గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/జపానుదేశమందలి ప్రాచీనపుస్తకాగారములు
జపాను దేశము.
ప్రపంచమందలి ప్రతిఖండమందును ప్రాచీనకాలమునుండి విద్యావ్యాసంగమునం దభిలాష గల వార లుండిరి. జపా దేశమందును నట్టివారుండిరని చరిత్రప్రతీతి.
షి. మెకూ పరగణాలోని ఆషిక నగరమందున్న భాండాగార మతిప్రాచీనమైనది. పూర్వము 8 మొదలు 11 శ బ్దముల వరకుగల హెయినా రాజులకాలము జపానీయుల స్వణ ్ యుగమని పిలువబడెను, ఆకాలమున పద్యగ ద్యాత్మకము లగు ననేక గ్రంధముల వ్రాతప్రతులు చేర్చబడెను.
నియుమియను చక్రవతిజ్ఞ కాలమున ననగా క్రీ. శ. 842 సం॥ ప్రాంతమునటమూరాఒనో అను నొక గవర్న కరిసరమున నొక పాఠశాల స్థాపించెనని యింకొక ప్రతీతి కలదు. ఎట్లయినను 1467 సంవత్సర ప్రాంతమ నాగావో అను నతనిచే నింకొక పాఠశాల స్థాపింపబడుట రూఢి. ఇందులోనే యొక ప్రసిద్ధపుస్తక భాండాగారా ంపబడెను. 15వ శతాబ్దమున నొరిజానీయుసూ జీయను నుద్యోగస్థుడీ భాండాగారమునకు 'భూ తులనిచ్చి గ్రంధము ల సేకములను జేర్చిను. కాలక్రమమున నిచ్చోటనే పుస్తకము లచ్చుబడెను.
టోకుగా వాయియాము అను నాతడు కన్ఫ్యూషియసు యొక్క ప్రతిమనొకటి యీ పాఠశాలలో నుంచెను. అ నేటికిని గలదు. కన్ఫూషియను అనునాయనచే రచియింపబడిన గ్రంధములు 18 ఇందుగలవట.
తరువాత కనజావాలో 12వ శతాబ్దమధ్యమున స్థాపింపబడిన యింకొకపుస్తక నిలయము కలదు. సానిటోకీహా జోయనువానిచే నిది స్థాపింపబడెనని చరిత్రకారులు నమ్మెదరు.
ఈపుస్తక భాండాగారములు రెండును లేచిన కాలముననే యూరపునందును భాండాగారములు 'స్థాపితములాయెన జపానీయు లిప్పుడీ పుస్తక భాండాగారములను జూచునప్పుడు వాని సంస్థాపకులను కొనియాడుచున్నాడు. పఠనముంది ములు, పుస్తకాగారములు దేశమున నన్ని వైపులు నెలకొల్పబడినపుడు ముందు యుగమున రాబోవు జనులు కృతజ్ఞత గలవారుగ నుందురు.