కాశీమజిలీకథలు/పండ్రెండవ భాగము/343వ మజిలీ
జేరెను. ఆ నగరము వెలుపల నా విమానమునుదిగి సమీపముననున్న నందివృక్ష శీతలచ్ఛాయకేఁగి యందుఁ బుండరీకుండు బ్రక్క నుదయసుందరియును నెదురఁ దారావళియునుండఁ గూర్చుండెను. పిమ్మట విమానరూపమును విడచి దివ్యాకృతిం బూని మాయాబలుండు కృతాంజలియై వారియెదుట నిలిచి యిట్లనియె.
దేవా ! అటుచూడుము. కోఁతిం దరుముకొనిపోయిన మన భూనాధుండు దానుగోరిన తరుణీమణి నెచ్చటనో లభింప నామెం దోఁడ్కొని తిరిగి యేతెంచియున్న వాఁడని జెప్పికొనుచుఁ బరుగుపరుగున బరిజనులెల్ల నిం దఱుదెంచుచున్నారు. కావున నోక్షితిపాల పుంగవా! నన్నిందే విడచిపపెట్టుము. నీవు తలంచికొనినంతనే నే నెవరి కిని జెప్పకుండ త్వరితగతి నేతెంచితిని. నీ వియోగంబున నెంతకాలము మసలితినో యెఱుంగను. ఇందులకుఁ బ్రభువగు విభీషణుఁ డేమని తలంచుచున్నాఁడో తెలియదు. అని పలుకుచు వానిమాటల నాదరించి యా ధాత్రీశ్వరుండు నావాంఛితమెల్ల సమకూర్ప గలిగిన నీకేమి పారితోషిక మొసఁగగలను ? వలసినప్పుడు నా శరీరమే నీ యధీన మొనరింపఁగలవాడనని యత్యంత స్నేహభావంబున వచించి యా రాత్రించరుని వీడ్కొల్పెను.
ఇంతలో నలువైపులనుండి యత్యంతానందమునఁ బురజనులు గుంపులు గుంపులుగా నచ్చోటి కరుదెంచసాఁగిరి గ్రమంబున మంత్రిసామంత హిత పురోహిత బృందమెల్ల నేతెంచెను. ఛత్రచామరాది రాజలాంఛనములెల్ల గైకొని సకలపరివార మేతెంచెను. అందఱికన్న ముందుగఁ గుమారకేసరి ఱేనిసమీపముకఱిగి వానికి నమ స్కరించి జరిగిన వృత్తాంతమెల్ల దెలిసికొనెను. పిదప నా చక్రవర్తి యెల్ల వారిని దగిన రీతి నాదరించి యుదయసుందరితో భద్రదంతావళం బధిష్టించి ముందు మంగళధ్వనులు జలరేగుచుండ మహావైభవంబున బురప్రవేశ మొనరించెను.
అట్లు వారేఁగుచుండ వారిని జూచువేడ్కచే విలాస వ్యాపారములనెల్ల విసర్జింను యతిరయంబునఁ బరువెత్తుకొనివచ్చి కామినీలోకము సౌధశిఖరములయందును గవాక్షములయందును దోరణ ద్వారములయందును నిల్చియుండిరి. అమ్మహారాజు ప్రియురాలితో నాపురవీధుల నూరేఁగును. నూరిజనులచే ననేకవిధంబులఁ బొగడ బడుచు ప్రకృతివర్గమువలన నభినందింపబడుచు, బ్రతి గృహద్వారము మ్రోలను బుణ్యస్త్రీలవలన నీరాజనంబులఁ వడయుచుఁ, బౌరజన సువాసినీ బృందము మధుర మంగళగీతములఁ బాడుచుండ, వందిజనులొనర్చు జయధ్వానము నింగి ముట్టుచుండ దేవేంద్రవైభవంబున వివిధమణి తోరణోపచార చర్చితంబయిన రాజమందిరమును ప్రవేశించెను.
343 వ మజిలీ
మఱునాఁడు సాయంకాలమున బుండరీక రాజేంద్రుండు కమారకేసరి వెంటరా నుదయసుందరీ తారావళులతో బ్రాంతవిహారశైలంబునకఱుగ బయలుదేరెను. తారావళియు నుదయసుందరియు నొక్కయశ్వశకటమునందును తానును కుమార కేసరియు నొక్క యశ్వశకటమందును గూర్చుండి ప్రాంతవిహారశైలంబున నశ్వ శకటంబులనుండి దిగి కుమారకేసరిపైఁ జేయూని ఉదయసుందరీ తారావళులు తోడురా పచ్చికబయళ్ళతో నికుంజమంజరులతో సాంద్రద్రుమసందోహములతో నతిసుందర మగు కుసుమ సుందరమును విలాసోద్యానమునందలి దివ్యమాణిక్య మందిరంబున బ్రవేశించిరి.
