చతుర్దశవిద్యలు వానికి విధేయములయ్యను. శారదాదేవి కాతడు ప్రియపుత్రుడయ్యెను. హిమత్పర్వతమునుండి భూమిమీదికి బ్రవహించు గంగానదివలె గవితారవ మాతని నోటనుండి వెల్లి విరియజొచ్చెను. అట్లగుటచేత నాతడు నిర్భయముగా దననెత్తియడ జూచుచున్న దేవికి బ్రదక్షిణముజేసి సాష్టాంగ నమస్కారపురస్కారముగ నామె చరణములు బట్టుకొని యిట్లు స్తుతించెను.

స్తవము

శ్లో॥మాణిక్యవీణ ముపలాల యంతిం
   మదాలసాం మంజులవాగ్వేలాసారి
   మహేంద్రనీలద్యుతికోమలాంగీం
   మాతంగ కన్యాం మనసా స్మారామి
శ్లో॥ చరుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే
      కుంకుంరాగశోణే
      పుండ్రేఱనాశాంకుశపుష్ప బాణహస్తే నమస్తే
      జగదేశమాత
శ్లో॥ మాతామరకతాశ్యామా మాతంగీ మధుశాలినీ
     కుర్యసత్కటాక్షిం కల్యాణీ కదంబ వనవాసిని
శ్లో॥ జయ మాతంగతనయే జయనీలోత్పంద్యుతే
     జయ సంగీతరసికే జయ లీలాశుకప్రియే

అని శ్లోక చతుష్టయముతో సుతియించి కవిత్వ మప్రయత్న పూర్వముగా వెడలుచుండుటం జేసిల్య్లు నంత నిలువక దేవీ మనోమండలము వికాసము జెందునట్లు దండక మొక్కదాని నాశుధారగా రచియించి యట్లు సుతించె.