గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 11/సంచిక 4

పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.4 (1937).pdf/2 పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.4 (1937).pdf/3 పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.4 (1937).pdf/4 పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.4 (1937).pdf/5 పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.4 (1937).pdf/6 పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.4 (1937).pdf/7 పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.4 (1937).pdf/8 పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.4 (1937).pdf/9 పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.4 (1937).pdf/10 పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.4 (1937).pdf/11 పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.4 (1937).pdf/12 పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.4 (1937).pdf/13 పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.4 (1937).pdf/14 పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.4 (1937).pdf/15 పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.4 (1937).pdf/16

అమ్మవార్లు రక్తమును త్రాగు రాక్షసులా? దేవతలా?

శ్రీ వేలం వెంకటరమణగారు, జీవకారుణ్యవచారకులు, అనకాపల్లి.

మనము పూజించు గ్రామ దేవతలు రక్తపానము చేయు రాక్షసులా అమృతాహారు లెన దేవతలా యని యోచించి చూచిన గాని యెడల అమ్మవార్లు దేవతలని తెలియుచున్నది. మనహిందువులు అమ్మవార్లను దేవతలని పూజ సేయుచున్నారుగాని రక్తమును త్రాగు రాక్షసులని గాని పీనుగులను దినుపిశాచులని కొలుచుట లేదు. మనహిందూ దేశములో ఎచ్చో టనైన ప్రజలను అమ్మవార్లు దేవతలా రాక్షసులా యని ప్రశ్నించిన దేవతలనియే చెప్పు చున్నారు గాని, రాక్షసులని చెప్పుట లేదు. దేవతలకు ఆహారము అమృతముగాని రక్తమాంస ములు ఎన్నటికిని కావు. దేవతలు కూడ ర క్ష మాంసముల దిను రాక్షసులే అయినచో వారిని మనము పూజింపవలసిన అవసరమే లేదు. కాని మాటవరుసకు దేవతలు కూడ రక్తమాంసము లనే కోరుదు రనుకొందము. అప్పుడు గ్రామ దేవతలకు రక మేకదా కావలెను. ఏ రక్తమైన నేమి? పులి, పిల్లి, కుక్క, నక్క, శ్రద్ద, రాబందులలో మాత్రము రక్తము లేదా ? వాటిని? అమ్మవార్లకు బలియియ్యరు ఎందుకు మాంసము మనము తినము గనుక. వాని

ఇందువలన తేలిన దేమి మానవుడు ఏ వస్తువు తినుటకు అలవడినాడో ఆవస్తువునే అమ్మవార్లకు మొక్కుచున్నాడు గాని తాను తిననటువంటి పిల్లినిగాని కుక్కను గాని, గ్రద్దనుగాని మొక్కడు. ఈ నిదర్శనమును బట్టి జూచిన మానవుడు తన వాంఛను తీర్చు కొనుట కే అమ్మవారి పేరు పెట్టి జీవులను చంపు కే చున్నాడని స్పష్టమగుచున్నది. అమ్మవార్ల పేరు చెప్పి అమాయకములగు మూగజీవులను చంపు వారు రెండు పాపములను సంపాదించుచున్నారు. మొదటిది ఒక ప్ర్రాణిని ఏ కారణము చేతనైన హత్యచేయుట. రెండవది పవిత్రమైన దేవత బలిని కోరినదని నెపము కల్పించి, నోరులేని మూగ జంతువులగు కోడి, గొట్టె, మేకలను బలి యిచ్చి ఆమెకు కళంకము తెచ్చుట. కొంతమంది విద్యావిహీనులకు అజ్ఞానులకు నోరులేని ఈ మూగజంతువులను అమ్మవార్లకు బలియిచ్చిన కోరికలు నెర వేరుసని గుడ్డి నమ్మకము. అమ్మ వార్లకు కోళ్ళను, మేకలను, దున్నలను బలి యిచ్చి నిజముగా కోరికలు తీర్చుకొనగల యెడల పూర్వము మహాఋషు లందరును వందల కొలది సంవత్సరములు అహోరాత్రము లన కుండ తపస్సు చేయవలసిన అవసరమే లేదు. అదియును గాక ప్రస్తుతము మన కనులయెదుట కన్పడుచున్న దేశసేవా పరాయణులును స్వరా స్వాతంత్ర్య కాంక్షతో తహతహలాడుచున్న జవహరిలాల్ నెహ్రూ, బాబురాజేంద్రప్రసాద్, నారీశిరోమణియైన సరోజినీ దేవి, మహాత్మా గాంధి మున్నగు మహనీయు లందరును స్వరా జ్యసంపాదనకై ఎన్నో గొజ్జెలను, మేకలను, కోళ్ళను, దున్నలను బలియిచ్చి స్వరాజ్యమును తెచ్చియే యుందురు. అమ్మవార్లకు జంతువు లను బలియిచ్చి కోరికలు నేర వేర్చు కొందమన్న మాట సంగీతమునకు చింతకాయలు రాలు న న్నట్లున్నది.

