కుటుంబ నియంత్రణ పద్ధతులు/ట్యూబెక్టమీ
16. ట్యూబెక్టమీ
ఆరుగురు పిల్లల తల్లి ఆండాలమ్మగారు ఇంట్లో పని చేసుకోలేక సతమతమై పొతున్నారు. దానికీతోడు వారం రోజులనుంచి పనిమనిషి అప్పలమ్మ కూడా రావడంలేదు. ఇక ఇంట్లో కోడలు సంగతి చెప్పనే అవసరం లేదు. నెల తప్పిన దగ్గరనుంచీ ఒకటే వేవిళ్ళు. సరిగ్గా ఒక్క ముద్దయినా ఒంటబట్టిని రోజు ఉండదు. ఇక నీరసం ఉండక ఏమి చేస్తుంది క్రిందటిసారి కాన్పు అవగానే కోడలుకి కుటుంబ నియంత్రణ ఆపరేషను చేస్తే మంచిదని డాక్టరమ్మ చెప్పినా ఓకంతట బుద్దికి ఎక్కలేదు. "ఏమిటో ఈ రోజుల్లో ఇద్దరు పిల్లలు పుట్టేటప్పటికి వీళ్ళ పని అయిపోతోంది. మా రోజుల్లో ఒక్కొక్కళ్ళం డజనేసి పిల్లల్ని కనేయలేదా?" అని డాక్టరమ్మ మాటని ఆండాలమ్మ తోచి పుచ్చింది. "పైగా ఆపరేషను చేయించుకుంటే బోలెడు బాధలు వస్తాయట" అంటూమూర్ఖంగా వ్యవారించి కోడలుకి ఆపరేషను జరగకుండా చేసింది. కోడలుకి వెంటనే మళ్ళీ కడుపువచ్చి వేవిళ్ళతో మంచం మీద పడుకుంటేనేగాని ఈసారి ఆండాలమ్మకి అర్ధం కాలేదు. ఇలా ఇంటిపనితో సతమతమై అలసిపోతున్న ఆండాలమ్మ దగ్గరికి పనిమనిషి అప్పలమ్మ మొగుడు వచ్చి ఏడుపు ముఖంతో నిలబడి "అమ్మగారూ ! నిన్న నా పెళ్ళాం అయిదవ కాన్పులో ఓ ఆడపిల్లని కని, కాన్పులో మరింత రక్తంపోయి ఈ లోకంవదిలి వెళ్ళిపోయింది. ఇంతకుముందు పిల్లలు లేకుండా ఆపరేషను చేయించుకోమంటే భయమేసి వూరుకున్నా. ఈనాడు ఇంతఘోరం జరిగిపోయిందని భోరున ఏడ్ఛేశాడు. ఆండాలమ్మ, అప్పలమ్మల్లోనేకాదు, ఎందరో చదువుకున్న వాళ్ళల్లో కూడా అర్ధం లేకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లపట్ల ఆపోహలు, భయాలు వున్నాయి మరి అసలు నిజం ఏమిటి?
స్త్రీలలో కుటుంబ నియంత్రణ ఆపరేషను
"ట్యూబెక్టమీ" అనేది స్త్రీలకు చేసే కుటుంబ నియంత్రణ ఆపరేషన్. ఈనాడు "ట్యూబెక్టమీ" ఆపరేషన్ ఇంత ప్రచారంలోవున్నా పూర్వకాలంలో కూడా ఈ ఆపరేషన్ చేయడం జరిగేది ముఖ్యంగా తల్లి తిరిగి గర్భవతి అవడంవల్ల ఆమె శారీరకంగా, మానసికంగా ఆరోగ్యము మరింత చెడిపోతున్నదని భావించిన పక్షంలోనూ, తల్లి మానసిక వ్యాధి కలిగివుండి బిడ్డని సక్రమంగా పెంచలేని పరిస్థితి ఏర్పడినప్పుడూ, హీమోఫిలియావంటి వంశ పారంపర్య వ్యాధులకి పిల్లలు గురికావడం మంచిగికాదని నిర్ణయించుకున్నప్పుడు ట్యూబెక్టమీ చేసేవాళ్ళు ఈ ఆపరేషన్ కాన్పు జరిగిన మరునాడే చేయవచ్చు లేదా ఇంకె ప్పుడైనా చేయవచ్చు. ట్యూబెక్టమీ పొట్టకోసి ఛేయవచ్చు, పొట్ట కోయకుండా యోని ద్వారం గుండా చెయవచ్చు. ఆపరేషన్‌కి తల్లికి పూర్తి మత్తుయిచ్చి చేయవచ్చు.
A. గర్భాశయానికి ఒక వైపు ఉండే ట్యూబుని మధ్యలో ముడివేయట
B. ట్యూబుని మధ్యకి కత్తిరించి రెండు కొసలని దారంతో ముడివేయుట.
C. మధ్యకి కత్తిరించిన ట్యూబు రెందు కొసలని వేరువేరుగా ముడి వేసి వదలివేయుట. దీనితో ట్యూబుద్వారా అండం ప్రయాణించడం కుదరదు. లేదా వెన్నుకి ఇంజక్షన్ ఇవ్వడం ద్వారానో, ఆపరేషన్ చేసేచొట మాత్రమే మత్తు ఇంజక్షను ఇచ్చో ఆపరేషను చేయవచ్చు. కడుపుమీద నుంచి ఆపరేషను చేయడానికి కేవలం ఒక అంగుళం మేర మాత్రమే కోయడం జరుగుతుంది.
