గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/సారస్వత జీవనము

సారస్వత జీవనము.


ఉ.

భూషలు గావు మర్యులకు ◆ భూరిమయాంగద ఉతారహారముల్
భూషిత కేశపాశ మృదు ◆పుష్ప సుగంధజలాభిషేకముల్
భూషలు గావు పూరుషుని ◆ భూషితుఁజేయు పవిత్రవాణివా
గ్భూషణమే సుభూషణము ◆ భూషణముల్ నశియించు నన్ని యుక్. (లక్ష్మణకవి)


సారస్వత జీవన మననేమి?

సారస్వత జీవన మన నేమో యాంగ్లేయభాషాపరి చితులు కానివారికి బోధపడక యెద్దియో యొక క్రొత్తవి శే పముగాఁ బొడకట్టవచ్చును. గ్రంధరూపమున నున్న వా ఙ్మయమునకే సారస్వతమను నామము వర్తించుచున్నది. అట్టిసారస్వతని ర్మాణము నే జీవనాధారము గాఁ జేసికొని లోకయాత్ర గడపునట్టి వృత్తికే సారస్వత జీవనమని నా మకరణముఁ జేయుచున్నాఁడను. దీని నేగ్రంధములు వ్రా సి తన్మూలమున ధనమాజి౯౦చుటయే వృత్తిగాఁ గలిగి యుండుట యని తేటమాటలతోఁ జెప్పఁదగును. ఇట్టి సారస్వత జీవనము నాగరికులైన విదేశీయులలో నెక్కు వగాఁ గాన్పించుచున్నను మనయాంధ్రులలో నరుదై యున్నది. ఈవిషయము మహత్తరమైన దగుటచేతను, యిదియొకవృత్తిగా మన దేశమున పఁబడ కుండుటచేతను, ఆంధ్రసారస్వతమును గూర్చి మా త్రమే వ్రాయుదును.

ప్రాచీన కాలమున సారస్వతజీవనము.

నిదివఱకుఁ బరిగణిం

“సారస్వత జీవనము పూర్వముండెనా? ఉన్న, నేరీతి నుండెను? ఇప్పుడేరీతినున్నది? దీని నవలంబించుట వలనఁ గలుగు లాభనష్టము లెట్టివి? దీని నభివృద్ధిపరచు ఔ ట్లు?" అనునీ మొదలగు ప్రశ్నంబులకుఁ దగిన ప్రత్యుత్త రంబులు సంగ్రహముగానైనఁ జర్చించి చెప్పవలసియుం డును. సారస్వతజీవన మొకరీతిగాఁ బూర్వకాలమున మ న దేశముననుం డెనుగాని స్వచ్ఛమైన రీతినుండక యది యొక ప్రత్యేక మొక శాఖవారిలో నే యత్యల్ప సంఖ్యా కులులచే నలంకరించుకొనఁబడి దేశకాల స్థితులను బట్టి యెదుగుబొదుగు లేక సంస్కారరహిత మైయొప్పు చుండెను.

పూర్వకాలమున రాజ్యపరిపాలనము చేసిన మహారాజులు, మండలాధిపతులు, సేనానాయకులు, మంత్రులు, ధనికు లు మొదలగువారుకొందఱు భాషాభిమానులును కీ ర్తికా ములునై కవుల నాదరించి భూవసతులను, కొన్ని వేళల నగ్రహారములను నొసంగియు, ధన కనక వస్తు వాహనాదు లచే సంతరింపఁజేసియు బహువిధంబుల సత్కరించుచుం డుట చేత న నేకులు వారలకు కృతుల నంకితములఁ గావిం చి కుటుంబపోషణముఁ జేసికొనుచుఁ వచ్చిరి గాని యది యంతియుత్తమ మార్గము గాఁ గనుపట్టకుండెను. అంతి యగాక మహాసముద్రములో నొక జలబిందువువలె మహా సంఘములో వారిసంఖ్య యత్యల్పమై యుండెను. ఆయ త్యల్పసంఖ్యగల వారి మార్గముకూడ నిఱు పేదలై, భక్తా గ్రగణ్యులయిన కవివరేణ్యుల చే నీచమైనది గాఁ గరింపఁ బడుచునే వచ్చినదికాని యుత్తమమార్గమని సూచింపఁ బడలేదు.

