కాశీమజిలీకథలు/పదవ భాగము/219వ మజిలీ

యేనుఁగుల బలముగలుగునట్లు చేయుదుము. మమ్ముఁ గలిసినపిమ్మట బరమేశ్వరుఁడైన నాకుఁ జాలఁడని నీకొకగరువము గలుగఁగలదు. ఇందు నవనిధులు గలిగియున్నవి భాగ్యంబున నీకుఁగుబేరుఁడు సరిపడఁడు నీకిందుఁగొదవయేమున్నది. మేము నీకేది యభీష్టమో అట్లు మెలంగువారము మన్మధసాంమ్రాజ్యపట్టభద్రుండవై క్రీడింపుమని ప్రార్థించుచు నతనిమెడలోఁ బూవుదండలువైచిరి. పరిజనులందఱు కరతాళంబులు వాయించిరి.

తాళధ్వజుని రెండవకమారుఁడగుసుధన్వుండాకాంతాత్రితయముంబెండ్లియాడి యపూర్వక్రీడా వినోదములతోఁ గాలక్షేపముచేయుచుండెను.

అని యెఱింగించువఱకుఁ గాలాతీతమైనది పై థ తరువాయి మజిలీయందిట్లు చెప్పందొడంగెను.

___________

219 వ మజిలీ

రత్నావతికథ.

రత్నావతి! సుధన్వుడరిగిన రెండుదినములదనుక వారి కేమియుం జెప్పక మూఁడవనాఁ డాహారము దీసికొనిపోయియంతలో గ్రమ్మఱవచ్చి అయ్యో! అయ్యో! ఆబద్ధపురుషుఁడేమయ్యునో తెలియదు. అందులేడు తలుపులబీగములు పగులగొట్టఁబడియున్నవి. వచ్చిచూచుకొనుఁడని లోపలికివచ్చి కేకలువైచినది. ఆమాటలువిని తటాలునవచ్చి నరాంతకు డాగదులన్నియువెదకి వానింగానక పరితపించుచునక్కటా! వీడుగజదొంగవలెనున్నాడు. సామాన్యునకీ కవాటములబీగములు విడఁగొట్టశక్యమా? దొంగలతల్లికి నేడున భయ మనినట్లీయవమాన మెవ్వరికిఁ జెప్పరాదు. అసమర్ధుండ నాభార్యకోరికఁ దీరుపలేక పోయితినిగదా! రేపుసీమంతోత్సవ మాపిమఱియొక ముహూర్తముంచిన లంబోదరి మఱియొక నరకళేబరము సంపాదించునేమో అడిగివత్తుంగాక.

అనియాలోచించుకొనుచు మఱునాఁ డుదయమునకే లంజోదరియొద్దకుఁబోయెను. అదివానింజూచి బావా! మీయింటనేఁడు సీమంతోత్సవముకాదా? తీరుబడిగానుంటివేమి? నాపంపినమాంసము నిలవయున్నదా! వానినెప్పుడు చంపితిరి? అనియడిగినవాఁడు-తెల తెల్లఁబోవుచు నోసీ! నీవుపంపిన మానిసినిఁజంపక పెంపుడు పశువునకుంబోలె నాహారము దిట్టముగాఁ బెట్టించితిని. ఆమిండఁడు తెగబలిసి గండుమిగిలి మాకు తెలియకుండ నిన్న తాళములు విరుగగొట్టి పారిపోయెను, మాకర్మమునకు నీవేమిచేయుదువు? ముహూర్తము మార్చెద మరియొక నరవలలము సంపాదింపగలవా? అనియడిగిన నాదానవి కటకటంబడి యిట్లనియె. సీ. సీ. మీరెట్టిమూర్ఖులు వానికాలుసేతులు విరచి చావనీయక తగునాహారముపెట్టి పెండ్లికొడుకువలెఁ బోషించినఁ బాఱకుండునా ? రెండుసారులు మీకొఱకై కష్టపడితిని. ఇక మీకుపకారము సేయ జూలను. వాఁడెందుఁ బోఁగలడు రాజుగారికిఁ దెలియఁబరచి వానింబట్టి తెప్పింతు జూఁడుము కాని మీకు వానిమేనిమాంసము లభ్యము కాదు వేరొక తెరువాలోచించుకొనుఁడని పలికి నరాంతకునంపి యప్పుడేఱేనికొక చీఁటియిట్లు వ్రాసినది.

