కాశీమజిలీకథలు/నాల్గవ భాగము/46వ మజిలీ

నలువది యాఱవ మజిలీ

కళావతికథ

గోపా ! విను మిట్లు కళానిలయకూఁతురు కళావతి యక్షిణీ ప్రభావంబున దూరదేశ కాంతారాంతరంబునంబడి య త్తెరం గెఱుంగక ప్రాతఃకాలమున వాడుక ప్రకారము వీణం దడువుకొనుచు లేచి నలుమూలలు చూచి యక్కాఱడవి గాంచి మేను వడకఁ గన్నులు మూసికొని అయ్యో ? నే నిక్కడి కెట్లు వచ్చితిని ? యంతఃపుర మేమైనది ? ఇట్లు స్వప్నము గంటినా యని పలుతెఱుంగులఁ జింతించుచుఁ బెద్దతడవు కన్నులు మూసికొని యది స్వప్నా వస్థకానియట్లు నిశ్చయించి మఱలఁ గన్నులం దెఱచి యాత్మగతంబున -

మ. అకటా ! యీశరభాది ఘోరమృగవా • రాక్రాంతారభూ
     మికి నే నెట్ల రుదెంచితిన్ సఖులిదే • మీరు కానరారిందు మా
     మకశుద్ధాంత మణి ప్రభాలలిత హ • ర్మ్యంబెందుఁ బోయెన్భళీ
     యిఁక గర్తవ్యమదేది ? యేమి గతిప్రా • పెవ్వారు నాకీయెడన్.

అని పెక్కుగతుల విచారించుచు నబ్బాలిక కదలిక యట్టెయొక చెట్టుక్రిందఁ గూర్చుండెను. మిట్టమధ్యాహ్న మైనంత నాదారి సదాచారి యను బ్రాహ్మణుండు పల్లెకుఁబోయి తిరిపె మెత్తుకొని వచ్చుచు నెండతాకున నలసట జనింప ముష్టిమూటలు బరువైన నాతరుచ్ఛాయ విశ్రమింపఁదలంచి మూటలు దింపికొనఁబోవుచుఁ దటాలున సం... ... ... 21న తగంటి వెల్లంకయుం బోలెడ యుచుఁ బంచెఁ డే వల య... కనుమది మును విభూషణములలో సంకరింపఁబడియున్న యః wd: 0 గాంచి నురుధయ: లిత మతియై మ్రాన్పడి చూచుచున్న యజన్నిగట్టు, ni (యూ, చినగా తియిన్లు యె. పోటుఁడ! | నన్ను జూచి యట్లు వెఱచుచున్నా మి , నేను భూతము: గాను, దాపునకురమ్ము అని పలుకరించిన నా విపుండు గుండె ల్లుమన స : నేఁటిలో పని తీఱినది. ఈ చెట్టు నీచ బ్రహ్మరాక్షసియున్నది. యది యనే రూపములతో వచ్చి ప్రజల మాసము చేయునని చెప్పుచును నిజముగా . మ . :-- జులికయే పైనలో పెట్టి సుందరము నట్టి యలంకారములు గE : nut : యరణు " న న నేమిటికి పసించ.ది ? ఇది నాపం పట్టు: కే జ... - Adhi. . - అతు: పైనది. ఇప్పుడేము ఆయుడుకు హరి - 1 - ... ... సుతుఁడా 5 తుయు సంక.. , trist : .54 . . . నలునప్పుడు ముచన .. నలు......... ( 10 at : అక్కటా ! ఇది గులునలేచి నా మునులను చంపులు, " అదిగో లేచుచున్నట్లు కనంబడుచున్నదని బెదరుచు గదలక ప్రాణములు పోయిన వానివలె నిలువంబడియున్న యా బ్రాహ్మణుఁ గాంచి యా చిన్నది యల్లన లే వృద్ధుఁడా నేను పెద్దపులి ననుకొన్నావా ? భయములేదని పలుకుచు నతనిదెసకు రెండడుగులు నడిచినది.

అప్పు డతండు తల్లీ ! నీకు నమస్కారము. నాజోలికి రాకుము నాకుఁ బెక్కండ్రు పిల్లలు కలిగియున్నారు. నేనొక్కరుండ వారికిదిక్కు రక్షింపుమని పలుకుచు వెనుక తిరిగి కాలికొలది పరువెత్తెను. ఆ చిన్నదియు నట్టడవిలో మనుష్య సహాయము దొరకెనని సంతసించుచు నతని వెఱపునకు నవ్వుకొనుచు లేచి యా దెసకే నడువఁ దొడంగినది.

అప్పు డతండు కొంచెము దూరము పరుగెత్తి వెనుకకుఁ దిరిగి చూచెను. ఆ చిన్నది తనవెనుక వచ్చుచుండుటచూచి తన్నుఁ జచ్చినవానిగా నిశ్చయించి పోవుటకు కాళులురాక తడఁబడుచుండ నా ముష్టిమాటలు బరువై దిగజారి కాళ్ళకుఁ దగిలికొన మెలికెపడుటయు నేలం జతికిలఁ బడియెను.

అంతలో నాచిన్న దివచ్చి కలిసికొని తనుఁజూచి వెఱచి పిరికి తనమునఁ బారిపోవుచున్నాఁడని తెలిసికొని భయం బుడుపఁదలంచి నేలంబడిన యప్పుడమివేలుపు చేతులు పట్టుకొని లేవనెత్తఁబోయినది. అప్పుడప్పాలఱుఁడు మొఱ్ఱోయని యఱచుచు “నన్ను బ్రహ్మరాక్షసి జంపుచున్నది. ఎవ్వరైనవచ్చి రక్షింపరే" యని యఱచెను. అప్పుడా చిన్నది నవ్వుచు విప్రుఁడా" నేను బ్రహ్మరాక్షసినికాను, కృష్ణదేవరాయల" కొమార్తెను. నా పేరు కళావతి యండ్రు నీవేదియో నాకు సహాయము చేయుదువని తలంచి నీదాపునకు వచ్చుచుండ నన్నుఁజూచి పారిపోయెదవేమిటికి ? లెమ్ము. లెమ్ము. నన్ను మాయూరుజేర్చితివేని నీదరిద్రము వాయఁజేసెదను. నన్నిప్పుడు మాయింటికిఁ దీసికొని పొమ్మని నైపుణ్యముగాఁ బలికిన నమ్మకతఁడు వివశుండై బహ్మరాక్షసమా ! నీవీలాగనేచెప్పి ప్రాణములు తీయుదువఁట. నీమాట యెట్లు నమ్ముదును? ఇంతమంది యుండ నీకు నేను దొరకితినా విడువుము, విడవుము. నీపేరు చెప్పుకొని బ్రతికెద నని యొడలెఱుంగకయే వేడుకొనఁ దొడంగెను. అయ్యో! ---బ్రహ్మాణుఁడా నామాట నమ్మవేమి ? నేను బ్రహ్మరాక్షసినైనచో నిన్నింతసేపు బ్రతిమాల నేటికి? ఈపాటికే మ్రింగివేయుదును. దైవముతోడు. నేను రాజపుత్రికను, నన్ను మావిజయనగరము జేర్పుము. నీకు మంచి పారితోషిక మిప్పింతునని రెట్టించి నాలుగుసారులు చెప్పగా నెట్టకేఁ గొంచెము ధైర్యము దెచ్చుకొని నీవు రాజపుత్రికవైనచో నొక్కరిత నిక్కడి కెట్లు వచ్చితివని యడిగిన నమ్మగువ యతని కిట్లనియె.

అయ్యా ! నావృత్తాంతము వినిన నీవిట్లు జడియక పోవుదువుగదా ? నిన్న రేయి మాయంతఃపురములోఁ జాలప్రొద్దుపోవు దనుక శాస్త్రచింతనచేసి పండుకొంటిని. ఇదియేమి యింద్రజాలమో తెలియదు. నేఁటి యుదయమున నీయడవిలో నుంటి. ఇందులకు మూలమేమియు దెలియక యాలోచించుఁ గూర్చున్నదానఁ గూర్చుండినట్టుంటిని. ఇంతలో నీవు వచ్చితివి. నిన్నుఁ జూచుటచే నావంత కొంత తగ్గినది. నిజము తెలిసికొనక యూరక నీడద్రొక్కు కొని వెఱచెద వేటికి నన్ను మా యూరు జేర్చితివేని నీకుఁ దగినంత పారితోషిక మిప్పింతునని యతండు నమ్మునట్లు పలికెను.

