కాశీమజిలీకథలు/ఆరవ భాగము/93వ మజిలీ

తొంబది మూడవ మజిలి

జయంతుని కథ

శోభావతి - ప్రాణేశ్వరా ! మీ కుమారుఁడు జయంతుఁడు మిమ్మేదియో యడుగుటకు వచ్చి వెరచుచున్నాఁడు పిలువుఁడు.

ముంజుఁడు - వత్సా ! రమ్ము. నా యొద్ద సందియ మేమిటికి ? నా కృషియంతయు నీ నిమిత్తమేకాదా ? నీ కేమి కావలయునో యడుగుము. ఇప్పుడే యిప్పించెదను.

జయంతుఁడు - (కన్నీరుఁ దుడిచికొనుచు) తండ్రీ ! నా కేమియు నక్కర లేదు. మాయన్న భోజకుమారుని భువనేశ్వరీ కాంతారమునకుఁ జంప బంపితివఁట. అతం డట్టి యపరాధ మేమి కావించెను ?

ముంజుఁడు - పట్టీ ! నీవు చిన్న వాఁడ విట్టిప్రశ్నల నడుగరాదు. అపరాధి యగుటచే యట్టి శిక్ష విధించితిని.

జయంతుఁడు - పెద్దవారలు చిన్నవారలై కాని పనులు సేయుచుండఁ జిన్న వారలైన బెద్దరికము వహింపఁగూడదా ? అతఁడు కావించిన యపరాధ మేదియో యించుక వినఁగోరు చున్నవాఁడ. వివరింపుడు.

ము౦జు - పట్టీ ? నీవు వట్టి యమాయకుఁడవుగదా? ఆత్మౌన్నత్య మెరుంగక మాట్లాడుచుంటివి. నే నెవ్వరి నిమిత్త మిట్టిపనిఁ జేసితినో నీవే నన్నాక్షేపించుచుండఁ బెరవారి నన నేల?

జయ - నా నిమిత్తమా? సకలగుణజలనిధియగు భోజకుమారుని జంపించితివి. అక్కటా? నేనెంత పాపాత్ముండ. అయ్యో ? నేను బుట్టకపోయినను నా దయాశాలి జీవించునుగదా ? (అనియురముఁ బాదుకొనుచు దుఃఖించు చున్నాఁడు)

శోభావతి - జయంతా?| వారికి వారియన్న బిడ్డయందు లేనిప్రీతి నీ కేటికి ? మన మంతకంటె దూరమువారము కామా ? ఊరడిల్లుము.

జయంతుఁడు - తల్లీ ! వానిగుణంబుల‌ నీవేమి యెరుంగుదువు. నన్నుఁగన్నబిడ్డకన్న నెక్కుడు గారాబముగాఁ జూచు వాడుగదా ? “మాతండ్రి నెరుఁగను. ముంజుఁడే మా తండ్రియని” సంతసముతోఁ బల్కుచుండును. అట్టి పుణ్యాత్ముం జంపి రమ్మనుటకు నో రెట్లాడెనో తెలియదు. విను మొకనాఁడు మే మిరువురము నడవికి వేటకుఁ బోయి యం దందుఁ దిరుగుచుండఁ పరిజన మించుక వెనుకబడుటయు నొక వరాహము వెనువెంట వచ్చి నా తొడ జీరి పారిపోయినది. అప్పుడు నా యంగమునుండి బొటబొట రక్తము కారినది. నా గాయముఁ జూచి యడ ------------------ నన్నెత్తుకొని యొకపాదపమునీడకుఁ దీసికొనిపోయెను. నడచునప్పుడు నా భారమించుకయు లెక్క సేయం తమ్ముడా ! ఎట్లున్నది ఎట్లున్నది. వెరువకుము. నీ వ్రణము మానిపించెదని పలుకుచు నెన్నియా యుపచారములుచేసి పసరు పిండి కట్టులుకట్టి యయ్యాత నతన్నుఁ జెందినట్లు బాధపడియె. నిదిగో వ్రణ చిహ్నము చూడుము. దీనిఁ జూచిన వాని యుపచారము లన్నియు జ్ఞాపకము వచ్చు చున్నవి.

శోభావతి - అయ్యో తండ్రీ ! నీ మాటలు జెప్పుచుండ నాకునుం గన్నీరు వచ్చుచున్నదిగదా? గతమునకు నిప్పుడేమి చేయఁగలము. బోజుఁడు మిగుల గుణవంతుడనియే నేనును వినుచుంటిని.

జయంతు - తల్లీ! వానికి నా యందుగల యక్కటిక మే మని వక్కాణింతును. ఒకప్పుడు అన్నా ! నీవు రాజైన వెనుక నాయందీ యనురాగముఁ జూపుదువా ? అని యడిగితి నతండు నవ్వుచుఁ దమ్ముఁడా? ఈ రాజ్యము నీవే పాలించుచుండుము. నేను సంతతమా విద్వాంసుల గోష్టిచేఁ గాలక్షేపము చేయుదు నని కృపారసపూరితులగు చూపులు నాఫై వ్యాపింపఁ జేయుచు నానతిచ్చె. ఆ మాటలు తలంచుగొన గుండెలు భిన్నము లగుచున్నవికదా ?

శోభావతి - పుత్రా ! మీ తండ్రి తెలియక దుష్కార్యముఁ జేసిరి. నీవే యట్లు రట్టుఁబెట్టిన బ్రజ లెంత నిందింతురు. కాలగతి యని తలంచి చిత్తము మరలించుకొనుము.

ముంజుఁడు - ప్రేయసీ ! వాని మాటలు నమ్మి నీవును వేరొకరీతి బలకెద వేమిటికి ? ఎట్టివానికిని రాజ్యము వచ్చిన తరువాత వెనుకటి మాటలు నిలుచునా? వాఁ డట్టి వాత్సల్య మేమిటికిఁ జూపెనో వీఁ డెరుంగునా? జాలిగుండెవాఁ డగుట నిట్లుఁ గుందుచున్నవాఁడు. పోనిమ్ము.

