కాశీమజిలీకథలు/ఆరవ భాగము/62వ మజిలీ
అని యెరింగించువరకు వేళ యతిక్రమించుటయు మణిసిద్ధుం డవ్వలి మజిలీయందు తదనంతరోదంతం బిట్లని చెప్పఁ దొడంగెను.
అరువది రెండవ మజిలీ
అయ్యా ! మే మేమి నేరముఁ జేసితిమి అక్రమముగా మమ్మిట్లు బద్దులుఁగా జేసికొని పోవుచుంటిరే ! ధర్మస్వరూపులైన రాజులే యన్యాయములు సేవింపుచుండఁ గాదనువా రెవ్వరు ? రాజపుత్రిక పారితోషిక మిచ్చినం గైకొంటిమి. అది యిప్పుడే సహదేవుడను రాజకుమారున కమ్ముకొంటిమి, ఇప్పుడా మండనముఁ దెమ్మనిన నెట్లు తెత్తుము. అందలివి మణులో గాజుపూసలో యెవరు పరీక్షించిరి అని దీనస్వరముతో వేడుకొనుచుండ వీణావతినిఁ తల్లినిం బట్టుకొని రాజభటులు వారిని గిరిదుర్గమునకుం దీసికొని వచ్చిరి.
రాజదూతలు వేశ్యలవలనఁ గొంతలంచము గొనినవారగుట నంతగా వారిని బాధింపక గౌరవముగానే యొకబసలోఁ బ్రవేశ పెట్టిరి. అప్పటి కింద్రమిత్రుడు గ్రామాంతర మరిగియున్నవాఁడు గాన వెంటనే యాబోటుల వారి యపరాధము విమర్శింపఁ గొల్వుకూటమునకు తీసికొనిపోవ నవసరము లేకపోయినది. ఈ లోపల వీణావతి తనకు మండనముఁ భారితోషికముగా నిచ్చిన రాజపుత్రిక యొద్దకుఁబోయి తమనిర్బంధములఁ జెప్పికొని వచ్చెదము సెలవిండని రక్షకభటుల గోరికొని యొకఁనాడు ప్రాతఃకాలమున నయుద్యాన వనమున కరిగినది.
వెనుక తనకుఁ బరిచయము కలిగిన యొకపరిచారికం జేరి నారాక భర్తృదారికకు నివేదించి రమ్మని కోరిన నా దూతిక గురుతుపట్టి వీణావతీ ! మా రాజపుత్రిక మూఁడు దినములనుండి పీడఁజెందియున్నది. ఈవలకు వచ్చుటలేదు. నేఁడు కొంచెము నెమ్మదిగా నున్నది. ఇంతకుముందే పూవుఁదోటఁజూచి పోయినది. డప్పరిగపై నిప్పుడు హేమతో నెద్దియో ముచ్చటించుచున్నది. అవసరముఁజూచి నీవార్త నెరింగించి వచ్చెద నాలస్యమునకు శంకింపక నిందేయుండుమనిచెప్పి యప్పరిచారిక యుప్పరిగకుం బోయినది అప్పుడు తలుపులువైచుకొని రాజపుత్రిక హేమతో నిట్టు సంభాషించుచున్నది.
సఖీ ! హేమా ! నీతో నేమి చెప్పుదును. ఏమనుటకును. వాక్కు రాకున్నది. సీ ! నా నీమము లన్నియును గంగపాలైనవి. వినుము నీవరిగిన వెనుక లజ్జాభయ విషాదములతో నయ్యోగినివెంటఁ దిరుగుచుంటి ఆమెకు మంచిమాటల జెప్పుచు సంతోషముతోఁ గాలక్షేపముఁ గావించినది. అందలి పూవులం గోసుకొనివచ్చి నన్నుఁ ఏంజేసి భోజనం మనం నవరా పౌరునిక మ ంకరించిన నీవు మునిపుత్రుడును మూడు రాత్రు లేకశయ్యాగతుపై సమండవలెను. నయ్యోగిని రాజపు కాయనసేవఁ జేయుటకు మంచి సమయము దొరికినది. మంచి విశేషములం దెలిసికొనఁగలవు.
