గోదావరిసీమ జానపద కళలు క్రీడలు వేడుకలు/కృతజ్ఞతలు
కృతజ్ఞతలు
1912లో ఎం.ఏ. పాసైనా వాలో విద్యాతృష్ణ తీరలేదు. కాని ఉద్యోగం వదలుకోలేదు. పి.హెచ్.డ్. ప్రయివేటుగా చేద్దామవేది నా తపన, మునిపల్ కమీషనరు ఉద్యోగంలో యిదిసాధ్యపడేదికాదన్నారు అందరూ. రాజమండ్రిలో ఒకమీటింగులో ఒకసారి ప్రొఫెసరు యస్వీ. జోగారావుగారితో యీ ప్రస్తావనతేగా తప్పక యూనివర్సిటీకి అప్లయిచేయండి. ఈ సబ్జక్టుకు మీరు ఫిట్ కేండిడేటు అన్నారు. అలాగే ఆంధ్రాయూనివర్సిటీ ఎగ్జంప్షన్ యిచ్చింది. కాని నేనున్నది నూజివీడు. అంతదూరంనుండి దీన్ని సాధించడం అసాధ్యం. నాకోరిక తెలపగానే ప్రభుత్వం దయతోనన్ను భీమ్లీ కమీషనరుగా ట్రాంస్పర్ చేసింది. భీమ్లి మంచి వాతావరణం. ఇక్కడికి వచ్చేసానండి అని చెప్పగానే ప్రొఫెసర్ జోగారావుగారు ఎంతో ఆనందించి తనదగ్గర అవకాశంకల్పించి ఆరుమాసాలలో ప్రీ పి. హెచ్ డి. పూర్తిచేయింఇ, సంవత్సరేం తిరక్కుండానే పి.హెచ్.డి. కి యీధీసెస్ సమర్పించేటట్టు చేశారు. వారిచ్చిన ఉత్సాహం. ప్రోత్స్దాహం యీ పరిశోధనలో నేనుపడ్డ కష్టాన్ని మరపించేది. ఆయన ఉత్తమ గురువు. నన్ను శిష్యుడుగాగాక స్నేహితుడిగా అభీమానించారు. వారికి నా నమస్కృతులు.
ఈ ధీసెస్ని మెచ్చి నాకు డాక్టరేట్ పట్టా యివ్వడానికి సిఫార్సు చేసిన ఆంధ్రాయూనివర్సిటీ త్రెలుగుడిపార్టుమెంటు అధ్యాపకులకూ యీగ్రంధంపై నాకు డాక్టరేట్ యివ్వమని అమూల్యాభిప్రాయం అందించిన యితర ఊనివర్సిటీల ఎడ్జుడికేటర్సుకూ నా వందనాలు.
ఈ పరిసోధన ప్రజలకు సంబందించినదికావడంవల్ల యీ పేరుమీద ఎందరో వృద్ధ కళాకారులకు, అజ్ఞాతమేధావులను కలిసేభాగ్యం కలిగింది. ఇది నాకు ఎనలేని శక్తిని, ఆసక్తిని, అన్నికళలపట్ల అవగాహనని పెంపొందించి ప్రజలు ప్రీతితో "సకల కళాసాగర", "లలితకళాభిజ్ఞశేఖర", "జానపదకళాప్రపూర్ణ" వంటి బిరుదులిచ్చి గౌరవించేటట్టు చేసింది. ఆ మేధావులకి, ఆ కళాకారులకి, ఆ అభిమానులకి నేనెంతో ఋణపడివున్నాను. వారికి నా అభివాదములు-
పుస్తకప్రచురణకు ఆర్ధికసహాయమందించిన తెలుగు యూనివర్సిటీ వారికి కృతజ్ఞతలు.
భవదీయుడుడా.పడాల రామకృష్ణారెడ్డి ఎం.ఏ.పి.హెచ్.డి.