గరిమెళ్ళ వ్యాసాలు/సాంఘిక నవల
సాంఘిక నవల
మన ఆంధ్రమున నిప్పటి కొక వేయి వనలలయినను ప్రచురింప బడి యుండవచ్చును. వీటిలో ననేకములు బంగాలీ, హిందీ, మహారష్త్రము మొదలగు దెశీయ భాషలనుండి తర్జుమాలైయున్నవి. వీటిలో గూడ కొన్ని మహమ్మదీయ, మరాష్ట్ర రాజపుత్ర యుగములనటి చరిత్రాత్మకములై యున్నవి. కొన్ని బ్రిటిషు యుగము నాటి రహస్యపరిశోదకములై యున్నవి. మఱి కొన్ని పౌరాణీకములై కూడా యున్నవి. అతి కొంచెము మాత్రము గ్రంధకర్తలు తాము స్వయముగా నాలోచించి వ్రాసినవై యున్నవి. ఆటిలో గూడ మరల ఆంధ్రదేశపు టాచార వ్యవహారములకును, ఆంధ్రదేశపు పల్లెలు, పట్టణములు, ఏఱులు, సరోవరములు మొదలగువాటి వర్ణనలకును సంబంధించినవి మఱియు స్వల్పము. ఈ చివర తప్ప మఱి వేనిని గాని ఆంధ్ర సాంఘిక నవల యనుటకు వీలు లేదు. అయినను ప్రస్తుత గ్రంధకర్తలలో సాంఘిక నవల వ్రాయుదమను నుత్సాహము మిక్కుటముగా గనుపట్టుచున్నది. ఇట్టి యవసరమున సాంఘిక నవల కుండవలసిన లక్షణములెవ్వి? అవి యేట్లు మన ప్రస్తుత సాహిత్యల్మున నచ్చటచ్చట పొడసూపు చున్నవి. వాటినెల్ల సంపుటీకరణము చేసి యందమగు సాంఘిక నవలా నిర్మాణమున కెట్లు దారితీయనగును అను అంకములను కొంచెము విచారించుట యెంతమాత్రమును నప్రస్తుల్తము కాదు. లాక్షణికులిట్టి నిర్ణయమిప్పుడు చేయనిచో ప్రతి లేఖకుడును ఏ వివాహమునకో వ్యవహారమునకో లేఅ వింతకో సంబంధించిన యొక కధనల్లి దానికి సాంఘిక నవల యను పేరు పెట్టుట తటస్థింపవచ్చును. అట్లు జరుగుచున్నది కూడాను.
ఐరోపా ఖండములోనేమి భారతదేశముననేమి నవల యనునది పురాణములు, పద్యకావ్యములు, వచన చరిత్రములు మొదలగునవి యెన్నియో వెలువ్డిన తర్వాత నూతనముగా వికసించిన సాహితీ విశేషమని చెప్పవచ్చును. ఐరోపా ఖండములో అనేక సాహిత్య వికాసములకు లాటిను భాషయు, ఇటాలియను గ్రంధములును మార్గదర్శకము లైనట్లే నవలలకు గూడ ఇటాలియను నవలలే మార్గదర్శకములుగా నుండెను. ఇటాలియను నవలలు తరుచుగా ఉన్నత కుటుంబములకు చెందిన యువతీ యువకులు, నాయికా
గరిమెళ్ళ వ్యాసాలు నాయకులు కలివిగాను, వారు ఒకరి ప్రేమనొకరు చూఱకొనుటకు చేయు త్యాగములు, విలాసములు, పరిశ్రమలు మొ॥నవి విషయములుగా గలవిగాను, చాలమట్టుగ చరిత్రాత్మకములు గాను, కొంత వరకు అద్భుతములతో కూడినవిగాను నుండేడివి. అయిరొపా ఖండము ఇటాలియను సాహిత్య పరిచయము వలన బడసిన నూతన భావములతోను, ఉత్సాహములతోను ఉఱ్ఱూతలూగెడి సమయమున వివిధ దేశములలో ప్రధమమున వెలువడేడి నవలలిట్తివి గానే యుండేడివి. ఆంగ్లేయ బాషలో స్కాటు నవలలను పఠించువారికి వాటి లక్షణములు తెలియగలవు. మనదేశములో రసపుత్ర శౌర్యముగ రచిందిన విమలాదేవి, రాణి సంయుక్త మొదలగు నవలలు కూడా నిట్టివే.
