కావ్యాలంకారచూడామణి/నవమోల్లాసము
నవమోల్లాసము
—————
వ్యాకరణము
క. | శ్రీవిశ్వేశ్వర విజయ, శ్రీవిశ్రమహర్మ్యబాహుశిఖరఋతోక్తీ | 1 |
క. | భవదనుమతి సూరిసుఖ, ప్రవణం బయినట్టి యంధ్రబంధురరుచిమ | 2 |
క. | యుక్తివిశేషము కబ్బం, బుక్తివిశేషంబు గాదు యోగ్యునకైనన్ | 3 |
మ. | విలసద్భావరసాద్యలంకృతులచే విప్పాఱి గీర్వాణభా | 4 |
క. | ధర శ్రీపర్వతకాళే, శ్వరదాక్షారామసంజ్ఞ వఱలు త్రిలింగా | 5 |
గీ. | తత్త్రిలింగపదము తద్భవం బగుటచేఁ, దెలుఁగుదేశ మనఁగఁ దేటపడియె | 6 |
గీ. | తెలుఁగు దేశభాష తెలియుఁ బొమ్మనఁబోక, తెలియవలయు మించు తేటపడఁగ | 7 |
గీ. | విశ్రుతులు హేమచంద్రత్రివిక్రమాదు, లొనరఁ జూపిరి ప్రాకృతంబునకుఁ ద్రోవ | 8 |
క. | స్వరములు నచ్చులు ననఁగా, నరయ నకారాదిసంజ్ఞ నయ్యక్కరముల్ | 9 |
క. | యరలవ లంతస్థలు నా, నురవగు శషసహలు పొలుచు నూష్మ లనంగాఁ | 10 |
క. | భువిలోఁ దత్సమమును ద, ద్భవమును సహజాంధ్రదేశభవమును దేశ్యో | 11 |
తత్సమలక్షణము
గీ. | పరఁగ సంస్కృతంబుపైఁ దెనుంగువిభక్తు లునుపఁబడి పొసంగె యుండెనేని | 12 |
చ. | పరమవినీతిమంతు లగుపార్థివకోటికి విశ్వమేదినీ | 13 |
క. | వదలక సిద్ధాక్షరములఁ, బొదివిన వర్ణములఁ దూలిపోఁ బలుకఁగ స | 14 |
సీ. | యజ్ఞంబు జన్నంబు యత్నంబు జతనంబు చంద్రముఁ డనుపేరు చందమామ | 15 |
దేశ్యలక్షణము
క. | శ్రేయములై బహుదేశా, నేయములై చక్కఁదనము నెఱదనములు నై | 16 |
సీ. | వాలాయ మాలంబు పంగడ మంగడ సోలంబు చొక్కులు సోయగంబు | 17 |
అచ్చతెలుఁగు లక్షణము
క. | ఈమూఁడుతెఱంగులలో, నేమిటనున్ దొరలకున్న నెల్లజనులకున్ | 18 |
చ. | ఎనుములు గుఱ్ఱము ల్మొదవు లెడ్డులు బండులు పండు లుప్పు ప | 19 |
గ్రామ్యలక్షణము
క. | ఈసడములు గోరడములు, గా పరబీసరలు నైన కట్టిఁడిపలుకుల్ | 20 |
సీ. | ఊసలు వేసలు వేసాలు దోసాలు దోసలు వేదాలు గాసడాలు | 21 |
తత్సమశబ్దపరిజ్ఞానము
గీ. | వెలయుసంస్కృతంబు తెలిఁగించుతెఱఁగు సం, ధులు విభక్తిచయవిధులు సమాస | 22 |
అజంతప్రకరణము
క. | నిడు పుడుపవలయు సంస్కృత, మెడపక లింగములు మూఁట నేకాక్షరముల్ | 23 |
క. | బిందువిసర్గంబులు గడ, నందిన పొల్లులను దక్కి యంధ్రవిభక్తుల్ | 24 |
క. | స్థావరతిర్యక్పదములు, దేవమనుష్యాదికములుఁ దెనిఁగించునెడన్ | 25 |