జయంతుఁడు - హా ! త్రిలోకైకసుందరరూప ! హా ! మృదుమధుర గంభీరాలాప ? హా ? సుగుణ జలనిధీ ! హా !; దయానిధీ ! హా ! సుకమారా ! భోజకుమారా ! అన్నా ! నిన్నుంజూచి యెంతో కాలమైనట్లున్నదిగదా ? నన్ను విడిచి గడియ మసలువాఁడవుకావు. ఇప్పుడెట్లు పోయితివి ? నేను గృతఘ్నుఁడగదా ? నీ వెంట రాలేకపోయితినని యనేకప్రకారముల విలపించుచు మూర్చాలస వివశహృదయుండై పండుకొనియెను. తల్లి సేదదీర్చుచు దాపున నిలువంబడినది.

అట్టి సమయమున నాంతరంగిక పరిజను డొకఁడు వచ్చి నమష్కరింపుచు దేవా ! బాహ్లీకునొద్దనుండి నలువురు బ్రాహ్మణులువచ్చి దేవరదర్శన మరయుచున్నారు. మీతో మాట్లాడుటకు సుముహూర్తము మిగిలిపోవుచున్నదఁట. సభకు విచ్చేయుదురేయని చెప్పిన‌ నతండేమియుం దోచక యోలగంబున కరిగె

అప్పుడాబాడబులు స్వస్తివాచక పూర్వకముగా నాశీర్వదింపుచుదాము తెచ్చిన శుభలేఖ లానృపతి కందిచ్చిరి అమాత్యుఁడు గైగొని యిట్లు చదువుచున్నాడు. స్వస్తిశ్రీ ముంజు మహారాజువారి‌ సన్నిధికి బాహ్లీకుఁడు వ్రాయుశుభ లేఖార్దములు. మీ రంపిన మీ పుత్రుని చిత్ర ఫలకముఁ జూచి మిక్కిలి యానందించితిమి. మదీయ పుత్రిక లీలావతిని మీకుమారున కిచ్చుట కనుమోదించితిని. ముహూర్తము నిశ్చయించి తరలి రావలయు నివియే పదివేల శుభ లేఖార్థములు---బాహ్లీకుడు.

ఆ వార్తవిని సభాసదు లందరు పుత్రుం డనభోజుఁడా ? జయంతుఁడా ? యని సందేహ మందుచుండిరి. భోజుఁడనియే నిరూపించిన వారు కన్నీరు విడువఁ దొడంగిరి. ముంజుఁడునుతి డోలాయిత మనస్కుడై యొక్కింత తడవు విచారించి మీ రంపిన చిత్రఫలక మందినదని వ్రాయుచున్నాఁడు. వీరికి నేను చిత్రపట మెవ్వరిది పంపితినో యించుకయు జ్ఞాపకము లేదు. బాహ్లీకుని కూతురు లీలావతి కడు రూపవతియని వినియంటిమి. భీజుఁడు వరించి తనయా లేఖ్యమునంపి యుండును. పోనిమ్ము ఇందు నీ పుత్రుఁడనియే (వానిపేరు వ్రాయబడి యుండలేదు గదా) జయంతునికే యా కన్యను వివాహముఁ జేసికొందుగాక. బాహ్లీకుఁడు మా కన్నఁ బదిమడుఁగు లెక్కువ వాడు. వాని సంబంధ మన్నివిధముల నుచితముగానున్నదని తలంచుచు నాభూసురుల వలన లీలావతిచిత్రపట మందుకొని యేదియో ముహ్తూర్త మప్పుడే నిశ్చయింపఁజేసి యాపారులకుఁ గానుకలిచ్చి యంపెను.

పిమ్మట నా చిత్రపటముఁ గైకొని భార్యయొద్దకు వచ్చి ప్రేయసీ ఈ యువతిం జూచితివా? బాహ్లీకుని కూఁతురు దీనిపేరు లీలావతి. త్రిభువనాశ్చర్యకర సౌందర్యమున విరాజిల్లు చున్నది. దీని వరించి భోజుండు తన చిత్రపటంబుఁ బంపి యున్నాఁడు. బాహ్లీకు డల్లునకు మున్నూరు గ్రామములు కట్టణమిచ్చునఁట. మన జయంతున కాకాంతం జేసికొనుటకు నిశ్చయించితిని. ముహూర్తము నిరూపితమైనదని పలికిన విని యామె యిట్లనియె. నాఁ బోజకుమారుని జంపితిరని నగరమంతయు నల్లకల్లోలముగాఁ జెప్పుకొనుచున్నారఁట. ఇంతలో నీ శుభముహూర్తము నిశ్చయించిన విని ప్రజలూరకుందురా ? మొగము మీదనే యనకమానరు. అదియునుంగాక మీ కుమారుఁ డతని నిమిత్తము మిక్కిలి దుఃఖించుచున్నాఁడు. ఇప్పుడీ పెండ్లికి సమ్మతించునా? మఱికొన్ని‌ దినములు గడువనీయుడని యుపదేశించినది. అంతలో సాయంకాలమైనది. అప్పుడు వత్సరాజు రత్న కుండల సముజ్వలమగు బోజకుమారుని శిరంబు జేత నిడికొని రాజమందిరమున కరుదెంచి మహారాజా ! దేవరయానతి వడువున బోజుని భువనేశ్వరీ కాంతారమునకుఁ దీసికొని పోయి చంపితిని. ఇదిగో ? వాని శిరంబుఁ జూచికొనుమని పలికెను.

