కుటుంబ నియంత్రణ పద్ధతులు/రక్షితకాలం పాటించటం సేఫ్ పిరియడ్

7. రక్షితకాలం పాటించటం సేఫ్ పిరియడ్

మధ్యంతరంగా మతం పుచ్చుకున్న మోహన్ రావు మస్టర్ మోజస్ గా మారిపోయాడు. అప్పటికే అతనికి అయిదుగురు పిల్లలు. ఎప్పటికప్పుడు ఇక పిల్లలు పుట్టకుండా ఆపరేషను చేయించుకుందామనుకుంటూనే క్రొత్త మతము లోకి చేరిపోయాడు. ఇక ఈ మతం ప్రకారం "బిడ్దలు దేముడిచ్చే బిడ్దలు, బిడ్డలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవడం మహాపాపం" ఏదీ బుఱ్ఱకి ఎక్కినా ఎక్కక పోయినా ఇది మాత్రం అతని బుఱ్ఱకి బాగా ఎక్కింది. మతం మారినా పూర్ ఫెలో మిస్టర్ మోజస్ పుట్టిన పిల్లలకి, పుట్టబోయే పిల్లలకి ఎందరికని తిండి, బట్ట చూడగలడు? అందుకని దేమనికి ఆగ్రహం కలిగించకుండా "పాపం" కాని పద్ధతి అవలంబించి పిల్లలు కలగకుండా చూచుకోవాలను కున్నాడు. చివరికి "సేఫ్ పిరియడ్" అంటే ఏమిటో తెలుసుకొని కుటుంబనియంత్రణ అవలంబించసాగాడు. కాని భార్యకి బహిష్టులలో అస్తవ్యస్తత వుండటంతో అతని ఆశలు అడియాసలై ఆమెవ్ తిరిగి గర్భవతి కావడం జరిగింది.

ఈ "సేఫ్ పిరియడ్" నే కుటుంబ నియంత్రణ ఫాటించ డానికి "రక్షిత కాలం" అని అంటారు. ఈ రక్షిత కాలంలో దాంపత్య జీవితాన్ని గడిపినట్లయితే స్త్రీ గర్భవతి కావడం జరగదు. ఈ రకంగా స్త్రీకి గర్భం రాని రోజులను గుర్తిస్తే సంయోగంలో పాల్గొనడానికి ఎటువంటి కుటుంబ నియంత్రణ సాధనాలు అవసరమూ వుండదు. ఒక పైసా ఖర్చూ వుండది.

బహిస్టుకి ముందు బహిస్టుకి తరువాత గర్భం రాని రోజులు

సాధారణంగా స్త్రీకి బహిస్టు స్రావం ప్రారంభము అయినరోజు నుంచి మరొక బహిస్టు ప్ర్రారంభం కావడానికి 28 రోజులు పడుతుంది. ఇలా 28 రోజుల కొకసారి బహిస్టు అయ్యే స్త్రీలో అండం విడుదల బహిస్టు అయినరోజు నుంచి లెక్కపెడితే 14 వ రోజున అవుతుంది. అంటే ఒక బహిస్టుకి మరొక బహిస్టుకి సరిగ్గా మధ్యకాలాన అండం విడుదల అవుతుంది. కాని ప్రాక్టికల్ గా చూస్తే కరెక్టుగా ప్రతి 28 రోజులకి బహిస్టు అయ్యే స్త్రీలో అయినా సరిగ్గా 14 వ రోజుననే కాకుండా 12 నుంచి 16వ రోజులో ఎప్పుడైనా అండం విడుదల జరగవచ్చు. ఈ అండం విడుదలయ్యే రోజులలో సంయోగంలో పాల్గొంటే గర్భం రావడానికి ఎక్కువ అవకాశాలు వున్నాయి. సంయోగ సమయంలో యోని మార్గంలో స్కలనమైన వీర్యకణాలు 3 రోజులపాటు బతికి వుండి అండంతో కలయిక పొందే శక్తి కలిగి వుంటాయి. అందుకని అండం విడుదల అవడానికి మూడురోజులు ముందు సంయోగంలో పాల్గొన్నా ఆ వీర్యకణాలు అండం విడుదల అవగానే దానితో కలయిక పొందుతాయి దీనివల్ల 9వ రోజు సంయోగంలో పాల్గొన్నప్పుడు అండం విడుదల లేక పోయినప్పటికీ 12 వ రోజు అండం విడుదల జరిగితే గర్భం రావడం జరుగుతుంది. ఒకసారి స్కలనమైన వీర్యకణాలకు మూడు రోజులపాటు శక్తి కలిగి ఉంటే, ఒకసారి విడుదలయిన అండానికి ఒక్కరోజు మాత్రమే వీర్యకణాలతో కలయిక పొందే శక్తి ఉంటుంది. అందుకని అండం విడుదల చివర 16 వ రోజున జరిగితే ఒక వేళ 17 వ రోజున దాంపత్య జీవితంలో పాల్గొంటే గర్బం రావడానికి వీలు ఉంది. అలా కాక 18 వ రోజున సంయోగంలో పాల్గొంటే గర్భం రావడానికి అవకాశంలేదు. దీనికి 16వ రోజున విడుదల అయిన అండానికి 24 గంటలు గడిచిన తరువాత వీర్యకణాలతో కలయిక పొందే శక్తి ఉండదని తెలుసుకదా. ఈ విధంగా అండం విడుదలయ్యే సమయం, వీర్యకణాలకీ, అండానికీ కలయిక పొందే శక్తి మొత్తం దృష్టిలో పెట్టుకుని చూస్తే బహిస్టు ప్రారంభమయిన 9 వ రోజునుంచి 17 వ రోజు వరకు 'అన్ సేఫ్ పిరియడ్ ' లేక డేంజరస్ పిరియడ్ గా భావించబడుతుంది. ఇంతవరకు చెప్పుతున్న ఈ రోజులను వదలిపెట్టి ముందు 8 రోజులు, తరువాత 18 నుంచి 28 వ రోజు వరకు దాంపత్య జీవితంలో పాల్గొంటే గర్భం రాదు. ముందు ఎనిమిది రోజులను, తరువాత 11 రోజులను, 'సేఫ్ పిరియడ్ ' అనీ, రక్షిత కాలమనీ అంటారు. ఇంతవరకు మనం తెలుసుకున్నది ప్రతి 28 రోజులకీ బహిస్టు కీ అయ్యే స్త్రీ విషయం గురించి మాత్రమే. అలా కాక కొందరు స్త్రీలు 21 రోజులకే బహిస్టు అవుతూ ఉంటారు. మరికొందరు 30 రోజూలకీ, 35 రోజులకీ, 38 రోజులకీ బహిస్టు అవుతూ ఉంటారు. ఇటువంటి స్త్రీలలో ముందు అండం విడుదల ఎప్పుడు అవుతుందో తెలుసుకొని దాని ప్రకారం 'సేఫ్ పిరియడ్ ' ని పాటించజలి.