గీ. | దానకల్పకుజము దర్ఫోగ్రసింహమ్ము, రజనికరుఁడు కాంతి విజయుఁ డాజిఁ | 28 |
క. | రవి యరితిమిరాపహతం, బవి పరగిరివిహతి రసవిభావప్రతిభం | 27 |
సీ. | ఇల నుకారాంతపదములఁ దెలుఁగు సేయఁ, గడ వుకారంబు నుండు డుకార ముండు | 28 |
క. | మనుకటుపటుశబ్దాదుల, నొనరింప డుకార మెపుడు నుండదు కవితం | 29 |
గీ. | మనువు ధర్మశాస్త్రమతమున మిక్కిలి, కటువు బిరుదవినతి కర్ణములకు | 30 |
క. | వెలయు ఋకారాంతపదా, దులఁ దెనుఁగుగఁ జేయుచోటఁ దుదివిడుపులు గు | 31 |
క. | స్త్రీలింగంబుల నిడుపులు, వాలాయము నుడుపఁ దెనుఁగువచనము లగు నం | 32 |
క. | స్త్రీలకు మదనుఁడు విజయ, శ్రీలకు రఘురాముఁ డెపుడు హ్రీలకు నుచితా | 33 |
క. | శ్రీవిష్ణువర్ధనాఖ్య, క్ష్మావరుభూవర వెపుడును మాకు సనంగా | 34 |
క. | వనితా యనుచో వనితయు, జననీ యని పలుకుచోట జననియును వధూ | 35 |
క. | ఐకారాంతము లోకా, రౌకారాంతములుఁ దెనుఁగు లైనప్పుడు పూ | 36 |
క. | రై పరఁగును నడుగోవున, గోవులు విదుకంగ గ్లౌనికులనృపతులు ధ | 37 |
వ. | ఇది యజంతంబులు తెనిఁగించుతెఱం గింక హలంతవిధియు నెఱిఁగింతు. | 38 |
హలంతప్రకరణము
క. | భూభుగ్విరాడ్పదంబులు, శోభితముగఁ దెనుఁగుపఱుచుచోఁ దుద పొల్లల్ | 39 |
క. | బలవన్మతమత్పదముల, తలమున్న నకార మెడలుఁ దగఁ దెనుఁ గగుచో | 40 |
గీ. | ద్విట్పదంబు వేదవిత్పదంబును దిక్ప, దమును బూర్వవర్ణతను భజించు | 41 |
క. | చేరు నకాచాంతముల డు, కారముఁ దెనిఁగించుచోటఁ గుఠినాత్ముఁ డనన్ | 42 |
గీ. | వలసినపుడు కర్మనగ్మశబ్దంబుల, పైడుకార మెక్కుఁ బాసిపోవు | 43 |
సంధిపరిచ్ఛేదము
వ. | ఇది సంస్కృతపదంబుల కాంధ్రీకరణం బింక నజంతహలంతసంధు లనంగ రెండు | 44 |
సీ. | ఆదిశీబ్దాంతవర్ణంబు నంత్యశబ్ద, పూర్వవర్ణంబుతో గూడఁ బొత్తుచేయ | 45 |
గీ. | తెలుఁగుఁబలుకులు వెలిగాఁగ దివిజభాష, లమరఁ దెనిఁగించినప్పుడు నచ్చుతోడి | 46 |
క. | అచ్చుతుదియచ్చు పట్టున, వచ్చి యకారంబు నిలుచు వలసినయెడఁ దా | 47 |
క. | వేయిచ్చుట యీవులయెడఁ, వేయుడుపమి యరుల యెలమి సిదుముట యిలయుం | 48 |
క. | పోయితి పపుడప్పుడు నీ, వీయని కేతెంచి తేయు మేయు మనంగాఁ | 49 |
గీ. | ఒనర సంబుద్ధి నోతండ యనఁగ నోతఁ, డనఁగఁ బూనిన వీని కనర్హ మగున | 50 |
గీ. | అట నుకారాంతషష్టి పై నచ్చు మొదల, నొనరఁ బొల్ల నకారంబ యుండవలయుఁ | 51 |
