కాశీమజిలీకథలు/నాల్గవ భాగము/42వ మజిలీ

వృంతము. కధా, సాచుర్యములేని వస్తువులచి సతుగపుగదా య పలుకులు మనసు . మనం తి .......... కును.

నలువది రెండవ మజిలీ

సx | 1:8 . . . . . గుడి సమ thics | మణిమvie మరిని 1 గోపా | it. "ii) - 4 | Tara r) :). 1 . మ . . . . రసము ? నంది

  • 1.1 kish a vive an ai - 1 న్న.. సుగనల సూకరణములు

• మనుషులు మున్న ముకుం జూచి ఎలుగుపడుచు సం...దు, విను. అప్పటి క న నాసనముసుం , యవ్వBS | దాకినది. ఆయు లి: " నా నిరుషుడు మంచము శిశంబున ఏడుకొని చకసమునం ఊపుచున్నట్లు కసంబడినది. ద్వ లాంతము వక్కాణించి నాకాసండముఁ గలుగు జేయుఁడని ప్రార్థించిన నాసిద్ధుండు ఉద్దయుఁ బ్రీతుండై మన ప్రభావమునఁ చదు దంతముఁ డెల్లముగా నాకలించుకొని తల యూచుచు నిట్లు చెప్పం దొడంగెను.

పుష్ప హాసుని కథ

గోపా ! వినుము గంగాతీరంబునఁ సింధుగారంబను నగరంబున ధనంజయుఁడను రాజు రాజ్యంబు సేయుచుండెను. ధర్మశీలుండగు నానృపాలునకుఁ కాలక్రమంబుస సుందరకుం డను నందనుండను లలితయను తనూజయుం జనించిరి. అమ్మహారాజొకనాఁడు పేరోలగంబున్న సమయంబునఁ బ్రతీహారి వచ్చి నమస్కరింపుచు దేవా ! గుహుండను పల్లెవాఁడు పదియేఁడులు ప్రాయముగల కొడుకు నెత్తుకొని వచ్చి ద్వారంబున దేవదర్శనంబునకై వేచియున్న వాఁడు. ప్రవేశమునకు సెలవే ? యని యడిగిన న న్నరపతి శిరఃకంపమున నంగీకారమును సూచించిన నా ద్వారపాలుం డరిగి వానిం దీసికొని పచ్చెను . గుహుండు రాజు నెదుటఁ జంకనున్న కుమారునిం దింపి నమస్కరించి పుత్రునిచేతఁగూడ దండము పెట్టించెను. లేకులం వెగడు సోగకన్నులును నిండుచంగుతుం బురడించు ముద్దు...గం.. తను చెక్కులు వెడఁజయుడము దీర్ఘ బాసువులు సువర్ణచ్చాయం ను.. | అదన పూపు గ్రమ్ము కొడపతుమ్మెడంవల ముంగతులు మె*ము) పై ... 0:34 ..... : నిలపవచ్చిన కంతుఁడో జయుతుఁడో యసం తన ప స్వప్న . చిన్న 0 గాంచి మాసృపతి ముతాశ్చర్య నటుడు అయ్యారే ! యిట్టిపాపని మాయట్టి చక్రవర్తుల కులంబునం బుట్టింపక నికృష్ట కులంబునం బుట్టించిన పరమేష్టి డిట్టినఁ దప్పేమి ! ఇసిరో ! విధాత మెప్పుడు నసదృశకార్యంబులే చేయుచుండునని తలంచుచు నోరీ ? వీఁడు నీకొడుకే ? అని యడిగిన వాఁడు స్వామీ ! దేవరదాసుఁడు వీఁడు నాకొడుకే యని యుత్తరముఁ జెప్పెను.

అప్పు డప్పాపని దాపునకు రప్పించుకొని రాజు వాని బుగ్గల నల్లన లేఖినిం బొడుచుచు నోరీ ? బాలకా ! నీపేరేమని యడిగిన వాఁడు నగుచుఁ బుష్ప హాసుఁడని యుత్తరముఁ జెప్పిన విని యతండోహో ! మంచి పేరే పెట్టితివే. వీని నవ్వే వీని పేరు చెప్పుచున్నదిగదా! అని మెచ్చుచు నోరీ ! గుహుఁడా ! నీవేమిపనికై వచ్చితి వని యడిగిన గుహుండు మెల్లనఁ దన తలపాగలో మడిచి యుంచిన రత్న కంకణ మొకటి పైకిఁదీసి ఱేని ముందర నిడి యిట్లనియె.

క. గాలమిడ గండ నేఁడొక
   మేలగు మీనంబు దొరకె మేమది గోయం
   గ్రాలుచున్నది తదుదర
   గోళంబున వలయుమిది యకుంఠితరుచులన్.

సామీ ! యిది మాబోఁటివారు ధరింప నర్హులు కారనిదేవరకుఁ గానుకగాఁ దీసికొనివచ్చితినని చెప్పెను. అప్పుడా యేకిమీ డాకంకణముఁ గై కొని త్రిప్పిచూచి యందలి విలాసమరసి పరికించి హా ! గంధర్వదత్తా ! హా ! సహోదరీరత్నమా ! నిన్నుఁజూచి యెన్నిదినములైనదే. అయ్యో ! నీ సౌందర్యమంతయు నీటిపాలైనది కాఁబోలు. అక్కటా ! నీకాపుర మెంతలో మాయమైపోయినది. అయ్యారే ! నీ రాజ్యము గంధర్వనగర ప్రాయమైనదె యని శోకించుచుండ నర్మసఖుండు దేవముఖుండను బ్రాహ్మణుఁడు దేవా 1 యిదియేమి ? యకారణముగా శోదరిం దలంచికొని విచారింపుచున్నారు. వగపు నిరర్థకమని యెఱుఁగరా ? యని యోదార్చిన రాజిట్లనియె.

వయస్యా ! ఇది మన గంధర్వదత్తకంకణము. ఈపల్లె వానికిఁ మత్స్య గర్భంబున దొరికినదఁట చూచితివా ? దీనిం బట్టిచూడ మనవారు గంగానదింబడి సమసిరని తలంచెద. నాఁటిరాత్రి వారుప్పరిగపైఁ బండుకొనిరని చెప్పినమాట విశ్వసింపఁదగియుండలేదు. అందేమి కాపట్యమున్నదో తెలియదు. ఎటులయిననేమి యల్పకాలములో విధి చలపట్టి మూఁడు ప్రాణంబుల గావు పెట్టెను. మన లలిత జనించినప్పుడు తనకుఁ గోడలుగలిగినదని యది బ్రహ్మానందము పొందినది. ఏముచ్చటయు దీఱినదికాదని వగచుచు నావలయము లలిత కిమ్మని ------------- నంతఃపురమునకుఁ బంపి యతండు గన్నీరు దుడిచికొనుచు గుహున కిట్లనియె

నిషాదపతీ ! నీవీవస్తువు దాచుకొనక తెచ్చి మాకిచ్చినందులకు మిగుల సంతసించితిమి. నీకెద్దియేని యభీష్టముండిన వక్కాణింపుము గ్రక్కునందీర్తు ననవుడు నాగుహుఁడు సామీ ! కోరికతోడనే మీ దర్శనమునకు వచ్చితినికాని మంచిసమయమైనదికాదు. నా యిచ్చిన వస్తువు దేవరకు విచారమేకాని, సంతోషము గలుంగఁ జేసినదికాదు. మఱియొకప్పుడు దర్శనము కావింతు నిప్పటికి సెలవియ్యుండని వేఁడిన నప్పుడమిఱేఁ డిట్లనియె. ఓహో ! యట్ల నవలదు. నీ విచ్చిన కంకణము మాకు హృదయస్థానమైనది. అట్టి సంతోషము మరియొక టేదియుం గలుగఁజేయనేరదు. నీకామితము తెలుపుము సంశయింపకుమని పలికిన గుహుండు, సామీ ! నా కీ కుఱ్ఱవాఁడు లేకలేక కలిగెను. మిక్కిలి గారాబముగాఁ బెనుచుకొనుచున్నాను. వీఁడేది కోరినను దెచ్చి యిచ్చుచుంటి. నిప్పుడు నా కలవికాని కోరికలు కోరుచున్నాఁడు, ఎట్లు తీర్తును ? వినుండు. తనకిప్పుడు గొప్పగొప్పసదువులు సెప్పింపు మని నిర్బంధించుచున్నాఁడు. అవి యేమియో నాకుఁ దెలియవు. చిన్నబడి గురువులు దనకుఁ బనికిరాఁరట. దేవరవారి పాఠశాలలోఁ జదువుకొనునఁట. వీనికిఁ జదువు చెప్పింప దేవరం బ్రార్థింపుచున్నానని కోరిన నవ్వుచు యాభూపతి యౌరా ! పల్లె పిల్ల వాని కెట్టి కోరికలున్నవి ! కానిమ్ము. వీని రూపమునకుఁ దగిన విద్య కావలసినదే; అవశ్యమట్లే చెప్పించెద. పాఠశాల కనుపుచుండుమని చెప్పి తన పుత్రునితో సమముగా వాఁడు కోరిన విద్య లన్నియుఁ జెప్పుఁడని యుపాధ్యాయుల పేర పత్రిక వ్రాసియిచ్చి యారాజు సభ చాలించి యంతఃపురమున కరిగెను.

గుహుఁడు పుత్త్రునితో నింటికిం జని మంచిముహూర్తము దెలిసికొని పుష్పహాసునిఁ బాఠశాల కనిపెను. అది మొద లా బాలకుండు ప్రతిదినము విడువక బడికిఁబోయి క్రమంబునఁ గావ్యనాటకాది గ్రంథముల తర్కవ్యాకరణాదిశాస్త్రములం జదివి సంగీతకళావైదుష్యము సంపాదించి యశ్వగజాందోళికారోహణక్రీడా వై దగ్ద్యము గలిగి శస్త్రాస్త్ర విద్యాపరిశ్రమ యందెక్కుడుగాఁ బనిచేయుచుఁ బడులలో నన్నిటిలో నఖండపాండిత్యము సంపాదించి యసమాన ప్రజ్ఞాదురంధరుండయ్యెను. పుష్పహాసుని విద్యాగ్రహణ సామర్థ్యమునకు మనీషా కౌశల్యమునకు నుపాధ్యాయులు మిక్కిలి యక్కజపడజొచ్చిరి. రాజనందనుఁడగు సుందరకుఁడు పుష్పహాసునితో నన్ని విద్యలుం బాఠము జెప్పుకొనియెనుగాని యొక్కదానియందైన నించుకయుఁ బ్రవేశము గలిగినదికాదు.