అప్పుడు ముంజుఁడు వత్సరాజు నగ్గించుచు మిత్రమా ! నీవు బోజు నెట్లు దీసికొనిబోయితివి. ఎవ్వరైన దారిలోఁ గనంబడిరా ? వానితో నేమని చెప్పితివి. ఖడ్గ ------------------ వాడేమయిన మాటలం జెప్పెనా ? సవిస్తరముగా నెరింగింపుమని యడిగిన నతఁ డిట్లనియె. దేవా ! నేను దేవరయనుజ్ఞకొని యరదముతోఁ బాఠశాల కరిగితిని. పిలిచినంతనే యా రాజకుమారుఁడు నన్నుఁ బాదరక్షతో దవడ మీద గొట్టెను. పిమ్మట నరణ్యమునకుఁ దీసికొని పొమ్మని యున్న మీ శాసన పత్రికం జూపితిని. అప్పుడతండు శాసనమునకు బద్దుండై రధమెక్కి నాతోవచ్చెను. ఈవార్త పురమంతయు నంతలోనే వ్యాపించినది పౌరులు పెక్కండ్రు నా రధమున కడ్డము వచ్చి యాటకంముఁ జేయుచు రాజకుమారు నిందు దింపి పొమ్మని యదలించిరి. నా భటులచే వారినెల్లఁ బలాయితులం గావించితిని. మరికొంత దూర మరిగిన తరువాత వీరభటులు కొంద రాయుధపాణులై వచ్చి యా రధము చుట్టు ముట్టడించిరి. అప్పుడు భోజకుమారుఁడు సానునయముగా వారిని వారించుచు రాజ శాసన‌ మెవ్వరును మీరరాదు. మంచి చెడ్డలు విమర్శింపఁ ప్రజల కధి కారములేదు అట్లెయిన రాజ్యము సేయుటయే సాగదు. అని యే మేమో బోధించుచు వారి యాటంకము మానిపించెను.

కొంత ప్రొద్దు పోయిన తరువాత నయ్యడవి కరిగితిమి. నన్నేమిటి కిట్లు తీసికొనివచ్చితిరి ? రాజ శాసనము నా కేమిశిక్ష విధించుచున్నది. అని యడిగిన నేను జెప్పలేక చివురకు నిన్ను జంపుటకే ఇక్కడికిఁ బంపిరని రెండవ శాసనము జూపితిని. అప్పుడతం డించుకయు విచారింపక నవ్వు మొగముతో నోహో ? దీనికంత వింత పడనేమిటికి ? హారిశ్చంద్రుఁడును. నలుఁడును శ్రీరాముఁడును నెట్టి సామర్థ్యము గలవారు అట్టివారు రాజ్య భ్రష్టులై యెన్ని బాములంబడిరి. ఎల్లవారును గాలవశంబునఁ జెడిపోవుచుందురు అట్టి వారిని రక్షించువారెవ్వరు ? మంచివార్తఁ జెప్పితిరి. పిన తండ్రికిష్టము చేయుట నా కెంతయు సంతోషము. వేగ మీ పని కాని‌చ్చుకొనుఁడు. చీకటిలో నింటికిఁబోలేరని యత్యంత శాంతస్వాంతముతోఁ బలికిన మే మెంతయు నివ్వెరఁ జెందితిమి. మృతియన నతని కించుకయు. వెరపులేదు గద. శిరంబు నరకుఁడు. నరకుఁడని వంచుటయుఁ గతులెత్తి “మీ తల్లికిగానిఁ పిన తండ్రికి గాని జెప్పవలసిన మాట లేమైనం గలవా? చెప్పు" మని యడిగితిమి.

అప్పుడతండుతొడఁ జీరి వటపత్రపటంబున రక్తంబుఁ జేర్చి యా యాకులపై నేవియోవ్రాసెను. ఒకటి మీకును నాకండు జయంతునికిని నిమ్మని చెప్పెను. తరువాత నాకుమార శేఖరుఁడు హరిస్మరణ జేయుచు కన్నులు మూసికొని మోడ్పు చేతులతో శిరంబు వంచిన నిర్దయులమై నరికి తీసికొనివచ్చితిమి మిదియే వృత్తాంత మని చెప్పి యాపత్రికలిచ్చి వత్సరాజు పరివారములతోఁ దన యింటికిం బోయెను.

అప్పుడు ముంజుఁడు జయంతుని కిచ్చిన పద్యమును ముందుగా నిట్లు చదివెను.

న్యు నావొక పొత ముకం చరి. బరోపకార 4
మరకుమా 1 ధరసబనకోటితోడ స
పంపును? ఇలునగా. దలపోయకుమూ ? గురుని నీ
బూర్వకర్మ దురితంబిది నాకు భరింపగాఁ దగున్‌.

ఆ పద్యమును విని యించుక పరితాపంబు మనంబునం జనింపదనకు వ్రాసిన పద్యము నిట్లు చదువుచున్నాఁడు.

శ్లో. మాంధాతాచ మహీపతిః కృతియుగాలంకార భూతోగతః
    సేతు ర్యేన మహోదధౌ విరచితః క్వాసౌ దళాస్యాంతకః
    అన్యేచాపి యుధిష్టిరప్రభృతయో యాతా దివం భూపతే
    నై కేనాపి నిమంగతా వసుమతీ మానం త్వయా యాస్యతి.

కృతయుగమున కలంకార భూతుండగు మాంధాతయుత్రేతాయుగంబునఁ గొండల నీటియందుఁ దేలించిన శ్రీరాముఁడును ద్వాపరయుగంబున రాజ్యము నిమిత్తము జ్ఞాతులనెల్లఁ బరిమార్చిన యుధిష్టిరుఁడు లోనగు మహారాజు లందరు పెద్దకాల మీ భూమి పాలించియు నీ వసుమతి నిక్కడవిడిచియే లోకాంతమున కరిగిరి. పినతండ్రీ ! నీవు మాత్ర మీ భూమి నిందు విడిచిపోఁజాలవు. వెంటఁ బెట్టుకొనియే పోయెదవు. అంతయాస లేకున్న క్షణభంగురమైన శరీరమును నమ్మి నిరపరాధియైన యన్న కొడుకు నేల జంపఁ బంపుదువు ?