గీ. | అచ్చికారాంతషష్ఠిపై నడఁగుఁ బొడము, నింటి దింటిది యనఁ జెల్లు నెల్లకడల | 52 |
క. | అచ్చులపై హ ల్లుండిన, న చ్చుండినఁ దద్ద్వితీయ కపుడు నకారం | 53 |
క. | భువి నైని కెగంటి ని కెగు, రువునకు నంధునకు బిరుదదూరునకారం | 54 |
క. | .... .... .... .... ...., .... .... .... .... ...... .... .. | 55 |
క. | నిడుపున జకారభావము, పడసియు హ్రస్వమున నెల్లపట్టున నుత్వం | 56 |
క. | నేను బదరింతు నీవలెఁ, గానము విశ్వావనీశు కడ నునుపేనిం | 57 |
గీ. | అచ్చు పరమైనపట్టునఁ బ్రాణిపదము, కర్మమగుచోటఁ దక్క నుకారయుక్తి | 58 |
క. | రిపు నోర్చె రిపుని నోర్చెను, రిపు నాజి జయించె నుగ్రరిపుని జయించెన్ | 59 |
గీ. | తద్ద్వితీయవిభక్తిపొంతలఁ జరించు, కద్దిగల సున్న సోఁకునఁ గచటతపలు | 60 |
గీ. | జడులఁ గరుణించుఁ జతురులఁ జాలఁ బ్రోచు, వాజిపదకాయంబున వశము సేయు | 61 |
క. | అలఁతులఁ దుదహల్లులకును, నలవడ నామమున నుండి యిచ్చోటులచేఁ | 62 |
క. | తనుఁ బొగడుఁ దన్నుఁ బొగడును, జనుఁడు జనుం డనఁగ నెసఁగుజాడలు గలుగున్ | 63 |
క. | మొల్లమ్ముగ నెల్లెడలను, హల్లులపై నిడుపు లగుచు నాయీయేయో | 64 |
క. | రారా నాగారీ ము, న్నీరే కర్ణాదిదాత లిట్టివదాన్యో | 65 |
క. | రుచిరముగఁ బిలుచుచోటను, బ్రచురంబుగఁ బ్రథమపొంతఁ బడియుండెడున | 66 |
గీ. | విశ్వవిభుఁడు గడిది వీరుండు సతురుండు, డక్కుఁద్రిక్కులేని చొక్కులాఁడు | 67 |
క. | డులు రునులను నీవర్ణత, తులు మొదలుగఁ గొన్ని గొన్ని తుద హల్లులతోఁ | 68 |
గీ. | వేడ్క వేడుక వ్రేల్మిడి వ్రేలుమిడియు, మార్మలసె మఱుమలసెను మాన్పు మాను | 69 |
క. | ఇది సంధిక్రమ మరయఁగఁ, దదుచితసంధానవిధులు తఱచెఱుఁగుఁ డిలన్ | 70 |
విభక్తిప్రకరణము
వ. | ప్రథమయు ద్వితీయయుఁ దృతీయయుఁ జతుర్థియుఁ బంచమియు షష్ఠియు సప్త | 71 |
క. | తెలుఁగుం బ్రాకృతభంగిన, బలియుటచే నేకవచన బహువచననపదం | 72 |
క. | ముడులు తుదఁ గలుగుశబ్దము, లడరుం బ్రథమావిభక్తు లవి కర్త లగుం | 73 |
క. | నునివర్ణంబులు తుది నొం, దిన కర్మపుఁబదము దా ద్వితీయ యనంగాఁ | 74 |
క. | చేత ననుపలుకు తుదలఁ బ్ర తీతం బగునేని యది తృతీయ యగుం బ్ర | 75 |
క. | పలుకులతుదఁ గై శబ్దం, బలపడ నిలిచినఁ జతుర్థి యగు విశ్వమహీ | 76 |