ఈ నవలలను పఠించుట వలన నవలయను పేరు మోపెడి ప్రతి గ్రంధమునకును కొన్ని పడికట్లుండుననియు, అది లేనిచో ఆ గ్రంధము నవల కాదనియు అభిప్రాయము సాహిత్య ప్రపంచమున నల్లుకొనెను. ఆపడికట్లు ఉన్నత వంశమునకు చెందిన నాయికా నాయ్హఖూళూ, వారొకరికొకరు తప్పక త్యాగము చేసి యిడుములు గుడిని తమ ప్రేమను ఋజువుపరచుట, నీతిదాయకమై నెగడుట, భాష రసోద్దీపకమై శబ్దాలంకార శోభితమై లలితమై నీతిదాయకమై నెగడులు, భాష రసోద్దీపకమై శబ్దాలంకార శోభితమై, లలితమై గంభీరమై యుండుట ఆయాతావుల కధకెంత యవసరమో అంతకు మించియు (కధనడకలో విస్తారము సంబంధము లేకపోయినను సరే) ప్రకృతి వర్ణనములు సలుపుట మొదలగునవి ఈ విశ్వాసమౌ నవలా ప్రపంచమున నొక మూర్ఖమతము వలె వ్యాపించి యీజాతి నవలలన్నియు స్థల నామములు, పురుషనామములు మత్రమే భేదముగా సమస్త దేశముల నవలలు నొక్క తీరుగా నుండునట్లు చేసినది. ప్రత్యేక స్థలముల యాచార వ్యవహారములు గాని, నిరొపణలు గాని వ్యక్తుల పోలికలు గాని చేజిక్కక యువకజనోచితములగు నుత్సాహమును మాత్రమినుమ డించుచు, అద్భుత చర్యల పఠనమున కాని గొలుపుచు వచ్చినవి. వీటిని నవలలు కావని యెవ్వరును ననజాలరు. అవియొక రీతి ననలలు సాంఘిక నవలలు కావు.
సంఘజీవనము నందాసక్తి పుట్టి, వారి యాశలు ఆశయముల యందు
గరిమెళ్ళ వ్యాసాలు
మనకభిరుచి జనించి వారి తళుకులు, బెళుకులు, హోయలు, యెయ్యారములు, నవ్వులు, పరియాచికములు, వివదములు, కష్టసుఖములు మొదలగు వాని యందు సానుభూతి జనించి అ అచ్చట్లను ముచ్చటలను ఆనందదాయకముగా వీలయినంత వరకు వారు మాటలాడుకునే శబ్దార్ధాలంకార రహితమగు శైలిలో చెప్పెడి ప్రశంసలకే సాంఘిక నవలని పేరు అట్నలి శైలి అల్పులు, నీచులు కూడ మాట్లాడే రీతిని హేయపద భూఇష్టమై యుండకుండా సఖ్యమై వెగటు పుట్టించ కుండిన చాలును. ఇట్టి నవల కుండవలసిన ముఖ్య లక్షణముమేమన కధ యే కాలము నాటిదని మనము చెప్పుచున్నామో ఆ కాలము నాటి మాటపడుపు, యాస, మర్యాదతీరు స్థలారుల చిత్రము కళ్ళకు కట్తినట్లగుపడవలెను. ఇట్టివన్నియు పురుషాంతరమునున కొకసారియైన నచ్చముగ మారిపోవుచుండును. సాంఘిక నవల యనిన కధ చెప్పుట కాదు. కధచెప్పుటకెట్టి శైలియైనను నొకటే. యెట్లువర్ణీంచిననునొకటే. సాంఘికనవలయనిన కధను చిత్రించుట. ఇట్టి చిత్రమున కెక్కడనుండవలసిన రంగు, నీడ, కాంతి అక్కడ సరిగ నుండిననే చిత్రము సరియైనదగును కాని సంఘమర్యాదలు, వివరములు, స్థలము యొక్క తాత్కాలికి విచిత్రములు, మొదలగు వానియందు లక్ష్యము లేక లేఖకుడు తన కల్పనలతో నవిచ్చిన్న ముగ విజృంభించినచో ఏదో యొక చిత్రము తయారయి ఏదో యొక వింతరొలిపి మోహింప జేయునే కాని అది సంఘ చిత్రము కానేరదు.