ఇట్లుండ నొకనాఁడు ధనంజయనృపాలుం డేమిటికొ రాజమార్గంబున నరుగుచుఁ దురంగమ మెక్కి యతివిచిత్రవేగ గమనంబున వచ్చుచున్న పుష్పహాసుం జూచి వెరఁగుపడుచు నీ యశ్వికుండెవ్వఁడని పరిచారకు నడుగుటయు వాఁడు 'దేవరా ! వీఁడు గంగయొడ్డుననున్న గుహుండను పల్లెవాని కొడుకు. వీని పేరు పుష్పహాసుఁడు. దేవరయే వీనికి విద్యఁజెప్పించుచున్నారు. మఱచితిరా ?' యని చెప్పిన నప్పుడమిఱీఁడు స్మరణమభినయించుచు నోహో ! వీఁడా ? యెంత వాఁడయ్యెను ? వీని కశ్వారోహణ మందు మంచి నేర్పుకుదిరినది. ఇంతవఱకు వీఁడు మన బాఠశాలలోఁ జదువు చున్నాఁడా ? మన చిరంజీవితో సహాధ్యాయిగా నున్నవాఁడు గాఁబోలు చిరంజీవి యిట్లు గుఱ్ఱమెక్కఁగలఁడా యని యడిగినఁ గింకరుఁడు దేవా ! యువరాజుగారు గుఱ్ఱ మెక్కగా మేము చూడలేదు. పుష్పహాసుఁడు తఱచుగఁ గనంబడుచుండును. వీని కింకఁ జాలవిద్యలలోఁ బ్రవీణత గలదని చెప్పుకొనియెదరని పలికిన విని రాజు సరే నీపుపోయి పుష్పహాసుని సుందరకుని వెంటనే సభకుఁ దీసికొనిరమ్మని యుపాధ్యాయులతోఁ జెప్పుము పొమ్మని పలికి నగరికరిగెను.

రాజశాసనమువిని నాఁటిమధ్యాహ్న ముపాధ్యాయులు శిష్యులు నిరువుర వెంటఁబెట్టికొని యోలగంబున కరిగిరి. ఆ దివసమునఁ బుత్రు విద్యాపరిశ్రమముఁ బరీక్షింపఁ తలంచి పెక్కండ్రఁ బండితుల రప్పించి మంత్రిసామంతహితపురోహిత వితతి సేవింప నిండు కొల్వుండి యా భూపాలుండు పాఠశాలనుండి వచ్చిన కుమారుం గారవింపుచుఁ బుష్పహాసు నాదరింపుచు వారి నమస్కారంబులం గై కొని దీవించి యుచితాసనములఁ గూర్చుండఁజేసి తొలుతఁ గుమారునితో నిట్లనియె.

రాజు - వత్సా ! నేను రాజకార్యవ్యగ్రతచే నీవిద్యావ్యాసంగమును గఱించి యించుకయు విమర్శింపనై తి. ఏయేవిద్యలం జదివితివి ? ఏయేవిద్యలందుఁ బ్రావీణ్యము గుదిరినది ? విశేషించి శస్త్రాస్త్ర విద్యలయందు గజాశ్వారోహణలయం దెక్కుడు పరిశ్రమము జేసితివా ?

పత్త్రుఁడు – తండ్రీ ! నీ యొద్ద నబద్ధము చెప్పనేల ఈ యుపాధ్యాయులు పల్లెవానియం దెక్కుడు పక్షపాతము గలిగి నాకుఁ దిన్నఁగావిద్యలం గఱపినారుకారు. దానంజేసి మీతోనేమని వక్కాణింతును.

ఉపాధ్యాయుఁడు - (భయముతో) ఏమిరాజపుత్త్రా ! అసత్యములాడు చున్నావు? నీయెడ మే మేమికపటముఁజేసితిమి? నీకంటె వాఁడెక్కుడువాఁడా! రాజా ! మేమిరువురకు సమముగానే చెప్పితిమి.

రాజు - సరే పోనిండు. వీని కేయేవిద్యలం గఱపితిరి ?

ఉపా - అన్ని యుం జెప్పితిమి.

రాజు - పుష్పహాసా ! పెద్దవాఁడవై తివే. ఈ యుపాధ్యాయులు నీవు కోరిన విద్యలన్నియుం జెప్పిరా ?

పుష్ప - (లేచి నిలువంబడి) దేవర యనుగ్రహము గలిగియున్న గొఱంత యేల గల్గెడిని ? దయతో గురువులన్నియుం జెప్పిరి. చదివితిమి.

రాజు - సుందరకుఁడు నీతో సమముగాఁ జదివెనా ?

పుష్ప - చదివిరి.

రాజు - గరువులు నీ యెడఁ బక్షపాతముఁ జేసిరని చెప్పుచున్నాడే మో? పుష్ప - వట్టిది. దేవా ! అది స్వకపోలకల్పన. నేనాయన కన్న నధి కుండనా ?

రాజు - మీ యిద్దఱి విద్యాపరిశ్రమము చూతము. శాస్త్రములోఁ గొంచెము ప్రసంగముఁ జేయుఁడు.

పుష్ప - చిత్తము. ఏ శాస్త్రములోఁ బ్రసంగింతము.

రాజు - చిరంజీవి ! నీ యభినివేశ మెందు ? తర్కము యుక్తి యుక్తముగా నుండును. దానిలో నీవు మొదటఁ బూర్వపక్షముఁ జేయుము.

పుత్త్రు - సీ ! పాడుతర్కము దానిపేరు సెప్పిన నా కసహ్యము.

రాజు - పోనీ, వ్యాకరణమునఁ ! బ్రసంగింపఁ గలవా ?

పుత్త్రు – సందేహ మేలా ?

రాజు – ఏదీ. చక్కగా ననువదించి పూర్వపక్షము చేయుము.

పుత్త్రు - సరే. పుష్పహాసా ! నా యెదుటికిరా. “అత్తునకు సంధి బహుళము" అని చెప్పియున్నారుగదా ? మేనత్త మేనియత్త‌ యనినట్లే చింతాకు , చింతియాకు అని యేల చెప్పగూడదో చెప్పుము.

(అందఱు) పకపక నవ్వుచున్నారు).

పుష్ప - మిత్రమా ! బాలురు చదుకొనెడు తెలుఁగు వ్యాకరణము నడిగెద వేల ! పాణినీయ వ్యాకరణమం దడుగుము. ఇది పరిహాసముకాదు.

సుందరకుఁడు – ఇది మాత్రము వ్యాకరణము కాదా యేమి ? నా యిష్టమైనదానిలో నడిగెద, వానికి నీ యాజ్ఞ యేల ? తెలిసినఁ జెప్పుము. లేకున్న రాదనుము.

పుష్ప - దీనిలో నేమియున్నది ? బహుళ మనుటచేతనే చింతాకు, అనుచోట వైకల్పికము లేదని తేలుచున్నది.

సుంద — బహుళ మనఁగా నేమి ?

పుష్ప - ఒక్కొకచోటఁ గలిసి యొక్కకచోటఁ గలియనప్పుడు బహుళ మని ప్రయోగింపబడును.

సుంద – అది కాదు. నీకు దాని యర్థమే తెలిసినది కాదు. రెండు విధములుగా వచ్చునదే బహుళము.

పుష్ప - (తెల్లపోయి సభవంకఁ జూచుచున్నాడు.)

రాజు - చాలు చాలు. నీ ప్రసంగము వినసొంపుగానే యున్నది. నీ వక్తృత్వము తెల్ల మగుచున్నది. పరిహాసము మానుము.

పుత్త్రు - తండ్రీ ! నేడు నా మది వేడుకగా లేదు. అందుమూలమున నిట్లు పరిహాసముగా మాటాడుచున్నాను. రాజు — పోనీ. విద్యలమాట యటుండనిమ్ము . పుష్పహాసుం డెక్కునట్లు గుఱ్ఱ మెక్కి నడిపింపఁ గలవా ?

పుత్త్రు – అయ్యో ! గుర్రమే యెక్కలేనా ? నాతో సమముగా నీ పల్లెవాఁ డెక్కగలడా ?

రాజు - ఎవఁడురా ? అక్కడ మన పెద్ద గుర్రమునకు జీనుగట్టి తీసుకొనిరా?

పుత్త్రు - అబ్బా ! యీ కాలిలో నొప్పిలేకున్న నా ప్రజ్ఞఁజూపుదును గదా. బాబా ! యిప్పుడు వద్దు. మఱియొకప్పుడు చూతురుగాక. అప్పుడు సభ్యులు కడుపుబ్బులాగునఁ దలలువంచుకొని నవ్వుచు రాజు చూచునేమో యని వెఱచుచుండిరి. పుష్పహాసుండును నాపుకొనలేక పక్కున నవ్వెను.

రాజపుత్త్రు --- (కోపముతో) ఏమి నీ కండకావరము. ఏఁటిలో నీటికాకివలె మునుఁగుచుఁ జేపలంబట్టి బ్రతికెడు బెస్తవానికిఁ జదువుఁ జెప్పింపఁబట్టి గదా పోతరించి యట్లు నవ్వుట.

పుష్ప - (ఇంచుక యలుకతో) జాతము దైవాయత్తమైనది. దానిగుఱించి పలుమా రాక్షేపించినం బ్రయోజన మేమి ? పురుషకారమును గురించి మాటలాడ వలయు.

రాజు - (వారించుచు నుపాధ్యాయులం జూచి) దేశికోత్తములారా ! ఇంత కాలమునకు మా వానికి నేరిపిన విద్యయిదియా ?

ఉపా - దేవా ! మే మేమి చేయుదుము ? యువరాజుగారికి జదువు మనినఁ గోపము. ఊరకున్నఁ బరాకు. మందలించిన నభిమానము. గ్రహణశక్తి తక్కువ, యశ్రద్ధ పెద్దది. దబ్బరకు మేరలేదు చదువెట్లు వచ్చునో చెప్పుఁడు.

రాజు - చాలు చాలు మంచివిద్యనేర్పితిరి. అందఱుం బోవచ్చునని పలికి లజ్జావిషాదమేదురహృద యుండై లేచి నృపతి యరుగుచుండ సుందరకుండు బాబా ! యీ పుష్పహాసుఁడు మన రాజ్యము లాగికొని తానే యేలుకొనియెదనని యందరితోఁ జెప్పుచున్నాఁడట వింటిరా ? యని చెప్పిన, సీ! సిగ్గులేక ప్రేలెదవు. నీవంటి పరమ నిర్భాగ్యుఁడు క్షత్రియ వంశంబునం బుట్టిన తరువాత నెవ్వరేమి చేసినం జేయఁ గలరు. పోపొమ్మని పలికి లోపలికి పోయెను పుష్పహాసుం డింటికిం బోయి యా సభావిశేషము లన్నియుం దండ్రి కెఱింగించెను. రాజపుత్త్రుఁడు వానియందు బద్ధ మత్సరుండై యున్న వాఁడని యెఱింగి గుహుఁడు నాఁటంగోలెఁ బాఠశాలకుఁ పోవలదని కుమారునికిం జెప్పెను.

