తారీఖు తెలి యదు. మాన్యం మూడు కుచ్చళ్ళన్నర అయి గొల్లపూడి రామలింగావధాన్లు గారికి స్నదు వున్నది తారీఖు తెలియలేదు . ౦ ౦ భాగవతుల అన్నెశ్వర సోమయాజులు గారికి న్న ౦౦ .. ఫసలి వికారినామ సంవ్వత్సరం వైశాఖ శు౨లు స్నదు. సుసల౯ సుబ్బన్నకు DUE (1776 AD) ఫసలి హెవళంభినామ సంవ్వత్సరం వైశాఖ శు ౨లు స్నదు నెతి వెదనాగలింగ్గు సోమయాజులుగారికి స్న ఉv (1780 AD) ఫసలి ప్లవనామ సంవత్సర శ్రావణ శుంలు స్మదు కుచ్చళ్ళు ౦ జ్నొలగడ్డ లింగప్పకు స్న౦౧౯౦ (1780 AD) ఫసలి ప్లవనామ సంవ్వ త్సర వైశాఖ శు౨లు స్నదు ఆర కుచ్చలు. ౦ ౦ దర్భా కృష్ణంభొట్లకు స్న ౧౧౯౧ (1781 AD) ఫసలి శుభకృతు సంవ్వ త్సరం వైశాఖ శు౨లు స్నదు ప్రభలు శీతారాముడికి స్నదు పరశురామప్రీతి అయ్నిది. స్న ౧౧౯౨ (1782 AD) ఫసలి శోభకృతు నామ సంవత్సరమునుంచి దుఁబ్బాలాలు వున్నది. గన్కు నడుస్తూ వుంన్నమాన్యము ౦ 4 - యీవని నారాయణ భొట్లుగారికి స్నదు పరుశరామప్రీతి అయ్నిది. ఆనంద నామ సంవ్వత్సరము నుంచి దుంబ్బాణాలు వుంన్నది. 54 o C 0 " Co b ధపా C o C O రాజా భావనారాయణ మాణిక్యారాయనిఁ గారు యిచ్చిన మాన్యాలు. జ్నొనలగడ్డ శంక్కరప్ప గారికి స్న ౧౦౯౯ (1789 AD) ఫసలి విరోధి కృతి సంవత్సర వైశాఖ శు లు స్నద్ను మాన్యం- ౦ 4 జొన్నలగడ్డ చిన అప్పయ్యకు సదుఁమజాతినామ సంవత్సర కాతీజాక శు ౦౫లు మాన్యం అరకుచ్చల సదుచేరువు యజ్ఞనారాయణ శాస్తులు గారికి వున్నది. తారీఖు తెలియదు మాన్యం 6 చింహ్నలు, వలివేటి పేరు శాస్తులుగారికి స్నదు సంవత్సర వైశాఖ శు౨లు మాన్యం. త్సరములినుంచ్చి వుత్తరువు అయింది. బలిజేపల్లి పేరప్ప స్నదు స్న ౧౧౯ (1784 A D) ఫసలి క్రోధి సంవ్వ త్సర మాగ౯శిర శు ౧ంలు మాన్యం కుచ్చళ్ళు — మెడిచల౯ లక్ష్మీనరసగార్ని మాన్యం పాతికె తారీఖు తెలియదు. (3 2 గో తేరీజు C భాగవతుల రామభొట్లుగారికి స్నదు వున తారీఖు తెలియలేదు మాన్యంపాతి కె. కోటంరాజు నర్సంన్నకు సదు వున్నది. తారీఖు తెలియలేదు. మాన్యం కుచ్చల- భాగవతుల లక్ష్మీనర్సయ్యకు సదు వున్నది. మాన్యం. 9 4 గ్రామ కైఫీయత్తులు (1772 AD) ఫసలి విజయనామ పాతికె యీమాన్యం యిరవై సంవ్వ I a 2 జములా యిరువది అయిదు కుచ్చెళ్ళ పద్నాలుగు వీసాలు అన్యగ్రామన్య శీమ