బమ్మెర పోతన.

పూర్వజన్మ సహస్ర సంచిత తపఃఫలంబున శ్రీమ న్నా రాయణకథా ప్రపంచ రచనా కుతూహలుండును, సహజ పాండిత్యుండును, కవివరుండును, భక్తాగ్రేసమయం డునగు బమ్మెర పోతన నిఱుపేదయయ్యును నరకృతి నిషేధించి, తనభాగవతమును శ్రీవారి కంకితము చేసినట్టుగ తత్కృతిలోని


"ఉ.

ఇమ్మనుజేశ్వరాధముల
కిచ్చి పురంబులు వాహనంబులు
సొమ్ములుఁ గొన్ని పుచ్చికొని
సొక్కి, శరీరమువాసి కాలుచే
సమ్మెట వేటులంబడక
సమ్మతి శ్రీవారికిచ్చి చెప్పెనీ

బమ్మెర పోతరాజు కఁడు
భాగవతంబు జగద్ధితంబుగ౯."
అనుపద్యమువలన విస్పష్టమగుచున్నది.

మఱియు సంకుసాల నృసింహకవియు తన కవికర్ణ రసాయనమున


"సీ.

ఆందోళికలయందు నంతరచరులైన
శవకృతాకృతులఁ బిశాచజనుల
వాలవీ జనములఁ గ్రాలుచునీఁగకు
గాలునిఖరవర్తు లాండసముల
నేత్రపరంపరా విలకంటకాకృతిఁ
జేరఁబోరానిఖర్చూరతరుల
పరక రాలంబులై ప్రార్థింపఁగైకోక
వాయెత్తకుండు జీవచ్ఛవముల
శంఖనాగస్వరాదిక శ్రవణసమద
విన్ఫుటచ్ఛత్ర విస్ఫారిత స్ఫటాక
దిష్టవిన వైద్య వశవర్తి దుష్టఫణుల
ప్రభుదురాత్ముల నెవ్వాఁడ ప్రస్తుతించు.”


గీ.

 నరగుణాంకిత మయ్యెనే సరసకృతియు
దూవ్యమగు శునరోద్వృత్తదుగ్ధమట్ల
హరిగుణాంకితమయ్యె నే సరసకృతియు
హారసూత్రంబుగతిహృదయంగమంబు."


అనివాక్రుచ్చి గర్హించి యున్నాఁడు. బమ్మెర పోతరాజు కర్ణాటులకుఁ గృతియొసంగి ధనము సంపాదిం పవలసినదని శ్రీనాధ-నిచేఁ బ్రేరేపింపఁ బడినపుడు భారతి కన్నీరు మున్నీరుగా నేడ్చుచుఁ బ్రత్యకు మైనట్లు గాఁ గా న్పించిన నతఁడు


"ఉ.

 కాటుకకంటినీరు చను
కట్టుపయింబడ నేలయేడ్చెదో
కైటభదైత్యమర్దనుని
గాదిలికోడల!యోమదంబ! యో
హాటకగర్భురాణి! నిను
నాకటికిం గొనిపోయి, యల్ల క
ర్నాట కిరాట కీచకుల
అనిపలికి యామెనూరార్చి నట్లు గాఁ జెప్పెదరు.


ఒకప్పుడు బమ్మెర పోతరాజు పొలముదున్నుకొ నుచు నలసిగట్టునఁ గూర్చుండియుండఁగా నతని బావమ అదియని చెప్పఁబడేడీ పై శ్రీనాధకవి “హాళికులు సుఖము గా నున్నారా”యని పరిహాసముజేయఁగా నమ్మహనీ యుఁడు


"ఉ.

బాలరసాలసాలనవ
పల్లవకోమల కావ్యకన్యక
గూళలకిచ్చి యప్పడుపు
కూడు భుజించుటకంటె సత్కవుల్
హాలికులైననేమి గ్రహ
నాంతరసీమలఁ గందమూల
ద్దాలికులైన నేమి నిజ
కారసుతోదర పోషణార
వణార్ధమై."