మఱి యొకనాఁడు దైవవశంబున రెండవ కంకణముగూడ వెనుకటివలె గుహునకు మత్స్యగర్భంబునం దొరికినది. దానిం గొడుకున కిచ్చి నాయనా ! దీనిం దీసికొనిపోయి కృతజ్ఞతఁ జూపుచు విద్యాప్రదాన దక్షణగా నృపాలున కిచ్చిరమ్ము పొమ్మని పంచిన పుష్పహాసుం డొకనాఁడు సాయంకాలమునఁ జక్కగా నలంకరించుకొని యా కంకణముం బూని కోటలోనికి పోయెను. అప్పుడు కొల్వుకూటంబు వివక్తంబై యుండుట కచ్చెరువందుచుఁ గొంచె మవ్వలికిం జని మనుష్యులజాడ నరయుచుండ లలిత సఖురాలు తిలక యసు కలికి యచ్చటి కేమిటికో వచ్చినం జూచి బోఁటీ ! నేఁడు రాజసభయం దెవ్వరును లేరేమి ? ఒడయం డెందున్నాఁడని నది నరపతి వేఁటకై యడవికిం జనియె. దానం జేసి యోలగంబు శూన్యంబై యున్నదని చెప్పి నీ వెవ్వండవు ? ఏమిపనికై వచ్చితి ? వని యడిగినఁ బుష్పహాసుండు తన కులశీలనామంబు లెఱింగించి ఱేనికి వెనుక మేమొక కడియం బిచ్చితిమి. రెండవదికూడ దొరకుటచే నదియుం దెచ్చితి. దాని నిచ్చుటకై పరిపృధు నడిగితినని చెప్పెను.

ఆ మాట విని యా బోఁటి యోహో ! అదియా ? తెలిసినది. నిలు నిలు మది మా రాజపుత్రిక ధరించియున్నది. రెండవదానికొరకు వేడుకపడుచున్నది. ఆమెతోఁ జెప్పివచ్చెదనని పోయి యంతలో మఱలవచ్చి ఓయీ ! భర్తృదారిక నిన్నా కడియ మంతఃపురమునకుఁ దీసికొని రమ్మన్నది. వత్తువే యనుటయు నతండు సంశయించుచు నిప్పుడు రాను. ఱేఁడు వచ్చినతరువాత మఱలఁ దీసికొనివచ్చెద. పోయివత్తునని రెండడుగు లిడినఁ దిలక యడ్డము నిలిచి పోవలదు పోవలదు వెఱవకుము. మఱెవ్వరు నందులేరు. ఇమ్మండనంబు దాల్ప నమ్మగువ మిగుల వేడుక పడుచున్నది. పదపద మని త్రోసినది.

లలితకథ

అతం డడుగులు తడఁబడ నప్పడతివెంట మెల్లఁగాఁ గక్ష్యాంతరమ్ములు గడచి రాజపుత్రిక వసించియున్న శద్ధాంతమున కరిగెను. నాఁడు దైవికముగాఁ జెలికత్తియ లందఱు తల యొక పనిమీఁదం బోయిరి. లలిత యొక్కరితియే చంద్రకాంత శిలావేదికపయిం గూరుచుండి వీణాగాన పరిశ్రమ చేయుచున్నది. అప్పుడు తిలక వానిని ద్వారదేశమున నిలువంబెట్టి లోపలికిఁబోయి లలితా ! ఆ చిన్నవాఁడు వచ్చి యున్న వాఁడు; కడియము పుచ్చుకొననా ? వానినిఁ దీసికొని రానా ? యని యడిగిన సప్పడఁతి వాఁడేల ! కంకణమే తెమ్మనిచెప్పినది. తిలక యా వయసుకాని చెలువ మా లలనకుఁ జూపింపఁ దలచి పొలఁతీ ! య వెరవరి కడియము నా కీయఁ డట. తానే నీచేతఁ గూర్తుననుచున్నాఁ డేమనియెద ? వనఁ దద్వసులోభంబునంజేసి కానిమ్మి. పల్లెవాఁడుగదా ! రమ్మను మని పలికినది. అప్పడఁతి యప్పపుష్పహాసు నా విలాసిని చెంతకుం దీసికొనిపోయినది. అబ్బిబ్బోకవతి యబ్బురపాటుతో నా పల్లెవానింజూచి: అమ్మనేఁజెల్ల ? వీడెక్కడ పల్లెవాడే వీని రూపము త్రిభువనా సేచకంబై యున్నదిగదా ! యని విస్మయ సాగరంబున మునుఁగుచు నాత్మగతంబున_

.

ఉ. చెక్కులనిగ్గునెన్నుదురు • చెల్వు గనుంగవతీరు మోము మే
    ల్చక్కఁదనంబు జానుగుల • సౌరు భుజంబుల సోయగంబుమై
    చొక్కపుతళ్కు పేరురము • సుందరమెన్న వశంబె ? బ్రహ్మక
    మ్మక్క! యరుంధతీలలన • యైన వరింపదె ? వీని జూచినన్.

అయ్యారే ! వీనిం గాంచనగర్భుఁడు సత్కులసంజాతుం గావించినచొఁ గాంచనంబునకుఁ బరిమళం బిచ్చినట్లుండునుగదా ? యని వెరఁగందుచుఁ దెలకా ! నీవు చెప్పిన యతం డీతండే ? యని యడిగినది సఖీ ! వీని ప్రఖ్యాతి నీవెఱుఁగవు గాఁబోలు మన సుందరకునితోఁ జదువుకొని సకలవిద్యలయం దసమానుండని మొన్న రాజసభలో బిరుదము వహించినాఁడు. మీ యన్నగారే యోడిపోయిరి. ఈతండు గౌరవనీయుఁ డని పలికిన నక్కలికి స్మృతి నభినయించుచు నగు నగు. వింటి నా ప్రఖ్యాతుం డీతండేనా ? యా గద్దియపైఁ గూర్చుండుమనుము. అని మరుశరంబుల కగ్గంబైవడెందముతో వానియందమూరక చూచుచుండెను. పుష్పహాసుండును లోకాతిశయ సౌందర్యంబునఁ బొలుపొందు నయ్యిందువదనంగాంచి పంచశర విద్ధహృదయుండై మోహాతిరేకంబున నొడలెఱుంగక యిట్టెచూచుచుఁ దనచూపులఁ దదీయ విలోకనశృంఖలంబులకుం దగిలికొనఁ జేసెను.

ఇద్దఱు పెద్దతడ విట్లొండొరులఁ గనుంగొనుచుఁ జిత్తరువుల కరణిఁ గదల కుండుటయుం జూచి తిలక పలకరించుచు ననఘా ! నీవీ గద్దియం గూర్చుండుము. నీ కీ శద్ధాంత నిశాంత చిత్రప్రతిమ లంత వింత గలుఁగజేయుచున్నవియా యేమి ? విస్మయముతోఁ జూచుచుంటివని పలికిన నతండు దనచూపుని మఱలించుకొని యా పీఠంబునం గూర్చుండి, లలనా ! యగునగు నే నింతకుముం దింత వింత ప్రతిమలఁ జూచి యెఱుంగ. వీనిసోయగ మప్రతిమానముగదా! యని పలికెను.

అప్పుడు తిలక నాతీ ! కంకణము వానిచేతనుండగనే యబ్బురపడి చూచెద వేల ? చేతికి రాదా ? పిమ్మట సంతతముచూచి ముచ్చటపడవచ్చునులే యని మంద లించిన నచ్చంచలాక్షి తెలిసికొని యేదీ ? యిటులెమ్ము దానిం దాల్చు నుత్సుకత్వ మంత తొందర పెట్టుచున్నదని పలికినది. అప్పుడా కడియమును బుష్పహాసుఁడు తిలక కిచ్చెను. తిలక లలిత కిచ్చినది. లలిత దానిం బుచ్చుకొని మునుపటి కడియము పజ్జనిడి రెండిటికిని భేదము గానక సంతసించుచుఁ దిలకా ! నేఁడుగదా ! నా వేడుక తీరినదిఁ జోడులేక యిది ముచ్చటఁ జేసినది కాదుసుమీ: యని పలికిన ------------ అగు నేడను జోడుగూడినం గాని శోభించదని యుత్తరము చెప్పినది. లలిత దానిం దాల్ప నోపియుఁ జేతగానియట్ల భినయించుచుఁ దిలకను దనచేతఁ బెట్టమని కోరినది. అదియు నీకుఁ గానిది నా కలవడునా ? యని యుత్తరము జెప్పినది.

సకలకళానిపుణుండగు పుష్పహాసుఁడా భాసురగాత్రి ------------ గ్రహించి అయ్యో ? యిప్పుడు నేను మిక్కిలి ప్రమాదమైన పనిఁ గావించితిని. ఒంటిగా నీ యింటిలోనికి రాఁగూడదు. తుంది. వినినా va అనడిగం. ఆ ... నాస సకల విద్యలం గజపించ . మనకు విద్యాభివృద్ధి వితండే కారణము. ఆ bయ... 3. "పు :1.8నను ...... ....... ichు. ఆడ మనం: కుంతము . స్వగుం మviivin a..తంగా అమలు శృంఖల లు ఎ'చం: or and is in livinoit an ని స పుష్పవు | మీ పుతి. కli, చార్పి మరి మట్సు కత్వ.. . చుచున్నది. అది పనులను మనం గన్నది నీకు ...' నము. tvగం.... ! యను 3 Arry : 3 కు లు అతలు - కారులు అర... "తమును సుమా ! ఏ రండి 3 నెస్కుని. నేర్పడు... ! అయిన 1, 2 + $ 30 - Wటు నమ్మను. నా కంగలము . య. ...కిచ్చినది. ది... అని నీల చిప్పిస్ సులభముగానే తగిన, అతుడు చాల విడదీసి యిక నేటు చేయవలయునని యనఁ దిలక "ఎన్ని సారులు చెప్పదయు.. ! కడుము డూయేమి !" అని సర్మికులాడుచు లలికా : చే యిట్లు చాపుము. కంకణముఁ గట్టి పోఁగలఁచని చెప్పిన నప్పఁడు "మించుక వంచి తిర్యగ్విలోకనం:ుఁ జచుచుఁ బ్రహర్ష పులకితమగు చేయి చాచిసడి.

ఆతండును చేయి పట్టుకొని కంకణము రెండు మూడు సారులు త్రిప్పి త్రిప్పి చేతికిఁ దగిలించెను. అదియే పాణిగ్రహణ విధియుఁ గంకణధారణ మహోత్సవముగా సంకల్పభవుఁడు పండ్లి పెద్దయై చూపులనుజేలములకు బ్రహ్మముడులు సంఘటించెను. అట్లా నాతి చేతఁ గంకణము దగిలించి యక్కుమారుండు కలికీ యిఁక నేను బోయివత్తు ననుజ్ఞ యిండని వేఁడిన నచ్చేడియ తిలకా ! వీని కేమి పారితోషికము కావలయునో యడుగుము. ఇత్తుము గాక యని చెప్పినఁ బారితోషికం బడిగి యిత్తురా ? మీ యనుగ్రహమే కావలయునింతకంటె నొండొల్ల నని పలుకుచు నతం డయ్యంతఃపురము నుండి బయలువెడలి యొరులు చూతురేమో యను సందియముతో నొదుగుచు నల్లన నా మేడ దిగి యాస్థానము దాపునకు వచ్చెను.