అట్టి యర్దముగల పద్యమును జదివికొని యా ముంజుండు తత్కాల జనిత వైరాగ్యవృత్తిచేఁ బశ్చాత్తాపముఁ జెందుచు విగత చేతనుండై నేలంబడియెను. అప్పుడు భార్యవచ్చి లేవఁదీసి సేదఁ దీర్చుటయు నతండు నన్ను ముట్టకుము. నేను జండాలుఁడను. పుత్రుం జంపించితిని. హా ! భోజకుమారా! సుగుణసాగరా ! పూర్వకృతమని పలికితివి యించుకయు నిందింపవైతివి. నీ యట్టి శాంతస్వాంతుఁ బరిమార్చిన నాపాపమునకు మేర కలదా? నీ తండ్రి నిన్ను నా తొడపైనిడి నీకొడుకులాగునఁ జూచుకొమ్మని చెప్పినమాట యించుకయు సాగింపలేక పోయితిని. నాకు నిష్కృతి గలదా యని యూరక దుఃఖించుచుండ నతని భార్య జయంతునితో వత్సా ! మీ తండ్రి కిప్పటికి భోజుని నిమిత్తము పశ్చాత్తాపము కలిగినది. మీ కేదియో పద్యము వ్రాసి పంపెనట. దానిం జూచి దుఃఖించుచున్నారని చెప్పుటయు జయంతుఁ డచ్చటికి వచ్చె.

పుత్రా ! నీపాటి ధర్మపరిపాటి నాకు లేక పోయినది. నిష్కారణము మన్మధాకారుఁడైన కుమారుని జంపించితిని. వాఁడు నీ కొక పద్యమును వ్రాసి పంపెను. చూడుమని యా పద్యపత్రిక నిచ్చెను. దానిఁ జదివికొని జయంతుఁ డురము మోదికొనుచుఁ బెద్దగా విలపింపఁ దొడంగెను.

అప్పుడు ముంజుండు దౌవారికుల నంపి పండితుల రప్పించి పుత్రఘాతకునకు నిష్కృతి యేమని యడిగిన వహ్నిస్రవేకమే ప్రాయశ్చిత్తమని యా బ్రాహ్మణులు ధర్మశాస్త్రములు చూచి చెప్పిరి. అప్పుడా రా జగ్ని ప్రవేశము సేయుటకు నిశ్చయించుకొనియె. అని యెరింగించి తదనంతర కధా వృత్తాంతము మణిసిచ్ధుం డవ్వలిమజిలీ యందిట్లుఁ జెప్పం దొడంగెను.

తొంబది మూడవ మజిలీ

లీలావతి కథ

సఖీ! చెప్పుము. చెప్పుము. సంశయించెద వేమిటికి? నీ వక్కడి కెప్పటికిఁ బోయితివి? ఎవ్వరు గనంబడిరి. ఈవార్త యెవ్వరుచెప్పిరి, సవిస్తరముగా నెరిగింపుమని నాగపురంబున బాహ్లీకుని కూఁతురు లలీవతి చామంతిక యనుతనసఖురాలి నడుగుటయు నా పొలఁతి యిట్లనియె.

పడఁతీ నీ యాజ్ఞ శిరంబునఁబూని ధారానగరంబున కరిగితిని. పట్టణ మంతయు నేదియో విచారముతోఁ గుందుచున్నట్లుఁ గనంబడినది. పదుగు రొక చోటఁ గూర్చుండి భోజకుమారుని గురించి దైన్యాలాపముల నాడుకొనుచుండిరి. నేను మెల్లగా వారి దాపునకుఁ బోయి. అయ్యా ! భోజకుమారుని నెల వెందున్నదని యడిగితిని. వారిలో నొకడు అయ్యో ? ఎక్కడి భోజుఁడు. అతని నెలవు నాక మందున్నది. మావీడు విడిచి మూడు దినము లైనదని చెప్పెను. అప్పుడు నేను గుండెలు కొట్టికొని అయ్యా ! ఎప్పుడు స్వర్గస్తుడయ్యెను. ఇంతలో నేమి వ్యాధి మూడినది సత్యముచెప్పుడు అని వినయముతో నడిగిన‌ ఆయన పిన తండ్రిచే బలవన్మరణము నొందెను. అని చెప్పఁ బోవుటయు మరి యొకఁడు వారించుచు నా సంగతి మాకుఁ దెలియదు. చావునకు గారణము కావలయునా ? ఎట్లో సమసినమాట సత్యమని చెప్పెను.

అప్పుడు నేను మరియొక చోటికిఁ బోయి విమర్శింప నతని పిన తండ్రి రాజ్యలోభంబునం జేసి భువనేశ్వరీనివాసమునకుఁ బంపి చంపించెనని తెలిసినది. ఆ మాట విని వికలమనస్కనై యేమియుందోచక యిక్కడికి వచ్చితిని. ఇదియే యక్కడికథ యని చెప్పిన విని ఆ రాజపుత్రిక ఆ? యేమి? ఎట్టి మాటవింటిని. హతవిధీ ! ఎంత క్రూరుఁడవైతి

ధాస్యించుచుం డెను, అంతలో! డల్లి య చ్చి అుమంతికాః ననబాూ బిందున్నడి. అడి కోరినవానికే తండి'పే సింద్‌ (న ఏనం ప గంటి. బార్నాణులు ధహాననగ్‌ ఎడకరిగి సుహువళా ర్ట నిశ్చయముం జేసకొ షరి యడిగినం బాయలని? ల్‌ల్మ/ బోయి చూచుచు నా పీఠముపై ( వంగుకొన్త 3 ఆ మాదవిని రక టి షి ఒఎవ్వనికి స్‌


లంచిరి ? నేను గోరినవాల!

రు ౩ మాఎ ంతగా సున్నదని చెపిన చః ఛిః రు ౧ యాచెడల 1 ఇంతకు బూర్వమే పంపిన భూసురులు వచ్చిరని చెప్పిరి. శుభలేఖలు కూడఁ దెచ్చిరని దెలుపుటయు లీలావతి నమ్మక యా లేక లిటుతెమ్మని యడిగినది. ఆమెయు నొక పరిచారికను భర్తయొద్ద కనిపి యా పత్రికం దెప్పించినది.

