గృహలక్ష్మి మాసపత్రిక/సంపుటము 7/సంచిక 1/స్వవిషయము

స్వవిషయము

“మ|| హరికిం బట్టపుదేవి, పున్నెములప్రో, వర్ధంపుఁ బెన్నిక్క, చం! దురుతోఁబుట్టువు, భారతీగిరిసుతల్ తో నాడు పూఁబోఁడి, తా మగలందుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించునిల్లాలు, భా సురత లేములు వాపుతల్లి, సిరి, యిచ్చుజ్ నిత్యకళ్యాణముల్ ||" -భాగవతము.

శ్రీహరికటాక్షమువలన లక్ష్మీ సమానురాండ్రగు నిల్లాండ్రప్రేమాశీర్వాదముల బలముకలిమిని, 'చెలిమిఁ గొలిపి ఫలము నాశింపక వెలలేని వ్యాసాలంకారములఁ దులకింపంజేసిన యపరగురులగు కవియువకుల సహాయమున నీ గృహలక్ష్మి, యా గేండ్లు గడపినది. నేడు సప్తమ వర్షారంభ దిననుని మాపాఠక మహాశయులకుఁ దెలుపుట కెంతయు సంతస మొందుచున్నాము.

ఈ గడచిన యారేండ్లు నిదియొనర్చిన పనియందుఁగల మంచి చెడ్డలను గురించి యవ్యాజహృదయయగు జ్యేష్ఠ సహోదరి, శ్రీమతి కనుపర్తి వరలక్ష్మమ్మగారు, లోకమునకుఁ దెలిపినయంశములను దరువాతఁ జూతురుగాక. అంతమాత్రమున 'ధన్యోస్మి' యని ఇది తలద్రిప్పఁ గలదా? ఇది చేసినపని 'యావగింజలో నరపాలు.' ఇంకఁ జేయవలసియున్నది బ్రహ్మాండమంత! ఈయథార్థమును మేమెరుఁగుదుము.

చూడుఁడు. సాంఘిక విషయమున శారదాశస్త్రమును, శక్తిధ్వజమును బూని లక్ష్మీ ప్రభాకలిత యై నాగరక సోదరీజనమండల ములయందే యీగృహలక్ష్మి తాండవముఁ జేయుచున్నది కాని పల్లెటూరి 'పార్వతమ్మల' కడకుఁ బోఁజాలకున్నది. ఏలయన నాసోదరీ వలనఁ దానాశించిన వెనుకదన్ను చాలక. పోనీ వీరి నిట్లుండనిచ్చి యింక వీరి కంటె విశిష్టలగు నాగరక భగినీజనముల కడకుఁ బోవుదమన్న, వారు దీని మోమైనఁ గనరు. వారిభాషలు విజాతీయములు. వారి భావములు మేరలు విరియున్నవి. ఇంక నేమిదారి? ఎత్తుచున్న తల ద్రింపఁజాలదుకదా! బాలిక యేయయ్యు మానాభిమానము మెండుగాఁగలది. కాఁబట్టి వెళ్లినదారినే తిరిగిరాక సామవాదములతో నిట్టి విశిష్ట నాగరక యువతులఁ దనవారిగాఁ జేసికొని యావలఁ గ్రమక్రమముగఁ దొంటి 'పల్లెటూరి పార్వతమ్మల’తో బంధుసఃణి నెఱపవలసియున్నది. తమ కిది యిష్టము లేకున్నను లోక సంగ్రహమునై నఁ బాటించి యీ విశిష్ట సహోదరీమణులు ఈ గృహలక్ష్మీం బలుకరించి భాషంత్రుగాక !

తమ సువిశాల సరస్వతీభ వనములయం దీ తెనుఁగు బిడ్డ కొకింత చోటిత్తురుగాక! అటులై నవో నీ బాలిక కొక లోపము పోవు నళి మాయభిప్రాయము.

ఇఁక నైతికముగా, నిది పల్కు చున్నవి. జిలిబిలి ముద్దుమాటలే యైనను “పిన్ని చేలి దివ్వె పెద్దగా వెలుగదా” యను యధార్థమును బాటించి హృదయపూర్వకముగ వినుచున్న వారలు పలువురున్నారు కాని యంత మాత్రము చాలదు.

" ఎఱుకగలవారి చరితలఁ గఱచుచు సజ్జనులగోష్టిఁ గదలకధర్మం | బెఱుఁగుచు నెఱిఁగిన దానిని మఱువు కనుష్ఠించునది సమంజసబుద్ధి ||"

అనున ట్లాచరణయే నీతిశ్రవణమునకు ఫలము, అది పెక్కుచోట్ల ననుకొన్నం లేదు, మన యీ “గృహలక్ష్మి' వయసు మీరినకొలఁది తన సహోదర సహోదరీ లోకమును దశవశము చేసికో గలదేమో యింకను జూడవలసియేమున్నది. ఇంతతోఁ దీరలేదనియే మాయాశయము. భ్రూణహ త్యాది మహా పాతికవాసన లింకను దఱచు గానే కొట్టుచున్నవి. శివశివాయని 'ముక్కూ చెవులూ' మూసికొనవలయునేకాని నోరెతి గట్టిగా నేమియు సనరాదుగదా ! "ముక్కు. గోసికొన్న నెత్తురు నోటిలోనికి వచ్చుట” నిజముకదా! కాఁబట్టి "కాలమన్ని యుం జేయుచుచుండుఁ; గాలము విచిత్రము దు స్తర మెట్టివారికి" యని కాలమునే యనుసరింప వలెను గాని వేగిరింపరాదు.

