కాశీమజిలీకథలు/ఏడవ భాగము/105వ మజిలీ
105 వ మజిలీ.
చిదానందరమానందులకథ
రమానందుఁడు - చిదానందూ ! ఆ యోగిని జగన్మోహ -------------- త్రివేణిలో స్నానము చేయుచుండఁ జూచితిని. దానిమేని లావణ్యము కన్నుల మిరమిట్లు కొల్పినది. అయ్యారే ? నారచీరఁ గట్టినను భూతిబూసికొని కలు ధం చినన (గొ శ్రయందము గలుగుచున్నడి. అట్టి,07౦ నన్ను మళ
ణాలదా! తిలోకాదిపత్యమేల!
చిచానంద(చ--అవును. అ పూవుటోం:” ది
(బి భమునకు శోథ తఆగుసా! మన
పల జూడధళలిగికడి. అమ్మకిటల్లః తివి వలి ల
లగు పచ్చవిల్లు? ఫిరంగి గుండ్లని తలంపవలయును
గమానందంతు- అందులకు సందేహమేల,
చ. 'సెంవుం నుప్పతిల్లి సరినిక్కి మొనల్ తలలెత్రి క్రొవ్వ బలసి సమంబుపై బిగిసి వృటువలై మెలు/ెక్క్ చర్కానై శ] కెంళల వికటిల్లి చెలికిం గడునొప్పె గుళంబు రొన్పు కు ప్పుణగను మన్మధుండు సరివాలగ |దాసునందూవేనోయనన్.
చిదా--అ రెండవ బాలయోగినియ నందక ్రెయగాని లోక సామాన్యమఃగా. 'నన్నడి. అడి దాని సఖరాలని తలింపవచ్చును.
'రమా--ఈ తరుణు లిరువురు నిట్టి పథమ్మప్రాయంబున వర్త బూనుటరు( 'గారణమేడియో దురవగాహమై. గ్లీన్నది. వీరి కులీల నామంబు లెట్టిపో ఆలిసికొసి రాఢలవా?ి
చిదా-వీరు కన్నులెత్తి యెవ్వరిం జూవరు. మాట్లాడరు. బబ్కరించిన.. వస పించు కొనరు. వెనువెంట డివిగి యథి యంతయం బరీ£ంచితిని,
'రమా.-అటైననౌండు వినుము. వీరు మనుష తల్మతమున వళలుగారు. పై 'తరతమున॥ బడ్మబ్రోయవలయు మనోహరడాసుని నీ వెలు(గుదులా?
చిదా--ఎయుంకేమి. అతడు సకల మం్యత తం్మతవిడి యస,
'రమా--వానబేతిలో బడిమాడలం బెట్టిన మంచికర్యత మెగండ.పగంనిన దానం ఇంపించినచో( గుక్క అవలె నక్కటలికిమన్న లిరువుడు మన... ము ౧గ్గరకు రాగలరు. ఇడియే నాక(దోచిన యూహా నీ వెమనయెకవు?్ చిదా - నీ యూహ సమంజసముగానే యున్నది. యిప్పుడే పోవుదము పద అని చిదానంద రామానందులను బాల సన్యాసులు ప్రయాగలో నాయోగినులఁజూచి మోహించి వారి వశవర్తినులం జేసికొను తలంపుతో నొకనాఁడు మనోహరదాసు నింటికిం బోయిరి.
ఆ మనోహరదాసు ఏబదియేండ్ల ప్రాయములో నుండెను. జడలు పెంచికొని యుష్ణీషముగాఁ జుట్టికొనియెను. రుద్రాక్షమాలిక లొడలి నిండ ధరించెను. కుంకుమ బొట్టు నొసటదిద్డి శక్తిపూజా పరతంత్రుఁడై యుండువాఁడు. అట్టి తంత్రజ్ఞునింజూచి యీయోగు లిరువురుం పాదంబులబడి నమస్కరించుచు స్వామీ ! నీపాద సేవకులము ప్రసన్నులమై నీయొద్దకు వచ్చితిమి రక్షింపుము రక్షింపుమని ప్రార్దించిరి.
