కథలు - గాథలు (చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి)/పిఠాపురప్రభువు లేటు శ్రీ గంగాధర రామారావుగారి కథలు



పిఠాపురప్రభువు లేటు

శ్రీ గంగాధర రామారావుగారి కథలు

పైని వుదాహరించిన ప్రభువరేణ్యుని అత్యద్భుతచర్యలు మాప్రాంతములలో తఱచుగా చెప్పకుంటూవుంటారు. నాకు కొంచెం ప్రాజ్ఞత కలిగేటప్పటికి వీరు తుట్టతుదిదశలో వున్నారు. వీరిని నేను చూడడం చూశాను. గాని, నన్నుమాత్రం వా రెఱగడానికి తగ్గస్థితిలో అప్పటికి నేను లేను. నేను కాశీనుండి కాశీకావడి బుజాన్ని పట్టుకొని వచ్చే రోజులలో తునికిన్నీ అన్నవరానికిన్నీ మధ్యగావున్న తేటగుంట, తిమ్మపురంవద్దకు వచ్చేటప్పటికి యీ మహారాజు ద్వాదశాహస్సునాఁటి సంభావన పుచ్చుకొన్న బ్రాహ్మణ్యం యెదురుగావచ్చింది. నాకు నామరూపాలు కలగడం కాశీనుంచి వచ్చిన మఱుచటినాటి నుండే కావడంచేత, వారిని నేనెరగడమేకాని నన్ను వారెఱిఁగి వుండే యోగం తటస్థించలేదు. అదిన్నీకాక యీ ప్రభువు సుమారు 5, 6, సంవత్సరాలకాలం అంత్యదశలో కొంత అనారోగ్యంగావుండి - "కాశ్యాంతు మరణాన్ముక్తి" కనక. కాశీలో భౌతికదేహం చాలించేవుద్దేశంతో వకటి రెండుసార్లు కాశీకి వెళ్లినట్లుకూడా వింటాను. కాని తుదకు వీరు తమ రాజధానియగు పిఠాపురంలోని కోటలోనే భౌతికదేహాన్ని చాలించినారు. వీరు భౌతిక దేహాన్ని చాలించేనాటికి కొంచెం పూర్వగాథలు నాకు తెలియటాని కభ్యంతరం లేదుగాని, వీరు రాజ్యానికివచ్చిన కొలఁదికాలం నాటిచర్యలు నాకు వినికివల్ల తెలిసినవేకాని ప్రత్యక్షంగా తెలిసినవి మాత్రం కావు. బహుశః, గతించిన ధాత, ఈశ్వర సంవత్సరాల ప్రాంతంలో జరిగిన వకచర్యనుగూర్చి యిందు వ్రాస్తాను.

జియ్యంగారిరాక

అప్పటికి నావయస్సు సుమారు ఆఱుసంవత్సరాలకు దాదాపు. అప్పుడు కఱవువచ్చింది. రూపాయిపెట్టి బియ్యంకొంటే చేటలోకి పూర్తిగా వచ్చేవికావు. యిటీవల బియ్యపుధర ఆమాదిరిగా వున్న రోజులు నాబాల్యానంతరం చాలావున్నాయి గాని కఱవనిమాత్రం లోకం అనుకున్నట్లు లేదు. ఆ కాలానికి అదే పెద్దకఱవు. అప్పటికింకా మా కుటుంబము కడియం గ్రామంలోనేవుంది. నాకు తగుమాత్రం అప్పటి సంగతు  లిప్పటికిన్నీ జ్ఞప్తిలో వున్నాయి. గాని యిప్పుడు వ్రాసేదిమాత్రం యిటీవల విన్నదేగాని అనుభవించి జ్ఞాపకముంచుకొన్నదికాదు. అప్పుడు మాగ్రామం జియ్యంగారు వచ్చారని చెప్పకోవడం మట్టుకు జ్ఞాపకంవుంది. నేను జియ్యంగారిని “బియ్యం” గారని వాడినట్లు కూడా జ్ఞాపకంవుంది. యిఁక వ్రాయబోయే సంగతులేవిన్నీ జ్ఞప్తిమీఁద వ్రాసేవికావు. మా తండ్రిగారు వగయిరా లిటీవల చెప్పుకొనేటప్పుడు విన్నవే.