అని యతఁడు మాఱుమాటాడకుండునట్లుగాఁ బ్ర త్యుత్తరం ఓచ్చెనని కూడ చెప్పెదరు. ఇట్టి దుృష్టాంతముల ను మఱికొన్నిటి నాంధ్రసారస్వతమునుండి యెత్తిచూప వచ్చునుగాని గ్రంధవి స్తర భీతివలన వానిని విరమించుచున్నాను.

ప్రాచీన కాలమున సారస్వత జీవనము వృద్ధి బొందకుండుటకు గారణము.

ఈకాలమునందువలె నాకాలమున వచ్చుకూటము లు వెలసి, గ్రంధములు ముద్రింపబడి మూల్యమునకు వి క్రయింపఁబడుట లేని కారణమున, నాకాలమాన స్వతం త్రమైన సారస్వత జీవనమున కవకాశము లేకయుండెను. ఏతన్మూలమున నాంధ్రసారస్వత వి కాలమునందువ లె శాఖోపశాఖలతో వర్ధిల్లుటకు మార్గము లేక యున్న తా వున నేయుండి యాకాలఁపుం బ్రభువర్యుల దయాధర్మభి క్షములకులోనై మనవలసిన దయ్యెను. కాఁబట్టి యాకా లమునాటి సారస్వత జీవనము నొక జీవనముగాఁ బరిగ ణింప వలసిన పనిలేదు.

పూర్వకాలమునందు కవులు.

పూర్వమునఁ గవులయెడఁ బ్రజలకు భక్తికన్న భ య మెక్కువగ నుండెను. కవులు తిట్టిన శాపమై తగులు నన్న వెట్టిభయ మాకాలమున నుంట చేఁ గొందఱుక వులు భూషించియు, దూషించి యుఁగూడ ధనహరించుచుండిరి. ఒకని గుఱించిన కీ ర్తి గాని యపకీర్తిగాని వ్యాంపిపఁజేయుటకు నీకాలమునందలి వార్తాపత్రికలవలె నాకాలమునందలి కవులు కారకులగుటచేత సాధారణముగా నెల్లవారును కవులకు భయపడుచు, శుభకార్యాదులలో కట్నములు కానుకలుగూడ చెల్లించువారుగ నుండిరి. ఎవ్వరు సన్మానింపకో వారిపైకత్తికట్టి, కలము చేఁబట్టి, చలము చేనొక దూషణ పద్యమును గాని గ్రంధమును గాని / వాసి దేశదేశములఁజాటు దుష్క వులు కూడ నుంటచో గ్రంధకర్త పదము భయంకరమైనదై యపకీర్తిపాల య్యెను. సామాన్యులలో "గ్రంధకర్త" యనఁగా చెడుగు చేయునాఁడని యపార్ధమేర్పడినది. అతఁడు "గ్రంధసాంగుఁడు; మనవాఁడు గ్రంధకర్తయైనాఁడు" అనునవి చెడు పనులు చేయువారిని గూర్చి పలుకునట్టి వాక్యములుగానున్నవి.

గీర్వాణభాషాపండితులు.

ఇట్లే గీర్వాణభాషాపండితులు కొందఱు సామాన్య జనుల వేషభాషల నధిక్షేపించుచు నౌచితి నెఱుంగక ఛాందసులై పామరులతో సంభాషించునపుడు సయితము సంస్కృత పదాడంబరమును జూపుచుంట చేత సామాన్యజనులకు వారిభాష యర్థము గాక యుండెను. అందువలన సామాన్యజను లాగీర్వాణపండితులను గర్వభూయిష్టులను గాఁ దలంచుచుండిరి. ఏతత్కారణము వలన గీర్వాణశబ్దమున కపార్థ మేర్పడినది. అతనికి గీర్వాణము బలిసిపోయినదనఁ గా వానికి గర్వ మతిశయించినదను నిర్ధము స్ఫురించుచున్నది. ఎంతటి సద్వస్తువు నైనను సద్వినియోగమునకుఁ డేక దుర్వినియోగ పఱచుచున్న యెడల దానికుండు సహజ గౌరవము కూడ చెడుచుండుననుటకు పైవిషయములను తార్కాణముగఁ జూపవచ్చును. కాఁబట్టి గ్రంధకర్త శబ్దమునకట్టి యపార్ట్ మేర్పడినప్పుడు సారస్వత జీవనమునకు సంఘములో గౌరవ మెపేర్పడఁ గలదు?