అప్పుడతండు గుండెఁ గుదుటపఱచుకొని ధైర్యముతోఁ గన్నులం దెరచి అమ్మా ! తల్లీ ! నీవు రాజపుత్రికవా ! యెఱుఁగక బ్రహ్మరాక్షసి వనుకొంటిని గదా ! క్షమింపుము. మీతండ్రి ప్రసిద్ధి వినియుంటి, మీదేశ మిచ్చటికి జాలదూర మున్నది. కానిమ్ము. నెమ్మదిమీఁద నిన్నుఁ మీయిల్లు చేర్చువాఁడ నిప్పుడు మాయింటికిరమ్ము పోవుదము ఈవస్తువులతో నిన్నుజూచిన ప్రజలు దొంగలగుదురు. తీసి నాకిమ్ము మూటఁగట్టి గుప్త ముగా దెచ్చెదనని చెప్పుటయు నాబాలిక వల్లె యని యామండనము లన్నియుఁ దీసి యా భూసురున కిచ్చినది. అతండు బియ్యము పారఁబోసి యామండలముల మూటఁ గట్టికొని యాబలిక వెంటరా తన గ్రామమునకుఁ బోయెను.

గీ. తాటకకు మేనయత్తపూ • తనకుఁ దల్లి
   శూర్పనఖ పెద్దకూఁతురె • చ్చుక హిడింబి
   కక్కలంకిణిచెల్లె లో • యనఁగ వెలయుఁ
   జోలగయ్యళి యాసదా • చారినారి.

ఆ రాగ యెంటికివచ్చి మగనిం జూచి కసరుచు నీబాలిక నేమిటికిఁ దీసికొని వచ్చితివి ? దీనిసంతోషమున ముష్టియెత్త మానివేసితివి కాబోలును. నేఁడు మీయందరిపొట్ట లెటుల పూడ్చికొనెదరు ? ఈ పాడుకాపురము చేయలేక నేను చచ్చిపోవు చున్నానని నోటికి వచ్చినట్లు ప్రేలుటయు నతండు రహస్యముగా నోసీ ? యీబాలికను నిందింపకుము. శ్రీకృష్ణదేవరాయల కూఁతురు. ఇవిగో ? దీని నగలు దీసి నాకిచ్చినది. దీని వెల పదివేలకు మించ యుండును. పాడుబియ్యమొక్కపూటకుఁ జాలవని పాఱబోసి వీని మూటఁ గట్టుకొని వచ్చితిని. తప్పా ! చెప్పుము. ఈచిన్న దానినిగన్న తండ్రి కప్పగించిన మంచి పారితోషిక మిప్పింతునని చెప్పినది. మేము రేపే పోయెదమని యాకథయంతయుం జెప్పిన విని యాగయ్యాళిమొగము వికసింప నబ్బురపాటుతో నా మండనము లన్నియు లెక్కించుకొని మూటఁగట్టి లోపల దాచి వచ్చిన మగని కిట్ల నియె. నీవీ తొడవులిందు బెట్టిదీనినొక్కరితం దీసికొనిపోయి తండ్రి కప్పగింతువేని రాజు నగలమాట నడుగక మానడు.

అప్పుడు మనమాయలంకారముల నిచ్చి యవలయునుగదా ? ఆతండు పిన కానుకలిచ్చును కాని ఎలలో బడవ కొచ్చనలు బహ్మంచమగును. చేతికి దొరికినది విడిచి రాఁబోవు దానినిమిత్తము ఉన్న నేల? వినుండీ చిన్న దానిని దండ్రియొద్దకుఁ దీసికొని పోయెదనని చెప్పి యడవిలో నేనూఁతిలోనో పారవేసిరండు. పిమ్మట మనల నడుగు వారుండరని భోధించినవిని యతండు మది యొడంబడకున్నను భార్యవలన భయంబున మారాడలేక సమ్మతించి యూరకొనియెను.

మ. కులనిర్మూలనకారణంబు ప్రతిభా • కుట్టాక ముద్వేగకో
     పలతాదోహద మాజవంజవసుఖ • ప్రత్యూహ మాత్మవ్యధా
     జ్విలనజాలిక కామినీనయన వీ • క్షాపాతసంరోధి ని
     త్యలఘుత్వాశ్రయభూమిలేమి యదియా • హా ! యేమిగావింపదో.

అని మున్నొక కవి వాసియున్నాడ గదా ! ఆధూర్త కళావతిని గొన్ని దినములు తనయింటఁ బెట్టుకొని యొరులకు తెలియకుండ నన్న పానాదు లొసంగి లాలించుచుఁ గాపాడినది. మఱియొక నాఁడాబాలిక యావిపృనితో తాతా ! మనమిక్కడకువచ్చి పెక్కు దినములైనది. మా యూరి కెప్పుడు తీసికొనిపోయెదవు? ఉపేక్ష చేయుచున్నావేమి ? నన్ను౦గానక మావారు విచారించుచుందురు గదాయని యడిగిన నాపాఱుండు భార్య నడిగినగాని యేమియుఁజేయడు కావున నామాట నారాగతోఁ జెప్పెను.

ఆ వంచకురాలు మఱునాఁడు వారికిఁ బయనము సవరించి చేయదగిన కృత్యములు మగనికి బోధించి యంపినది. ఆ సదాచారి యా నారీమణిని భుజముపై నెక్కించుకొని యొకయడివి దారింబడి నడుచుచు నొకచో నొక యగాధహ్రదంబు గాంచి యందా సుందరిం బడవేయఁబోయి యంతలో నాత్మగతంబున నయ్యో ! నా భార్య దీనింగూపంబున బడవేయమని చెప్పినది కదా. ఈ ముద్దు బాలికను నాచేఁతులతో నెట్లుపారవేయుదును ? పాప మీపావ నీళ్ళుత్రాగి పెద్దతడవుబాధపడి ప్రాణములు విడుచును. ఇది మరణమునకు సులభమగు తెరువుగాదు మఱి యొకవిధము గావించెద నని యాలోచించి యటఁగదలిపైన నడువదొడంగెను ఆ పాఱుండక్కలకలతిం జంపు తలంపుతో నడవి తెరవులనే నడుచుచుండెను. మఱికొన్ని పయనంబులు గడచినంత నొకనాఁడచ్చేడియ తనతొడపై శిరంబిడి నిద్రించుండ నాజన్ని గట్టిట్లాలోచించెను. ఇప్పు డీచిన్నది నిద్రఁబోవుచున్నది. దీనికంఠము పిసిగిన నిమిషములో జావంగలదు. అట్లు చేయుదునా ? అని చేతులు మెడపైమోపి అబ్బా ! ఈబాలిక నాకేమియపకారము చేసినది ? పాపము తననగల మాటయైన నెప్పుడు తల పెట్టలేదే, ఇట్టిదానినెట్లు చంపుదును? --- యిది యడుగకున్నను దీనితండ్రి తొడపులేదని యడుగక విడిచి పెట్టునా ? అప్పుడు నేనింటికిఁబోయిన నాభార్య నన్నుఁ దిట్టకమానదు కావున దీనిం జంపుటయే కర్జము యిప్పుడుగాదు . తలంచి ఎప్పుడు నిగ్రలేపి యా బాలిక మఱియకప్పు పడతి కప్పడు సెనంగా తొందరయేమినచ్చినదని నెత్తుకొని తెరువు నువవొచంగెను. చండ నగందయ్యో | నా భార్య చెప్పిన పని చేయక యింతకాల మూరక పోగొట్టితిని. నేనిఁక నింటికింబోవలయు. జాలిపడిన నా మీఁదికి రాగలదు. నేడు దీని నెత్తిపై నాపాషాణమువైచి చంపెద. నట్లైన నాచాన బాధ తెలియక తృటిలోఁబ్రాణము బాయఁగలదు. ఇదియే యుచితమనితలచి యందున్న యొక పెద్దశిలయెత్తి నెత్తిపై వేయఁబోయి యంతలో నాహా ! మఱచిపోయితిని. దుర్మరణము జెందిన వారు పిశాచమగుదురని చెప్పుదురు. ఇప్పుడు దీనింజంపితినేని బిశాచమై యీ యడవిలో నాపని పట్టకమానదు. ఇదియు నుచితముగా లేదని తలంచి యారాయి నేలం బారవైచెను.

