గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/ప్రారంభవిద్యకు గ్రంధాలయముల తోడ్పాటు

ప్రారంభవిద్యకు గ్రంధాలయముల తోడ్పాటు.

ఏనాడు ప్రాధమిక విద్య సర్వజనసాధారణ మై పట్టణములయం దెట్లో పల్లెలయు దట్లే తాండవమాడగలదో, ఏనాడు ప్రారంభ విద్య నభ్యసింపగోరు ప్రతిబీదవాడును చదువుకొను టకు విద్యాశాలలు బహిరంగముగ తెఱచి యుంచబడునో, ఆనాడే యాంధ్రదేశౌన్నత్య మున కాదిమదివసమని జెప్పవచ్చును. కావు న వత౯మానకాలపు విద్యాస్థితిని అనగా “వ్యాప్తి” నారయుదము. అందులకుగాను ఆంధ్రదేశములో గల జనావాసములయొక్క యు, చదువతగిన యీడుగలిగి చదువుచున్న బాల బాలిక లయొక్కయు, చదువుకొనువారికి వేర్వేర ప్రభుత్వమువారియొక్కయు ప్రజల యొక్కయు గల తోడ్పాటుల వివరములను గూర్చియు చక్కగా తెలిసికొనవలెను.

ఆర్యులారా ! ఎనుబదిమూడు వేలకు పైగ ల చతురపుమైళ్ళ వైశాల్యముగలిగి ప్రత్యేక రాష్ట్ర విశ్వవిద్యాలయాదులను గోరు మన ౧౧ ఆంధ్రమండలములయందు గల ౧ కోటి 20 లక్షల జనసంఖ్యలోను 54 లక్షలజనులు మాత్రమే చదువగలిగినవారున్నారు. అనగా ఆంధ్రదేశమం దొకొక్కనూరుగురిలో నైదు గురుమాత్రము చదువుకొనినవారు. తొంబది యైదుగురా జనాభాలెక్క కేనివచ్చు చదువె రుగని నిరక్షరకుక్షులు. అయిదింటికిని తొం బదియైదింటికిని ఎన్ని అంతరములు గలవు. అజగజాంతరమా ? కాదు కాదు. హ స్తిమశ కాంతరము. కడచిన దానికి వగచిన నేమి ఫల ము. పాఠ శాలకుపోదగిన యీడు బాలురు అనగా ౫ మొదలు ౧౫ సంవత్సరము ల వయస్సు గల వారి యాంధ్రదేశమందు ౪౩,౯౫,౯౪౧ మందిగలరు. ఇందులో చదువు కున్న వారు ౩,౯౫, ౩౮౫మంది. అనగా చదువ తగిన యీడుగల ప్రతి నూరుగురు బాలురకు ను సగటున పదిమందిమాత్రమే చదువుచు న్నారు. ఆంధ్రదేశమందొక కృష్ణామండల ముమాత్రము ౧౦ సంఖ్యను మించుచున్నది. జనపరిగణనము ననుసరించి తెలుగు మండల ములలో సుమారు ౩౧౦౦౦ గ్రామములు గ లవు. ఈగ్రామములలో పై బాలురకు దా దాపు ౧౦ వేల బడులుగలవు. ప్రభుత్వము వారి సాహాయమువలన చదువుచున్న బాలుర సంఖ్య నూటికి నలుగురుగా నున్నారు. వారు జేయుచున్న సహాయము చేతనే మనమింతవర కైన విద్యాభివృద్ధిని గావించుకొన నవకాశ ముగలిగినది. ఇంతేగాక ఇప్పుడిప్పుడు విద్యా భివృద్ధి కాంధ్రదేశమునం దనేక సత్ప్రతిష్ఠాప నము లేర్పరుపబడినవి. ఏర్పరుపబడుచున్నవి.

