కవిజనాశ్రయము/అవతారిక
క. శ్రీకరముగ రేచనపై
లోకంబున సుకవివరులు లోలతఁ బొగడన్
బ్రాకటముగ నీఛందము
లోకం బౌ ననఁగఁ దెలుఁగులో నొనరింతున్. 1
క. వేములవాడను[2] వెలసిన
భీమేశ్వరుకరుణ గల్గుభీమసుకవి నేఁ
గోమటిరేచనమీఁదను
నీమహిఁ గవు లెన్న ఛంద మెలమి రచింతున్. 2
క. [3]అనవద్యకావ్యలక్షణ
మొనరంగాఁ గవిజనాశ్రయుఁడు మల్లియ[4] రే
చనసుకవి[5] కవిజనాశ్రయ
మనుఛందముఁ దెనుఁగు బాస నరుదుగఁ జెప్పెన్. 3
ఛందఃప్రశంస
క. నెఱయంగా నీఛందము
తెఱఁ గెఱుఁగక కవిత చెప్పుధృష్టాత్ముఁడు ద
బ్బఱచీఁకు చీఁకుగుఱ్ఱము[6]
బఱపిన క్రియ నిఖిలహాస్యపదనిరతుఁ డగున్. 4
క. [7]కడుఁ గవితామహిమకుఁ దివి
రెడుకవి కిచ్చదువు[8] తెఱఁ గెఱింగినఁగా కె
- ↑ ఈయవతారికఁలో చేరిన పద్యము లాఱును జ-యను ప్రతిలో మాత్ర మున్నవి.
- ↑ వేమనవాడ యని మాతృక. వేములవాడ, లేములవాడ యని వ్యావహారిక నామములు. ఈగ్రామము హైదరాబాదు రాజ్యములోఁ బూర్వము వెలిగందల జిల్లా యనియు నిప్పుడు కరీంనగర్ జిల్లా యనియు వాడుక గల మండలమందు మహారాజా కిస్సెన్ ప్రసాదుగారి జాగీరులో నున్నది. అందు సుప్రసిద్ధమయిన భీమేశ్వరాలయము కలదు.
- ↑ ఈపద్యమునకుఁ బూర్వమం దీక్రిందిపద్యములు రెండును బ - ప్రతిలోఁ గనుపడుచున్నవి.
(1) పరఁగిన విమలయశోభా
సురనిరతుఁడు భీమనాగ్రసుతుఁ డఖిలకళా
పరిణతుఁ డయ్యెను భూసుర
వరుఁడు ప్రపాదోదితధ్రువశ్రీయుతుఁడై.
(2) అసమానదానరవితన
యసమానోన్నతుఁఢు యాచకాభరణుఁడు ప్రా
ణసమానమిత్రుఁ డీకృతి
కి సహాయుఁడుగా నుదాత్తకీర్తి ప్రీతిన్. - ↑ ద-లో ‘మల్లియ’ కు బదులుగా నన్నిచోట్ల ‘మల్లయ’ యని యున్నది.
- ↑ జ- దాను
- ↑ జ - లం, బరచీకుగుఱ్ఱమును వడి
డ - న, బ్బుర నెక్కి గుడ్డిగుఱ్ఱము
ద - చెప్పఁదివిరెడుకవి ద, బ్బఱచీఁకటిగుఱ్ఱమునున్.
శబ్దరత్నాకరమందు. దివురు నతఁడు ద, బ్బఱచీకుచీకు గుఱ్ఱముఁ, బఱపినగతి - ↑ పోల్చి చూడుఁడు.
ఛందమ నఱియదె కవితెయ
దందు గదొళ్ తొళలినుళివకుకవియె కురుడం
ముందెకవల్వట్టెయిర
ల్కందుమణంపదమనిడలదేంగెయ్దపనో. (కర్ణాటచ్ఛందో౽౦బుధి.) - ↑ ద - కవికిన్ జదువు
బ - తివిరెడువానికిఁ జదువు