గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/రయిలుస్టేషనుల యందు గ్రంథాలయములు

రయిలు స్టేషనులయందు గ్రంథాలయములు.


ఇంగ్లాండు దేశమునందున్న కొన్ని రయిలు స్టేషనులయందు 'ఫ్రాన్కులటు ఛెల్ ' ( ... మహానుభావుడు సంచార ధర్మగ్రంధాలయములను స్థాపనజేసెను. రయిలు స్టేషనులయం దాయన గ్రంథముల బీరువాలనుంచెను. ప్రయాణీకులు తమకిచ్చవచ్చిన గ్రంధములను అందుండి తీసుకొనిపోవచ్చును. ఆట్లు తీసుకొనిపోవువారు తమ నామము లను గాని, మారునామాలను గాని వ్రాసి పెట్టవలసిన అగత్యము లేదు. గ్రంధము లింతకాలములో తిరిగి ఈయవలయుననెడి నియమము లేదు. తమ ప్రయాణములనుండి తిరిగి వచ్చునప్పుడు దీసికొనిపోయిన గ్రంధముల నివ్వవచ్చును. లేదా స్టేషను మాస్టరు 6 పోస్టుద్వారా పంపవచ్చును. ఈ ప్రకారము స్థాపింపబడిన గ్రంధాలయములయం దొక్క గ్రంథమైన తస్కరింపబడలేదు. 'లట్ ఛల్' గారిని వారి యుదారగుణమునకు అభినందించుచు అనేకమంది ఉత్తరములు వ్రాసిరి. వీటియందలి గ్రంథములు అప్పుడప్పుడు మార్చబడుచుండును.

    1. 40B ##