సంఘ చిత్రము సరియైనదై యుండవలెను. అనగా సత్యమైనదై యుండవలెను. సత్యమనగా ఇక్కడ బ్రహ్మపదార్ధము ను గూర్చిన సత్యము వంటి విశేష సత్యము కాదు. ఆ సత్యము దేశకాల పరిస్థితుల వలన బాధింపబడినది. ఈ సత్యము దేశకాల పరిస్థితుల మార్పు వలన బాధింపబడు సామాన్య సత్యము స్థలములు వేడున్నట్లు మరి పదియేండ్ల తర్వాత నుండవు మాట తీరులు, అలవాటులు, మర్యాదలు, ఆచారములు తాత్కాలిక చరిత్రాత్మకమగు విశేషములు మొదలగునవి కూడా నేడున్నట్లు ఒక పురుషాంతము తరువాత నుండబోవు. ఈచిత్రమును మనము కన్నులార చూచుచు చిత్రించినవే సరియైన సత్యమైన చిత్రము చిక్కుని కాని ఊహాప్రపంచము నుండి కల్పనలను తీసుకొని వచ్చి చిత్రించినచో అది కృత్రిమము కాకమనదు. కనుక సాంఘిక నవల గ్రంధకర్త తన కన్నుల
గరిమెళ్ళ వ్యాసాలు యెదుట ప్రవహించుచున్న కాలవాహినిని గాంచుచు అందలి విషయములను గూర్చి వ్రాసినపుడే సరియైన సత్యము చిక్కును గాని రసపుత్రయుగము నాటిదియు వంగభాష మాటాడు వంగదేశమునకు సంబందించినదియు రాయచూరు యుద్ధము వలె ఏ విజయనగ సామ్రాజ్యం నాటి ఆంధ్రులచరిత్రకో సంబంధించిన దియు నగు విషయము నెత్తుకొని వ్రాయగడంగినచో మన చర్మ చక్షువుల యెదుట జరుగు ఆకళంక సత్యమును గాక ఊహాచక్షువు నెదుట గోచరించు నట్టియు అభూతకల్పనలతో కూడినట్టియు శృంగార, వీర, శోకాద్భుతాది రసములతో మన డేందముల నానందకల్లోలినిలో నుంచునట్టియు, విచిత్రకాల్పనిక సత్యమును మాత్రమే చిత్రించినదగును. పందొమ్మిదవ శతాబ్దమున జీవించిన ధేకరియను ఆంగ్ల నవలాకారుడు పదునెనిమిదవ శతాబ్దము నాటి యొక కధను నవలా రూపుముగా వ్రాసెను. అందుకొరకా శతాబ్బపు మర్యాదలు, సంభాషణములు మొదలగునవి అద్భుత కార్యమొనర్చిన యొక ప్రజ్ఞావంతుడుగను, సాధింప సాధ్యము కాని కృత్యమును చాలవరకు సాధించిన యొక వీరునిగ మాత్రమే పరిగణించుచున్నారు కాని దానిని సంపూర్ణమగు సాంఘిక నవల యని వ్రాయుటకే విమర్శకునకు చేయిరాకున్నది.