జియ్యంగారంటే, బహుశః శ్రీవానమామల జియ్యంగారైవుండాలి. వీరు శ్రీవైష్ణవపీఠస్థులు. స్మార్తులకు శ్రీశంకరాచార్యపీఠం యేలాటిదో విశిష్టాద్వైతులకు యీ పీఠమున్నూ అలాంటిదే. యిటీవల చాలాభాగము ఆ యీ పీఠస్థుల పవరు తగ్గిందికాని మా చిన్నతనంలో గవర్నమెంటువారి కన్న యీ పీఠస్థులకు తక్కువ అధికారం వున్నట్టు లేదు. వారికి యివ్వవలసిన పాదపూజ సమర్పించకపోతే ఆయాగృహస్థుల యిళ్లల్లో సామాను జప్తుచేయడం వగయిరా అధికారాలు పీఠస్థులకు గవర్నమెంటుతోపాటు వుండేరోజులు నేను కొంచెం ఎఱుగుదును. క్రమంగా మా గోదావరి డిస్ట్రిక్టుకు పీఠమంటూ వుండడమే అంతరించి చాలారోజు లయింది. సుమారు నలభైయేండ్ల దరిమిలాను మా ప్రాంతానికి శంకరాచార్యపీఠం వచ్చినట్టు గాని, పాదపూజ సమర్పించినట్టుగాని నే నెఱుఁగనే యెఱుఁగను. కాని సుమారు పదేండ్లనాడు కాఁబోలును, యెవరో మాంతాచార్య స్వాములవారంటూ మా సమీపగ్రామం జేగురుపాడుకు వచ్చి నాపేర శ్రీముఖం పంపించారు. శ్రీముఖం అంటే గురుపీఠంవారు శిష్యులకుపంపే నోటీసు. దానిమీద నాకు తోఁచిన పాదపూజ పంపించుకొన్నానుగాని తీరికలేని వారి సందర్శనానికి వెళ్లలేదు. మొత్తం చిరకాలాన్నుంచి మా జిల్లాకు పీఠస్థుల సందర్శనం లేకపోయిందన్నది ప్రస్తుతం.

శైవం - వైష్ణవం

వానమామల పీఠస్థులు మా గ్రామం దయచేయడానికి కారణం శ్రీపిఠాపురం రాజావారే. మాప్రాంతం వెలమవారందఱున్నూ వైష్ణవ మతస్థులే. నేను వెంకటగిరి సంస్థానానికి వెళ్లడానికిపూర్వం వెలమవారిలో శైవులున్నారనే సుతరామున్నూ యెఱుఁగను. యీకారణంచేతనే వెంకటగిరి స్టేషనులో వక వెలమదొరగారితో నాకు నిష్కారణంగా పోట్లాట తటస్థించింది. ఆయన చాలా మంచివారుకనుక కాని, లేకపోతే నాకు ఆపోట్లాటలో “తస్యప్రహరణ" మహోత్సవం కూడా జరిగేదే. అసలు కథేమిటంటే, జంగందేవర వేషముతో వకాయన ఆ స్టేషనులో నాకు ప్రత్యక్షమైనారు. ఆయనతో నేను సామాన్యపు జంగాలతోవలెనే మాట్లాడుతూ వున్నాను. ఆయన మంచివారు కనుక మేము వెలమవారం అని చెప్పారు పాపం. కాదు, మీరు జంగాలన్నాను నేను, యెఱుగనప్పుడు నేనేమన్నా, ఆయన యథార్థం  చెప్పిన తరువాతేనా వెనక తగ్గవలసింది. కాని ఆయన వేషం, వకగంటా శంఖమూ యింతే తరవాయిగాని పూర్తిగా జంగందేవరలా కనపడింది. పయిగా వెలమవారేమిటి? విభూతిరుద్రాక్షలు వేసుకోవడం ఏమిటి? అని వకశంక. అందుచేత ఆయన మాటను నేను బొత్తిగా నమ్మలేకపోయాను. తుదకు విధిలేక నమ్మి, “మావైపున వెలంవారు యెవ్వరూ విభూతివగయిరా ధరింపరు.” అంటూ యేవో రెండు యథార్థమైనమాటలే చెప్పి ఆయనవల్ల కాళహస్తి ప్రాంతంలో శివభక్తులైన వెలంవారు వున్నట్టు తెలిసికొన్నాను. యిటీవల చాలారోజులకు గుంటూరుసీమవివాదాలనాడు చేబోలు కమ్మవారిని చూచి కమ్మవారిలో శైవులుండడం తెలుసుకున్నాను. అలాగే హైదరాబాద్ ప్రాంతంలో కంసాలులలో తిరుమణి ధారులున్నట్లు తెలుసుకున్నాను. అందుకే కూప కూర్మంగా వుండడం యెవరికీ కూడదు. కవికి బొత్తిగా కూడదని అనుభవజ్ఞులు చెపుతారు. “అప్రవాసినంచ బ్రాహ్మణందృష్ట్వా సచేలస్నాన మాచరేత్" అనేవారట మా గురువుగారి గురుపరంపరలో వకరైన శ్రీ యింద్రగంటి గోపాలశాస్తుర్లుగారు. అది అట్లా వుండనిచ్చి ప్రకృతం మాట్లాడుకుందాం.