ట్యూబెక్టమీ ఆపరేషనులో కడుపుకోసి అండవాహికలైన ట్యూబులను మధ్యకి కత్తిరించి ముడివేసి వదలివేయడం జరుగుతుంది. ఈ రకంగా గర్భసంచికి రెండు వైపులా వుండే ట్యూబులను కత్తిరించడం జరుగుతుంది. ఈ విధంగా ట్యూబులని కత్తిరించడంవల్ల అండాశయాల నుంచి ట్యూబుల ద్వారా అండం ప్రయాణించడం జరగదు. అందువల్ల ఇక గర్భందాల్చడం జరగదు. ఈ ఆపరేషనంతా 15, 20 నిమిషాల్లో చేయడం అయిపోతుంది.
లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీ
ఈనాడు లాప్రోస్కోప్‌తో ట్యూబెక్టమీ ఆపరేషన్ల విధానం బహుళ ప్రచారం పొందుతోంది. మామూలుగాచేసే ట్యూబెక్టమీ ఆపరేషనుకంటే ఇది చాల సులువైన పద్ధతి, ఆపరేషను చేయించుకునే వారికి తేలికైనపద్దతి. ఈ పద్ధతి ప్రకారం ట్యూబెక్టమీ చేసేటప్పుడు కడుపుపైన మధ్య భాగంలో ఒక సెంటీమీటరు మేర మత్తు ఇంజక్షను ఇచ్చి బ్లేడుతో చర్మానికి గాటు పెడతారు. చర్మానికి పెట్టిన గంటుద్వారా అర సెంటీమీటరు కైవారం వుండే గొట్టాన్ని కడుపులోకి పోనిస్తారు. అలా కడుపులోకి పోనిచ్చిన గొట్టంలో వెలుగునిచ్చే బల్బు ఒకటి వుంటుంది. ఆ వెలుగు సహాయంతో గర్భాశయానికి ఇరుప్రక్కలా వుండే ట్యూబులని గమనిస్తారు. ఇలా ట్యూబులని గమనించిన తరువాత కదుపులోకి త్రోసిన గొట్టంద్వారా మరొక పనిముట్టుతో అండవాహిక అయిన ట్యూబుని లాగి పట్టుకొని రబ్బరు బ్యాండులాంటి చాన్ని దానికి తగిలిస్తారు. అలా బ్యాండుని తగిలిచడంతో అండవాహికం మార్గం ముడుచుకుపోతుంది. ఇదే విధంగా రెండోవైపు కూడా చేస్తారు.
లాప్రోస్కోపీ పద్ధతి ప్రకారం ట్యూబెక్టమీ ఆపరేషను వల్ల సంబవించే దుష్పలితాలు ఏ మాత్రం వుండవు. పైగా ఈ పద్ధతి ప్రకారం చేయించుకున్న వాళ్ళూ ఒక్కపూటలోనే ఇంటికి వెళ్ళిపోయి తమ పనులని తాము చేసుకోవచ్చు. ఈ ఆపరేషను చేయించుకున్న తరువాత ప్రత్యేక జాగ్రత్తలు ఏమీ తీసుకోనవసరం లేదు. ట్యూబెక్టమీలో లాగానే ఇందులోకూడా నడుమునొప్పి, కడుపునొప్పి రావడం, ఒళ్ళు రావడం వంటివి వుండవు. అయితే మామూలు ట్యూబెక్టమీ కంటె యిది అతి సులువైనది, భాధలేనిది. 'మినీలాప్ ' ఆపరేషను అంటే ఏమిటి?
స్త్రీలకు చేసే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లలో ట్యూబెక్టమీ, లాప్రోస్కోప్ ఆపరేషన్లతో పాటు 'మినీ లాప్ ' ఆనేది ఎక్కువ వినబడుతూ ఉంటుంది. 'మినీ లాప్ ' ఆపరేషన్ ఏదో క్రొత్త టెక్నిక్ తో చేసే ట్యూబెక్టమీ ఆపరేషను కాదు. మామూలుగా చేసే ట్యూబెక్టమీ ఆపరేషనునే 'మినీలాప్ ' అని కూడా అంటారు. ట్యూబెక్టమీ కంటే మినీలాప్‌కి పొట్టమీద కాస్త తక్కువ కోయడం జరుగుతుంది. అంతకంటే ఇంకేమీ తేడాలేదు.
'మినీలాప్ ' అంటే మినీ లాపరాటమీ ట్యూబెక్టమీ, దీనిని ముందు 1951 లో జపాన్‌లో ఉకేడా అన్న సైంటిస్టు ప్రచారంలోకి తీసుకుని వచ్చాడు. తరువాత 1983 లో మనీలాలో జరిగిన ఇంటర్నేషనల్ ఎక్సుపర్ట్ కమిటీ వర్కు షాపులో దీనిని ఆమోదించడం ప్రచారంలోకి తీసుకుని రావడం జరిగింది.
మామూలుగా చేసే ట్యూబెక్టమీ లాగానే'మినీ లాప్ ' ట్యూబెక్టమీ ఆపరేషను కూడా ఛేయడం జరుగుతుంది. ఆపరేషను చేయడానికి మత్తు ఇంజక్షను ఆపరేషను చేసే స్థలంలోనే ఇవ్వవచ్చు. లోకల్ ఎనస్థీషియా (లేదా వెన్నుకి మత్తు ఇంజక్షను స్పయినల్ నెస్థీషియా) ఇవ్వవచ్చు లేదా పూర్తి మత్తు ఇచ్చి చేయవచ్చు. దీనినే జనరల్ ఎనస్థీషియా అంటారు. అయితే మినీలాప్ ట్యూబెక్టమీ ఆపరేషను సాధారణంగా లోకల్ ఎనస్థీషియాతోనే చేయడం జరుగుతోంది.
'మినీలాప్ ' ఆపరేవ్షనుని సాధారణంగా లోకల్ ఎనస్థీషియాలోనే చేయడం జరుగుతోంది కనుక ఆపరేషను చేసిన స్త్రీని కొద్ది గంటల్లోనే ఇంటికి పంపివేయటం జరుగుతుంది. ఇంటికి వెళ్ళీన రోజు రాత్రే మామూలుగా కడుపు నిండా భోజనం ఛేయవచ్చు. మరుసటి రోజునుంచే ఇంట్లో వంటావార్పూ చేసుకోవచ్చు.