సాంఘిక నవల కధ యే కాలమునకు చెందినదో ఆ కాలము యొక్క సరియైన చిత్రము గ్రంధకర్తలు తరుచూ తమ కన్నుల యెదుట జరుగుచర్యలనె సరిగా చిత్రించలేక యెదో ఒక ఆబావము చేయుచుందురనిన నిర్ణయించగల తీర్పరు లెవరు? జరుగుచున్న కాలమునాటి దానికి సజీవమగు ఆ సంఘమే సాక్షి ఏ మాత్రమెచ్చుతగ్గున్నను యే యమ్మలక్కలైనను కనిపెట్టగలరు. ఇక విమర్శక విశారదుల మాట వేరే చెప్పనేల?
కనుక సాంఘిక నవలను వ్రాయ్లబూనువాడు తన కాలము నాటియు, తనకు తెలిసినట్టియు, తాను కనిపెట్టియు జీవితాంశముల నెత్తుకొని వర్ణింపదొడగిననే సఫలీకృతుడగును. కాని 'అనగనగా నొకరాజు ' అని యే పూర్వచరిత్రనో గైకొనినచో కేవల పరిహసపాత్రుడగును. కధ జరిగి తీర
గరిమెళ్ళ వ్యాసాలు
నక్కరలేదు. నిజముగా జరుగుచున్నట్లనిపించిన జాలును.
సాంఘిక నవల కవి వ్రాయుచున్న నాటి కాలముదై యుండ వలెను. మనకధ జరుగుచున్న నాటి సమయమున ప్రయోగమందెచ్చటను కానరాదు. కధ యే భాషలో వ్రాయబదుచున్నదో ఆ భాష మాటలాడే ప్రాంతమునకును, జాతికినీ సమబంధించినదై యుండవలెను. ఒక దేశపు ప్రజలు వేఱొక దేశపు భాషను దానికి స్వతస్సిద్ధమగు జాతీఅములతొను, సులువుతోను, సౌందర్యముతోను మాటలాడజాలరు. కవి తన స్వభాషలో స్వభాష మాటలాడు వారి జీవనమును ప్రతిబింభింప చేయుటకు ప్రయత్నించిననే సాంఘిక నవల సరియైన చిత్రము కాకలదుకాని లేనియెడల సరియైనది కాజాలదు.
కధ సత్యముగ జరుగుచున్నట్లగపించిన సాంఘిక నవల కవి కాలము నాటిదై కవి యొక్క స్వభాషలో రచితమై పాత్రలు తమ మాతృభాషను నవలలో మాటలడుచుండ వలెనని కధలో నెచ్చటను కృత్రిమ నామాదులుండరాదు. కృత్రిమ నామములనగా ఆ భాష మాటాలాడే ప్రజలు గల రాష్ట్రంములో వాడుకలో లేని స్థల నామములు, పురనామములు, పురుషనామములు మొదలగునవి. భోగవతి, మధురనగరము, ధార్మిక పురము, శ్రీ నికేతనము పేరులు మందాకిని, మస్స్యవతి మొదలగు నేఱుల పేరులు, వీరసేనుడు, విజయసింహుడు మొదలగు పురుష నామములు, సంధ్యావళి, మదాలస, మనోరమ, మొదలదు స్త్రీనామములూ ఇట్టివి మన తెలుగు దేశములో లేవు కనుక ఇట్టి పేరులను కవి సాంఘిక నవల యందు ప్రయేగించినచో అంతవరకు అవి కాల్పనికములుగా తోచి కధనంత వరకు సత్యము కానట్లు తోపజేయును. ఆంధ్రదేశపు సాంఘిక నవలను వ్రాయగడగినచో ఆంధ్రదేశములో నున్న నదులు, కొండలు, గ్రామములు, పట్టణముల పేరులును, ఆంధ్రదేశములొ వ్యవహారములో నున్న స్త్రీ, పురుష నామములను మాత్రమే ప్రయోగించవలను.