వర్ణాశ్రమాచారాల పట్టుదల

శ్రీ గంగాధరరామారావుగారు వైష్ణవ మతస్థులవడంచేత వారు పిలిపిస్తే వానమామల జియ్యంగారు శ్రీ రాజావారి ప్రధానగ్రామాల్లో ఒకటైన మాకడియం గ్రామం దయచేశారు. వారు దయచేసేటప్పటికి శ్రీ బులుసు పాపయ్యశాస్రులవారుకూడా శ్రీరాజావారి సమక్షమందే దయచేసియున్నారు. శ్రీ రాజావారికి గురుదర్శనానికి వెళ్లేటప్పుడు పాపయ్యశాస్రులవారి సహితంగా వెళ్లాలని కుతూహలం వుంది. కాని రాజావారికి వారు గురువులు గాని పాపయ్య శాస్రులవారికి వారు మతరీత్యా గురువులు గారుగదా? విద్యలోనో, యెవరూకారు. అట్టిస్థితిలో వారి సందర్శనానికి వీరేలావస్తారు? స్వబుద్ధిచేత రారు. శ్రీ రాజావారు మాత్రం రావలసిందని యేలా కోరుతారు? అప్పటి రాజులంటే వర్ణాశ్రమాచారాలను పరిపాలించడానికి బద్ధకంకణులుకదా? ఆరాజావారిరోజులలో మనగవర్నమెంటు యింత కట్టుదిట్టంలో లేకపోయినా కొంతేనా వ్యాపకంలో లేకపోలేదు. గవర్నమెంటు అధికారాలలో యేకొంచెమోతప్ప “నాన్‌బ్రామిన్సు" వున్నట్టులేదు. గొప్పగొప్పపదవులలో యేచిన్నపరీక్షలో ప్యాసయిన బ్రాహ్మణులే వుండేవారు. అప్పటికి ప్లీడర్ల ఆర్గుమెంటునుగూర్చి యిప్పటికిన్నీ కొందఱు వేళాకోళంగా చెప్పకుంటూవుంటారు. కోర్టుమునసబుగారు మీ ఆర్గుమెంటు చెప్పండనేసరికి, యెవరో వక్కలంకాయనఁట, పేరు జ్ఞాపకంలేదు. “నేను చాలా పెద్దకుటుంబీకుడను, వేఱే మనవిచేసేదేమిటి? యీ కేసు కోర్డు వారు నాకు వ్యతిరేకంగా చేస్తే నా దగ్గఱికి మఱోకేసు రాదు, కాఁబట్టి అనుగ్రహించ వలసిందని మీ ఘనతనుగూర్చి ^  మిక్కిలిప్రార్ధిస్తాను." అనిచెప్పే వారట! అట్టిస్థితిలో బ్రాహ్మణ ప్లీడర్లే వుండేరోజుల్లో “నాన్ బ్రామిన్సు"కు చదువుసందెలెక్కడ? ఉద్యోగాలెక్కడ? యెవరేనా వక వుద్యోగి వారిలోవుంటే జమీందార్లకు-అందులో క్షత్రియ వెలమ యీ జాతి జమీందార్లకు - వారికి దర్శనమివ్వడానికిఁగాని వారితో మాట్లాడటానికిగాని, బొత్తిగా ప్రాణసంకటంగా వుండేదఁట. దీనికిసంబంధించిన గాథలు పిఠాపురం సంస్థానానికి చెందినవే చాలా వున్నాయి. వాట్లనుగూర్చి మఱొకప్పడు మాట్లాడుకొందాం. అప్పటి జమీందార్లకేమి, ప్రజలకేమి వర్ణాశ్రమాచారాల విషయమై మిక్కిలి పట్టుదల వుండేదన్నది ప్రస్తుతం.