మినీలాప్ ఆపరేషను ఏ స్త్రీ అయినా ఛేసుకోవచ్చు. ఎటువంటి దుష్పలితాలు ఉండవు.
ట్యూబెక్టమీ వల్ల బహిస్టులు సక్రమంగా వుండవా?
కొందరు స్త్రీలు ట్యూబెక్టమీ చేయించుకుంటే బహిస్టులు సక్రమంగా రావని, ఒకవేళ బహిస్టులు సక్రమంగా వచ్చినా బహిస్టుస్రావం అధికంగా అవుతుందని భావిస్తూ ఉంటారు. ఇలా భావించటం వారి అజ్ఞానానికి చిహ్నమే తప్ప వాస్తవానికి అలా ఏమీ జరగదు. బహిస్టులు సక్రమంగా రావడం, రాకపొవడం అనేది అండాశయంనుంచి తయారయ్యే ఈస్ట్రోజన్, ప్రొజిస్టిరోన్ హార్మోన్ల మీద ఆధారపడి వుంటుంది. ఈ హార్మోన్లు తిన్నగా రక్తంలోకి ప్రవహించి తరువాత గర్భకోశం పొరల మీద తమ ప్రబావాన్ని చూపిస్తాయి. ట్యూబెక్టమీ ఆపరేషనులో కేవలం ఆ అండం ప్రయాణింఛే ట్యూబులని మాత్రమే మధ్యకి కత్తిరించి ముడి వేయడం జరుగుతుంది. దానివల్ల అండాశయంలో తాయారైన అండం గర్భాశయానికి చేరకుండా నిరోదింపబడుతుంది. అండాశయంలో తయారయ్యే హార్మోన్లు ఈ ట్యూబుల ద్వారా పయనించడమంటూ జరగదు. అటువంటప్పుడు ట్యూబెక్టమీ ఛేయడంవల్ల హర్మోన్ల ఉత్పత్తిని ఆటంకపరచడంగాని అవి గర్భాశయానికి చేరే మార్గాన్ని నిరోధించడమనే ప్రసక్తిగానీ లేదు. ట్యూబెక్టమీ చేసినా ఆండాశయాలు యధావిధంగా హార్మోన్లని ఉత్పత్తి చేస్తూనే ఉంటాయి. అక్కడ రక్తనాళాలు తమ లోకి ఆ హార్మోన్లని పీల్చుకుంటూనే ఉంటాయి. ట్యూబెక్టమీ చేయించుకున్న తరువాత ఎవరిలోనైనా బహిస్టులు అస్తవ్యస్తత కలిగితే వేరే యితర కారణాలవల్ల అవవలసిందే తప్ప ఆపరేషనువల్ల మాత్రంకాదు.
ట్యూబెక్టమీ సంయోగం
వేసక్టమీ ఛేయించుకుంటే కొంతకాలం రతికి అభ్యంతరం ఎందుకు?
రతిలో పాల్గొనె విషయంలో వేసెక్టమీకి, ట్యూబెక్టమీకి తేడా ఉంది. స్త్రీలు ట్యూబెక్టమీ చేయించుకోగానే రతిలోపాల్గొన్నా గర్భం రావడానికి ఏమాత్రం అవకాశం లేదు. కాని పురుష్సులు వేసెక్టమీ చేయించుకున్నతరువాత కనీసం నెలరోజులైనా రతిలో పాల్గొనకుండా వుండాలి. ఒకవేళ కంట్రోలు చేసుకుని ఉండలేకపోతే నిరోద్ గాని, యితర కుటుంబనియంత్రణ సాధనాలుగాని ఉపయోగించాలి. లేకపోతే భార్యకి గర్భం వచ్చే అవకాశం వుంది. ఎందుకంటే ఆపరేషను చేసేనాటికి వృషణాలనుంచి విడుదలైన వీర్యకణాలు శుక్రకోశాలకిచేరి అక్కడ నిలవవుంటాయి. ఒకసారి శుక్రకోశాలలో నిల్వచేరిన వీర్యకణాలు నెలనుంచి మూడు నెలలదాకా సజీవంగా వుంటాయి. వేసెక్టమీ ఆపరేషన్‌లో వృషణాల నుంచి వీర్యకణాలు పయనించకుండా వీర్యవాహికలని కత్తిరించడం జరుగుతుంది కాని శుక్రకోశాలని మూసివేయడమంటూ జరగదు. అందుకనే వేవక్టమీ చేయించుకున్న వ్యక్తులను తిరిగి రతిలో పాల్గొనే ముందు వీర్య పరీక్ష చేయించుకుని అందులో వీర్యకణాలు లేకపోతేనే రతిలో పాల్గొనమని సలహా ఇవ్వడం జరుగుతుంది. వీర్యంలో వీర్యకణాలు ఉంటే ఇంకా కొద్దిరోజులు ఆగమని సలహా యివ్వడం జరుగుతుంది. ట్యూబెక్టమీ చేయించుకుంటే స్త్రీలలో కామపరంగా కోర్కెలు తగ్గిపోవడంకాని, రతిలో అసమర్ధత కలగడంగాని జరగదు. పైగా ఇక గర్భం రాదనే ధైర్యంతో ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతుంది. ఈ ఆపరేషను వల్ల అజీర్తి వ్యాధులు, తలనొప్పి, దృష్టిమాంధ్యం వస్తాయనుకోవడం కేవలం ఆపోహ మాత్రమే. ఒక వేళ అవి వచ్చినా ఈ ఆపరేషన్ వల్ల మాత్రం కాదు. జాగ్రత్తగా గమనిస్తే వాటికిగల ఇతరకారణాలు అర్ధం అవుతాయి.
ట్యూబెక్టమీ మంచిదా? వేసెక్టమీ మంచిదా?