మనోభవరహస్య విశేషము లన్నియు నివేదింపఁగలఁడు. నీపుణ్యము మంచిదని కొనియాడుచు నమ్మంటపమునఁ బుష్పశయ్యఁ గల్పించి యా యతి కుమారుండు విసిరికొనుచుండ బలాత్కారముగ లాగికొనివచ్చి యా తల్పమునఁ గూర్చుండఁ బెట్టినది.
ఆమె యోగినియైనను విలాసముల మరచిపోలేదు. నాచేయి నతని చేతిలోఁబెట్టి స్వామీ ! ఈచిన్నది కడు వైరాగ్యవంతురాలు పరమార్థ విశేషములం దెలిసికొనుటకే మిమ్ము భర్తగా స్వీకరించినది. చనువుఁ గలుగఁజేసి యాత్మభవతత్వ విశేషము లన్నియు నీమెకు బోధింపుఁడని పల్కుచు నన్నువిడచి యామె యవ్వలకుం బోయినది. బోటీ ! పిమ్మట నేమని చెప్పుదును. ఏమాట యాడుదమన్నను నాకు నోరురాదు. ఏమిచేయుదమన్నను గరపాదములు ప్రసరింపవు. మేనంతయుఁ జెమ్మటలు బట్టినది. శరీరము వణక దొడంగినది. వేయేల మందాక్షము న న్నస్వతంత్రురాలిగాఁ జేసినది. స్వప్న మో యింద్రజాలమో యని తలంచుచుంటి.
అప్పుడా రాజకుమారుండు మంటపము స్థంభమునకుఁ జేరఁబడి తరుణీ ! అట్లు వెరచెదవేమిటికి ? భయముడిగి యిటు గూర్చుండుము. అని హస్తముతో నిర్దేశించినంతఁ గొంత తెఱపిఁదెచ్చుకొని యించుక యెడముగాఁ గూర్చుండి తలవంచుకొంటి. ఆయన యించుక నవ్వుచు పువ్వుఁబోణీ! నీ చరిత్ర మంతయు నంతర్దృష్టిఁ దెలిసికొంటి. నీవు కడు పవిత్రురాలవు. నీ మనసు నిర్మలమైనది. అని యెరింగియే మాయోగిని నిర్బంధింప నీ పెండ్లి కంగీకరించితిని. నీవు స్వయంప్రభ కన్న నెక్కుడు మహిమ సంపాదింపఁ గలవు. వెర పుడిగి మాటలాడుము. నీ యభీష్ట మేదియో చెప్పుము అని యడిగెను.
సిగ్గు నన్నగ్గపరచుకొని కంఠమునకుఁ గవాటమై యేమాటయు నన్నడగ నిచ్చినదికాదు ! పిమ్మట నతండు మంచిదానవు మంచిదానవని పలుకుచు నావీపుపైఁ జేయివైచి యించుక దగ్గరకు లాగికొనియెను. అప్పుడు నేను పురుషసంపర్కమున కులికిపడుచు భర్త యనుమాటఁ దలంచికొని సమాధానపడితిని.
పిమ్మట నతండు నామెడలోఁ జేయి పెట్టి హారము సవరించుచు మనో హారిణీ ? ఈ హారమునిమిత్తమే గాదా నీతండ్రి మిక్కిలి పరితపించు చున్నవాఁడు. దీని నేఁ దెప్పించనిచో నీరాజ్యము వేశ్యకాంత యధీనమైపోవునుగదా ! దీని నిమిత్తమే వెనుక మీ తండ్రి నా యొద్దకు వచ్చెను. ఇదియే మనకు బంధుత్వముఁ గలిపినది. అని పలుకుచు పేరులు సవరింపుచుండ తత్కరతల స్పర్శమునకు మేను ఝల్లుమన నేనా హారము పైకి దీయఁబోయితిని. వలదు. వలదు. అట్లేయుంచుము. అని పలుకుచు నా భూషణంబు నా మెడలో నదిమివైచెను. అప్పుడు నేను మేను ముడిచికొని చేతుల నురముం గప్పికొని కూర్చుంటిని. అతడించుక వంగి నాచేతుల రెంటినిం బట్టుకొని ముద్దుపెట్టుకొనుచు దన కరతలంబులు నా కపోలముల వాని మోమించుక యెత్తి మత్త కాశినీ ? ఇటుచూడక మాటాడక కన్నులు మూసికొనియెద వేమిటికి ! నీ నిమిత్తము తపంబు మాని యవకాశముఁ జేసికొని వచ్చితినికదా ! తెలిసికొనదగిన విషయము లడుగవేమి ? నన్నిఁక నన్యునిగాఁ దలపకుము. సిగ్గువిడువుమని పలుకుచు దగ్గరకు లాగికొని గౌఁగిటఁ జేర్చుకొని శిరముపైఁ జేయివైచి జడవెంబడి దువ్వదొడంగెను.