అందు నా కుమారునకు మీ కూఁతురు లీలావతిని వివాహము చేసికొనుట కంగీకరించితిని. ఈ లేఖలో వ్రాసిన సుముహూర్తమునకుఁ బెండ్లి కి వచ్చుచున్నాము ముంజుఁడు అని యున్నయర్దమును విమర్శించియిందుభోజకుమారునకనిబేరువ్రాయక పోవుట సందియముగా నున్నది. తన కుమారుఁడు మరియొకఁ డున్నాఁడేమో ? వాని నిమిత్తమై యంగీకరించెనేమో తెలిసికొనవలయును నేను కోరినవాఁడు భోజుఁడు ఇదిగో ? వాని‌ చిత్రఫలకము. చూడుము. అని చూపుచుఁ జామంతిక పోయివచ్చి చెప్పినమాట లన్నియు నెరింగించినది.

పో, పొమ్ము. ఎక్కడిదానవు అమంగళపు మాటలాడెద వేమిటికి ? మరియొకని వెదకి పెండ్లి చేయవచ్చును. వానిజోలి మన కేలయని మందలించిన తల్లి కి లీలావతి అమ్మా? బ్రతికియున్నచో బోజకుమారుని బెండ్లి యాడెద. లేనిచో నిట్లే బ్రహ్మచారిణినై యుండెదగాని యొరుని వరింపనని పలికినది. అవ్విషయమిరువురు పెద్దతడవు తగవులాడిరి. ఎంతచెప్పినను లీలావతి యంగీకరించినది కాదు. అవ్వార్త యామె భర్త కెఱింగించినది. బాహ్లీకుండు వార్తాహరులఁ గొందర ధారానగరమునకు బోయి భోజుని వృత్తాంతమును దెలిసికొని రమ్మనిపంపెను.

ఆ భటులు పటురయంబున ఘోటకము లెక్కిపోయి వచ్చి దేవా! బోజకుమారుని జంపించి ముంజుఁడు పశ్చాత్తాపముఁ జెందుచు నగ్నిఁజొచ్చుటకు సిద్ధముగా నున్నాఁడు. మనమా గొడవ తలపెట్టవలసిన పనిలేదు. వేరొకయోచన సేయుఁడని వ్రాఁకుచ్చిరి. ఆ కథ విని యా రాజుమిక్కిలి వెఱగుపడుచు మంత్రులతో నాలోచించి పుత్రికకుఁ జెప్పకయే వేరొక సంబంధము నిశ్చయించి యాముహూర్తమునకే పెండ్లిచేయు నట్లేర్పరచెను.

ఆ వార్త దాసీముఖముగా విని లీలావతి యొరుని బెండ్లి యాడుట యిష్టము లేని దగుట వివాహముహూర్తము రెండు మూడు దివసములున్నదనఁగా నెవ్వరికిం దెలియనీయక వేకువజామున లేచి కోట దాటి చురుకుగల యొక తురగము నెక్కి యొక యరణ్య మార్గమునఁ బోవఁ దొడంగినది.

దృఢనిశ్చయులగు తరుణుల చిత్తము మరలింప విరించితరముగాదు. ఆ చిన్నది యశ్వారోహణమందును, ఆయుధ ధారణము నందును, బాల్యమునందె లెస్సగా శిక్షింపబడి యున్నదగుటఁ జేతఁగౌక్షేయకము ధరించి యతి వేగముగా గుఱ్ఱమును దోలుచుండెను. ఆమె వేషము చూడఁ బురుషుడో స్త్రీయో తెలిసికొను దుర్ఘటముగా నున్నది.

అం )లమీతుయంబరతల వ మర్యవ న దనుక నేకరితి నట్లు పోవుచుండ

ను నషతోవ. ాగినడి. కోంత నవ్వరిగి ‌ కొంటాం టల నించో ( పప్పీ గుం నంత గంటకలకాతరు సాంద్రంబై తెరవు దొరకినది కాదు. అప్పుడప్పఁడతి త త్తిడిని మెల్లగా నడిపించుచుఁ దెరపి గనంబడి దెసకుఁ బోవుచు గంచెలం దాటుచు దొరియల నతిక్రమించుచు వచ్చిన దారియుఁ బోవలసిన తెరవునుం దెలియక తిరిగినచోటె తిరుగుచు నమ్మహారణ్యములోఁ జిక్కులు పడుచుండెను.

ఒకచోటఁ దురగమును నిలిపి సమున్నతా గ్రతంబగు నొకయనో కహమెక్కి నలుదెసలు పారఁ జూచుటయు నొకమూల ననతి దూరములో జలాశయమున్నట్లు పొడగట్టినది. ఆ దిక్కు గురుతుఁ జూచుకొని యా చిగురుబోణి క్రమ్మర వారువ మెక్కి యక్కడకుఁ బోయినది. అందుఁ గుముద కై వర మండితమైన పద్మాకర మొండు కన్నుల పండువ గావించినది.

తత్కాసారశీకరాసార చోదకములగు కుమార సమీరములు మార్గాయాస మపనయింపఁ దత్తీరధారిణి వారువమును దిగి జలములఁ ద్రాగించి యొక చెట్టునీడం గట్టిపెట్టినది. మరియు నత్తరుణీరత్నం బత్తటాకం సొంపువిలోకింపుచుండ నొక దండఁ గోవెలయొకటి కనంపడినది. ఇవ్వి జనారణ్యమం దీ దేవళ ముండుటకుఁ గతంబేమని యాలోచించుచు నందు జనులుందురను తలంపుతో నా గుడి దాపునకుఁ బోయినది. ఆ వేల్పు టింటికిఁ గవాటములైన లేవు భైరవ విగ్రహ మొకటి యొప్పుచున్నది. ఆ దేవతకు నిత్య పూజోత్సవములు చేయుచున్నట్లు కనంబడలేదు. అప్పుడప్పు డెవ్వరో పూజించుచున్నట్టి చిహ్నములు కొన్ని యున్నవి. అచ్చట విశేషము లన్నియుఁ జూచుచు నా కలకంఠి క్రమ్మర వెనుకటి నెలవునకు వచ్చి కటారి నొక తరుశాఖం దగిలించి పుట్టంబులు విప్పి గట్టునం బెట్టి దివాకర కిరణ ప్రతాపిత సంతాపము వాయ హాయిగా నా సరసీపయ పూర౦బునం దిగి తీర్థము లాడఁ దొడంగినది.