కుటుంబ నియంత్రణ అమలు వరచా లనుకున్నప్పుడు దంపతులిద్దరిలో ఎఫరు ఆపరేషన్ చేయించుకున్నా మంచిదే. ఈ ఆపరేషనువల్ల ఎట్టి భాధగాని, దుష్ఫలితాలుగాని లేవు. గనుక దంపతు లిద్దరిలో ఎవరు చేయించుకున్నా ఒక్కటే. అయితే ట్యూబెక్టమీ చేయించుకుంటే స్త్రీలు వారం రోజుల పాటు మంచంమీద ఉండవలసి వస్తుంది. అదే పురుషునికైతే ఆపరేషను చేయించుకున్న మరుక్షణంనుంచి బయట తిరగవచ్చు, పని చేసుకోవచ్చు. భార్యకంటె భర్త ఆపరేషను తేలికైంది కనుక భర్తె వేసక్టమీ చేయించుకుంటే బాగుంటుంది. పైగా కాన్పులవల్ల, పిల్లల్ని పెంచడంవల్ల బాధపడే భార్య తిరిగి భర్త తననే ఆపరేషను చేయించుకోమని అడిగితే కొంత అసంతృప్తిని వ్యక్తపరచవచ్చు. అందు కని భర్త బార్యమీద అనురాగంతో ఆమెకు మళ్ళీ ఇబ్బంది కలిగించకుండా తానే ముందుకువచ్చి ఆపరేషను చేయించుకున్నట్లయితే ఎంతో తేలికలో అయిపోతుంది. పైగా భార్య ప్రేమకి పాత్రుడవుతాడు. కాన్పులవల్ల బాధపడిన తనకు తీరిగి బాధ కలిగించకుండా భర్తే ఆపరేషను చేయించేసుకుంటే అతనిమీద భార్యకి అనురాగం, అభిమానం పెరగకుండా ఎలా ఉంటాయి? మరి అటువంటి దాంపత్యం ఆదర్శ దాంపత్యం కాకుండా ఉంటుందా?
ట్యూబెక్టమీవల్ల కడుపులో నొప్పి వస్తుందా ?
ఇంటి దగ్గరే కాన్పు అయిన ఇందిర మూడవరోజునే ఆసుపత్రికి వెళ్ళి పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకుంది. ఏడవరోజున కుట్లు తీయించుకుని ఇంటికి వెళ్ళిన ఇందిర కొద్ది రోజులకే కడుపులో నొప్పి, తెల్లబట్ట, జ్వరం అంటూ ఆసుపత్రికి వచ్చింది. ప్రక్కనే వున్న ముసలమ్మ ఊరుకోక "వద్దంటే విన్నదికాదు ఆపరేషని చేయించుకుని అనవసరంగా బాధ తెచ్చి పెట్టుకుంది" అంటూ మామూలు ధోరణిలో మాట్లాడసాగింది. వాస్తవానికి ఇందిరకి వచ్చిన జ్వరం, కడుపులోనొప్పి ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకోవడంవల్ల కాదు. ఆపరేషన్ చేయించుకోక పోయినా ఇందిరకి కడుపులోనొప్పి జ్వరం వచ్చి ఉండేవే. అది ఎలా సంభవం అని అనుమనం కలగవచ్చు ఇంటి దగ్గర కాన్పు అయినపుడు, కాన్పు విషయంలో పూర్తి శ్రద్ధ తీసుకోవడం జరగదు. ఎంతో శ్రద్ధ తీసుకున్నామని వారు భావించినా బాక్టీరియా క్రిములు స్త్రీ జననేంద్రియాల్లోకి ప్రవేశించుతాయి. నాటు మంత్రసాని చేతులకి శుభ్రమైన గ్లౌవ్స్ వేసుకుని కాన్పు చేయకపోవడం వల్లగాని డైనర్స్ పరిశుభ్రమైనవి ఉపయోగించకుండా మామూలు గుడ్డలు వాడటంవల్లగాని, డెట్టాల్‌తో రోజూ డూష్ ఇవ్వక పోవడంవల్లగాని, యాంటీబయాటిక్స్ వాడకపోవడం వల్లగానీ బాక్టీరియా క్రిములు యోనిమార్గంలోనికి ప్రవేశిస్తాయి. నిదానంగా అవి పైకి పయనించి గర్భాశయాన్ని, దానికి రెండు ప్రక్కలా ఉండే ట్యూబులకి వ్యాధిగ్రస్తం చేస్తాయి. వ్యాధిగ్రస్తమైన ట్యూబులు వాయడం కూడా జరుగుతాయి. వాపువల్ల పొత్తి కడుపులో నొప్పి, జ్వరం వస్తాయి. తెల్లబట్ట కూడా అవుతుంది. కాన్పులో అశుభ్రతవల్ల ఈ లక్షణాలు కొందరిలో రెండు మూడు రోజుల్లో కలిగితే మరికొందరిలో రెండు మూడు వారాలపాటు పట్టవచ్చు ఇలాంటి పరిస్థితికి అవకాశం ఉన్న ఇందిరలాంటి వాళ్ళు ఆపరేషన్ చేయించుకుని దానివల్లనే ఈబాధలన్నీ కలిగాయని భావిస్తారు. అయితే ఆపరేషను చేయించుకున్నప్పుడు సరైన యాంటీబయోటెక్ సరైన మోతాదులో పుచ్చుకోవడం జరిగితే పై బాదలు కలగకుండా పోవచ్చు. బాక్టీరియా క్రిములు నిర్మూలింపబడటానికి సరిపోయినంత మోతాదులో మందు పడనప్పుడు బాధలన్నీ నెమ్మదిగా బయట పడతాయి. ఇంటి