నవీన కాలమునందలి యభివృద్ధి.

కనుకనే మన దేశములో నితకుఁ బూర్వము గ్రంధరచన యొకవృత్తిగాఁ బరిగణింపఁబడుచుండలేదు. ఆదిసద్వృత్తులలో నొక్కటియనుమాట జనసామాన్యమునకుఁ దెలియకుండెను. ప్రస్తుతస్థితియొకింత పరికింతము. బ్రిటిషు ప్రభుత్వము మనదేశమునకు లభించిన నాటకుండి మనదేశములో ముద్రా యంత్రములు వెలసి ప్రాచీ నాంధ్రగ్రంధముల నేకములు ముద్రింపఁబడి కాక వెలలకు వేనవేలు విక్రయింపఁ బడుచున్నవి. వార్తాపత్రికల మూలమునను యేటేటను ముద్రాయంత్రములనుండి వెలువడు గ్రంధములవలనగు భాషాభివృద్ధి యగుచున్నది. స్వదేశోద్యమమువలన మన దేశమునకు; గలిగిన లాభము భాషోజ్జేననముని ముఖ్యముగాఁ జెప్పఁదగును, సర్వకలాశాలాధి కారులు దేశభాష ల నుద్ధరింప రుదాసీనులై యున్నను దేశమున గ్రంధప్రచారమునకై య సేక సమాజము లేర్పడి యేటేటచెక్కు గ్రంధములనచ్చొత్తించుచు దేశమున వెనఁజల్లుచున్నవి. ఆగ్లేయభాషావిశారదులైనవారు మాతృభాష పట్లవిముఖులు గాక య నేకులిప్పుడు మాతృభాషాభిజ్ఞులై యత్యంతోత్సాహముతో మాతృభాషా సేవకై గడంగుచున్నారు. పల్లెలలో సైతము గ్రంధభాండారములు వెలయుచున్నవి.

మార్పు కాలము.

శాస్త్రగ్రంధములు, చరిత్రగంధములు, నవలలు, నాటకములు, ముద్రాయంత్రములనుండి వెలువడుచు నోకరీతిగా నమ్ముడువోవు కాలమువచ్చినది. ఇదియొక మార్పుకాలము, ఈ కాలస్థితిని జూచి యనేకులాకర్షింపఁబడి గ్రంధరచనకుఁ బూరుకొని దానినే జీవనాధారమగు వృత్తిగఁ జేసికొనవలయునని సాహసించి ముందుకువచ్చు చుండుట చే భాషా ప్రపంచమున నొక గొప్పకలవరము జనించుచున్నది. దానిస్వరూపమిట్టిదని తెలిసికొనుట గ్రంధరచనకు దొరకొనఁబూనిన ప్రతిమనుష్యున కవశ్యకర్తవ్యమైయున్నది. గ్రంధకర్తలకు మాత్రమెకాదు. దేశక్షేమము నభిలషించి సారస్వతాభివృద్ధి కై పాటుపడుచున్నట్టి ప్రతిదేశాభిమానికిని కలవరస్వరూపమును దెలిసికొనుటవిధి యైయున్నది. ఈకలవరమే నేఁశ్రీవ్యాసమును వ్రాయుటకు నన్నుఁ బ్రేరేపించుచున్నది.

ఈ కాలమునందలికవులు.