అప్పుడు నేను బోనునం బెట్టిన కురంగియుంబోలెఁ గొట్టికొనుచు నంతరంగమునఁ బలుదెఱంగులఁ జింతించుచు నేమిచేసిన నేమికోపము వచ్చునోయని వెఱచుచు ప్రాణము లుగ్గబట్టుకొని కౌఁగిలి యెప్పుడు వదలునాయని ధ్యానించుచుంటి. నా వికారము గ్రహించి కొంతదరికిఁ గౌఁగిలివదలి కొమ్మా ! పోనిమ్ము ! నీ మనసు వేఱొకలాగున నున్నది. తెరపిఁ జేసికొనియే మాటలాడుము. ఇందుఁ బండుకొనుము. ప్రొద్దు వోయినది. అని పలుకుచు నాశయ్యపైఁ గొంతభాగము నా కవకాశమిచ్చి యతండు పండుకొనియెను.
నేను శయ్యవిడచి దూరముగా శయనించి యిట్లు ధ్యానించితిని. అహహా ! స్త్రీజాతి కడు పాపజాతికదా! మదీయ సాన్నిధ్యంబునం జేసి నిశ్చలంబైన యీతని మనంబు గాలిచే దీపమట్లు చలించినది. నాపాలిండ్లఁ జేయిడినప్పుడు చేతులఁ బొడమిన పులకాంకురములు మకరాంక చిహ్నములుగాక మరియేమి ? నన్ను బిగ్గ గౌవుగలింప నవసర మేమివచ్చినది? ఏమా! ఒకవేళ ప్రీతికొరకట్లు చేసెనేమో? తెలియక మహాత్ములపై దోషారోపణఁ జేయుట పాతకము. అని ధ్యానించుచు నిద్రలేక కన్నులు దెఱచియె పండుకొనియుంటి. కొంత సేపటి కతండు శయ్యనుండి లేచి నాయొద్దకువచ్చి నామొగముఁ బరిశీలించి చూచుచు ముద్దు పెట్టుకొనుచుఁ జుంబించుచు నొక్కుచు నంటకయే పెక్కు కామవికారములం గావించెను.
అర గనుమోడ్పుతో నంతయుఁ జూచుచు నే నది మోహావేశమని యెఱింగి మోము నేలవంకఁ ద్రిప్పి పండుకొంటిని. అంతలోఁ దెల్ల వారినది. అతండు స్నానార్ధమై యరిగెను. ఆ యోగిని నాయొద్దకువచ్చి ప్రాతఃకృత్యముల వర్ణింపఁజేసి భామినీ ! రాత్రి విశేషములేమి? తత్వరహస్యము లేమైనం దెలిసికొంటివా యని యడిగిన నే నిట్లంటిని. అమ్మా ! తత్వవిశేషములు తెలిసికొనుదాన నైతినేని యీ యాడు పుట్టుక యేమిటికిఁ బుట్టుదును. ఈ పాపజాతి తాను జెడుటయే కాక యొరులంగూడఁ జెరుపుచుండును. అమ్మహాత్ముని చెరప మీరునన్నుఁ బరుండఁబెట్టిరి. లక్కచెంత నిప్పు పెట్టిన మెత్తపడక గట్టిగా నుండునా? తపోవ్యాస క్తమగు నమ్మహాత్ముని చిత్తము నాకతమున -------------- నొందినది, రాత్రిచర్య లేమి చెప్పుదునని చింతింప దొడంగితిని.
