గరిమెళ్ళ వ్యాసాలు/ప్రపంచమంతా అక్షరాలు - అంకెలే
ప్రపంచమంతా అక్షరాలు - అంకెలే
(25-1938 న కేశవరంలో ప్రోగ్రెసివ్ రైటర్ల మహాసభ - ఆంధ్ర రచయితల సభాధ్యక్షులు - గరిమెళ్ళ సత్యనరాయణ ప్రసంగం)
లేఖకులంతా ఒకే కుటుంబము వారు లేఖకులందరూ ఒకేకుటుంబమునకును, సోదరవర్గమునకును చెందిన వారనుటలో నాకెట్టి సందేహమును లేదు. కొందరు పురాణములు వ్రాసినా, కొందరు ప్రబంధములు వ్రాసినా, కొంద్రు నవలలు వ్రాసినా, కొందరు నాటకములు వ్రాసినా, కొందరు దేశచరిత్రలు, భూగోళశాస్త్రము, విజ్ఞానవిషయములు, రాజేకీయోప న్యాసములు వ్రాసిన కొంద్రు వ్యాకరణ, సాహిత్యశాసన, వైజ్ఞానిక పరి శోధనలు చేసినా వీరందరి ఆశయమును నొక్కటే. లేఖకునికి కలిగే రెండు శక్తులు ప్రోద్భలము చేయుచుండుట వలననె వారు లేఖనమునకు నడంగుదురు. వీనిలో మొదటి ఆత్మతృప్తిరెండవది పాఠకుల నుత్తేజింపజెయవలెనను ఆసక్తి ఈ రెండు సంకల్పములలో నేదియు నేదియు లేని వ్రాతలు వ్రాతలే కావు. అవి కేవలము అక్ద్షరముల ప్రోవులు.
లేఖకులకు ఆత్మతృప్తియే ప్రధానం వీనిలో మొదటిదే లేఖకునకు ప్రదాన ప్రోద్బలము మేఘములు వర్షఋతువులలో వర్షము కురువకుండా యెట్లూరు కొనజాలవో, నాటబదిన బలిష్ట బీజములు ఫల వృక్షములు కాకుండా యెట్లు తప్పించుకొనజాలవో, భానుడు ఉష్ణమును, శశి శైత్యమును, మారుతము హాయిని యెట్లు ప్రసరించకుండా ఉండ జాలవో, ఉత్కృష్టభావస్థగ్తులైన లేఖకులు తమ భావమ్లను చాటకుండా ఊరుకొనజాలరు. దుర్విమర్శనలు వారికి జంకునుజ్ కలిగించవు. సుష్టశాసనములు వారి కలములను విడువజాలవు. వినువారును, చదువువారును ఉండరన్న చింత వారిని నిరోధింప జాలదు. ప్రకటనముకాదన్నభాధకూడా వారిని బాధింపనొల్లదు. వారి ఆత్మగత భావాలను వారు గ్రంధరూపేణా కాపాడుకొనుచునే ఉందురు. మనం వినకపోతే వారి ఆదేశమేమైనా అరికట్టబడుతుందా! లేఖకులకు కలిగే
గరిమెళ్ళ వ్యాసాలు
మొట్టమొదటి ప్రొద్బలము వారి ఆత్మల నుండియే వచ్చుచున్నదనుటకు సందేహము లేదు.
