క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయమునకు నీరాజనం
జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువుమాణిక్యముల నీరాజనం
చరణ కిసలయములకు సకియరంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు అతివనిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం
పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై
నెగడు సతికళలకును నీరాజనం
జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల
నిగుడు నిజ శోభనపు నీరాజనం
Ksheeraabdhi kanyakaku Sree mahaalakshmikini
Neerajaalayamunaku neeraajanam
Jalajaakshi momunaku jakkava kuchambulaku
Nelakonna kappurapu neeraajanam
Alivaeni turumunaku hastakamalambulaku
Niluvumaanikyamula neeraajanam
Charana kisalayamulaku sakiyarambhorulaku
Niratamagu muttaela neeraajanam
Aridi jaghanambunaku ativanijanaabhikini
Nirati naanaavarna neeraajanam
Pagatu sreevaemkataesu pattapuraaniyai
Negadu satikalalakunu neeraajanam
Jagati nalamaelmamga chakkadanamulakella
Nigudu nija sobhanapu neeraajanam
క్షీరాబ్ధి = పాలసముద్రము
కన్యకకు = కన్యకకు (పాలసముద్రము నందు జన్మించిన కన్యకకు )
శ్రీ మహాలక్ష్మికిని = శ్రీ మహాలక్ష్మీదేవికి
నీరజాలయమునకు = ?
- నీరజము = తామర, ముత్యము, చెంగల్వ కోష్టు
నీరాజనం = హారతి
జలజాక్షి = జలజము + అక్షి
- జలజము = తామర
- అక్షి = కన్నులు
మోమునకు = మొఖమునకు (తామర కన్నులు కల మొఖమునకు)
జక్కవ = చక్రవాక పక్షి ?
కుచంబులకు = స్తనములకు , పయోధరములకు
నెలకొన్న =
కప్పురపు = కర్పూరపు
నీరాజనం = హారతి
అలివేణి = తుమ్మెద వంటి వెంట్రుకలు కల ఇంతి (స్తీ, పడతి)
తురుమునకు = కొప్పునకు (జడ కొప్పునకు)
హస్తకమలంబులకు = చేతులకు ?
నిలువుమాణిక్యముల = ?
నీరాజనం = హారతి
చరణ = పాద
కిసలయములకు = చిగురులకు, పల్లవములకు
సకియరంభోరులకు = ?
నిరతమగు = నిరంతరమగు
ముత్తేల = ముత్యాల
నీరాజనం = హారతి
అరిది = దుర్లభము, అశక్యము
జఘనంబునకు = నడుము, మొల, మడికట్టు నకు
అతివనిజనాభికిని = స్త్రీ నిజ బొడ్డునకిని
నిరతి = నిరంతరము
నానావర్ణ = రకరకాల రంగుల
నీరాజనం = హారతులు
పగటు = ప్రకాశించు
శ్రీవేంకటేశు పట్టపురాణియై = శ్రీ వేంకటేశ్వర స్వామి పట్టపు రాణి అయి
నెగడు = మెరిసిపోవు, ప్రకాశించు
సతికళలకును = ?
నీరాజనం = హారతులు
జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల = జగత్తులో అలిమేల్మంగ చక్కదములకెల్లా
నిగుడు = వ్యాపించు
నిజ శోభనపు నీరాజనం = నిజ మంగళపు నీరాజనము
===బయటి లింకులు===
/2010/11/annamayya-samkirtanalumangalaharati.html
అన్నమయ్య పాటలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | ఱ
|