గజానికి గజమున్నర లెక్క

ఆ కారణంచేత శ్రీ పాపయ్యశాస్రుల్లుగారు జియ్యంగారి దర్శనానికి వెళ్లావెళ్లరు, వారిని శ్రీ రాజావారు రమ్మని అనాఅనరు. కాని ప్రస్తుతం అలా జరుగలేదు. దీనిలో మహాపాతక మేముందనే తాత్పర్యంతో, “మహాపండితులుగదా శాస్రుల్లుగా"రని ఆలోచించి, అయినా యేమంటారో చూతామని రాజావారు శాస్రుల్లుగారూ జియ్యంగారి దర్శనానికి మాతో తాము దయచేయడాని కేమైనా అభ్యంతరం వుంటుందా?" అన్నారట, విలాసంగా. దానిమీద పాపయ్యశాస్రుల్లుగారికి పచ్చివెలక్కాయ గొంతుకలో పడ్డట్టయింది పాపం! యేమంటే, నిన్నగాక మొన్న శ్రీరాజావారిచే స్వయముగా “మీకు మా యెస్టేటులో యొక్కడ యెంతభూమి కావాలో కోరుకోవలసిందని కోరుకోcబడి, "నెల 1 కి ఒకపుట్టి భూమి చొప్పున వుంటేచాలును" అనఁగా పుట్టి అంటే మా వైపున 8యకరాలు కనుక "సంవత్సర గ్రాసానికి 12 పుట్ల భూమి 96 యెకరాలు యిప్పించవలసిం"దని కోరుకొని ఆ భూమి వారి స్వగ్రామానికి సమీపంలోవున్న శానపల్లె లంకలో పుచ్చుకొని వున్నారాయె. ఆ పుచ్చుకోవడంలో ఠాణాదారుగారిని, పాండిత్యం చేతనే అనుకోండి, లోపుచేసుకొని 12 పుట్లకు పద్దెన్మిది పుట్లుకూడా కొల్పించుకొని వున్నారు పాపయ్యశాస్తుల్లుగారు. యీ మోసము రాజావారి కేలాగో తెలిసి ఆ ఠాణేదారుని బరతరపు చేశారు కూడాను. ఆ సంగతి పాపయ్య శాస్రుల్లుగారికి తెలిసి మళ్లా రాజావారి దర్శనానికి వెళ్లి తాము మాకు మొన్న దయచేయించిన భూమిని మళ్లా మీరే స్వీకరించవలసింది. మాకు సుతరామున్నూ అది అక్కరలేదన్నారట పాపయ్య శాస్రుల్లుగారు! దానిమీద రాజావారు “ఇదేమి శాస్రుల్లుగారు; యిలాసెలవిస్తూవున్నారు. మేము మీయెడలచేసిన మహాపరాధమేమిటో దాన్ని వ్యక్తీకరిస్తే సవరించుకోcదగ్గదయితే సవరించుకుంటా” మన్నారట. శాస్రులుగారు “యింతకంటే అపరాధ మేం కావాలి. మాకు భూమి కొలిచియిచ్చిన ఠాణేధారుణ్ణి మీరు బరతరపు చేయడంవల్ల మాకు ఆ భూమియందు అనాదరంకలిగిం"దన్నారట. దానిమీcదరాజావారు “మా వుద్యోగస్థుడు మా ఆజ్ఞకు - \ అన్యథాగా వర్తించడంవల్ల బరతరపుచేశాం కాని మీ యందు మాకు లేశమున్నూ అనాదరం లేదే" అన్నారట. దానికి శాస్రులుగారు చెప్పిన జవాబేమిటంటే:- "అయ్యా ఆయన మీ యాజ్ఞకు లేశమున్నూ వ్యతిరేకించలేదు. యేమంటారా? పండైండుపుట్ల భూమి మీరు మాకుకొలిచి వప్పజెప్పవలసిందనేకదా ఆయనకాజ్ఞాపించి ఉన్నారు. ఆయన అట్లే వప్పగించారు. దీనిలో ఆయన తప్పేముందన్నారట." రాజావారు “12 టికి 18 పుట్లు యివ్వడం తప్పకాదా" అన్నారట. పాపయ్యశాస్రులుగారు అన్నారట:- "అయ్యా మాకు మీరు భూమి యివ్వడం యెందుకువచ్చిందని ప్రశ్నించారట. మీరు జగదేక పండితులనే కారణంచేత యిచ్చి తరించాలనేవుద్దేశంచేత నన్నారంట. సరేఎందులో పండితులమని మీవుద్దేశమన్నారట? వేదశాస్తాలలో అన్నారంట. అవి యే భాష అన్నారంట. గీర్వాణబాష అన్నారట రాజావారు. గీర్వాణభాష కదా, గీర్వాణులంటే దేవతలే కదా? మేము ఆ భూమి దేవమానంచేత కొలిపించు కొంటాంగాని మనుష్య మానంచేత యేలాకొలిపించు కొంటామని తమరనుకున్నారంటూ చెప్పియేలాగయితేనేమి గజానికి గజమున్నర చొప్పన లెక్కకట్టి సరిపెట్టి రాజావారికి నచ్చంజెప్పి మళ్లా ఆ ఠాణేదారు వుద్యోగం ఠాణేదారుకిప్పించి తమ భూమిని తాము నిల్పుకున్నారంట. ఆ భూమి అంటే సామాన్యమైనదికాదు, లంకభూమి. యితరత్ర వకయకరం యెంత ఖరీదో అక్కడ వక సెంటు అంతఖరీదు చేస్తుందన్నమాట. అది యిప్పటికిన్నీ వారి కుటుంబీకులు అనుభవిస్తున్నారు.