అందెల్ల నగ్రగణ్యమైనవియు పండితపామ ర జనోపకరమైనవియు నగు గ్రంథభాండాగా రముల ప్రశ_స్తము సుప్రసిద్ధము. వాక్సూరు లుగాక కార్యశూరులై పేరుప్రతిష్ఠలకొఱ కు బాటుపడువారుగాక, సహజదేశాభిమాన ముతో శ్రమపడు యువజనులచే స్థాపింపబడి నయట్టి గ్రంథాగారము లాంధ్రలోకమున ౨00 వరకునుగలవు. కాని మొన్న మొన్న నే వె లువడినగతవత్సరగ్రంథాలయ చరిత్రలో ౧౬౦ మాత్రమే చేరియున్నవి. ఈ గ్రంథాగారము లే మిచేయుచున్నవి? వివిధవిద్యలను బ్రోగుఁ జే సీ పండితులను, ఉచితముగా విద్యమైసగి పా మరులను సంతుష్టి పరచుచున్నవి. మఱియు కొద్దిగానో గొప్పగనో చదువ నేర్చియు తమ విలువగల కాలమును దుశ్చింతలతోను దు ష్కృత్యములతోను వెళ్ళబుచ్చువారికొక వి ధమగు నూతనోత్సాహమును జనింపజేసి, సు మారు దినమునకు రెండు వేలమందికి పైబడు జనులను గ్రంథాలయముల దర్శింపించి గ్రం థములను వార్తాపత్రికలను చదువఁజేసి, కాల మును బుద్ధిని సద్వినియోగము జేయుచున్న దీ గ్రంథాలయముల పరిశ్రమయే ! ఈ భాం డాగారములు యాదార్యముచేతనే స్థాపింపబ డిన ముప్పదికిలోబడిన పాఠశాలలలోను, సు మా రేనూరు బాల బాలిక లుచితముగా విద్య నభ్యసించుచున్నారు. ఈ గ్రంథనిలయముల కృషివలననే కొన్ని గ్రంథమాలలు కొన్ని సదుపన్యాసములు కొన్ని వ్యాయామపు బరి శ్రమములు బయలు వెడలి, జనులలో విద్య నభివృద్ధిఁ జేసి నీతిని బలపఱచి యారోగ్యవం తులను జేయుచుండినవి. ఇట్టి గ్రంథాగార ములే నిజముగా ప్రారంభ విద్యాభివృద్ధికి ము ఖ్యసాధనము లనవచ్చును. అయిన నీ గ్రంథ భాండాగారములు ప్ర త్యేకించి ప్రారంభవిద్యా భివృద్ధికెట్లు తోడ్పడగలవు ?

సోదరులారా ! ఆంధ్రదేశ గ్రంథ భాండా గారసభవారి యాదర్శముల ననుసరించియే ప్రతితాలూకా గ్రంథాగారికులును తమతమ. తాలూకాలోగల గ్రంథ భాండాగార సమాజ ముల జేర్చుకొని, ప్రారంభవిద్యాభివృద్ధి కొక సంఘము నేర్పరచనగును. వీలు వెంట ననగా జనులనుండి చందాలను వసూలు చేసి పాఠశాల ల నెలకొల్పవలెను. పల్లెల కేగి యచ్చట వారికి విద్యయందభిరుచిని గల్పించి వారిచే పాఠశా లలు స్థాపింపజేయవలెను. ఇట్లుతగుకట్టు బాట్ల తోడను, పట్టుదల యభిమానాదులతోడను పనిఁజేసిన భాండాగారముల కృషివలన ప్రా రంభవి ద్యాభివృద్ధి కగు తోడ్పాటమేయమ ప్రారంభవిద్యాభివృద్ధి కిట్టి తాలూకా, జిల్లా సంఘము లావశ్యకములేయని విదేశీయురాలు య్యు మన దేశాభివృద్ధికి బాటు బడు చుండి; సుప్రసిద్ధనారీతిలకమగు అనిబిసెంటు దొరసా నియు, తన 'న్యూయిండియా' పత్రికయంద దేశీయులకు సలహా మెసగుచున్నది. ఈ సల హాను గ్రంథభాండాగార సభవారును పరిశీ లించి మండల, తాలూకా భాండాగార సభల కు బ్రోత్సాహము మెసగి, ప్రారంభవిద్యకు భాండాగారముల తోడ్పాటును వెలువరింతరు గాక !