ఇంతలో పాతాళంబునుండి వైవాహికపరికరములతో కతిపరి పరివారములతో ప్రభువగు శిఖండతిలకుని యానతిని తారావళిజనకుండు రత్నమౌళి యచ్చటి కేతెం చెను. అతండు తాదెచ్చిన బహువిధ దివ్యాభరణంబులు నుదయసుందరికొసంగి నరలోక దుర్లభంబగు వస్తుజాతమెల్ల నా రాజేంద్రున కొసంగి దంభోళివలన మీ సంబంధము శిఖండతిలకుం డెఱింగి బంధుజనంబుతో నధికానందంబునొంది యామో దించెనని పల్కుచు వారికి యధావిధిగ పరిణయమొనర్చెను. పిదప రాజానతిని తన కూఁతురు తారావాళి కుమారకేసరి కొసంగి యతివైభవంబున నచటనే వివాహం బొనర్చెను. పిదప రత్నమౌళి యా రాజేంద్రునిచేత వివిధ సత్కారంబులం బొంది యుదయసుందరి యొనర్చు తప్పులనెల్ల క్షమించుచుండుమని రాజేంద్రునివేడి రాజు హృదయానుకూల ప్రవర్తనంబున నుండమని యుదయసుందరికిం బోధించి యుదయ సుందరి ననవరతము హితం బొనర్చుచుండుమని తారావళికిఁజెప్పి తారావళి ననురా గంబున నేలుకొమ్మని కమారకేసరిని ప్రార్థించి, వీరినందఱను వీక్షించుభారము నీ యందే యున్నదని వెండియు, రాజును బ్రార్థించి వారినెల్ల వీడ్కొని పాతాళంబున కేగెను.
గోపా ! వినుము వైకుంఠ సభయందు గరళకంఠునిచే శపులైన నింద్ర చంద్రులే పుండరీక కుమారకేసరులై జన్మించిరి. పార్వతిశాపంబున నహల్యాతారలు పాతాళంబున యుదయసుందరీ తారావళులుగా జన్మించి భూలోకంబున కష్టపరంపర లకు లోనై పుండరీక కుమారకేసరులను వివాహమాడి మరియు ఉత్తర జన్మంబున గంధర్వలోకంబున హంసునకు ఉదయసుందరియే మహాశ్వేతగను చిత్రరధునకు తారా వళియే కాదంబరిగను నీశ్వరీ వరప్రసాదంబున జన్మించి కాదంబరీ మహాశ్వేతలు యింద్రచంద్రుల రూపాంతరంబునను చంద్రాపీడ పుండరీకుల వరించి వివాహమాడి సంతానము బడసినంతనే నారాయణ వరప్రసాదంబున శాపంబుదొలఁగి యధాస్థితిగ బొందుదురు. చంద్రుఁడు శాపగ్రస్తుడైన కతంబున నతనిభార్య రోహిణి నతని ననుస రించి పూర్వభవంబున మధుర యను పురంబున కుమారకేసరి భార్యగను ఉత్తర జన్మంబున చంద్రాపీడుని తాంబూలరండవాహినగనుండి రూపాంతరములనున్న
భర్తకు శుశ్రూష యొనర్చెను.
క. అని చెప్పిన విని గోపుఁడు
ఘనవిస్మయ సుప్రహర్ష కలితాత్ముండై
ప్రణుతించెఁ దపసి తపసియు
జనియెం దదనంతరావసధమున కంతన్.
340 వ మజిలీ
క. శ్రీ పార్వతీ మనోహర !
లోపాముద్రేశ్వరేంద్ర ! లోలార్క సమ
ర్చాపర ! విశ్వేశ్వర ! కా
శీపురపరిపాల ! దుష్ట శిక్షాశీలా !
దేవా ! అవధరింపుమట్లు మణిసిద్ధ యతీంద్రుఁడు గోపశిష్యునితో గాశీ యాత్రఁ గావింపుచు గ్రమంబున చతుశ్చత్వార్యధిక త్రిశతి తమ నివాస స్టానంబుఁ జేరి నిత్యానుష్టానంబులఁ దీర్చుకొని భుక్తోపవిష్టుండై శిష్యునిరాక నరయుచున్నంతలో నగ్గోపాలుఁడు వచ్చి యయ్యవారికి నమస్కరించుచు నిట్లనియె.
