కుక్కుటేశ్వరశతకము
కూచిమంచి తిమ్మన
పీఠిక
వేదము వేంకటకృష్ణశర్మ - శతకవాఙ్మయసర్వస్వము, 1954
శ్రీనాథుని తరువాత 18వ శతాబ్దారంభమునఁ బెక్కు గ్రంథములను వ్రాసి, సమకాలికులచేత మెప్పుపొంది ప్రభుదత్త “కవిసార్వభౌమ” బిరుదము వహించిన మహాకవి యీ కూచిమంచి తిమ్మనార్యుఁడు (క్రీ॥ శ॥ 1690-1760).
“హాటకగర్భవధూలీలాటనచలితాంఘ్రినూపురారావ శ్రీ-
పాటచ్చరములు, తేనియతేటలు మా కూచిమంచి తిమ్మయ మాటల్”
అని, సమకాలికుఁడును, విద్వత్కవీంద్రుఁడునగు ఏనుఁగులక్ష్మణకవిచేఁ గొనియాడఁబడిన యీ కవిలోకగ్రామణి పాండితీప్రతిభయుఁ, గవితాప్రజ్ఞయు నలోకసామాన్యములని వేఱుగఁ జెప్పవలయునా? ఇతఁడే కాఁడు; ‘కూచిమంచి’ వంశస్థులందఱును బండితులు, కవులుగఁ గన్పట్టుచున్నారు.
“మునుపు మాకీవె భల్లాణుఁడనెడి ఱేని కతయు, రుక్మిణి పెండిలికతయు, బొబ్బ
మెకపు గుబ్బలికతయు, మేల్మీఱ నీలపెండ్లి కతయును గబ్బము ల్పేర్మిఁ గూర్చి!”
అని “అచ్చతెలుఁగు రామాయణము”నను
“ప్రతిభమై రుక్మిణీపరిణయంబును, సింహశైలమాహాత్మ్యంబు, నీలపెండ్లి
కథయును, రాజశేఖరవిలాసంబును, నచ్చతెనుంగు రామాయణంబు,
సారంగధరనృప చరితంబు, సాగరసంగమాహాత్మ్యంబు, రంగుమీఱు
సకల సలక్షణసారసంగ్రహంబు నొనర్చి కృతులు మాపేర నంకితము చేసి”
అని “రసికజనమనోభిరామము”నను
“నెరవొప్ప రుక్మిణీపరిణయంబును, సింహశైలమాహాత్మ్యంబు, నీలపెండ్లి
కథయును, రాజశేఖరవిలాసము, నచ్చతెనుఁగు రామాయణంబు మొదలగు”
అని “సర్వలక్షణసారసంగ్రహము”నను
“ప్రౌఢిమై రుక్మిణీపరిణయంబును, సింహశైలమాహాత్మ్యంబు, నీలపెండ్లి
కథయును, రాజశేఖరవిలాసంబును, నచ్చతెనుంగు రామాయణంబు,
సారంగధరనరేశ్వర చరిత్రంబు, సప్తార్నవసంగ మాహాత్మ్యకంబు,
రసికజనమనోభిరామంబు, లక్షణసారసంగ్రహమును, సర్పపుర స-
మంచిత క్షేత్రకథనంబు, మఱియుఁ బెక్కు శతకదండక సత్కృతుల్ ప్రతిభఁగూర్చి”
అని “శివలీలావిలాసము”నను పేర్కొనియున్నాడు. అతని కృతులలో ‘శివలీలావిలాసము’ కట్టకడపటిదిగాఁ గనఁబడుచున్నది. ఏల యనఁగా, నందులోఁ దాను వ్రాసిన గ్రంథముల నన్నింటిని తెలిపియున్నాడు. పైఁగా, దేనిలోను దడవని తనశతకములగూర్చి శివలీలావిలాసములో సూచనప్రాయముగాఁ జెప్పినాఁడు. వాని పేరులు తెలుపలేదు. శతకదండకసత్కృతుల్ అనినందువలన నవి రకమున కొకటికి మించియుండవలయును.
తిమ్మకవి తాను వ్రాసిన ప్రతికృతిలోను దద్రచనాకాలమును సూచించి విమర్శకలోకమున కొకింత మేలు చేసెను. ఈ క్రింద నతఁడేయే గ్రంథముల నెప్పుడు వ్రాసినది తెలుపు పట్టికను బరిశీలించినచో నతని కాలము సులభముగ నూహింపవచ్చును.
రుక్మిణీ పరిణయము శా.శ. 1637 క్రీ.శ. 1716
సారంగధర చరిత్రము శా.శ. 1651 క్రీ.శ. 1729
భర్గ శతకము శా.శ. 1651 క్రీ.శ. 1729
సర్వలక్షణసారసంగ్రహము శా.శ. 1662 క్రీ.శ. 1740
రసికజనమనోభిరామము శా.శ. 1672 క్రీ.శ. 1750
సర్పపురీ మాహాత్మ్యము శా.శ. ? క్రీ.శ. 1754
శివలీలా విలాసము శా.శ. ? క్రీ.శ. 1756
సింహాచల మాహాత్మ్యము ? ?
నీలాసుందరీ పరిణయము ? ?
రాజశేఖర విలాసము ? ?
అచ్చతెలుఁగు రామాయణము ? ?
కుక్కుటేశ్వర శతకము ? ?
రెండుమూఁడు తప్పఁ బై గ్రంథములలో నన్నియు ముద్రితములే. కడపటి యైదింటి రచనాకాలము తెలియవచ్చుట లేదు. “కుక్కుటేశ్వరశతక” మసమగ్రము. (92 పద్యములే కలవు.) కాని తన ప్రతికృతిలోను కవి స్వయముగాఁ దాను వ్రాసిన గ్రంథముల నొకక్రమము ననుసరించి పేర్కొన్నాడు. అందులోఁ దొలిదైన ‘రుక్మిణీపరిణయమే’ యతని మొట్టమొదటి కృతి. అది క్రీ.శ. 1716 సం॥రమున సాగినది. ఆ తరువాత (1) సింహాచలమాహాత్మ్యము, (2) నీలాసుందరీ పరిణయము, (3) రాజశేఖర విలాసము యీ మూఁటిని వ్రాసినట్లు తెలిపినాఁడు. కాని వాని కాలములు తెలుపలేదు. వీని తరువాత ‘సారంగధర చరిత్ర’ (ద్విపద), ‘భర్గశతకము’ రచించినట్లు చెప్పినాఁడు. ఈ రెండును లఘు కృతులే. వీని నిర్మాణకాలము క్రీ.శ. 1729. కాబట్టి క్రీ.శ. 1715-1729కు మధ్యగల 14 ఏండ్లలో పై మూఁడు కృతుల రచన జరిగియుండుననుటలో నేమాత్రము సందేహము లేదు. సారంగధర చరిత్ర వ్రాసిన క్రీ.శ. 1729కిని, సర్వలక్షణసారసంగ్రహము వ్రాసిన 1740కిని ఆ రీతిగనే మధ్యగల 12 ఏండ్ల వ్యవధిలో “నచ్చతెలుఁగు రామాయణ” కావ్యనిర్మాణము జరిగియుండును. దీనిని బట్టి కవి జీవితకాలమును గ్రహించుట కొంచెము సులభసాధ్యము.
‘రుక్మిణీ పరిణయము’ను వ్రాసిన (1715) కాలమునకు కవికి 25 యేండ్ల ప్రాయమైన నుండును. ఆ పక్షమునఁ దిమ్మన క్రీ.శ. 1690 సం॥ర ప్రాంతమున జన్మించినవాఁడనుట సమంజసము. అతని కడపటి కృతియయిన “శివలీలావిలాసము” క్రీ.శ.1756లో వ్రాయఁబడినది. కనుక నతఁడు దాదాపు 1760 ప్రాంతమువఱకు జీవించి యుండవలయును. ఈ నిర్ణయము సత్యమే యని రుజువు చేయుటకు మఱియొక యాధారము కూడ లేకపో లేదు. తిమ్మకవి-
అని తాను “రుక్మిణీపరిణయము” వ్రాయు కాలమునకుఁ బీఠికాపురమునకుఁ ప్రభువైన పెద్ద మాధవరావును బేర్కొన్నాఁడు. ఇది 1715 నాఁటి రచన; కనుక నతఁడు ప్రభువుల దృష్టి కెక్కునంత ప్రౌఢుఁడుగా నుండియుండఁడు.
కాని 1760 లో రచించిన ‘రసికజనమనోభిరామము’లో “రావు నీలాద్రిమాధవరాయ నృపతిచేతఁ గవిసార్వభౌమ విఖ్యాత బిరుద
మందిన ఘనుండఁ, దిమ్మయాహ్వయుఁడ”
నని చెప్పినాఁడు. దీనినిబట్టి యీ నీలాద్రిమాధవరాయనృపతి నీలాద్రిరాయణింగారి మనుమడయిన చిన్న మాధవరాయణింగారనియు, నితఁడు వేంకటకృష్ణారాయణింగారికిఁ దరువాత ననఁగా 1759లోఁ బ్రభుత్వమునకు వచ్చినాఁడనియుఁ దెలియుచున్నది. అట్టి సందర్భములోఁ, దిమ్మకవి తాను 1750లో వ్రాసిన రసికజనమనోభిరామములో 1759లో వచ్చిన ప్రభువు కవిసార్వభౌమబిరుద మిచ్చినాఁడనుట పొసఁగునా! ఏల పొసఁగదు? బిరుదమిచ్చుటకుఁ, బరిపాలనము సేయు రాజే యయి యుండవలయునను సిద్ధాంత మెక్కడను లేదుకదా! యువరాజై న నందుల కర్హుఁడే కదా! తిరుపతి వేంకటకవులు వేంకటగిరిసంస్థానమునకు వెడలినప్పుడు ముందుగా సత్కరింపఁబడినది, యప్పటి యేలికయగు శ్రీరాజగోపాలకృష్ణయాచేంద్రులవారివలన కాదనియు, వారి సోదరులగు ముద్దుకృష్ణయాచేంద్రులవారిచేత గౌరవింపఁబడిరనియు వారి ‘నానారాజసందర్శనము’ వలనఁ దెలియుచున్నది. కనుక చినమాధవరాయణింగారివలన తిమ్మకవియు బిరుదము పొంది యుండుటలో నసంభవ మేమియు లేదు. (ఏలిక కాకున్నను) యువరాజైనవానికి నంతమాత్ర మధికారముండి యుండుననుట బేసబబు కాదు.