అక్కడ రాజపుత్రుం డెదురుపడి వచ్చుచున్న పుష్పహాసునితో నీసుమీఱ నోరీ ! పాటచ్చర ! యాలోపలి కేమిటికిఁ బోయితివి ? నిన్నిందెవ్వరు రమ్మనిరి ? నాఁడు మా తండ్రియెదుట నేమేమో ప్రేలితివే. ఇప్పుడుదొరికితివి. అంత:పురకాంత లుండు చోటికిఁ బోయిన యపరాధము సామాన్యమను కొంటివా ? నిలునిలుమని యదలించిన నతం డించుక కొంకుచు నిట్ల నియె. మిత్రమా ! నా యందు నీ కింత కోప మేమిటికిఁ గలుగవలయును ? మనమిరువురము చెలికాండ్రము కామా ? మా తండ్రికి నేటిలోఁ రెండవ కంకణము దొరకినది. దాని మీ తండ్రిగారి కియ్యవలయునని వచ్చి 10. - సేక అట్లు .. డి.సంత పరుగు - 1 పేతం : 1 2. రని చల్లగా నడిగిన వాడు చాలు చాలు. : చేస్తున) పంచ నారుములు గౌరవమే వచ్చినది. ఆ కంకణమేది ? వీధినుండి యడుగక లోపలకు పోవుదువా ? యన నతం డాకంకణ మతఃపురమున కొకదాది తీసికొని పోయినదని చెప్పెను.

అప్పుడు నిప్పుద్రొక్కిన కోఁతివలె నెగసిపడుచు, నోరిమొద్దా ! పెద్ద వారలు లేనప్పుడు వచ్చి యంతఃపురమునకు వస్తువులు పం పెదవా ? నిన్నిప్పుడు గట్టింతుఁ జూడుమని పలుకుచు రక్షక పురుషు లెవ్వరిక్కడ రండోయని యఱచెను. అప్పుడు క్రోధోద్దీపితమాససుఁడై పుష్పహాసుడు అల్పబుద్ధులు సామంబున జక్కఁ బడరుఁ “దండమేకార్యమని" తలఁచుచు బిడికిట వాని నొక్కపోటు పొడచి యవ్వలికి దాటిపోయెను. ఆ వ్రేటుతిని రాజనందనుఁడు నేల బడి మూర్చనొందెను. ఇంతలో రాజపురుషులు కొందఱచ్చటికి వచ్చి వానిలేవనెత్తి సేదదీర్చి భర్తృదారకా! నిన్నెవ్వఁ డిట్లు పడవేసెను. ఒక్కండ వీ మాఱుమూలకు రానేల ? మాటాడవేమి ? అయాసము తీరలేదా ? యని యడిగిన నతండు తెరపి తెచ్చుకొని కన్ను లెఱ్ఱజేయుచు చీ ! ఛీ ! యింత పనికిమాలిన కావలివార లెందైనం గలరా రాజులేఁడని నేడు కోటలోని కొక్కడైన రాక యిండ్ల కడ శయనించిరి కాఁబోలు కానిండు. మీ పని ముందుఁ బట్టింతు. ఇట్టి బహిరంగ స్థలంబున బట్టబగలు వచ్చి యొక చెడుగు పిడుగుపడినట్లు పిలికిటఁ బొడిచి పాఱిపోయిన నొక్కరైన నడ్డగించకపోయిరే. ప్రాణములు పోయిన తరువాత వచ్చి యేమి చేయుదురు ? అబ్బా ! నాకీ నొప్పి యెన్ని దినంబులకుఁ బోవును. యావజ్జీవము గుండెలలో బాధించుచుందునే ? అయ్యో ? యేమి చేయుదునని విచారింపుచున్న, రాజపురుషు లిట్ల నిరి.

అయ్యా ! యిది సంధ్యకాల మగుటచే భోజనంబునకై కావలివార లిండ్ల కు పోయిరి. అంతియ కాని మఱియొకటి కాదు. మిమ్మట్లు గొట్టిన మూర్ఖునిం బేర్కొనుఁడు. ఇప్పుడేపోయి వానింబట్టి చెఱసాల బెట్టింతుము. కాలసర్పమును గాలఁదన్ని బ్రతుకఁ దలంచినవాఁ డుండనే యని పలికిన నతండు “వినుండు ఆ మొండికట్టె పల్లిబికారి తొత్తుకొడుకు శుద్దాంత నిశాంతాంతరమునకుం జొరనిచ్చితిని కానని నన్నిట్లు చేసి బాఱిపోయెను. మీకు సామర్థ్యము గలిగియుండిన నా స్వామిద్రోహిం బట్టుకొని చెఱసాలఁ బెట్టుఁడని నుడివిన వాండ్రు తెలియని మిమ్ముఁ గొట్టినట్టి పల్లె వాఁడీవీట నెవ్వఁడున్నాఁడు. విప్పి చెప్పుఁ డనుటయు తనసాటివా డెవఁడును లేఁడని గరువము గలిగి యెగసిపాటుతో మా గుర్రము లెక్కి తిరిగెను గుఱ్ఱపుకాసువాఁడు పుష్పహాసుని మీ రెఱుఁగరా ? యని పలికిన వార లఱుతఁ జేతులు వైచికొని అమ్మకచెల్లా ! వాఁడా? వాఁడుమీకుఁజెలికాఁడు కాఁడా? వానిం బట్టుకొనుట కష్టము. వాఁడెదిరించిన వేగురం గొట్టఁగలఁడు. అందుల కెక్కుడు సన్నాహము కావలయునని చెప్పిరి. అంతలో రాజపుత్రుఁ ------ నొప్పి ప్రబలుటచే నంతఃపురమునకుఁ గొనిపోఁబడెను. శత్రువును వంచించుట కిధియే సమయమని బాధ యలఁతిగా నున్నను నా రాజపుత్రుఁ డపుడే చచ్చు వాడుంబోలె మూల్గఁ దొడంగెను. అప్పుడు శుద్ధాంతకాంత లెల్లదల్లడమందుచు నా రాత్రి రాజవైద్యులు రప్పించి పలు విధములగు చికిత్సలు చేయించిరి. పుష్పహాసుఁ డారాజపుత్రుం బితృలోకము జూచి వచ్చునట్లు గ్రుద్ది పాఱిపోయి వచ్చెనను వార్త పట్టణమంతయు వ్యాపించినది. సామంతులు వేఁట నుండి తక్షణము రావలయునని నృపాలునకు వార్త నంపిరి.

అట్టుండ నది రాజపుత్రిక పుష్పహాసుం డడిగిన ------- తన ప్రమాదముఁ దెలిసికొని తిలకతో సఖీ ! యిప్పుడు రూపైక పక్షపాతి యగు నిందిరాసూతి నన్నంత తేలిక పఱచెనో చూచితివా ?అయ్యో ! సన్నంత తేలి: పు 1.5 1 ని .. " - 1 - in- సంతులని నలంద యే ముడు - అన్ వలం.. | మంతi. 3 time. 197: ను గా న న న నల దని చెప్పితి:- ను "" మన కుల ..... | Fi•vi in 1 .రు.. రు.19న సప్పుడు H యిట్ల సి. ఉచ్చి మన

మన మేమి వింతలు గనపరచితిమి ? వాఁడు కంకణముఁ దెచ్చి మనకిచ్చెను. మనము గై కొంటిమి. దీనం దప్పేమి ? అతండు స్వయముగా నీ చేతం బెట్టిన విశేష మొకటి జరిగినది. కళాదకులస్థు లట్లుపెట్టుట వాఁడుక యున్నది గదా ! ఇదియు నట్లే జరిగిన దని తలంచరాదా ? ఊరక పశ్చాత్తాప పడుచుంటి వేమని మందలించిన నా చంచలాక్షి వెండియు నిట్ల నియె.

అగునగు నంతకన్న క్రొత్తవింత లేమియు వ్యక్తిపరచలేదు. కాని వాని సోయగము తలంచుకొన మనమున నేదియో వికారము గలుగుచున్నది. వాని యందుఁ గల కొఱఁత యైనది గాని కానిచో నెవ్వరేమనుకున్నను వానినే పెండ్లి యాడితీఱుదు. కానిమ్ము. మన రహస్య మెవ్వరికిఁ దెలియ నీయకుమీ యని పలుకుచుండఁగనే పరిచారిక యొకతె వచ్చి అమ్మా ! అన్నయ్యగారి నెవ్వఁడో గుండెలమీఁద గ్రుద్దినాఁ డఁట. అంతఃపురములో మరణబాధ పడుచున్నారు. అమ్మ గారు మిమ్ముఁ దీసికొని రమ్మన్నారని నిట్టూర్పులు నిగుడింపుచు జెప్పిన గొబ్బున లేచి యేమేమీ ? మాయన్న బాధపడుచున్నాఁడా ? వాని గ్రుద్దినవాఁ డెవ్వఁడని మఱల నడిగిన నది ఆయనతోఁ జదువు కొన్న వాఁడట యెవ్వఁడో పుష్పహాసుఁడంట, వాఁడు గుద్దెనని చెప్పుకొనుచున్నారు. సత్వరము రమ్మని పలికిన విని తిలక మొగము చూచుచు సఖీ ! యిది యేమి వార్త ? దీన మనకేమైన ముప్పు రాదు గదా ? యని పలుకుచు లలిత తిలకతోఁ గూడ నన్నయున్న సౌధంబున కరిగినది.

అందుఁ గాంత లందఱు పుష్పహాసుండు స్వామి ద్రోహుఁడు. చదువు చెప్పించెనను విశ్వాసమైన లేక ప్రభు పుత్రుఁడని మన్నింపక యిట్లు చేయునా ? యా యూరక చెప్పుకొనుచున్నారు. ఆ మాటలు విని లలిత వెఱచుచు నన్నదగ్గఱకుఁ బోయి అన్నా ! సుందరక ! నీకు దెబ్బ తగిలినదా ? యని యడిగెను. వాఁడు కన్నులెత్తి చూచి ఆ పల్లె హలాంకోరు నీ యొద్దకు రెండవ కంకణము పంపెనట. నిజమేనా ? యని యడిగిన సప్పడఁతి తెల్ల బోవుచు మాటలు దడబడ బం పెఁ బంపె నని చెప్పినది అది వాని యొద్దనుండి తెచ్చినీకిచ్చిన వారెవ్వరని యడిగిన నేమియుం దోచక యాలోచింపుచున్నంత తిలక ఆయ్యా ! అది నేను దీసికొనిపోయి యిచ్చితిని. ఆమె మరచి పోయినదని సవరించినది. కానిండు మీ రందఱు స్వతంత్రులు. పయివాఁడను సందియము లేక పెద్దలు లేరని వెరవక యొరు లిచ్చిన వస్తువు లంతఃపురమునకుఁ దీసికొని వత్తురేమి ? రాజును రానీయుఁడు అని బెదరించుచు నతండు బాధ నభినయించుచు నా రాత్రి యెట్టకే గడపెను. పట్టణమంతయు నా రాత్రి పుష్పహాసుని మాటఁ జెప్పుకొనుచుండ విని యా రాత్రి గుహుఁడు కొడుకుం జేరి నాయనా ! యిదియేమి కర్మము ? నీవు రాజపుత్రుని గ్రుద్దితివఁట ఱేపు నీ పని యగునని ప్రజలు పందెములు వైచుకొను చున్నారు. ఏమి చేసితివి ? నిజము జెప్పుమన నతండు జరిగిన వృత్తాంత మంతయు నా మూలాగ్రముగాఁ జెప్పెను.

