గంధము పుయ్యరుగా
పల్లవి :
గంధము పుయ్యరుగా
పన్నీరు గంధము పుయ్యరుగా
అను పల్లవి:
- అందమైన యదునందనుపై
- కుందరదన లిరవొందగ పరిమళ
చరణం (1):
- తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా
- కలకలమను ముఖకళగని సొక్కుచు
- బలుకుల నమృతము లొలికెడు స్వామికి
చరణం (2):
- చేలము గట్టరుగా బంగరు చేలము గట్టరుగా
- మాలిమితో గోపాల బాలులతో
- నాల మేపిన విశాలనయనునికి
చరణం (3):
- హారతులెత్తరుగా ముత్యాల హారతు లెత్తరుగా
- నారీమణులకు వారము యౌవన
- వారక యొసగెడు వారిజాక్షునికి
చరణం (4):
- పూజలు సేయరుగా మనసార పూజలు సేయరుగా
- జాజులు మరి విరజాజులు దవనము
- రాజిత త్యాగరాజ నుతునికి