తిమ్మకవియెడల (అతని కాలమునకు) సంస్థానాధిపతులయిన దొరలకెల్ల సమానగౌరవప్రతిపత్తు లున్న ట్లతని రచనలన్నిట వారిని బేర్కొనుటచేతనే సూచితమగుచున్నది. తన రుక్మిణీపరిణయములో పెద్దమాధవరాయణింగారిని, సారంగధర చరిత్రలో వేంకటకృష్ణారాయణింగారిని, రసికజనమనోభిరామములో నీలాద్రి (చిన్న) మాధవరాయణింగారిని పేర్కొన్నాఁడు. ఈ ముగ్గురిలోను మొదటి యిద్దఱకంటె మూఁడవవారే యెక్కువ రసికులుగను, నెక్కువ సన్నిహితులుగను నుండి, కవిగారి నాదరించి, సత్కరించి, బిరుదమిచ్చి యుందురనుటలో సందేహము లేదు. పైగా నీ ప్రభునియొక్కయుఁ, గవిసార్వభౌముని యొక్కయు వయస్సులలో నట్టే తేడా కనబడుట లేదు. సమకాలికులు, సరసులయిన వీరిరువురి సమకాలికత్వము ప్రభువు సాహిత్యపోషణకును, కవియొక్క కవితాప్రతిభాప్రకటనకును తగిన యవకాశము కలిగించినది. కనుకనే, కవి యందలి తన గౌరవమును సూచించుటకు చినమాధవరావు “సార్వభౌమ” బిరుద మతని కనుగ్రహించినాఁడు.
తిమ్మకవి తన కులగోత్రాదికములనుగూర్చి తన కృతులలో వివరముగా వ్రాసికొనినాఁడు-
ఇతఁ డాఱువేల నియోగి బ్రాహ్మణుఁడు. కౌండిన్యసగోత్రుఁడు. ఆపస్తంబసూత్రుఁడు. లచ్చమ గంగనల జ్యేష్ఠపుత్రుఁడు. ఇతని తాత కూడ తిమ్మన నామాంకితుఁడే. ముత్తాత బయ్యన. జగ్గన్న, సింగన్న, నరసన్న లితని పినతండ్రులు. వీరమ్మ, పాపమ్మలు మేనత్తలు. సింగన్న, జగ్గన్న (జగన్నాథకవి), సూరన్నలు తమ్ములు. ఇతని సతీతిలకము గొట్టుముక్కుల రామయమంత్రి కూతురైన బుచ్చమాంబ.
తిమ్మకవి తన రసికజనమనోభిరామములో
“నిఖిలవిద్యాభ్యాసనిపుణుఁడు మత్సహోదరుఁడగు జగ్గసత్కవితనయులు
ఘనులు తిమ్మనయు, సింగనయును లేఖకపాఠకులై కృతుల్ ప్రబలఁ జేయ”
“మానితానూనాసమాన నానావిధవంగత్రిలింగద్రవిడదేశభాషావిశేష భూషితాశేషకవితావిలాస భాసురాఖర్వ సర్వలక్షణసారసంగ్రహోద్దామరామాయణాది ప్రముఖబహుళప్రబంధనిబంధబంధురవిధాన నవీనశబ్దశాసనబిరుదాభిరామ తిమ్మకవిసార్వభౌమ”
(చంద్రరేఖావిలాప గద్య)
“రకపుం గావ్యకళాకలాపరచనా ప్రాగల్భ్యసంసిద్ధికై,
ప్రకటప్రేమ భజింతు నీశమకుటప్రస్ఫీతగంగాజలా-
ధికమాధుర్యాకవిత్వ ధూర్వనధియౌ దివ్యప్రభావాఢ్యుఁ ది-
మ్మకవిశ్రేష్ఠు, మదగ్రజు మదిని రామా భక్తమందారమా”
(భక్తమందారశతకము)
ఇతఁడు రుక్మిణీపరిణయములోఁ దప్పఁ దక్కిన తన యన్ని కృతులలోను “దెందులూరి లింగనారాధ్యుని” తన గురువని స్తుతించుటచేత రుక్మిణీపరిణయ రచనాకాలమునాఁటి కతనికి గురువుగారి యాశ్రయము కలుగలేదని యేర్పడుచున్నది. తద్రచనాకాలము క్రీ.శ. 1715. ఆ తరువాత క్రీ.శ. 1729 సం॥ అతఁడు సారంగధర చరిత్రలో
“శ్రీకరగుణసార చిరశుభాకార, నాకధునీజార నవసుకుమార
అలఘుతేజోనిధి యగు దెందులూరి కులు లింగనాగాధ్య గురుని నుతించి”
యనియు, భర్గశతకములో
“చిరభక్తి న్మదిలో భవద్వ్రతముగా జింతింతు నశ్రాంతమున్
బరవాదిప్రమదద్విపేంద్రపదవీపంచాననశ్రేష్ఠు బం-
ధురతేజోనిధి, దెందులూరి కులపాథోరాశి రాకానిశా-
కరునిన్ లింగయసద్గురూత్తముని భర్గా పార్వతీవల్లభా”
అనియుఁ జెప్పుటవలన దెందులూరి లింగనారాధ్య గురుత్వము 1715-1729 సంవత్సరముల మధ్య యెప్పుడో యతనికి లభ్యపడి యుండవచ్చును. ఈ గురూపదేశము పొందుటకు ముందు తిమ్మకవి, తాను రచించిన రుక్మిణీపరిణయములోఁ దక్కిన కృతులలోవలె సతీసహితముగాఁ ద్రిమూర్తులను గణాధిపుని మాత్రమే కాక, యాంజనేయ, వైనతేయ, నవగ్రహాదులనుగూడ స్తుతించుట చేత వైష్ణవపక్షపాతముగల యద్వైతిగనే కనిపించును.
నియోగులలోఁ బ్రాఙ్నాటివారనియు నార్వేలవారనియు రెండు ప్రధానశాఖలున్నవి. అందులో మొదటిది తిర్యక్పుండ్రాది శైవప్రముఖాచారముగా, రెండవది యూర్ధ్వపుండ్రాది వైష్ణవప్రసిద్ధాచారపరముగా వ్యవహరించుచుండినను రెండు నద్వైతమతమునే యవలంబించి, శాంకరగురుపీఠమునకే యంకిత మైయుండుట యందఱి కెఱుకపడిన విషయమే. ఒక్క గోల్కొండవ్యాపారిశాఖ మాత్రమే విశిష్టాద్వైతమతము నవలంబించినది. ఇఁక నార్వేలశాఖవారు శివకేశవభేదము లేని శుద్ధాద్వైతులైనను, నామములు ధరింతురు. ఈ యార్వేలశాఖవారిని గూర్చి కంకంటి పాపరాజు చెప్పిన విషయములన్నియు నక్షరముల నిజము. ఆనాఁటి కవులందఱు నూటికి డెబ్బదియైదుగురు ఆర్వేలవారే. (ఇఁక నిప్పుడున్నవారి మాటయో) - అది విషయాంతరము.
ఆర్వేలశాఖవాఁడయిన మన కూచిమంచి తిమ్మకవి యద్వైతమతావలంబకుఁడై యుండియు, అనుటచేత శుద్ధశైవమతము నవలంబించినట్లు తోఁచుచున్నది. లింగన యారాధ్యబ్రాహ్మణుఁడని పై పంక్తులే చెప్పుచున్నవి. అనఁగా లింగధారణము కలిగిన వీరశైవుఁడని వేఱ చెప్పనక్కఱలేదు కదా! అయిన నతని శిష్యుఁడగు మన తిమ్మకవి (శుద్ధ) శైవము నవలంబించి యుండవచ్చును. కాని వీరశైవాచారపరుఁడు మాత్రము కాఁడు. లింగన శిష్యత్వముచేత, నాంజనేయ వైనతేయాది భక్తస్తుత్యాదులు దగ్గినవి. కాని, త్రిమూర్తులమీఁద నతనికిఁగల భక్తి సమానమే. ఇక్కడ మఱొక విశేషము- చిన్ననాటినుండి యతని శివభక్తి యతివేలము. అందునను పీఠికాపుర కుక్కుటేశ్వరుఁ డతని యిష్టదైవము. అందుచేతనే (సర్పపురీమాహాత్మ్యము తప్ప) తన గ్రంథములన్నియుఁ గుక్కుటేశ్వరునకే యతఁ డర్పించినాఁడు.
ఇతఁడు పీఠికాపుర సంస్థానములోఁ జేరిన ‘కందరాడ’ గ్రామములో నుండువాఁడనని, సర్వలక్షణసారసంగ్రహములోను, శివలీలావిలాసములోను స్పష్టపఱచినాఁడు. కాని సారంగధరచరిత్రలో మాత్రము, తన్ను గూర్చి చెప్పుకొనుటలో “పావన కంద్రాడ పట్టణాధిపుని” యని పొగడుకొనినాఁడు. దీనినిఁబట్టి సారంగధరచరిత్ర రచనాకాలమునకు (క్రీ.శ. 1729) అతఁడా గ్రామకరణీకమును సర్వాధికారములతో ననుభవించుచుండినాఁడనుట సత్యము. అయిన, సర్వలక్షణసారసంగ్రహము వ్రాసిన క్రీ.శ. 1740 సం॥రమునకుఁ దర్వాత నా యుద్యోగమును దన తమ్ముండ్రకో, జగ్గకవి కుమారులకో యప్పగించి, సాహిత్యకవిత్వవిచారములతోఁ దాను కాలము గడపియుండును. అనఁగా నప్పటికే తిమ్మకవి వయస్సు అఱువదియవ పడిలోఁ బడియుండుట చేత “లేఖకపాఠకులు”గా జగ్గకవి కుమారుల సహాయ మపేక్షించుచు (రసికజనమనోభిరామము చూడుఁడు) నున్నవాఁడు కరణీకమును నిర్వహించుట కష్టమయి వారికే యెప్పగించినాఁడనుట సహేతుకమే. కనుక క్రీ.శ. 1729 నాఁటికి కంద్రాడ పట్టణాధిపుఁడైన తాను 1740 నాఁటికి కందరాడ మందిరుఁడైనాఁడు.