క. | పదముతుద వలన ననియెడు, పద ముండినఁ బంచమీవిభక్తియ పుష్ప | 77 |
క. | అమరి కుశబ్దము పాదాం, తమునం దున్నేని షష్ఠి తప్పదు విద్యా | 78 |
క. | పలుకుతుద నందు ననున, ప్పలు కుండిన సప్తమీవిభక్తి యగు న్ని | 79 |
గీ. | ప్రథమ గావించు ముడులను బాయఁబెట్టి, కట్టెదురఁ బల్కు సంబుద్ధి కడుఁదనర్చు | 80 |
క. | కోరి ముకారముమీఁద డు, కారముపట్టునను దగ లుకారము నిడిఁ బెం | 81 |
క. | కడల ముకారడుకారము, లుడుపఁగఁబడు నచ్చతెనుఁగుటుక్తులయందుం | 82 |
క. | చింతింపఁగ నెవ్విధిని హ, లంతంబులు చెల్లు నిలఁ గ్రియావంతులు శ్రీ | 83 |
క. | ధర బాలుమీఁదిడుత్వము, పరువడి రుత్వంబు నొందు బహువచనము బా | 84 |
గీ. | వాఁడు వీఁడను నవి బహువచనములను, వారు వారలు వాండ్రును వీరు వీండ్రు | 85 |
గీ. | కొఱను నెఱను మ్రాను కొల నను నివియెల్ల, బహువచోనియుక్తిఁ బరఁగుచోట | 86 |
క. | కొఱకులు నెఱఁకులు మ్రాఁకులు, జిఱుఁగొలఁకులు నయ్యెఁ బేను జేనును మీనుం | 87 |
క. | పల్లు వి ల్లిల్లు నాఁ జనుపలుకులెల్ల, బండ్లు వీం డ్లిండ్లు నాఁజను బహుత నొడువఁ | 88 |
గీ. | వరుస నేయి చేయి వా యనుపలుకుల, తుదలఁ బెక్కుఁ జెప్పఁ దులు జనించు | 89 |
గీ. | వేయి ఱాయి దో యనియెడి వీనిబహుత, నోలిఁ గుదుద లుత్వ మొనఁగూడు వేలు ఱాలు | 90 |
క. | కే లేకవచన మరయఁగఁ, బాలును దెమ్మెరలు సహజబహువచనంబుల్ | 91 |
గీ. | కొఱ్ఱ లాళ్లు వడ్లు గోదుమ లనుములు, కొల్లు లనెడు వీని కెల్ల నిట్ల | 92 |
గీ. | ప్రాణిపదములు వెలిగాఁగఁ బ్రథమలైన, నరయ నొక్కొక్కచో ద్వితీయార్ధము లగు | 93 |
క. | ఒనరఁ దృతీయయుఁ బంచమి, యును సప్తమియును దలంప నుచికనిజైకా | 94 |
గీ. | విశ్వవిభునిచేత విలసిల్లు సిరి కర, వాలభైరవాంకువలనఁ గలుగు | 95 |
క. | పోక చతుర్థీషష్ఠులు, నేకార్థమునందుఁ బలుక నిత్తురు విశ్వ | 96 |
వ. | మఱియు నంధ్రభాషావిభక్తులకుం గల నామాంతరంబు లెఱింగింతు, స్థావరతిర్య | 97 |
క. | ద్రుమ మేచె ద్రుమముఁ జూచెను, ద్రుమమ్ముచే నొప్పె నరుగు ద్రుమమునకై యా | 98 |
వ. | ఇది యేకవచనవిధి. | 99 |
క. | ద్రుమములు ద్రుమములఁ గదిసెను, ద్రుమములచే నీడ గలిగె ద్రుమములపై గం | 100 |
వ. | ఇట్లు తిర్యక్పదంబులకు యోజించునది. | 101 |