అట్టి సమయంబున నొక సార్ధవాహుఁ డా తీరమునకుఁ బారివచ్చి యందున్న యశ్వంబునుం గాంచి జను లెవ్వరో యున్నారని తలంచి నలుమూలలు సూచుచు పెద్దయెలుంగున ఓ పుణ్యాత్ములారా ! నేను దారానగరవాసిని. వర్తకుఁడ దారి తప్పి‌ యీ యడవిం బడితిని. దొంగలు తరుముకొని వచ్చిరి. నన్ను రక్షింపుడు. రక్షింపుడు. అని కేకలు వైచుచు నటు నిటు తిరుగుచుండెను. వాని యార్తధ్వని విని లీలావతి జాలిపడియు దిగంబరయై యున్న కతంబున నేమి చేయుటకు వీలులేక తన్నొరులు చూతురను సంకోచముతోఁ గంఠదఘ్నంబగు జలంబున వసించి తన మొగ మొక పద్మపత్రములవలెఁ గనంబడునట్లు వెలయించు చుండెను.

అంతలో నా బేరిం దరిమికొని వచ్చిన చోరు లచ్చటికివచ్చి నలుమూలలు వెదకి లీలావతి విప్పి పెట్టిన పుట్టంబులనెల్ల గైకొని యవ్వలకుఁ బోయిరి. లీలావతి యవ్విధం బరసి అయ్యో? ఇఁక నేనేమి చేయుదును? నా కట్టు పుట్టంబు లెత్తి కొని పోయిరి. ఇందు వే రొకచేల మెట్టుదొరక కలదు. కట్టా ! పుట్టములు విప్పి దిగంబరనై జలకమాడు నలవాటు బోటుల కెల్ల గలిగియన్నది. ఇది కడు ముప్పు దెచ్చినది దెసమొలతో నెక్కడికిఁ బోవుదును ? అయ్యో ? తలంచుకొన నా సంకల్ప మున్మత్త క్రియాకల్పమైనది. ఒరునిం బెండ్లి యాడ నిష్టము లేదని చెప్పిన బలవంతమునఁ గట్టిపెట్టుదురా యేమి? నే నీ సాహస‌ మేమిటికిఁ జేయవలయును? నా కీ యడవిలో మరణము విధి విధించెఁ గాబోలు ? హరిహర హిరణ్య గర్భులకైనను నొసటి వ్రాతఁ దప్పింప శక్యము కాదుగదా? బోజుండు హతుండయ్యెనని వినియు నక్కడికిఁ బోవలయునను బ్రయత్న మేమిటికో తెలియదు. నా బుద్ధి యంతయు మొద్దు వోయినది. ఈ నీటిలో నుండి పైకెట్లు పోవుదును. పోయియు నెట్లు మసలుదును. దైవమా! నా కీ యాపద యేమిటికిఁ దెచ్చితివి. నీ భక్తురాలి నిన్ని చిక్కులు పెట్టెదవా ? అని పరమేశ్వరుని ధ్యానించుచు నొక యుపాయ మాలోలించి పద్మపత్రంబులన్నియు మేనికిఁ జుట్టుకొని తూండ్లుచే బిగియించుకొని యల్లన తీరముఁజేరి యొక భూరుహ మూలమునఁ గూర్చుండి కర్తవ్యముఁ దెలియక ధ్యానించు చుండెను. అంతలోఁ బద్మినీ కాంతుండు పశ్చిమగిరి శిఖర మలంకరించెను. అట్టి సమయమున గంధర్వకన్యకలు గొంద రా తటాకమున జలక్రీడలాడ నరుదెంచి చేలములు విప్పి కూలమున నిడియోలలంచు నీటంబడి యీదులాడ మొదలు పెట్టిరి.

ఆ వారిజాక్షుల వారి విహారములుసూచి లీలావతి ఔరా ? వీరు సౌరాంగనలై యుందురు జలకమాడువేళ మానవ మానవతుల పోలిక వీరును చేలములు విప్పుదురు. కానిమ్ము. నన్నుఁ జెందిన కుందు వీరికో నొకసుందరిం జెందుగాక. ఒకదానికోక కట్టికొని పోయెద నీ యాపద నీ రీతి భగవంతుండు దాటించెనని తలంచుచు మృగమువోలెఁ బ్రాకి యా కోకలదరి కరిగి మేలైన యొక చేలము సంగ్రహించుకొని మెల్ల మెల్లన బ్రాకుచు దన కటారిఁ దీసికొని డొంకలమాటుగా భైరవాలయమున కరిగి యందాచీర ధరించి కృపాణంబు బాణిమరించుకొని యా భైరవ విగ్రహముచాటున గూర్చుండెను.

అంతలోఁ జీఁకటిపడినది. కొంతసేపటికి ఘంటానాద మొండు వినంబడినది. అది యేమియని యాలోచించుచుండ నొక కాపాలికుఁడా గుడిలోనికివచ్చి విగ్రహము మ్రోలనగ్ని వేల్చి హోమముఁ జేయుచుండ నా కుండమునుండి యొక దేవత బయలువెడలి కాపాలికా! నీ కామితమేమి యెరింగింపుమని యడిగిన నతండు చేతులు జోడించి యిట్టనియె.