ఈగతి నతండా చిన్నదాని జూచిచూచి చంపలేక యెత్తికొని తిరుగుచుండ గొన్నిమాసములు గడచినవి. ఒకనాఁడా కళావతి యతనితోఁ దాతా ! నీకు దారి తెలియదాయేమి యెప్పుడు నడచిన నడవి తెరువుననే నడుచుచుండెదవేల ? మార్గములో గ్రామములులేవా ? పాపము నన్ను మోచువఱకు నీ భుజములు కాయలు కాచుకున్నవి. నీ యుపకారమునకు ప్రీతి యెన్నడు చేసికొందునో ? యని స్తోత్రము చేయగా నుబ్బుచు నతండు అమ్మా మీ యూరికి దారి నాకుఁదెలియదు. దానంజేసి యిన్ని చిక్కులంబడుచుంటి. నిన్ను మోచుటచే నాకేమియు నలసటలేదు. ముష్టిమూటలు మోయుటచే నిదివఱకే నా భుజములు కాయలు కాచినవి. నీవు సంతసించినఁ జాలునని పలుకుచు మఱికొన్నిఁ బయనములుచేసి దై వికముగా నొకనాడు కుముద్వతి యను పట్టణము జేరెను.

అందొక సత్రంబునభుజించి యతండా బాలికతోఁగూడ నందలి చావడిలో విశ్రమించి నలుమూలలు విమర్శింపుచుండ నెదుటి గోడపై నొక ప్రకటన పత్రిక గనంబడినది. అందు ఏతత్పట్టాణాధీశుండగు కుముద్వంతుని కూఁతురు కౌముదితోఁ జదరంగమాడి గెలిచిన వారికిఁ బదివేలమాడలు కానుకగా నీయబడును. ఓడిపోయిన పురుషుండు తక్షణ మురితీయఁబడునని తత్ప్రకారమంతయు నందు వ్రాయఁబడి యున్నది.

ఆ పత్రికఁజదువుకొని యాధాత్రీసురుం డుబ్బుచు నబ్బాలికతో నమ్మా ! నీవు నేర్పుగాఁజదురంగ మాడుగలనని నాతోఁజెప్పియుంటివి. ఈ దేశపు రాజుకూతురు కౌముదితో నాడి గెలువఁగలవా ? పది వేలమాడలు కానుక యిత్తురట. ప్రకటన పత్రిక చూచితిరా యని పలికిన నక్కలికి కలుకుచు తాతా ! నిజముగా ఆడి యా చేడియం గెలువఁగలను. పదివేలమాడలు నీచేతిలో నున్నవని తలంచి యుండుము నే నాడెదనని వారితోఁ జెప్పిరమ్మని యుత్సాహంబు దీపింపఁబలికిన నతండుబ్బుచు నాత్మగతంబున నిట్లు తలంచెను.

ఆహా ! దైవమ ప్రయత్నముననే కార్యములు సఫలము జేయుచుండును. నా భార్య మాటచొప్పున నీ బాలికను దారిలోఁ గడతేర్చకపోవుటయే మేలైనది. ఈచేడియ చదరంగమాడి యోడిపోయినచో నాచేతితోఁ జంపనక్కరలేకుండ వారే కడతేర్చుదురు. గెలిచెనేని బదివేలమాడలు రాఁగలవు. ఎట్లైనను లాభమేగదా ! పాపమీచిన్నది యోడిపోయినఁ జంపబడుదునను మాట గ్రహింపలేదునుఁబోలు. నేనది తెల్లముచేయనేమిటికని తలంచుచు నమ్మించుబోఁడి కిట్లనియె.

అమ్మా ! దీనికి మనమిప్పుడొక యుపాయము చేయవలయును. నీకుఁ బురుషవేషమువైచి నాకుమారుండని జెప్పెదను. నీవు రాజపుత్రికతోఁ చదరంగమాడి గెలిచితివేని నీ మూలమున నాకును గీర్తిరాగలదు. ఈపాటి యుపకారము జేయఁదగుదువని నుడివిన నప్పఁడతియు నందులకు సమ్మతించినది.

కళావంతుని కథ

అప్పుడు గుప్తముఁ గళావతికిఁ బురుషవేషమువైచి యాపాఱుండు తదీయ రూపవిశేషమున కచ్చెరువందుచుఁ గళావంతుఁడ పేరుతోఁ బిలువఁ దొడంగెను.

అప్పుడు కళావతి పదమూ డేడుఁల ప్రాయముగల చక్కని బ్రహ్మచారివలెఁ బ్రకాశింపుచుండెను.

సదాచారి యక్కుమారుందీసుకొని మఱుఁనాడు ప్రాతఃకాలమున రాజసభకుఁబోయి యందున్న యధికారులతోఁ తనకుమారుండు గౌముదితో జదరంగ మాడుటకైవచ్చెనని చెప్పెను. ఆ యుద్యోగస్థులు కళావంతుని సౌందర్యాతిశయమున కచ్చెరువందుచు సదాచారితోఁ బాపఁడా ! నీవు ధనమున కాసపడి మన్మధునివంటి కుమారునేల జంపుకొనియెదవు? కొమ్ములు తిరిగినవారు వచ్చి యాడలేక యోడిపోయి యురితీయఁబడిరి. వీఁ డెంతవాడు. పాప మాపాపనికింకను ముక్కుపచ్చలారలేదే ? ఎందయిన ముష్టియెత్తుకొని బ్రతుకఁగలఁడని బలుదెఱంగుల బోధించిరి. కాని సదాచారి వారి మాటలఁ బాటింపక యాటకు సెలవిమ్మని ముమ్మాటికిం గోరుకొనెను.

అప్పు డా యధికారు లా సదాచారిచే నోడిపోయినచో నురితీయుటకు సమ్మతించినట్లొడంబడిక వ్రాసి పుచ్చుకొని యా వృత్తాంతము రాజపుత్రికకుఁ దెలియ జేసిరి. రెండు గడియలలో నేటిఁకి మూడవనాఁడు మధ్యాహ మా విప్రకుమారుని మా యంతఃపురంబునకుఁబంపుఁడని కౌముది యొద్దనుండి యాజ్ఞాపత్రిక వచ్చినది.

ఆ పత్రిక జూచుకొని వారు పాఱుఁడా ! నీ కుమారుని కింక మూడు దినములు యాయువు గలిగియున్నది. అప్పుడు తీసికొని రమ్ము పొమ్మని చెప్పుటయు నతండు కళావంతునితోఁగూడ సత్రమున కరుదెంచెను. కళావంతుని జూచిన వారెల్ల జాలిపడుచు బాలుఁడా ! మీ తండ్రి సొమ్ము కాసపడి నిన్ను జంపుకొనుచున్నాఁడు. నీ వందుల కొప్పుకొనబోకుమని కళావంతునికి బోధించుచుండిరి. నవ్వుచు నతండు వారిమాటలఁ బాటింపఁడయ్యెను.

అంత మూడవనాఁడు సదాచారి వానిం దీసికొని యాస్థానమున కరిగెను. అంతకుమున్న రాజపుత్రిక సఖురాండ్రిరువురు వాని రాకకై యందు వేచియుండిరి. కావున నా ముద్దియలిద్దరు కళావంతు నంతఃపురమునకుఁ దీసికొనిపోయి చతురంగ కేళీశాలలోఁ గూర్చుండఁబెట్టిరి. అంతలో నా రాజనందన సకలాభరణభూషితయై సఖీ పరివృతయై యరుదెంచుచు నల్లంతదవ్వున నక్కాళావంతుంగాంచి తదీయరూప రేఖా విలాసములకు వెఱగుపడుచు నోహో ! పరమేష్టి సృష్టీ వైచిత్ర్యమున కియత్తలేదు కదా ! ఇట్టి సౌందర్యశాలిని బేదపాఱునికిఁ బుట్టించిన యొక్కటియే యతని లోపమై యున్నది. అయ్యో ? వీఁడు నాతోఁ జదరంగమాడి జయింపఁగలడా ? వీనింజూడ నా యెడద జాలిబొడము చున్నది. కారణమేమియో తెలియదు. వీని నెట్లు జంపింతునని యాలోచించి నొకచీఁటి వ్రాసి చెలికి త్తియచే నతనియొద్ద కనిపినది.