క. | తనయుడు తనయుని గనియెను, దవయునిచేఁ దనయుకొఱకుఁ దనయునివలనన్ | 102 |
క. | తనయులు తనయులఁ బడిసిరి, తనయులచేఁ దనయులకయి దనయులవలనం | 103 |
క. | కవి యొప్పుఁ గవి భజింతురు, కవిచేఁ గృతు లొదవు సిరియుఁ గవియు గవులకై | 104 |
క. | కవులు నుతింతురు కవులం, గవులచేతఁ (?) గవులకొఱకుఁ గవులవలనఁ ద | 105 |
క. | గురుఁ డధికుఁడు గురుఁ దలఁపుము, గురుచేతం దెలిసి భక్తి కొఱలు గురునకై | 106 |
క. | గురువులు గురులను గొల్తురు, గురువులచే గురులకొఱకు గురువులవలనన్ | 107 |
వ. | ఇత్తెఱంగున ననుక్తపదంబులయం దొడఁగూర్చునది. | 108 |
క. | స్థావరతిర్యక్పదములు, లోవిడిచి తృతీయమొదలు పురుషాఖ్యలపైఁ | 109 |
క. | సుతుచేత సుతునిచేతను, సుతుకొఱకును సుతునికొఱకు సుతువలనం ద | 110 |
గీ. | పరఁగఁ గూఁతురుశబ్దంబుపై రుకార, మొక్కపలుకున పైనైన నుండుఁ బాయుఁ | 111 |
క. | కూఁతులచేఁ గూఁతురిచేఁ, గూఁతులకై కూఁతుకొఱకుఁ గూతులవలనం | 112 |
క. | ఓయాదిపదంబులతుదఁ, బాయని నిడు పుడిపి తగవిభక్తు లునుప ము | 113 |
గీ. | కడ డుకార మున్న నొడు లెల్ల సంబుద్ధి, హ్రస్వమైన దీర్ఘమైన నగును | 114 |
క. | డులు బహువచనంబులయెడఁ, దొలఁగు న్సంబోధనమున దుర్జనులారా | 115 |
గీ. | ఒనర యుష్మదస్మదుక్తుల కేకవ, చనబహువచనములు సంభవించు | 116 |
క. | నియతుఁడవు నీవు నిన్నును, నియమింతురు శుభము లొలయు నీచే నీకై | 117 |
క. | మీ రనఘులు మిముఁ గొలుతురు, సేమము మీచేత నుతులు చెలు వగు మీకై | 118 |
క. | నే రమ్యుఁడ ననుఁ దలఁతురు, నారులు నాచేత నెగడె నాకై ప్రియమౌ | 119 |
క. | మే మెఱుఁగము మము మఱచిరె, భామలు మాచేత బ్రదుకఁబడి మాకై ము | 120 |
సమాసప్రకరణము
క. | మొదలిపదాంతవిభక్తిని, వదలుచుఁ దుదిపదము మొదలివర్ణముతోడం | 121 |
వ. | అది తత్పురుషంబును, గర్మధారయంబును, బహువ్రీహియు నన మూఁడుతెఱంగులం | 122 |
క. | రాచిలుకలు విరజాజులు, రాచకొడుకు లంపగములు రాయంచలు నా | 123 |
క. | నెలిదమ్మి కమ్మఁదూపులు, వలకే లెడకాలు నీలవర్ణము నవసా | 124 |
గీ. | పూవుఁబోఁడి తలిరుఁబోఁడి పూవిల్తుండు, వాలుఁగంటి నాతనాఁడి మించు | 125 |
వ. | మఱియు వీనికి సాధారణలక్షణంబు లొకకొన్ని యెఱింగింతు. | 126 |
గీ. | గుణిగుణంబు చెప్పం గొఱలు విశేషణ, పదముపై నికార ముదవుఁ బాయు | 127 |