పైఁగాఁ దాను స్వతంత్రముగా వ్రాసిన కుక్కుటేశ్వర, భర్గ శతకములలో రాజులను, వారి ప్రవర్తనములను గూర్చి యుపాలంభించుటకుఁ, దన కరణీకవృత్తి ప్రతిబంధకముగా నుండునేమో యను నూహచేతఁ గూడ దానిని వదలియుండవచ్చును. పోషకులయిన పీఠికాపుర ప్రభువులను దన గ్రంథములలోఁ గాఁచిత్కముగా సూచించి తన ప్రభుభక్తిని లాంఛనప్రాయముగాఁ దెలుపుకొనెనే కాని, యే ప్రభువునకై న నొకకృతినైన నంకితము చేయలేదు. వారు నతని మహాకవిగా నంగీకరించి ‘సార్వభౌమ’ బిరుదముతో గౌరవించిరి. కాని తమ పేర కృతి రచింపవలసినదని యెప్పుడును గోరినట్లు కనఁబడదు. తిమ్మకవి జీవితములో నుండు నీ యద్భుతసన్నివేశము మఱి యే కవిజీవితములోను లేదు. “ప్రభువు - ఆశ్రితుఁడు” అను నంతస్తులలోఁగాక, స్వతంత్రవృత్తి గల పాలకపాలిత భావముతో సమానఫాయాలో పీఠపురాధీశ తిమ్మకవిసార్వభౌముల కాలము గడచినది. అవసానకాలములో నతఁడు చంద్రమపాలెము చేరినట్లు తెలియుచున్నది.
ఇతనికి “కవిసార్వభౌముఁడు” అను చినమాధవరాయ ప్రదత్తబిరుదమేకాక, “నవీనశబ్దశాసన” బిరుదముకూడ నున్నట్లు జగ్గకవి “చంద్రరేఖావిలాపము”వలనఁ దెలియుచున్నది. బహుశా యీ బిరుద మతని “సర్వలక్షణసారసంగ్రహ” రచనము తరువాత విద్యత్కోటి యనుగ్రహించి యుండవచ్చును. కాని యీ బిరుదమునుగూర్చి తాను, స్వరచిత గ్రంథములలో దేనియందును చెప్పలేదు.
తిమ్మకవిసార్వభౌముఁడు వశ్యవాక్కు. సంస్కృతాంధ్రములలో సమాన పాండిత్యము కలవాఁడు. ఆచ్ఛికశబ్దములతో నిరాఘాటముగా కవిత్వమును ‘కదం’ తొక్కింపఁగల యుద్దండుఁడు. అతని కావ్యములలో నర్థాలంకారములకంటె శబ్దాలంకారములు ప్రాధాన్యము వహించును. లక్షణానుసరణమైన కవిత్వమును సాగించుటలో శ్రీనాథుఁడు. ఆ కాలమున సంస్థానాధిపతులు, పండితులు మొదలయిన వారందఱు నతనిని గౌరవప్రపత్తులతోఁ జూచువారు. కవు లతని గ్రంథములను బ్రామాణికములుగా నంగీకరించువారు. రాజులయెడఁ దిమ్మకవి గౌరవము చూపువాఁడే; కాని వారి ప్రవర్తనల మాత్రమంతగా మెచ్చుకొనువాఁడు కాఁడు. పైగా నీసడించువాఁడు. ఆకారణము చేతనే వారికి గ్రంథములను గృతి యీయలేదు. ఈ విషయమున నీతఁడు బమ్మెర పోతరాజునకుఁ దుల్యుఁడైనను నీయిరువురి నరాంకిత విముఖత్వములో భేదము లేకపోలేదు.
పోతన రాజులను “మనుజేశ్వరాధము” లన్నాఁడు. “సద్ద్విజశ్రేయమై” అని ద్విజులను మాత్రము “సద్ద్విజు” లన్నాడు. ఇందులోఁ గటువైన పరనింద, ఆభిజాత్యసూచకమైన యాత్మస్తుతి యున్నవి. ఇట్టి భావములు తిమ్మకవికి నున్నవి; కాని యంత పెడసరముగా (శతకములలోఁ దప్ప) నతని కృతులలో నంతగాఁ గనిపింపవు. అందుకుఁ గారణము లేకపోలేదు. వ్యవసాయము స్వయముగాఁ జేసికొనుచు బ్రతుకు నిరుపేద రైతయిన బమ్మెరపోతన, పాలకుల వలన బాధ లనుభవించినాఁడు. కవిసార్వభౌముఁ డట్లు కాక, “కందరాడ” పురాధీశుఁడై గ్రామవ్యవహారములన్నియుఁ దన యదుపులో నుంచుకొని ప్రభువుల గౌరవమును సంపాదించుకొని జీవించినాఁడు.
నరులకుఁ గృతినర్పించుటకుఁ దన యసమ్మతిని జూపిన పోతన
“హాటకగర్భురాణి నిను నాఁకటికిం గొనిపోయి, య-
ల్ల కర్ణాటకిరాటకీచకుల కమ్మఁ ద్రిశుద్ధిగ నమ్ము భారతీ”
అని ప్రభువుల యెడలఁ దనకుఁగల ద్వేషభావమును బూర్తిగ వెల్లడించినాఁడు. తిమ్మకవి కూడ
“వినుమఖిలేశ, మర్త్యులకు వేడుకఁ గావ్యమొసంగి, ధాత్రిపై
నొనరఁగ సౌఖ్యసంపదల నుద్ధతులై సుకవీంద్రులుందురు”
అనియు,
“పనిఁబూని తుచ్ఛభోగంబునకై కొఱగాని జనులఁ బొగడుటయెల్లన్
గనుఁగొన నిహపరదూరంబని తలఁచి వినిర్మలాంతరంగుండగుచున్”
(రాజశేఖర విలాసము)
అనియు చెప్పినాఁడు. అంతియకాక తన రసికజనమనోభిరామములో
అని యన్నాఁడు. ఈ విధముగా రాజులను, వారికిఁ గవుల విషయములోఁగల యలక్ష్యభావమును, వారి త్యాగములను గూర్చి యితఁడు తన కుక్కుటేశ్వర, భర్గ శతకములలో మఱియు దీవ్రముగా విమర్శించుటతో బాటు వారి ననుసరించు పండితులనేగాక, కవులనుగూడ నిరసించి పలికినాఁడు. దానినిగూర్చి మున్ముందు మనవి చేయుదును.
తిమ్మకవి కవితను దన యనుదినారాధ్యదేవతగా భావించి, తన కృతులకన్నిటికిఁ “గుక్కుటేశ్వరు”నే పతిగాఁ జేసినాఁడు. పూర్వకవుల ప్రయోగముల నొరవడిగాఁ బెట్టుకొని శబ్దౌచిత్య మెఱిఁగి, నిరాఘాటముగా, ధారాశుద్ధితోఁ గవిత్వము సాగించు శక్తి యితనితో నంతరించినట్లు ప్రాచీనపద్య వాఙ్మయచరిత్రకారుల యభిప్రాయము. ఆనాఁటి సిద్ధహస్తులయిన కవీంద్రులలో నగ్రగణ్యుఁడైన యీ తిమ్మన తన శివలీలావిలాసములో
అని చెప్పుటవలన, నొకనాటి కిన్ని పద్యములు రచింపవలయునను నియమము నవలంబించి గంగాఝరీసరణినిఁ బురుడించు ధారలోఁ బెక్కు లాచ్ఛికమిశ్రకావ్యములు వాణికిఁ దొడవులుగా దిద్దితీర్చుచుఁ దన జీవితమును గవితాసామ్రాజ్యపాలనకే యర్పించినట్లు తోఁచుచున్నది.
ఇతఁడు మహారసికుఁడు. ఇతని కావ్యములలోని శృంగారఘట్టములు రసికయౌవతయువతతుల కనురాగవర్ధనములు. కాని, దాని నాధారము చేసికొని, మనవారట్టి మహాకవుల జీవితములకుఁ గళంక మాపాదించు చిలిపికతలను గల్పించి చెప్పుట సర్వధా గర్హ్యము. అందు నీ తిమ్మకవిని గురించి యీ క్రింది కత పరంపరగా వచ్చుచున్నది:
ఇతని కావ్యములలోని శృంగారరసము నామూలాగ్రముగా గ్రహించి యానందించు విద్వత్కవయిత్రి యయిన యొక వారకాంత యతని సాహచర్యమునకుఁ దగిన యవకాశముకొఱకుఁ జూచుచుండఁగా నిర్జనమయిన యొక సందుమలుపులో నతఁ డొకనాఁడు హఠాత్తుగాఁ దటస్థపడినాఁడట! అప్పుడామె బలాత్కారముగా నతనిని గౌఁగలించుకొనినదఁట! అతఁ డట్టిసమయమున మోమావలకుఁ ద్రిప్పుకొనినాఁడట! అంతట నా గణికారత్నము-
“చతురులలోన నీవు కడుజాణవటంచును, నేను గౌఁగలించితి నిటు
మాఱుమోమిడఁగఁ జెల్లునే, యో రసికాగ్రణ్య!”
యనఁగా కవి వెంటనే
“అద్భుతమగునట్టి బంగరపుఁబొంగరపుంగవఁ బోలు నీ కుచద్వితయము
ఱొమ్ము నాఁటి యల వీపున దూసెనటంచుఁ జూచితిన్”
అని చెప్పెనఁట! ఇది కర్ణాకర్ణిగా వచ్చుచుండు కట్టుకథ యనుటకు సందియము లేదు. తిమ్మకవి రసికతాపరీక్ష కిదియా యుపాయనము? సందుమలుపా ప్రదేశము? ఎంత సిగ్గువిడిచినవారైన నిట్లు తమ గ్రుడ్డిప్రేమను బ్రదర్శింతురా? విద్యావివేకములుగల నాయికానాయకుల కిట్టి రసాభాసపు నడివీధి శృంగార మంటఁగట్టి, వారి రసికత కిది తార్కాణమని పొంగిపోవు మేధావులు కుర్కురశృంగారక్రీడాప్రశంస చేయువారికంటె భిన్నులు కారు.
కొందఱీకథను ముక్కుతిమ్మనార్యున కంటఁగట్టుచున్నారు. దీని విశ్వసించువారు, పరిస్థితులను బట్టి, అతనికే యవకాశము లెక్కువ కాన, అదియే నిశ్చయమని తలంతురు. ఆ ప్రబంధయుగమున రసికలోకవరుఁడగు ముక్కుతిమ్మన సాంగత్యము గోరు గణిక సాహసించి (తెగఁబడి) ఆ మహానగరమున నేమూలనో తారసిల్లిన ముక్కుతిమ్మన విషయమున నట్లు ప్రవర్తించెననుట సందర్భశుద్ధికి లోటు గలిగింపదు.