ప్రారంభవిద్యాభివృద్ధిని చేయు నుద్దేశమ తోడనే దాదాపు ముప్పది భాండాగారము లుగల మా తెనాలి తాలూకాలో ప్రథమము న యొక యువకునిచే బ్రేరేపింపబడి యేడు సమాజములతోమాత్రము ప్రారంభవిద్యాభి వర్ధనీ సంఘము స్థాపింపబడినది. ఇప్పటికి మా రిమూడు సమాజము లందు జేరి పనిని చేయు చున్నవి. వరదలు వగయిరాలవలనమాతాలూ కా కీయేడునష్టముగలిగినది. అందుచే యీనూ తనోద్యమమునకు నిదర్శనముగా చూపబడిన తెనాలి తాలూకా ప్రారంభ విద్యాభివర్ధనీ సంఘము మిమ్మందర నక్కజపరుప దగినంత కృషి సల్పజాలకున్నను, రెండు పాఠశాలలో మువ్వురుపాధ్యాయులచే నూరుగురు బాల బాలికల కుచితముగా విద్య నొసగుచున్నది. మఱియు నిట్టిసంఘముల తోడ్పాటు ప్రారంభ విద్యాభివృద్ధి కత్యగత్యమనియు, అనుకూల మార్గమనియు, ఆచరణయోగ్యమనియు మాత్రము గ్రహించి యేతాలూకావారా తాలూకాయందిట్టి సంఘముల నెలకొల్పి విద్యనభివృద్ధిజేయ మిమ్మందర ప్రార్థించుచున్నది. కనుక గ్రంథ భాండాగారికులారా! మహాజనులారా !! చదువన నెట్టిదియో యెరుగక, చదువరులఁజూచి సిగ్గుఁ జెందుచు, తమ జీవితము నెట్లు గడుప వలయునో గ్రహింపక యుండు విద్యావిహీనులగు మీ దేశీయ సోదరుల దుస్థితిఁజూచి మీ చేతనై సంత సాయము జేయక మీరూరకుండవచ్చునా! ఎట్లూరకుండగలరు ? మీతోపాటాంధ్ర మాతృగర్భమున జనించి మీకన్న హైన్యస్థితి యందుండ, వారి హీనత్వమే మీ హీనత్వము కాదా? మనమందరమాంధ్ర మాతృ గర్భమునం దుద్భవించిన యేకోదరులమని తెలసుకొని, ఆంధ్రమాతృరక్తమే మన యెల్లర దేహములను బ్రవహించుచున్నదని యెఱింగికొని, యేకోదరత్వము,రక్త బాంధవ్యములకన్న మిన్నయగునది నున్నదియని గ్రహించినచో నిదియొక ఘనకార్యము గాదు. కావున మీ సోదరులై మీకన్న బీదలై, మీ దయాభిక్షములకు వేచియున్నట్టియు, నాశించియున్నట్టియు, విద్యావిహీనులకు నిరక్షరకుక్షులకు విద్యాదానముఁ జేయ గంకణము కట్టుకొని గ్రంథభాండాగారములు దేశమునకు నిజమగు నుపయోగవంతములుగా జేయుదురు గాక ! మఱల జరుగబోవు గ్రంథభాండాగార సభనాటి కిట్టి సంఘము లొండు రెండేని స్థాపింపబడి ప్రారంభవిద్యాభివృద్ధికి దోడ్పడుదురు గాక!

సత్తెనపల్లి హనుమంతరావు.