క. | విదితవిశేషపదాంతము, గదిసి పుకారంబు నిలుచుఁ గడ హ ల్లున్నం | 128 |
క. | గూఢపుమంత్రంబులు నతి, గాఢపుఁగర్మములు సోయఁగపుటాటలు నా | 129 |
క. | ఇలఁ బల్లు ముల్లు విల్లును, హలాదులను నదుకుచోట నడఁగును జడ్డల్ | 130 |
గీ. | వెన్ను కన్ను చ న్ననియెడు వీనిజడ్డ, లుడుపుటొప్పు సమాసనియోజనములఁ | 131 |
క. | ఆదట నా నీ తన యను, చో దుత్వము గలుగు షష్ఠి చూపెడునెడలన్ | 132 |
క. | నా నీ తన యనుపలుకుల, తో నదుకు దుకార మపుడు దొలఁగిన దొలఁగుం | 133 |
మ. | తనసత్యవ్రతకౌశలంబుఁ దనవిద్యాతంత్రనిర్మాణముం | 134 |
క. | క్షీరార్ణవకూఁతురు సం, సారార్ణవయోడ శుభ మొసఁగు మీ కనఁగా | 135 |
గీ. | అరయ నానీలు హల్లుతో నదుకుచోట, నొనర నుగ్గును నిడుపయియున్న నుండు | 136 |
క. | ఆకరి యక్కరి యనఁగా, నాకర మక్కరము నాగ నక్కీకసకం | 137 |
గీ. | సంస్కృతము లయ్యుఁ దెనుఁగులై చాఁగుఁ గొన్ని | 138 |
క. | సుమతి నికారోకారాం, తముపై సంస్కృతపదంబు తగుఁ గూర్పఁగ వే | 139 |
క. | తగుఁ గూర్ప నికారాంతం, బగుసంస్కృతపదముమీఁద నచ్చతెనుఁగున | 140 |
గీ. | అత్తమామ నాఁగ నాలుమగం డనఁ, గొడుకుగోడ లనఁగఁ గొఱనులేలు | 141 |
తద్ధితప్రకరణము
క. | అరి యిడి కాఁ డాఁడఱయన, ధరలో నొకకొన్ని చెల్లుఁ దద్ధితపదముల్ | 142 |
సీ. | సూఁడరి ముండరి తూఁడరి కల్లరి కాలరి ప్రేలరి కష్టుఁ డనఁగ | |
| దనరు దబ్బఱ చిందఱందఱ యనంగఁ, బరఁగు పలుకులు తద్ధితపదము లయ్యెఁ | 143 |
క్రియాప్రకరణము
గీ. | అరయ వాక్యకదంబోత్తమాంగమునకు, నమితదృష్టులు జగతిఁ గ్రియాపదములు | 144 |
క. | ధరఁ బ్రథమమధ్యమోత్తమ, పురుషాఖ్యలఁగ్రియలు మూఁడు పొలుచుం గాల | 145 |
గీ. | ప్రథమపురుషాఖ్య యన్యార్థపణితిఁ జెప్పు, నగ్రసంస్ధితుఁ జెప్పు మధ్యమపురుషము | 146 |
గీ. | అగుచునున్న కర్త యగు వర్తమానంబు, భూత మనఁగ నయిన పూర్వకృతము | 147 |
క. | ఉచితవిధి విధియు నాశీ, ర్వచనమునను క్రియలు రెండుఁ బ్రథ నొక్కటియై | 148 |
క. | తెలుఁగుక్రియాపదములకును, వలగొను ధాతువులు జనపదవ్యవహారో | 149 |
వ. | ప్రథమపురుషంబునకు వర్తమానార్థంబునందు నేకవచనబహువచనంబులందు నెడినెద | 150 |
క. | అరిగెడి నరిగెద రనఁగాఁ, | 151 |
వ. | ప్రథమపురుషంబునకు భూతార్థంబునందు నేకవచనబహువచనంబుల నెన్నిరులును | 152 |