శా. సామీ ! కాశికి నెంతకాలమునకున్ సాగంగనౌ మీ కటా
క్షామూల్యద్యుతిఁ జేసి లోకమున విఖ్యాతంబులై నెన్ని యేఁ
బ్రామాణ్వంబులతో మహో త్తర కథల్ పాటించి నే వింటిఁ గా
శీ మహాత్మ్యమికన్ వినం దలచితిన్ జెప్పంగదే యొప్పుగన్.
అనిన విని గురుండు వాని సౌశీల్యంబులకు మెచ్చుకొని గోపా! లే ! లెమ్ము ! వేళ మిగిలినది భుజింపుము. నీ వడిగిన యర్థంబులు చెప్పెద ననుటయు గోపాలుండును సావడివచ్చి యొజ్జల పాదంబులనొత్తుచు శుశ్రూషఁ జేయుచుండ మణిసిద్ధ యతీంద్రుఁడు నమ్మణివిశేషంబున నంతయుఁ దెలిసికొని యిట్లనియె. గోపా ! నీ ప్రశ్న వృధాకాదు. దీనవైళ్వానర నిరృతి వరుణాది దిక్పతుల పూర్వోదంతము దెలియఁవచ్చెడిని వినుము.
పింగాక్షునికథ
వింద్యపర్వత ప్రాంతారణ్యంబున నొక లోయపల్లెగలదు.. దాని కధినాయ కుండై పింగాక్షుండను బోయదొఱ పరిపాలించుచుండెను. కాశికిఁ బోవు తైర్థికు లామార్గంబుననే బోవుచు నీ బోయపల్లె పజ్జంగల చెఱువు సమీపమున విరాజిల్లు తింత్రిణీవృక్షమునక్రింద బసచేయు నలవాటు గలదు. అ చుట్టుపక్కల నెందును జలా శయము లేమి కునికి యీ మజిలీ యాత్రాపకులకు రాకపోకలయందు తప్పనిదయ్యె అచ్చట ముష్కరులగు కిరాతులవలన దోపుడు భయం బెక్కువగా గలిగియుండుట చేత యాత్రాపరులు పెద్ద పెద్ద జట్టులుగా జేరగాని యా మజిలీ దాటజాలరు. అది దాటిన సుఖముగా నిఁకఁ గాశి జేరవచ్చునని సంతోషించుచుందురు.
అట్టి దారుణారణ్యమార్గం బనుసరించి యొకనా డొక భిక్షుకుండు బోవు చుండుటయును నచ్చటి శబరులు గొందరు వాని చుట్టు ముట్టడించి యోరీ ! నీయొద్ద నున్న ముల్లె నిందు బెట్టుము. లేకున్న నీతల యెగిరిపడునని రూక్షముగా బలుక సాగిరి. వారిమాటల కా బాటసారి యించుకయు వెరువక “శబరులారా ! బిక్షుకుండ నగు నాయొద్ద నేముండును. ఈ పులితోలు, వెదురుకర్ర, లాతము, మట్టిచిప్ప, జేబురు గుడ్డలు మాత్రమే నాయొద్దగల ధనములు దీనిం గావలసిన బుచ్చుకొని యుపయోగించు కొనుఁడు. ఈ మజిలీ వెనుకటినుండి గడుదీర్ఘమగుటచేతను నెదుర నెందును జనపదం బులు లేకుండుటచేతను భిక్షుకుదరక నా మనంబున గమనాయాసంబున మిగుల తహ తహం బడుచుంటిని మీకు మంచి పుణ్యమురాగలదు. నన్ను మీ పల్లెకు గొనిపోయి యిన్ని గోక్షీరములైన ద్రావనిచ్చి పుణ్యంబు గట్టుకొనుడు” అని బలుకుచున్న యా బైరాగిం జూచి యా యాటవికులు నవ్వాపుకొనుచు నిట్లనిరి. "బిచ్చగాడా ! నీ ముచ్చటలు గడు విచిత్రములుగా నున్నవే ? దారులగాచి బాటసారుల దోచుకొను మా యొద్ద నేమైన గుంజులాడ బ్రయత్నించుచున్నట్లున్నది. నీ మాటలనమ్మి మోస పోవువా రిందెవ్వరును లేరు. మ్రుచ్చుల మోసగించుటకు రొక్కము జిక్కములలో బెట్టి మొలకు జుట్టుకొని యేమియు దేనట్లు నటించువారి నెందఱ మే మింతవరకు జూచి యుండలేదు. చేత గాసైన లేకుండఁ బొరుగూరికి బోవువారెందైన నుందురా ! పెక్కు మాటలు మాని నీయొద్దనున్న దేమో యిచ్చటఁ బెట్టుము. లేకున్న బలవంతముగఁ బైఁబడి లాగికొందుము” అని పలికెను. మరియొకడు మాటలవలన సొమ్మూడి పడు నటరా ! యనుచు చేతనున్న దుడ్డుకఱ్ఱతో నా జటిలుని నడినెత్తిమీదఁ గొట్టెను. తోడనే యయ్యతి హరాహరా ! హా ! కాశీవిశ్వేశ్వరా ! యని యఱచుచు స్మృతిదప్పి నేలఁ బడెను.