వస్తుస్వరూపమును సరిగా గ్రహింప శక్తులు లేక దురాశాబద్ధులై యనేకులు సరియైన భాషాజానము గాని క్ష గాని, లోకానుభవము గాని, యోన్పుగాని లేక గ్రంధకర్తలకుండు బాధ్యతలను గుర్తెఱుంగక దుస్సాహస మునకుఁ గూడ నొడిగట్టి చేత గాని పరులకుఁ జేయిచాచి, తాము నష్టముఁ బొందుటయె కాక తాఁజెడ్డ కోతి వనమె •ఁ జెఱిచినదన్నట్లు ప్రతిభాశాలురయిన గ్రంధకర్తల ప్ర యుత్నములకుఁ గూడ నాశనమును గల్పించి, దేశమునకుఁ కీటు వాటిల్లుగీతి వర్తింపసమకట్టుట శోచనీయము, మన దేశములో నెవ్వఁడేని సమర్థుఁడొకఁ డొక వ్యాపారము కుజేసి, యావ్యాపారమునకై నానాకష్టములుపడి సమ ర్ధతతో దానిని నిర్వహించి కొంచెము లాభము బొందుట తటస్థమైనతోడనే య సేకులదివఱకు మాంద్యులైయుం ఫియు, మఱియొక వృత్తికి దొరకొనక వాని పై పోటీకి బోయి, యావ్యాపారము నే చేయనవలంబించి, తాము నష్టమును బొందుటయేగాక, లాభమును బొందుచున్న మొ నటివానికి నష్టముగలిగించి, చెఱచుచుండుట, మనము క అన్నులారఁ జూచుచున్నారము. సారస్వతి విషయమునఁ గూడ నిట్టి చందములే గాను బడుచున్నవి. సారస్వత జీవ నము కష్టసాధ్యము. మిక్కిలి పవిత్రవంతము. సుగుణా శ్యులకు సులభసాధ్యము, దురాశాపాశబద్ధులకు దుస్సా న్యము, నాల్గు పద్యము లల్లఁగల్గినవాఁడు కవియు నాల్గు పత్రములుగీకినవాఁడు గ్రంధకర్తయుఁ గాఁజాలడు. త్కావ్యములను రచించువారు సత్కవులు, సత్కవులసం వృత్తమును సంకుసాల నృసింహకవి కవికర్ణ రసాయనము న నిటభివర్ణించి యున్నాఁడు.


"చ.

“మనమునఁగొన్న సెవ్వగలు
మాన్ని ఘటింతురకాండ సమ్మదం
బనఘ కథా ముఖంబున హి
తాహితబోధ మొనర్లు రింపుగా
గనుఁగొనుకంటె నద్భుతము
గా నెఱిగింతు రతీంద్రియార్థముల్
ఘనమతు లెల్ల వారికి న
కారణబంధులు కారె సత్కవుల్"


ఇక్కాలమున నిట్టి సత్కవు లెక్కడనో గాని కా కంబడరు. సత్కవులెట్టివారో సద్గ్రంధకర్తలు గూడ నట్టి వారి యగుదురనుటకు సందియములేదు. నిష్కళంకమై న యోచన, సత్యమం దనరాగము, కీర్తిప్రదమైన స్వేచ్ఛ వీ.నితోఁగూడుకొన్న దై నయెడల సారస్వతజీవనము తక్కి నవానికన్న శ్రేష్ఠ మైనదనుటకు లవమాత్రము సందియ ములేదు.

గ్రంథకర్తలు.

తనంతగ తానొక పక్షమునకు మొగ్గ నూహించిన ప్పుడుతక్క గ్రంథకర్త యెన్నఁడుము నొక మనుష్యునకుఁ గాని, యొక స్థలమునకుఁ గాని, యొక పక్షమునకుఁ గాని శుఁడు కాఁజాలఁడు. గ్రంథకర్తకు జనసామాన్యమైనను రాజాధిరాజైనను నొక్కటియె. గ్రంథకర్త యనేక ప్ర జలను బరిపాలింప సమర్థ తగలవాఁడు. అతనిశక్తి మహ త్తరమైనది, ఆ ప్రతిమానమైనది. కనుక సారస్వత జీవన ము తక్కినవానికన్న నధిక సంతోషకరమయినదిగా నే నూహించెదను. అయినను గొందఱు నాయభిప్రాయము తో నేకీభవింపకపోవచ్చును. అట్టివారు సారస్వత జీవన ముగలవారిలో నే పెక్కందుకలరని నేనెఱుంగుదును. అగ్ని మాంద్యముచే క_సిపడువా రనఁగా మనోరథభగ్ను లైన గ్రంధకర్తలు పెక్కండుగలకు. ప్రచురణకర్తల కు న నేక సంవత్సరములవఱకు నొడంబడికలు వ్రాయువా రు శృంఖలములలో నృత్యములు సేయు వారి పగిది దుఃఖ భోజనులగుచున్నారు. సారస్వత జీవనమువలనఁ గలుగవ లసిన యానందము గలుగనేరదు. ప్రచురణకర్తలు తమ కృషికి నెంతప్రతిఫలము నొసంగుదురో యని యనుదిన మును తాను వ్రాసిన కాగితములను లెక్క పెట్టుకొనుచుం డు గ్రంథకర్త యెన్న ఁడును సుఖమనుభవింపఁ జూలఁడు. జనప్రవాహ మెట్లీడ్చిన నట్లు పోవుచు, నేఁడిచ్చట, రే పు వేఱ క్కచోట, నెల్లుండి మతొక్కచోట స్తుతి పాఠములంగనుచు, తిబ్బిబ్బులగుచు, అప్పటి కానందము ను బొందఁగోరు గ్రంధకర్త దేవతా ప్రసాదమునకు దూర గుఁడై, తానెవ్వరితోఁ గలిసి మెలసి తిరుగఁదలం చెనో యట్టి గొప్పవారిచేత నే పరిత్యజింపఁబడి తుదకు కష్టకా లమునకు నసహాయుఁడై పరితప్తుఁడు గాక మానఁడు.