జయము మహారాజా జయము.

నిన్న నొకమనుష్యుఁడు యంత్రశిలాఫలకముమీఁదఁబడివెంటనేలేవబోయెను. అప్పుడు కుంభుండు దుడ్డుకఱ్ఱతో వానినెత్తిపైఁ గొట్టఁబోయిన వాఁడాదండములాగికొని కుంభునిఁజావమోది వాఁడు నేలంబడియుండ నాకుఁ గనంబడకుండ నెక్కడికో పారిపోయెను. ఇదివఱకిట్టి విచిత్రమెన్నఁడును జరిగియెఱుంగను. వాడెట్టిబలవంతుఁడో తెలియదు వానివెదకి పట్టించి తెప్పింపఁ గోరుచున్న దాన,

ఇట్లు మీపాదసేవకురాలు, లంబోదరి.

ఆజాబు కుంభునికిచ్చి రాజుగారియొద్ద కనిపినది. వాఁడాయుత్తరమును దీసికొనిపోవుచుండ దారిలో రాజపుత్రికయగు పద్మసేన పరిచారిక ద్విజట వానికెదురుపడినది. అదివానింగురుతుజూచి యోరీ!

నీవు నాఁడుమాకుఁ దోటలోఁగనంబడినవాఁడవుకావా! నీకొఱకేపోవుచుంటిని భర్తృదారికనిన్నుఁదీసి గొనిరమ్మన్నదిపోవుదమురమ్ము. అని పలికిన వాఁడు అమ్మా! నేనునాఁడుచూచిననాఁడనే అమ్మగారికి నామాట జ్ఞాపకమున్న దా! నాపనియేమివచ్చినదో! అట్లేవచ్చెదను. ఈ యుత్తరము రాజుగారికిచ్చి వచ్చెద నంతదనుక గడువీయుఁడని వేడుకొనియెను. ద్విజట యాచీటీయేదీ యిటు తే! యేమ వ్రాసిసదోచూచెదంగాకయనిలాగికొని విప్పిచదివి రా రమ్ము. ఈకమ్మలోనంతయగత్యమైనపని కనిపింపదు తరువాతఁబోవుదువుగాక. అని వానిబలవంతముగా శుద్ధాంతముసకుఁ దీసికొనిపోయి రాజపుత్రిక కత్తెఱం గెఱింగించినది.

అబోఁటిచీటింజదివికొని కుంభా వధ్యశిపైఁ బడినిన్నుఁజావమోదియెవ్వఁడో పారిపోయినట్లిందు వ్రాయఁబడియున్నది.వాడెన్ని యేండ్లవాడు. పోలికయెట్లున్నది. నిజముచెప్పుము. లేకున్ననిన్ను దండింపఁజేయుదునుచుమీ యనియడిగిన వాఁడుగడగడలాడుచు జోహారుచేసితల్లీ మీకడనబద్ధములాడుదునా? వాడుఅచ్చముగానాడు మీరు దీసికొని పోయినవానివలెనున్నాఁడు. వారిద్దఱు నన్నదమ్ములు గావచ్చును. అనియెఱింగిన రాజపుత్రిక విస్మయసంభ్రమములతో నిట్లనియె.

