క్రీడాభిరామము (ఎమెస్కో)/అనుబంధము

అనుబంధము

శ్రీనాథుని

వీథి నాటకము

చాటు పద్యములు

అనుబంధము

శ్రీనాథుని వీథి నాటక మను పేర చాటు పద్య సంకలన గ్రంథ మొండు బహుళ ప్రచారములో నున్నది. ఇది కేవల మొక ముక్తకగ్రంథము, ఇందు పాత్రములు, కథ, వీథీ లక్షణము - ఇత్యాదులు మృగ్యములు. ఇందలి రెండు మూఁడు పద్యములు మాత్ర మెట్లో ప్రచారములో నుండు వల్లభరాయని క్రీడాభిరామమునఁ జోటు సంపాదించుకొన్నవి. ఈ యుభయ వీథీగ్రంథముల విభిన్నరచనావిధానము, తీరుతీయములు చదువరుల యవగాహన సౌలభ్యమునకై క్రీడాభిరామమునకు అనుబంధముగా ఈ శ్రీనాథుని 'వీథిని'ని గూడఁ బొందుపఱచి యున్నారము. దీనికి సహాయపడిన గ్రంథములు:

1.

శ్రీనాథుని వీథి నాటక మను శృంగార పద్యములు,
వంకాయల కృష్ణస్వామిశెట్టిగారి
శ్రీరంగవిలాస ముద్రాక్షరశాలయందు
ముద్రితము; చెన్నపురి, (1903).


2.

వీథినాటకము - శృంగార పద్యములు,
వావిళ్ళ రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్,
చెన్నపురి; (1924).


3.

అప్పకవీయము,
వావిళ్ళ రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్,
చెన్నపురి; (1934).


4.

సర్వలక్షణసారసంగ్రహము,
కూచిమంచి తిమ్మకవి ప్రణీతము,

ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి,
హైదరాబాదు-4; (1971).


5.

చాటుపద్యమణిమంజరి,
శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారిచే సంపాదితము,
వావిళ్ళ రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్,
చెన్నపురి; (1949).


6.

శ్రీనాథ కవితా సమీక్ష,
రచయిత:
శ్రీ చిలుకూరి పాపయ్యశాస్త్రి గారు
పాపులర్ ప్రెస్,
కాకినాడ; (వికారి, మకర సంక్రాంతి).


7.

చాటుపద్యములు,
బ్రౌను దొరచే సంపాదితమైన వ్రాఁతప్రతి (డి.సం.2334)
మదరాసు ప్రభుత్వ ప్రాచ్యలిఖితగ్రంథాలయము,
మదరాసు.

శ్రీ

శ్రీనాథుని వీథి నాటక మను శృంగార పద్యములు

సీ.

దీనారటంకాల తీర్థ మాడించితి
                        దక్షిణాధీశు ముత్యాలశాల,
[1]వాక్కు తోడై తాంధ్రభాషామహాకావ్య
                        నైషధగ్రంథసందర్భమునకు,
పగులఁగొట్టించి తుద్భటవివాదప్రౌఢి
                        [2]గాఢ డిండిమభట్టు కంచుఢక్క,
చంద్రభూషక్రియాశక్తి రాయలయొద్ద
                        పాదుకొల్పితి సార్వభౌమ[3]బిరుదు,


తే.

నెటుల మెప్పించెదో నన్ను నింక మీఁద
రావు [4]సింగన భూపాలు ధీవిశాలు
నిండుకొలువున నెలకొనియుండి నీవు
సకలసద్గుణనికురంబ! శారదాంబ!

1


శా.

అక్షయ్యం బగు సాంపరాయని తెలుంగాధీశ! కస్తూరికా
భిక్షాదానము సేయురా! సుకవిరాడ్ బృందారకశ్రేణికిన్
ద్రాక్షారామ[5]పురీవిహారవరగంధర్వాప్సరోభామినీ
వక్షోజద్వయకుంభికుంభములపై వాసించు నవ్వాసనల్.

2


శా.

ధాటీఘోటకరత్నఘట్టనమిళద్ద్రాఘిష్ఠకల్యాణఘం
టాటంకారవిలుంఠలుంఠితమహోన్మత్తాహితక్షోణిభృ
త్కోటీరాంకితకుంభినీధసముత్కూటాటవీఝాటక
ర్ణాటాంధ్రాధిప! సాంపరాయని తెలుంగా! నీకు బ్రహ్మాయువౌ!

3

ఉ.

కందుకకేళి సల్పెడు ప్రకారమునం, [6]బురుషాయితక్రియా
తాండవకేళి సల్పెడు విధంబున [7]వాసరభామ లేఁత [8]నీ
రెండ ప్రభాతవేళ రచియించెను [9]గుబ్బలమీఁది హారముల్
కుండలముల్ కురుల్ కదల గోమయపిండము లింటిముందటన్.[10]

4


చ.

గురు[11]కుచముల్, ప్రియోక్తులును, గ్రొమ్ముడియున్, నిటలాలకంబులున్
మురిపెపు మాటలున్, నగవు, ముద్దుమొగంబును గల్గుఁ గాని, యా
[12]సురతపునేర్పు మాటలును, సూక్ష్మవిభీషణభూషణంబులున్,
బరువడితో విభుం గవయు భావము పుట్టదు విప్రభామకున్.

5


చ.

[13]గురుకుచయుగ్మ, మాననము, కోమలికంబులు, ముద్దుమాటలున్
అఱపు, లతిప్రసంగములు, నప్పట నప్పట మేలమాట, లం
తరితకళానిధానములు, తాడనపీడనభూషణంబులున్,
బరువడి నొంద [14]నేర్చు ప్రియభాషలు గల్గు నరేంద్రభామకున్.

6


చ.

పురుషుఁడు గూడువేళఁ బెడబుద్దులు సుద్దులు, కానిచేఁతలున్,
సరగున మేనికంపు, చెడు చందపు రూపము, నేహ్యవస్త్రముం,
బరగు నిరంతరంబు, నెడఁబాయని సౌఖ్యము, లేని ప్రేమయున్
విరహపుఁ జూడ్కు, లుమ్మలిక వీసము, బుల్లులు వైశ్యభామకున్.

7

మ.

వరగంభీర[15]పయోధరంబులు, గుణాభావప్రవీణత్వము,
న్నరవిందాస్యసుగంధగంధపటువేణ్యత్యంతసౌందర్య, ము
ద్ధురతంద్రాణవివేకసంపదయు, మాధుర్యాదిగాంభీర్యముం,
దరుణీరత్నము శూద్రభామగుణముల్ తథ్యంబె వర్ణింపఁగన్.

8


సీ.

హరినీలముల కప్పు లణఁగించు నునుకొప్పు
                        విడ పువ్వుదండ దా వీడఁబారఁ,
గోటిచందురు డాలు గోటుసేయఁగఁ జాలు
                        మొగము కుంకుమచుక్క సొగసు గులుక,
నల జక్కవల జక్కు లణఁగఁద్రొక్కఁగ నిక్కు
                        పాలిండ్లపై నాచు పైట జాఱ,
నిసుకతిన్నెల మెట్టు పసిఁడిచెంపలఁ గొట్టు
                        పిఱుఁదుపై మొలనూలు బెళుకుదేరఁ,


తే.

జిగురుఁ గెమ్మోవిఁ బగడంపు బిగియు మెరయ
మాటలాడఁగఁ, గనుదోయి తేట లమరఁ,
జెమట లూరంగ, సింహాద్రిఁ జేరవచ్చె
భోగగుణధామ, యాంధ్ర నియోగిభామ.

9


క.

బంగారు వంటి మేనును,
శృంగారము లొల్కు కుల్కు, చిక్కని చన్నుల్,
బంగారపు నెఱచీరలు,
చెంగటి చూపులు నియోగి చేడెల కొప్పున్.

10


శా.

రాపాడం గల గుబ్బచన్నుఁగవతో, రాకేందుబింబంబుపైఁ
దూపేయంగల ముద్దునెమ్మొగముతోఁ, దోరంపు మైచాయతోఁ,
జూపున్ ముద్దుల బాలసంఘములతో, సొంపారు లేనవ్వుతో
వేపార్యంగన వచ్చెఁ గాసె బిగితో, వేణీభరచ్ఛాయతోన్.

11

సీ.

విడినకొప్పున జాజివిరు లొప్పుగా వ్రాలఁ,
                        జిట్టి కుంకుమ చుక్కబొట్టు చెదరఁ,
జక్కఁగా బటువారు సందెడు కుచ్చెళ్ళు
                        చెలఁగు మెట్టియలపైఁ జిందులాడఁ,
గొదమగుబ్బలఁ బైటకొంగు చయ్యన జాఱ,
                        ముక్కున త్తొకవింత ముద్దుఁగులుక,
మొలగంట లిమ్మగు మ్రోఁతతో రంజిల్లఁ,
                        గనకంపు టందియల్ ఘల్లురనఁగఁ,


తే.

బొసఁగు [16]కర్పూరవీడ్యముల్ పొందుపరిచి
యనుఁగుఁ జేడెలతో ముచ్చటాడికొనుచు,
నలరు సింహాద్రిపై కెక్కి హర్షమునను
వచ్చెఁ, గలకంఠి వేపారి మచ్చెకంటి.

12


మ.

కుసుమంబద్దిన చీరకొంగు వొలయం, గ్రొవ్వారుపాలిండ్లపైఁ
ద్రిసరంబుల్ పొలుపార, వేణి యవటూదేశంబుపై రాయఁగాఁ
బస నెవ్వాఁడొ యొకండు రాత్రి [17]రతులన్ బ ల్గాసి గావింపఁగా
[18]నసియా ల్వాడుచు వచ్చుచున్నయది కర్ణాటాంగనన్ గంటిరే.[19]

13


ఉ.

వీసపు ముక్కునత్తు, నరవీసపు మంగళసూత్ర, [20]మెంతయున్
గాసుకు రాని కమ్మ, లరకాసును కానివి పచ్చపూసలున్,
మాసినచీర గట్టి, యవమాన మెసంగఁగ నేఁడు రాఁగ, నా
కాసలనాటివారి కనకాంగిని జూచితి నీళ్ళరేవునన్.

14


సీ.

ఒకచెంప కోరగా నొనఁగూర్చి దిద్దిన
                        తురుమున నుండి క్రొవ్విరులు [21]జాఱ

రాత్రి యెవ్వాఁడొ బల్ రతుల గాసి యొనర్ప
                        బడలిక నడుగులు తడఁబడంగ,
వింతవారలఁ జూచి వెస నవ్వినను కప్పు
                        గల దంతముల కాంతి వెలికి [22]జాఱఁ,
జడిముడి నడచుటఁ జెలరేగి గుబ్బల
                        పైఁ దాకి యొక్కింత పైట జాఱఁ,


తే.

జెమటచేఁ దిరునామంబు చెమ్మగిల్ల,
హాళి డా చేత విడియంబుఁ గీలుకొలిపి,
రంగపురి రాజవీథిఁ గానంగ నయ్యె,
నాదు మదిఁ గోర్కె లూర వైష్ణవవధూటి.

15


క.

రంభాస్తంభము లూరువు,
లంభోరుహనిభము లక్షు లతనుశరంబుల్,
జంభాసురారి మదగజ
కుంభము లీ నంబివారి కోడలి కుచముల్.

16


సీ.

మీఁగాళ్ళ జీరాడు మేలైన కుచ్చెళ్ళ
                        తీరున మడిచీరఁ దీర్చికట్టి,
బిగువుగుబ్బలమీఁద నిగనిగల్ దళుకొత్తు
                        నోరపయ్యెద కొంగు జాఱవైచి,
వలపుల కొకవింత గలుగఁగా గొప్ప లౌ
                        కురులు నున్నగ దువ్వి కొప్పు పెట్టి,
నెలవంక నామంబు సలలితంబుగ నుంచి
                        తిరుచూర్ణ మామీఁదఁ దీర్పుచేసి,


తే.

యోరచూపుల విటులఁ దా నూరడించి
గిల్కు మెట్టెల రవరవల్ గుల్కరింపఁ

జికిలి చేసిన తామ్రంపుఁ జెంబుఁ బూని
వీథి నేతెంచె సాతాని వెలఁది యొకతె.

17


క.

పూజారివారి కోడలు
తా జాఱఁగ, బిందె జాఱి దబ్బునఁ బడియెన్,
మై జారు కొంగు తడిసిన,
బాజారే తిరిగిచూసి పక్కున నవ్వెన్.

18


ఉ.

వాసన గల్గు మేను, నిడు వాలుఁ గనుంగవ, [23]గబ్బిగుబ్బలున్
గేసరిమధ్యమున్, మదనకేళికి నింపగు బాహుమూలవి
న్యాసముఁ గల్గినట్టి యెలనాఁగను, బోగముదానిఁ జేయ, కా
దాసరిదానిఁ జేసిన విధాతను నే మనవచ్చు నీశ్వరా?

19


ఉ.

చీరయు, ముక్కుముంగరయుఁ, జెంపలగంధము, చుక్కబొట్టు, మం
జీరఝణంఝణారవముఁ, జేతులఁ గంకణనిక్వణంబు, నొ
య్యారపు జాఱుగొప్పును, గయాళితనంబును గాని, లోన శృం
గార మొకింత లే దనుటఁ గంటిని నీ పురి వారకాంతలన్.

20


ఉ.

బంగరులింగమూర్తి చనుబంతుల మధ్య నటింపుచుండఁగాఁ,
జెంగులు జాఱ, మేల్వలువ చీరయు వీడ, మదీప్సితంబు లు
ప్పొంగఁగ, వామహస్తమునఁ బొల్పగు నీవిని బట్టి, వేడ్కతోఁ
జంగున గోడ దాటు నగసాలె శిరోమణిఁ జూచితే సఖా?

21


ఉ.

తల్లియుఁ గొండపల్లి నొకతామరగండికి నీళ్ళ కేఁగఁగాఁ,
దెల్లని చీరకొంగు నెగఁదీసుక నవ్వుచు నీళ్ళు ముంచగాఁ,
గొల్లల లింగకాయ [24]చనుగుబ్బలసందున నాట్య మాడఁగాఁ,
జల్లని మాటలాడు నగసాలె శిరోమణిఁ జూచితే సఖా?

22

క.

అగసాలిది కాఁబోలును
సొగసైన మిటారి, యోరచూపులతోడన్
జగమెల్లను వలపించుచు
మగఁటిమితో వచ్చెఁ బురము మార్గము వెంటన్.

23


సీ.

పొలుపొందఁగ విభూతి బొట్టు నెన్నొసలిపైఁ
                        దళుకొత్తఁ జెమట కుత్తలపడంగ,
సొగసుగాఁ బూదండఁ జోపిన కీ ల్గొప్పు
                        జాఱఁగా నొకచేత సరుదుకొనఁగ,
బిగిచన్నుగవమీఁద బిరుసు పయ్యెద చెంగు
                        దిగి జారి శివసూత్ర మగపడంగ,
ముక్కున హురుమంజి ముత్యాల ముంగర
                        కమ్మ వాతెఱమీఁద గంతు లిడఁగఁ,


తే.

గౌను జవ్వాడ, మెట్టియల్ గదిసి మ్రోయఁ,
గమ్మవిలుకాని జాళువాబొమ్మ యనఁగ,
మెల్లమెల్లన సింహాద్రిమీఁది కేఁగెఁ
గన్నెపూఁబోడి, యగసాలి వన్నెలాడి.

24


ఉ.

వాలగు కన్నుదోయి, బిగివట్రువ గుబ్బలు, కాఱుచీఁకటిం
జాల హసించు కొప్పు జిగి, సారసమున్ నగు మోము గల్గు నా
బాలికఁ, గూలి కమ్ముకొన బట్టలు నేసెడువాని కిచ్చె, హా!
సాలెత కాదురా! కుసుమసాయకు పట్టపుదంతి యింతియే?

25


ఉ.

కుమ్మరివారి బాలిక, చకోరవిలోచన ముద్దుగుమ్మ, యా
సమ్ము దరిన్ రసామలినవస్త్రము చుంగులు జాఱఁగట్టి, తాఁ
గమ్మనిమ్రోఁతతోఁ, గరనఖమ్ముల భాండము లంగజాస్త్రపా
త మ్మనఁ బ్రోవుఁ దీసె, విటతండము గుండియ లారవిచ్చఁగన్.

26


ఉ.

ముంగురు లంటఁ జుట్టి, తనమోమున మోము నమర్చి, చీర ముం
గొంగు వదల్చి, మన్మథుని గోప్యపుగేహము చెమ్మగిల్లఁగా,

నంగజకేళిఁ బల్లవుల నార్భటులం గరగింపనేర్చు నీ
జంగమువారి కాంత రతిజాణశిఖామణి యెంచి చూడఁగన్.

27


సీ.

తళ్కు తళ్కను కాంతి బెళ్కు కెంపుల ముంగ
                        రందమై కెమ్మోవి యందుఁ గుల్క,
ధగ ధగ ద్ధగలచేఁ దనరారు బంగారు
                        గొలుసు లింగపుఁగాయ కొమరుమిగుల,
నిగ నిగ న్నిగలచే నెగడు చెల్వపుగుబ్బ
                        మేరు మిన్నందున మెలఁగుచుండ
రాజహంసవిలాసరాజితంబగు యాన
                        మందు మెట్టెలు రెండు సందడింప,


తే.

సరసదృక్కుల విటులను గరఁగఁ జూచి,
పొందికైనట్టి మోమున భూతిరేఖ
రాజకళ లొప్ప నద్దంకి రాజవీథిఁ
బొలిచె నొకకొమ్మ, గాజుల ముద్దుగుమ్మ.

28


ఉ.

శ్రీకరభూషణంబులును సిబ్బెపు గుబ్బలు, ముద్దుచెక్కులున్,
గోకిలవంటి పల్కులును గొల్చినఁ జేరలఁ గేరు కన్నులున్,
బ్రాకటదేహకాంతియును, బంగరుచాయకు హెచ్చువచ్చు నీ
చాకలివారి సుందరికి, సాటిగ రా రిఁకఁ దొంటి జవ్వనుల్.

29


సీ.

మకరధ్వజునికొంప యొకచెంప కనుపింపఁ
                        జీర కట్టినదయా చిగురుఁబోఁడి,
యుభయ[25]పక్షములందు నురుదీర్ఘతరములౌ
                        నెరులు పెంచినదయా నీలవేణి,
పసుపు వాసన గ్రమ్ము పైట చేలము లెస్స
                        ముసుకుఁ బెట్టినదయా ముద్దుగుమ్మ,

పూర్ణచంద్రుని బోలు పొసఁగు సిందూరంపు
                        బొట్టు పెట్టినదయా పొలఁతి నుదుట


తే.

నెమ్మి మీరంగ నిత్తడిసొమ్ము లలర,
నోరచూపులఁ గుల్కు సింగార మొల్కఁ,
గల్కి యేఁతెంచె మరుని రాచిల్క యనఁగ
వలపులకుఁ బేటి, యొక యొడ్డె కులవధూటి.

30


చ.

విడిబడి నిట్ట వేగి, యట బిఱ్ఱున వ్రాలిన నంతలోనఁ, దా
వడిసెల చేతఁ బట్టుకొని, వట్రువగుబ్బలఁ బైట జాఱఁగా,
నడుము వడంకఁగాఁ, బిఱుఁదు నాట్యము సేయఁగఁ, గొప్పు వీడఁగా,
దొడదొడ యంచు నెక్కె నటు దొడ్డమిటారపు రెడ్డి కూఁతురున్.

31


చ.

తొలకరి మించుతీఁగె గతిఁ దోప దుకాణముమీఁద నున్న యా
యలికులవేణితోఁ దములపాకుల బేరము లాడఁబోయి నే
వలచుట కేమి శంకరుని వంటి మహాత్ముఁడు లింగరూపమై
[26]కలికిమిటారి గుబ్బచనుగట్టుల సందున నాట్యమాడఁగన్.

32


క.

నిబ్బరపుఁగలికిచూపులు,
జ బ్బించుక లేనిపిఱుఁదు, సన్నపునడుమున్,
మబ్బు కురు, లుబ్బు కుచములు,
బిబ్బీలకు గాక కలవె పృథివీస్థలిపై.

33


సీ.

హరినీలముల కప్పు లదలించు నునుకొప్పు
                        చెంగావిముసుకులోఁ జిందులాడఁ,
చక్రవాకముల మెచ్చని బలు సిబ్బెపు
                        బిగువు చందోయి పింపిళ్ళు కూయ,

ధవళాబ్జరుచులు నాఁ దళుకులీనెడు నవ్వు
                        వెన్నెల నిగ్గుతో వియ్యమంద,
గొంతు కూర్చొని రసికుల దర్శన స్పర్శ
                        నంబుల మోహద్రవంబు జాఱ,


గీ.

నెడమ కుడి హస్తముల సన్న లెసఁగ, విటుల
రమ్ము ర మ్మని పిలుచు గారవము దోఁప,
నుర్వి మెఱయించు కార్పాసపర్వతంబు
చేరి మర్దించె, నొక్క పింజారితరుణి.

34


క.

ఆ కదురునఁ బికరవము,
న్నా కదురున భృంగరవము, నాత్మరవంబున్
ఏకీకృతముగ నేకు ల
నేకులు విన, వడికె ముదిర, యే కులముదిరా?

35


ఉ.

తెల్లమడుంగు గట్టి, యరుదెంచెడు పాంథుల ఱెప్పలార్పఁగా
నొల్లక చూచుఁ గాని, మదినున్న విధంబు విలాసవైఖరిన్
దెల్లమి చేసి, గాఢరతి నేలు నుపాయ మొసంగదయ్యె, నా
కల్లరి బొమ్మ యించుక విఘట్టన శూన్యపయోధరాగ్ర జా
గ్ర ల్లసమానతైక్ష్ణ లగుద్రావిడభామల కెంత వెఱ్ఱియో!

36


చ.

విటకరపీడనాది పరివేదన కోడి, శరీరజన్మ హృ
త్పుటమున వ్రాలి, పోవఁగను బోవఁగఁ బోవఁగ నాభిఁ గాంచి, య
చ్చటఁ బటుదీర్ఘదండహతిచేత విరోధమటంచుఁ దెల్పినన్,
దటుకునఁ బోక నిల్చిన విధంబున నుండెఁ గుచంబు లింతికిన్.

37


ఉ.

వన్నెల గాగరా జిలుఁగు వట్రువ కుచ్చిళులందుఁ బాదముల్
సన్నపు వారి [27]భంగము లసంబున నీగెడు బాలకూర్మముల్
గన్న తెఱంగు దోపఁ, గరకంజములన్ ముసుకున్ బిగించి, ప్ర
చ్ఛన్న ముఖాబ్జయై నడచెఁ జంగున, బొందిలిభామ గోమునన్.

38

మ.

విమలాంభోరుహపత్రజైత్రములుగాఁ బెంపారు నేత్రమ్ములం
గమనీయంబగు కజ్జలం బునిచి, రేఖాసౌష్ఠవం బొప్ప, నా
గముతోఁ జేసిన సిందురంబు నుదుటం గాన్పింపఁ, బయ్యంటయున్,
యమునా రైకయు దాఁటి, పూపచను లొయ్యారంబు చూపన్ దుకా
ణముపై బొందిలి దోర్తు నిల్చె ముఖచంద్రస్ఫూర్తి శోభిల్లఁగన్.

39


శా.

[28]పొచ్చెం బింతయు లేని [29]హంసనడతోఁ, బొల్పొందు లేనవ్వుతోఁ,
బచ్చల్ దాపిన [30]గుల్కు ముంగరలతో, బాగైన [31]నెమ్మోవితో,
నచ్చంబైన [32]ముసుంగు వెట్టి, చెలితో నామాటలే చెప్పుచున్,
వచ్చెం బో! కుచకుంభముల్ గదలఁగా వామాక్షి తా నీళ్ళకున్.

40


శా.

హంసీయానకుఁ గామికి న్నధమరోమాళుల్ నభఃపుష్పముల్,
సంసారద్రుమమూలపల్లవగుళుచ్ఛంబైన యచ్చోట, వి
ద్వాంసుల్ రాజమహేంద్రపట్టణమునన్ ధర్మాసనం బుండి, ప్ర
ధ్వంసాభావము ప్రాగభావ మనుచుం దర్కింతు [33]రాత్రైకమున్.

41


ఉ.

హా జలజాక్షి! హా కిసలయాధర! హా హరిమధ్య! హా శర
ద్రాజనిభాస్య! హా సురతతంత్రకళానిధి! యెందుఁ బోయితే?
రాజమహేంద్రవీథిఁ గవిరాజు ననుం గికురించి, భర్గకం
ఠాజితకాలకూటఘుటికాంచిత మైన యమాస చీఁకటిన్.

42


చ.

గొరియల, మేఁకపోతులను, గొఱ్ఱెపొటేళ్ళను, కోడిపుంజులన్
బరిపరి వీథులం దిరిగి భక్షణఁ జేసెద వింతె కాని, నీ

చరణము లంటి రాని, యల చాకలి పైదలి మర్మజావళిన్
బిరిగొనలేవు నీవు నొక భీకరమూర్తివె కాళికేశ్వరీ.

43


చ.

గొరియల, మేఁకపోతులను, గొమ్ముపొటేళ్ళను గావుగొందు వీ
వరయఁగ, సందెకాడఁ దగ వత్తు నటంచు భవచ్ఛిరంబుపైఁ
గర మిడి పోయినట్టి తిలఘాతుకురాలి తదీయశష్పముల్
పెఱుకఁగలేవు, [34]నీవుఁ గడు భీకరమూర్తివె కాళికేశ్వరీ?

44

శ్రీనాథుఁ డొక ప్రథమరజస్వలాగృహమునకుఁ బోయి భోజనసమయమందుఁ జెప్పిన పద్యము

ఉ.

దుష్పరివారశూన్యగతితో, మెఱుఁగై, సరసోచితోల్లస
త్పుష్పశరాసనఁక్రియకు బొల్పెసలారి మనోహరంబు నౌ
పుష్పసుగంధ్యనంగగృహపుణ్యమునన్ భుజియింపఁ గల్గె, వా
స్తోష్పతి కెన్ని యున్న సరి తూగినవే యొక శోభనంబుతోన్?

45


గీ.

[35]కాలకంధర! యీశాన! గరళకంఠ!
విసము మెసవిన గలుగు నక్కసబు వోవఁ
గొమ్మ మేడూరి కమ్మ చకోరనేత్ర
[36]పనిగొనఁగ రాదె యల యొంటి పనస తొలను.

46


క.

ముదివిటులు, విధవలంజలు,
పదకవితలు, మారుబాస బాపనవారల్,
చదువని పండితవర్యులు,
[37]కదనార్భటవీరవరులు కడిదిపురమునన్.

47


శా.

కుల్లా [38]యెత్తితిఁ, గోకఁ జుట్టితి, మహాకూర్పాసముం దొడ్గితిన్,
వెల్లుల్లిన్ దిలపిష్టమున్ [39]విసికితిన్, విశ్వస్త వడ్డింపఁగా,

చల్లా యంబలిఁ ద్రాగితిన్, రుచుల దోసం బంచుఁ బోనాడితిన్,
దల్లీ! కన్నడరాజ్యలక్ష్మి! దయలేదా? నేను శ్రీనాథుఁడన్.

48


సీ.

బొమవింటఁ దొడిగిన పూవిల్లుదొరముల్కి
                        పోల్కి కస్తురి సోగబొట్టు దిద్ది,
చకచక లీను తారకల తళ్కులు వోలెఁ
                        గొలుకులు వెడలఁ గజ్జలము దీర్చి,
పొడుపు గుబ్బలి మీఁదఁ బొడము నీరెండ నా,
                        రంగు చందురు కావి రైక దొడిగి,
పిఱుఁదు పొక్కిలి యను మెరక పల్లము గప్పఁ
                        బాల వెల్లువ మించు చేలఁ గట్టి,


గీ.

యంచ కొదమల గమి బెదిరించు లాగు
నందె చప్పుళ్ళు ఘల్లు ఘల్లనుచు మొరయ,
నడుము జవజవ లాడ, కీల్జడ చలింప,
వచ్చె ముక్కంటిసేవకు మచ్చెకంటి.

49


చ.

సరసుఁడు గాఁడొ? జాణ; రతిసంపద లేదొ? సమృద్ధి; రూపమో?
మరుని జయించు; మోహ? మసమానమె; యిన్నియుఁ గల్గి జారవై
తిరిగెదవేల బాల! యతి ధీరవు, ప్రౌఢవు నీ వెఱుంగవే?
నెర గృహమేధి యన్ పలుకు నీచము దోఁచెఁ, గొఱంతదే సుమీ!

50


మ.

అరవిందానన! యెందుఁ బోయెదవు? మత్ప్రాణేశుప్రాసాదమం
దిరదేశంబునకో లతాంగి! బహుళాంధీభూతమార్గంబునన్
దిరుగ న్నీ కిటు లొంటి గాదె? శుకవాణీ! మాట లింకేటికిన్,
మరు డాకర్ణధనుర్గుణాకలితుఁ డై మావెంట రా, నొంటియే?

51

ఉ.

శ్రీమదసత్యమధ్యకును, జిన్నివయారికి, ముద్దులాడికిన్,
సామజయానకున్, మిగులఁ జక్కని యింతికి మేలు గావలెన్,
మే మిట క్షేమ మీవరకు, మీ శుభవార్తలు వ్రాసి పంపుమీ!
నా మది నీదు మోహము క్షణంబును దీరదు స్నేహబాంధవీ!

52


ఉ.

మొన్నటిరేయి నా కలను మోహము లొల్కఁగ వచ్చి, యంతలో
సన్నపు వల్వ దీసి, బిగిచన్ను లురమ్మున నొక్కుచు న్నటే
కన్నులు విప్పి చూచి, నినుఁ గానక హా! యని చింత నొందితిన్,
దిన్నగ వచ్చి నా వలపు దీరిచి కూడవె ప్రాణనాయికా!

53


ఉ.

కామిని! యేమె? నీ వయసు కావరమా? మొగమెత్తి చూడవే?
ప్రేమను ముద్దుగుమ్మ! యని పిల్చినఁ బల్క, విదేటి గర్వమే?
కోమలమైన నీ కులుకుగుబ్బలమీఁదట నున్న యట్టి నా
ప్రేమ మరుం డెఱుంగు నిఁక వే యన నేరను బ్రాణనాయికా!

54


శా.

పచ్చల్ దాపిన తారహారములతోఁ బాలిండ్లు గాన్పించి, నే
మెచ్చన్ బైఁబడి కౌఁగి లియ్య, విది యేమే? మేటి పంతంబుతో
వచ్చెం జూడవె పచ్చవిల్‌దొర యదే, ప్రాణంబు రక్షింపవే!
కుచ్చె ళ్ళొప్పుగ నూడఁదియ్యనియవే! కొమ్మా! జగన్మోహినీ!

55


ఉ.

కన్నులు చల్లఁగా నిను సుఖంబున నెన్నఁడు చూతునో చెలీ!
యిన్నిటి కేలనే! మనల యిద్దఱి వాంఛలు దీర, హాయిగాఁ
జిన్నికుచంబు లానుచును, జెక్కిలి నొక్కుచు, ముద్దులాడఁగా
నెన్నటి కబ్బునో? మన యదృష్టము స్పష్టము సేయరాదటే?

56


శ్రీనాథుని వీథి నాటకము

సమాప్తము

  1. పలుకు
  2. గౌడ
  3. బిరుద మెటుల
  4. సింగమహీపాలు
  5. చళుక్యభీమ
  6. ఘనపేషణ
  7. పామరభామ
  8. యీరెండ
  9. మాటికిఁ గంఠ
  10. క్రీడా. ప. 82
  11. తమమౌ
  12. సురుచిరమైన
  13. గురుతరసుందరాననము
  14. నేర్పు
  15. మనోరథంబులు
  16. కప్రంపువీడెముల్
  17. సురతప్రౌఢిం దనుం దన్పినన్ (సర్వలక్షణ.}
  18. వసి వార్వాడుచు (అప్ప; సర్వల.)
  19. (చూ. క్రీడా.ప. 86)
  20. మమ్మినన్ గాసుకు
  21. రాల
  22. రాల
  23. సన్మృదూక్తులున్
  24. కదుగోమునఁ బయ్యెద
  25. కక్షము
  26. కులుకు మిటారి గబ్బి చనుగుబ్బల
  27. భంగముల సందున
  28. ఒచ్చె౦ బింతయు లేక హంసనడతో నొయ్యారముం జూపుచున్ (సర్వల)
  29. యంచనడతో (?}
  30. కీల్కడెంపునగతో
  31. నెమ్మోముతో (సర్వల.)
  32. మండుగు గట్టి (సర్వల.)
  33. రశ్రాంతమున్.
  34. నీవు నొక
  35. కాలకంధర! యీశాన! ఫాలనేత్ర!
    నీదు విష మారగించిన చేదు పోవ
  36. పనస తొన వంటి భగము చుంబనము సేయు
  37. కదనాస్థిర
  38. యుంచితి
  39. మెసవితిన్