నేఁటి మనవారెట్టి యపదూఱులు తిమ్మకవికేకాక, శ్రీనాథునికి, ధూర్జటికిఁగూడఁ గట్టిపెట్టిరి. కారణమేమన, శృంగారము తొణికిసలాడు నూతనభావోపేతములగు నా మహాకవీంద్రుల చాటువులు, వారి కావ్యములలోని పద్యములే! కవి హృదయమును బాగుగాఁ దరచి, వారి గంభీరభావముల నర్థము చేసికొనలేని యసమర్థులయిన విమర్శకులకు “కరిసంఛాదితపంచాయుధగేహ” లనిన బమ్మెర పోతనవంటి మహాభాగవతశిఖామణికూడ విటాగ్రణియే. రంధ్రాన్వేషణపరాయణుల సంకుచితదృష్టులు వారికి సహజములు కావచ్చును. కాని యవి సంఘమున కపకీర్తికరములు; లోకమునకుఁ బ్రమాదకరములు; చారిత్రక సత్యమునకు విపత్కరములు.
ప్రకృతిసిద్ధ మానవసౌందర్యమునకు యువతులు నిధులైనందున, వారి హావభావవిలాసవిభ్రమోపేత శృంగారమును మనవారు ప్రధానముగా స్వీకరించిరి. ఆ రసపోషణ లేకుండ కృతులు రచించుటయన, వారి దృష్టిలో “నేలవిడిచి సాము చేయుట” వంటిది. ఈ విషయమునఁ గొందఱి రచనలలో నే రవంత మోతాదు మించినట్లుండినను, వారెల్లరు దుర్వర్తనులనుట సాహసమే. అది సహింపరాని నేరము.
సహజసౌందర్యలీలావిలాసముగ మోహనలగు గ్రామవనితల నిష్కళంకకోమలరూపమహిమను గుర్తింపని నాయకులు, పుట్టుసౌందర్యము వెల్లడించు నవయవసౌభాగ్యము లేని పట్టణవాసికాంతాజన కల్పితాభరణాంబరశోభలను, స్నో, ఫేస్పౌడర్, లిప్‍స్టిక్కుల రంగులను, నసహజదృగ్గమనాదుల తళుకుబెళుకులను జూచి, వారే “యందాల రాణు”లని నిర్ణయించు నీ కాలములోని మనకుఁ బ్రాచీనకవుల శృంగార మవినీతిగను, వారు “పక్కా” విటరాజులుగను గనఁబడుటలో వింత లేదు.
కావున, తుచ్ఛభోగముల నాశించి, తన కృతులను, (అందుకొని సత్కరించు ప్రభువులుండియు) నరాంకితము చేయనొల్లక, లింగనారాధ్య గురూపదేశప్రాప్త పరమమాహేశ్వరవ్రతనిష్ఠాగరిష్ఠుఁడై, పారమార్థికబుద్ధితో జీవితము పవిత్రవంతముగాఁ గడపిన తిమ్మకవిసార్వభౌమునికి బరిహాసమున కయిన నఘ మంటఁగట్టుట మహాపచారమగును.
పదునెనిమిదవ శతాబ్దపు కవులలోఁ దిమ్మకవికిఁగల స్థానము మహోన్నతమైనది. అతని కావ్యములన్నియుఁ, దత్పూర్వకవుల మార్గములోననే నడచినను, గొన్నింటిలో నూతనత్వము లేకపోలేదు. ‘రసికజనమనోభిరామ’ రచనలోని యభూతకల్పనలు, నష్టాదశవర్ణనలు, ప్రాచీనప్రబంధముల ఫక్కిలోనే నడచినది. అంతవఱకుఁ బ్రబంధముల ధోరణులతోఁ దలవాఁచి, మొగము మొత్తిన రసికజనులకు “రసికజనమనోభిరామము” వెక్కసమయినది.
అచ్చతెలుఁగు కావ్యములను సరళశైలిలో వ్రాయుటయందుఁ దిమ్మకవి సిద్ధహస్తుడు. అందులో నతనికుండు ప్రత్యేకప్రతిభయే యాయన కవితాధార కొక విశిష్టతను జేకూర్చినది. అతనికి ముందు పదునాఱవ శతాబ్దములోని పొన్నిగంటి తెలగనార్యుఁడుకూడ నచ్చతెలుఁగులో “యయాతిచరిత్రము” వ్రాసినాఁడు. కాని తిమ్మకవి “యచ్చతెలుఁగు రామాయణ, నీలాసుందరీపరిణయము”లకు వచ్చిన ఖ్యాతి దానికి రాలేదు.
తెలుఁగువారి సంప్రదాయములను జాఱవిడువకుండ, నొడుదొడుకులు లేని కవిత్వ మచ్చతెలుఁగులో నడపి యాంధ్రప్రజానీక ప్రశంసలందుకొనిన యానాఁటి తెలుఁగుకవి తిమ్మన సర్వధా శ్లాఘ్యుఁడు; ధన్యుఁడు. అతని నిండు తెలుఁగుఁదన మతని శతకములలో బాగుగాఁ బ్రస్ఫుటమగుచున్నది. కుక్కుటేశ్వరశతకము
పీఠిక
తిమ్మకవి కుక్కుటేశ్వరశతకము తెలుఁగుసీమలో జాలకాలముగాఁ బ్రచారములో నున్నది. ఇది వేణుగోపాల, రామలింగేశాది శతకములవలె నా కాలమునందలి సంఘదురాచారములను, ప్రభువుల యవినయప్రవర్తనలను నిర్దాక్షిణ్యముగా ఖండించుచున్నది. అట్టి శతకములను గవులు స్వానుభవమును బురస్కరించుకొని చెప్పుటచేత, నా రచనలలోని యావేగము, నావేశము, కావ్యలక్షణములనుగూడ నతిక్రమించుట సహజము. అట్టి సందర్భములలో శబ్దములు దూకుడుగా దొర్లుకొని వచ్చు ధోరణిలోఁ గవిత నడచును. జుగుప్సాంశములుకూడ కృతిముఖముగా బట్టబయలగును. అట్టివానిని పరిష్కర్తృమహాశయులు సంస్కరించి ప్రకటనార్హము చేయుటకు తంటాలు పడినను, తత్సహజస్వరూపమును కవిహృదయమును దాఁపలేక పోవుచున్నారు. ఏలాటి నిశితబుద్ధిగల పాఠకుఁడైన, నట్టి పట్టులలో “నిది కవ్యుద్దిష్ట శబ్దము కా”దని వెంటనే కనిపెట్టగలఁడు. తిమ్మకవి కుక్కుటేశ్వర శతకములోఁ గూడ నట్టి పట్టులున్నవి.
ఈ శతకమునకుఁ దిమ్మకవి తన “రుక్మిణీపరిణయము”లోనే యీ క్రింది పద్యముతో నంకురార్పణము చేసినాఁడు.
“చిన్నివెన్నెలఱేఁడు చెన్నైన సికపువ్వు, పసమించు పులితోలు పట్టుసాలు,
చిలువల యెకిమీఁడు బలు మానికపుఁ దాళి, వాటంపుఁ దెలిగిబ్బ వారువంబు,
గఱికి పూజల మెచ్చు గారాబు కొమరుండు, వలిగొండ కూతురు వలపుటింతి,
జేజే తుటుములెల్లఁ జేరి కొల్చెడు బంట్లు, నునువెండి గుబ్బలి యునికిపట్టు,
నగుచుఁ జెలువొంద, భువనంబు లనుదినంబు రమణఁ బాలించు నిన్ను నేఁ బ్రస్తుతింతు
బుధనుతవిలాస, పీఠికాపురనివాస కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!”
ఈ పద్యములోని కడపటి రెండు చరణములే కుక్కుటేశ్వరశతకమునకు మకుటమయినది. దీనినిబట్టి తన యిష్టదైవమైన కుక్కుటేశ్వరునికి తన కృతులన్నియు నంకితము చేయుటతోఁ దృప్తిపడకుండ నొక శతకమే యా దేవుని పేర వ్రాయ నెంచినాఁడనియు, దానికి రుక్మిణీపరిణయములోని పై పద్యాంత చరణద్వయమే యందమైన మకుటముగా స్వీకరించినాఁడనియుఁ దెలియుచున్నది. కాని పై పద్యములోని ‘బుధనుత’ యనునది, శతకములో “భూనుత” యని మాఱి యున్నది. ఇది యసలు కవికృతమే యయి యుండును.
ఇఁక శతకములోని విశేషములనుగూర్చి కొంచెము పరిశీలించుట యవసరము.
ఇందు పద్యములు 92 మాత్రమే. వాని వివరణము:
Ø దేవతాస్తుతి 24 పద్యములు
Ø స్వవిషయము 1 పద్యము
Ø పంచాక్షరీ మహిమ 1 పద్యము
Ø ఖల లోభులు 12 పద్యములు
Ø సుజనులు ఘనులు 6 పద్యములు
Ø సుకవి కుకవులు 4 పద్యములు
Ø సుశీలా దుశ్శీలలు 5 పద్యములు
Ø పామరజనులు 10 పద్యములు
Ø కలిమిలేములు 2 పద్యములు
Ø సత్ప్రభు దుష్ప్రభులు 2 పద్యములు
Ø దాతలు సప్తసంతానములు 2 పద్యములు
Ø సామాన్య నీతులు 12 పద్యములు
Ø కలికాల మహిమ 2 పద్యములు
ఈ విషయవిభాగములవలన, కవి యప్పటి సాంఘిక పరిస్థితుల నన్నింటిని సులభముగా నవగాహనము చేసికొని పాఠకుల కన్నులకు కట్టిన ట్లెట్టయెదుట ప్రత్యక్షము చేసినట్లు గోచరించుచున్నది..
ఇందులోఁ గల తెలుఁగునాటి దైనందిన వ్యావహారిక శబ్దములు నుపమానములు-
అద్భుతజాతీయములకు, నానుడులకు నీ శతకము నిధివంటిది.
