గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/సంచారగ్రంథభాండాగారములు

సంచార గ్రంధ భాండాగారము లాంధ్రుల పరిచితములు. వీనినిగుఱించి వినినవారుగూడ మనలోఁ జాలఁ దక్కువగనుందురు. మన దేశ ములో గ్రంధభాండాగారములు దినదినము నేకములు నెలకొల్పఁబడు నిక్కాలమున సం చార భాండాగార మొక్కటియైన నింతవఱకుఁ బ్రారంభింపఁబడకపోవుటకుఁ దెలియనివారికిఁ దెలియకపోవుటయుఁ, దెలిసిన వారికిఁ గార్య శూరత్వము లేకపోవుటయు, గార్యశౌర్యము గలవారికి మన స్థైర్యమును సహాయమును లేకపోవుటయును గారణములు. గ్రంధకర్త లను, బ్రతికాధిపతులను, మొగమోటంపెట్టి యో, నిర్బంధపఱిచియో, ప్రార్థించియో, సగము వెలలిచ్చియో, మఱి యేయితరమా ర్గములనో కొన్ని పుస్తకములను, గొన్ని పత్రి కలను సంపాదించి, యొకచోఁ బెట్టుకొని, స్నే హితులనందఱను జందాదారులుగాఁ జేర్చికొ ని, సాధ్యమైనంతవఱకుఁ దమమాటను జవ దాఁట లేనివారినే కార్యనిర్వాహక సంఘము లోఁ జేర్చికొని, నిశ్చింతమై నెుక్క చోఁ గూ ర్చుండి నిరంకుశాధికారము వెలిగించుచుఁ గ డుపులోనిచల్ల గదలకుండ మేము భాషాభివృ ద్ధియు, దేశాభివృద్ధియుఁ జేయుచున్నామని ప్రగల్భములు కొట్టుట కవకాశమీయక యివి సంచారము చేయవలసినవగుట మఱియొక . ప్రబల కారణము; ఇన్ని కారణములవలన నివి యింతవఱ కాంధ్రదేశమున బయలుదేర లేదు.

నిర్బంధవిద్యాదానము లేని మన దేశమున వీని యావశ్యకత మితిమీఱియున్నది. చదు వన నెట్టిదో యెఱుంగక, విద్యవలనఁ గలుగు ప్రయోజనములు తెలియక, విద్యాభ్యాసము నందాసక్తి లేక, తమ దేశస్థితి సుంతయుఁ దెలి యక, పరదేశములున్న వనియైన నెఱుంగక, తామున్న స్థితియే మహోత్కృష్టమైనదని భా వించి యధఃపతితులమై పోవుచున్న జనసా మాన్యమునకు విద్యాతృష్ణకలిగించుట కీ సం చార భాండాగారములు చాల నుపయోగప డును. వీనివలన, నిర్బంధ విద్యాశాసనము నెత్తిమీఁద మొట్టకున్నను, బ్రజలు చాలవ ఱకుఁ దమబిడ్డలను బాఠశాలలకుఁ బంపుట యు, వారి విద్యాభ్యాసము విషయమున శ్ర ద్ధతీసికొనుటయుఁ దటస్థించును. అప్పుడు ని ర్బంధవిద్యాశాసన ప్రభావమును దెలిసికొని తమనాయకుల వెనుక నిలిచి, నిర్బంధ విద్యా శాసనమును జేయవలసినదని జనసామాన్య ము ప్రభుత్వమువారిని మాటిమాటికిఁ బ్రా ర్ధింపగా ప్రభుత్వమువారు మనకోరికను సిద్ధిం పజేతురని నేనిప్పుడు సిద్ధాంతివలె భావిస్థితిని నిరూపించుట సాహసము కాఁజాలదు.

ఇట జనసామాన్యమనఁగాఁ బల్లెటూరి ప్ర జలని నాయభిప్రాయము. దేశమునకుఁ బునా ది పల్లెటూరు. దేశాభివృద్ధి కాధారభూతులు పల్లెటూరిప్రజలు. కావున దేశాభివృద్ధికావలె నని యెవరుకోరినను బల్లెటూళ్ళను బాగు చే యవలయును. వానిమాట మనము మఱచిన చో నభివృద్ధి మనమాట మఱచిపోవును. ప ల్లెటూళ్ళను, బల్లెటూరి బ్రజలను మీ రేవగిం చుకొందురేని యభివృద్ధి మిమ్మేవగించుకొ నును. పట్టణములయందలి న్యాయాధికారి కుమారుఁడుగాని, న్యాయవాది కొడుకుగాని పెద్ద సాహుకారి పుత్రుఁడుగాని జమీందా రుని కుమారుఁడుగాని, వారి కుమార్తెలుగా ని, పెద్ద పెద్ద పరీక్షలలో నెగ్గినను, విదేశము లకుఁబోయి క్రొత్తవిద్యలు నేర్చివచ్చినను, మిన్నంటు మేడలపై నివసించినను, గుఱ్ఱపు బండ్లమీఁద షికారుపోయినను, నభివృద్ధి వా రిని వరింపదు. భారతమాతకనుంగుఁ బుత్తుఁ డై, యామెవలనఁ బ్రత్యక్షముగ నుత్కృష్ట ఫలములను బడయు పల్లెటూరి కర్షకుని కొ డుకు, ప్రారంభ విద్యలోఁ దేలినను, నాతఁడు పట్టణయువకునివలె గంభీరముగ వేషమువే యఁజాలని యమాయకుఁడైనను నభివృద్ధి ని స్సందేహముగ వానినే వరించును. అభివృద్ధి వలన, అనఁగా మహాలక్ష్మీ వలన వరింపఁబడు టకు యోగ్యుఁడగు పల్లెటూరి కర్షకునిఁ జూ చి తల కంటగించుకొను మన నాయకులు నాయకాభాసులు.