అండం విదుదల తెలుసుకోవడమెలా ?

ప్రతీ 35 రోజులకు ఒకసారి బహిస్టు అయ్యే స్త్రీ ఉన్నదనుకోండి. ఆమెకు బహిస్టు అయిన 21 వ రోజున అండం విడుదల అవుతుంది. అది ఎలా చెప్పడమంటే ఏ స్త్రీలో అయినా రాబోయే బహిస్టుకి సరిగ్గా 14 రోజుల ముందు అండం విడుదల అవుతుంది 35 రోజుల కొకసారి బహిస్టు అయ్యే స్త్రీకి 14 రోజుల ముందు అంటే 21 వ రోజు అవుతుంది కూడా. అలాగే ప్రతి 30 రోజులకి బహిస్టు అయ్యె స్త్రీకి 6వ రోజున ప్రతి 21 వ రోజున బహిస్టు అయ్యే స్త్రీకి 7 వ రోజున అండం విడుదల అవుతుంది. ఇలా అండం విడుదల రోజు గుర్తించి ఇక డేంజర్ పిరియడ్ ని లెక్కకట్టవచ్చు. కట్టాలంటే, అండం విడుదల రోజుకి ముందు అయిదు రోజులు తరువాత మూడు రోజులు కలపాలి. అ రకంగా లెక్కకడితే ప్రతి 35 రోజులకి బహిస్టు అయ్యే స్త్రీలో 16వ రోజునుంచి 24 వ రోజువరకు డేంజర్ పెరియడ్ అవుతుంది. దీనికి ముందు 15 రోజులు, తరువాత 25, 35 వ రోజు వరకు గర్భం రాకుండా ఉండే రక్షితకాలం.

సేఫ్ పెరియడ్ లో డేంజర్ !

ఇంతవరకు మనం తెలుసుకున్న సేఫ్ పెరియడ్స్ ప్రతినెలా కరెక్టుగా రావలసిన రోజులకే బహిష్టులు వచ్చే వాళ్ళలోనే సంభవం. ఒకసారి బహిస్టు 28 రోజులకు వచ్చి మరొకమారు 30 రోజులకు వచ్చి ఇంకోసారి 26 రోజులకి వస్తూ సరిగా బహిస్టులు రాని వాళ్ళలో సేఫ్ పిరియడ్ ఫలానా అనే దానిమీద ఆధారపడటం ప్రమాదకరం. అస్తవ్యస్తంగా బహిష్టులు ఉండే వాళ్ళల్లోనే కాకుండా కాన్పు అయిన తరువాత, ముట్లు ఎండిపోయే ముందు సేఫ్ పిరియడ్ లెక్క కట్టడం కుదరదు. ఒకేసారి 28 రోజుల కొకసారి 30 రోజుల కొకసారి ఇలా కొద్ది తేడాలతో బహిష్టు అయ్యే సంధర్భంలో అండం విడుదల కూడా తేడాగా ఉంటుంది. రక్షితకాలం, అరక్షితకాలం అనేది నెల నెలా సరిగ్గా బహిస్టు అయ్యే స్త్రీలోనే సక్రమంగా ఉంటుంది. అలా సరిగ్గా బహిస్టు కాని స్త్రీలో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క సారి అండం విడుదల అవుతుంది.

నెల నెలా సక్రమంగా ఒకే రోజుకి బహిస్టు కాని వారిలో బహిస్టు అయిన తొలి దినాలకంటే బహస్టు రావడానికి ముందు 11 రోజులు ఎక్కువ క్షేమకరం.

నెల నెలా ఎంత సక్రమంగా బహిస్టులు వచ్చే స్త్రీలో నైనా ఒక్కొక్కసారి అండం విడుదల మామూలు కంటే ముందుగానూ జరగవచ్చు. ఆలస్యంగానూ జరగవచ్చు. అటువంటప్పుడు రక్షితకాలంలో కూడా గర్భం రావచ్చు. అలా జరగకుండా ఉండాలంటే రక్షిత కాలంలో పాల్గొన్నా పూర్తి రక్షణ కొరకు గర్భం రాకుండా ఫోమ్ బిల్లలు గాని, ఫోమ్ జెల్లీగాని వాడటం మంచిది.

* * *