ఆ తెక్కలికాండ్రు వానియొద్ద నేమైన రొక్కమున్నదేమో యని వాని బెద్దగా పరిశీలించిరి. గాని వారికేమియు దొరికినదికాదు. చచ్చినవాఁడు చేతఁ గాసై నను బట్టుకుని రాకుండ మనల నందరను వృధాగా శ్రమబెట్టెనని విసిగికొనుచు నా భిక్షుకుని కళేబర మా మార్గమధ్యమందే పడవైచి వచ్చినదారింబట్టి యెందేనిఁబోయిరి. ఇంతలో బింగాక్షుండు దైవికముగా నాదారింబోవుచు యందు మృతుఁడైనట్లు పడి యున్న యాపారికాంక్షి వీక్షింక్షి యక్కజంపడుచు సన్నిధి కేతెంచి వాని యౌదలఁ గల గాయమును గనిపెట్టి యిప్పుడే యెవ్వరో వానిగొట్టిపోయిరని నిశ్చయించి యెద్దియో యాకుదెచ్చి దానిరసము నా గాయముపై బిండెను. కొంతసేపటి కాజటిలునకు చైతన్యము కలిగినది. ఆ భిల్లపరివృధుండి పంచు. వానిసన్నిధినేయుండి తగిన యుపచారములు సేవకు లచే జేయించుచుండ తెలివివచ్చి యా భిక్షుకుండు దాహము దాహమని హస్తసౌంజ్ఞల జేయుచు దెలియజేసెను. తోడనే నిర్మలోదకము తెప్పించి వాని కిచ్చిరి. పిమ్మట కొంత సేపటికి స్వస్థత గలిగి లేచి కూర్చుని యా పింగాక్షుంగాంచి యల్లన నిట్లనియె.
మహారణ్యంబున దోఁపుడుగాండ్రచే మ్రద్దింపఁబడి దిక్కులేక పడియున్న నన్ను నీ వెవ్వఁడవో దేవునివలెవచ్చి కాపాడితివి. సమయమునకు నీవు రాకున్న నే నీపాటికా దెబ్బతోఁ బరలోకమునకు బోవలసినదే ? నాకు నీవు ప్రాణదాతవై మిక్కిలి సుకృతము గడించితివి. నీ వృత్తాంతము విన కుతూహల వడుచున్నానని బలుకుటయు నా భిల్లనాయకుం డిట్లనియె.
అయ్యా ! నేనీపల్లెకు యెకిమీడుండను. శబరుండను పింగాక్షుండనువాఁ డను. నేటి యుదయమున నీప్రాంత కాంతారములకు మృగయావినోదంబున బోయి తిరిగివచ్చుచు మార్గమందు స్మృతిదప్పి వపడియున్న మిమ్ముజూచి యొక యోషధీవిశే షంబున మీ గాయమును కుదిర్చితిని. మీరు పునర్జీవితులయగుటయు నాకెంతేని సంతో షముగా నున్నది. మీ రెందేగుచు నిందు వచ్చి యీవిధమున బాధపడితిరి. మిమ్ము గొట్టినవా రెవ్వరని యడిగిన నాజటిలుం డిట్లనియెను.