శ్రీనాధుని యవసానదశ.

మహారాజుల చెలిమిఁజేసి, బంగరుతూగుటుయ్యే లలో నూగుచు, హంసతూలికా తల్పంబుల శయనించుచుఁ జల్లకులలో నెక్కి యెల్ల వేళల విహరించుచు, బమ్మెర పోతరాజుదారిద్ర్యమును బరిహసించిన కవిసార్వభౌముఁడు శ్రీనాధునివంటివాఁడు సయితము వార్ధక్యమునఁ గష్ట పరంపరల పాలయినవిషయము శ్రీనాధక వికృతము లైన


"సీ,

కవిరాజుకంఠంబుఁ గౌగలించేనుగ దా
పుర వీధి నెదురెండ పొగడ దండ
సార్వభౌమునిభుజా స్తంభమెక్కెనుగదా
నగరివాకిటనుండు నల్లగుండు
ఆంధ్రనై పధక ర్త యంఘ్ర యుగ్మంబునఁ
దగిలియుం డెను గదా నిగళయుగము
వీరభద్రారెడ్డి విద్వాంసముం జేత
వియ్య మొందెనుగదా వెదురుగొడియ
కృష్ణ వేణమ్మకొనిపోయె నింత ఫలము
బిలబిలాక్షులు తినిపోయె తిలలుఁ బెసలు
బొడ్డుపల్లెను గొడ్డేలిమోసపోతి
నెట్లు చెల్లింతు టంకంబు లేడు నూర్లు."


"సీ,

కాశికావి శ్వేశుఁగలిసె వీరారెడ్డి
రత్నాంబరంబు లే రాయఁడిచ్చుఁ
గైలాసగిరిఁబండ మైలారివిభుఁడేగా
దిన వెచ్చ మేరాజు తీర్పఁగలఁడు
గంధగూడె తెనుంగు రాయరాహుత్తుండు
కస్తూరికేరాజుఁ బ్రస్తుతింతు
స్వర్గస్థుఁడయ్యె విస్సనమంత్రి మణి హేమ
పాత్రాన్న మెవ్వనిపంక్తిఁగలదు
భాస్కరుఁడు మున్నె దేవునిపాలికరి గెఁ
గలియుగంబు-నిఁక నుండఁ గష్టమనుచు
దివిజకి వివరు గుండియల్ దిగ్గురనఁగ
నరుగుచున్నాఁడు శ్రీనాధుఁ డమరపురికి."


అను పద్యములలోఁ దెలుపఁబడియుండెను.

"రాబర్టు బరున్సు"