యీశాన్యానికి కోవెలమూడి చెబ్రోలు కూడలి మంమ్ముల కుంట్ట నడియ చింహ్న ఆకుంట్ట వడియనడుముగా దక్షిణముఖమై నడువగా రామకోటి సకటి తూవు౯ దరిని చెబ్రోలు,కోడూరి కూడలి ముమ్ముల వుంన్న పెద్దపుట్ట తూపు౯ధరిని రెండ్డు రాతి స్తంభాల చిహ్న. ఆ రాతిస్తంభాల వద్దనుంచ్చి కొట్టి తూపు౯ దక్షణ ముఖమై నడువగా సూర్య చంద్రాంక్కితమైన . . ఖ ం॥ం దాటి దక్షిణం నడువగా కోడూరి తెరువుదాటి యర్రరాయి స్తంభముమీదుగా కుంచాల మెరద తూపు౯ బాలు పుట్టలమీదుగా కోడూరి జూపూడి కూడలి ముమ్ములవున్న నెలపడియ యర్రరాతి స్తంభంచిహ్న తూపున్ దరిని లెమల్లె చెబ్రోలు కూడలి మమ్ముల రెగులకుంట్ట చింహ్న ఆ కుంట్ట తూవున్ కట్టకుని... కుని తూపు౯ ముఖమై... నడుపగా చాటతెలన్ కుంట్ట అంద్దునుండి పడమర ముఖమై నడువగా వువ్వి(?) పోచ, యర్రరాతిస్తంభం చిహ్న, అక్కడ నుంచ్చి నయిరుతి ప్రదీచి ముఖమై నడువగా జావూరి తెరుపుదాటి పోంగ్గా చవిటి దక్షిణపుదరిని యర్రరాతి స్తంభం దాటి నేలపడియ పువ్వి పొదచిహ్న అక్కడ మేడితాప, యీ మెడితాపఘట్టు పట్టుకొని దక్షిణ ముఖమై నడువగా పూడి కాలి౯ మల౯ కూడలి మమ్మూలకుంట్ట పడియ దక్షిణపు కుంట్ట చిహ్న ఆ దక్షిణపు కుంట్ట కట్టనుండ్డి నడువగా రెండు అడ్డవాగులుదాటి కాలి౯ మల్౯, పల్లూరి తెరువులు దాటి కాటి దక్షిణంగా కాలి౯చల౯(?). కారెంపూడిపాడు కూడలి ముమ్ములకుంట్ట మడియ శంఖుపక్రాంకితమైన యర్రరాతి స్తంభ చిహ్న.

అంద్దునుండి వుత్తరముఖమై నడువగా కారెంపూడి తెరువు పట్టిపోగా కన్యధార కుంట్టు పడమటి గట్టు మీదుగా వుత్తరమై నడువగా కుంట్ట పడియ(?) పులిచింత్తలు చింహ్న అక్కడ మెడితాప ఆమెడితాపట్టు పట్టుకొని పడమట నడుపగా కుంట్ట పడియ చిహ్న అక్కడనుండి వుత్తర ముఖమై నడువగా పడియ చిహ్న. అక్కడ పెడితాప ఆమెడితాప పడమర ముఖమైన నడుపగా కారెంపూడిపట్టు చెర్కూర్ కూడలి ముమ్ములపెద్దకుంట్ట పడమటి కట్ట చిహ్న. అక్కడ నుండ్డి వుత్తరముఖమైనడువగా చెర్కూరు తెరువులో కుంట్ట పడమడి మీదుగా వుత్తరమైనడువగా వరగోగు కుంట్ట వుత్తరపు పడమటి మూలను యెఱ్ఱరాతి స్తంభం మీదుగా ఉత్తరమే పోగా చిల్కముక్కు సల్లరాతి స్తంభం డమురుగత్రిశూలము సూర్య చంద్రాంకితమైన వట్టె చెర్కూరు లెమల్లెపాడు కూడలి ముమ్ములచిహ్న అంద్దునుండి తూపు౯ ముఖమై నడువగా యర్రరాతి స్తంభం మీదుగా యీశాన్య ప్రాచీనమై నడువగా వెమల్లెతెరువుకుంట్ట వుత్తరపు కట్టమీదుగా తూపె౯ నడువగా చెబ్రోలు కోవెలమూడి కూడలి ముమ్ములగారలకుంట్ట దక్షిణపు కట్టమీదుగా తూపు దరినివున్న యర్రరాతి స్తంభంచింహ్న అంద్దునుండి ఆజ్ఞేయ ప్రాచీనడువుగా గణపతి కుంట్ట తూర్పు కట్ట నడుమనువున్న గణపతి మీదుగా ఆజ్ఞేయ ముఖమై నడువగా కుంట్ట వడియ రాతిస్తంభం అక్కడనుంచి తూపు౯ నడువగా కోవెలమూడి తెరువు దాటి చుట్టూ కట్టకు పుత్తరపుకట్ట చిహ్న అక్కడ నుంచ్చి తూర్పు నడువగా చేబ్రోలు కోవెలమూడి కూడలి ముమ్ములకుంటలు. తేషాం మధ్యవర్తి క్షేత్రం

శ్లోకము॥ స్వదత్తా ద్విగుణంపుణ్యం పరదత్తాను
పాలనం పరదత్తాపుహరెణ
స్వదత్తం నిష్పలం భవేత్
స్వదత్తాం పరదత్తాం వ్యాదయోహరేశి

వసుంధరాం
షష్టివష౯ సహస్రాణి నిష్టయాం
జాయతే క్రిమిః ౹౹
శత్రుణాపి కృతో ధర్మః పాలనీయ్యం
ప్రయత్నతః శత్రురే పహిశత్రుస్స
ధర్మ శత్రుర్నక సృజత్ ॥
యిదం నర్ధాభావెన పార్ధి వెంద్ర
భూయోభూయో యాచితే రామచంద్రః
శ్రీ సాంబశివార్పణమస్తు

ఆన ౧౮౧౨ (1812 AD) సంవత్సరం నవంబ్బరు ౧౫(15) తేదీ ఆంగ్గీరస నామ సంవత్సర కాత్తి౯కశుద్ధ ౧౧ (11) ఆదివారం.