స్వామీ ! ఆరునెలలనుండి నేను నీ మంత్ర మిందుఁ బునశ్చరణఁ జేయుచుంటి. నేటికి నీ కనుగ్రహము కలిగినది. నా కోరిక వినుము. చిత్రాంగదుని కూతురు చంద్రముఖియను చిన్నదాని నిచ్చటికిఁ దీసికొని రావలయును. దాని ------------ వర్ణనాతీతమైయున్నది. అక్కాంతం బెండ్లి యాడు తలంపుతో నిన్నా రాధించితినని కోరిన నభ్భైరవుం డప్పుడపోయి రెండు గడియలలో నా చేడియం దీసికొని వచ్చి యా కాపాలికుని మ్రోల విడిచి యంతర్హితుం డయ్యెను.

అప్పు డా కాపాలికుం డగ్గి ప్రజ్వరిల్లం జేసి యా చిగురుబోణి కరంబుఁ బట్టికొని “తరుణీమణీ ? నన్ను గరుతు పట్టితివాఁ నాఁడు మీ యింటి కరుదెంచిన కాపాలికుండ. నా యభిలాష వెల్లడించిన భటులచే ద్రోయించితివి కావా? ఇప్పు డేమి చేయదువు? నా చేతం జిక్కితివి నా మహిమ యెరుగక పరిభవించితివి వికఁ నిష్టముతో నన్నుఁ బెండ్లి యాడుము. కన్నులెత్తిచూడుము. ఇది మీ గృహము కాదు. మహారణ్య మధ్యమునందలి భైరవాలయము” అని పలుకుటయు నాకలికి యులికిపడి యోరీ ! దురాత్మా? నా యంతరముఁ దెలియ కేల బలవంత పెట్టెదవు. ప్రాణమైన విడుతునుగాని నిన్నుఁ బెండ్లి యాడనని యా చేడియ ప్రత్యుత్తరముఁ జెప్పుచుండెను. “ఇప్పుడు నీతో బలవంతమునఁ గ్రీడించెద నెవ్వ రడ్డమో చూతుము గాక" యని బెదరించుచు నా కాపాలికుండా పైదలిచేయి విదలించుటయు నచ్చేడియ పెద్ద యెలుంగున నేడువఁ దొడంగినది.

అప్పుడు విగ్రహముచాటున నున్న లీలావతి యంతయుంజూచుచు సమయము వేచి వేచి కరవాలం బుంకించుచు నోరీ? కాపాలికా! అక్రమంబున మంత్రబద్దం జేసి యీ చిగురాకుబోణిని రప్పించి వేధించు చుంటివి. నిన్నుఁ జంపిన దోషంబులేదని పలుకుచుఁ దటాలున వచ్చి కటారి వాని శిరంబు ఖండించి భైరవునికి నై వేద్యముఁ బెట్టినది.

అంతలో భైరవుఁడు ప్రత్యక్షమై మచ్చకంటీ ! నీ సాహసమునకు మెచ్చుకొంటిని. నీ వేదియైనఁ గోరికొను మిచ్చెదనని పలికిన విని లీలావతి యేమియుం గోరక మహత్మా ! ఈ సుందరి నెందుండి తీసికొనివచ్చితివో యచ్చటికిఁ‌ దీసికొని పోయి విడిచి రమ్ము. ఇదియే నాకుఁ బ్రియమని పలికెను.

ఆ వేలు పాపూవుబోణి నప్పుడు భజముపై నిడికొని ముహూర్త కాలములో వెనుకటి మందిరమున శయ్యపైఁ బరుండవెట్టి వచ్చెను. అంతలోఁ దెల్లవారినది. అప్పుడు లీలావతి మెల్లన గుడి వెడలి దేవతా కన్యలజాడ నరయుచు నా ప్రాంతభాగముఁ దిరిగినది. వారెందును గనంబడలేదు. క్రమ్మర గుఱ్ఱమున్న తావునకు వచ్చి తన్నుఁ జూచి సకిలించెడు ఘోటకమును దువ్వుచు నా జవ్వని రివ్వుననెక్కి యత్తురగము నొకదెసకు నడిపించుచుండెను.

కొంతదూరము పోవువరకు నొకచోట నాపాటచ్చరులా వర్తకుని బట్టికొన మొరపెట్టుచుండ మూటఁ జూపుమని చెట్టునకుఁ గట్టి కొట్టుచున్నారు. లీలావతి యవలీల నచ్చటికిఁ బోయి తస్కరులఁ బారఁదోలి యాసార్దవాహుని విడిపించినది. అతండా లీలావతినిఁ బురుషుడఁనుకొని మహాత్మా ! నీవు నాకు బ్రాణదానముఁ గావించితివి. లేకున్న నీపాటికి నన్ను వీండ్రు కడతేర్చియుందురు. నన్ను వెనువెంటఁ దీసికొనిపోయి జనపదంబుఁ జేర్చుమని పలికిన నక్కలికి యిట్లనియె.

నీ వెవ్వడవు? ఎందుఁబోవుచుంటివి ? నీయొద్ద నేమియు లేదుగదా ? నిన్ను వీండ్రేమిటికి పీడించుచుండిరని యడిగిన నా వర్తకుం డిట్లనియె. అయ్యా ! నా కాపురము ధారాపురము. నేను రత్నవర్తకుఁడ. నా పేరు రత్నపాలుఁ డందురు. రత్నములు మూటఁగట్టికొని గుఱ్ఱముపై వైచి యలకాపురంబున కరుగుచు దారి దెలియక నీ యడవిలోఁ బడితిని. ఇందు మ్రుచ్చులు నన్నుగాంచి యడ్డగించిరి. అప్పుడు నేనొక యుపాయముఁ జేసి గుఱ్ఱమునందు విడిచి పారివచ్చి వారికిఁ దెలియకుండ నా మూటనొక వృక్షమూలమునఁ బాతివైచితిని. ఆ గుఱ్ఱముపైనున్న మూటలో నేమియు లేకుండుట విమర్శించి నన్నుఁ బట్టుకొనుటకుఁ దరిమికొని వచ్చిరి. నేనంతకుమున్నె యాముల్లె దాచితిని కావునఁ బట్టువడినది కాదు. నన్నా మూటఁజూపుమని నిర్భంధించుచున్నారు. ప్రాణములై న విడువ సాహసించితిని గాని మూటజాడఁ జెప్పితిని కాను. ఇంతలో మీరు వచ్చి విడిపించితిరి. ఇదియే నా వృత్తాంతమని చెప్పెను.