ఇంతియ కాదు. ఈ నదులను గ్రమములను మొ॥ వానిని గూర్చి వర్ణించునపుడు గాని వాటి ప్రశంసలు వచ్చునప్పుడు గాని యే నదులకైనను గ్రామములకైనను సమానముగా వర్తించునట్టియు పురాణ
గరిమెళ్ళ వ్యాసాలు ప్రబంధములలో తరచుగ గాననట్టియు సమాన గుణములు కురిపించి విడిచి ఆయా పేరులు గల గ్రామములకు, నగరములకు, పట్టణములకు ప్రత్యేకించి ఎల్లునట్టియు, కదనము యెక్క గమనికను, వీలయినంత వరకు ప్రతియక్షరమును సంబందించు నట్టియు విశేషములు చేర్చవలెను. ఇట్లు చేయుట వలన ఇతివృత్తము సరిగా నడౌచున్నట్లు మనదృష్ఠికి గొచరించుచుండును.
పిమ్మట ఈ దేశములో నున్న కులాచార వ్యవహారములను చిత్రించుచు రావలెను. కాని పల్లె పడుచులకు పట్టణ వాసపు ఫేసు ఫౌడరులను పూసియు, పట్టణపు కన్యలకు టర్కీ మసుగులు ఇంగ్లీషు గౌనులు తొడిగియు, వికారవేషములు వేయరదు. ఆచారములను మీరి ప్రవర్తించు వారి విషయమై వర్ణీంచునపుడు మాత్రమే అట్టుల వ్రాయనగును. ఇది కాక ప్రతి జారికిని జాతి లక్షణముల నొప్పు కొన్ని స్వభావ లక్షణములుండును. ఇవి దేశమునుండి దేశమునకు, రాష్ట్రమునుండి రాష్ట్రమునకు మాత్రమే కాక ఒక గ్రామము లేక నగరములొ కూడా ఒక తెగనుండి మరియొక తెగకూడ భేదముగా నుండును. వారి యిళ్ళు వాకిళ్ళలోనూ వారి వస్తు వాహనముల నుంచుమొనెడి యిమ్ములోను ఒకరినొకదు పలుకరించి ఆదరించెడి విధానములోను, ఇతరులతో ప్రవర్తించునప్పుడు కనబడుచు విధి విషయములు లేక టెక్కు టక్కులలో శుబాశుబ పుణ్యాపుణ్య కార్యములలోను, ద్రవ్యాదుల నాకర్షించునట్టి లేక వెచ్చించునట్టి తెరవులలోను, సరసములు, సల్లాపములలోను ఈ లక్షణములు తమ్ము తమ్ము చూడు మన్నట్లగుపింఛుచుండును. నిజమైన శిల్పదృష్టి గల కవి వాటినెట్లో పోల్సి వర్ణనలో, ప్రశంసలలో, సంభాషనలలో వాటి చాయల నాకర్షించి ముద్రించగలడు. ఈ శిల్పదృష్టి లెని వాడేంత పండితుడయ్యు, ఎట్టి యనర్గళ ధార కలవాడయ్యు ఆ సంఘచ్చాయ నాకర్షించలేదు.