ప్రాణదాతా ! నీయవ్యాజ కరుణాకటాక్షంబుల దెంతేని గొనియాడగలను. నీవుజేసిన యుపకారం బీజన్మావధిలో నెన్నఁడును మఱువఁజాలను. నేనొక విరక్తుం డను. కాశికింబోయి యందు విశ్వనాధుని సందర్శించుటకు నేనీదారిం జనుచుంటిని. వెనుకటి మజిలీయందు కొందరు పుణ్యాత్ములు నన్నీమార్గంబున నొంటరిగా బోగూడ దనియు నట్లుపోయిన దొంగలవలన నపాయము వచ్చుననియు నెంత చెప్పినను వినక దొంగలు నన్నేమిచేయగలరు ? వారివలన నాకెట్టి భయము కలుగదని విశ్వేశ్వర సంద ర్శనలాలసుండనై వారిమాటలం ద్రోసిపుచ్చి వచ్చితిని. ఇచ్చటికిఁ జేరుసరికి గొందరు మన్నెగాండ్రు వచ్చి నన్నాటంకపెట్టి నాయొద్ద నేమియులేదని నేనెంతజెప్పినను వినక నన్నుఁ జావఁగొట్టి, పిదప వారేమైరొ నాకుఁ దెలియదు. నీవలన నేను బ్రతికితిని. ఇదియే నా వృత్తాంతము. నే నిప్పుడు మిగుల క్షుద్బాధా పీడితుడనై యుంటిని. తినుట కేమయిన నిచ్చి నన్ను రక్షించి కాశికిఁ బంపుము ఆ కాశీ సందర్శనంబున గలుగు సుకృతంబున నీకర్థభాగ మిచ్చుచున్నానని బలుకుటయును నా భిల్లపతి యప్పుడే కొంద ఱంబంపి కొన్ని ఫలంబులను గోక్షీరంబులను దెప్పెంచి వానికిచ్చెను. ఆ ఫలంబులఁ దిని యాపాలను ద్రావినంత మేనికి బలము గలుగగనేలేచి యా బోయదొరతో వాని గృహమునకేగి వాని యనుమతంబున కొంతకాల మందు విశ్రమించెను. ఆ జటిలున కారోగ్యము కుదిరినకొలఁది మేనిక జవసత్వములు వృద్దిపొందసాగినవి. పిమ్మట నా యతి యొకనాఁడు పింగాక్షునితో చపాన పింగల యెకిసీనా & సీయి
యులోగ్వవంతిన పతన. ఇ? నారు.గా శరింటో. నాపాపము పటాపంచ లయ్యెను. భవద్దర్శనమాత్రంబుననే తుచ్చముఖంబులపై నస హ్యమును మోక్షముపై నపేక్షయు గలిగినది. దుఃఖబహుళంబగు నీ సంసారమునందు బడియుండుటకు నాకిష్టము లేకున్నది మీతో నేను కాశికిం జనుదెంతును. నన్ను వెంటఁదీసికొనిపోయి మోక్షమార్గంబుఁ జూపింపుఁడు యిదియే నాప్రార్దన యని వేడు కొనుటయు నా పరివ్రాజకుం డల్లన నవ్వుచు నిట్లనియె.
భిల్లతల్లజా ! నీమంచిబుద్ది కేనంతయు సంతసించితిని. కాశికిం బోవుట యనేక జన్మసుకృతపరిపాకంబునంగాని లభింపజాలదు. ఇందుల కొక యితిహాసము గల దాకర్ణింపుము.
341 వ మజిలీ
ధనంజయుని కథ
దక్షిణాపథంబున సేతుబంధ సమీపమున నొక్కగ్రామంబున ధనంజయుఁ డను వైశ్యోత్తముండు గలఁడు. అతనితండ్రి చిన్నతనమందే పరలోకమున కేగెను. వానితల్లి భర్త లేనిచింత నొకమూలకు ద్రోసివేసి కుమారున కేలోపము రాకుండ బోషించుచు విద్యాబుద్ధులు చెప్పించి యుక్తవయస్సున తగిన సంబంధముదెచ్చి పెండ్లి చేసెను. ధనంజయుండు విశేషధనవంతుడు గాకపోయినను గృహకృత్యంబున కిబ్బంది పడకుండ వర్తకమున ధన సమార్జనం బొనరించుచు మాతృసేవా పరతంత్రుఁడై మంచివాడుకలోనికి వచ్చెను. వానితల్లికి పిన్ననాటినుండియును గాశి కేగవలయునని యుత్సాహముండునది. ధనలోపంబున గొన్ని నాళ్ళు తీసుకొని వెళ్ళువారులేక కొన్ని దినంబులును, మంచితోడు గుదిరినపుడు, బోవచ్చునను నుపేక్షచేత గొన్నినాళ్ళును వ్యాధిగ్రస్తురా లగుటంజేసి కొంతకాలము, నన్నియు సమకూరిన నప్పటి కేదియో యాటంకముచేతను ప్రయాణము నిలుపుచేయుచు నొకప్పుడు మనుమరాలి పురుటి దినంబులనియు నింకొకప్పుడు