అప్పుడు వాఁడు నాలుకఁ గఱచుకొనుచు అయ్యో ! అయ్యో ! యెంతపని జేసితివిరా ! పడుచువాఁడవు అంతఃపురమునకుఁ బోవచ్చునా ! అన్నన్నా ! రాజు విన్న గమారునిఁ గొట్టిన దానికన్న డప్పుగా గటించునుగదరా ! బలవద్విరోధము వచ్చినదే. యేమి చేయుదుము ? మనల రక్షించువా రెవ్వరని యూరక విచారించినఁ బుష్పహాసుం డిట్ల నియె.

తండ్రీ ! యిందు నా తప్పు రవ్వంతైన లేదు. నే నంతఃపురమునకు రాననిన నది బలాత్కారముఁ జేసి తీసికొనిపోయినది. నన్నుఁ బోవలదని యడ్డు పెట్టిన వాని గ్రుద్దితిని. రాజు విమర్శింపక నన్నూరక శిక్షించునా ? అంత యధర్మ శీలుండా? పొనిమ్ము. వేగురం బరిమార్చినను వారికి నేను లోఁబడనని బీరములు పలికిన మందలింపుచు గుహుం డిట్ల నియె.

అప్పా ! యీ వార్త వినన రాజునకుఁ గోపము రాక మానదు. నిన్ను దండింపక విడువఁడు కావునం నీ విం దుండరాదు. యవన ద్వీపంబున కవ్వల నమరావతియను పట్టణము గలదు. మనయోడ లక్కడికిఁ బోవుచుండును. అది తీర స్థలము. అచ్చట నాకు మిత్రులున్నారు. వారికిఁ బత్రికలు వ్రాసి యిచ్చెదను. నీ వక్కడికిఁ బోయి కొన్ని దినంబులుండి రాజు కోపము చల్లారిన తరువాత రమ్ము. ఇదియే యుపాయమని చెప్పి వాఁడెట్టకేఁ బట్టి నొడంబడఁజేసి యా రాత్రి పయనముఁ జేసి వాని నంపెను. ధనంజయ నృపాలుం డమ్మఱనాఁడు. వేఁటనుండి వచ్చి సామంతుల వలన నా వృత్తాంత మంతయు నాలించి పుత్త్రునోదార్చుచు నప్పుడే పుష్పహాసునిం బట్టుకొని ఱెక్కలుగట్టి తీసికొని రండని కింకరుల కాజ్ఞాపించెను. పదుగురు వీరభటులు పోయి గహునియిల్లు ముట్టడించి వెదకి పుష్పహాసు నెందునఁ గానక గుహుం బట్టుకొని ఱేనికట్టెదుటికిం దీసికొని పోయి యా వృత్తాంతము జెప్పిన రాజువానితో –

ఓరీ ! బెస్తవాడా ! నీ కొడుకు పోతరించి యేమిచేసెనో చూచితివా ! విద్యలం గఱపించినందుల కిదియా ఫలము ? కానిమ్ము. వాని నెక్కడ దాచితివో చెప్పుము. చెప్పకున్న నీ నంగడం బంతయు నాశనము నొందింతుఁ జూడుమనుటయు గడగడ వడంకుచుఁ జేతులు జోడించి వాడిట్ల నియె.

స్వామీ! నేను దేవరయెదుట వాస్తవము మనవి చేయుచున్నాను. వాఁడు నాకుఁ గడుపునఁ బుట్టిన కొడుకుగాడు. వినుండు. నే నొకనాఁడు రాత్రి గంగలోఁ బెద్ద వలఁబన్ని మఱునాఁ డుదయ కాలంబున నా జాలంబు లాగి యందుఁ జిక్కి,న యాదఃప్రకరంబులఁ దీరసికతా తలంబున దులుపుచుండ నా వలనుండి యీ బాలుండు నేలంబడియెను. అప్పటి కాశిశువునకు నాలుగేడుల ప్రాయముగలిగి యున్నది. అక్కజమగు తేజముతోఁ బ్రకాశింపుచున్న యా పాపనిఁ జూచి విస్మయము జెందుచు బిడ్డలు లేని వాఁడినగుట గంగాదేవియే దయఁజేసినదని సంతసించి వాని నింటికిం దీసికొని పోయి పెంచుకొంటిని. ఈ రహస్య మెవ్వరికిని దెలుపక వాఁడు నాకడుపునఁ బుట్టిన వాఁడే యని చెప్పుచుందును. మా కులమువారెల్ల వాఁడు గంగాదత్తుడని యెఱుంగుదురు. దేవర విచారింపవచ్చును. మఱియు వెనుకటిరీతిగా రెండవ కడియము నాకు దొరికినది. దానిం దేవరకిచ్చిరమ్మని నిన్నఁ బంపితిని. వాఁడు కొల్వుకూటమునకు వచ్చి యది వివిక్తముగా నుండుటకు శంకించుచు నలుమూలలు సూచుచుండ భర్తృదారిక దాసి యొకతెవచ్చి యా వలయ వృత్తాంతము విని దానిఁ గైకొని యంతఃపురమున కరిగినట.

అంతలో యువరాజుగారువచ్చి నీవిం దేటికి వచ్చితివిరా ద్రోహుఁడా ? యని తొంటిపలుకుల నుగ్గడింపుచు నదలించిన వాఁడు వచ్చినపని చెప్పినంత నింతింతనరాని కోపముతో నిలు నిలు పోవలదని యంకిలిపెట్టిరట. వాఁ డంతటితో నిలువక త్రోసికొని వచ్చెనఁట. ఇదియే యదార్థమని యింటికి వచ్చి వాఁడు నాఁతోఁ జెప్పెను.

అప్పుడు నేను వాని దిట్టినతిట్లును కొట్టినకొట్లును దేవరతో నేమి మనవి చేసికొందును ? వితర్కించిన దేవరకే విశదముకాక మానదు. వాఁడు నాయదపులకు నిలువలేక నిన్నరాత్రి నాతోఁ జెప్పకయే యెక్కడికో పాఱిపోయెను. ఇంతియ నిక్కువము, నేను దేవర పాదసేవకుండ రక్షింపుఁడని పాదంబులంబడి వేఁడుకొనియెను. అప్పు డా రాజు వితర్కపూర్వకముగా ఏమేమీ ! వాఁడు నీ కౌరసుఁడు కాఁడా ? రెండవ కడియముగూడ నీటిలో దొరికినదా' ఆ! ఆ!ఆ! యని యేదియో ధ్యానించుచు నంతకుమున్ను గలిగిన కోపమంతయు నీరైపోవ బుత్త్రుని మొగంబుఁ జూచి వీని మాటలు వింటిరా ? యదార్థములేనా? యని యడిగిన రాజపుత్త్రుం డిట్లనియె. తండ్రీ ! వీని మాటలన్నియు వట్టి బూటకములు. తనకుఁ బుట్టలేదని మీరు కనికరింతురని యట్లు చెప్పుచున్నాడు. కడియము నెపంబున వాఁ డంతఃపురము దాపునకుంబోయి యాగడముఁ జేసెను అట్టివానిం బోవలదనుట తప్పా ? వాఁడు నన్నుఁ ద్రోసికొని పోయెనేమి ? నా గుండెలోని దెబ్బ పరీక్షింపుఁడు. ఈతేప వానిని విడిచి పెట్టితిరేని నేను దలయెత్తి తిరుగఁగలనా ? క్షత్త్రియ వంశమున జనించి చేపలుపట్టికొని బ్రతికెడు బెస్తవానిచే దెబ్బలు తిని ప్రతిచేయక జీవించుటకంటె నీల్గుటయే శ్రేయమని యేమేమో చెప్పి తండ్రికి రోషము పురికొలిపెను. అప్పుడా రాజు కానిమ్ము. వాఁడు దొరికిన తరువాత విమర్శించెద. ఇప్పుడేల? యని వానిం బట్టుకొనుటకు నలుమూలలకు దూతలం బంచి యప్పుడే తా నంతఃపురమున కరిగెను.

ఆ సంభాషణ విశేషము లన్నియు విని తిలక లలితయొద్ద కరిగి, తరుణీ ! ఆ పురుషుండు పల్లె వాని కొడుకు కాఁడట. వింటివా ! వానికి గంగలో నిడ్డజాలములో దొరికెనఁట. వాఁడు పాఱిపోయెనఁట. పాపము వాని కిట్టుముప్పు తెచ్చి పెట్టినవారము మనమే కదా. వాఁడు రానని పోవుచుండఁగా బ్రతిమాలికొని తీసికొనివచ్చితిని. వానియం దే నేరము లేదు. మీ యన్న యడ్డగింపఁగాఁ ద్రోసికొని పోయెనట. దానికిఁ గొండంతఁ జేసి మీ యన్న తండ్రితోఁ జెప్పెను. మీ తండ్రియు వానిం బట్టికొనిరమ్మని దూతలం బంపినా రివియే సభావిశేషములని చెప్పగా నా యొప్పుల కుప్ప యెట్టెట్టూ ? వాఁడు పల్లెవానికి గంగలో దొరకెనా ? బాగు బాగు, ఈమాటు నచ్చినది వాఁ డెవ్వఁడో యుత్తమవంశ సంజాతుఁడు కానిచో' నన్ని లక్షణములుండవు. వాఁ డెక్కడికిఁ బాఱిపోయెనో రహస్యముగాఁ దెలిసికొనిరమ్ము . మనము గూడఁ బోవుదమని సాభిలాషముగాఁ బలికిన నాలాగే పోవచ్చును. వేయిజన్మములెత్తిన నటువంటి భర్తను సంపాదించుకొనఁ గలవా ? యని తిలక యుత్తరముఁ జెప్పినది. అంతలో మరియెవ్వరో యచ్చటికి వచ్చుటచే నా ప్రసంగము మానివేసిరి.

నాఁటి రాత్రి యంతయుఁ దిలక పుష్పహాసుని మందిర ప్రాంతమందుఁ దిరుగుచు నతని చరిత్ర యంతయు విమర్శించి మఱునాఁడుదయ కాలంబున లలిత యంతఃపురమునకు వచ్చినది. అప్పుడు లలిత తల్పంబునం గూర్చుండి చెక్కిటఁ చేయిజేర్చి యెద్దియో ధ్యానించుచు నల్లగలువరేకులపై మకరందము చిమ్మినట్లు కాటుక కన్నుల నశ్రజలమ్ము గ్రమ్మ వెక్కి వెక్కి యేడ్చుచుండుట తిలకించి తిలక పలుకరించి కలికీ! యిదియేమి ? అకారణముగాఁ గుందుంచుంటివని యడిగిన నప్పడఁతి తలయెత్తి నఖరశిఖరంబున నశ్రువులు వెదఁజిమ్ముచు నల్లన నిట్లనియె.