కుంభా! వాడుఱాతిమీఁదబడినతోడనే యెట్లులేచినిన్నుఁగొట్టగలిగెను? వాఁడంత బలంవంతుడా యేమి? అచ్చముగా నేమిజరిగినదియో చెప్పుము మాకంతయుఁ దెలిసినదిలే! నీవుదాచిన దాగునను కొంటివా యని అడిగినవాఁడు చేతులుజోడించి అమ్మా! నేనేమియుఁదప్పుజేసియెఱుంగను. మీరు వలదనిచెప్పినతర్వాత నట్టిపని చేయుదునా అంతయులంబోదరియేచేసినది మీరు తెలిసికొన వచ్చును. అమానిసి పది దినములక్రితమే వధ్యశిలపైఁబడియెను. వాడుసగముప్రాణములతోఁగొట్టుకొనుచుండ బడియతో బాదబోయిన లంబోదరి వారించి చంపనీయక యాకళేబరము వెనుకటివలెనే నరాంతకునింటికి దీసికొనిపొమ్మని నాకాజ్ఞాపించినది. మీపాదములతోడు నేనంగీకరింపలేదు. ఆరాత్రితానే వానిందీసుకొనిపోయి వారింటియొద్దనప్పగించినది. నానిచేతులుకాళ్లు విఱువక యొకయింటి లోఁబెట్టి గట్టిగా మేపిరట. ఒకనాఁడు బీగముల విఱుగఁగొట్టి యాజెట్టి తలుపులఁ దెఱుచుకొని మాఱుదారి నెక్కడికో పాఱిఁబోయెనఁట. నరాంతకుఁడువచ్చియాకథ చెప్పినంతలంబోదరితనకు మాటవచ్చునని యీమాదిరిగావ్రాసినది కాబోలు? ఇందునాతప్పేమి యున్నదో యాలోచింపుఁడు. మీశిక్షకుబాత్రుఁడ నగుదునని పలికిన నాకలికి యొక్కింతవిచారించి కుంభా !ఇందు నీవేమియునెఱుఁగవుకాని యీమాట దెలిసిన రాజుగారు నిన్నుఁగూడ శిక్షింపకమానఁడు. నీవజాబాయనయొద్దకుఁ దీసికొనిపోవలదు. ఇంటికిఁబొమ్ము, నేబుచ్చికొంటినని లంబోదరితోఁ జెప్పుము. అనివానినదలించి యింటికంపివేసినది.

పిమ్మట నాకొమ్మ ద్విజటతో నాలోచించినవార్త వీరవర్మ కెఱింగించి మీతమ్ముఁడు మీకంటె గండఁడువలెఁ దోచుచున్నాఁడు. ఱాతికట్టడములనడుమనుండి యెట్లుతప్పించుకొనిపోయెనో తెలియదు. వానివెదకి తెప్పింపకుండ నీచీటిలాగుకొంటిని. ఇఁకమీతమ్మునికేమియుభయముండదు. అనియోదార్చినవిని రాజపుత్రుఁడిట్లనియె,

ప్రేయసీ ! అతండు మాతమ్ముఁడగుట వాస్తవము వానిచేత నాయుధములేదు. ఆయింటిలోనుండి యెట్లు తప్పించుకొని పోఁగలడు? ఆమాట నాకు సత్యముగాఁ దోపలేదు. వానిం జంపితిని యిట్లు ప్రకటించిరేమోయని యనుమానముగానున్నది. వా రింటనున్న యాప్తులవలన నీరహస్యము తెలిసికొనవలయునని బోధించుటయు రాజ పుత్రిక యిట్లనియె. మనోహరా! మీరిందులకుఁ జింతింపవలదు. నేనందలి రహస్యము దెలిసికొందును వారింట నాసఖురాలొకతెయున్నది. దానివలన సమస్తము విదితముకాఁ గలదని పలికి యప్పుడే రత్నావతిని దీసికొనిరమ్మని ద్విజటనంపినది. అది వోయి రెండుగడియలకు నాయెల నాగను దీసికొనివచ్చినది. ఇరువురు నిట్లు సంభాషించుకొనిరి.

రాజపుత్రి - సఖీ! రత్నావతీ ! నీవీ నడుమగనంబడుటలేదేమి ? మననేస్తము మఱచితివా?

రత్నావతి – సరిసరి నీవట్లనరాదు. నీవు రాజపుత్రికవు మేము సేవకురాండ్రము నీతోమాకు సాటియా! నీ సెలవైనచో నిత్యమువచ్చి పాదసేవ చేయకపోదునా?

రాజపుత్రి - సఖీ! ఇందు సేవ్యసేవకన్యాయముతోఁ బనిలేదు. నేస్తమేకావలసినది. నీవంతగామన్నించిన నాకుఁగష్టముగానున్నది.

రత్నావతి – రత్నమునకుఁ గాచమునకు నెంతభేదమున్నదో నీకును మాకునంత తారతమ్యమున్నది నీవుగర్వశూన్యురాలవు కావున ని ట్లనుచున్నావు.

రాజ -- మైత్రిలోని హెచ్చుతగ్గులు విచారింపవలదనిచెప్ప లేదా.

రత్నావతి — దేవీ! విద్యచే ధనముచే రూపముచేతఁ గూడ నీతో మేమీడుకానేరము నీయనుగ్రహ కాంక్షులము ఆదరించి మాటాడితి విదియ పదివేలు.

రాజ -- నన్ను దేవీయనవలదు సఖీ! అనిపిలువుము సంతసించెదను.