మనుమని వివాహమనియు నిట్లెప్పటికప్పుడెద్దియో యొక యభ్యంతరము వచ్చుచునే యుండెను. కాని యెప్పటికిని యామెకోరిక తీరినదికాదు. ఇంతలో వార్ధక్యము పెనుభూతమువలె వచ్చి మీఁదబడినది. కన్నుచూపు తగ్గినది. రదసంబులశక్తి సన్నగిల్లినది. దేహంబున వణకుబుట్టినది. శ్రోత్రేంద్రియవ్యాపారము క్షీణించినది. అహారము తగ్గినది. ఒడలిలో రోగ మంకురించినది. ఇట్లుండినను నా యిల్లాలికిఁ గాశికిపోవలెనను కుతూహలము పోలేదు. నిత్యమును కుమారునితో నాయనా ! నన్నెట్లేని గాశికింజేర్చి యొక్కమారు గంగాస్నానంబు జేయించవా ! యని దీనురాలై చేప్పుచుండునది. కుమారుడును అమ్మా ! నీదేహమున స్వస్థత గలుగఁగానే తప్పక కాశీయాత్రఁ జేయించెదనని ప్రత్యుత్తరం బొసంగుచుండెను. ఇంతలో వ్యాధిముదిరినది. కృతాంతకుం డెంతటి కఠినహృదయుండో కాని యాయవ్వ కోరిక దీరకుండగనే మించిపోయినట్లు కక్షవహించినట్టు యామెప్రాణంబుల నీడ్పించు కొనిపోయెను. మృతినొందిన జనయిత్రింగాంచి యాకుమారుడు గాశికిబోవలయునను నీకోర్కె దీర్పఁజాలనైతినిగదాయని మిక్కిలి విచారించుచు తల్లి యపరక్రియల విధ్యుక్తంబుగ నొనరించి యామె యస్థులనైనం గంగలో గలిపి తల్లి కోరికనుదీర్చి కృతకృత్యుండ నగుదునని దలంచి యామె కీకస శకంబుల సంగ్రహించి వస్త్రంబున జుట్టి పదిలముగా రాగిపెట్టైలోఁబెట్టి తాళమువైచి గాశికిఁ బయనమై యాపెట్టె మోసి కొని యొక్కరుండునుఁ బోయెను.
అట్లుపోయి పెరగిరివననదీపట్టణంబుల దాటుచు నెడద నెడద గమనా యాసంబుదీర నాగుచు నతికష్టంబున నాపేటికఁబూని కొన్ని పయనంబుల సాగించెను. అందొకపల్లెలో నొకభిల్లుని కూలి కేర్పాటు చేసికొని యా పెట్టె వానిచేత మోయించు కొనుచు మార్గంబున ననేక బాధలఁబడుచు నెట్టకేలకుఁ గొన్నిమాసములకు గాశీపట్ట ణంబుఁ జేర గలిగెను. అందొక వణిజునింట బసజేసి యంగడికింబోయి వలయు పదా ర్థంబులఁ గొనివత్తుననిచెప్పి యాభిల్లు నందుండ నియమించి పోయెను.
ఇంతలో నాపునిందుఁ డా పేటికభారమునుబట్టి యందు ధన మున్నదని తలంచి యాధనంజయుఁడు మగుడి వచ్చులోపల పెట్టెతో మాయమయ్యెను. ఆ వైశ్యు డును వలయు పదార్దములన్నియుఁ గొని వచ్చి యందాశబరుని గానక తల్లి యస్థులు గల నాపేటికతో వాఁడు పోవుటకు దల్లడిల్లుచు నాయస్థులు గల నాపేటికతో వాఁడు పోవుటకు దల్ల డిల్లుచు నాయస్థుల గంగలోగలుపజాల నైతినే యని పరిపరివిధంబుల విల పించుచు వాఁ డా పెట్టెలో ధనమున్నదని దలంచి యట్లపహరించుకొని పోయెనని నిశ్చయించి యెట్లయినను వానింగని పెట్టి యాయస్థులందెచ్చి గంగలోకలిపి మాతృ ఋణము దీర్పువలయునని తలంచి యప్పుడే యతండు మున్ను దానుజూచిన యా బోయపల్లెకు బ్రయాణమై పోయెను.
ధనంజయు డట్లు బోయపల్లెకు మిగుల శ్రమంబుల నరిగ యందాచెంచు వాని గృహంబుజేరి వానింజేరినంత గురుతుపట్టి యా యాటవికుండు భయంపడి దాగి యుండి తనభార్యకు చెప్పవలసిన విధంబంతయును బోధించి యావలకుం బంపెను. ఆ చెంచతయును ధనంజయుని సన్నిధి కేతెంచి తనభర్త యింటలేడనియు మీతో గాశికి వచ్చిన నాటంగోలె వాఁడు తిరిగి రాలేదనియు జెప్పుచు అయ్యా! మీరిందొక్కరే వచ్చితిరేమి? నాభర్త యేమయ్యెనని యెదురు ప్రశ్నింప దొడంగినది.