ఇట్లే ప్రసిద్ధిఁగాంచిన “రాబర్టు బరన్సు”యను నాంగ్లేయకవి యౌవన కాలమున గొప్పవారిచే సన్మానింపఁబడుచు వారిచేఁ గావింపఁబడువిందులం గుడుచుచు నుండియు, తుద కవసానకాలమున తన్నావఱకు గౌరవించి శ్లాఘించుచుండెడి తనతొంటిమిత్రు లు పేక్షాపరులై, యొక్కరొక్కరే విడిచిపోవ "నైదుపౌను లస్పీయవలసిన దీని యొక ప్రచురణకర్తను బ్రార్థింపవలసివచ్చినది. తన యౌవనమున దన్ను స్తుతించిన ధనాధ్యులగు ప్రభువులంద నేమైరి ? వారి సంబంధములు, వారి కార్యములు నెఱ వేరినంతవఱకె. కుక్షింభరణార్థము స్తోత్రప్రియులైన ప్ర భువులను ధనాఢ్యులను బొగడుచుండెడి కవులు ఇప్పటికి సారస్వత జీవనమువలనఁ గలిగెడి నిజమైన సౌఖ్యము గలుగ నేరదు. కుక్షింభరణార్ధము తన యమూల్యమయిన స్వా తంత్ర్యామృతమును ధారవోసి, దానిసుతనము నలంకరిం చుకొను గ్రంధక ర్తకు నిజమైన సౌఖ్య మెట్లులభిం నను ? మఱికొందఱు గ్రంధక ర్తలు కుక్షింభరణార్ధము తమకృతి నాధుల సంతోష పెట్టుటకై యోగ్యులైన సత్కవు లె న్నఁడును, వినరాని కనరాని ముద్రవిషయములకుఁ దిగి తమశ క్తులను భ్రష్టపఱచుకొనుచున్నారు.

గ్రంథకర్త కష్టములు.

ఇట్టివారివిషయ మటుండనిచ్చి, సారస్వతము జీవ నముగాఁ జేసికొన్న సద్గ్రంధకర్తలకు కష్టములు లేవా యని యడుగవచ్చు. గ్రంధకర్తలకు ఆశాభంగములు, నిరుత్సాహములు, కష్టములు లేక యున్న యెడల వారు ఆనందముయొక్క విలువ యెటు తెలిసికొననగును? సుసిర చిత్తుఁడైన గ్రంథకర్త ఫలసిద్ధిని గోరువాఁ డగు నేని యె న్నఁడు నాశాభంగములకు, నిరుత్సాహములకు, నాటంక ములకు భయపడి వెనుదీయఁడు. అతఁడు వాని నే విజయ కారణములు గాఁ జేసికొనఁ జూచును. సారస్వతమునకు సేవఁ జేయఁబూనిన నిజమైన గ్రంధకర్త యుత్కృష్టా దర్శ ములను గలిగియుండు భాగ్యము వహించి యుండెనేని సౌఖ్యప్రదములయిన వస్తువులను వ్యర్థవ్యయములను దాం భికత్వమును విడిచి సులభ జీవనమున కలవాటుపడి, తృ ప్తిఁగాంచియుండును. పుష్టికరమైన భోజనము మెదటికీ చుఱుకుఁబుట్టింపఁజాలదు. ప్రతిభాశాలి లక్షాధికారిగఁ బుట్టియుండలేదు. అసూయాపిశాచగ్రస్థులగు కవికుర్శ కులవలన గ్రంధకర్తలకు మనస్తాపములు కలుగుచుండును. గొప్పతనమునుగోరి ముందుకు సాగివచ్చు ప్రతి గ్రంథకర్త

ఈ నిటిపీడ కలుగుచు నేయుండును.

నిజమైన గ్రంథకర్త.

కాని ప్రతిభాశాలియైన గ్రంధకర్త యెన్నఁడును నిరుత్సాహమును జెందక, పట్టుదలయు, నభిని వేళమునుగలి గి నిరంతరకృషి చే నట్టిశత్రువుల కందనివాఁడై యున్నత స్థానమును జేరి పరమానందమును బడయుచుండును. త్యానురక్తి, ఆత్మగౌరవము, ఆత్మవిశ్వాసము, ఆత్మశిష జి తేంద్రియత్వము, నిరంతరపరిశ్రమ, అభినివేశము, సా హసము, ధైర్యము గలిగియుండునట్టి ప్రతిభాశాలియైన గ్రంథకర్త పామరజనాను రాగమునకై యుత్తమగుణము లను గోల్పోవఁ జూడఁడు. ప్రపంచమును దనవెంట నీ డ్చుకొనిపోవఁ జూచును కాని ప్రపంచము వెంటఁ దాను బఱుగిడఁజూడఁడు. ఇట్టిశక్తులు లేనివాఁడు గ్రంథరచన మునకు దిగరాదు. దిగినను నిష్ప్రయోజనము.


"క.