అతండు వారి లేవనెత్తి యోగులారా! మీరు నా వలనఁ గాఁదగిన కార్యమేదియో చెప్పుడు? ఓపుదునేన తప్పక కావించెదనని చెప్పుటయుఁ జిదానందుఁ డిట్లనియె. స్వామీ ! మా మనోరధము జెప్పుటకు సిగ్గగుచున్నది. మీ వేషముల కిట్టికృత్యము దగదని నిందింతు రేమోయని వెరచుచుంటిమి. దోషమని యెఱింగియుఁ బూనికొంటిమి. ఈ పదిమాడలు దక్షిణగా స్వీకరించి మా కోరికవిని మమ్మాక్షేపింపక సఫలము జేయ గోరుచున్నామని పలికి యాదక్షిణ నిచ్చుటయు, నందుకొని యాయోగి యిట్లనియె.
కుమారయోగులారా! మీపని విత్తము గొనకయే చేయఁదగినది. తలత్రాను సారమునఁ గైకొనవలసివచ్చినది. మీరు సంశయింపక కోరికఁ దెలుపుఁడు. తృటిలోఁ గావింతును. దేవతలకే తప్పులుగలుగుచుండ మనుష్యులమాట జెప్పనేల? విశ్వామిత్రునియంతవాడు కామలోలుఁ డగుట వినమో? మిత్రభావమును వచియింపుఁడని యడిగిన నవ్వుచుఁ జితానందుం డిట్లనియె.
స్వామీ! మీరు గ్రహించితిరి అందులకే మీయొద్దకు వచ్చితిమి. యోగులకు యోగినులకు సంఘటనము జేయవలయును. త్రివేణీ తీరమున నిరువురు తరుణులు యోగినీవేషముతోఁ దిరుగుచున్నారు వారి కులశీలనామములు దెలియవు. ఒరులఁ గన్నెత్తి చూడరు. వారు మాకాళ్ళకడకు వచ్చునట్లు చేయవలయును. మీమంత్రప్రభావ
అచు గానిండు మీకోరిక యసాధ్యమైనద. అయినను దు. బహు ఐథ )వర్మకగలవానికి. నసార్య ముండునాయని బ్లైమును. ఆడివి. మీయదృష్టముల్లి సిగంధ బడినడి. నేకొకమంత ముపదేశించెదను ఆహం2.ఎను గతఐన. నిలిపికొని రెండులలజిపము. చేయడు గడంబ
గిన్నెతి చూ వట్టి. వింది
అనం డిర పుష్పములచేత లక్ష హోమములు జేసినచో మహాపతివ్రతయైనను శీఘ్రముగా మీ యొద్దకు రాఁగలదు. అట్లుచేయుఁడు పోపొండని యామంత్ర ముపదేశించి యతండు వారినం పెను.
ఆయోగు లామంత్రము సాంగముగా గ్రహించి యమునానదింగ్రుంకి నియమముగా రెండులక్షలు జపించి హోమముజేసి మూడు రాత్రులలో వ్రతసమాప్తి గావించిరి. నాలుగవనాఁటి రేయి తప్పక యప్పడఁతి వచ్చునని నిశ్చయించి మారుమూలనున్న నొకపర్ణశాలలో మంచిశయ్య గల్పించి తగురీతి నలంకరించి యామిందఁ బోణిఁరాక నిరీక్షించుచు వారిట్లు సంభాషించుకొనిరి.
రమానందుఁడు - చిదానందూ ! ప్రొద్దెంతపోయినది?
చిదానందుడు - ఇంకను జాము ప్రొద్ధయినను బోవలేదు. తొందరపడియెద వేమిటికి? అర్ధరాత్రమునగాని రాదలి మనోహరదాసు చెప్పినమాట మరచితివా?
రమా - అబ్బా! యీప్రొద్దెంత సేపటికిఁ దరుగకున్న దేమి?
చిదా - సమయము కావచ్చినదికాని ముందు నీవా? నేనా?
రమా -- అచిన్నది తొలుత నెవరిని పిలుచునోవాఁడు. మంత్ర మిద్దరము. జపించితిమిగదా.
చిదా - సెబాసు లెస్సగా జెప్పితివి. అదియే బాగున్నది.