సఖీ ! పుష్పహాసుఁడు రాత్రి కలలోవచ్చి నా శయ్యపై గూరుచుండి నన్నక్కున జేర్చుకొని చెక్కులు ముద్దాడుచు మోవిపుడుకుచుఁ బ్రాణేశ్వరీ ! నేను విదేశముపాలై పోవుచున్నాను. నా డెందము నీయంద తగులుకొని రాకున్నది. మరుఁడు విరిబాకుపోటుల నా యెడద నాటు నేయచున్నాడు. ఏమిచేయుదును ? భవదీయ సల్లాపంబులఁ దలంచుకొనుచు విదేశమునఁ ప్రాణధారంబుఁ జేసికొనియెద . ననుగ్రహ ముంచుమీ యని పలుకుచుఁ దద్దియుం బ్రీతిమొగంబున విన్నఁదనంబు దోప శయ్య నొయ్యన డిగ్గి యవ్వలికిం బోయెను బోఁటి ? వానిమాటలం దలంచుకొని మదిపగిలిపోవుచున్నది. ఆ సుందరు నిట్టి చిక్కులం బెట్టిన వారము మనమే కదా ! అయ్యో ? నిష్కారణము నొకరి కపకారముఁజేసి జీవింప నేమిటికి ? సఖీ ! మనల నీ పాతకమెట్లు పాయునని యెన్ని యో చెప్పి యూరక వగచుటయు నవ్వుచు నా జవ్వని యిట్లనియె.

నెలఁతుకా ! కల కిట్లుకలంగెద వేల? చాలు చాలు ? నీ వింత బేల వని యెఱుంగనై తినే యెవ్వరైన వినిన నవ్వుదురు సుమీ. నా తెచ్చినవార్తనీకల ననుసరించియే యున్నది. విను మాపురుషసింహుండ లోకసామాన్యుఁడని చెప్పవలసినదే. నేను రాత్రి వానియింటి కురంగటి వారల వానిగుణంబుల నడిగి తెలిసికొంటి నాహా! తదీయౌదార్య గాంభీర్యచాతుర్యాదిగుణంబు లేతన్మాత్రములు కావఁట. సత్యసంధుండన వానినే చెప్పవలయునఁట. వానికిఁగల దాతృత్వము కర్ణునికి లేదని చెప్పిరి. ఆ గోవాళ్ళు పల్లెవానికి జాలములో దొరికెనని యావీధివారందఱికిం దెలియును. మఱియు నేనందుఁ దిఱుగుచుండ నొక కోడెకాఁడు వచ్చి నా మొగ మెగాదిగఁ జూచి నీపేరు తిలక కాదా? యని అడిగిన, ఔను దిలకనే. నన్ను నీ వెట్లెరిఁగితివని యడిగితిని. అప్పుడు వాఁడు నీ మాటలం బట్టి, గురుతుఁబట్టితిని. నా స్నేహితుఁడు పుష్పహాసుఁడు విదేశమున కరుగుచు నిన్నుఁ దెలిసికొని రహస్యముగా నీ పత్రిక నీకిమ్మని చెప్పి యది నాకిచ్చెను. నేను నీజాడ నరయుచుండ దైవికముగా నీ విక్కడఁ గనంబడితివి. ఇదిగో యుత్తరము పుచ్చుకొమ్మని పలికి యతండది నాకిచ్చి యవ్వలికిం బోయెను. అని చెప్పువఱకు నాయొప్పులకుప్ప చెప్పునఁ గనుఱెప్పలు విప్పుచు నేదేది ? అది నీవిచ్చటికి దెచ్చితివా ? తెమ్ము తెమ్మని తొందరపడ నత్తెఱవ యయ్యుత్తర మత్తరుణి కిచ్చినది. అదివిప్పి యప్పడఁతి యిట్లు చదివినది.

మ. తరుణ: దూరము బోవుచుంటిని, భవ • త్సల్లాపభావప్రవృ
     త్తరసావేశముతో విదేశమునఁ ద్వి • ద్ధత్తోపచారక్రియా
     స్మరణంబొప్పఁగఁ బ్రాణధారణవిధి • స్వల్పం బ్రయత్నించెదన్
     మఱువన్ శక్యమె? తావకోహిత స . న్మానంబు లెన్నాళ్ళకున్.

అను పద్యమును ముమ్మాఱు చదువుకొని యమ్మదవతి ధృతి నాపలేక యా లేఖ తిలకపయింపబడ వైచి, వేఁడినిట్టూర్పులు నిగుడింపుచు అయ్యో ! వానికి మన మేమి సన్మానములు చేసితిమి ? మనమాటలే తలంచుకొనుచుఁ బ్రాణధారణముఁ జేయునఁట. పాప మిట్టి యిక్కట్టు తెచ్చి పెట్టితిమి. ఇప్పుడు కర్తవ్యమేమి ? యని యడిగిన నాతిలక కలికీ ! పత్రికలోనున్న సే విశేషములు సూడక నాపైఁబాఱవైచితి వేల? విను మతండు ప్రయాణు నే " ప్రకారమంతయు నిందుఁ డు మూ... మ... న్న పరపాదహిందు ను i, ఏం. avis... - సేది. సాభిప్రాయముగాఁ మనం .. అని అంటే సియ... న యఁడు మనల నచ్చటికి రమ్మని యభిప్రాయము. . అక్కడఁ గదలి రేవానగరంబున కరిగి యందాఱు దినంబు లుండునఁట. ఈ వ్రాతంబట్టిచూడ నతని చాతుర్య మంతయు స్పష్టమగుచున్నది సుమీ యని పలికిన విని లలిత యించుక సిగ్గుతో దీనికి నీవేమనియెదవని యడిగిన నది నీకిష్టమైన సమంజసమే యని యుత్తరముఁ జెప్పినది ఇష్టమైనను జరుగుట యెట్లనవుఁడు బుద్ధిమంతుల కలవి గాని పనులుండునా ? యని మఱలఁ బలికినది. మఱియెప్పు నడ నప్పుడే యని సాంకేతికముఁ జెప్పినది. ఇట్లు వారిరువురు సంభాషించు కొని యొరు లెఱుఁగకుండ నాఁడు ప్రయాణ సన్నాహముఁ గావించుకొనిరి. రాజ కన్యలకుఁ బ్రాయము వచ్చులోపల గుఱ్ఱములెక్కి తిరుగుట నేర్పుదురు గదా, నాఁడు గడియ యొకయుగములాగున వారికిఁ బ్రొద్దు జరిగినది.

లోక బాంధవుం డపరగిరిశిఖర మలంకరించుటయుఁ గ్రమంబునఁ కీఁకటులు కాటుకబూసినట్లు జగం బాక్రమింప నల్లనల్లన లోకులు గాలకృత్యంబులు నిర్వర్తించుకొని శయనమందిరంబునఁ బ్రవేశింప సంతంతఁ దమకృతమోహాతిరేకంబున నొడ లెఱుంగక పడియున్న కాళరాత్రియుం బోలె నారాత్రి నిద్రామోహంబున స్మారకము దప్పి పడియున్న జంతువితతి కలదగుట నిశ్శబ్దంబై భయంకర తమోమయంబై యొప్పుచుండ నారాజపుత్రిక గంటల గణించి యర్ధరాత్రి యయ్యెనని నిశ్చయించి మంచిమంచి రత్న భూషాంబరంబులు సంగ్రహించుకొని తిలకచే నమరింపఁ బడి యుంచిన శృంఖరానిశ్రేణిక నధిరోహించి యాకోటగోడ నవలీలఁ దాటి యవ్వలఁ బడినది.

అంతకుమున్న వాఱువముతో నచ్చేరువ నిలచియున్న తిలక యక్కలికిం బట్టికొని తనరాక నెఱింగించుటయు నమ్మించుఁబోడి "జాగేల వేగమ ముందెక్కుమని" చెప్పి తాను వెనుకనెక్కి కళ్ళెము చేతంబూని పత్రికలో వ్రాసిన మార్గము ననుసరించి గుఱ్ఱమును వడి వడిఁ దోలఁ దొడంగినది. తిలకకు గుఱ్ఱమునెక్కు నలవాటు లేకపోవుటచే వడిగాఁ దోలవలదని లలితను బ్రతిమాల డొడంగినది. కాని వెనుకఁ దమవారు వత్తురను వెఱపుచేఁ దిలక నొకచేతం బట్టుకొనుచు భయపడకుము. కాళులు బిగపట్టుమని పలుకుచుఁ దోలుచుండ అమ్మయ్యో, నే నిలువఁజాల. నాకన్నులు తిరుగుచున్నవి. వమనము వచ్చుచున్నది. నిలునిలుమని మొఱలిడ నాయువిద యొక చోటఁ దత్తడి నిలిపి వెరపుడిపి తిలకను వెనుకదెసఁ గూర్చుండఁ బెట్టుకొని మఱల నాతట్టున వడిగాఁ దొలఁదొడంగినది. తిలక కొంతసే పుగ్గబట్టుకొని అమ్మయ్యో ! ఇఁక నే నిలువఁ జాల నొడలు వివశ మగుచున్నది. నిలుపు నిలువు మని బ్రతిమాలు కొనుచు నంతలో ముర్చనోయెనది. ఆ సంగతి గ్రహింపక యూరకున్నది గదాయని లలిత తురగమును వేగముగాఁ దోలినది.

అంతలోఁ జేతులు పట్టువదలి తిలక జారి యొకచోట నేలంబడినది. కొంత దూరము పోయిన తరువాత నానాతి యా సంగతి తెలిసికొని యడలుచు నశ్వమును నిలిపి తిలకా ! తిలకా ! యని పిలువఁ దొడంగినది. ప్రతివచనంబు గానక గుఱ్ఱమును వెనుకకు మఱలించి నడుపుచు దిలకా ! యని పిలుచుచుఁ గొంతదూరము పోయినది. అయ్యో ! యెక్కుడు దూరము వెనుకకు వచ్చితి నాలోపలనే పడియుండను మఱల నాలాగే పోవలయునని పైకి నడిపించెను. ఈరీతి వెనుకనుండి ముందరకు ముందర నుండి వెనుకకుఁ దెల్లవారు వఱకుఁ పదిసారులు తిరిగినది. కాని తిలకజాడ గనఁబడినదికాదు. అంతలో సూర్యోదయ మైనది. ఆప్రదేశమంతయు మహారణ్యమైయున్నది. వచ్చినదారి యేదియో పోవలసినదారి యేదియో తెలియక లలిత సాధ్వసకలితమతియై విధిలేక వీతి నొక రీతి నడిపించుచు వృక్ష లతా గుల్మాంతరములఁ దిలకం దిలకింపు చుండెను. క్రమంబున ఖరకరుని వేడి కిరణంబులు సోకి వేడి జనింప శ్రమ జలబిందు సందోహంబు వదనంబునకు మకరంద బిందు సందీప్త మగు నరవిందంబుఁ చందంబొందుపరుపఁ ---ఱలసటతో నడచుచుండ నొకదండి శాఖామండలచ్చన్న దిక్తటం బగు పటవిటపి యొకటి గనంబడినది ఆ చెట్టునీడ గుఱ్ఱముదిగి యమ్మగువ నలుదెసలు దిలకింపుచుఁ దన మనంబున నిట్లు తలంచెను.