ప్రబోధం కలుగ జేయవలిననే ఆసక్తి అయినను రెండవ ప్రోద్భలమును కూడా మనము ఈసడించ వీలులేదు. ఇదియే పాఠకుల నుత్తేజింప ఛెయవలెనను ఆసక్తి ఆత్మ ప్రోద్భలము వలన లేఖకునకు సగము తృప్తియే తీరును. రెండవ దాని మూలముగానే పూర్తిగా తృప్తికలిగి జన్మ సార్ధక జ్ఞానముదయించును. తన దేశస్థసోదరులు చదివి ఆనందించవలె నని తనదేశము పురోభివృద్ధికి వావలెనని, భారతదేశము ప్రపంచ దేశముల నెల్ల కిరీట తుల్య్హము కావలనని ఆందోళనపడకుండా వ్రాసే లేఖకుదు ముఖ్యముగా ఈ యుగములో భారతదేశమందు లేడనియే చెప్పవచ్చును రెండు పంక్తులలో వేయిగ్రంధములో వ్రాసినంత మత్రముననే కృతకృత్యుడైనట్లు భావించుకొనేంట పిచ్చివాడు యీ యుగములో లేడు. వ్రాసేదాకానే మొదటి ప్రోద్బలము తొందతపెట్టుచుండును. కాని వ్రాసినది ప్రజలల్లరును చదివి రెండవ ప్రోద్బలము లేఖకులను అల్లరి పెట్టుచునే యుండును. అప్పిటి కాని వారికి సంపూర్ణ పరితృప్తి చేకూరదు. లేఖకుల పట్ల విరాదరణ అయితే ప్రజల హృదయమునకే విజ్ఞానము నెక్కించి వారి నుత్తేజింపచేసి, దేసమును నూతన ప్రభావసమానముగా చేయదనునేది, కలము, కాగితము పట్టి వ్రాసుకునేటంత సులభమైన పనికాదు. ప్రస్తుతం మన దేశములో ఎందరోకవులు, లేఖకులు, వ్ర్రయుచున్నపాటలు, వ్యాసములు, తయారుచేసిన గ్రంధములు, వారి వ్రాతప్రతులను దాటి వెలుపలకు రానేరకున్నవి. అధవా, అచ్చయిన గ్రంధములుకూడా, తమ స్వంత బీరువాలను దాతి వెలుపలకు కదలక వారి ననేక కష్తముల పాలొనరించుచున్నవి.
ఇంటింటికి, సభకు వెళ్ళి చదివి వినుపించుకునె వారికి ఆ మాత్రముగా నైనను ప్రకతించుకొనే యదృష్టము పట్టుచున్నది. కాని వారు అందుకుకూడ బాహ్యలగుచున్నారు. వీరికి చేయూతనిద్దామనే ఆసక్తి ప్రజలకు గాని, ప్రభుత్వమునకు గాని కొంచెమైనను నేటికిని కలుగకుండుట పూర్తిగా శోచనీయము. ప్రభుత్వము వారికీ సంగతి వివేదించుకొన్నచో ఇది ప్రభుత్వధర్మముకాదు ప్రజల బాధ్యత అందురు. ప్రజలకిఈ సంగతి నివేదించుకొన్నచో, ఇది ప్రభుత్వ కర్తవ్యము కాని, ప్రజలను పీకుకొనితింటే యేమి పుష్టి అందురు. మన రాష్ట్ర టెక్ట్సుబుక్కు కమిటి వారు డా॥పట్టాభి సీతారామయ్య డా॥జె.సి.కుమారప్ప గార్లు వ్రాసిన గ్రంధములనే త్రోసివేసిరి. దానిని బట్టి సామాన్యులకు ప్రోత్సాహమెక్కడ ఉండగలదో గ్రహింపుడు.
ప్రజాయుత్త ప్రభుత్వ ధర్మము
మన రాజులు, చక్రవర్తుల పరిపాలనములో, సాహిత్యమునకును, విజ్ఞానమునకును రాజాదరణము ద్వారా విస్తారమైన తోడ్పాటు కలిగిందన్న సంగతిని మనము మరువరాదు. రోజుల నాదర్శముగా చేసుకొనియే, అమాత్యులు, జమీందార్లు, శ్రీమంతులు, సర్వులు సాహిత్య విజ్ఞానములకు నిరుపమానమయిన చేయూత నిచ్చుచుండెడివారు. ఇప్పుడు వారికీ ధోరణి లేదు. నేడు సర్వదేశములు భారతదేశము కూడ, ప్రజా ప్రభుత్వమయము లేక ప్రజాప్రతినిధుల ప్రభుత్వమయములై క్రొత్త వన్నెలు నీనుచున్నవి. ప్రజలకే రాజత్వము సిద్ధించుచున్నది. పూర్వమువలె కాక, నేడు ప్రజలు తమ విద్య్హను, సౌభాగ్యమును, సంపదను, బలమును, సర్వమును ప్రభుత్వము నందే కేంద్రీకరించుకొని, ఆ ప్రభుత్వమిచ్చెడి సహాయ సంపర్కమున్నంతవరకు వర్థిల్లుచు లేనంతవరకు వెనకపడుచున్నది. ఈవైజ్ఞానిక యుగములో కేంద్రీకరణ యుగములో యిది తప్పని సరి యగు;చున్నది. ప్రభుత్వాదరణము, కేంద్రీకరణము తీవ్రముగా ప్రారంభమయి నప్పటి నుండియు ఆ ఆదరణము గల సంస్థ లెవ్వియో వర్ధిల్లు .