అప్పుడా యోగిని మందహాసము సేయుచు నబలా ! ఏమో యనుకొంటిని దీనికే నీవింత పశ్చాత్తాపముఁ జెందుచుంటివి? చాలు చాలు. అమ్మహర్షికుమారుని శక్తి నెఱుంగక వికారము నొందెనని భ్రమ జెందితివి. మన కట్లుతోచునుగాని వారిమదికి వికారములు లేవుఁ శ్రీకృష్ణునిచర్య లెట్టివో యెఱుంగవా అమరుక నృపవధూపరిచయంబు ఆదిశంకరులను గళంకపరచినదాఁ మహాత్ముల చేష్ట లద్భుతములు ఇదమిద్ధమని మనము నిరూపింపఁ జాలము. వారు చెప్పినట్లు చేయుటయే మనకు లెస్స. ఏమియుఁ బ్రతికూలము సెప్పరాదు. మనసు కలసిన పిమ్మట నంతయు నంతడే నీకుఁజెప్పఁగలఁడు. నీనిమిత్త మెంతయో బ్రతిమాలితిని. స్త్రీప్రశంసయే విననివాఁడు నీ ప్రక్కఁజేరి నందులకుఁ సంతసింపకఁ జింతించుచుంటివా? ఈ రేయి నతం డెట్లు చెప్పిన నట్లు నడువ వలయును సుమా ! అని బోధించి నా మనసు సమాధాన పరచినది.
ఆ యోగిని కడు జాణకదా? ఆ పగలెల్ల నా కా బోధయే చేయుచున్నది. పుష్పములచేఁ జక్కగా నలంకరించినది. అంతలో సాయంకాలమగుటయుఁ బూర్వమువలె మమ్మిరువుర నేకశయ్యాగతులఁ జేసి యవ్వలకుం బోయినది. అటుపిమ్మట నమ్మహాయోగి భోగపరుండై నిముషమైనఁ దమి నిలుపజాలక మోహావేశముతో నన్ను బిగియ గౌగలించె. పైనఁ జెప్పవలసిన దేమున్నది. అని నిట్టూర్పు నిగుడించుచు మన్మధుం గృతార్ధుం గావించెను. నాకాచేష్ట లేమియు నభీష్టములుగాకున్నను నెదురాడవెరచి ప్రతిమవలె నూరకుంటి. అంతలోఁ దెల్లవారినది. నాఁడు తపమేలేదు. పగలెల్ల నాచుట్టుచుట్టుదిరుగుచుండెను. మరల రాత్రిపడినదోలేదో వెండియువిలాసక్రీడకుఁ దొరకొనియెను. శరీరధర్మము లెట్టివారిని మోసము సేయకమానవు. రుచి యెరుగనప్పుడు సుకారసము విరసముగా నుండును. అలవాటు పడిన నమృతముకన్న మిన్న యగుంగదా ! అక్కటా ఇంద్రియములు వివశుండగు దేహిని సారధిలేని రథమును గుఱ్ఱములట్ల నలుమూలలకుఁ ద్రొక్కించును. అయ్యో ! ఆ చేష్టలం దలంచికొన సిగ్గును విషాదమును శోకమును గలుగుచున్నవి. నావలన నితండును నతనివలన నేనును జెడితిమి. అతనిచేష్టలు ఋషికృత్యములట్లు నాకుఁ దోచలేదు. మూడునికన్నఁ దక్కువగా వస్తువిమర్శన లేనివాడయ్యె ? ఇంద్రియము లేమియు నతని స్వాధీనములోలేవు. అన్ననా ! ---------- వంటి మహాత్ముని విటునిగాఁజేసి తపంబు జెరచిన నా పాపమునకు మేరయున్నదా అక్కటా ! నేనిప్పు డందరికన్నఁ దక్కువదాననై పోతి. సామాన్యస్త్రీవలె తుచ్ఛ భోగములకుఁ బూనికొంటి. నా వివేకము మన్నై పోయినది. నావిషయ వై ముఖ్యము డాంబికమునకు వినియోగించినది. ఇంత వరకును గారకురాలవు నీవు ఆ యోగినితో కలసి నీవు పెండ్లి యనిచెప్పి నన్ను మోసముఁ జేసితివి. బ్రష్టురాలనై పోతిని. మధిచలపట్టి నన్ను సంసారసముద్రములో ముంచివై చెనుగదా? నా చరిత్రమువిని యెల్లరుఁ బరిహాసమాడక మానరు. తల్లిదండ్రుల కేమని యుత్తరము సెప్పుదును, -------- నేనెక్కడ. యోగి యెక్కడ. పర్వతమెక్కడ తపమెక్కడ. అఘటిత ఘటనాసమర్ధుని భగవంతుని విలాసములు కడుచోద్యములుగదా? ఇట్టి పాతకముఁ గావించి బ్రతుకుటకంటె బలవంతమున నంతము నొందుటయే శ్రేయము. అని పలుకుచు గోలుగోలున నేడువఁ దొడంగినది.