లోకోక్తులు, ఉపమానములు నుక్తవిషయముల కలికినట్లు కూర్చుటలో నీ శతకకారుఁడు కడుంగడు దిట్ట. కొన్ని యీ క్రింద కాననగును:
ఇవిగాక, (1) రాజ్యాంతే నరకం ధ్రువమ్, (2) జాతస్య మరణం ధ్రువమ్, అను నార్యవచనములు నటనటఁ గాన్పించుచున్నవి.
సంస్కృత గ్రంథములలోని భావములుగూడ నీ శతకములో నక్కడక్కడ నగపడుచున్నవి:
“అంబోధి కభిషేక మాచరించిన యట్లు, గంగకుఁ బాద్య మొసంగినట్లు,
మేరువునకు నలంకారంబు లిడినట్టు, లినునకు నారతులెత్తినట్లు,
మలయాచలమునకు గలప మిచ్చినయట్లు ఇల వసంతునకుఁ బూ విడినయట్లు
భూపముఖ్యునకుఁ దాంబూల మిచ్చినయట్లు సోమున కద్దంబు సూపినట్లు
నిఖిలలోకైకభర్తకు నీకు నొక్క బిల్వదళ మార్యవర్యు లర్పించుచుంద్రు”
(కుక్కుటేశ్వర శతకము)
ఈ పద్యభావము సౌందర్యలహరిలోని
“ప్రదీపజ్వాలాభి ర్దినకర నీరాజనవిధి
స్సుధాసూతే శ్చంద్రోపలజలలవై రర్ఘ్యరచనా,
స్వకీయై రంభోభి స్సలిలనిధి సౌహిత్యకరణం
త్వదీయాభి ర్వాగ్భిస్తవ జనని వాచాం స్తుతిరియమ్”
అను శ్లోకభావమునకు ఛాయ; కాని పద్యములో, ‘బిల్వదళార్పణము’, శ్లోకములో ‘స్తుత్యర్పణము’ ప్రసక్తమైనది. “సుధాసూతే శ్చంద్రోపలజలలవై రర్ఘ్యరచనా” యనునది తెలుఁగులో “సోమున కద్దంబు సూపినట్లు” అనుటచేత సంపూర్ణభావము రాలేదు. తక్కినవానికి ప్రజలర్చించు నౌపచారిక వస్తుసముదాయము సమృద్ధిగా నున్నప్పు డట్టి యౌపచారికము పరిహాసాస్పదమని భావము. ఆ రీతిగాఁ జంద్రునికి సమృద్ధిగా నుండు వస్తువు (అతని చేతనే ద్రవీకరింపఁబడిన) “చంద్రోపలజలం” మూలశ్లోకములో సూచితము. ఆ స్థానమును తెలుఁగుపద్యములోఁ గవి “యద్దము”న కిచ్చినాఁడు. ఇది ప్రక్రమభంగమే కాకుండ భావపుష్టికిని గించిన్న్యూనము.
యను పద్యము “ఆయుర్వర్ష శతం” అను శ్లోకభావమును బుడికిపుచ్చుకొనినది.
“నదులలో జాహ్నవి, నరులలో విప్రుండు, గ్రహములలోనఁ బంకజహితుండు,
తృణములలో దర్భ, మృగముల సింగంబు, వ్రతముల ద్వాదశి, లతల జాజి,
దానమ్ములం దన్నదానమ్ము, లోహజాతమ్ములలోనఁ గార్తస్వరంబు,
గిరులలో మేరువు, పురములలో గాశి, తరువుల రావి, సంతతులఁ గృతియు”
అను పద్యభావము, భగవద్గీతలలోని విభూతియోగ శ్లోకముల లోనివి.
Ø నదులలో జాహ్నవి (స్రోతసామస్మి జాహ్నవి)
Ø నరులలో విప్రుఁడు (నరాణాం చ నరాధిపం) “నరాధిపం” అను ముక్కకు విప్రుండు అని వ్రాయుట జాత్యభిమానమునకు సూచన.
Ø గ్రహములలోనఁ బంకజహితుండు (జ్యోతిషాం రవిరంశుమాన్)
Ø మృగముల సింహంబు (మృగాణాం చ మృగేంద్రోఽహం)
Ø గిరులలో మేరువు (మేరుశ్శిఖరిణా మహం)
Ø తరువుల రావి (అశ్వత స్సర్వవృక్షాణాం)
అనుకరణములు
ఈ కుక్కుటేశ్వర శతకము నొరవడిగా నుంచుకొని వంకాయలపాటి వేంకటకవి “కోలంక శ్రీమదనగోపాలశతకము”ను రచించినాఁడు. ఎత్తుగడలుగూడ “ఫక్తు కాపి”. Ø ‘గురుతర కౌండిన్యగోత్ర పవిత్రుడ’ (కుక్కు)
‘గురుకర గౌతమగోత్ర పవిత్రుడ’ (కోలం)
Ø ‘దండ ముద్దండ దోర్దండ విఖండిత’ (కుక్కు)
‘దండంబు దోర్దండ మండిత కోదండ’ (కోలం)
Ø ‘కాకంబునకు రత్నఖచిత పంజరమేల?’ (కుక్కు)
‘ముసిఁడి తుప్పలకు గొప్పులు త్రవ్వగానేల?’ (కోలం) (ఇట్టి పద్యాలు కో.మ.గో. శతకములో మూఁడున్నవి.)
Ø ‘భోగియై ప్రతిదినత్యాగియై పుణ్యసంయోగియై సుజనానురాగి యగుచు’ (కుక్కు)
‘జారుఁడై దుష్టప్రచారుఁడై, పాపవిదూరుఁడై బహుదురాచారుఁ డగుచు’ (కోలం)
Ø ‘ఘూకంబు తెఱఁగున గొందుల నిఱుకుచు భుజగంబు చాడ్పున బుస్సుమనుచు’ (కుక్కు)
‘కడుపిశాచరీతి నెడపక భక్షించి గ్రామసూకరమట్లు కడుపు పెంచి’ (కోలం)
Ø ‘ఎనుఁబోఁతునకు విద్దెలెన్నింటి నేర్పిన మడుఁగున కేఁగుట మానఁగలదదె?’ (కుక్కు)
‘ఏపి నందలముపై కెక్కించినను గ్రిందికురవడి పుల్లెల కుఱకకున్నె?’ (కోలం)
Ø ‘అలికులవేణి సింహకిశోరనిభమధ్య, పరిపక్వబింబోష్ఠి పద్మగంధి,
రాకేందువదన శరచ్చంద్రికాహాస కోకిలకలవాణి కుందరదన
పల్లవపాణి శంపాలతావిగ్రహ లికుచవక్షోజ నాళీకనేత్ర
ముకురకపోల చంపకపుష్పసమనాస భుజగరోమావళీ పులినజఘన’ (కుక్కు)
‘కులుకుమిటారి పూవిలుతుచేతికటారి, బంగరుబొమ్మ, కప్రంపుదిమ్మ,
యన్నుల తలమిన్న, చిన్ని సంపెఁగగున్న, గోములనడుదీవి, గుజ్జుమావి,
వెన్నెల దొంతి మవ్వంపు పువ్వులబంతి, రతనాల తేట, వరాల మూట,
పండువెన్నెలసౌరు బలమానికపు తీరు, వలపుల మొక్క మేల్‍తరపు చుక్క’ (కోలం)
Ø ‘జగడాల చీలి, వేసాల వెల్లి, పిసాళి, తిండిపోతు, గయాళి, మొండికట్టె,
హేయభాజనము, పల్నాయల పుట్టిల్లు, గంతులరాకాసి, పంతగత్తె,
యవలక్షణము తావు, నవివేకముల ప్రోవు, చెఱపన చేట, మాసికల మూట,
నిక్కులబండి, బందెలమారి, కల్లలపాఁతఱ, సోమరిపోఁతనంగ’ (కుక్కు)
‘పలుగుగయ్యాళి, దెబ్బలగండు పలుగాకి, మాలుఁగఁబోతు, బల్మాయలాఁడి,
పిసినిగొట్టు, పిసాళి, పెంకె, బొంకుల పుట్ట, చెడుగు నిక్కులయిక్క, చెనఁటిమంకు,
టకుబాజు, కల్లరి, టాటోటు, గడుమోట, బందెల పుట్టిల్లు, నందగత్తె,
ఱంకులరాటంబు, రవ్వలమారి, తంటాకోరు, రంతులరావు ముచ్చు’ (కోలం)
Ø ‘వలవని చెలువతో మెలఁగువాఁ డొకకూళ, వాసి డించి చరించువాఁడు కూళ,
సిరిగల్గి కుడువక చిక్కువాఁ డొకకూళ, వనిత కుంకువ చెప్పువాడు కూళ,
చెడి బంధునింటికిఁ జేరువాఁ డొకకూళ, వసుధేశు చెడనాడువాడు కూళ,
ధనికుతోఁ బగఁ బెట్టుకొనెడువాఁ డొకకూళ, వడిలేని దొర కొల్చువాఁడు కూళ’ (కుక్కు)
‘తనుఁ దాను నుతి జేసికొనెడువాఁ డొక మూర్ఖు, వలదన్న పని చేయువాడు మూర్ఖు,
పలుగు పెండ్లాముఁ జేపట్టువాఁ డొక మూర్ఖు, పాడి చెప్పఁగఁ బూనువాఁడు మూర్ఖు,
తనకన్న ఘనుఁడు లేడనెఁడువాఁ డొక మూర్ఖు, వనితకు జనవిచ్చువాఁడు మూర్ఖు,
కొఱగానివారల గూడువాఁ డొక మూర్ఖు, పలుగాకివలె పేలువాఁడు మూర్ఖు’ (కోలం)
Ø ‘పరమలోభిని దివాకరతనూభవుఁ డంచు, ఛద్మచిత్తుని హరిశ్చంద్రుఁ డనుచు
నిర్దయాత్ముని రామనృపశిఖామణి యంచుఁ, గడుకురూపిని రతికాంతుఁ డనుచుఁ
బాపకర్ము నభంగపాండవాగ్రజుఁ డంచు, సమరభీరుని సవ్యసాచి యనుచుఁ
గుండబీదను మరున్మండలేశ్వరుఁ డంచు, మతివిహీనుని భోగిపతి యటంచు
కవులు కక్కూర్తి నిసుమంత కడుపు కొఱకుఁ బొగడుచుందు, రవివేకబుద్ధులగుచు’ (కుక్కు)
‘కుక్షింభరుని బుధరక్షాపరుండంచు నతినికృష్టుని మహాత్యాగియంచు
బహుబీజసంభవుఁ బరమపావనుఁ డంచుఁ జంచలాత్ముని ధైర్యశాలియంచు
దౌర్జన్యకారిని ధార్మికోత్తముఁ డంచుఁ గఠినచిత్తుని దయాకరుఁ డటంచు
జారకర్ముని పరదారవర్జితుఁడంచు నుత్తమూఢుని శాస్త్రవేత్తయంచు
గవులు కక్కూర్తి చేతను గడుపుకొఱకు సన్నుతింతురు మదిలో విచారపడక’ (కోలం)
తిమ్మకవికి దాదాపు 80 యేండ్ల తరువాతివాఁడయిన యీ వంకాయలపాటి వేంకటకవి, శబ్దములను మార్చినాఁడు; కాని భావచౌర్యము పూర్తిగాఁ గుక్కుటేశ్వరశతకమునుండి చేసిన ట్లతని కోలంక శ్రీమదనగోపాలశతకమువలన తెలియుచున్నది.