ఈశిల్ప దృష్టి స్వతస్సిద్ధముగా పుట్టుకొని రావలసినదే యని యెప్పుకొనుచునే అట్టి శిక్పుల కుండవలసిన కొన్ని సాధారణ లక్షణములు మాత్రమిచ్చట్ చెప్పవలసి యున్నది. వారు సంఘ మునెడ యెడము గాక సంఘములో కలిసిమెలసి తిరుగ నభిలాష కలిగి తిరుగుచుందురు. వారి కష్టములను, సుఖములను, సరసములను, విరసములను తాము కూడ ననుభవించునట్లు మనశ్చలనములను గలిగి యుందురు. అందరితోను కలుపుగోలుతనముతో తిరుగగలట్టియు, అరమర అభ్యంతరము లేక ప్రవర్తించునట్టియు, అందరికిని హర్షప్రదమై నట్టియు, జనపరిచయము, సంభాషణతీరు, హస్యరసము, అనుకూలమగు నడవడి కలిగియుందురు. సాంఘిక నవల వ్రాయగొరువారు మున్ముందెంత వరకీ లక్షణములు తమకు గలవో యేచించుకొని, అలవాటు చేసుకొని, చాయగ్రఃఅన శక్తి నలవరచు కొని గ్రంధరచనకు గడంగినచొ బాగుండును. లేనియెడల ఆ గ్రంధము సరియగు చిత్రముగా ప్రచారము కాక గ్రాంధిక శైలి కొరకో, అద్భుతములగు చర్యలకొర్కో దీర్ఘమగు కధ కొరకో, నీతిబోధ కొరకో పాఠశాల తరగతులలో పఠనీయమైనదిగా కమిటి వారిచే నిర్ణయింపబడుట కొరకో మాత్రమే గౌరవము కలిగియుండును.
కవికీ దృష్టి యుండి, స్వభాషణలో రచించుటకు, స్వభాష మాటలాడువారి చర్యలే వ్రాయుటకు, వారి ఆచార వ్యవహారములను, ఆశలు, విలాసములను, కష్ట సుఖములనే చిత్రించుటకు గడగినచో సాంఘిక నవల రచించు నాతడింకొక విషయమును గురించి అత్యంత శ్రధ్ధ వహించవలసి యున్నది అది శైలిని గూర్చి ఈ సందర్భమున గ్రాంధిక, వ్యవహారిక శైలులను గూర్చిన చర్యకు దిగుటకు నాకెంత మాత్రము నిష్టములేదు. సాంఘిక నవలను గూర్చి ఆలోచించినంత వరకైనను, ఒకశైలి వ్యావహరికమైనంత మాత్రమున గ్రంధస్థమగుటకు తగదినియు గ్రాంధిక మైనంత మాత్రమున సంఘమును చిత్రింపజాలదనియు చెప్పుటకు నేను సాహసింపను. శైలి కవికి నైజమై యుండవలెను. కాని శ్రమపడి పుస్తకములు వెదకి కష్టమై అపురూపమైన ప్రయోగముల నేర్చి గ్రంధములో గాంభీర్యము కొరకు జొనుపబడినదిగా నుండకూడదు. సముద్రతరంగముల వలె గంభీరమున నుండుగాన, సెలెయేటి కలకలము వలె మంజులముగా నుండును గాన, తేనేసోనల వలె తేటగా నుండును గాన, శైలి కవికి నైజమై యుండవలెను. అతను సృష్టించెడి పాత్ర నోటితో నది ఔచిత్యము గలిగి యుండవలెను. పాత్రల సంభాషణలో నుపయోగించెడి శైలి పాత్రము నుపయేగించినంత వరకు మాటలాడు కొనే భాషలో,
గరిమెళ్ళ వ్యాసాలు అరసున్నలు, నెరసున్నలు, లేక అనాయాసకరమైనదిగా నుండక తీరదు. లెనియెడల నాపాత్రలు మనకు వింత గొలుపును గాని నైజత్వమును స్పురింపజేయవు వారి సంభషణపై విమర్శనములు, వారు సంభాషించుచుండు తరి వారి హావభావ విలాపములను వర్ణించు భావములు కూడా ఆ శైలిలోనె వ్రాయుట యెంతయును యుచితము కవి తానుగా నొనరించు స్థలాదుల వర్ణనలు, సంఘ సమస్యలు చర్చలు, పాత్రల యోగ్యతలను గూర్చి అభిప్రాయములు కనుక పాఠకులు శ్రమ తీసుకొని చదవగలదు. కాని పాత్రలే మాటలాడునప్పుడు లేదా వాని సంభాషణలు ప్రక్క ప్రక్కను వచ్చుచు వాటి సున్నితములను మనము గ్రహించుటకు కవి సహాయము చేయవచ్చునపుడు, కవి తన ప్రతిభణూ, ఫాండిత్య్హమును, కల్పనా ప్రాగల్భమును జొప్పించక పాత్రలను తమంతట తామే వచ్చును పోవును మాటలాడునట్లు చేయవలెను.
