కుంభరాణా (మీరాబాయి)/నాంది
కుంభ రాణా
[మీరాబాయి]
నాంది
శ్రీ రాధాసతి నేలినట్లు కరుణా
చిత్తంబునన్ దు:ఖ దు
ర్వారాంగ పరీక్షఁ దప్తయగు
మీరాబాయి చేపట్టి లో
కారాధ్యుండుగ నొప్పు మాధవుఁడు
మమ్మజ్ఞాన సంక్షుబ్ధ సం
సారంభోనిధిఁ గర్ణధారుఁడయి
మోక్షద్వీపముం జేర్చుతన్!