యభిప్రాయము. అట్లయిన విక్రమార్కుని యాస్థానమున నౌకరు భోజుని యాస్థానమున నౌకరు నుండిరేమో? అతని కాలనిర్ణయము సరిగా నింతవఱకు జేయబడలేదు. ఇతడు గౌడదేశస్థు డనియు, కౌండిన్యసగోత్రుడనియు గొందఱనుచున్నారు. ఇట్లనుట కాధారము లేమియు గానబడవు.

మతము

కాళిదాసుడు

శివ భక్తుడు

ఇందుకు నిదర్శనము లనేకములు కలవు. కుమార సంభవమును శైవకావ్యము నితడు రచియించెను. అందు శివుడు పార్వతిని వివాహమాడుటయు, నామవలన గుమారస్వామిని గనుటయు, నతనిచేత ద్రిలోకకఠకుడై-ఇంద్రాదిదేవతలను హింసించిన తారకాసురుని జంపించుటయు, మొదలగు వృత్తాంత మతిమనోహరముగా వర్ణింపబడియున్నది. ఇదిగాక యమ్మహాకవి తాను రచించిన రఘువంశ కావ్యమునందు

   శ్లో॥వాగర్ధావిన సంవృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయె
       జగతు పితరౌవందే పార్వతీ పరమేశ్వరా.

తా॥ మాటయు దానినిర్ణయము నెట్లు కలిసియుండునో యట్లు కలసియున్నట్టియు, దల్లిదండ్రు లైనట్తియు పార్వతీ పరమేశ్వరులను వాక్యార్ధ సిద్ధికొఱకు నమస్కరించుచున్నాడను.

అని మొట్టమొదట నిష్టదేవతా ప్రార్ధనము జేయుచున్నాడు. నాటకరాజమని జగత్పసిద్దిజెందిన యభిజ్ఞానశాకుంతల నాటకమునందు గాళిదాసుడు నాందీరూపకమైన యీ క్రింది శ్లోకముచేత శివునే స్తుతించియున్నాడు.

శ్లో॥యాసృష్టి: సష్టురార్యా నహతివిధిహంతం యాహర్యా
     చహో తీ హోత్వకాల విధతి: శ్రుతివిషయగుణాయా
     స్ధితావ్యాప్య విశ్వం మీమాహు: నిగ్వభీజప్రకృతి
     యయా ప్రాణీనకపాణనస్త" ప్రత్యక్షౌంభి: ప్రసన్న
     స్తనుభిరవతు సప్తాభినష్టాభిరీశ"

తా॥ బ్రహ్మయొక్క మొదటిసృష్టి యేదియో, విధిప్రకారము హోమముచేయబడిన హవిస్సు నేదికాల్చునో, యేది హోతృరూపమో యేరెండు కాల విభాగ మిచ్చుచున్నదో, శృతివిషయగుణము గలదై విశ్వమంతయు వ్యాపించి యేది యున్నదో, సర్వభూతములకు బ్రకృతి యని దేనిని జెప్పుదురో, దేనిచేత జంతువులు ప్రాణవంతముగలుచున్నవో, ప్రత్యక్షముగానున్న యాయెనిమిది మూర్తులచేత నీశ్వరుడు ప్రసన్నుడై మిమ్ము రక్షించుగాక!

మఱియు నీకవి రచించిన విక్రమోర్వశీయ నాటకమునందలి నాందిచేతగూడ శివస్తుతియే యిట్లు చేసినాడు.

శ్లో॥వేదాంతేషు యమాహు రేకపురుషుని వ్యాప్య
    స్తితం రోదసీ యస్మిన్నీశ్వర ఇత్యనవ్యవిషయ:
    శబ్దో యదార్ధాక్షర: అంతిర్యశ్చ మముక్షీభిర్ని
    యమిత ప్రాణాధిఃభిర్మృగ్యతే నస్ధాయి స్ధిరభక్తి
    యోగసులభో నిశ్శేయపాయాస్ద్తుమ.

తా॥ వేదాంతములయం దెవ్వరిని విశ్వమంతయు వ్యాపించి యున్నట్టి యేపురుషునిగా జెప్పుచున్నారో, యన్యుల కెవ్వరికి జెందని యీశ్వర శబ్ద మెదనియందు సార్ధకమైనదో, ప్రాణాయామ విద్యయందు బ్రవీణులైన ముముక్షువు లెవ్వరు వెదకుచుందురో, స్ధిరభక్తియోగ సులభుడైన యాస్ధాణుడు మీకు మొక్షసుఖము లిచ్చుగాక!

మాళవికాగ్నిమిత్ర నాటకమందుగూడ నిత డీవిధముగానే శంకరస్తుతి జేసినాడు.

శ్లో॥ఏకైశ్వర్వేస్దితోసిప్రనతబహుఫలే య:స్వయంకృత్తి
     నాసా।కాంతావిజ్మశ్రదేహోస్యవిషయమనసాం య:
     సరిస్తాద్యతీనాం అష్టాభిర్య కృత్స్నం జగపి తనుభి:
     చిత్రతో నాభిమాను సన్మార్గాలోకనాయ వ్యపన
     యతు నవస్తామసీంవృత్తి మీశ:

తా॥ ఎవ్వడు మహైశ్వర్యము గలిగియు దాను తోలు దాల్చి భయభక్తులకు బహుఫలము లిచ్చుచుండునో, యద్దకాదీశ్వరుడయ్య జతేంద్రియులైన యతులకు గూడ నతీతుడయ్యెనో, తనయష్టమూర్తులచేత జగత్తును భరించుచున్నవాడయ్యు నభిమానము లేకయున్నవాడో, యట్టి యీశుడు సన్మార్గదర్శనము కొఱకై మీతామవృత్తి నడుచుగాక్.

గ్రంథరచనలో నొక చమత్కారము

కాళిదాసుదుతనకావ్యరచనలో నొక చిత్త్రమైనఫక్కి నవలంబించెనని చెప్పుదురు

వివాహమైనతరువాత నతడుగదిలో బండుకొనియున్నప్పుడు భార్య యతని యరసికతజూచి "అస్తికశ్చిద్వాగ్విశేష:" యని ప్రశ్న మడిగెననియు, దానియర్దము దెలియకతడు బార్య సనాదరణము జేసెననియు. దానియర్దము, అనగ నేమైన పాండిత్యము మీకు గలదా యని దానిబావము. తరువాత నతడు కాళికావరప్రసాదము బడసి భార్యను వీడుకొని దేశాంతరములకు బోయి భార్యవలననే తనకట్టి విద్యావిశేషము గలిగినదని యామెయెడల విశ్వాసముగలిగి మొట్టమొదట దన్నామె యడిగిన యాప్రశ్నములో నున్న 'అస్తి, కశ్చత్, నాక్, విశేష: ' యను నాలుగు మాటలను నాలుగుకావ్యమ్యులలో మొదటిమాటలుగా జేసి గ్రంధ రచనను చేసెనని