తిమ్మకవి రాజులను నిరసించుచు పలికిన పలుకులు గమనింపఁదగినవి.
Ø ‘నిక్కి మిక్కుటమైన యా దొక్కి బొక్కి టక్కరి నృపాలకుల కీర్తి దక్కునొక్కొ?’
Ø ‘కాని దుర్మతులై ప్రజఁ గలఁచి ధనము గూర్పఁ జూతురు బేలలై కూళదొరలు’
Ø ‘రాజ్యమేలంగఁ గలవాఁడె రాజు గాక హీనమతియై చరించువాఁడేటి రాజు?’
Ø ‘తనరు క్రూరనృపాలకాధముల నమ్మి సిరుల కాసించు వాఁ డొక్క చెనటిగాఁడె?’
Ø ‘ధర్మమతి తొట్టు సీ! యిట్టి దుర్మదాంధ నృపకులాధము లేరి కేమియ్యగలరు?’
Ø ‘విత్తంబు గూర్చుట విమలప్రచారమా?, బహునిధుల్ గావఁడె భైరవుండు,
ప్రజల దండించుట పరమసంతోషమా? ప్రాణుల నెల్ల నేఁపఁడె జముండు,
దొరతనంబున కివి గావు వరుసలరయ సాహసౌదార్య ఘనపౌరుషములు గాని’
Ø ‘గాక తన పొట్టకై ప్రజఁ గలంచు దురితరతుఁడు వాఁడొక్క రాజా, తరాజు గాక?’
Ø ‘రాజగునె జాగ్రదురుదురాగ్రహము చేతఁ బ్రజల బాధించు ఘోరదర్పధ్వజుండు’
Ø ‘తస్కరుల చందమునఁ బదార్థములు మ్రుచ్చిలించుచుఁ జూపించు కుకవుల నెంచనేల?’
Ø ‘కూడదనఁగను గవితలఁ గూర్చి బలిమిఁ గుమతులకు నిచ్చువాఁడొక కూళ సుమ్ము’
కుక్కుటేశ్వరశతక భావములు వేణుగోపాలశతకములోఁగూడ నక్కడక్కడఁ గనిపించుచుండినను కొంగ్రొత్త పోకడలు లేకపోలేదు.
“కాపు కవీశ్వరుల్, కంచర యోగులు, సాతాని వైష్ణవుల్, సాలె భటులు,
గోమటి దాతలు, కొంటె భాగోతులు, మాల వెజ్జులం, బోయ మావటీలు,
గొల్ల పౌరాణికుల్, పల్లె దైవజ్ఞులు, బానిస వేశ్యలు, జైన బాప
లాఁడుఁ దీర్పరు, లుగ్రయవన ధరాధీశ్వరులు, వైదిక ప్రధానులును...” (కుక్కు)
(ఛాయ-)
“నంబికవిత్వంబు, తంబళజోస్యంబు, వలనొప్పు కోమటి వైష్ణవంబు,
వరుసనే యుప్పరవాని సన్న్యాసంబు, తరువాత శూద్రసంతర్పణంబు,
రజకుని గానంబు, రండా ప్రభుత్వంబు, వెలయంగ నఱవల వితరణంబు,
సాతాని విద్వాంసశాస్త్రవాదము, వేశ్య తనయుఁ డబ్బకుఁ బెట్టు తద్దినంబు” (వేణుగోపాల)
తిమ్మకవి “కుక్కుటేశ్వరశతక”మే తరువాత వచ్చిన నీతి (సీస) శతకముల కన్నింటికి మార్గదర్శకమైనది. అట్టి శతకములలో విషయగౌరవమునుబట్టి, భావబాహుళ్యమునుబట్టి వేణుగోపాలశతకమున కగ్రతాంబూల మీవలసివచ్చును.
తిమ్మకవి క్రీ.శ. 1729 సం॥న రచించిన మఱియొక శతకమైన భర్గశతకము సమగ్రముగా నుండ, నీ కుక్కుటేశ్వర శతకములో మాత్ర మెనిమిది పద్యములు తక్కువగా నున్నవి. ఇప్పటివఱకు దొరకిన ప్రాఁత ముద్రితప్రతులన్నిటిలోను నీ లోటు ఒకేవిధముగఁ గన్పించుచుండుట వలనఁ గవి వ్రాసినవే 92 పద్యములని యూహింపవలసియున్నది. పైగా కుక్కుటేశ్వరశతకములోని కడపటి పద్య మీ యూహను బలపఱచుచున్నది. ఏవో యొకటి రెంటిలోఁ దప్పఁ దన కృతులన్నిట కట్టకడపట, వాని రచనాకాలమును, మంగళాచరణమును దిమ్మకవి విధాయకముగా వ్రాయువాఁడు. భర్గశతకమునఁ గూడ 100, 101 సంఖ్యలుగల పద్యములలో నీ ‘రివాజు’ పాటించినాఁడు. “కుక్కుటేశ్వరశతకము”లోని 92 న పద్యము” శివశివా! ధాత్రి దా వలచిన వధూటిఁ బాయు వెత వద్దు సుమ్మెట్టిపలువకైన” యని పురుష విరహమునుగూర్చి చెప్పునది. అందుచేతఁ దక్కిన యెనిమిదింటినిగూడ రచించు నుద్దేశముండియుండుననుట సబబు. అట్లు పూర్తి చేయకుండుటకుఁ గారణ మొక్కటే తోఁచుచున్నది.
ఈ కుక్కుటేశ్వరశతక మకుట నిర్మాణము క్రీ.శ. 1715 నాఁటి కే (వెలువడిన) తన రుక్మిణీపరిణయములోనే కవి చేసినాఁడు. ఆనాటినుండి తన యవసానదశ వఱకు స్వానుభవములోని విషయములను బురస్కరించుకొని యప్పుడప్పుడు తనకుఁ దోఁచిన భావములతో 92 పద్యములనే వ్రాయఁగలిగినాఁడు. తక్కిన 8 పద్యములు పూరించులోపలనే యతఁడు మరణించియుండవచ్చును. ఈ నిర్ణయమును దృఢపఱచు నంశములు కుక్కుటేశ్వరశతకములోనే కనఁబడుచున్నవి. అందులో 89వ పద్యము-
“నోరు చేఁదై కూడుకూరలు చవిదప్పు, గడగడ నొడలెల్ల వడఁకుచుండుఁ,
జెవుడున నేమియుఁ జెవులకు వినరాదు, తెగులును జింతయుఁ దగులుకొనును,
కన్నులఁ బొఱగప్పి కానరాదెద్దియు, సిగ్గొకించుకయైనఁ జేరబోదు;
బాలురందఱుఁ గూడి గేలి గావింతురు, మగువలు పకపక నగుచునుంద్రు
మదిఁ దలంపఁగఁ గటకటా! ముదిమి యంత రోఁత లేదుగదా, ధారుణీతలమున”
“బావిలోపలఁ బడ్డ పామును వెడలింపఁ జనువాని గఱువక చనఁగఁగలదె?
చిచ్చులోఁ బడెడు వృశ్చికమును వెడలింపఁ జనువాని మీఁటక సడలఁగలదె?
పెనువెల్లిఁ బడి పోవు బెబ్బులిఁ బరికింపఁ జనువాని మింగక చనఁగఁగలదె?
అవనిలోపల ఖలుని నెయ్యంబు మీఱ మనుపఁ జనువానిఁ జెఱుపక మానఁగలఁడె?”
అని తెలిపినాఁడు. లోకవృత్త మెఱిఁగినవారి కిట్టి సంఘటన లాశ్చర్యమును గలిగింపదు. కొంచెము శక్తి యుడుగునప్పటికిఁ దన యాప్తులైనవారు, తన వలన వృద్ధికి వచ్చినవారుకూడ మేలుచేయు మాట యటుండనిచ్చి, విడనాడుటయేకాక, కీడుఁగూడఁ గలిగించుటకుఁ బూనుకొందురు. ఈ విషయములో మానవత్వము బదులు, దానవత్వమే నరజాతి నాశ్రయించును. తిమ్మకవి విషయములో నంతియ జరిగినది. అతని మనస్సునకు సహింపరాని నిర్వేదము కలిగించి యుండుననుటకు పై పద్యమే ప్రబల సాక్ష్యము.
చిట్టచివర 92వ పద్యములో నుటంకింపఁబడిన విషయమును బట్టి చూచిన, నతనికి సతీవియోగముకూడ సంభవించినట్లు తోఁచుచున్నది.
“అన్నంబు నాలుక కరుచియై కనుపట్టు, నిలిచినచో నిల్వ నలవి కాదు,
మనుజేంద్రుతోనైన మాటాడ సైఁపదు, పనులయందేమియు మనసు లేదు,
నడచుచో నడుగులు తడబాటు గైకొనుఁ, దగ బండువులనైన నగవు రాదు,
తెవులువుట్టిన రీతి దేహంబు కృశియించుఁ గలనైన నిద్దుర గలుగఁబోదు,
శివశివా! ధాత్రిఁ దా వలచిన వధూటిఁ బాయు వెత వద్దు సుమ్మెట్టి పలువకైన”
ఈ దుస్సహవిరహము చేతనే క్రుంగిపోయి, కవిసార్వభౌముఁడు తన కడపటి జీవితమును కష్టముతోఁ గడపియుండును.