చున్నవి. లేనివెల్లయుక్షీణించుచున్నవి. వీనికి సాయము చేయ వలసిన పని మీదికాదని ప్రభుత్వమువారు వెనుకకు తగ్గుట దేశమునకు శ్రేయమే కాదు. ఎన్నో విధములయిననూతన సంస్థలను ప్రస్తుత ప్రభుత్వములు నెలకొలిపి చేయూత నిచ్చి స్వయం వ్రవర్ధమానములయ్యే దాకానైనా సహాయం చేస్తున్నరు. విద్యాసంస్థల యెడల. అందులోనూవయేజనవిధ్యాసంస్థల యెడల్;అ వారి ఆదరణము మరీ యెక్కువగా ఉన్నాయి. అని ప్రపంచ చరిత్ర తెలియజేయుచున్నది
గరిమెళ్ళ వ్యాసాలు
వయేజన విద్య
విద్య యొక్క మహత్తు నెరిగిన వారెవ్వరు కాని వయోజన విద్యా సమస్యను ప్రస్తుతం భారతదేశంలో ఉన్నస్థితిలో విడిచి పెట్టజాలరు. నూటికీ తొంబది మంది నిరక్షరాస్యులై అక్షరాస్యులెందరో , యెప్పుడో చదువుకున్న స్వల్పవిషయముల నతి వేగం మరిచిపోవుచు, ఆధునిక విజ్ఞానములో వెనుకబడి ఉన్నయెడల భారతదేశము ప్రపంచ్జములోని యితర దేశములతో తుల్యమైన అంతస్థునకు ఏనాడు రాగలదు? మనప్రధాని రాజాజీ, మద్రాసులో విద్యార్ధిసభలో చెప్పినట్లు మన బారత జాతీయులు ఆతీర్మానలళోమన పూర్వపు విజ్ఞానము యింకను జీర్ణమై యున్నది. కనుకనే మనకు చదువులు రాకున్నా లోపము లేకుండా సంసారపక్షంగానైనా ప్రపంచయాత్రలో కష్టసాధ్యం మీద నెగ్గుకొని వస్తున్నాం. కాని లేకుంటే ఈ యుగధర్మమున్ బట్టి చదువురాని వారికి శవమునకు కంటె ఎక్కువగా గౌరవవం లేకుండా పోతున్నదన్న సంగతి మనము మరువరాదు.
ప్రపంచమంతా అక్షరాలు, అంకెలే
కనువిప్పీవిప్పడంతో మనకళ్ళయెదుట అక్షరాలు, అంకెలు, బొమ్మలు, భోగట్టాలు ప్రత్యక్షమగుచున్నవి. చదువురానివాడికి, అంకెలు తెలియనివనికి, కళ్ళున్నప్రయోజనం కూడా లేకుండా పోతున్నది. రైలు, బస్సుటికెట్ల మీద పేర్లు, అంకెలు, ఇంట్లో వుంచామంటే తలుపుల మీద అంకెలు టైముతెలుసుకుందామంటే వాటి మీద అంకెలు, నాణెమైన బట్ట కొందామంటే మిల్లు చీటి ప్రత్యక్షం. పట్నంలో నాలుగు వీధులు తిరగాలంటే పేర్లు చదువుకోవాలి. కాంగ్రెసుమంత్రివర్గం వచ్చి మధ్యపాననిషేధ, గ్రామ పునర్నిర్మాణప్రచరములను చిత్రవిచిత్రమైన నీతి వాక్యములు అంకెలతో సాగిస్తున్నారు. సాగించబోతున్నారు. వానిసారమును గ్రోలవలెనన్నా అక్షరాలు, అంకెలు తెలియాలి చదువురాకుంటే అరక్షణమైనా కళ్ళు విప్పుకొని నడవలెని పరిస్థితులేర్పడు చున్నవి. ఇప్పుడు కూడా మనపూర్వుల నాటి జ్ఞానవైరాగ్య పద్దతిలో మునిగి ఆమత్తు మరిగి సారస్యము గ్రహించలేక ఈ ప్రపంచ జ్ఞానములో తేలదామనే సమస్య మనము నిర్లక్ష్యం చేసే లాగుంటే (మనకు జ్ఞానం సరిపోతుందికదా). ప్రపంచంలో మరు
గరిమెళ్ళ వ్యాసాలు దినం కూడా వెళ్ళదు.