హా | పాడువిధీ ? నన్నిప్పుడు నట్టడివిలోఁ దీసికొనివచ్చి పాఱవేయుదువే ? అయ్యో ? కులకాంతా విరుద్దంబని తలంపక యెండమావుల జలంబులు గ్రోల నాసఁ గొనునట్లు వాని యుత్తరమునకు లేని యర్థములుదీసి లోకనింద్యురాలై యిట్టులనిల్లు వెడలివచ్చితినిగదా ! అన్నన్నా ! ఆ కోటగోడ యెట్లు దాటితినో తలంచుకొన నాకే విస్మయమగుచున్నది సీ ? ఆఁడుజాతి పాడుజాతిగదా ! కష్టపడి కన్న తల్లిదండ్రుల మక్కువ లెక్కింప కుల్లంబున వల్లభునెడ పక్షపాతముఁ జూపుదురు. ఆ ? యేమి నిజముగా నేనిల్లు వెడలి వచ్చితినా ? లేదు. లేదు. ఇదిస్వప్నము. అక్కటా ? ఇది కలగాదు నిజమే. హా ! తిలకా ! నీ యనురాగ మెట్లు మఱచిపోవుదును. నీమాట వినక ఘోటకమును వేగముగాఁ దొలఁబట్టి గదా నిన్నుఁ గోలుపోయితిని నాకు నీవెట్లు కనంబడుదువు. ఇప్పుడేమి చేయుదును ? ఎక్కడికిఁ బోవుదును ? రక్షించువా రెవ్వరు ? ప్రాణ సఖిం బోఁగొట్టికొంటి. పుష్పహాసుఁడు గనంబడుననుమాట దబ్బఱ అన్నిటికిఁ జెడిపోయితినని పలుదెఱంగుల జింతించుచు నాకలిబాధింప గర్తవ్యమేమియుతెలియక తిలక వచ్చునేమోయని నలుదెసలుం బరికింపుచుండెను.

గోవిందుడను బ్రహ్మచారికథ

ఆ ప్రాంతమందుఁ దామ్రపురంబను కాపుటూరుగలదు. అందుఁగల దు బౌరోహిత్యముఁ జేయుచు గోవిందుఁడను బ్రహ్మచారి యందుఁ గాపురముఁ జేయుచుండెను. వానికిఁ దల్లి మాత్రమే కన్నత. సచ. మంచు వచ్చిన - 113, 2 మనసుపడుచు నాకు . ఆమ్మ కిరువదియేండ్లు వచ్చినవి. పెండ్లి కాలేదు. భార్యతోఁ బీటలపై గూర్చుండు భాగ్యమెట్టి పుణ్యము జేసికొన లభించునో ? అయ్యో ! యూరేగు మనసైన దీరినదికాదే. పేరులు సెప్పుమని పేరంటాండ్రు నిర్బంధింపఁ జిఱునగవుతోఁ బెండ్లి కూఁతురు చెప్పినంగాని చెప్పనవి వారి నూరించు సంతోష మెట్టి పుణ్యమున సంప్రాప్తించునో! ఆహా ! శోభన దినంబునఁ బేరంటాండ్రు నవ్వుచుండ శయ్యపై గూరుచుండి భార్యచే గంధము పూయించుకొనువానిదే జన్మ. సీ: నా జన్మము కాల్పనా, ఇఁక నాకీ పుట్టుగునఁ బెండ్లి కాదు. ఈ పౌరోహిత్యమున సంపాదించిన బియ్యము, కాయగూరలుఁ నంగ వస్త్రములు నేమిచేయుదును ? నా రవికెలు, చీరలు కట్టుకొని యానందించువారెవ్వరు ? అని విచారించిన విని వానితల్లి నాయనా నీకెన్ని యేండ్లున్న వని పెండ్లి కిఁ దొందర పడియెదవు ? నిన్నకాక మొన్నటివాఁడవు. కళ్యాణమువచ్చిన పెండ్లి యాగునా ? యని యోదార్చిన వాఁడిట్లనియె.

చాలు చాలు. మంచిదానవే. నాకంటెఁ జిన్నవారలు రెడ్డికొడుకులు, వాండ్ర భార్య లెంతయున్నారో చూచితివా ? పెక్కులేల ? రెడ్డికాపు పాలికాపు జానెడులేఁడు. వానికిసైతము పెండ్లియై భార్య కాపురమునకు వచ్చినది నేనామాత్రము నోఁచనై తినని నిత్యము విచారింపుచుండును. ఆ బ్రహ్మచారి నాఁడు జాముప్రొద్దెక్కిన తరువాత నాకులు కోసికొనిపోవుటకై యా మఱ్ఱిచెట్టు దాపునకువచ్చి ముందరను,

సీ. ముకురద్యుతికపోల • మకరికాలతలతోఁ
               గమ్మకస్తురిచిత్ర • కమ్ము చెదర
    వక్త్రగంధానుధా • విన్మిళిందముతోఁ
               గప్పుపెన్నిరికొప్పు • గంపమొందఁ
    గర్ణికాకుసుమ రిం . ఖస్మరందములతో
               నిడువాలుతమదోయి • నీరుచిలుక
    గళదనర్గళఘర్మ • కలెపరంపరలతో
              నరుత ముత్తెపునరుల్ • దొరసియాడఁ

గీ. దీనవక్షోరుహము లే • గొనుఘన ని
   తంబమలరం నడుగులు • దడబడంగ
   నిలిచి నలుదెసలీక్షించు • లలితఁగాంచెఁ
   బరమ సంతోషకలితుఁడై • బ్రహ్మచారి.

కనుంగొని మనంబునఁ బలుతెఱంగుల సంతసించుచు నమ్మించుఁ బోఁడిని సమీపించి యబ్బురపాటుతో "బోటీ ! నీ వెవ్వతెవు ? నీ పేరేమి ? యెందుండి వచ్చుచుంటివి ? మా గ్రామ మీ బ్రాంతమందే యున్నది. నేను బ్రాహ్మణుడను, బహ్మచారిని, నాకుఁ దల్లికాక దిక్కెవ్వరునులేరు. మా యిల్లీ ప్రాంతమం దేయున్నది. భోజనసదుపాయము గావింతు" మని పలికిన విని యక్కలికి యాకలిగొనియుండుఁట జేసి వేరొకతెరువుఁ గానక మంచిది మీ యింటికివత్తు పదమని పలికిన, వాఁడు మూపు లెగరవైచుచు నా చిన్న దానిం దనయింటికిం దీసికొనిపోయెను.

"అమ్మా ! యీ చిన్నది మహాలక్ష్మివలె మనయింటికి వచ్చినది. ఆఁకటికిఁ దాళలేదు పెందలకడ వంటఁజేసి పెట్టుమని" చెప్పిన వాని తల్లియుఁ ద్రుటిలో వంటఁజేసి యామెకు భోజనము పెట్టినది. పిమ్మట గోవిందుఁడు రహస్యముగాఁ దల్లి తో "అమ్మా ! యీ చిన్నదానికి దిక్కె వ్వరు లేనట్లున్నారు. నా పుణ్యము నేఁటికిఁ బండినదేమో విఘ్నేశ్వరునికిఁ దప్పక టెంకాయలు కొట్టవలయును సుమీ. మంచి మాటలు చెప్పి నన్నుఁ బెండ్లి యాడుమని బోధింపుము. ఇదియే పెండ్లియాడినచో మన మొక్క వస్తువు పెట్టనక్కరలేదు. అన్నియు దానిమేన నున్నవి. ఇంతకన్న మంచి సంబంధము మనకు దొరక' దని బోధించెను.

అమెయు నా చిన్న దానితో 'పొలఁతీ !' నీ పేరేమి ? మా పిల్లవాఁడు నిన్నుఁ జాల మెచ్చుకొనుచున్న వాఁడు. ఇదివఱ కెందఱో పిల్లల నిత్తుమని వచ్చిన సమ్మతింపలేదు. వాని తెలివితేట లెటువంటి వనుకుంటివి. పీటపైఁ గూర్చుండి పెండ్లి చేయించుచుండ నొరులు నోరెత్తఁగలరా? మాకు మూడుగ్రామము లున్నవి. బియ్యము, కూరలు బట్టలు సంవత్సరమునకుఁ జాలినన్ని దొరకును. నీవు వీనిం బెండ్లి యాడితివేని చాల సుఖపడుదువు. పొంగిన పాలమీఁది నీరుపోయనక్క ఱలేదు. నీ యిష్టమువచ్చి నట్లు మెలంగవచ్చునని యెన్నియో బోధించిన నామె మాటలు వినినంతఁ జింతాకుల స్వాంతమగు నా యింతికే నవ్వువచ్చినది.

వటపాదపారణ్యము దాపుననున్న పల్లె యదియని యటకు మనోహరుండు వచ్చునను తలఁచి లలిత యెక్కడికిఁ బోవుటకుం దోచక కొన్ని దినంబులు వారి యింటనే యున్నది. ఆ బ్రహ్మచారి మఱియొకనాడాఁ చేడియ నుద్దేశించి -

సీ. అవునషే మాటాడ • వదియేమి నీకునే
             ననుకూలవరుఁడఁగా • ననియ ? లేక
    కాపురంబిదిచక్క • గా లేదనియ ? కాక
             ధనధాన్యములు చాల • వనియ ? చెప్పు
    చేడెరో ? ననుఁ బెండ్లి యాడిన ఘనపురో
             హితురాల వగుదువే • ప్రతిదినంబు
    నాబ్దికంబులవచ్చు • నట్టి బియ్యము పిండి,
             కాయగూరలును గో • కలును రూక

గీ. అతివ ! నీయిచ్చవచ్చిన • యట్లుచేసి
   కొమ్మ యిఁకమీఁద నిలుదిద్దు • కొమ్మ కొమ్మ
   యరయ నీ చేతికడ్డు ర • వ్వంతలేదు
   దొరకనేరదు మంచి కా • పురము నీకు.

. . అని బ్రతిమాలిన నమ్మానవతీవతంసంబు తదీయ గ్రామోక్తులకు మందహాసముఁ గావించినది అదియే యంగీకార సూచకమని యుబ్బుచు నా బ్రహ్మచారి తల్లి తోఁ జెప్పి పంచాంగము విప్పిచూచి పెదవి విరచుచు, అమ్మా ! యిది శూన్య మాసము. ముందు మాసములో మూఢమి వచ్చినది. ఆపైమాస మధికమాసమైనది. ఇఁక మూఁడు మాసములదనుక శుభముహూర్తములు లేవు. ఇదియు నా కర్మమే కాఁబోలునని వగచిన వారించుచుఁ దల్లి 'నాయనా! మంచి ముహూర్తముకానిదే పెండ్లి యాడఁగూడదు. ఇంతకాల మాగి యిప్పుడా తొందర ? మూడుమాసము లనఁగ నెంత ? కన్నులు మూసికొనిన రాఁగలవు. పిల్ల మనయింటనే యుండునుగదా' యని పలికి యోదార్చినది. మఱియు నా వాల్గంటి వారింట నుంట యెఱింగి -

సీ. పంచాంగమున్నదా • బాపఁడా ? యీవేళ
               వర్జమెప్పుడంచు • వచ్చునొకఁడు
    రమ్ము వేగము తద్ది • నమ్మఁట ననుఁగాపు
               పంపించెనని పిల్వ • వచ్చునొకఁడు
    నాకు శోభనపు ల • గ్నము మంచి దుంచఁగా
               వలెనంచు నడుగంగ • వచ్చునొకఁడు
    ఏదిచూతము లెస్స • యే ! మీగృహం బని
               పల్కి లోపలఁజూచి • వచ్చునొకఁడు

గీ. దుడుకుతనమున నందున్న • పడుచురెడ్డి
   కొడుకులెల్లరు నిత్యంబు కులుకుగబ్బి
   గుబ్బలాడిహొయల్ గనుం • గొనెడువేడ్కఁ
   గపట మూహించి వటుఁ • డల్కఁ గసరుచుండ.