అట్టిసమయమున హేమ ప్రత్యుత్తరమీయ వెఱచి యొదిగి యొకమూలఁ గూర్చుండెను. ఆమె కోపము కొంత చల్లారినవెనుక హేమచెంతఁ జేరి కాంతా ! నీవలిగిన నే నేమియుం జెప్పజాలను. మణిహార ప్రదానమున నతండు మహానుభావుండని తెల్లమగుచున్నదిగదా! వ్యాసమహర్షియంత వాఁడు రాజభార్యలతోఁ గ్రీడింపలేదా? దాన నతని మహిమ కొఱంతపడినదా ! దీన మీకు వచ్చిన లోపము లేదు. ఇది ప్రఖ్యాతికే మూలకము. చింతింపకుము. నీ వారు వినిన సంతసింతురు గాని కోపింపరు అని స్తోత్రముఁ జేయుచు నా యువతికి సంతోషము గలుగఁ జేసినది.
వారి సంవాదము ముగిసినదని యెరింగి ద్వారమున వేచియున్న పరిచారిక లోపలికిఁబోయి భర్తృదారికా ! వీణావతి మీ దర్శనమునకు వచ్చి ద్వారమున వేచియున్నది. రప్పింపవచ్చునా యని యడిగిన నంగీకారము సూచించుటయు నది వోయి వీణావతిని తీసికొని వచ్చెను. వీణావతి యా యువతికి నమస్కరించుచు తన్ను రాజభటులు పెట్టిన నిర్బంధమంతయుఁజెప్పికొని రక్షింపుఁడని ప్రార్ధించినది.
వీణావతి వృత్తాంతమంతయు విని హేమ యెద్దియో ధ్యానించి మించుబోణీ !నీవు విచార పడకుము. నీ యాపదఁ దప్పించెదను. నీ వా మణిహారము మాకిచ్చిన ట్లుత్తరము వ్రాసి యిచ్బెదము. నీవీణ చక్కఁబడి నందులకు మిగుల సంతసించితిమి. అని పలుకుచు నప్పుడే యట్టియుత్తరము వ్రాసి యంపినది. తరువాత రాజపుత్రిక హేమా ! నీ వొకసారి యా గిరి పరిసరమునకేగి వారేమి చేయుచున్నారో చూచిరమ్ము. అని చెప్పి యంపినది.
హేమయు నతిరయంబున బోయి వారిజాడ నరిసినదిగాని యందెవ్వరును గనంబడలేదు. వారి వస్తుసామాగ్రియు నందులేదు. అప్పుడు విస్మయముఁ జెందుచు తిరిగివచ్చి యత్తెర గత్తెఱవ కెఱిగించినది. ఆ కథవిని రాజపుత్రిక హేమా ! నావలెనే యామహానుభావుండు దుష్క్రి యాచరణమునకు పరితాపమునుఁ చెంది యిందున్న డెందము వికార మొందునని యెందేనిం జనియెనని తలంచెద. ఉత్తముల చిత్తములు జలంబులవలె నన్యసంఘట్టనంబునం గలఁగినను మరల నిర్మల భావము వహింపక మానవు. పోనిమ్ము నా కన్నెరికము వదలినదిగదా ! నాతలిదండ్రులు నన్ను బెండ్లియాడుమని నప్పుడి త్తెరం గెరింగింపవచ్చును. మంచిముహూర్తము తెలిసికొనిరమ్ము. నేనును జటావల్కముల ధరించి యోగినివేషము వైచుకొని యిందు తపంబు గావించెదను. అని వైరాగ్యవృత్తితోఁ బలికిన విని హేమ యిట్లనియె
సుందరీ ! తపంబునకుఁ దొందర యేమివచ్చినది. అతండు యతియో భూపతియో యించుక విమర్శింప వలసియున్నది. ఎట్లయినను నీవు ధన్యురాలవేగదా ! యని యుక్తముగాఁ జెప్పి యప్పటి కామెచిత్తవృత్తి మరలింపఁ జేసెను. అని యెరింగించు వరకు వేళ యతిక్రమించుటయు మణిసిద్ధుం డవ్వలి కథ తదనంతరా వనిధంబున నిట్లని చెప్పఁదొడంగెను.