కోమటి దాని యాకార చేష్ఠాప్రకారంబంతయుఁజూచి అది యసత్యమాడు చుండెనని గ్రహించి మంచిమాటలచే దానివలన వాని యునికిదెలిసికొనవలెనని యెంచి, యోసీ ! నీమగ డింత పిరికివాఁ డయ్యెనేమి? అంతదూరము నాతో కష్టపడి వచ్చియు కూలియైన బుచ్చుకొనక ముందువచ్చెనేమి? నేను వానిని నాతో సహవాసంబునకు గదుర్చుకొని తీసికొనిపోతిని గాని యాపెట్టె మోయుటకుగాదు. దానిలో నేమున్నది యెముకలు నేను గాశికి పోవుచుంటిని గదా యని యెప్పుడో దాచియుంచిన పెద్దల యస్థులను గంగలో వైచి రమ్మని మావాండ్రు నాకిచ్చిరి. ఎట్లయినను కాశి కేగు చుంటినిగదా వీలైన వాటిని గంగలో పారవేయుట కేమి కష్టమని నేనందుల కంగీక రించి తెచ్చితిని. వాటిని గంగలో వేసిననేమి మరియొకచోట పారవయిచిననేమి? దాని తోనే చచ్చినవారికి మోక్షమువచ్చునా యేమి? ఆపెట్టె నెచ్చటనో పాఱఁవేసి నే నందు లకు కినియుదు నని తన భృతినైన గొనకుండ నాతో చెప్పకుండ తిరిగివచ్చిన నీమగని కంటె బుద్ధిహీనుం డింకొకఁ డుండునా? నాతోఁ వాఁడు మార్గములో పడిన కష్టము నకు దానికి నే నీయవలసిన కూలి నెగవేయుట పాప హేతువని దలంచి యింటికి వచ్చి తిని. వాఁడు లేకున్న నే నా సొమ్మెట్లీయ గలనని బలుకుటయు నాబోయది సొమ్మిచ్చు నని భ్రమపడి అయ్యా ! మీరు చాలమంచివారు. ఒకరి కష్టము మిగుల్చుకొనువారుకారు. మీ పెట్టె నా కాశీపట్టణంబులో నెవ్వరో దొంగలు ధన మం దున్నదని యాశపడి నా మగని నన్నిధినుండి యపహరించుకొని పోయిరట. దానికి మీరేమి చేయుదురో యని భయముచేత నింటికి పారివచ్చిన మాట నిజము. మీ రేమందురో యని మిమ్ము జూచు టకు సిగ్గపడుచు లోన దాగియున్నాడు. పోనిండు మీరీయవలసినసొమ్ము నా కీయ కూడదా యనుటయు నతండు అమ్మీ ! నేను ప్రమాణము జేసి చెప్పుచున్నాను పెట్టె పోయినందులకు నేను వాని నేమియు గినియను. నన్ను వాని సమీపంబునకు దోడ్కొని పొమ్ము. వాడును నేనును లెక్క జూచుకొనకుండ సొమ్ము నీచేతి కెట్టిమ్మందువని యనునయ పూర్వకముగా పలుకుచున్న వానిమాటలయందు నమ్మికపుట్టి యా చెంచెత లోనికరిగి భర్తను కుదుటగరపి వానిం దీసుకొనివచ్చి యాకోమటి యెదుటం బెట్టినది. ధనంజయుడును వాని కీయవలసిన కూలియంతయు లెక్కించి యప్పుడే యిచ్చి వేసి వారికి సంతోషము గలుగఁజేసెను. ఇట్లాబోయవానితోఁ గ్రమంబున నతిమైత్రిని సంపా దించి యొక్కనాఁడు ధనంజయుండు మిగుల దీనాననుండై వానితో నిట్లనియె. స్నేహితుండా ! నేను నిన్నొకటి యడిగెదను దాన నీవు మఱొక లాగున దలంపక నిక్కము వచింపుము. దాన నీకేమియు భయములేదు. కాశిలో నేను నీకిచ్చిన యస్థికల పెట్టె నెవ్వరో బరులపహరించిరని నీభార్య జెప్పినది. గాని యామాటలు నాకేమియు నమ్మకముగా లేవు. నీవాపెట్టె నేమిచేసితివి? అందున్న యస్థులు మా యమ్మవి. వానిని భాగీరధీజలంబునగలపి మాతృఋణము దీర్చుకొన గంపెడాసతో నే నన్నికష్ట ములుపడి కాశికిం జేరితిని. తుదకాపని జేయకుంటిని గదా ! యని హృదయతాపంబున గొట్టుకొను చుంటిని. ఆయస్థుల నేమిసేసితివో చెప్పి యవి నీయొద్దనున్న నాకిమ్ము. నీకు పుణ్యము రాగలదని మిక్కిలి బ్రతిమాలుచున్న నావైశ్యకులోత్తమునితో నా చెంచెత యిట్లనియె.