రమా -- చూడు. చూడు. అమూల నెద్దియో సద్దగుచున్నది. అర్దరాత్రము దాటిపోయినది.
చిదా - గాఢాంధకారములో నేదియుం దెలియదు (నిదానించి) అవును యెవ్వరో వచ్చుచున్నట్లేయున్నది.
రమా - రాక గుండెలున్నవియా? మనముజేసిన జపముసామాన్యమా? మనోహరదాసుమాత్రము మంచి తంత్రవేత్తసుమీ?
చిదా -- అది యెఱింగియేకాదా? నేనువానియొద్దకు రమ్మంటిని.
రమా -- అవును ఈయపాయము జెప్పినవాఁడవు నీవే.
చిదా - అదిగో వచ్చుచున్నది మాట్లాడకు బోటీ? ఇటురా ఇటురా. మాపర్ణశాల యిక్కడనున్నది.
రమా - రమానందు డిక్కడ నున్నాడు. ఇటురా?
చిదా - నేను జిదానందుఁడ నిందున్నాను. ఈలాగున.
రమా - దాపునకు రానిదే తొందరపడియెద వేమిటిక?
చిదా - నీవు ముందుగాఁ బిలిచితివికాదా? రమా -- అందులకే దూరముగా బోవుచున్నది.
చిదా - ఇటురా ఇటురా. (అని బిగ్గరగాఁ బిలిచెను)
అప్పుడక్కడ కొక బ్రాహ్మణపుశ్వస్త దేహబాధకై చేతఁ జెంబుదీసికొని యా మూలకు వచ్చి వారిపిలుపు విని దాపునకుఁ బోయినది చీఁకటిలో నామె నాయోగినియే యనుకొని దాపునకు వచ్చినతోడనే తటాలున లేచి చెరియొకప్రక్కకుఁ చేరి చేయిపట్టుకొని నీకుఁ జిదానందుఁడా? రమానందుఁడా యని అడిగిరి. ఆమె భయకంపిత స్వాంతయై అయ్యో! మీరెవ్వరు? నే నెవ్వతె ననుకొంటిరి? మాది దక్షిణ దేశము. నేను విశ్వస్తను. గాశీయాత్రకువచ్చి యీత్రివేణిలో గంగ బట్టుటకై నిన్నరాత్రి యిక్కడికి వచ్చితిమి. ఆచావడిలోఁ బండుకొంటిమి. దేహబాధకై యావల బోవుచున్న దాన రజోదూషిత నన్నేలముట్టితిరి నేను మీరనుకొనినదానగాను, పో పొండని యదలించి యామె యవ్వలికిం బోయినది.
అప్పుడు వాండ్రిరువురు సిగ్గుపడి నవ్వుకొనుచు నోరీ! యిదియేమిరా? యిట్లు మోసపోయితిమి. నయమే అది భయపడి కేకలు వేసినదికాదు. చుట్టుపట్ల వాండ్రువచ్చి మనలఁ జోరులుగా నెంచి బద్ధులం జేయుదురు మరియుఁ బద్మినీజాతి స్త్రీకి నంత్యయామము ప్రియమైనదన గ్రంధములో నున్నది. దానంజేసి తెల్లవారు జామునఁ దప్పక వచ్చును అని నిశ్చయించి యారేయియెల్ల గనురెప్పవాల్పక వారిద్దరు నాముద్దులగుమ్మకై యెదురుచూచుచుండిరి. ఇంతలోఁ దెల్లవారినది. దిజ్ముఖములవలె వాండ్రముఖములు వెలవెల బారఁజొచ్చెను.
అప్పు డాయోగులు కడువిచారముతో మనోహరదాసునొద్దకుఁబోయి స్వామీ! మీమంత్రమింత గొడ్డువోయినదేమి? అయ్యయ్యో? మూఁడురాత్రులశ్రమ యట్లుండ నిండు. నిన్నరాత్రి మేము పడిన యిడుములకు మేరయున్నదా? తుదకొక విశ్వస్తం బట్టుకొని పరిహాసా స్పదులమైతిమని యాకథ యంతయుఁజెప్పి దుంఖింపఁదొడంగిరి.
