కాలం సర్వం చక్రాబ్రమణం

కాలం సర్వం చక్రబ్రమణం

వంటరి పయనం మనకు మనం


పల్లవి: చాల నడిచాం ఇచటె ఉన్నం

లేధా మనకిక సంక్రమణం


చరణం:

అక్షయ లెన్నొ పొయాయి

ప్రభవలు చాల పుట్టాయి

సూర్యుని చంద్రుని గగనాన

చాటెస్తొంధొయ్ ఒక శక్తి ----1


పిన్నవు తాతవైనావు

పేధవు ధనికుడ వైనవు

జడుడవు పండితు డైనావు

ఐనా ఎటు పోతున్నావు -----2



ధళితులు ధీనులు వీరంత

నీగత జన్మల బంధువులె

వెనుకటి నీ స్తితి మరవద్దు

ఎక్కిన మెట్టులు జారొద్దు -----3


మరపు మకిలిగా మధము వెకిలిగా

కప్పెశాయ్ నీ హౄదయాన్ని

మసిని తుడుచుకొ కనులు తెరుచుకొ

దత్త మార్గమును గుర్తించుకో -----4



తెలివి పెంచుకొ కలిమి పెంచుకొ

నీవు మనిషవని గుర్తించుకొ

అహము త్రుంచుకొ లోన కాంచుకొ

విశ్వమంతటను వ్యాపించుకో-------5


యుగాల కొలతలు మనకొద్దు

కాలం కడుపున కలవొద్దు

శ్రీ గురుదత్తరాధనలొ

సచ్చిధానందుల మవుధాము -----6