కనుపాప కరవైన కనులెందుకో


చిరంజీవులు (1956) సినిమా కోసం మల్లాది రామకృష్ణ శాస్త్రి రచించిన పాట.


పల్లవి :

కనుపాప కరవైన కనులెందుకో

తనవారె పరులైన బ్రతుకెందుకో ||| కనుపాప |||


చరణం 1 :

విరజాజి శిలపైన రాలేందుకే

మరుమల్లె కెంధూళి కలసేందుకే || విరజాజి ||

మనసైన చినదాని మనసిందుకే రగిలేందుకే ||| కనుపాప |||


చరణం 2 :

అలనాటి మురిపాలు కలలాయెనా

చిననాటి కలలన్ని కథలాయెనా || అలనాటి ||

తలపోసి తలపోసి కుమిలేందుకా తనువిందుకా ||| కనుపాప |||


చరణం 3 :

తనవారు తనవారె విడిపోరులే

కనుమూసి గగనాన కలసేరులే || తనవారు ||

ఏనాటికైనాను నీదాననే నీదాననే

చిననాటి మన పాట మిగిలేనులే

కలకాల మీ గాథ రగిలేనులే రగిలేనులే