శాస్త్రులుగారి లౌక్యప్రజ్ఞ

చెప్పేదేమిటంటే, అట్టిమహాదాత రాజావారు. వారిగురువులదర్శనానికి వెడుతూ, రమ్మంటే రానని శాస్రులుగారు ఎలాచెప్పఁగలరు? "అర్ధస్య పురుషో దాసః" అన్నాండుగదా భీష్మండంతటివాడు. ద్రోణాదులు కూడా ఈమాటేచెప్పారు ధర్మరాజుతో, అయితే పాపయ్య శాస్రుల్లుగారు మహాలౌక్యులు. తుదకు వెళ్లకుండా చమత్కారంగా తప్పించుకున్నారని వినికి. యేంచేశారంటే:- అయ్యా మా స్మార్తమతం సర్వమతాలని సహిస్తుంది. వానమామలస్వామి దర్శనానికి రావడం నాకు లేశమున్నూ బాధకంకాదు. కాని నన్ను చూడడం వారికి బాధకంగా ఉంటుంది. విభూతి రుద్రాక్షధారణతో వున్నవారిని సామాన్యంగా శ్రీవైష్ణవులే చూడడానికి సంశయిస్తారు. అందులో వారు గురుపీఠంగదా? అట్టివారు సంశయింపకుండా వుంటారా? వకవేళ తమతోవచ్చిన హేతువుచేత యేలాగో స్వామి సహించి వూరుకొన్నా శిష్యులవల్ల ముందుముందేనా వారికి ఆక్షేపణ కలగడంతప్పదు. అనేటప్పటికి రాజావారు వారిలౌక్యప్రజ్ఞకు సంతోషించి వారిని వెంటఁబెట్టుకొనివెళ్ల కుండానే గురువులవారి దర్శనానికి దయచేశారంట! భూమి కొలత సందర్భములో దేవమాన మనుష్యమానాల విషయం యెట్లావున్నా అప్పటికాలపు దాతల సౌశీల్యాన్ని మనం ముఖ్యంగా గమనించాలి. అంతేకాక, పాండిత్యంలో యెంతగొప్పతనమున్నా ఛాందసత్వం కొంత దురాశ కలిగింపక మానదనికూడా అనుకోకతప్పదనుకొంటాను. ఆ దురాశవల్ల అవమానం పొందకపోవడమున్నూ పయిగా తమ లౌక్యప్రజ్ఞచేత తాముతరించడమే కాకుండా తమతోపాటు తాటితోదబ్బనంగా ప్రవర్తించిన (పాలెప్పళ్లంరాజు) ఠాణాదారుగారినికూడా తరింపఁజేయడం వగైరా పాపయ్య శాస్రుల్లగారి ప్రజ్ఞావిశేషానికి వుదాహరణంగా మనం గ్రహించవచ్చును. ఆయన గనక సరిపోయింది కాని యిదే మఱో పండితుడికి తటస్థిస్తే రాజావారు మంచివారుకనక శాస్రుల్లు వారికిదక్కితే 18 పుట్ల భూమిన్నీ దక్కేదేమోకాని ఠాణాదారుగారికి వుద్యోగంవూడి “అగ్నేయంతి" సిద్ధమయ్యేది.