అమ్మవారిదయను పొందవలెనన్న అహింస, ఇంద్రియనిగ్రహము, భూతదయ, క్షమ, శాంతి, తపస్సు, ధ్యానము, సత్యము - అను ఎనిమిది పుష్పములను సమర్పింపవలెను. జీవుల పీకలు కోసిన పుణ్యము రాదు. విదుమిక్కిలి పాపము సంభవించును. ఒక మనుష్యుని కూనీ చేసిన పాప మనియు ఘోరమనియు చెప్పుదురు. మేకనుగాని దున్నపోతునుగాని మరే జంతువును గాని కూనీ చేయుట పాపముకాదా? అవి విూదృష్టిలో ప్ర్రాణము కలవి కావా!

సోదరులారా! ప్రపంచమున మీ రెంత స్వతంత్రులో ఇతరులుకూడ అంతస్వతంత్రులు. మీకు సుఖము కావలసిన యెడల ఇతరులను సుఖింపజేయుడు, పరమేశ్వరుడు సృష్టించిన సర్వ జీవులకును మనవలె సుఖదుఃఖములు కలవనియు, మన ప్ర్రాణములందు మనకెంత తీపియో ఇతర ప్రాణులకుకూడ వాటి ప్రాణములందు అంత తీపి యుండుననియు, సర్వజీవులును సర్వేశ్వరుని అంశ ములేయనియు నమ్మి ఏమహనీయుడు సమ స జీవులయెడల ప్రేమతో వర్తించునో అట్టి మహ నీయునికే ఆనంద మను స్వర్గము లభించును. ఆనందమే బ్రహ్మము.

కావున క్షుద్ర దేవతల పేరు గాని భక్షణా పేక్షతోగాని మరియే యితర కారణములచేతను గాని మీరు జీవులను హింసించి పాపమార్జిం చుటకంటె ఆశ్మవ త్సర్వభూతాని * (సకలపాణు లను తనవలె చూడవలెను) అను నార్యోక్తిని గుర్తించి ప్రేమోపాసన చేసి ప్రేమమయుడగు పర మేశ్వరునికృపకు పాత్రులగుదురుగాక!