రత్నా - నీహృదయశుద్ధి యట్టిది.

రాజ — నరాంతకుఁడు నీకు మేనత్తభర్తకాడా?

రత్నా - అవును మేము వారింటనే యుందుము.

రాజ -- నరాంతకుని భార్య గర్భవతియైనదఁట కాదా? అవును ఇదియే ప్రథమగర్భము చిరకాలమునకు వచ్చినది. రాజ - సీమంతోత్సవము జరిగినదియా?

రత్నా - లేదు. అగిపోయినది. మొన్న జరుగవలసినదే.

రాజ — ఆమె యేమికోరికలు కోరుచున్నది?

రత్నా — ఏమోతల్లీ! నాకంతగాఁ దెలియదు.

రాజ — ఇక్కడనే నీవు స్నేహభావము విడిచి మాట్లాడుచుంటివి. మాట వరుస కడిగితిని,

రత్నా - (ఇంచుక సంశయించుచు) నాకు వారితో నంతగాఁ గలియదు నాతో వారి రహస్యములు సెప్పరు.

రాజ - చెప్పకున్నను నింటిలో మాటలు తెలయవా!

రత్నా - (అంతర్గతంబున) ఓహో! ఈమెకు నిజము తెలిసినట్లున్నది. అందులకే గ్రుచ్చిగ్రుచ్చి యడుగుచున్నది. చెప్పకున్న మఱియొకలాగు తలంచును. కానిము (ప్ర) నరమాంసము కోరుచున్నదని సవసవగా విన్నాను,

రాజ - ఊ. ఆమాటవినియే నేనడిగితిని. నీవు నాఁతోఁ జెప్పుటకు సంశయించుచున్నావు.

రత్నావతి - అసలు మావాళ్ళకు నాయం దిష్టములేదు. నోరు మూసికొని యుందును. ఏమన్ననుతప్పే కనుక దాచితిని. దేవీ ! నాయపరాధము సైరింపుము.

రాజు - భయములేదు మఱి నరమాంసము దొఱకినదియా ?

రత్నా - దొఱకను దొఱకినది పోవనుఁభోయినది.

రాజ - ఎట్లుపోయినది?

రత్నా - వాఁడు బలవంతుడుతలుపులువిదళించి పాఱిపోయెను.

రాజ - సఖీ! ఆమాటయేనమ్మవీలులేకున్నది. ఆకథయంతయు వింటినికాని యామాటయె నమ్మదగిలేదు సగముచచ్చియున్న మనుష్యుడు ఇనుపతలుపుల విదళింపఁగలఁడా. ఇందేదియో రహస్య మున్నది. ఆరాత్రి చంపియేయిట్లనుచున్నా రేమోయనితోచుచున్నది.

రత్నావతి - రామరామ! అదివట్టియబద్ధముఎట్లైన నేమివాఁడు పాఱిపోయినమాట వాస్తవము.

రాజ — ఆరహస్యమే నాకుఁ దెలియవలసియున్నది.

రత్నా – కనుఁ గొని చెప్పెదనులెండి.

రాజ -- నీకు వివాహమెక్కడ నిశ్చయింపఁదలచినారు?

రత్నా — ఆమాట నన్నడుగవలదు నాప్రారబ్ధ మెట్లుండెనో అట్లుజరుగును హ్రస్వపాదునిపుత్రున కీయఁదలంచిరి కాని నాకిష్టములేదు.

రాజ — నీవుగూడ నాపుంతలోని కే వచ్చితివే.

రత్నా - నీకేమి? రాజపుత్రికవు స్వయంవరమున నీయిష్టము వచ్చినవాని నేఱుకొందువు. నాకెట్లు?

రాజు - నేనునీతోనిజము చెప్పుచున్నాను. రాక్షసులఁబెండ్లియాడను.

రత్నా – ఇఁక నాలుగుదినములలో స్వయంవరోత్సవ ముహూర్తమున్నదని చాటించుచుండ నట్లనియెదవేల?

రాజ - ఆచాటింపుచాటింపే. రాక్షసులవరింపను. ఇదియయథార్థము.

రత్నా — అసభకు రాక్షసులుగాక దేవతలు మనుష్యులు వత్తురాయేమి? అందెవ్వరినో యొకరిని వరింతువా?

రాజ - ముమ్మాటికిని వరింపను.

రత్నా - మఱియాస్వయంవరవిధి యేమిటికి?