దగ్గర కాన్పు అయిన ఇందిర సంగతి ఇలా వుండగా, ఒక ఆసుపత్రిలో ఒకేరోజు అనేకమంది ట్యూబెక్టమీ చేయించుకున్న కొందరికి కుట్లుదగ్గర నొప్పి, కడుపులో నొప్పి రావడం జరిగాయి. ఇలా రాఫడం ఆపరేషను చేయించుకుంటే అందరికీ రావాలని లేదు. దీనికి ఆపరేషను చేసిన డాక్టరు పూర్తి శుభ్రతని పాటించక పోవడం, ఆపరేషనుకి సంబంధించిన పనిముట్లని పరిశుభ్రమయినవిగా ఉన్నవీ లేనిదీ చూసి శ్రద్ధ తీసుకోకపొవడం, దానికి తగ్గట్టుగా ఆపరేషను తరువాత పూర్తి మోతాదులో పెన్సిలిన్ లాంటి యాంటీబయాటిక్స్ ఇవ్వకపోవడం కొన్ని కారణాలు. డాక్టరు ఆపరేషను విషయంలో పూర్తి పరిశుభ్రతని పాటించకపోతే బాక్టీరియా క్రిములు ఆపరేషను చేసినప్పుడు లోపలికి ప్రవేశించి గర్బకోశానికి సంబందించిన ట్యూబులు వాచేందుకు, చీము పట్టేందుకు కారణం అవుతాయి. అలాగే కుట్లుకూడా చీము పట్టుతాయి. కడుపులోపల ట్యూబులు వాచినట్లయితే గడ్దలుగా తయారై కడుపులో నొప్పిరావడం, నడుము నొప్పి కలగడం ఉంటాయి. ఒకేచోట అనేకమందికి ఆపరేషను చేయవలసి వచ్చినప్పటికి ఆపరేషను పనిముట్ల విషయంలోనూ, ఆపరేషను సమయంలోనూ పూర్తి పరిశుభ్రతని పాటీంచినట్లయితే, పూర్తి మోతాదులో యాంటిబయాటిక్స్ వాడినట్లయితే,ఆపరేషను తరువాత కడుపులో నొప్పి రావాడం ఉండదు. కలలో కూడా దాని గురించి తల వడం ఉండదు. ఏ కారణంవల్ల కానివ్వండి ట్యూబులు వాచి కడుపులో నొప్పి వచ్చినప్పుడు అశ్రద్ధ చేసి ఊరుకోకుండా ముందే డాక్టరుకి చూపించి సక్రమంగా మందులు వాడినట్లయితే పూర్తిగా బాధలన్నీ తగ్గిపోతాయి. అలా చేయని వాళ్ళే అనవసరంగా ట్యూబెక్టమీ వల్ల కడుపులో నొప్పులు వస్తాయని అనడం జరుగుతుంది.
గనేరియా తెచ్చి పెట్టే గందరగోళం
కాన్పయిన రెండు నలలకి నీరజ ఆపరేషను ఛేయించుకుంది. ఆపరేషను అయిన ఆరు నెలలకి కాపురానికి వెళ్ళింది. ఆపరేషను అయినా ఏ బాధా అనిపించక పోవడంతో నీరజకి నిజంగానే ఆనందం కలిగి అందరితో ఆపరేషను ఛెయించుకోమని చెప్పేసింది. అలాంటి అభిప్రాయం అట్టే కాలం ఉండకుండానే తిరిగి కాపురానికి వెళ్ళిన నీరజకి కటుపులో నొప్పి రతిలో బాధ ప్రారంభమయినాయి. అర్ధంకాని అయోమయ పరిస్థితిలో పడిపోయిన నీరజ ఇదంగా ఆపరేషను వల్లనే అని ఆపోహపడింది.
అయినా డాక్టరుని సంప్రదిస్తే బాగుంటుందని వెళ్ళితే కడుపులో నొప్పికి డాక్టరు చెప్పిన కారణం గందరగోళ పరిచింది. కడుపులో నొప్పి ట్యూబెక్టమీవల్ల కాదట, గనేరియావల్లనట. కాని నీరజ విషయంలో ఇది నమ్మశక్యం గాని నిజం. అంతకాలం నీరజ దగ్గర లేకపోయేసరికి ఆమె భర్త ప్రర స్త్రీ సంపర్కంతో ఈ వ్యాధి తెచ్చిపట్టుకున్నాడు. అదే ఆమెకు సంక్రమించి సంకటస్థితి తెచ్చి పెట్టింది. గనేరియా క్రిములు పైకి ప్రవేశించి నిదానంగా ట్యూబులని వ్యాధిగ్రస్తం చేశాయి. దానివల్ల నే కడుపులో నొప్పి, రతిలో బాధ కలగనారంభించాయి.
పై విధంగా కొందరి స్రీలలో సుఖవ్యాధులవల్ల కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది. అయితే అసలు కారణాన్ని గుర్తించలేక ఆపరేషను చేయించుకోవడం జరిగింది గనుక ఆలోచన లేకుండా ట్యూబెక్టమీ అంటగట్టడం ఆనవాయితీ అయిపోయింది. ఆపరేషను అయి అయిదు సంవత్సరాలైనా తరువాత ఏ బాధవచ్చినా అదంతా ట్యూబెక్టమీ వల్లనే అని భావించే అమాయక స్త్రీలు ఎందరో లేకపోలేదు, అమీబియాసిస్ వల్ల కడుపులో నొప్పి వచ్చినా, జీర్ణకోశంలో పూతవలన మంట, నొప్పి వస్తున్నా, ట్యూబెక్టమీ ఆపరేషను వలనేనని భావించే వాళ్ళు లేకపోలేదు.