“మాణవకోత్తమా ! నీ రూపము దర్శనీయమై యున్నది. నీవు నాతోఁ జదరంగమాడి జయించుటకల్ల. మదీయ శపధంబు కడుదారుణమైనది. ఇప్పుడైనఁ బ్రతుకఁగలవు. లెస్సగా నాలోచించుకొనుము." అని యున్న యా పత్రికందీసికొని పోయి యొకబోటి వాని కిచ్చినది.

దానిం జదివికొని యతండు మఱియొక పత్రిక నిట్లువ్రాసెను. “తరుణీ ! దాక్షిణ్యము జన్మముతోడనే గలుగవలసినది. నీ హృదయంబునం కనికరమేమియు లేనట్లు స్పష్టమగుచున్నది. కానిచో నట్టి వ్రత మేల పట్టెదవు ? నిపుణమతి కిదియా తెరువు ? చాలు చాలు. నన్ను జూచి జాలిపడనక్కరలేదు. నీవు గెలిచిన పిమ్మటఁ గరుణించి విడుతువుగానిలే. నీ యాటలు మూడునుఁ వరుసగఁ ద్రోసిరాజు చేయక పోతినేని నన్ను గెలిచినవానిఁగా దలంపుము." అని వ్రాసి దానిదిరుగ రాజపుత్రిక నొద్దకుఁ బంపెను. ఆ బోటి యా చీటిం జూచికొని వాని ధైర్యమునకు వెఱగందుచు నల్లనబోయి వానికభిముఖముగా నమరింపఁబడిన రత్నపీఠంబున గూర్చుండెను. అంతలో సుఖురాండ్రు నీ లోపల పద్మరాగ మణీశకలములచేఁ గూర్పంబడిన కేళీ ఫలకము వారి నడుమ నిడియందు సితాసితమణి విరచితమైన బలము సవరించిరి.

మఱియుఁ జుట్టునుం గూర్చుండి సఖురాండ్రు వారియాటల జూచుచుండిరి. అప్పుడు మొదట రాజపుత్రికయే మూడెత్తులు జరిపినది. పిమ్మట నా భూసురుండు క్రొత్తమాదిరిగా నెత్తులు వైచెను. వాని జూచి యా చిన్నది యాలోచింపుచుండ నతండహో ? యింత యాలస్యము చేసిననెట్లు? ఇదియా నీ విన్నాణము ? ఇంత సేపాలోచించి వైచిన యెత్తిదియా ? యిందీయపభ్రంశమున్నది చూచితిరా ? యీ మాత్రము పాటవమునకే యింతపన్నిదము వైచితివి ? యేమో యనుకుంటిని చాలు చాలు. అదిగో మంత్రి వచ్చుచున్నాఁడు. చూచుకొనుము కావలసిన నీ యెత్తిచ్చెద దీసికొనుము అని హేళనగా మాటాడుచు నాడియాడి చేడియా ! పాప మెర యని యెరుగక మా బంటునే నా మంత్రిం జంపితివి గదా ఇదిగో చూచుకొనుము మొదట గురుతు పెట్టిన బంటుచే ద్రోసిరాజనిన నీయాటఁ గట్టినది. అని పలుకుచు దొలి యాట యవలీలగా గట్టెను. అప్పుడా రాజపుత్రిక విస్మయ రసావేశహృదయయై అయ్యో నా బుద్ధి యింత మొద్దువోయినదేమి ? వీని యెత్తులే నాకుఁ దెలియకున్నవి యాలోచించినట్లే కనంబడఁడు. తనయాటఁ గాచుకొనుచున్నట్లు తోచదు. అన్నన్నా ! యెరలువైచి రాజునకు జంతువుల దూరము జేసి తృటిలో నాటగట్టివై చెనే ? ఆహా ! యింతనేర్పరిని నేను జూచి యెఱుఁగనని యక్కజమందుచు వెండియు రెండవయాట ప్రారంభించి తన బుద్ధియంతయు వ్యాపకము జేసి యాడినదికాని యదియు నాతండశ్రమముననే త్రోసి రాజు చేసెను.

అప్పుడా చిన్నది చిన్నవోయి మూఁడవయాటకు బలము సవరింపుచున్న సమయంబున నతండు నవ్వుచు బోటీ ? నీ యాటపాటవము దెలిసినది. ఈ సారి మంత్రిఁదీసి నిన్నుఁ ద్రోసి రాజుఁజేసెదఁ జూడుము. అట్లు చేయకపోతినేని నీయాట లన్నియు నోడినట్లు సమ్మతించెదనని మూఁడవయాట ప్రారంభించెను. అప్పుడప్పుడఁతి తన జంతువులన్ని యుం జంపుకొన్న కాని యతండు చెప్పిన గదిలోని బంటుం జంప లేక పోయినది. అతం డాబంటుచేతనే త్రోసిరాజుచేసి పన్నిదము గెలిచితినని కేకలు వైచెను. ఆపై దలి లజ్ఞావిషేదమేదుర హృదయయై తలవంచుకొని యొక్కింతసే పూరకొని ఓహో ! నీ కృషియంతయు నీ యాటలోనే చేయంబడినట్లు కనఁబడు చున్నది. విద్యలలో నిటువంటి ప్రవేశము గలిగిన లెస్సయంగుగాదాయని పలికిన విని యతండిట్ల నియె. పడఁతీ ! నీవే విద్యలలోనైన నాతో బ్రసంగించి గెలుపుకొంటివేని నేను జదరంగములో నోడినట్లే యెంచుకొనియెద. నడుగవచ్చునని యుత్తర మిచ్చుటయు నమ్మచ్చెకంటి తాను జదివికొనిన విద్యలలోఁ గొన్ని శంకలు చేసినది

తత్ప్రశ్నముల కతండవలీలగా నుత్తరము జెప్పి నాలుగువేదములలో నాఱు శాస్త్రములలోఁ దనకుఁగల పాండిత్యమంతయుం దెల్ల మగునట్లుపన్యసించి యా చంచ లాక్షికి వాగ్భంధము గావించెను. కౌముది కళావంతుని రూపమునకు విద్యకు మిక్కిలి యాశ్చర్యమందుచు నతండు తన్నె త్తిపొడిచిన మాటలు హృదయశూలములై బాధింప సఖీ ! యీ పాఱుఁడు మాటలు పెక్కు నేర్చియున్నాడు తక్కిన పాండిత్యమువెనుక విమర్శింతుగాక. ఈ పందెము గెలిచినందులకుఁ బారితోషికము పంపుదుమని చెప్పుమని పలుకుచు లేచి లోపలికిం బోయినది.

అప్పుడు కళావంతుఁడంగ జానలు మార్గమెరింగింపఁ గొల్వు కూటమునకు వచ్చి యందున్న సదాచారితోఁ గౌముది గెలిచితినని చెప్పెను. ఆ మాటవిని యతండు గంతులు వైచుచు వానిం గౌఁగిలించుకొని తండ్రీ ! నీ కతంబున నా కులంబు వన్నె కెక్కినది. నేను ధన్యుండ నైతినని స్తోత్రములు చేయఁదొడంగెను. అందున్న అధికారులును వాని విద్యాపాటవము విని యబ్బురమందఁజొచ్చిరి. పిమ్మట సదాచారి కళావంతునితోఁ గూడనధికారుల యనుజ్ఞ గై కొని సత్రమునకు వచ్చెను.

అప్పుడు అందున్న బ్రాహ్మణులెల్లరు మూగికొని యొహో ! వీని ప్రాయ మెంత ? బుద్దియెంత ? విద్యయెంత ? యని యూరక స్తోత్రములు చేయుచుండ విని వారితో హరిశర్మయను బ్రాహ్మణుం డిట్ల నియె.

విప్రులారా ! మీరీ బాలుండు కౌముదినిఁ జతురంగములో గెలిచినందులకే యాశ్చర్యపడుచున్నారు. వీనికంటె రెండు మూడేడులు పెద్దగా నుండును. పాండ్య మహారాజు గారి యాస్థాన పండితుఁడు విష్ణు గుప్తునికొడుకు దేవగుప్తుండను బాలు డీ నడుమ కృష్ణదేవరాయలవారి పండితులతోఁ ప్రసంగించెను. వాని విద్యాపాటవము వినిన నెంత యక్కజమందెదరో గదా ! తద్వృత్తాంతము జెప్పెద నాలింపుఁడు.