కనిష్ట పరిణామ జ్ఞానం
అయినా విజ్ఞానమంటే అక్షరాలు, అంకెలు, తెలుసుకోవడం పంచిపెట్టబడే సినిమా అడ్వరుటైజుమెంటు పేపర్లు మొదలగు వానిని కూడబలుకుకోవడం మాత్రమే అని నాఉద్దేశ్యంగాదు. ప్రపంచములో మానవ తుల్యంగానైనా నివసిద్దాంతమంటే మనకీ మాత్రం జ్ఞానమైనామొట్టమొదడ అత్యావశ్యకమని నాభావము. మానవ విజ్ఞానమునకు, ఇది పుట్టగీటు ఆ కనిష్టపరిణామజ్ఞానముంటే ఆ తరువాత మెట్టు ఏదైన మనకు అందుకు వస్తుంది. లేకుంటేనే ఈ మట్టుకు కూద క్రిందుగా మనము ప్రాకుతూ వుండవలసిన వారమే. ఇందుకోసమే నిరక్షరాస్యత క్రూర పిశాచముల కంటె కూడ ఘోరమై తక్షణమే తరిమివేయవలసిన పెనుభూతము వలె నేడు మనకు కనిపించుచున్నది. విద్యలో ఒక రహస్యమున్నది. మానవ్లకు ఆరుచిని మప్పే దాకానె కాస్త కష్టం కావచ్చును కాని, ఒకసారి రుచిని మరిగిన వారు మరి దానిని విడువజాలరు. అక్షరజ్ఞానం నేర్పి చిన్న చిన్న పాఠములు చదివించి ప్రాధమికవిద్యను ప్రజలకు ఉత్సాహవంతముగా ఒకసారి నేర్పే దాకానే కాస్త కష్టం కావచ్చును కాని, తరువాతను వారే స్వయంకృషివల్ల పత్రికలను, గ్రంధములను చదివి ప్రపంచ పరిణామము నంతటిని గుర్తించుదురు.
పరిపాలనము మన చేతులలో పెట్టబదినది. ప్రభుత్వ దర్మమును ప్రజలు గుర్తించి తదనుకూలురైన వారికే ప్రజలు వోటు నియ్యవలసి యున్నది. తగాదాకలుగకుందాను, అధవాకలిగినా, కోర్టునెక్కకుండా గ్రామాలలో పరిష్కారమయ్యేటట్లుగాను ప్రజలు వర్తింపవలసియున్నది. పంచాయితీలను, సహకార సంఘములను వారు నడిపించుకోవలెను. సభలలో వర్తింపవలసిన సూత్రము లెరుగక సంతలలో వలె గోలచేసి పోట్లాటలకు దిగుచో పోలీసు సహాయము పిలువవలసి వచ్చునేమో ఈ విషయము లన్నింటికి సంబంధించిన విజ్ఞానము వరిలో ప్రచారం కాకుంటే బండి నడవగలదా! నూతన సంస్కరణం సిద్ధించవలెను
సంఘమున కంతటికిన్నీ ఒక నూతన సంస్కరణము సిద్దించవలెను. ఇందుకై వయోజన విద్య తప్ప రెండవ మర్గం లేదు. ఇందుకై వలసిన బలగమింతా అంతా కాదు. విజ్ఞానవంతులగు యువకుల సహాయము మనము చూరగొనవలెను. రాష్ట్రీయ ప్రభుత్వమీ యుద్యమమునకు సంపూర్ణదోహరము చేయవలెను. ఇంతమందిమి కలిసి పోరాడకుంటే ఈ అజ్ఞాన పిశాచమును మనము సంహరింపజాలము, దానిని సంహరించనిచో మన మీదాస్వాంబుదిని తరింపజాలము.