రాజ - అది లాంఛనమునకే నీవు నాకత్యంతప్రియురాలవు కావున నీరహస్యము నీతోఁ జెప్పితిని.

రత్నా - మన మప్సరోజాతివారమగుట రక్కసులు వెక్కసముగాఁ దోచుదురు,

రాజ - అందులకేమనమైత్రియవ్యాజమైనదని చెప్పుచున్నాను. ఆపురుషునివృత్తాంతము తెలిసికొని యెప్పుడుచెప్పెదవు? రత్నా - ఎప్పుడోయననేల? ఇప్పుడే చెప్పెద. నిఁక దాఁప నేమిటికి (అని చెవిలో నిటునిటు)

రాజ -- అమ్మయ్య! నాహృదయ మిప్పటికిఁ జల్లఁబడినది.

రత్నా - నీకతనియందింత యనుకంప యేమిటికిగలిగినది. వాని నెఱుంగుదువా యేమి?

రాజ — ఆరహస్యమంతయు నీకు మఱొక్కప్పుడు తెలియజేసేదను. అనిమాట్లాడి యాచేడియవల్ల నారహస్యముదెలిసికొని సగౌరవముగా నామెననిపినది. ఇంతలో స్వయంవరమహోత్సవదివసము సమీసించినదనియు సన్నద్ధురాలవై యుండవలయుననియుఁదండ్రియొద్ద నుండి చీటివచ్చినది. ఆచీటితీసికొని వీరవర్మయొద్దకుఁబోయి నమస్కరించుచు రత్నావతివలనఁదెలిసికొనిన విషయంబు లన్నియు నెఱింగించి నీతమ్ముఁడు నీకంటె నున్నతస్థితియందున్నాఁడు, అతనికొఱకువిచారింపఁ బనిలేదు. మఱియు స్వయంవరము సమీపించినది. పాతాళలోకములలోనుండి పేరుపొందిన దానవులందఱు వచ్చుచున్నారట. కర్తవ్య మేమి? అనియడిగిన నతండు నవ్వుచు నీయిష్టమువచ్చిన మగని నేఱుకొనుటయేకర్తవ్యమని పరిహాసమాడుటయు నాయువతి చెవులు మూసికొని ఇది పరిహాససమయముగాదు. ఈయాపద యెట్లుదాటునని నాహృదయము పరితపించుచున్నది తగినయుపాయ మెఱింగింపుఁడని యడిగిన నతండు ప్రేయసీ! నీకుఁ బదిసారులు చెప్పవలయునా. ఇదివఱకు నీకెఱిఁగించియేయుంటిని. అట్లేచేయుము కార్యసిద్ధియగునని యుపదేశించెను. ఆమెయంగీకరించి యందులగుఱించియే వితర్కించుచుండెను.

పద్మసేన మిక్కిలి చక్కనిదని పాతాళలోకములన్నిట వాడుక మ్రోఁగియున్నది. రాక్షసులు సహజకామ క్రోధావిష్టులు తత్స్వయంవర ప్రకటనము వినినతోడనే చతురంగ బలసంయుక్తులై యయ్యతలమున కరుదెంచిరి. వజ్రకంఠుడు తనవీటి కరుదెంచిన రక్క సులకెల్ల భోజన భోజనాదివిధులకుఁ దగినసదుపాయము లపారముగాఁ గావింపఁజేసెను. దైవజ్ఞ నిర్దిష్ట సుముహూర్తమునకు మహిషాసుర ప్రముఖులెల్ల వచ్చి యాసభ నలంకరించిరి. పద్మసేనయు సముచిత భూషాంబరధారిణియై ద్విజటవెంటరా యధాకాలంబున కాసభాంతరాళముఁజేరి రాక్షసశ్రేష్ఠులనెల్లఁ గలయంగనుంగొని వారివారి వృత్తాంతములఁ దెలిసికొను కోరికతో నాసింహాసనశ్రేణీ మధ్యము నుండి మెల్లగా నడుచుచుండెను. అప్పుడు సర్వజ్ఞుండను రాక్షసపరివ్రాజకుండు త తద్యృత్తాంతముల నాకాంతామణికిట్లు చెప్పఁబూనెను.