దేవగుప్తునికథ

పాండ్యదేశ ప్రభు డగు మలయధ్వజుండు పండిత ప్రియుండని వాడుక యున్నది కదా ! ఈ నడుమ రాయలవారి యాస్థాన కవులు పెద్దన్న రామలింగకవి లోనగు పండితులు దిగ్విజయము చేయుచుఁ దద్రాజధానియగు మధురాపురమున కరుదెంచి యన్నరపతితోఁ బ్రసంగ సంగరార్ధులమై యరుదెంచితిమని చెప్పిరి. అప్పు డప్పార్ధివోత్తముండు మిగుల సంతసించుచు విష్ణుగుప్తుండను తన యాస్థానవిద్వాసునకవ్వార్తఁ దెలియజేసెను. ఆ సూరిసత్తముండు తానా సభకు రాక పదియాఁరేడుల ప్రాయముగల తన కుమారుని దేవగుప్తుఁడను మాణవకుని బంపెను. వాని రూపరేఖా పలాసములు కంతునకు జయంతునకుం గూడ లేవని చెప్పఁగలను. పల్ల కీ యెక్కి వచ్చిన యా విప్రకుమారునిం జూచి సభ్యులెల్లరు విస్మయరసావేశమతులై పొగడదొడంగరి. ఆ దివ్యచ్ఛిధామణి యంతకు పూర్వ మెన్నఁడు నిల్లుకదలి రాలేదఁట. అదియే ప్రధమసమాగమనమట దుర్నిరీక్ష్యమగు తదీయ తేజమునకు వెఱగుఁ జెందుచు నా భూపతి యడుగ నతండు తన కథ జెప్పెను. అప్పుడతండు ప్రతివాదిగా నిరూపింపఁబడి యా పండితుల కభిముఖముగా నున్న పీఠంబుపైఁ గూర్చుండెను. అంతలోగంట మ్రోగినది ఆ గురుతు గ్రహించి దేవగుప్తుండు లేచి సభ్యులకు నమస్కరించుచు, దొలుత విద్యాప్రవృత్తిని గుఱించి కొంచె ముపన్యసించెను. ఆ యుపన్యాసము విని సభాసదులు మంత్రింపబడినట్లు కదలక యట్టె వినుచుండిరి. తరువాత నతండువాదుల యభిఖ్యలెట్టివో తెలిసికొనవలయునని యడిగిన వారి శిష్యుఁ డొకండు లేచి యీ పద్యమును జదివెను.

సీ. రామలింగకవీంద్ర • రాజరత్నమితండి
                కలడాంధ్రకవియ పి • తామహుండు
    పెద్దనామాత్యుండు • ముద్దుపల్కుల ముక్కు
                తిమ్మనకవి యీసు • ధీవరుండు

    అయ్యలరాజ వం • శాబ్దిసోముఁడు రామ
                 భద్రుఁడు కవితాస • ముద్రుఁడితఁడు
    మల్లనకవి రాజ • తల్ల జుండతఁడు ధూ
                ర్జటిపాదరతుఁడు ధూ • ర్జటియతండు

గీ. సకలరాజాధిరాజ సం • స్థానకలిత
    భూరితకీర్తి పింగళ • సూరియాతఁ
    డాశుకవితాధురంధరం • డతఁడు రామ
    రాజభూషణ కవిరాజ • రాజమౌళి.

అని యెఱింగించుటయు నవ్వుచు వసుంధరుఁడు ఓహో ? వీరా తెలిసినది తెలిసినది. వీరినే కాదా గజములని పిలుచుచుందురు. వీరి చరిత్రము లింతకుముందే మదీయ శ్రోత్రానందము గావించినవి. నరేంద్రా వీరితోఁ బ్రసంగించుటకేనా విష్ణుగుప్తున కంతతీక్షఱముగాఁ బత్రిక వ్రాసితివి ? భళిరేయని యెకసక్కెము లాడిన నారాజు వాని మాటలకు వెఱఁగుపడుచు నీవుగొండికవుగావున నిట్లనుచున్నావు. తత్పాండిత్య మెఱింగి పలుకుమనుటయు దేవగుప్తు డిట్లనియె.

అయ్యా ! నే నెఱుంగఁబట్టియే యిట్ల నుచున్నాను. వీరు మందారవల్లి యను మహా విద్వాంసురాలితోఁ బ్రసంగించిన విషయము తెఱింగినచో వీరికి మీరింత జడియక పోవుదురు గదా. తత్సంవాదమే వీరి ప్రజ్ఞాప్రభావంబులువెల్లడి చేయుచున్నవని పలుకుటయు భట్టుమూర్తి జనాంతికముగా నోహో ! యా రహస్యము వీని కెట్లు తెలిసినదో గదా ? వీని మాటలు మిగుల ప్రగల్భముగా నున్నవి. సింహపోతంబునుం జూచిన కలభంబుచాడ్పున నా హృదయము వీనిం జూచి వెఱచుచున్న దేమియోయని పలుకుటయు రామలింగకవి మాటకుఁ బదియుక్తులుతోచెడు నాకు సైతము వీనికిఁ బ్రత్యుత్తరము చెప్పుట కేమియుం దోచుకున్నది వీఁడు మనకు వాగ్బంధముజేసెనా యేమి యని పలికెను. తక్కినవారును పిరికి తనముగా మాట్లాడికొనిరి.

అప్పుడారాజు సూరిసత్తమా ! యుత్తములు తమ ప్రజ్ఞను క్రియా రూపముగాఁ జూపెదరు. మాటలతో బనియేమి. వాదమునకుఁబూనికొమ్మని పలికిన నతం డయ్యా ! కత్తులతోనా కఱ్ఱలతోనా వీరితో వేనిలోఁ బోట్లాడుదు నని యడిగిన నారాజు నవ్వుచు శాస్త్రములతో బోట్లాడమని పలికెను.

వీరాంధ్ర కవీంద్రులు శాస్త్రములన్నియు సంస్కృతభాషలో నున్నవి. అది వా రెఱుంగుదురో యెఱుంగరో యని సంశయించు చున్నానని పలికిన నలుకతోఁ బెద్దన్న కవిలేచి యమేమీ ? బాలకా ప్రగల్భములు పెక్కు భాషించుచున్నావు ? ఈ రామలింగకవి మందారవల్లింబరాజితం గావించిన వృత్తాంతము నీ వెఱింగిన నిట్లనవు. మాకు సంస్కృతమేరానియట్లు వాక్కాణింపుచున్నావు. ఏ శాస్త్రములోఁ బ్రసంగింతువో తువో చెప్పుము. పూర్వపక్షము చేయుదునని పలికెను. అప్పుడు వారికిట్లుసంవాదము జరిగినది.

వసుంధరుఁడు - అయ్యో ! పేరు చేతను గూడ మీరు బెద్దన్నలు గదా లోక పితామహులు వృద్ధులతోఁ బరిహాసము లాడరాదు. మీ రించుక విశ్రమింపుఁడు.

పెద్దన్న - నీవు వాచాలుఁడగుదువు సంతసించితిమి నన్నుఁ గెలిచి నీ యౌవన గర్వము చూపుము.

వసుం - మీ రొక్క పద్య మెన్ని సంవత్సరములకుఁ జెప్పుదురు ?

పెద్దన్న - అట్లడిగెదవేల గడియకు నూఱుపద్యములు చెప్పఁగలను.

వసుం - ఏమీ ? గడియకే నూఱుపద్యములు : అందులకేనా అఱువది యేండ్ల కారువందల పద్యములు గల మనుచరిత్ర మొక్కటి రచించితిరి నేనుదాని బట్టి విభజించి సంవత్సరమునకుఁ బది పద్యములు చెప్పఁగలరని నిశ్చయించితిని.

బెద్దన్న - అఱువదియేండ్లు మనుచరిత్ర మొక్కటియే రచింపుచుంటి ననుకొంటివా ?

వసుం - పోనీ ! మీరు రచించిన మఱియొక గ్రంథము పేరు చెప్పుడు.

పెద్దన - అవసరము లేక మఱియొక గ్రంథము రచించలేదు.

వసుం - అవసరమెవ్వరికి మీకా ? ప్రజలకా ?