రామకవిచాటుధార

ఈ పళ్లంరాజుగారి తుట్టతుదిదశలో, అనగా వారం పదిహేను రోజులలో స్వర్గానికి వెడతారనగా నేనూ వీరిని చూడడం తటస్థించింది. వీరివల్ల ఆరోజున శ్రీ శిష్టు కృష్ణమూర్తిగారికి సంబంధించినవిన్నీ పాపయ్య శాస్రుల్లుగారు వగయిరా ఆ కాలంనాటి వారికి సంబంధించినవిన్నీ చాలా గాథలు విన్నాను. నన్ను ఆయన యెవరిద్వారానో యేకసంథాగ్రాహినిగా వినివున్నారఁట. భోజనమయిన తరవాత కూర్చున్నప్పడు అన్నారుగదా:- వెనక శ్రీ శిష్టు కృష్ణమూర్తిగారికి వుండేది యీ ప్రజ్ఞ యిటీవల తమకు వుందని విన్నాను. యేదోవకపద్యం చదువుతాను మళ్లా మీరు చదవాలంటూ అడగడానికి మొదలుపెట్టారు. ఆ యీ గాథ వికారి సంవత్సరం నాఁటిది. అప్పుడే నాకు కొంచెం బుద్ధిబలం తగ్గడ మారంభించడంచేత, తెనాలిరామలింగంగారి - "ప్రాయపు ప్రొద్దంత కొంత పడమటఁదిరిగెన్” అనే స్థితిలో వున్నాను. అంతకుముందైనా యేవోకొన్ని పద్యాలు మాత్రమే యేకసంతకు వస్తాయిగాని అన్నీరావు. అర్థం తెలిసేవైతే రావడాని కభ్యంతరంవుండదు. కాని అప్పటిస్థితిలో అలాటిది కూడా యేకసంతకు రావడం అనుమానాస్పదమే. ఆ యీ సందర్భాలు వున్నవివున్నట్లుగా చెప్పేటప్పటికి ఆయన అన్నారుగదా; పోనీ రెండుసంతలకు చదివినా చాలునని యీ క్రింది పద్యాన్ని చదివారు. -

ఉ. పెండెలనాగి చెక్కులను పెద్ది కటిస్థలి, గంగిగుబ్బచన్
గొండల నుండు రామకవికుంజరు హస్తము క్రిందుచేసె,
హా! పండక బంటుమిల్లి, అది పండిన యీ కసుమాలధారుణీ
మండలనాథుఁబోలు నొక మానవనాయకు వేఁడనిచ్చునే?