గర్భవతిగా ఉన్నప్పుడు కొందరు స్త్రీలకి మూత్ర కోశంలోగాని, మూత్రపిండాలలోగాని వ్యాధి క్రిములు చేరుతాయి. దీనివల్ల కడుపులోనొప్పి, నడుం నొప్పి కనబడుతూ ఉంటాయి. కాన్పు అయిన తరువాత ఆపరేషన్ చేయించుకుని పై కారణాలవలన కడుపులో నొప్పి వస్తూ వుంటే ఆపరేషన్ వలనేనని భావించి ఆపరేషన్ ఎందుకు చేయించుకున్నామా అని దిగులుపడిపోతూ వుంటారు. అలా కాకుండా అసలు కారణాన్ని గుర్తించి తగిన మందులు వాడినట్లయితే అన్నీ తగ్గిపోయి ఆపరేషన్ వలన కాదని అర్ధం అవుతుంది.
ట్యూబెక్టమీ చేయించుకుంటే గడ్డలు వస్తాయా?
ట్యూబెక్టమీ వల్ల నడుమునొప్పి వస్తుందా?
"డాక్తర్, మీరు కాదని అంటారుగాని ట్యూబెక్టమీచేయించుకున్న తరువాత నాకు వెన్ను నొప్పి వచ్చింది. మరి ఇప్పుడు మీరు ఏమంటారు?" అని ప్రశ్నించింది ప్రసన్న. ప్రసన్న ప్రసవించగానే మళ్ళీ కడుపు రాకుండా ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకుంది. ఇప్పుడు నడుం నొప్పి వస్తూ వుంటే, ఆ నడుమునొప్పి ఆపరేషను వల్ల నేనని ఆమ ఆపోహ పడటంలో తప్పులేదు. అయితే నడుము నొప్పి రావడంలో అసలు కారణాన్ని వివరించి చెప్పడంలో డాక్టరు బాధ్యత యెంతో ఉంది. ట్యూబెక్టమీ వలన నడుము నొప్పి ఏమీ రాదులే అని ఆమె మాటని త్రోసి పెట్టేసి ఊరుకుంటే బాధ బాధగానె ఉండిపోయి అపోహ తొలగకుండానే ఉండిపోతుంది.
వాస్తవానికి ట్యూబెక్టమీ వల్ల నడుం నొప్పి రానే రాదు. ట్యూబెక్టమీ చేయించుకున్న ఎందరో స్త్రీలు ఎటువంటి బాధ లేకుండా హాయిగా ఉన్నారు. అయితే కొందరు స్త్రీలలో ఆపరేషను చేయించుకున్న తరువాత నడుమునొప్పి కనిపిస్తూ ఉంటుంది ఎందకని? అయితే ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి ఇలా నడుమునొప్పి కెవలం ట్యూబెక్టమీ చేయించుకున్న స్రీలలోనే కాదు. చేయించుకోనటువంటి స్రీలలో కూడా కనబడుతుంది. మరి ఆపరేషను చేయించుకోకపోయినా వారిలో నడుమునొప్పి ఎందు కని ఉంటోంది? దీనికంతటికీ కారణం ఆపరేషన్ చేయించుకోవడం, చేయించుకోక పోవడం కారణం కానేకాదు. కేవలం కాన్పులు అవడమే ఇందుకు కారణము. ఒకటి రెండు కాన్పులు అయినాయా, పది కాన్పులు అయినాయా అనే దాన్నిబట్టి నడుమునొప్పి రావడం, రాకపోవడం ఆధారపడి లేదు,. అధికశాతం కేసుల్లో ఒకటి రెండు కాన్పులలోనే వెన్నుకి సంబంధించిన కండరాలలో బలహీనత కలగడమే ముఖ్య కారణము. కండరాలలో బలహీనత రాఫడానికి, వెసులుబాటు కలగడానికి స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు గర్భములో పిండము పెరుగుతున్న కొద్దీ నడ్డిఎముకపై ఒత్తిడి కలిగి స్త్రీ మామూలుగా కూర్చోవడము, పడుకొనలేకపోవడమో కారణము. దానివలన వెన్నుపూసల పొజిషన్ లో మార్పు వచ్చి వెన్నులో బాధ ప్రారంభం అవుతుంది. ఈ భాధ స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడే ప్రారంభం అవుతుంది. ఆసమయంలో గర్భవతి అయిన స్త్రీ నడుమునొప్పి మామూలే అని సరిపెట్టుకుంటుంది. కాన్పు తరువాత కూడా ఆ నొప్పి ఉంటూ ఉంటే బాలింతరాలికి బలహీనత సామాన్యమేనని అనుకుంటుంది. కాని ఒకవేళ ట్యూబక్టమీ చేయించుకున్న తరువాత పై కారణాల వలననే నొప్పి అనిపిస్తూ ఉన్నా అదంతా గమనించక ఆపరేషన్ వలననే అని అనవసరముగా ఆపాదిస్తారు.