సంచార భాండాగారములు జనసా మాన్యమురు, ముఖ్యముగాఁ బల్లెటూరి కర్త కులకు విజ్ఞానులుగాఁ జేయుట కుద్దేశింపఁబడి నవి, ప్రకృతమున మనపల్లెటూళ్ళు స్వతంత్ర ముగ నొక్కొక్క స్థిర భాండాగారమును నె లకొల్పుకొనుస్థితిలో లేవు. క్రొత్తగ్రామము లవారు పట్టణమువారిని జూచి భాండాగార ములను స్థాపించినను, వానివలన రవంతయుఁ బ్రయోజనము గలుగుటలేదు. జనసామాన్య ము విద్యావిహీనమైయుండుటయే యిందుల కుఁగారణము, చదువురాని వానియెదులు నెన్ని పుస్తక రాసులుంచినను నేమి ప్రయోజనము? ఇంతవఱకీ భారతభూమిలోఁ తొలుదొ నెన్నదగిన యొక్క బరోడా రాజ్యమునందు మాత్రము సంచార భాండాగారములు కలవు వంగమహారాష్ట్రముల ప్రస్తుతోన్న తస్థితిని బట్టి యా దేశములయందుఁగూడ సంచా భాండాగారము లుండెనని యూహింపవచ్చు ను. గాని విశేషముగ సంచార భాండాగారా ములు గలదియు, వానివలన సంపూర్ణ ఫలము ను బడయుచున్నదియు నింతవఱకు బరోజు రాజ్య మొక్కటియే.

బరోడా రాజ్యమునందలి సంచార భాండా గారముల కార్యక్రమమెట్టిదియో వివరింతు ను. సంచార భాండాగారికులు పరమో యోగములగు పుస్తకములు కొన్ని అన నొకటి రెండు పెట్టెలు, అక్షరాస్యులై, చ వుకొనుటకు గ్రంధములు కొనుగొనఁజాబీ బీదవారి కుటీరములమధ్యకుఁ బంపెదరు. అ క్కడ నాబీద వారావు స్తకములను జదివి చినతరువాత నాపు స్తకములను మఱియె చోటికిఁ బంపి వైచి వేఱకతరగతి పుస్తకము లను మొదటిచోటునకుఁ బంపుకురు. మా జిక్కులాంతరులు, సీనో మెటోగ్రాఫులుగూ బంపి ప్రకృతిచిత్రములను జూపుటయు, భ గోళజ్ఞానమును గలిగించుటయుఁ గూడఁ గల దు. కాని మొదటిపద్ధతి యిప్పుడు బరో రాజ్యముకంటే విద్యావిషయమున వె కఁబడియున్న మనదేశ మునకుఁ బనికి రాజ రెండవపద్ధతి, యనఁగా మ్యాజిక్కులాంత లను, సీసీమెటోగ్రాపులను బంపుటకు విశే ధనమావశ్యకమగుటచే ప్రథమమున మనః వాటిని నిర్వహింపజాలము. ఇక మనమిప్పు సంచార భాండాగారములను నిర్వహించు యెట్లు ? దేశ చరిత్రములు, వ్యక్తి చరిత్రములు, ప్ర తి శాస్త్రములు, సాంఘిక చరిత్రములు, తిపనులను గురించిన గ్రంధములు, జనాక ణముకొఱకుఁ గొన్ని నవలలు, నాటకము ప్రబంధములు, మెకటి రెండువందలకు ంచకుండ నేర్పాటుచేసి వివిధ విషయముల గుఱించి తెనుఁగులో ధారాళముగను, లభ శైలియందును, జక్కఁగ విషయనిరూ ణము గావించుచు నుపన్యసింపఁగల యుప వ్యాసకునకిచ్చి పల్లెటూళ్ళకుఁ బంపవలెను. వక, జనపదులను జూచియు, వారి ప్రవర్త సునుజూచియు నసహ్యపడువాఁడు కాఁగూ రు. పెద్ద పెద్ద వేషములు వైచి పల్లెటూరి వారికి దూరముగా నిలుచువాఁడు కాఁగూడ మఱియు ముఖ్యముగాఁ బల్లెటూరి ప్రజ నడవడులు తెలియని పట్టణవాసుఁడు కాఁ డదు. పల్లెటూరిప్రజల ప్రశ్నలకు విసు కొనువాఁడు కాఁగూడదు. వారితోఁగలిసి లసి యవసరమైనచోఁ జెప్పినదే మఱలఁ జె వలసివచ్చినచో నందులకు వెనుదీయఁ గూ రు. అతడు ముఖ్యముగా రాజకీయ, వాణి చారిత్రిక విషయములను దెలిసినవాడై ఉండవలెను. ఇట్టి యేర్పాటులు జరిగినచో దేశమునకు జాతీయ మహాసభవలనను, జధానీసభలవలనను, మండల సభలవలన జాతి సభలవలనను, వీరేశలింగకవి భాం గారము మున్నగు వేలంకొలంది గ్రంధము గల గ్రంధభాండాగారములవలనను, బత్రీ వలనను, నాంధ్ర సాహిత్య పరిషత్తువలన దక్కుంగల యిట్టియితర సమావేశముల నను గలుగు ఫలముకంటెఁ దొంబదితొ ది రెట్లు ఎక్కువస్థలము కలుగును.