సీ. నాతి! యీతఁడు కాలకేతుఁడు సర్వగీ
              ర్వాణదుర్దర్వ నిర్వాపణాత్ముఁ
    డతివ! యీతఁడు మహిషాసురుం డితని వి
             ఖ్యాతి సర్వజగంబులందు వెలయు
    చండముండులువీరె భండనంబున వీరి
             నవఘటింపఁగలేరు హరిహరాదు
    లువిద! శుంభ నిశుంబులురు బలాఢ్యులు వీరి
             పేరెన్నికొని నిద్రఁబోరుసురులు

గీ. వీఁడుభండాసురుం డతివీరుఁడితని
    తోడఁబోరాడు మగవాఁడులేడు మూఁడు
    లోకముల వాఁడె కను బాష్కలుండు మహిషు
    మంత్రి సర్వస్వతంత్రప్రమాణవేది.

అని యీరీతి నానారీతిలకమున కాపరివ్రాజకుండందున్న దానవశ్రేష్ఠుల కులళీలనామవిఖ్యాతు లెఱింగించుటయు నాలించియాచంచలాక్షిక్షణకాలమూరకుండి సభాసదులెల్లరువినసఖీఁ ముఖముగానిట్లు తెలియఁ జేసినది.

ఇందువచ్చిన రాత్రించరులెల్లఁ బ్రఖ్యాతులే కావచ్చును. ముఖ్యముగాఁ జూడఁదగినవి రూపము విద్య పరాక్రమము. రాక్షసజాతి కేరూపము పూజ్యముగదా. విద్యమాట యటుండనిండు. పరాక్రమము వితర్కింపఁదగియున్నది. ఇందఱలో లోకైకపరాక్రమశాలి యెవ్వఁడో లేచి నిలఁబడినచో వానికీరత్నమాల నర్పించుచున్న దాన నదియే మదీప్సితమని పలికించుటయు నారాక్షసవీరులెల్ల నొండొరులు మొగములు జూచుకొనువారును గుజగుజలాడువారును ఊర్ధ్వముఖులై యాలోచించువారునై యాకాలములో నెవ్వండు నేనని ప్రత్యుత్తరమిచ్చినవాఁడు లేకపోయెను.

అప్పుడు పద్మసేన యిందులకు మూడుదినములుగడువిచ్చితిని. ఈలోపలమీరాలోచించుకొని లోకైకవీరుండని యెల్లరు సమ్మతించిన వాఁడు నాకడకరుదెంచిన సన్మానింతునని పలుకుచు నారాజ పుత్రిక ద్విజటతోఁగూడ నాందోళికమెక్కి, యంతఃపురమునకరిగినది. కాలకేతుఁడు - (లేచి) ఓరాక్షసమిత్రులారా ! నాపరాక్రమము మీరందఱు నెఱింగినదే నేనులోకైకవీరుండననిచెప్పిన మీరంగీకరింతురా.

దుర్ముఖుఁడు – నీవు మహిషునికన్నను చండునికన్నను ముండునికన్న నధికుఁడవా యేమి ? వారి మ్రోల నీ వెంతవాఁడవు ?

తామ్రుఁడు - శుంభ నిశుంభాసురులుండ చండముండాసురుల ముందుగాఁ బేర్కొంటివేల?

దుర్ముఖుఁడు - చండముండులకన్న మహిషునికన్న శుంభ నిశుంభులధికులనియా నీయభిప్రాయము!

త్రాముఁడు - అవును సందేహమేల?

రక్తబీజుఁడు - మీయిరువురవాదములు నపరిజ్ఞాతృత్వంబును వెల్లడించుచున్నవి. జగదేకవీరుండు భండాసురుండుండ నొండువానిం బేర్కొందురేల?

చండుఁడు - రక్త బీజా! ఏమి నీక్రొవ్వు? మేమువీరులమనుట యపరిజ్ఞాతృత్వంబా! ఇంకొక్కమారట్లు పలుకుము, భండాసురుఁడు - చండా! నిలు నిలు. నీయుద్ధ పాండిత్యంబు మే మెఱుంగనిదికాదు. అనుచిత ప్రలాపంబు లాడక వెనుకముందు విచారించుము. (వాఁడామాటబదిసారు లనుచున్నాడు.)

మహిషాసురుఁడు -- ఏమిరా చండా! ప్రేలుచుంటివి? జగదేకవీరుఁడనేనుగానా? మదీయనిశాతశృంగ ఘాతంబు రుచిచూపనాయేమి?

భండా— పశువా! అట్లన నీకుశృంగభంగంబు చేయకుందునా? రా రమ్ము. రా రమ్ము.