ఆ యలజడి యంతయుంజూచి యా చిగురుఁబోడి యందుండుట కష్టమని నిశ్చయించి యొకనాఁడు బ్రహ్మచారిం జీరి యోయీ ! బ్రాహ్మణుఁడా ! మొన్న మఱ్ఱి చెట్టుక్రింద నా గుఱ్ఱమును విడిచివచ్చితిని. అది యా ప్రాంతమందే మేయుచుండును. తీసికొనివచ్చి యీ వాకిటఁ గట్టివేయుము. వెలగలదానిని విడువనేటికని చెప్పిన బ్రహ్మాండము ధారవోసినంత సంతోషింపుచు నతండు దల్లి యొద్దకరిగి అమ్మా ! ఆ చిన్నది నాతో మాటాడినది సుమీ ! అప్పుడే పనులకు నియోగింపుచున్నది చూచితివా? గుర్రమును దీసికొని రమ్మన్నదని చెప్పిన నామె నాయనా ! క్రొత్తగనుక రెండు దినములు సిగ్గుగా నూరకున్నది. మాట్లాడ కేమిచేయును ? పెండ్లాము మాటలు విని నన్ను మాత్రము వేరుబెట్టకుమీ యని పలికినది.

తరువాత నావడు గప్పుడేపోయి యా యరణ్యమంతయుఁ దిరిగి యా గుర్రమును దీసికొనివచ్చి వాఁకిటఁగట్టిపెట్టెను. అప్పు డా చిన్నది తన చేతనున్న రత్నకంకణముదీసి వానికిచ్చి యో విప్రుడా ! పాపము నీ యొద్ద సొమ్ములేనట్లున్నది. యీ ప్రాంతమందలి గ్రామమున కరిగి యీవలయమును విక్రయించి సొమ్ముదెమ్ము. దాన యధేచ్ఛముగా వాఁడుకొనవచ్చునని చెప్పినఁ బరమానందమును పొందుచు వాఁడు నాఁడు. వేకువజామునలేచి దాపుననున్న యొకవీఁటి కరిగి యందాకడియ మంగడికిఁ దీసికొనిపోయి యమ్మకముఁ జూపుటయు గొప్ప వెలగల కడియము తక్కువ వెలఁ జెప్పుటఁ జూచి రాజభటులు వానిం బట్టుకొని నీకి కడియ మెక్కడిదని యడిగిరి. అతఁడు నా భార్యదేయని చెప్పిన నమ్మక నీవు దొంగవలె నున్నావని వానిం బంధించి సింధునారనగరమునకుఁ దీసికొనిపోయిరి. తిలక పన్నిన వ్యూహము వలన దొంగలు కోటగోడకు గొలుసువైచికొని లోపలదూరి రాజపుత్రిక నెత్తికొని పోయినట్లూహింపబడుచున్నది. కావున మిక్కిలి దుఃఖింపుచు నట్టి దొంగలం బట్టుకొనుటకై నలుదిక్కులకు రాజభటులఁ బెక్కండ్రఁ బంపియుండెను.

రాజభటులు గోవిందునిఁ గడియముతో నారాజునెదుటఁ బెట్టిన తోడనే కడియము గుఱుతుపట్టి నృపతి యపరిమిత దుఃఖముతో లలితం దలంచుకొనుచు గోవిందుం జూచి యోరీ! యీ కడియము నీ కెట్లువచ్చినదని యడిగిన నా వడుగు నా భార్యదేయని చెప్పెను. బ్రహ్మచారివి నీకుఁ బెండ్లా మెట్లున్న దనవుడు ఇంకను బెండ్లిఁ జేసికొనలేదు. పిల్ల నింటికిఁ దెచ్చికొని యుంటినని యేమేమో వెఱ్ఱిమాటలం జెప్పెను. అప్పుడు వానియిల్లు పరీక్షించుటకై కొందఱ దూతల నాపల్లె కుం బంపెను. వాండ్రు పరీక్షించి వచ్చి దేవా ! వీని యింటిలోఁ దల్లి తప్ప నెవ్వరును లేరు. పది దినముల క్రిందట నొకచిన్న దానిం దీసికొనివచ్చి యింటిలోఁ బెట్టెనఁట. యిప్పు డేమయ్యెనో మాకుఁ దెలియదని గ్రామస్థులు జెప్పిరి ! తల్లి నడిగిన నది నా కొడుకు లేని సమయముఁ జూచి గుఱ్ఱమెక్కి యెక్కడికో పాఱిపోయెనని చెప్పినది. ఇదియే యచ్చటి విశేషములని వానియెదుటఁ జెప్పుటయు నా బ్రహ్మచారి అయ్యో ! నా భార్య పాఱిపోయినదా ? యెంత మోసము ? నే నెట్లు బ్రతుకుదును ? అని యేడువఁ దొడంగెను.

వాని చర్యలన్నియుం బరీక్షించి యున్మత్తుండనుకొని యంతలో వస్తువు దొరకుటచే దొంగయే యనుకొని యేమిశిక్ష విధింపవలయునో యని యాలోచించుచున్న సమయంబున రాజభటులు గొన్ని వస్తువులతో మఱికొందఱ దొంగలం దీసికొని వచ్చి రాజునెదుటఁ బెట్టిరి. ఆ వస్తువులన్నియు లలిత వగుట రాజు వాండ్రనెల్ల గట్టిగా విమర్శించి యా చిన్న దాని మీ రెట్లు తీసికొనిపోయిరి ? ఇపుడెందున్నది ? నిజము చెప్పుడు లేకున్న మిమ్మునందఱ గట్టిగా శిక్షింతునని భయంకరముగాఁ బలికిన నా పాటచ్చరులు భయకంపితాంగులై యా నృపతి కిట్లనిరి.

దేవరా ! మీతో నిజము చెప్పుచున్నాము. వినుండు. మేము తూరుపు సముద్రప్రాంతమందలి యరణ్యములోఁ దిరుగుచుండఁ బదియారేఁడుల ప్రాయము గల యొక చిన్నది గుఱ్ఱమెక్కి వడిగా నెక్కడికో పోవుచున్నది. మేమడ్డయిపోయి కఱ్ఱలు విసరి గుర్రమునాపి దిగుదిగుమని పలికితిమి. మా మాటల కా బోఁటి జడియుచు నన్నలారా ! నామేన నున్న వస్తువు లన్నియు మీ కిచ్చి వేయుదుసు. నన్నేమియుం జేయక కట్టుబట్టతో విడిచివేయుఁడని ప్రార్ధించిన మొదట నంగీకరించితిమి.

ఆ చిన్నది గుఱ్ఱముదిగి వస్తువులన్ని యుఁ దీసి మా ముందర రాశిగాఁభోసి మఱల గుఱ్ఱమెక్కబోవు సమయంబు నడ్డు పెట్టి నిన్ను బోనీయము. మాలో నొకనిఁ బెండ్లియాడుమని చెప్పితిమి ఆ చిన్నది మాకంటెఁ జాలగడుసుది. అప్పుడు మమ్మందఱం జూచి నన్ను బెండ్లియాఁడువాఁ డెవ్వఁడని యడిగిన నేను నేనని తగవు లాడఁదొడంగితిమి. అప్పుడప్పడఁతి అదికాదు, నేనీ గుఱ్ఱమెక్కి యొక్క దండము విసరెదను. అది వేగముగాఁ బరుఁగిడి ముందెవ్వఁడు నాకుఁ దెచ్చి యిచ్చునో వాఁడే నాభర్తయని చెప్పిన నందఱము సమ్మతించితిమి. అప్పుడు బారెడు దండము నొక దానిఁగొని గుఱ్ఱమెక్కి అదిగో కాచికొనుఁడు వైచుచున్నానని గట్టిగా విసరినది. అది నూఱు బారల దూరమునఁ బడినది. దాని నిమిత్తము మేమందఱము పరుగిడితిమి. ఆసందున నా సుందరి గుఱ్ఱమెక్కి పాఱినది. మే మంతవడిగాఁ బరుఁగిడిపోయినను మాకు దొరికినదికాదు. వస్తువులు మాత్రము తెచ్చికొంటిమి. ఈ భటులు మమ్ముఁ బట్టికొని కొట్టిన దెబ్బలకు మితిలేదు. బాబూ ! యదార్ధము చెప్పితిమి రక్షింపుఁడని వేడుకొనిరి. అప్పుడా రాజు కనికరింపక బ్రహ్మచారితోఁగూడ నా ముచ్చులకు ద్వీపాంతర వాసశిక్ష విధించి యా యరణ్యము లన్నియు వెదకిరమ్మని రాజభటులం బంపి కూఁతురు జాడ నరయుచుండెను.

అని యెఱింగించి మణిసిద్ధుండు వేళమిగులుటయుఁ గథఁజెప్పుటఁ జాలించి తదనంతరోదంతంబు ప్రైమజిలీయం దిట్లు చెప్పఁ దొడంగెను.

నలువది మూడవ మజిలీ

పోలిశెట్టికథ

గోపా ! వినుమట్లు లలిత సఖురాలు తిలక గుఱ్ఱమునుండి పుడమింబడి యది యిసుకనేల యగుటఁ గొంచెము దెబ్బతగిలినను బెద్దతడ వొడలెరుంగక వివశయై యెట్టకే మై దెలిసి కనులు దెరచి చూచినంతఁ దెల్ల వాఱుచున్నది. అప్పుడు లేచి నలు దెసలుం బరికింపుచు, అయ్యో ! లలిత నన్ను విడిచి యేగినదా ? నా జాడఁ దెలియక యెందు విచారించుచున్న దోకదా ? దారిం దప్పితిమేమో, నాపడినది యెఱుంగక యేగెనని తలంచెదను. కానిమ్ము. అది మగనితోఁ గలిసికొనిన నాకదియే పదివేలుఁ అని తలంచుచు నందొక దారిఁబడి నడువసాగినది. పోవంబోవ మధ్యాహ్నమున కొకపల్లె గనంబడినది. అందొక గృహస్థునింట భుజించి తన కులశీలనామంబులు దెలుపక యందలి జనులవలన దూరపు సముద్రపు తీరంబుననున్న రేవా నగరమునకు