అన్ని ఉద్యమములకు విలేఖకులు ప్రాణము వంటివారు
ఏదేశమునకైనను, ఉద్యమమునకైనను ప్రానములు లేఖకులే. వారి వ్రాతలను చదివియే, వక్తలు ఉపన్యసించుచుందురు. వారి గ్రంధములను పఠించియే, యువకులు, బాలురు, విద్యావంతులగు చుందురు. వారి బోధల నాలకించియే సంఘములు సంస్కరింపబడు చుండును. లేఖకుల తోడ్పాటు లేనిదే ప్రపంచములో నె యుద్యమమును ఇంతవరకు విజృంభింపలేదు. ఇకముందు విజృంభిచబోదు ఫ్రెంచి విప్లచ్వమునకు వాల్టేరు, రూసోలు, బ్రిటిషు విజ్ఞానమునకు బర్కు, రస్కిను, కార్లయిలు, మిల్లు మొదలగు వారి వ్రాతలు, రష్యా ఉద్యమమునకు అనంతకోటి లేఖకుల సిద్ధాంతములు, కధలు మన దేశములో కాంగ్రెసుయొక్క అఖండ విజయమౌనకు తిలకు, గోఖలే, అరవింద, మజుందారు, దాసు, బొసు నెహ్రూలు, గాందీజీ, రాజాజీ, పట్టాభి మొదలగు వారి వ్రాతలు పునాదులు వేసినవి. మనకు ఆంధ్రదేశములో ఈనవీన విజ్ఞానమును వెదజల్లుచున్న కవులు, గాయకులు, కధకులు, చరిత్రకారులు, పత్రికాధిపతులు, విలేఖరులు, విమర్శకులు, ప్రకాశకులు, మనలో నెందరో వున్నారు. వయోజన విజ్ఞానమునకు మన అందరి వ్రాతలును ఎంతో పోషకములయినందున నేనెంతయు వార్ని అభినందించు చున్నాను.
ప్రోగ్రేసివు రయిటర్లు
మనమందరమును లేఖకులము రసము లెని లేఖనము లేఖనమే కాదు.
గరిమెళ్ళ వ్యాసాలు కనుక రసవంతులని కూడా చెప్పవచ్చును. రసమును స్పురింపజేయునదే కళ. కనుక కళావిలాసులని కూడ చెపవచ్చును. మనమే విమర్శకులము కూడ గనుక సకల కళల యందును అనుభవము కలవారని చెప్పవలెను. అయితే మనకును కేవలం సాహిత్య లేఖకులకును గల వ్యత్యాసమేమనగా వారు పరిశుభ్రమయిన సోపానకులును, కళాభిమానులును అయివుండగా మనము ఆ రసములను కళలను ప్రజాసేవకు విజ్ఞానమునకు, దేశపురోభివృద్ధికి వినియోగపరచుటకై తాయారై యున్నవారము. ఇట్టి వారికే (Progressive Writers) అనునామము తరచుగా ఉపయోగించుచున్నారు., ఈ పదమును సరిగా మనం తర్జుమా చేస్తే పురోబివృద్ధి లేఖకులని పిలువవలెను. ఇతరుల వ్రాతలు కూడా పురోభివృద్ధికి హేతువులవునా కాద అను చొప్పదంటు ప్రశ్నలు చర్చల కెవ్వరును పోక మొదటి వారిని సాహిత్య సేవకులనిన్ని మనలు పురోభివృద్ది లేఖకులనిన్ని ప్రస్తుత్య ప్రపంచాచారము చొప్పున పిలిచినంత మాత్రమున ప్రమాదము లేదని నేను భావించుచున్నాను. ఇంతమాత్రమున మన వ్రాతలకు సాహిత్యప్రపంచంలో స్థానము లేకపోనూ లేదు. అన్నిభేదములవలె ఈ భేదము కూడా కాల్పనికమును సులువుకొరకు చేయబడిదియు అంగీకృత మైనదియునైయున్నది. ఇంతకూ ఎవరి కర్తవ్యమును వారెరుంగుట ప్రధానము. మన కర్తవ్యము మనకు తెలుసును మనమింక ఇట్టిపనికై గడంగ వలయును దేసమును, ప్రభుత్వమును, మన ప్రయత్నములకు సహాయకరమైనచో అనతి కాలంలో మనదేశము విజ్ఞానమున అమితవృద్ధిని పొందగలదనుట ముమ్మాటికీ నిశ్చయము.
ఆంధ్రపత్రిక, 27.1`0.1938