మీరు పుట్టకపూర్వము మీ గ్రంథము లేని యప్పుడు ప్రజలు బ్రతికి రాలేదా ? మీ రొక్కరే కాదు. మీ గజములందఱు నొకటి రెండు గ్రంథములు మాత్రము రచించి మా పాటి పండితుఁడు లేరని విఱ్ఱవీగుచున్నారు. మూడాశ్వాసముల రాజశేఖర చరిత్రమను నొక చిన్న గ్రంధము రచించిన నీ మల్ల న్న యుగజమే ఔరా ! యెంత చిత్రము మదము గలుగుటచే వీరికాపేరులు సార్ధకముగా నున్నవి. మీరు రచించిన గ్రంథములు నేనాకుగా నిప్పుడు రచించెద వ్రాసికొనుఁడు.

మఱియు రామలింగకవిగారు మందారవల్లి ని జయించిన విధానమంతయు మాకు బోధపడినది. వారు పూజ్యులు వారి నేమియు ననరాదు. దేవసాగర లిపితో నున్న గ్రంధములేమైన నిచ్చటికిఁ దెచ్చిరేమో నాకా భాష వచ్చును. అయ్యారే! యొక తొయ్యలికి నోడిపోయి వేషములు మార్చుకొని యాఁడువాండ్రై బధిరభారము వహించి పొరటిల్లి న మీరు మఱల సిగ్గు విడిచి దిగ్విజయము చేయవచ్చితిరే ? ఇంతకన్న నవివేక మెందైనం గలదా ? మీ గ్రంధములలోఁ బద్యమునకు నూఱు తప్పులు పట్టెద సమాధానము చెప్పుడు ఏ శాస్త్రములో వాదింతురో చెప్పుడు. పూర్వపక్షము చేయుదురా? సిద్ధాంతము చేయుదురా ? యని మేధుగంభీర భాషణంబులఁ బ్రతివాదులెల్లఁ --------- చూచుచుండ సకల శాస్త్రసయుక్తి యుక్తి ప్రకారములచే దద్గ్రంధస్థ శబ్దార్థదోషంబులెల్ల దెల్ల మగునట్లు చక్కఁగా నుపన్యసించెను. సింహధ్వని వినిన మదగజంబుమాడ్కి దదియోపన్యాసము విని యాపండిత వేదండములు భీతస్వాంతులై పెదవిగదుపఁ జాలక యట్టె చూచుచుండిరి.

అంతలో నియమిత కాలప్రబోధకంబగు ఘంటానినాదంబుశ్రోతానందము గావించినది. అప్పుడు రామలింగ కవిలేచి సభ్యురారా ! నేఁడీ బాలకుని యుపన్యాసము విని యెంతయు సంతసించితిమి. వీని ప్రశ్నలకు రేపుత్తరములు చెప్పుదుము

వీని యంతసార మేపాటియదియా తెలియవలయునని యింత దనుక నుపేక్షించి చూచుచుంటిమి. రేపు తప్పక మీరందఱు దయచేసి యస్మద్విద్యా పరిశ్రమ మెట్టిదో తెలిసికొనఁ గోరుచున్నా వారమని పలుకుటయు సభాస్థారులెల్లఁ గరతాళములు వాయించిరి. అంతటితో నా సభ ముగించుటచే నందరు నిష్క్రమించిరి.

అమ్మఱునాఁడు యధాకాలమునకు దేవగుప్తుఁడు మఱల సభకరుదెంచెను. పౌరులు పెక్కండ్రా సంవాదము వినవలయునని సభనలంకరించిరి. మంత్రులు సామంతులు హితులు పురోహితులు సేవింప మలయధ్వజుండు కొల్వుదీర్చి కూర్చుండి రాయలవారి పండితులరాక నరయుచుండెను. మిక్కిలి విశాలమగు నా సభాభవనంబున నా పండితుల యెనిమిదిపీఠంబులు దక్కఁ దక్కినస్థలమంతయు జనులచే నిండింపఁ బడినది. సభ్యుల దృష్టులు రాయలవారి పండితులరాక జూడ నా ద్వారదేశమున వ్యాపించుచున్నవి. ఎంత సేపటికి వారిజాడఁ గనంబడినదికాదు. నియమితకాల మతిక్రమించుటయు నాఱేఁడు కోపము చేయుచు వారిం దీసికొనిరమ్మని తద్వాసస్థానమునకు పలువుర దూతలం బంపెను. వాండ్రువోయి ముహూర్తకాలములో వచ్చి దేవా ! ఆ విడిదిలో నెవ్వరునులేరు. శూన్యమైయున్నది నలుమూలలు వెదకిన నొక తలుపున నీ పత్రిక వ్రేలంగట్టబడియున్నది. చూడు డని యొక కాగిత మాపతికిచ్చిరి. అందు -

మహారాజా ! మేము యధార్ధమైన రాయలవారి పండితులముకాము. విష్ణుగుప్తున కిట్టి కొమరుం డున్నవాఁడని యెఱుఁగక వానిం బెదరింప నిట్టివేషములతో వచ్చితిమి, మా కతండు దాయాదుండగుట నీ తెఱంగున నతని బరిభవింపవలయునని తలంచితిమి. అతని పాండిత్యము మాకుఁ దెలియును. దేవగుప్తునితో మేము ప్రసంగింపఁ జాలము నేఁడు సభకువచ్చినఁ బరాభవమగు నని యంతర్హితులమైతిమి. మా తప్పులు మన్నింపుము అని వ్రాయబడియున్నది. (అందరు పకపక నవ్వుచున్నారు) భూభర్త సంతోషము పట్టజాలక మానందభాష్పములతో దేవగుప్తుం గౌఁగలించు కొనియెను.

అప్పుడు సభ్యులెల్లరు దేవగుప్తుఁ బుష్పములచేఁ బూజించిరి. పిమ్మట నమ్మనుజపతి మంత్రులతో నాలోచించి రాయలవారి కప్పుడే యొక యుత్తర మిట్లు వ్రాయించెను. కృష్ణదేవ మహారాజా !

దిగ్దంతులని బిరుదములు వహించిన మీ యాస్థాన కవీశ్వరులీనడుమ మా పురమున కరుదెంచి మా యాస్థానకవి పుత్రుండు దేవగుప్తుండనువానితో బ్రసంగించి యోడిపోయి మఱునాఁడు వత్తుమని చెప్పి యీ యుత్తరమువ్రాసి యంపిరి. అది యిందుతోఁ గూర్చితిమి. అందలి నిజానిజంబు లెట్టివో మాకుఁ దెలియకున్నవి ఏది యెట్లయినం గానిండు. ఇప్పుడు బాలపండితునతో నేవిద్యలోనైనఁ బ్రసంగించి గెలుచు కొనినవానికి మూడు గ్రామములు బారితోషికముగా నిచ్చుచున్నవాఁడ. మునుపు దబ్బరయైనను నిప్పుడు నిక్కముగా మీ పండితులం బంపుదురని నమ్ముచుంటిని.

ఇట్లు మీ విధేయుఁడు

మలయధ్వజుండు.

ఆ యుత్తరమప్పుడే రాయలవారియొద్ద కనిపి యబ్బాలునకు రత్నకట కాంగుళీయాద్యాభరణంబు -లెన్ని యేనిఁ గానుకలిచ్చి వారి యగ్రహారమున కనిపెను. అప్పుడు నేనందుండటచే నా విశేషములన్నియుం జూచితిని. ఈ కళావంతుడా దేవగుప్తునితోఁ బ్రసంగించి గెలిచెనేని నెక్కుడు పాండిత్యముగలవాఁడని చెప్పఁదగినదని యా వృత్తాంత మంతయుం జెప్పుటయు నా బ్రాహ్మణులు హరిశర్మా? రాయలవారి పండితులు వచ్చిరా ? వారితోఁ బ్రసంగించిరా ? పిమ్మట నేమయ్యె నా విశేషములు వక్కాణింపుమని యడిగిన నతం డవ్వలి వృత్తాంతము నాకుఁ దెలియదు అమ్మఱునాఁడే నేనందుండి వచ్చితినని చెప్పెను.