అప్పుడు లీలావతి నవ్వుచు వర్తకుల లక్షణము లిట్లె యుండును. ఆ మూట యెందున్నదో నీవు చెప్పఁగలవాయని యడిగినఁ జెప్పగలను అక్కడిఁకి బోవుదము రమ్ము. మీ చెంతనున్న నాకు దొంగల భయము లేదని పలుకుచు నొక చెట్టు మొదటికిఁ దీసికొనిపోయి యందుఁ బాతియుంచిన రత్నముల మూటఁ దీసి చూపుచు నిఁక బోవుదము లెమ్మని పలికెను. లీలావతి యా మూట నందుకొని హయముపైఁ బెట్టికొని యతండు తనతో నడచుచుండ నా కత్తలాని మెల్లగా దోలుచు వర్తకుఁడా ! నీవు ధారానగరము బయలుదేరి యెన్ని దినములై నది. మీ రాజు కుశలియై యున్నవాఁడా? యని యడిగిన నతం డిట్ల నియె.

అయ్యా ! నే నిల్లు వెడలి యిరువది దినములైనది. ఇప్పటి మా రాజు కడు క్రూరుఁడు. అన్నకుమారుని భోజుఁడను వానిని రాజ్యలోభంబునఁ జంపించి పిమ్మటఁ బాశ్చాత్తాపముఁ జెందుచు నగ్నిఁ జొచ్చుటకు సిద్ధపడియెను. ఎవ్వడో సిద్దుఁడు వచ్చి భోజుకుమారు నారునెలలోఁ బ్రతికించి తీసికొనివత్తునని చెప్పుటచేఁ జావక నా యాసతో నుండెను. తరచు నేను దేశములు తిరుగుచుండుటచేఁ బురవిశేషములు నాకంతగా దెలియవని చెప్పెను. అమృత బిందువులువలె నా మాట చెవులకు సోకియాకోకస్తని యుబ్బుచు నావర్తకుని బలుమా రామాటయే యడుగుచుండెను.

అట్లు వారు మాట్లాడికొనుచు నాటి సాయంకాలమున కొకపల్లె జేరిరి. గుఱ్ఱమునొకచోటఁ గట్టి వారొక యింటిలోఁ బండుకొనిరి. మరునాఁడు లేచిచూడ ------------ గనంబడలేదు. ఎవ్వరో తోలికొని పోయిరని నిశ్చయించి పిమ్మట నెట్లు పోవలయునని యాలోచించుచుండఁగా నిరువురు కూలివాండ్రు వచ్చి అయ్యా మేము‌ పేదవాండ్రము మూటలు మోచికొని మీ వెంబడి వత్తుము. బత్తెము పెట్టినఁ జాలని యడిగిరి.

ఆ మాటలు సత్యములని నమ్మి వారిరువురు మాకు మూటలు లేవు. దారిఁ జూపినంజాలు. మీకుఁ దగిన పారితోషిక మిత్తునని చెప్పిరి. అందులకు వాండ్రంగీకరించి యతివినయముఁ జూపుచు ముందు నడచుచు గంటకములు నేరుచు నేర్పరి తనంబున గొంతదూరముఁ దీసికొనిపోయి యొక మహారణ్యములోఁ బ్రవేశ పెట్టిరి. లీలావతి పురుషవేషముతో నడుము బిగియించి కరంబునఁ గరవాలము గ్రాల సింహగమనంబున వారి వెంట నడచుచుండెను. అమ్మహారణ్యంబున నొకలోయలోఁ గొందరు కోయవాండ్రెదురై నిలునిలుండని వారినదలించిరి. అప్పుడు లీలావతి ముందు నిలిచి మమ్మేటికి నాటంక పెట్టిరి? మీ యభిప్రాయమేమన వాండ్రు మీ యొద్ద సొమ్ములున్నవి. అందుఁబెట్టి పొండని పలికిరి. ఆ కలికి తమవెంట వచ్చిన కూలివాండ్రు వారితో మాటాడుటఁ జూచి కోపావేశముతో నా యిరువుర శిరములు ముందుగ నరికి లేళ్ళగమికురుకు సింగంబు చందంబున నా యాటవికులపైఁబడి నరకుటయు యధాయధలై యా యధము లందరుఁ బారిపోయిరి . అమె పౌరుషముఁ జూచి యా వర్తకుడు వెరఁగుపడుచు వెనువెంటఁ దిరుగంజొచ్చెను. అట్లడ్డువచ్చిన మ్రుచ్చులనెల్ల , గడతేర్చి యాపడఁతి. తెరవుగానక నలుమూలలు సూచుచు గమ్యస్థానము గురించి విచారించుచుండెను.

అని వచియించిన మణిసిద్దుండు తత్కధాశేష మనంతకావసధమ్మున నిట్లు చెప్పదొడంగెను.

తొంబదినాలుగవ మజిలి.

భోజకుమారుని కథ

రాజపుత్రా ! వత్సరాజు మీ తండ్రి నా చప్పినసు చేయుట శంగినతం ట్లు సంర సంతులు, నకలు రవూ.౮4 ౫ గగటిసునల్ల కందిన చురపటు ప రోధన షా. వవపడ ముం. నడుం మప మంతిలళ్యరు.ంఎ ిపగసము. సమయము నేది సిన్నందు రిపింటంనం ఇ సీ పిసతం డి యనుభంంపం*లడా 1 సబల విరోధము కలుగఁజేసి దేశమునఁ గలతలు పుట్టించెదను. కర్తవ్య దెలియజేసెద. గూఢముగా నలకాపురంబునకుఁ జనుమని బుద్దిసాగరుండు భోజకుమారున కుపదేశించుటియుఁ దదనుమతి ననుసరించి