దేశమిట్టి బీదస్థితిలో నున్నపుడు వక్తను బోషించుట యెట్లనియు, నందులకుఁ బూను కొనఁదగువారెవరనియు నడుగ వచ్చును. ఈ పని బూనుకొనఁదగువారు ముఖ్యముగా భాం డాగార స్థాపకులు. వారిదివఱకొక విధమైన భాండాగారములను నడుపుచున్న వారు గావున నీ రెండవ పద్ధతి భాండాగారములను నడుపు ట కష్టము గాదు. అధమపక్ష మిరువది రూ పాయల జీతమైన లేకున్న నుపన్యాసకుఁడు రాఁడు. మన భాండాగారములలో నేదియైన నెలకింత మొత్తమును జెల్లింపఁదగినది కల దాయని మీరు సందేహపడవచ్చును. మన భాండాగారములలోఁ గొన్ని నెల నెలకును గ రపత్రములను బ్రకటించుచున్న వారు. విద్యా ధికు లనుకొను వారు వానినిఁ జూచుటయే లేదు. జనసామాన్యము తెలియకపోవుట చేఁ వానిని జూచుట లేదు. లేఖకులుమాత్రము తమవ్యాసములు ముద్రితములైనవను నుత్సా హముతోఁజూచి యుప్పొంగిపోవుట తక్క నీ కరపత్రములవలన మఱియెట్టి ప్రయోజనము లు కలుగుటలేదు. కావునఁ గేవలధనవ్యయై కప్రయోజకములగు నీకరపత్రములు బ్రకటిం చుటమానివైచి నాలుగైదు భాండాగార ములవారు కలిసియైన నొక సంచార భాండా గారమును నెలకొల్పుట చాలనుపయోగ కరము. జనసామాన్యమున విరివిగ విద్యావ్యా పించియున్న ఖండాంతరములయందు కరపత్ర ములవలన నేమైన ఫలముకలుచున్న దేమో గాని మనదేమున రవంతమైన ఫలముగలు గఁబోదని మఱియొకమాఱు నొక్కి చెప్పుచు న్నాను. మున్ను చెప్పిన సుగుణములుగల యుపన్యాసకుఁడు వ్యగ్రోత్సాహముతో మన స్ఫూర్తి గఁ బని చేసినచోఁ దమకొరఱకు పా టుబడుచున్న యీసంచార భాండాగారముల కుఁ పల్లెటూరివారు కొంతవరకైన సాయప డకపోరు.

పల్లెటూరిప్రజలు వక్తలకుఁ బెండ్లికొడు కులకుఁబోలె భోజనాదివసతులను గల్పించుట లో వెనుదీయరు. కావునను, ఒక గ్రామము నుండి మఱియొక గ్రామమీ భాండాగార సా మాగ్రినిఁ దీసికొని వెళ్ళుటకుఁ గూలి యీన క్కర లేకుండ భారవాహకులు మెసంగుటకుఁ గూడ సందేహింపరు గావునను, అవ్యయము లనుగుఱించి నేను చెప్పలేదు. అంతియేగాక ప్రతిగ్రామమునకు వందలకొలఁదిగ నుమ్మడి సొమ్ము ప్రతీయేట వసూలగుచున్నది. ప్రజ యందైకమత్యమును నెలకొల్పి యాధనవ ను సద్వినియోగముచేయునట్లు తత్తద్గ్రా వాసులకుఁ బురికొల్పుటకుఁ దగిన యవకా ములున్నవి. కావున, సంచార భాండాగారవ ల వారావిషయమును బూనుకొనినచోఁ ప్ర జ వేవేఱుగఁ జేతి సొమ్మాయనక్కఱ లేకుం సంచార భాండాగారములను బోషింపఁగలరు కావున జనసామాన్యమునకు విజ్ఞానము సంగి దేశాభివృద్ధిని గావించు నీ సంచార భా డాగారములనుగుఱించి మనము తగు శ్రద్ధ హింపవలయును. {{right|శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి