కూసుమంచి గణపేశ్వరాలయం/దక్షిణంవైపు మెట్లపై పాదముద్రలు
దక్షిణంవైపు మెట్లపై పాదముద్రలు
గణపేశ్వరాలయ రంగమంటపానికి దక్షిణం వైపు వున్న రాతి మొట్లమార్గంపై మామూలు పరిమాణం కంటే పెద్దగా వున్న పాదముద్రల జాడలు కనిపిస్తాయి. ఇవి సహజంగా వాతావరణ పరిస్థితుల వల్ల ఏర్పడినవో లేదా కావాలని చెక్కారో తెలియదు. ఇప్పుడు వీటిని శివుడి అడుగుజాడలని చెప్పుకుంటున్నారు. ఇలా పాదముద్రలను పూజించే సాంప్రదాయం బౌద్ధంలో గమనిస్తాం. ఒకవేళ కొంతకాలం బౌధ్దసన్యాసులు ఈ మంటపాన్ని ఆవాసంగా చేసుకుని వుండి వుంటారా? అనే సందేహం ఈ ముద్రల వల్ల కలుగుతుంది.