శ్రీసుజనసమాజస్థాపనము, కొత్తూరు,

తే .౨౭-౬-౩౮ దీని అనకాపల్లి శ్రీ సుజన సమాజ ప్రచారకులు మ. రా. శ్రీ వేలం వెంకటరమణగారు సర్వసిద్ధి తాలూకాలో కొన్ని గ్రామములందు ప్రచారము చేసి నేడు మాగా మము : చ్చి స్థానిక సత్సంఘమందిరమువద్ద ఒక పెద్దసభను జరిపి, అహింసాప్రబోధమును చేసిరి. గ్రామ దేవతీ పండుగలలోగాని, ఆహారముకొరకు గాని, మరియే కారణాంతరములచేతగాని, ఎట్టి జీవిని హింసింపగూడదని ప్రజలందరికి తేటతెల్ల ముగ తెలియునట్లు ఉపన్యసించిరి. తత్ ప్రచార ఫలితముగ ఈ గ్రామమున ౧౯౬ మంది ౧౯౬ మంది యువ కులు మత్స్యమాంసాహార మద్యపానములను మరణాంతమువరకు విసర్జించెదమని ప్రమాణ పక్త్రముల నిచ్చిరి. ఇతరప్రజలు కొందరు అమ్మ వార్ల పండుగలలో బలులను నిషేధించెద మని వాగ్దానము చేసిరి. మరియు అనకాపల్లి సుజన సమాజమునకు శాఖాసంఘముగ ఈగ్రామమున సుజనసమాజ మను పేరుతొ జీవ కారుణ్య సంఘ మును స్థాపించిరి. ఈసంఘమునకు మ.రా.శ్రీ కన్నం పెద అప్పారావు గారు అధ్యక్షులుగాను, మ. రా. శ్రీ కన్నం శ్యామసుందర రావుగారు ' కార్యదర్శిగాను, శ్రీయుతులు కన్నం వెంకు నాయుడుగారు సహాయ కార్యదర్శి గాను, మరి ౧౨ మంది సభ్యులుగాను, ఎన్నుకొనబడిరి. ఇంకను ఇట్టి జీవకారుణ్య సంఘములు దయామయుడగు పర రమేశ్వరుని కృపచే అభివృద్ధినొంది, శాంతి కలుగుగాక. జయంతి వెంకటరమణ.

ఆంధ్ర దేశ గోరక్షణమహాసభ

౨౬-౭-౩౧ తేదీని పై సభ బెజవాడలోని రామ మోహనగ ంథాలయభవనమున శ్రీ ఎన మండ లక్ష్మీనరసింహమువంతులు గారి అధ్య క్షతను జరిగినది. అందు, శ్రీ ఉమర్ అలీషాకవి గారు మహమ్మదీయులకుకూడ గోరక్షణము కర్తవ్య మని తెలిపిరి.

వింతలు - విడ్డూరములు

చచ్చినవారిని బతికించు ప్రయత్నము

చావనఁగా ఏమి ? చచ్చిన వారిని మరల బ్రతికించుటకు వీలగునా? అను విషయములను తెలుపఁగల గొప్ప పరిశోధనమును పేరుపొందిన వైమానికుఁ డగు కల్నల్ లిండ్ బర్గ్ గారును, నోబెల్ బహుమానము పొందియుండిన డా॥ ఎలె క్సిస్ కెరల్ గారును, బిటెన్నీ తీరమున జనులు లేని సెంట్ గిల్డాస్ ద్వీపములో చేయుచున్నారు. విజ్ఞానబలమువలన గుండెకాయను తయారుచేసి, దానివలన చచ్చిపోయినతరువాతకూడ మను ష్యులు బతికియుండునట్లు చేయు యంత్రమును సిద్ధ పఱు చు చున్నారు. గ్రంథులను (గ్లాండ్లను) చెడిపోకుండ ఉంచి, తలఁచుకొన్నప్పుడు చచ్చి పోయిన వారి అణువులను (టిస్యూలను) ప్రాణ సహితములుగా చేయుటయే ఈ పరిశోధనో దేశము. ఈ ప్రయత్నము ఫలించు నెడల పెక్కేండ్లక్రిందట చచ్చినట్లు అగపడు జంతు వును కూడ బ్రతికింప ఏ లగును. తమ యిష యిష్టమును బట్టి మూర్ఛావస్థయం దుండఁగలస్థితియు, చైతన్యము కలిగి యుండఁగల స్థితియు, దీనివలన రావచ్చును—అని డా॥ కెరల్ గారు తెలిపిరి. కొన్ని నెలల క్రిందట పై విజ్ఞాను లిరువురును తాము తయారు చేసినహృదయమును చూపి నపుడు శాస్త్రజ్ఞులు నివ్వెఱపడిరి. బ్రతికియున్న జంతువునుండి తీసిన అవయవమును ఆ జంతువు చచ్చిపోయిన పిమ్మట కూడ జీవించి యుండు నట్లు చేయుటకు ఈ హృదయమునకు శ కలదు. మనుష్యుని గుండెకాయవలె ఇదియు అవయవములకు నెత్తురు పంపుట మొదలగు పనులు చేయును. ఈ పరిశోధనము నెగ్గుచో 3 ఒక జంతువునుండి తీసిన మెదడును అది చని పోయిన పిదప కూడ జీవసహితముగా చేయు టకు వీలు కలుగును. (యునైటెడ్ స్ట్రెస్ నుండి ఆంధ్రపత్రిక కైశొనిన దానినిబట్టి.)