ఆస్తికతా మధ్యముననే పుట్టి యల్లారు ముద్దుగాఁ బెరుగుచున్న “గృహలక్ష్మి" యిఁక “మత విషయమున నేమి యొకరిచి నది ?” యని యోచింతమా, అది సర్వజన సమ్మతమగు మతముననే నడచుచున్నది. ఇట్టి వర్తమాన ప్రవర్తనముఁ బట్టియే భవిష్య త్తునుగూడ నెంచి నిశ్చింతతో నుండవచ్చును; . కాని యట్లుండుటకు వీలులేదు. సనాతన భయ మింతసుళువుగాఁ బోవునది కాదు కాఁబట్టి ‘నెగ్గితి' నని యిది విఱ్ఱవీఁగుట కవ కాశములేదు. మెలఁకువతోడనే మెలఁగవలసి యున్నాది.

మరి మొదటినుండియు నిది రాజకీయ రంగములయందుఁ బెద్ద పెద్ద పరువులు వార లే కుండుట బాల్యదశాదోషమే! కాని యీ దోష మిటులుండవలసినదే యేమోనను నను మానము కలుగుచున్నది. ఈ యనుమాన నివర్తి కేమి" యెగదుడుపులు దిగదుడు పులు” చేయవలయునో తెలియక మేమే సందిగ్ధానస్థయందున్నామ . కాఁబట్టి“యెప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి 66 నీవు యన్యులమనములు నొప్పింపక నొవ్వక తప్పించుకు తిరుగు” మని ధైర్యము చెప్పుచున్నాము. కాని పరమాస్వతంత్ర యైన బాలికకు మనసులోనిదిగులు మాసి పోవుటకల్ల.

ఈ విధముగా సాంఘిక, నైతిక, మత, రాజకీయాది విషయములయందు మన యీ గృహలక్ష్మి పరిపూర్ణముగాఁ గృతికృత్య యగుటకుఁ జాలినంత కాలమునే సంభావింపు చున్నాము. అదియును విజయము నిశ్చయిం చుకొన్న వారమై !!

ఎందువలన? వయోవిజ్ఞానవృద్ధులను పెద్దలు, "కాలములు గడసిన కత్తిపీట”ల వంటివారు మాకు సలహాదారులని. మరియు ననురక్తి శ క్తియుక్తులగు యువయువతీ మణుల నిరంతరసహాయప్రోత్సాహములవలనఁ గొంత వఱకు మాకు “వాగర్థప్రతిప త్తియొన గూడు చున్నదని.

తస్మాత్తు శక్తిధ్వజమునుబూని, శారదా శస్త్రహస్తయై లక్ష్మీప్రభాకలితయగు నీ యార్య “గృహలక్ష్మి'ని వినయముతో యధాపూర్వముగ మీ చేతులఁ బెట్టుచు న్నాము. కృతజ్ఞతా బద్ధులము. మాయెడ దయాభిమానములు చూపి దీని పరివ్యా ప్తికై తాము చేయవలసియున్నది కూడ నెంతో కలదనియు నెఱుకఁ జెప్పుచున్నాము. ఏవంకఁ జూచినను ఆర్థికవిషయములఁ గూర్చి హాహా కారములే వినవచ్చుచున్న యిట్టి విషమ పరిస్థితులయం దైనను గృహలక్ష్మీ యంద చందముల కేమాత్రపు లోపమునై నఁ గలుగ కుండనిఁక విూదుమిక్కిలి దీనిని నానాటి కధిక తర సౌందర్యవతినిఁగాఁ జేయుటకే మనసార యత్నములు సేయఁబడుచున్నవి. ఇట్టియత్న ములయఁదుగూడఁ గవులును జిత్రకారులును నిరంతర సహాయముఁ జేయుచునే యున్నారు. కాని యిట్టి సహాయ మొకప్పుడు మాకుఁ బనికి రాక పోవుచున్నది. దేశకాలపరిస్థితులఁ బట్టి స్త్రీ సమాజమును అటు పరమ పురాతనపద్ధతినుండియు నిటు పరమపాశ్చాత్య సరణినుండియుఁ ద్రిప్పి యీ రెంటికిని మధ్యమ మగు నొక త్రోవలో నడపించుటయే, దేశాభ్యుదయ పరంపరావాప్తికి ప్రథమోపాయ మని మా విశ్వాసము. ఇట్టిదానికిఁ బ్రతికూ ల్యత వాటిల్లునెడ మాకు మౌనముద్రయే శరణ్యమగుచున్నది. ఒక్కొక్క యెడ నుదాసీ నతయుఁ బూనవలసి వచ్చుచున్నది. ఇట్లుం డుటవలన మాయెడఁ జేయఁబడు కన్నెర్ర లను జూచి “శా న్తము లేక సౌఖ్యములే””దని

పాడుకొని యానందించుచున్నాము.

ఆకర్షణ