క. | చేసెం జేసి రనంగాఁ, జేసితి చేసితిరి మీరు సిరి మా కనఁగాఁ | 153 |
వ. | ప్రథమపురుషంబునకు భవిష్యదర్థంబునందు నేకవచనబహువచనంబులకు నుదురులును, | 154 |
క. | చేయుం జేయుదు రనఁగాఁ, జేయుదు చేయుదురు మీరు చిత్తం బలరం | 155 |
క. | మొదలం చెప్పిన యది తుద, యది యాదేశంబు విధికి నవ్వచనములం | 156 |
క. | చేయునది బుధుఁడు ధర్మము, సేయునది బుధులు విశేషసిద్ధక్రియలం | 157 |
గీ. | ఉనుదురులకుమీఁద నొగిఁ గాఁత యున్న నా, శీర్వచనమునకును జెల్లు నదియు | 158 |
క. | కారయిత సేయుకృతి నల, రారు ణిజంతంబు దాని కాదేశంబుల్ | 159 |
క. | తుద బహువచనమునకు నిం, పుదురును నింతురును నయ్యెఁ బుడమియెదల నిం | 160 |
సీ. | శ్రీవిశ్వభూపతి చేయించుఁ గ్రతువులు సేవింపుదురు తదాశ్రితులు సురలఁ | 161 |
క. | మహితస్థావరతిర్య, ఙ్మహిళాదిక్రియలవర్తమానార్థమున | 162 |
క. | పండును భూజము తరువులు, పండెడు రాచిలుక యొప్పఁ బలికెడుఁ జిలుకల్ | 163 |
క. | నిగుడదు భూజము సింగము, బెగడదు నిటు నాగవనిత పిలువ చనెడుచోఁ | 164 |
గీ. | ఒనర నింపు నించు ననియెడు వీనిపై, నుటతలొందెనేని నొక్కచోటఁ | 165 |
క. | కోపింపుట కోపించుట, కాపించుట పసుల నొప్పఁ గాయించుట నా | 166 |
గీ. | తెలుఁగుఁబలుకులు పునరుక్తిఁ బలుకుచోట, గదిసి రెండవపదమున మొదలివ్రాఁత | 167 |
క. | పులిగిలి యనఁ గరిగిరి యన, నలిగిలి యన నోడగీడ యనఁగా బరఁగున్ | 168 |
క. | స్మరధరచరవరపదములు, పరఁగుఁ గ్రియాపదము నొందుపట్టులనెల్ల | 169 |
క. | స్మరియించె సంస్మరించెను, ధరియించె ధరించె బూవుదండఁ జరించెం | 170 |
క. | ఇది తెనుఁగున కెల్లను జన, పదవిదితం బైనతెఱఁగుప ట్టించుక యె | 171 |
మ. | లలి ననోన్యముఖావలోకనము లీలం జేయఁగాలేని యా | 172 |
మ. | కవివాత్సల్యకళాచరిష్ణుఁడు జగత్కల్యాణవర్ధిషణుఁ డు | 173 |
క. | శ్రీమచ్చళుక్యవిశ్వ, క్ష్మామండలవిభుఁడు సకలసంగ్రామజయ | 174 |
తరళ. | బిరుదమిత్రుఁడు భిన్నశత్రుఁ డుపేంద్రపుత్రుఁడు యామినీ | 175 |
గద్యము
ఇది శ్రీమదుమారమణచరణారవిందవందన గోవిందామాత్యనందన
వివిధబుధవిధేయ విన్నకోట పెద్దయనామధేయవిరచితం బైన
కావ్యాలంకారచూడామణి యనునలంకారశాస్త్రంబు
నందు నంధ్రభాషావిశేషసంధిసమాసదేశీయ
ప్రయోగక్రియానిరూపణలక్షణసముద్దేశం
బన్నది నవమోల్లాసము.
—————