జాగ్రత్తగా గమనిస్తే కాన్పులైన స్త్రీలు చాలామంది నడుము నొప్పితో బాధపడుతూ ఉంటారు. వీరు ఎటువంటి ఆపరేషను చేయించుకుని ఉండరు. దీనికి ఇంతకుముందు చెప్పుకున్న కారణాలే కాకుండా వెన్నుపూసలకి సంబంధంచిన లిగమెంట్ల మీదా, బస్థి ఎముకలకి సంబంధించిన లిగమెంట్లమీద గర్భం రావడంవల్ల అధికమైన ఒత్తిడి కలగడమే మరొక కారణం. అంతేకాదు కొంతమంది స్త్రీలకి వెన్ను పూసల మధ్య ఉండే మెత్తని దిండులాంటి డిస్క్ గర్భం పెరగడమువల్ల కాస్త తొలగడము జరుగుతుంది. దీనినే డిస్క్ ప్రొలాప్స్ అని అంటారు దీనివలన కూడా నడుము నొప్పి వస్తుంది. మరికొంతమంది స్త్రీలకి గర్భము రాకముందే కొన్ని కారణాలవలన వెన్నుపూసలలోని చివరి పూస కాస్త తోలగివుండటమో, వెన్నుపూసకి సంబందించిన ఒక భాగం బస్థి ఎముకని ఆంటుకుని పోవడమో జరిగి ఉంటుంది. ఇలా జరిగినప్పటికీ కొందరిలో ఏ బాధ తెలియకుండా ఉంటుంది. కాని మొదట కాన్పు అవడముతో ఈ పరిస్థితికి సంబంధించిన బాధ నడుమునొప్పి రూపంలో బయటపడుతుంది. కొంత మందికి రెండవ కాన్పుతో మరింత నడుమునొప్పి యెక్కువ అవుతుంది. ఇద్దరు పిల్లలు పుట్టగానే ఆపరేషన్ చేయించుకుని తరువాత పై కారణాలవల్ల వచ్చిన నడుము నొప్పిని ట్యూబెక్టమీ వలననే వచ్చిందని భావించనారంబిస్తారు. ఈ రకంగా గర్భం రావడం వలన బయటపడిన నడుమునొప్పిని ఆర్ధోపెడిక్ కారణాలైన శాక్రో-ఇలియాక్, లుంబో - శాక్రల్‌స్ట్రయిస్ , ఇంటర్ వెర్టెబ్రల్ డిస్కు ప్రొలాప్స్, స్పాండిలోలిస్థిను శాక్రలైజేషనుల వలన అని గ్రహించలేక ఒకవేళ ట్యూబెక్టమీ చేయించుకొంటే దానికి ఆపాదిస్తారు. అయితే గర్భవతి అయిన స్త్రీ కాన్పుకి ముందూ, తరువాత కూడా తగిన జాగ్రత్త వహించి వెన్నుకి సంబంధించిన తగిన వ్యాయామము చేస్తే వెన్నుపూసలలో వెసులుబాటు కలిగినా బాధలేకుండా చేసుకోవచ్చు.
మరికొన్ని లక్షణాలు
చాలామంది స్త్రీలలో కాన్పుల సమయంలో గర్భాశయ కంఠము కొద్దిగా గాయమై ఎప్పటికీ పచ్చిగా ఉండి పోతుంది. మరి కొందరిలో కాన్పు సమయంలో తగిన శుభ్రతని పాటించకపోతే బాక్టీరియా క్రిములు గర్భాశయ కంఠము దగ్గరికి చేరుతాయి. దీనివల్ల అక్కడ పుండులాగా అవుతుంది. దీనివల్ల వైట్ డిశ్చార్జి అవడము, నడుము నొప్పి అనిపిస్తూ ఉంటుంది. అసలు విషయము తెలుసుకోలేక కాన్పు అవగానే ట్యూబెక్టమీ చేయించుకుని నడుమునొప్పి అనిపిస్తూ ఉంటే ఆపరేషను చేయించుకుని బాధ తెచ్చి పెట్టుకుంటున్నామని అనుకుంటు ఉంటారు. వజైనల్ స్పెక్యులమ్ ద్వారా గర్భాశయ కంఠాన్ని పరీక్షచేసి చూస్తే అసలు కారణము బయట పడుతుంది కొందరు స్త్రీలల్లో కాన్పులవల్ల గర్భాశయము ఉండవలసిన పొజిషన్‌లో వుండకుండా వెనుకకు వాలిపోతుంది. ఇలా వెనుకకు గర్భాశయం వాలిపోవడానికి కారణము దానిని పొనిషన్‌లో నిలబెట్టి ఉండే లిగమెంట్లు గర్భము పెరగడమువలన సాగిపోయి సహజశక్తిని కోల్పోవడమే. అలా వెనుకకు పడిపోయిన గర్భాశయము వలన నడుమునొప్పి అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇలా జరిగిన అందరి స్త్రీలలో నడుము నొప్పి ఉండాలని లేదు. అధికశాతము స్త్రీలలో మాత్రము నడుమునొప్పి కనబడుతుంది. మరికొందరి స్త్రీలలో కాన్పు సందర్భములో గర్భాశయము యోని మార్గముగుండా బయటకు కాస్త జారుతుంది. అలా జారబట్టికూడా నడుమునొప్పి తరచు అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇలా జరగడమువలన వచ్చే నడుమునొప్పిని దానివలనని అర్ధము చేసుకోలేక ట్యూబెక్టమీ చేయించుకుంటే దాని వలనని భావిస్తారు.
కొందరు స్త్రీలకి ఇంటిదగ్గర కాన్పులు అవడమువలన శుభ్రత సరిగ్గా పాటించక పోవడమువలన బాక్టీరియా క్రిములు గర్భాశయానికి. అండవాహికల్లోకి ప్రవేశించి వ్యాధిని కలుగజేస్తాయి. దానివలన తరచు నడమునొప్పి అనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు మూత్రకోశ వ్యాధులు, మూత్రపిండాల వ్యాధులు కలగడం సాధారణమైన విషయం. ఈ వ్యాధులు కాన్పు అయి పోయినా తగ్గిపోకుండా ఉండిపోయి నడుమునొప్పిని కలిగిస్తూనే ఉంటాయి. వాటికి చికిత్స పొందకుండా ఉండి ట్యూబెక్టమీ చేయుంచుకుంటే దానివలన వచ్చిందనీ, ఇక ఏమి చేసినా ఫలితం లేదని భావించి భాధపడుతూ అజ్ఞానంతో ఊరుకుంటారు. కాని డాక్టరుకి చూపించి అసలు కారణానికి చికిత్స పొందినట్లయుతే ట్యూబెక్టమీ గురించి కలిగించుకున్న ఆపోహలుపోతాయి
ట్యూబెక్టమీ వల్ల ఒళ్లు వస్తుందా?