వారిమాటలు విని మనోహరదాసు కొంచెముసేపు ధ్యానించి యెట్లైనను దాను కోరిన నారీమణి కులశీలనామంబులు తెలియక జపించినఁ బ్రయోజనములేదు. మీరూరక యాతురులై యడుగుటచే నట్లుచెప్పితిని. పరిచయముగలవారితోఁగాని యట్టి తంత్రము జరుపరాదు. మీమొగమే వా రెరుంగరని చెప్పుచున్నారు యట్లైన నాయోగినితోఁ బరిచయము గలుగఁజేసికాని వచ్చినచోఁ గార్యసాఫల్యము జేయఁ గలను. పో పొండు ఆపొన్ని కొమ్మలను వెన్నంటి తిరగుచుండుఁడని యుపదేశించెను.
వాండ్రు వానియొద్డ నేమియు మాటడలేక యావలకు వచ్చిరి. చిదానందుడు రమానందునితో నోరీ ! ఈమోసకాఁడు మనసొమ్మూరక తినవలసినదేనా? అడుగక యూరకవచ్చితివేల. రెంటికిం జెడుదుమా? యనుటయు నేమిచేయుదుము గట్టిగా నడిగినఁ బ్రయోగము జేసి మనలఁ జంపగలఁడు. వానిచేతిలో నెప్పుడు పెట్టితిమో యప్పుడే మనసొమ్ము పోయినది. పరిచయము గలుగఁజేసికొనివచ్చిన నేదియో చేయునని చెప్పుచున్నాఁడుకాదా ? అప్పుడే చూతము అని వాఁడు వానికి సమాధానము జెప్పెను. అప్పుడు చిదానందుఁడు యిఁక మనము నిత్యము నామత్త కాశినులు చేయు కృత్యములఁ బరీక్షించి పిమ్మటఁ జేయఁదగినపని యాలోచింతము. రహస్యముగా వారి వెనువెంటఁ దిరుగుచుండుమని బోధించిన రమానందుఁ డట్లుచేసి యొకనాఁడు చిదానందునితో నిట్లనియె.
మిత్రుఁడా ! నిన్న నే నొకవిశేషము దెలిసికొనివచ్చితిని వారిలో రెండవ యోగిని నిన్న బ్రహ్మానందయోగియొద్దకు వచ్చి వసిష్టమహర్షి యాశ్రమమునకు మార్గ మెట్లనియు నతని యాశ్రమమునకుఁ బోవలయుననియు నడుగుచున్నది. దారి చూపువారికిఁ గొంత ధనసహాయము చేయుదునని సూచించినది. ఆ యోగి వృద్దుండైనను గడు టక్కరియగుట నా ముని యిప్పు డెందున్నవాఁడో విచారించి తెలియఁ జేసెద రెండు మూఁడు దినములలో రమ్మని యుత్తరము జెప్పెను. ఇదే సమయము నే నొక వ్యూహము పన్నదలంచి యుంటి. విరివిగ సొమ్మువ్యయ పెట్టవలసియున్నది. నీ వంగీకరింతువేనిఁ గార్యసాఫల్యముగాఁగలదు అని పలుకుటయు చిదానందు డిందుల కెంత సొమ్ము వ్యయమైనను సగబాలు భరింతు గార్యము నెరవేరు తెరవాలోచించుమని యుత్తరము చెప్పెను. అప్పుడు రమానందఁడు వాని చెవిలో నేదియో చెప్పెను. చిదానందుం డంగీకరించెను.
అని యెఱింగించువరకు వేళ యతిక్రమించుటయు మణిసిద్దుండు అవ్వలికథఁ బై మజిలీయం చెప్పఁదొడంగెను.
106 వ మజలీ.
బ్రహ్మానందయోగికథ
రోహిణీ ? మన మీ ప్రయోగము వచ్చి పది దినములైనది. తీర్థసేవ గావించి కృతార్ధుల మైతిమి. పయనము మాట యేమి జేసితివి కాదు యోగులు చాలమంది గలరు. వారు దేశసంచారము చేయుదుందురు. వారికి -------------- మార్గము దెలియకపోదు. ఎవ్వరినైన యడిగితివా అని ప్రయోగమున జితపతి ------------- రోహిణితో ముచ్చటించిన నది యిట్లనియె.