పై పద్యములోని “తా వలచిన వధూటిని” ఎవతెయో ‘వాడవదినె’గా మహాత్ముల యశఃకాయమును హత్యచేయుటకుఁ బూనుకొను రసాభాస రసికనామధారులు చిత్రించుటకు ముందు, ‘వధూటి’ శబ్దనిర్వచనమును దఱచి చూడవలెనని మనవి. సామాన్య జారస్త్రీ విరహమునకైనఁ బై పద్యములో వర్ణితమయిన దురవస్థలన్ని యు నొక్కుమ్మడిగ వివేకవంతుఁడు, పరమేశ్వరభక్తుఁడు, మహాజ్ఞాని, పండితలోకసంభావితుఁడు నైన తిమ్మకవివంటి వానికి తటస్థించి యుండుననుకొనుట పరిహాసాస్పదము. అందులో నఱువది దాఁటిన వృద్ధుని విషయములో (89 ప. చూడుఁడు) భావించుట వెఱ్ఱితనము, ప్రకృతి విరుద్ధము. ఇక్కడ మఱియొక విషయముకూడ అప్రస్తుతము కాదు.
ఆ పద్యములో “పనులయందేమియు మనసు లేదు” అనుట చేతనే పత్నీవియోగానంతరము “కుక్కుటేశ్వరశతకము” పూర్తిచేయుటకు మనసు పాఱలేదని, యొకవేళ నట్లు పాఱినను, గడపటి పద్యములోని “తా వలచిన వధూటి” -జీవితము- అద్దములోవలెఁ దన కన్నులకుఁ దోఁచునప్పటికి దుఃఖావేగముచేత గంటము సాగక నిలిచిపోయియుండునని దృఢపడుచున్నది.
దీనిని బట్టి తిమ్మకవి క్రీ.శ. 1715లో వ్రాసిన రుక్మిణీపరిణయముతోఁ గుక్కుటేశ్వర శతకము నారంభించినాఁడు. కాని యది తలఁచుకొనినట్లుగ నొక్కనాఁటిలోఁగాని, లేదా యేవో కొన్నినాళ్లలోఁగాని వ్రాసినది కాదు. మఱి తన జీవితాంతమువఱకు నప్పుడప్పుడు తోఁచిన భావములను, స్వానుభవవిషయములతో గుదిగ్రుచ్చి వ్రాయుచు వచ్చినాఁడని, ఆ కారణముచేతనే చివరి యెనిమిది పద్యములు నట్లే నిలిచిపోయి, శతకసంఖ్యకు లోపము కలిగినదని నిశ్చయించుట సమంజసము. పాఠము
సీ. | శ్రీకరధవళాంగ, శ్రితజనావనసంగ, | |
తే. | శైలజానుంగ, నీకొక శతక మిపుడు | 1 |
సీ. | కొక్కుఁ జొక్కువయాళి జక్కి నెక్కెడి వేల్పు | |
తే. | నను గజాననుఁ డెపుడు నిన్ బొగడు కృతులఁ | 2 |
సీ. | గురుతరకౌండిన్యగోత్రపవిత్రుండ | |
తే. | తిమ్మకవిచంద్రుఁడను నేను దివిరి నీకు | 3 |
సీ. | కౌశిక కౌండిన్య కపిల కశ్యప కణ్వ | |
తే. | నిక్కముగ నిన్ను వర్ణింపనేర రనఁగ | 4 |
సీ. | దండముద్దండదోర్దండకోదండవి | |
| గోహర గోహీరదేహ, నీకు! | |
తే. | వందన ముదార దారుకావనమునీంద్ర | 5 |
సీ. | తపననందనభటోద్దండ చండభుజంగ | |
తే. | నైన వంచాక్షరిని భక్తి యతిశయిల్లఁ | 6 |
సీ. | అమరమస్తకకిరీటాంచిత మనోవిభా | |
| మరుదీశనీలోపమానమానితమహా | |
తే. | నీకు నతులు సమర్పించి నిష్ఠతోడఁ | 7 |
సీ. | అభవు నక్షయు నాద్యు నవ్యక్తు నవ్యయు | |
తే. | నహరహంబును నిను భక్తి నాత్మఁ దలఁచు | 8 |
సీ. | సర్వసర్వంసహాస్థలిశతాంగము గాఁగ | |
తే. | గూర్చి బారులు దీర్చి చిట్టార్చి పేర్చి | 9 |
సీ. | రక్షించితివి కదా రవిసూను బడఁదన్ని | |
తే. | నిగ్రహానుగ్రహప్రౌఢి నీకె కాక | 10 |
సీ. | పలుకుఁగ్రొన్ననఁబోఁడి కులుకు వీణియ మీట | |
తే. | సంతసము మీఱఁ గేరి సాయంతనమునఁ | |
| భూనుతవిలాస, పీఠికాపురనివాస, | 11 |
సీ. | అబ్జగర్భునకు లోకానీకనిర్మాణ | |
తే. | నహహ తావక పదసరోజార్చనావి | 12 |
సీ. | ధననాయకుడు నితాంతము బ్రియమిత్రుండు | |
తే. | గాఁగ నణిమాదిభూతులు గల్గు నీకుఁ | 13 |
సీ. | చెలిమి నోగిర యిడ్డ చిరితొండబత్తుని | |
తే. | శివశివా! నీవె యిటువలెఁ జేయునప్పు | 14 |
సీ. | దశశతాబ్దముల నిన్ దవిలి పూజించిన | |
తే. | బళిర జగముల నీవంటి భక్తిసులభుఁ | 15 |
సీ. | పుఱియలు పునుకలు నెఱియఁ బేర్లుగ వైచి | |
| పచ్చియేనుఁగుతోలు పైని గప్పి | |
తే. | మెలఁగుచుండియు భువనమంగళవిలాస | 16 |
సీ. | జంభాహితుని భుజాస్తంభనం బొనరించి | |
తే. | వీరభద్రావతార విహారలీలఁ | 17 |
సీ. | బాపని కొకస్వయంపాకాన కియలేక | |
| కడుగైనఁ దవుడైన విడిచివెట్టఁగలేక | |
తే. | ఖలుఁడు విత్తంబు గూర్చినఁ గట్టి కొట్టి | 18 |
సీ. | జారచోరులకు గంజాయికల్లులకును | |
తే. | సుకవిజనదేవతాగృహసూరివరుల | 19 |
సీ. | విధవాకుచంబులవిధమున ససి చెడ్డ | |
తే. | ధరణిఁ బరమనికృష్టుని దండనున్న | 20 |
సీ. | వేదశాస్త్రపురాణవిద్య లక్కఱగావు | |
తే. | నౌర యిక్కలికాలమహత్త్వమెంతొ | 21 |
సీ. | కాపుకవీశ్వరుల్ కంచఱయోగులు | |
తే. | భూతలంబునఁ గలిదోషహేతుకమునఁ | |
| భూనుతవిలాస, పీఠికాపురనివాస, | 22 |
సీ. | బొగ్గులఁ దైలంబు బుట్టింపగా వచ్చు | |
తే. | గాని తులువల డెందంబు గరగఁ జేయ | 23 |
సీ. | సల్లగా మాలదాసర సటారయగారి | |
తే. | గాని సీ యెద్దుమాంసుల కయితకంబు | 24 |
సీ. | అబ్బబ్బ కిందటేఁ డప్పయ్య తీర్తాన | |
తే. | నౌర తమకన్న కూసుగాఁ డవల నింకఁ | 25 |
సీ. | ఆసనబేదంబు లనుకొంటి సేనియా | |
తే. | యెంటఁబట్టిరి యబ్బబ్బ యేమి సేతు | 26 |
సీ. | మోటబొల్లెద్దుకు ముకుదాడు గట్టిన | |
| తడియాకుఁ గావలె తయ్యడాడు | |
తే. | పట్టిబుజములు గాలసబట్టెననెడు | 27 |
సీ. | బోలెఁడుగందంబు బొమలదాఁకా మెత్తి | |
తే. | సెడుగుబాపఁడు నాబంటుకొడు కబ్బబ్బ | 28 |
సీ. | బట్టయ్యగాళ్ళంట బబ్బాయువంటను | |
| కలయిర్పులెట్టి తొందరగాఁగ దండకాల్ | |
తే. | ఎంటఁ బట్టిరి గదరబ్బ యనెడు మూఢ | 29 |
సీ. | పాతపొత్తపుకట్ట సేత పట్టుకవచ్చి | |
తే. | సీ యితనికంటె సాకలిసెల్లిగాఁడు | 30 |
సీ. | కరణాలటంటను కైలకట్టల యిప్పి | |
తే. | దయ్యమా కాయకసరైన దక్కనియ్య | 31 |
సీ. | యెద్దుమందను గూర్చి యెగసాయమిడితేను | |
తే. | రహహ దందర మిటులయ్యె ననెడి మోటుఁ | 32 |
సీ. | కాకంబునకు రత్నఖచితపంజరమేల | |
తే. | పరమలోభికి నృపసభాప్రథితమహిమ | |
| భూనుతవిలాస, పీఠికాపురనివాస, | 33 |
సీ. | పొడవైన కారెనుబోఁతుఁ గన్గొని తేంట్లు | |
తే. | ధరణి నధముల దాంభికత్వములు చూచి | 34 |
సీ. | ఇల జొన్నఁ బడు గ్రుడ్డియెద్దు చాడ్పున మృదు | |
తే. | తస్కరుని చందమునఁ బదార్థములు మ్రుచ్చి | 35 |
సీ. | దేశాటనంబును దేవతోపాస్తియుఁ | |
తే. | గలిగి కవిరాజ రాజశేఖరులు మెచ్చు | 36 |
సీ. | అలికులవేణి సింహకిశోరనిభమధ్య | |
తే. | యనఁగ నెన్నిక గన్న లేయన్నుమిన్న | 37 |
సీ. | పతిని దైవమ యంచు మతి నెంచి యరయుచుఁ | |
| సత్యవాక్యనిరూఢి జరుపుచుండి | |
తే. | మెలఁగుచుండెడి యిల్లాలు కలుగవలయు | 38 |
సీ. | తనయింటి యర్థంబుఁ దానె మ్రుచ్చిలుదాని | |
తే. | తవిలి పదుగురుబిడ్డల తల్లియైన | 39 |
సీ. | జగడాలచీలి వేసాలవెల్లి బిసాళి | |
| నిక్కులబండి బందెలమారి కల్లల | |