చారిత్రక నవలల వలె మోహశౌర్య ప్రధానములగు నద్భుత నవలల వలె, కూఫీలు తీసెడి చమత్కారముల చూపు రహస్య పరిశోధన నవలల వలె సాంఘిక నవలలు కధా ప్రధానము లైనవి కావు. వీటికి ఒక మొదల్, ఒక నడుమ, ఒక తుది అని యుండవలసిన అవశ్యకత లేదు. సంఘము పోకడయు మానవుల సామాన్య సాంసారిక చర్యలే యొక మనోహరములగు నవల లాంటివి దానిని చిత్రించుట కెక్కడ నుంచి ప్రారంబించి యెక్కడితో మనమాపినను ఒకటే మన గ్రంధ ప్రారంభమే ఆ కధ యొక్క ప్రారంభము కాదు. మన మాపిన మాత్రమున ఆ కధ ముగిసిందని చెప్పుటకు వీలులేదు. కాలశకటములో ప్రయాణము చేయుచు కవి చూపినంత మేరకు మనము చూచినాము. చూపని మేరలను కూడ చూడవలెనని యున్నను మనకు సాధ్యము కాక యూరకొనుచున్నాము. సంఘములో ఏ గ్రామములో లేక ఏయే వ్యవహారంలో ఏయే రంగములకు సంబంధము గలదో ఆయారంగముల వాయావరుసను చిత్రించు కొనుచు పోయినచో చాలును. కరణాంతరములచే వాటికి ముందుండిన రంగములను విడువ వచ్చును. వాటి తరువాత రంగమును చిత్రింపక పోవచ్చును. ఈ కారణముల చేత ఇట్టి నవలలను శ్రమపడి ఆలోచించి పన్నవలసిన వ్యూహం లేక చట్రము
గరిమెళ్ళ వ్యాసాలు
(deliberate Plot) ఉండవలసిన అవశ్యకత లేదు సరేగదా అది యెంత లేకపోయిన కధ అంత స్వతస్సిద్దమై యున్నట్లనిపించును.
చిత్ర విచిత్రముగా నల్లిన వ్యూహము (Plot) లేనిదీ. శౌర్యపరాక్ర మాది రసప్రదానము కానిదీ, అద్భుతాశ్చర్యములి వెలిగ్రమ్మనిదీ, రహస్యపరిశోధకుల వెన్నాడి లోక కంటకుల గుట్టుమట్లు కనిపెట్టి పాఠకుల కురూహలము తీర్చనిదీ విరహవేదనల తోడి విప్రలంభములు, సుందర పద్యముల తోడి మోహలేఖలు, శబ్దాద్య్హలంకార యుక్తములగు ప్రకృతి వర్ణనలు లేనిదీ నవలయేమిటి అని ఇప్పటి పాఠక లోకమున కచ్చెరువు కలుగవచ్చును. కాని యిట్టి విశేషములు సంఘములో నిల్చి జరుగుచుండవు కనుక సాంఘిక నవల కధ కాదనియు, కధకాని సాంఘిక చరిత్రలో నిట్టివి తరచు కలుగుచుండవు గనుక సాంఘిక నవల యిట్టి పై పై తెచ్చుకోలు విశేషము లేక, సాధారణ సంఘము వలె చల్లగా, సధారణపు బచ్చటాలు, ముచ్చటలు, కష్ట సుఖములు క్జొరికలు, ప్రయత్నములు జయాపజయములు మొదలగు వనితో గూడి సంఘము యొక్క సాధారణ సమయ్హ వాహినీ చిత్రము వలె నలరారవలెను/
--భారతి, 1932 ఆగస్టు