సమాధిని విడఁగొట్టుబ చే మూగి అగుట.

కొమురికొండ ప్రదేశనివాసి ఒక ముస్లిము, తన చెల్లెలిని పాతి పెట్టినపుడు పొరపాటున చాల డబ్బున్నసంచి కూడ మంటితో కప్పివేసినట్లు జ్ఞాపకమురాఁగా, సమాధి విడఁగొట్టి చూచెద నని మతగురువు నడిగెను. 3 రోజులలోపల అటు చేయరాదని ఆయన చెప్పెను. మతగురువు ఆ సంచి తాను అపహరించుటకు ఇట్లు చెప్పెనని అనుమా నపడి, మన్ను తీసి వేసి తనసంచిని తీసికొని, మరల మన్ను పోసి కప్పుచుండెను. అపుడు తనచేయి శవముతలకు తగులఁగా వెంటనే విద్యుచ్ఛక్తివం టిది నరములకు కొట్టినట్లయి, అతఁడు ని శ్చేష్టుఁ డై, పడిపోయెను. ఆసుపత్రికి కొనిపోఁగా చాలసేప టికి స్మృతి వచ్చినది. కాని అతఁడుమాట లాడలేక పోయె. మూగివానివలె ఉన్నాఁడు. a (అ. పె. వార్త ఆంధ్రపత్రికలో నున్నది.)

విమానముల వేగము

ఒకనాఁడే లండనులోచలిది, ప్యారిసులో చిఱు తిండియుతిని, బెర్లినులో భోజనము చేయవచ్చును. రష్యన్ విమానములు 3 మాస్కో నుండి క్యాలిఫోర్నియాకు 2,000 మైళ్ళు నడుమను ఆఁగకయే ఎన్ని ఉపదవములకు లోనయినను 6 దినముల ౧ర గంటల నిమిషము లకు ఇదివఱ కున్న వడిని మించి చేరినవి. కాలెడోనియా - ఇంపీరియల్ ఎయిర్ వేస్ మార్గ దర్శి వాణిజ్య విమానము - రెండవసారి మొదటి వడితో నే ౧౨ గంటల 2 నిమిషములలో అటాం టిక్ మహాసముద్రమును దాఁటిపోయినది.

నోల్గా కాలువ

మాస్కో నగరమునకు బాల్టిక్, బ్లాక్, వైట్, కాస్పియర్, అజోవ్ సముద్రములతో పొత్తు కలిగించిన వోల్గా కాలువను రష్యా యింజనీర్లు శి ఏండ్లలో తయారుచేసిరి. ఇది తయారు చేయుటలో చూపిన నేర్పు నివ్వెఱపాటోదవించును.

ఉత్తరధు వరాజ్యము

రష్యావారు మంచుగడ్డల విడఁగోట్టు ఓడల సాయముతో ఉ త్తరధువమండలమును గాలించి, దారు లేర్పఱిచి, రేడియో స్టేషనులును దారి చూపువిమానములును తోడ్పడు నట్లు చేసి కొని, అక్కడ గొప్పవలసరాజ్యము స్థాపించి నారు. కలపవర్తకము చేయుటకును, మంచుక్రింద నికెల్, రాగి, నూనె, ప్లాటినము, రాక్షసిబొగ్గు కనిపెట్టుటకును ప్రయత్నించుచున్నారు. వారి అదృష్టమువలన బాగుగా ఉండునేని బంగారు గనులును దొరకునేమో!