చాలామంది స్త్రీలు ట్యూబెక్టమీ ఆపరేషను చేయించుకుంటే పొట్టపెరుగుతుందనీ, ఒళ్ళు వస్తుందని భయపడుతూ ఉంటారు. ట్యూబెక్టమీ చేయించుకుంటే ఒళ్ళు రావడం జరగదు. ఎవరికైనా ఆపరేషను చేయించుకున్న తరువాత ఒళ్ళు వచ్చిందంటే, ఆపరేషను చేయించుకున్నాం కదా, బలంగా తినాలని, మీగడ పెరుగులు, నేతి గారెలు తినడం వల్లనో, పనీ పాటా చేయకుండా నెలల తరబడి విశ్రాంతి తీసుకోవడం వల్లనో రావడం జరుగుతుంది.గాని ఆపరేషను వల్ల కానే కాదు. అందుకని అనవసరంగా అతిగా తినడం నెలల తరబడి విశ్రాంతి తీసుకోవడం పనికిరాదు. ఆపరేషను చేయించుకున్న వారే కాదు, మామూలువారు కూడా పనీపాటా లేకుండా కూర్చుని అదేపనిగా తినడం చేస్తే వాళ్ళకి కూడా ఒళ్ళు వస్తుంది.అసలు ట్యూబె క్టమీ ఆపరేషను చేయించుకున్న తరువాత బలం కోసం వేరే ఏమీ తిననవసరం లేదు. అలాగే ప్రత్యేకంగా విశ్రాంతి తీసుకోనవసరం లేదు. కాని ఈ విషయం తెలియక చాలా మంది స్త్రీలు నెలల తరబడి పని మానివేయడం, అనవసరంగా ఎక్కువ తినడం చేస్తారు.
కాన్పులైన స్రీలలో తెల్లబట్ట ఎందుకని !
కాన్పులప్పుడు గర్భాశయ కంఠం దగ్గర ఒత్తిడి కలిగి చీరుకుని పోవడమో, గాయమవడమో సాధారణమైన విషయం. ఇలా కాన్పుల వలన గాయమైన గర్భాశయ కంఠం (నెర్వెక్స్) వెంటనే మానిపోక పొతే యోని మార్గంగుండా బాక్టీరియూ క్రిములు గర్భాశయ కంఠానికి చేరి అక్కడ స్థానమేర్పరచుకుంటాయు. ఒకసారి గర్భాశయ కంఠంలోకి బాక్టీరియా క్రిములు ప్రవేవేశించిన తరువాత వెంటనే పూర్తి చికిత్స చేయకపొతే గర్భాశాయకంఠం ముందు ఎర్రటి పూతగా కనబడి తరువాత పుండుగా కనబడుతుంది అప్పుడు సాధారణంగా వాడే మందులు యోని మార్గంలోకి జొప్పించి వాడే బిళ్ళలు వలన ఫలితం అంతగా కనబడదు. ఒకవేళ ఉపశాంతి కనబడినా చాలా మందిలో తాత్కాలికంగానే ఉంటుంది. కొందరికి ఈ పుండుని కరెంటుతో మాడ్చినా తిరిగి రావడానికి ఆస్కారం ఉంది. గర్భాశయ కంఠం దగ్గర పూతగాగాని, పుండుగా గాని ఏర్పడినప్పుడు తెల్లబట్ట ఎక్కువగా అవుతూఉంటుంది. గర్భాశయ కంఠం దగ్గర పుండుగా ఏర్పడి తెల్లబట్ట అవడమనేది కాన్పులవలననే కాకుండా అబార్షన్ల వలన, గనేరియా వలన, కాన్పులయినప్పుడు శుభ్రత పాటించక పోవడం వలన కూడా జరుగుతుంది. ఆసుపత్రికి తెల్లబట్ట అవుతోందని చూపించుకోడానికి వెళ్ళే ప్రతీ అయిదుగురిలో నలుగురికి గర్భాశయ కంఠం దగ్గర పై కాణాలవలన పూతగాని, పుండుగాని ఏర్పడటమే కారణం. మందులతో గాని కరెంటుతో మాడ్చటం వలన ఉపశాంతి కలగక బాధాకరంగా ఉన్నప్పడు గర్భాశయ కంఠాన్ని కొంతభాగం ఆపరేషను చేసి తీసివేయడమో, గర్భసంచిని తీసివేయడమో మార్గం అవుతుంది. అయితే తెల్లబట్ట అవడానికి అసలుకారణాన్ని ముందు నిర్ధారించాలి.
ఆపరేషను చేయించుకోవడమువలన ఒళ్ళు వస్తుందని భావించడం ఆపోహ మాత్రమే, ఒకవేళ ఒళ్ళు వచ్చినా ఆపరేషను చేయించుకున్నప్పుడు కొన్ని నెలలపాటు విశ్రాంతి తీసుకొని, పళ్ళు - పాలు ఇతర బలవర్ధక పదార్ధాలు ఎక్కువగా తీసుకోవడమే కారణం. ఇలా వచ్చిన మంచి ఆరోగ్యం కొందరికి చక్కగా కొనసాగితే, మరికొందరు స్త్రీలు తరువాత తిరిగి తగిన ఆహారం, విశ్రాంతి తీసుకోక యధాస్థితికి వచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. మరికొందరు స్త్రీలకి ఆపరే షను అవడం, అవకపోవడంతో సంబంధం లేకుండా కొంత వయస్సు వచ్చేసరికి శరీర ధర్మంలో మార్పులు వచ్చి ఒళ్ళు చేయవచ్చు. ఒకవేళ ఈ మార్పు ఆపరేషను చేయించుకున్న దినాలలో జరిగినట్లయితే ఆపరేషనువలన జరిగిందని దానికి ఆపాదించడం జరుగుతుంది. ఇలాంటి మార్పు కావాలని ఆశించిన వాళ్ళు రెండూ ఒకేసారి తటస్థ పడితే సంతోషిస్తారు. మరికొందరు అయితే ఆపరేషను వలన వచ్చిందని తమలో తాము నిందించుకుంటారు.
* * *