హరిశర్మ చెప్పిన వృత్తాంతమంతయు విని సదాచారి కౌముదిని గెలిచినట్లే కళావంతుండు దేవగుప్తునింగూడ గెలువఁగలఁడని నిశ్చయించి యా మూడుగ్రామములు తనకు దొరకునని నాసతో నప్పుడారాజు పంపిన పదివేలమాడలం గొనక యందే యుంచుమని చెప్పి కళావంతుం దీసికొని మధురాపురంబునకుం బోయెను. మలయధ్వజుండు పండితులు, విద్యావివాదములఁజూడ వేడుకఁగలవాఁడు కావున విద్వాంసులు వచ్చినప్పుడు క్రిందివారు తన కెఱింగింపరని తానువసించు నెలవున నొక గంటఁ గట్టించి దాని త్రాడు సింహద్వారముదాపున వ్రేలాడఁజేసెను. పండితులు కానివారలా గంట లాగిరేనిఁ కఠినముగా శిక్షింపఁబడుదురని ప్రకటన వ్రాయించెను. కళావంతు డెవ్వరినడుగకయే యా ప్రకటనఁ జూచికొని యా త్రాడులాగి దృఢముగా నాగంట మ్రోగించెను. ఆ ధ్వని వినే యాఱేఁడు త్రాడులాగినవానిం దీసికొనిరమ్మని యొక భృత్యునంపుటయు వారిరువురను రాజునొద్దకుఁ దీసికొనిపోయెను.

ఆ యొడయఁ డాపుడమి వేల్పులంజూచి నమస్కరించుచు మీ రెచ్చటి వారలు ఏమిచదివికొనిరని యడిగినఁ గళావంతుఁడు దేవా ! మాది కాశీదేశము నా పేరు కళావంతుఁడండ్రు. ఈయన మాతండ్రి. కుముద్వతీ నగరంబున రాజపుత్రిక చతురంగమాడి తన్ను గెలిచినవానికిఁ బదివేలమాడలు కానుకగా నిత్తునని ప్రకటించిన విని యక్కడికి వచ్చితిమి. అమచ్చెకంటితో నాడి యోడించి యా కానుక నందితిని. ఇక్కడఁ దమ పండితపుత్రుఁడు దేవగుప్తుఁడనువానితో శాస్త్రములలోఁ బ్రసంగించి గెలుపుకొనినవానికి మూడుగ్రామము లిత్తురని ప్రకటించిన విని యిక్కడికి వచ్చితిమి ఇదియే మా రాకకు నిమిత్తమని పలికిన సంతసించుచు నా భూపతి సగౌరవముగా వారికిం దగిన విడిది నియమించి యప్పుడే దేవగుప్తుం దీసికొనిరమ్మని విష్ణుగుప్తునొద్ద కొక దూతంబంపెను. ఆ ప్రాంతమందున్న మహేశ్వరాగ్రహారమునకుం బోయి యా రాజుదూత, విష్ణుగుప్తుంకాంచి నమస్కరించుచు మీ కుమారుఁడు దేవగుప్తం గళావంతునితో బ్రసంగింప సత్వరమ పంపించుమనిరని నరనాధుని శాసనం బెఱింగించిన నాలించి యా బ్రాహ్మణు డెద్దియో ధ్యానించి నిట్టూర్పు నిగుడింపుచు దేవగుప్తుం డూరలేఁడు. గ్రామాంతర మఱిగియున్నాఁడు. పదిదినములలోఁ దీసికొనివత్తునని పార్థివోత్తమునితోఁ జెప్పుము అని గడువుగోరి యా భృత్యునంపి తాను వాని వెదకుటకై బయలుదేరి పోయి పోయి యొకనాడు రాత్రికి గుముద్వతీ నగరము చేరెను.

అందొక గృహస్తునింట భుజించి భోజనాంతరమున అయ్యా ! ఈ పట్టణమున దేవగప్తుండను బ్రాహ్మణకుమారుఁడు రాలేదుగదా యని వాని గురుతులు జెప్పిన విని యప్పారుఁడు విస్మయమేపార భూసురోత్తమా అతఁడు నీకేమైనఁ జుట్టమా యని యడిగిన నా కుమారుండేయని జెప్పెను. ఆ మాటవిని యా యజమానుఁడు నీ కుమారం డీ యూరెప్పుడు వచ్చెనో మాకుఁ దెలియదుకాని మొన్న రాజపుత్రికను జచ్చినదానిం బ్రతికించె నా వృత్తాంతము చెప్పెద నాలింపుము.

మదపుటేనుగు కథ

మా రాజునకు లేక లేక యొక్కరితియె కొమారై యుదయించినది. దాని పేరు కౌముది. ఆ చిన్నది మొన్నటి ప్రాతఃకాలమున బల్లకియెక్కి యుద్యానవనమున కరుగుచున్నది. అట్టి సమయమున నుత్తరపు తోటలోనున్న పట్ట పేనుగకు మదముదిగిన నది యొడలెఱుంగక గొలుసులం ద్రెంచుకొని మావటీండ్రజంపి చెట్టుకొమ్మల విరచుచు రౌద్రావేశముతోఁ బట్టణముమీదబడి కనంబడిన జంతువులనెల్లదుండాగ్రంబున మోది జంపుచు గాలంద్రొక్కి రాచుచు జీల్చుచు జనుల జత్రవధ జేయఁదొడంగినది. ప్రజలు హాహాకార నినాదములతో దెసలకుఁ బారదొడంగిరి కొంధరాయుధపాణులై యెదిరించి సదమదము చేయఁబడిరి. కొందరు ప్రాణభీతిఁ జెట్టులెక్కియుఁ గొమ్మలతోఁ గూడ భజింపఁబడిరి. ఈ రీతి నాభద్రదంతావళము వీరభద్రుండువోలె రౌద్రరసంబునఁ బ్రజల మర్థించుచుఁ దసదెస వచ్చుచుండుటంజూచి రాజపుత్రిక పల్లకీ మోచేడి బోయెలు వెఱచుచు మఱలి పట్టణముదెసకు నతివేగముగా బరువెత్తఁ దొడంగిరి.

అంతలో నాదంతావళము తఱముకొని వారిచెంతకు వచ్చుటయు నా బోయెలాతురము నొందుచు నా శిబిక నేలం బడవైచి తలయొక దారింబారిపోయిరి. జీవితముకన్న తీపుగలది మఱియొకటిలేదు గదా! అప్పుడమ్మత్తంగజము ఘీంకారముఁ గావింపుచు నా పల్లకీ దండికిఁ దొండంబుజుట్టి యెత్తు నంతలో నందున్న రాజనందన తటాలున నేలకు దూఁకి పారిపోవఁ దొడంగినది. ప్రాణమున్నంతవరకు జీవితాశ వదలదుగదా.

అట్లావేదండంబు తుండంబున నాపల్లకినెత్తి నేలంబడగొట్టి కాలితోఁ ద్రొక్కి వేయిచెక్కలు గావించినది. అందా రాజనందన యుండిన నేమగునో ? ఆ దంతియంతటితో విడువక వడివడిఁ బరుగిడుచున్న యా చిన్న దానిమీఁదికి బోఁదొడంగినది. అప్పుడు దూరమందుండి ప్రజలు రాజపుత్రిక చచ్చెనని యఱచిరికాని యొక్కడైన నడ్డుపడరైరి.

అవ్వేదండంబు కుండాదండబు సాచి య్యయండజ యానంబట్టి కొనఁబోవు సమయంబున నెక్కడినుండి వచ్చెనో యొక విప్రకుమారుం డంతలోఁ గలసికొని యెడమచేత నా నాతిం బట్టుకొని కుడికరంబున నగ్గజకరం బదిమిపట్టి యట్టెనిలఁబెట్టెను. ఆహా ! ఆ మహామహుని బాహుదండంబు తుండంబుపై నిడినంత నవ్వేదండంబు మంత్రించినట్లు కదలక చిత్తరువుమాడ్కి నిలువంబడినది. ఎంత చిత్రమో ? అప్పు డప్పడతి యప్పురుషసింహు నెడమపార్శ్వంబు బిగ్గరం గౌఁగిలించుకొని కన్నులం దెఱవక భయంబునఁ బెనుగాలింగదలు తీవయుంబోలె వణకఁ జొచ్చినది.