శస్త్ర వైద్య స్త్రవీణత

ఒకనిని కలముక త్తితో పొడువఁగా గుండె లలో రెండు లోతుగాయములు పడినవి. వానిని లండనుఆసుపత్రిలో పడవేసిరి. విల్లియమ్ స్సేనే, బొదొర్చు లెక్ బెర్గ్ అను ఇద్దఱు డాక్టర్లు చూచి, చావనున్న వానిని బ్రతికించు టెట్లని తలపోసి, అతనిగుండెకాయ పై కి తీసి కుట్టి వేసి మరల ఉంచుటకు నిశ్చయించుకొని, అటుల చేసిరి! ఒక డాక్టరు చేతిలో గుండె పట్టుకొని ఉండఁగా మటొకరు కుట్టివేసిరి!!

ఒకరికి పనికిరానికన్నులు తీసి మతొ కరికి అమర్చి అవి పనిచేయునట్లు డాక్టర్లు చేయఁగలుగు చున్నారు.

దృష్టి శక్తి

ఇపుడు మనగదిలో మనము కూర్చుండి ఎన్నో మైళ్ళదూరమున జరుగు విషయములను చూడఁగలుగు స్థితికి వచ్చినాము. ఎంత దట్టపుమంచులో నైనను దారిక నుగొను సాధనము ఓడలవారికి ఇపుడు లభించినది.

లోహావయవములు

మన శరీరములోని ఏఅవయవము చెడిపోయి నను దానిపని లోహావయవములతో జరుపుకొను శక్తి ఇప్పటి వారికి అబ్బినది.

మూలికామహిమ

మే పలికింపఁగల మూలిక ఒకటి కనిపెట్టినారు. కల్లలాడుటకు నిశ్చయించుకొన్న వారిచేత నిజ విద్యుచ్ఛక్తి మహిమ వేలకొలఁది అడుగుల దూరమున నేలమీఁదనుండి మెఱుపు బలిమి బొత్తమునొక్కి విమానమును తనంతట తా నేఎగురునట్లు చేయఁగలుగుచున్నారు. మనబల్లదగ్గఱతే మనము కూర్చుండి ఎక్క డనున్న వారితోనైనను మాటలాడు సాధనము కనిపెట్టినారు. మన యింటిలో కుర్చీమీఁద కూర్చుండి ఎక్కడనో నాట్యము చేయువారి నేర్పు చూచి సంతోషింప వచ్చును. (మహరాటానుండి)

గేదెకు ఏనుఁగుతలగూడ!

మధ్య రాష్ట్రములో షాజీపూరులో సేద్యగాని గేదెకు ఇటీవల పుట్టిన దూడకు ఏనుఁ ఒక గునకువలె తొండమును, దంతములును ఉండెను. ఈ విడ్డూరము చూచుటకు జనులు గుంపులు గుంపులుగా వెళ్ళిరి. కాని, ఆ దూడ పుట్టిన కొన్ని నిమిషములలో నే చనిపోయెను.

౧౫౦౦ ఏండ్లకింద నాటిన విత్తు మొలుచుట!

ది ౬-౫-౧౯౯౩౭ తేదిని మబాకి, షిబాటా ఇరువురు ప్రొఫెసర్లు కనగావాలో హియోషిదగ్గఱ ఒక సమాధిని తవ్వి చూడఁగా ఒక మొలకతో కూడ కొన్ని విత్తులు కనఁబడెను. కాలము వారే నిర్ణ యించిరి.

3 నెలలలో ౨ కాన్పులు

ఒక బ్రిటిషు వైద్యపత్రిక లోని ఒక తె మోటా రులో వెళ్లుచుండఁగా దానిలోనే ఆమెకు ఒక

వసంతము :

మగబిడ్డ పుట్టెను. తల్లియు, బిడ్డయు సుఖముగా ఉన్నారు. పిదప 3 నెలలకు ఆఁడుపిల్ల పుట్టెను. ఆ పిల్లయు సుఖముగా ఉన్నది. మొదటి గర్భము కలిగిన 3 నెలలకు రెండవ గర్భము కలిగియుండు నని నిర్ణయించిరి — అని కలదు.