అయ్యా ! బుద్ధిహీనుండనై యాపాపము నే మూటగట్టుకొంటిని. యా పెట్టె యందు మిక్కిలి రొక్కముండునని దురాశపడి దాని నపహరించిన మూఢుడను నేనే. నీ కష్టమంతయు నరణ్యముల పాలుచేసిన పాపాత్ముండను నేనే. నీ వంగడి కేగినప్పు డా పెట్టె నపహరించి మారుమూల మార్గంబున బయలుదేరి వచ్చి యీ యరణ్యంబున నొకచో నామందస మూడదీసితిని. లోపలనున్న యర్ధశకలంబులఁ జూచి విభ్రాంతుఁ డనై చేసిన పనికి సిగ్గుపడుచు నప్పుడు చేయునదేదియులేక వాటి నందే బారవైచి యింటి కేతెంచితిని. ఇది యంతయు యధార్దము. నామాట నమ్ముము. నాపెట్టెలో యెముక ముక్కలు తప్ప నింకేమియు లేవు. మిమ్ములను మోసము జేసితినను మాటయే మిగిలినది నీ పాదముల తోడని పలికెను.
అంత ధనంజయుండు వాఁడు తనతల్లి యస్థులఁ బారవేసిన ప్రదేశము వాని నడిగి తెలిసికొని వానితో నచ్చోటికిఁబోయి వెదకించెను. కాని యెందును వాని జాడ గనంబడినదికాదు. వాఁడా ప్రదేశమును దై వయోగంబున సరిగా గుర్తు పట్టలేక పోయెను. చూచిన చోటులే జూచుచు వెదకిన ప్రదేశములే వెదకుచు తిరిగినమార్గములే దిరుగుచు నీరీతి వారెంతఁ బ్రయత్నించినను గార్యము లేకపోయినది. అప్పు డావై శ్యుఁడు చేయునదిలేక తల్లిఁగూర్చి పెద్దగా వగచి తన యభాగ్యత ననేకవిధంబుల నిందించుకొనుచు నాకిరాతుని వదలి మగుడి కాశీపురంబున కేతెంచి యందు గంగానదిం జలకమాడి విశ్వనాధుని సందర్శించుకొని యెట్టకేలకు నిజపురంబునకుఁ దిరిగిపోయెను.
వింటివా ! విశ్వేశ్వరుని యాజ్ఞ లేనిదే యాకోమటి యవ్వ యస్థులైనను గంగలో కలుప వీలుగలిగినది కాదు. నీవు కాశికిం బోనక్కరలేకుండగనే యంతకు రెండింతలు సుకృతము సంపాదించుకొనగల యవకాశమున్నది. కాశీయాత్రాపరు లీ మార్గంబుననేగాని బోవుట కన్యమార్గంబులేదు. ఈమజిలీ దాటుటకు వారుపడు కష్టము లకు మేరలేకున్నది. ఈ మహారణ్యమందు కాశికిబోవు యాత్రికులకు తగిన సదుపా యంబులఁ గల్పించుచు, వారికి దోఁపుడుగాండ్ర వలన గలుగుచున్న బాధలు లేకుండఁ గాపాడుచుంటి వేని కాశికిం బోకుండగనే సహస్రగుణితంబగు సుకృతంబును సంపా దించుకొనవచ్చును. మఱియు మీజాతియందు నీవంటి క్రూరకర్మపరాజ్ముఖుం డుండఁడు. నీపూర్వపుణ్యంబున నీయందు సుగుణంబులన్నియుఁ జేరినవి. నీవు కారణజన్ముండవు. నాహితవచనంబులు పాటించి నేఁడు మొదలు జంతుహింసమాని ప్రతిదినంబును తీర్థ యాత్రాపరులకు కందమూల ఫలాదులొసంగి తృప్తులంచేయుచు సత్కరించుచుండుము. మార్గస్థులు తస్కరబాధ లొందకుండ కాపాడుచుండుము. సతతము కాశీవిశ్వనాథుని మనంబున తలంచుచుండుము. దానంజేసి నీకు పుణ్యలోకంబులు గలుగఁగలవని కొన్ని మోక్షధర్మంబు లుపదేశించి యాశీర్వదించి యాజటిలుండు తనదారిం బోయెను.
పింగాక్షుండును నాభిక్షుకుని యుపదేశమే వేదవాక్యమట్లు పాలించి తీర్థ యాత్రాపరులు నడుచు మార్గమందు గంటక పాషాణాదులం దొలగించి నడువ యోగ్య ముగా నొనరించుచు, నెడ నెడ వారు విశ్రమించుటకు శీతలచ్చాయల నీయ సుందర తరుబృందముల బాట కిరుప్రక్కల బెంచుచు, చలువ పందిళ్ళు వేయించుచు, ఫల