నేను సుళువుగా రెండుసంతలకు వప్పగించాను పై పద్యం. ఆయన సంతోషించారు. యీ పద్యం తురగా రామకవిగారి చాటుధార, యీయన తాలూకు అగ్రహారం బంటుమిల్లి పండకపోతే శ్రీ మొగల్‌తుర్తి ప్రభువుల సందర్శనానికి వెళ్లేటప్పటికి దివాన్జీగా రన్నారఁట:- యీ యేడు దివాణం పనిన్నీ కిచ్చాటుగానేవుంది వచ్చేయేడు దయచేయాలన్నారఁట. దానిమీద కవిగారికి కోపంవచ్చి “పనసకాయ దొరికినప్పుడు తద్దినం పెట్టుకోవాలిగాని, తద్దినం వచ్చినప్పుడు పనసకాయెక్కడ దొరుకుతుం” దని పైపద్యాన్ని చెప్పాడఁట! ఆ పద్యంవల్ల నాటికవుల నిరాఘాటత్వం మనం తెలుసుకోవచ్చు. "పెద్దాపురపుకోట పెద్దమ్మ కిల్లౌట కవివరేణ్యుల కోప కలనఁగాదె" అన్న మా శ్రవణానందంలోని కవి వరేణ్యుఁడు యీ రామకవిగారే. పిండి ప్రోలు లక్ష్మణ కవిగారు మొదలయిన వారు యీ తురగా రామకవిగారిని వేములవాడ భీమకవిగారితోపాటు గౌరవించి వున్నారు - "ఉంగుటూరిళ్ల రాకాసు లుండవచ్చు" అన్నది కూడా యీ రామకవిగారే, యీయనవాక్కు మంచినిగానీ చెడ్డనుగాని సాధించడంలో పేరుపడింది. మంచివిషయమైన గాథలున్నట్లేలేదు. చెడ్డ లెక్కువున్నాయి. వాట్లను వుదాహరించడాని కీవ్యాసం పట్టలేదు కనుక స్పృశించి వదలుతున్నాను. యిట్టికవులెవరో కొందఱున్నారని ప్రతీకవి కవిత్వాన్ని బట్టి యిలాటి మంచిచెడ్డలు జరుగుతాయని విమర్శించే నేఁటి విమర్శకులధోరణి శోచ్యము. దీన్ని గుఱించి నేఁటరేపటఁ గొంత ప్రసక్తి కలిగితే కలుగుతుందని కొంచెం వాసనగొట్టడంచేత యింతదాఁకా ప్రస్తావించాను.

గురువులవారి శిష్యవిత్తాపహారిత్వం

శ్రీరాజావారిని గురువుగారి దర్శనానికి పంపించివుంది కథాసరస్వతి. యింక అక్కడ జరిగిన సంగతి సందర్భాలు వ్రాయాలి. యేముంది, కట్టేఁడు - కొట్టేఁడు అన్నమోస్తరుగా వ్రాస్తే యిదివఱకే ముగింపయేది. మధ్యమధ్య యితరప్రసంగాలవల్ల కొంత పెరిగింది. కానివ్వండి. గురువులవారికి పాదపూజ వక లక్షకు తక్కువ స్వీకరించడానికి సంకల్పం లేకపోయింది. రాజావారో? యేభైవేలకుమించి యిచ్చేసంకల్పం లేకపోయింది. వారికీ వీరికీ కొంతవఱకు మృదువుగానే కొంత చర్చ జరిగివుంటుంది. శ్రీ రాజావారు గురువులవారి “శిష్యవిత్తాపహారిత్వం” బాగా కనిపెట్టారు. “శిష్యహృత్తాపహారులు" వీరు లేశమున్నూ కారనుకున్నారు. యిట్టివారిని మనం పిలిపించడమే ప్రథమ తప్పిద మనుకొన్నారు. యేభైవేలుకూడా ఆయన అంగీకరించినప్పటికీ ఇవ్వడం దుర్వ్యయమే అనుకున్నారు. యీ దుర్వ్యయం లేకుండా చేసినందుకు గురుపీఠంవారు అభినంద్యు లనుకొన్నారు. యేమనుకొన్నప్పటికీ గురుత్వం వదులుకోడానికి వీలులేదే! దానిలో యివేమేనా

స్మార్తగురుత్వాలా? 'అర్థం ప్రాణం ఆచార్యాధీనం' అనే తరగతిలోవి కదా?