నేరిచి సుకవికృతిచే
బేరెఱిఁగించుకొని జగతిఁ బెంపగుటొప్పుకో
నేరక కృతి చెప్పుటతగ
మియపకీ 8 జగతినిలుపుటకాదే!


క.

ఏరసము జెప్పఁ బూనిన
నారసమాలించువాని నలరింపని యా
నీరసఁపు కావ్యశవముల
దూరముననబరిహరిం పుదురునీతిజ్ఞుల్."


చ.

"ఫణతుల రెంటమూఁట నొక
పద్యముఁ గూర్చెడివారు లక్ష్యుల
క్షణ సహ కావ్యనిర్వహత
కల్గుట చిత్రము గానియట్లపో
ఫణమణిమాత్రధారులగు
పాము లసంఖ్యము గాక తత్ఫణా
మణివిధ విశ్వభూభృతి స
మర్థుఁడు శేషుఁడుగాక కల్గునే.


అని పై పద్యములోఁ గవికర్ణ రసాయన కావ్యకర్త విస్పష్టములగు వాక్కులతోఁ బ్రతివాఁడును గ్రంథరచన మునకు దిగ రాదని సూచించియున్నాఁడు.

"Valuable energy is wasted by being misdirected. Men are constantly attempting without special aptitude, work for which special aptitude is indispensable"

అని జార్జి హెన్రీ లూయిస్ వక్కాణించుచున్నాఁడు. అన్ని ఁటికంటెను సారస్వత జీవన ముత్కృష్టమైనదనుట కు సందియములేదు. ప్రతిభాశాలియైన గ్రంథకర్త యొ క్కఁదు మాత్రమే కష్ట పరంపరలనుండి తప్పించుకొని, సానంబట్టిన మణివ లెఁ బ్రకాశింపఁగలఁడుగాన ప్రతిభాశా లురుమాత్రమే సారస్వతమును స్వతంత్ర జీవనముగఁ జేసి కొనఁదగియుందురుగాని యేవిధమైన విద్యాశిక్షణమును లేక యచ్చుకూటములు తేరగనున్న వికదాయని పాడు, పొత్తములను రచించి ముద్రణము గావించి యదియొక జీవ నోపాధిగఁ జేసికొనఁగోరువారు తుదకు నష్టమును బొంద గలుగుదు రేకాని లాభమును బడయఁజాలరు. ఎల్లవారు ను సద్గ్రంధకర్త ను బ్రోత్సాహపఱుచుచు నుద్గ్రంధ కర్తల నిరుత్యాహపఱుచుచు నాంధ్ర సారస్వతము పరిశు ద్ధమైనదానినిగఁజేయుట విధ్యుక్త ధర్మమని వేఱుగ నేఁ జెప్పనక్కరలేదు.

మనము చేయవలసిన పని.

ఆంధ్రసారస్వతముఁ బెక్కువిధముల నేఁడభివృద్ధి గాంచుచున్నను, సంస్కార మభిలషించుచున్నది. నేటి కాలమున వందలకొలఁది నవలలు ముద్రింపఁబడుచున్నను గొన్నిట మృదుమధురమయిన శైలి మృగ్యమగుచున్నది. మన యాంధ్రులలో బ్రతిభాశాలురైన మేధావులుకొంద తాంధ్రసారస్వతమును జీవనాధారముగఁ జేసికొని సంఘ మున కత్యావశ్యకములును, ఆరోగ్యప్రదములు నగు గ్రంథ సముదాయము నుజ్జీవింపఁ జేయవలసియున్నది. అట్టి ప్రతి భాశాలురు బయల్వెడలినయెడల దేశభాషాభిమాను లెల్ల రును వారికి సర్వవిధములఁ దోడ్పడి, యాంధ్రసారస్వత మున్నతస్థితికి వచ్చునట్టులను జేయుటయ గాక సారస్వత జీవనముగూడఁ బవిత్రమైనదనియు, సత్యావశ్యక మైనదని యు, బ్రోత్సాహపఱుపఁ దగినదనియు నాంధ్రలోకము గ్రహించునట్లు కృషి సల్పుట మనకెలకు ముఖ్యకర్తవ్య మని నివేదించుచుఁ బ్రస్తుత మింతటితో విరమించుచు న్నాడఁను.