ముండా - భండా! శృంగమువలన భంగము నీకే కలుగును నీవనినమాటసత్యమే.

ముండా - మాటలతోనేమి. ఇదిగోకాచికొనుడు మదీయదోర్దండ ప్రచండబలపాండిత్యంబు తేటపడ గదాదండంబు వేయుచున్నాననిలేచి భండాసురుంగొట్టెను. అదివానియురంబుత్రాకిశకలములైపో యనది వెంటనేలేచి యతండు ముండాసురు నురంబునఁ బిడికిటంబొడిచి మూర్ఛనొందించెను. అతనిపాటుఁజూచి భండాసురుఁడు చండునిం గలియఁబడియెను. ఇద్దఱకు చెడ్డముష్టియుద్ధము జరిగినది. అంతలో మహిషుండు రక్తబీజుండు తలవడి యొండొరులం గొట్టుకొనఁదొడంగిరి. అట్లె యందున్న రక్కసులెల్ల రెండుతెగలై బాహుయుద్ధంబునకుఁ బూనికొని దారుణముగా బోరఁదొడంగిరి. వజ్రకంఠునికిఁగూడ నందొకపక్షముజేరక తప్పినదికాదు. క్రమంబున నాసంగ్రామంబు సంకులమగుట స్వపక్షపరపక్షంబులు దెలియక దొరికినవానింబట్టుచుఁబట్టిన వానింజంపుచు మిగిలినవానిం గవియుచుఁ జేరినవానిం బొడుచుచు నొక్కనినైనఁ బోనీయక చిక్కఁబట్టి రక్కసులెల్ల ఘోరముగాఁ బోరిపోరి యర్ధదివసములో నొండొరులచేఁ జంపఁబడి నామావశిష్టులైపోయిరి.

వీరవర్మ యత్తెఱంగరసి శరశరాసనంబులందాల్చి తురగా రూఢుండై నంగ్రామరంగంబునకరిగి హతశేషులంబోనీక సాయకనికా యంబులంబఱపి పరలోకాతిధులంగావించెను. కుంటి గ్రుడ్డి వృద్ధుఁడుం దప్ప బేరుపొందినరక్కసుం డొక్కడును మిగిలియుండలేదు. వజ్రకంఠుడు గూడ వారితో మడియుటందెలిసి రాజపుత్రిక శోకింప వీరవర్మ నర్మాలాపములచే నూఱడించి యందుఁజచ్చినరాక్షసులగాత్రములనెల్లనగ్నిసాత్కృతము గావింపఁజేసి శుభముహూర్తంబున నాపద్మసేనతోఁ గూడ దద్రాజ్యలక్ష్మింబరిగ్రహించి మహా వైభవముతో సింహాసన మెక్కెను. అనియెఱింగించి . . . ఇట్లు చెప్పదొడంగెను.

_________

220 వ మజిలీ

అతల రాజ్యము

వీరవర్మ యతలరాజ్యమునకుఁ బట్టభద్రుండైనతోడనే యాపట్టణమంతయుఁదిరిగి యందలి యంత్రరహస్యములన్నియుం దెలిసికొనియెను. అందుఁబేరుపొందిన రక్కసులెవ్వరునులేరు. ఉన్న వారతనిభుజబలమునకు మించినవారుకారు. కావునఁ బట్టణవాసులెల్ల నతనికి దాసులై యతనిపరాక్రమగ్గించి కొలుచుచుండిరి. అన్నగరము దిక్పాలుర నగరములకన్న నెక్కువశోభగలిగి విశాలమై ప్రకాశించుచున్నది. అతండు దినమునకొక్క వీధివడువునఁ దిరుగుచు నందలివి శేషములఁ దెలిసికొనుచుండెను.

మఱియు భూవివరాంతమునందలి యంత్రశిలాఫలకముకడకరిగి యందుఁగావున్న లంబోదరీకుంభులవలనఁ దనతమ్ముఁడు సుధన్వుని వార్త కొంతవిని వారపకారము చేయఁదలంచినను నప్పుడు చంపక పోవుట యుపకారముచేసినట్లే తలంచుచు వాండ్రకుఁ గానుకలిప్పించి యందు దప్పించి మఱియొక చోటికనిపెను.

అందుఁబడినవారు మడియకుండ మెత్తనిపానుపులఁ బఱపించి