తే. | నెన్నఁబడు బేరజపురండ నేలుచుండు | 40 |
సీ. | కిలకిల నగుచు ముద్దులు గుల్కు నొకవేళ | |
తే. | నౌర వింతలు భూమిపై నాఁడుదాని | 41 |
సీ. | ఒరులభాగ్యము సూచి యోర్వఁజాలనివాడు | |
తే. | ప్రోది చేసినవానితోఁ బోరువాఁడు | 42 |
సీ. | బహుపుత్రసంపత్తిఁ బ్రబలుచుండెడివారు | |
తే. | సప్తసంతానకర్త లీ సదమలాత్ము | 43 |
సీ. | వలవనిచెలువతో మెలగువాఁ డొకకూళ | |
తే. | కూడదన్నను గవితలఁ గూర్చి బలిమి | |
| భూనుతవిలాస, పీఠికాపురనివాస, | 44 |
సీ. | ఆరకూటములోన నపరంజి యిడినట్లు | |
తే. | తొడరి సుజనులు ధరణిలో దుర్జనులకుఁ | 45 |
సీ. | పరమలోభిని దివాకరతనూభవుఁ డంచు | |
తే. | కవులు కక్కూర్తి నిసుమంత కడుపు కొఱకు | 46 |
సీ. | పూదోఁటఁ గారెనుబోతు దూఱినయట్లు | |
తే. | వంగడంబున నొక క్రూరవర్తనుండు | 47 |
సీ. | కాకిమూఁకలలోనఁ గోకిలం బున్నట్లు | |
తే. | ధరణిఁ బెక్కండ్రు నీచవర్తనులలోన | 48 |
సీ. | చక్కెరలోఁ బిప్పి సంగతంబైనట్లు | |
| కనకంబునకు గామ కలిగినట్లు | |
తే. | ఘనున కొక నేరమించుక కలిగెనేని | 49 |
సీ. | కొఱగానిపంచమకులునైన నడిగించుఁ | |
తే. | ధరణిలోపల నకట పేదఱికమెంత | 50 |
సీ. | కులమున కెల్ల మిక్కిలితనం బొనఁగూడు | |
| కవిబుధవందిమాగధులచెల్మి ఘటించుఁ | |
తే. | గలియుగంబున నబ్బబ్బ కలిమివంటి | 51 |
సీ. | బంధుజాతములోన బహుమాన మెడలించు | |
తే. | నకట విద్యావిహీనత యంత కీడు | 52 |
సీ. | కడుపార ఘృతమాంసఖండముల్ కడు మెక్కి | |
తే. | నిక్కి మిక్కుటమైన యాదొక్కి బొక్కి | 53 |
సీ. | అనయమ్ము రాజ్యాంతమున నరకము ధ్రువ | |
తే. | కాని దుర్మతులయి ప్రజఁ గలంచి ధనముఁ | 54 |
సీ. | మరుమరీచికలు తామరసపత్రాంతర | |
తే. | సిరులు నిలుకడలని నమ్మి చెనఁటు లురక | |
| భూనుతవిలాస, పీఠికాపురనివాస, | 55 |
సీ. | భోగియై ప్రతిదినత్యాగియై పుణ్యసం | |
తే. | రాజ్యమేలంగఁ గలవాఁడె రాజు గాక | 56 |
సీ. | ఘూకంబు తెఱఁగున గొందుల నిరుకుచు | |
తే. | దనరు క్రూరనృపాలకాధముల నమ్మి | 57 |
సీ. | కోప మెక్కువ తాల్మి కొఱఁత కార్యము సున్న | |
తే. | ధర్మమతి తొట్టు నీ యిట్టి దుర్మదాంధ | 58 |
సీ. | అందలంబెక్కుట యవనిఁ బ్రశస్తమా | |
తే. | దొరతనంబున కివి గావు వరుస లరయ | 59 |
సీ. | దానవైఖరిని రాధాతనూభవుఁ బోలి | |
| సత్యంబునను హరిశ్చంద్రుఁ బోలి | |
తే. | సర్వసర్వంసహాభుజాధూర్వహుఁడు న | 60 |
సీ. | న్యాయంబు దప్పక నరులఁ గాపాడుచు | |
తే. | కాక తన పొట్టకై ప్రజఁ గలఁచు దురిత | 61 |
సీ. | మరుదనంగుడు శిబి మాంధాత భరతుండు | |
| దుష్యంతుఁ డతనిపుత్రుడు నలుండును పురు | |
తే. | ధర్మపద్ధతి నిల నేలి తారమైనఁ | 62 |
సీ. | మొదవుల బదివేలు కదుపులు గూర్చిన | |
తే. | కావున నొడళ్ళు నిల్కడల్ కావటంచుఁ | 63 |
సీ. | కొండంతవిత్తంబు గూడఁబెట్టిననైనఁ | |
తే. | దహహ డెందంబులోపల నంతకంత | 64 |
సీ. | నిరతాన్నదానవైఖరిఁ జెలంగెడివారు | |
తే. | తలఁపులోపల ననయంబు ధర్మకార్య | 65 |
సీ. | న్యాయపద్ధతి భూషణము ధరాధిపునకుఁ | |
తే. | బుధుల కెప్పుడు నీ పదాంభోజయుగళ | |
| భూనుతవిలాస, పీఠికాపురనివాస, | 66 |
సీ. | అంభోధి కభిషేక మాచరించినయట్లు | |
తే. | నిఖిలలోకైకభర్తకు నీకు నొక్క | 67 |
సీ. | నడచిపోవఁగ జవం బడరకుండుటఁ జేసి | |
తే. | కాని నిన్నొక్కమాఱైనఁ గడఁగి తలఁప | 68 |
సీ. | శతవత్సరంబులు జనులకుఁగా నాయు | |
తే. | కటకటా యెన్నఁడును దెల్వి గలిగి నిన్నుఁ | 69 |
సీ. | ప్రకృతి గుణంబులఁ బాసి షడ్వర్గంబు | |
తే. | లోనిచూపునఁ దగఁ దమలోనఁ గాంచి | 70 |
సీ. | వాయుభక్షణ చేసి వనటఁ గుందదె పాము | |
| కానలఁ దిరుగదే వానరంబు | |
తే. | యెన్ని తెఱఁగులఁ బొరలుచునున్న నిన్ను | 71 |
సీ. | పరుసంబువలన నబ్బురముగా లోహంబు | |
తే. | సద్గురుకృపాకటాక్షవీక్షణము వలన | 72 |
సీ. | మణిభూషణములు చామరములు ముత్యాల | |
| పల్లకీలు గుఱాలు బంట్లు బానిసలును | |
తే. | కులుకుప్రాయంపు ముద్దుగుమ్మలును గలిగి | 73 |
సీ. | దానహీనుండైన మానవాధము కల్మి | |
తే. | చిత్త మిగురొత్త నినుఁ బూజ సేయలేని | 74 |
సీ. | కుంభికుంభస్థలాక్షుద్రామిషము మెక్కు | |
తే. | ప్రభుభుజానీతభూరివైభవనిమగ్న | 75 |
సీ. | అడిగినప్పుడ తన యొడలి చర్మం బూడ్చి | |
తే. | కరయ వితరణశూరులైనట్టి ఘనులు | 76 |
సీ. | పురుషోత్తమము భద్రగిరి యహోబలము శ్రీ | |
తే. | మొదలుగాఁ గల పుణ్యభూములకుఁ జనఁగ | |
| భూనుతవిలాస, పీఠికాపురనివాస, | 77 |
సీ. | లవణాబ్ధి లంఘించు పవనాత్మజున కొక్క | |
తే. | సకలబ్రహ్మాండభాండరక్షణకలాభి | 78 |
సీ. | నదులలో జాహ్నవి నరులలో విప్రుండు | |
తే. | నెట్లు పూజ్యములయ్యె నట్లెల్లవేల్పు | 79 |
సీ. | నటుని పోల్కి ననేకనామరూపవిభేద | |
తే. | నిన్ను సేవింతు భావింతు సన్నుతింతుఁ | 80 |
సీ. | సాలెపుర్వునకుఁ కుంజరమున కహికిని | |
తే. | నీ మహత్త్వంబు పూని వర్ణింపఁ దరమె | 81 |
సీ. | ఆరకూటమ్ము బంగారమై యొప్పునే | |
| జిల్లేడు దేవతాక్షితిజ మగునె | |
తే. | రాజగునె జాగ్రదుడు దురాగ్రహముచేతఁ | 82 |
సీ. | జింక బొడ్డునఁ దావి జిల్లు కస్తురివోలె | |
తే. | జగతిలోపలఁ గారణజన్ము లొక్క | 83 |
సీ. | సిరికిఁ దోఁబుట్టువౌ జ్యేష్ఠామహాదేవి | |
| నలినాసనునకు మానసపుత్రుఁడైన ద | |
తే. | నిలను దుష్కర్మసహితుల కెట్టి గట్టి | 84 |
సీ. | గజముపై మహిషంబు కాలు ద్రవ్వెడునట్లు | |
తే. | క్రూరు లొక కొంద రసమానవైర మూని | 85 |
సీ. | పొద్దుపొద్దుకు వచ్చి పోలిబొట్లయ్య దా | |
తే. | మంచిదని సెప్పి సూకలు మానెఁ డన్ని | 86 |
సీ. | నింబభూజమునకు నిర్మలోదక మిడి | |
తే. | దుర్గుణున కెన్ని మంచి వస్తువులు పెట్టి | 87 |
సీ. | ఎనుబోతునకు విద్దె లెన్నింటి నేర్పిన | |
తే. | హీనుఁడగువాని సత్ప్రభు లెన్నిగతుల | |
| భూనుతవిలాస, పీఠికాపురనివాస, | 88 |
సీ. | నోరు చేఁదై కూడుగూరలు చవి దప్పు | |
తే. | మదిఁ దలంపగఁ గటకటా ముదిమియంత | 89 |
సీ. | బావిలోపలఁ బడ్డ పామును వెడలింపఁ | |
తే. | అవనిలోపల ఖలుని నెయ్యంబు మీఱ | 90 |
సీ. | ఘనగహనాంతరోద్గతతృణానీకంబు | |
తే. | కరిహయాందోళికారత్నకాంచనాదు | 91 |
సీ. | అన్నంబు నాలుక కరుచియై కన్పట్టు | |
తే. | శివశివా ధాత్రిఁ దా వలచిన వధూటిఁ | 92 |