అరువది మూడవ మజిలీ.
ఆహా ! ఈజగంబెంత మోహక్రాంతమై యున్నదో ? భగవంతు డైంద్రజాలికుండై తృణము మేరువునుగాను మేరువును తృణముగాను జేయుచుండును. అది యెరుంగక జనుండు స్వతంత్రుండువోలె నెల్ల కార్యములకుఁ బూనుకొను చుండును. అంతకన్న యవివేకము లేదు. వచ్చునది వలదన్నను రాకమానదు రానిది యెంతప్రయత్నముఁ జేసినను రానేరదు. అట్టి నిశ్చయముగలవానికి విచారము గలుగదు. వగపు బొడమదు దుఃఖము జనింపదు. అది లేకయేకదా నే నిన్నిదినములు పడరానియిడుముల బడుచుంటిని. నా రాజ్యం బన్యాధీనముకానిధి నారూపించియుండ నే నాపగలనా ? అక్కటా ! సంపద్విహీనునిఁ జూచి మిత్రులును జులకనగాఁ జూతురు గదా? రాజ్యనష్టానంతరమున సహాయులగుదురను తలంపుతో నాప్తులని నమ్మి నిజం బెరింగించిన యాభూపతు నెంత దేలికగా మాటాడిరి. కానిమ్ము. అప్పుడే నా రాజ్యము పోయినదాయేమి ? స్వయం ప్రభాదేవి యాలయములోని యతీశ్వరుఁ డభయ ప్రదాన మిచ్చియుండలేదా? అనుడి యేలఁదప్పును. అని తలంచుచు నింద్రమిత్రుఁ డొకనాఁడు సాయంకాల మశ్వారూఢుండై రత్నగిరి ప్రాంతము మీఁదుగాఁ దన పట్టణమునకు వచ్చుచుండెను.
అప్పు డిరువురుదూత లమాత్య ప్రేషితులై వడివడి పరువిడి వచ్చుచు నా రాజమార్తాండుని జోహారుచేసి దేవా ! ఆరత్నహారము రాజపుత్రికమెడలో వచ్చి చేరినది. అమాత్యులు మీకిట్లు విన్నపము సేయుమని రని చెప్పినతోడనే యా భూపతి యపరిమితా నందముతో గుఱ్ఱము డిగ్గనురికి యెట్టెటూ ! మరలఁ జెప్పుడు. మీరన్నమాట సత్యమగుంగాకయని యడిగిన నా కింకరు లిట్లనిరి. రేడా ! మేము దేవరయానతి దేశములెల్ల దిరిగి తిరిగి పురముల కరిగి యరిగి పల్లెలు చుచిచూచి తెరవుల నరసి యరసి యొకనాఁడు జాడలమీద నుజ్జయినిలో నా గణికల నిరువురం బట్టుకొని యామండన మిమ్మని యడిగితిమి. వారిహార మప్పుడే మమ్మతిమని బొంకిరి. ఆమాటలఁ బాటింపక సంకెలలువైచి యాపంకజముఖుల నిరువురను మనవీటికిఁ దీపికొని వచ్చితిమి. స్వామీ అది యేమి మాయయో తెలియదు. మేమెంత బ్రతిమిలాడినను మందలించినను కొట్టినను యాగుట్టు సెప్పక యెట్లుతెచ్చిరో తెలియదు అమండనము భర్తృదారికకిచ్చి వేసిరి. రాచపట్టి వలన ముట్టినట్లు యుత్తరముఁ దీసికొనివచ్చిరి. ఆమె వారిందండింప వలదనికూడ వ్రాసినదట, ఇదిగో యాపత్రికయనిరేని చేతికిచ్చిరి. దానిం జదువుకొని యాభూభర్త యుబ్బుచు నోహో ! ఆ మహానుభావుండు సెప్పినట్లు జరిగినది. తత్ప్రభావ మంచిత్యముగదా ! ప్రాంతమునకు వచ్చితిమి గావున నాయోగిపుంగవుని గాంచి నమస్కరించి కృతజ్ఞతఁ జూపికొంటయ కర్జము అని నిశ్చయించి వారి