ఆ భూసురసూనుండు పూవుఁబోడీ ! భయపడకుము. ఈ మదగజము నిన్నే మియుం జేయనేరదు. దీనిపై నెక్కుము తలపూవు వాడకుండ నిన్న మీ యింటికిఁ జేరుతునని పలుకుచు స్తంబేరమమును నేలంబండఁ బెట్టిన నా రాచపట్టి యతని పార్శ్వంబు విడువక భీతియై దానిపై కెక్కినదికాదు. అప్పుడతం డొకచేత నేనుఁగు తొండంబు బట్టుకొని యొకప్రక్క నక్కలికి నానికొని పట్టణాభిముఖుండై నడువఁ జొచ్చెను. అహితుండికునకు వశ్యంబైన కుండలియుంబోలె నమ్మాతంగం బతని యాజ్ఞకు లోనై యనుచరుండట్లు పార్శ్వభాగమున నడుచుచుండుటఁజూచి వారు లద్భుతరసావేశ హృదయులై యతని నయ్యతివంగాపాడ నరుదెంచిన భగవంతుఁడని స్తోత్రములు చేయుచు గ్రమంబున భయంబు వాసిమూగికొనఁ దొడంగిరి

అంతలో మదగజంబు కౌముదింబరిమార్చు చున్నదన్న వార్త విని యా భూభర్త యత్యంత దుఃఖముతో నాయుధపాణులైన పెక్కండ్రు వీరభటులతోఁ గూడికొని యతి రయంబున నా దెస కరుదెంచుచు నెదుర నమ్మదగజ ---------- లిరువంకల నలంకరింప నభిముఖముగా వచ్చుచున్న యా విప్రకుమారుం గాంచి హర్ష పులకాంచిత శరీరుండై యమ్మత్తకాశిని యప్పురుషసింహుని వలన రక్షింపఁబడిన వార్త పౌరు లెఱింగింప నతనిం దైవముగా భావించి తత్పాదంబులకు సాష్టాంగ నమస్కారము గావించి బలువిధములఁ గొనియాడెను. మఱియు సాధ్యసవికలమతియై యొడలెఱుంగక వివశయైయున్న కౌముది నూరడించుచు వేరొక యందలమును దెప్పించి యందమ్మందయానం గూర్చుండఁబెట్టి యంతఃపురమున కనిపెను. అప్పుడా ధోరణులు పెక్కండ్రువచ్చి యవ్వారణమును బుటునిగళంబులంగట్టి తీసికొనిపోయిరి. తరువాత నా భూతలనేత నా విప్రకుమారుని ప్రభావము పెక్కు తెఱంగులఁ గైవారము జేయుచు నతని నొక యందలముపై నెక్కించి యూరేగించి విహారసౌధములోఁ ప్రవేశ పెట్టించి యుపచారంబులం జేయ బెక్కండ్ర పరిచారకుల నియమించెను. ఇంతవట్టు కథ నిన్న జరిగినది. ఆ చిన్నవానికిఁ బదియాఱేడుల ప్రాయము గలిగియున్నది. వాని పేరు దేవగుప్తుండని చెప్పినట్లె జ్ఞాపకము. తక్కిన లక్షణములన్నియు మీరు నుడివినట్లున్నదని యా వృత్తాంతమంతయు జెప్పెను.

ఆ వృత్తాంతము విని విష్ణుగుప్తుండు మిగుల సంతసించుచు మఱునాఁడు ప్రొద్దునలేచి యడిగి తెలిసికొని విహారసౌధమునకుఁ బోయి యందు దేవగుప్తుఁడను చిన్న వాఁడున్నవాడా ? యని యందలివారల నడిగిన వారిట్లనిరి. అయ్యా ! దేవగుప్తుడు మా రాజపుత్రిక నాపత్సముద్రంబునుండి లేవనెత్తి నిన్నటివఱకు నిందే యుండెను. నిన్న నెవ్వరో కళావంతుడను విద్వాంసుఁడు జదరంగమాడి యోడించిన వృత్తాంతము చెప్పుచు నిప్పుడతండు మలయధ్వజుని యాస్థాన పండితులతో బ్రసంగింప నరిగేనని యెఱింగింపఁ దొందర పడుచుఁ గరికలభంబుమీఁది కుఱికెడు సింహ పోతంబు చందమున నందు నిలువక హుటాహుటి పయనంబుల నతండా ప్రోలి కరిగెనని యా వృత్తాంతము జెప్పిరి.

ఆ కథవిని విష్ణుగుప్తుండు పరమానందము జెందుచున్నందువెడలి కొన్ని దినంబులకుఁ దానుగూడ మధురాపురమునకుం బోయెను. అందు గొందఱు విహితు లెదురఁబడుటయు నతండు మిత్రులారా ! ఇచ్చటికి దేవగుప్తుండు వచ్చెనా ! సభజరిగినదా ? విశేషములేమని యడిగిన వారిట్లనిరి. విష్ణుగుప్తుండును గళావంతుఁడునుజక్కగాఁ బ్రసంగించిరి కుశలవులవలె నొప్పుచున్న యా విప్రకూమారుల నిరువురంజూచి సభ్యులు మిక్కిలి యక్కజమందజొచ్చిరి. వారిరువురు మూడుదినములు సకల విద్యల యందును హోరాహోరీగాఁ బ్రసంగించిరి, మూఁడవనాఁడు దేవగుప్తుఁడు కళావంతుని దాసోహమనిపించి పందెమును గెలిచెను. కళావంతుఁడు దేవగుప్తుని బృహస్పతియని యా సభలో స్తుతిఁజేసెను.

అప్పుడందఱు దేవగుప్తునిపైఁ బుష్పవర్షము గురిపించిరి. మనరాజుగారు మూఁడు గ్రామములను దానపట్టమువ్రాసి దేవగుప్తునకిచ్చిరి. కళావంతుఁడు దేవగుప్తు నాశ్రయించి తిరుగుచుండెను. నిన్ననే యిరువురును గలిసి మీ యగ్రహారమున కరిగిరని చెప్పిన విని విష్ణుగుప్తుండు సంతోష పారావారావీచికలం దేలుచు నతిరయంబునఁ దనయింటికింబోయెను. అని యెఱింగించి మణిసిద్ధుండు తదనంతరోదంతం బవ్వలి మజికీయం దిట్లని చెప్పందొడంగెను.

నలువది యేడవ మజిలీ

కౌముది కథ

గోపా : వినుమొకనాఁడు కుముద్వంతుని కూఁతురు కౌముది యంతఃపురమున సఖులతో నిట్లు వితర్కించినది.

కౌముది – ప్రజ్ఞావతీ ! కళావంతున కాయుత్తరమిచ్చి వచ్చితివా ?

ప్రజ్ఞావతి - నీవు చెప్పినప్పుడే యిచ్చి వచ్చితినికాదా ?

కౌ - ఆయుత్తరము జూచికొని యతం డేమనెను ?

ప్ర - మందహాసము గావించి సంతసించితిమని చెప్పుమనియె.

కౌ - అతండనుకూలుండని నీకు దోచినదా ? నవ్వుచున్నా వేమి ?

ప్ర - వానివలచియే యాటఁ గట్టించుకొంటివాయేమి ?

కౌ — అమ్మక చెల్లా ? వానిబుద్ధికౌశల మేమని వక్కాణింతును అప్పుడీసుచే నేమాటయుఁ బలికితినికాను.

ప్ర - ఎట్లయినను దనకన్న చిన్నవానిం బెండ్లియాడుట లోకవిరుద్ధమగు నని నవ్వుచున్నాను.

కౌ - అందులకు నవ్వనక్కరలేదు క్షత్రియులకదియాచారమే. శ్రీరాముని కన్న సీత యెన్నియేండ్లు పెద్దదియో యెఱుంగుదువా ?

ప్ర - లెస్సయేకాని మఱియొక వదంతి వింటి నది నీ మనోరధమునకు నిరోధకమని తలంచుచున్న దాన.

కౌ - అదియేమియో చెప్పుము.

ప్ర - ఏనుఁగబారిందప్పించి నిన్నుఁ గాపాడిన విప్రకుమారునకుఁ బెండ్లి చేయవలయునని మీతండ్రి తలంచుచున్నట్లు కింవదంతి పుట్టినది.

కౌ - చాలుచాలు భూమిలో, హారములో, నగ్రహారములో కాక యంత మాత్రమునకే మా తండ్రి నన్ను వానికిఁ బెండ్లిచేయుటకు సమ్మతించునా ? ఆవదంతి వట్టిది.

ప్ర - కళావంతునేమి చూచి వరించితివి ?

కౌ -- అదియా ? మేలు మేలు వాని విద్య యొక్కటిచాలదా ! -------------- ప్రతియున్నదా ! అంతకన్నఁ గావలసినది యేమున్నది.

ప్ర - నేను వానింజూడలేదు కాని వాఁడును ----------------------- మన ప్రజ్ఞావతి యంతయు నెఱుంగును.