పిల్లులను తిను ఎలుకలు!

తూర్పు చీనాలో లై నాక్ గ్రామమున ఎలు కలే పిల్లులను ముక్కలు ముక్కలుగ చీల్చి తినుట తాను చూచినట్లు 'న్యూస్ క్రానికల్' విలేఖరి తెలిపెను. ఈయెలుకలు గుంపులు గుంపులుగా పిల్లుల పై పడుచుండునఁట.

{{c|గ్రంథ వి మనము ఇది శ్రీ పెమ్మరాజు లక్ష్మీపతి గారి ముద్దుల కైతబిడ్డ. శ్రీ అదేపల్లి నాగగోపాలరాయ కవి గారికి పెండ్లినాఁడు డెందము చిగిరింపఁజేయ నెయ్యపుబలిమిచే విడిగా ఇచ్చిన మెచ్చఁదగిన కానుక. ఇది పేరునకు పెండ్లికొడుకున కిడిన దే కాని, నిజమునకు తెనుఁగుతల్లిని కొలుచువారి కెల్లరకును కానికయే; అంతే కాదు. తెలుఁగు వారి ఆమనియెన్నిక ఎటు లుండునో చూతమను వేడుకకల తక్కినపలుకు తల్లుల సొగసులు కలరు నెఱ వాదుల కందఱకును కానుక కాఁదగినదే. ఈచిన్ని పొ త్తపు చివరను ‘పరిచయము’లో లక్ష్మీ పతిగారిని గూర్చి .... లలితవసంతగీతికాసదృశ మగు త్మజీవితముచే లోకమును మాధురీ 'భరిత మొనరించు ఈ మా కవిసోదరుని రస హృదయ మీ కావ్యమూలమున ఆంధ్రలోక (గోలకొండ పత్రికనుండి) మున కింత వ్య క్తము కాగలదు' అని శ్రీ మంగిపూడి పురుషో త్తమ శర్మగారు వ్రాసిన మాట వట్టి నెయ్యముంబట్టియే కాక తమ నెయ్యునిపస ఎఱింగి వ్రాసిన దే. చవులు చిమ్మి, ఎదలు కరిఁగించి, హాయిమిన్నేటిలో ఓలలాడింపఁ జేయుఅందలి మచ్చుప ద్దెములు పత్రికాముఖమున వెలయుచున్నవి. కనుఁడు; అలరుఁడు. ఇది చూడ కన్ను పండువుగా ఉన్నది. మంచి కాగితములపై అచ్చు ఆణిము తియములవ లె మించుచున్నది. అమరిక కొత్త నాజూకు తన ముతో తనరుచున్నది. శ్రీ అంశాల సుబ్బారావు గారు కల్పించినచిత్తరువు బొమ్మ పొత్తము కు వన్నె తెచ్చుచున్నది. చదివింతల కలకు తెలుఁగు నెఱవాదులు ఇది కైకొని, చదివి, తనిసి, శ్రీ లక్ష్మీపతిగారిని తని పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.4 (1937).pdf/22 పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.4 (1937).pdf/23 పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.4 (1937).pdf/24 పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.4 (1937).pdf/25 పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.4 (1937).pdf/26 పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.4 (1937).pdf/27 పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.4 (1937).pdf/28 పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.4 (1937).pdf/29 పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.4 (1937).pdf/30 పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.4 (1937).pdf/31 పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.4 (1937).pdf/32 పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.4 (1937).pdf/33 పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.4 (1937).pdf/34 పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.4 (1937).pdf/35 పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.4 (1937).pdf/36 పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.4 (1937).pdf/37 పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.4 (1937).pdf/38 పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.4 (1937).pdf/39 పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.4 (1937).pdf/40 పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.4 (1937).pdf/41 పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.4 (1937).pdf/42 పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.4 (1937).pdf/43 పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.4 (1937).pdf/44



This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2024, prior to 1 January 1964) after the death of the author.