జుట్టుకోతప్రకరణం

మా రాజావారివద్ద యీ అర్ధప్రాణాచార్యాధీనాల ఆటలు కూడా సాఁగుతాయా? ఆయన మహా యుక్తిశాలి. చక్కఁగా ఆ శిష్యత్వాన్నుండి తప్పించుకున్నారు చూడండి. లోపల గురువుగారిమీద బోలెండు కోపం వచ్చిఁది. అలా కోపంరావడమే తటస్థిస్తే ఆరోజుల్లో మా రాజావారికి యెవరిమీఁద వచ్చిందో వారిజుట్టు వుండేదికాదు, కాని ఆ జుట్టుకు యెన్ని సంచుల రూపాయిలో వెంటనే ముట్టేవి అని యిప్పటికిన్నీ చెప్పకుంటారు. జుట్టు పోఁగోట్టుకొని రూపాయిలు స్వీకరించినవారిలో యిప్పటి కెవరున్నూ మిగిలినట్లు లేదు. యాభై అరువై యేళ్లనాఁటి ముచ్చట్లు. యీ సంగతి తెలిసి కొందఱు ధనసంపాదనకు యిది మంచి వుపాయమని రాజాగారివద్ద కొంత తెలివి తక్కువగా నడవడాన్ని ఆరంభించేవారంట. యెందుకంటే ఆ కాలంలో యిప్పటికాలంలోలాగా - సకలమ్మున్ గొరిగించుకోవడం ఫేషను కాకపోవడంచేత, జుట్టుపోయిందంటే పెద్ద అవమానమేకాని, ఆ అవమానానికేమి, పోతేపోయింది వెధవజుట్టు, మళ్లా పెరుగుతుంది. "శాకినీవ దినేదినే" వేలకొలది సొమ్మ దానంతటది వచ్చి యింట్లో పడుతుంది గదా! అని ఆ పెద్ద మనుష్యుల ఆశ. "బోలెడుతిట్లయినా బొక్కెండు కొఱ్ఱలుగా" వంటారుకదా పెద్దలు? అయితే అలా ప్రయత్నించినవారి జుట్టుమాత్రం మారాజావారి ఆయుధానికి వక్కటీకూడా బలిఅయినట్లు నేను వినలేదు. యెంతసేపూ వారి దివానులవీ, అడపాదడపా గవర్నమెంటు వుద్యోగులవీ అరుదుగా పండితులవీ పోతూవచ్చాయి. పండితులంటే ఆకాలంలో ఆ బిరుదు రావడం సామాన్యంగా వచ్చేదికాదు. కావ్యనాటకాలంకారాలు పూర్తిగా చదివినవారికి ఆ బిరుదు వుండేదేకాదు. సాహిత్య గాళ్లనేవారు వారిని. ఏదో వక శాస్త్రంలో పూర్తిగా పాండిత్యం సంపాదిస్తేనే పండితుడనడం. ప్రస్తుతం పండిత అనేబిరుదు బహు తేలికగా సంపాదన అవుతూవుంది. దీన్నిలా వుంచుదాం.

పొక్కునూరి వేంకట శాస్రులుగారు

పండితులలో అనగా సాహిత్యపరులలో పొక్కునూరి వేంకట శాస్రుల్లు గారనేవా రొకరు శ్రీ రాజావారితో బహు చనవుగా మాట్లాడేవారుండేవారట! శ్రీవారున్నూ యీ శాస్త్రుల్లుగారున్నూ సహాధ్యాయులని వినడం. యే చదువు సందర్భంలోనో తబిసీలు తెలియదుగాని బహుశః కావ్యపాఠ సందర్భంలో అయి వుండాలి. రాజావారు యెవరేనా పండితులు వస్తే వారితో ధారాళంగా సంస్కృతమే మాట్లాడేవారని వినికి. ఆ కారణంచేత వారు బాల్యంలో సంస్కృతభాష అభ్యసించి వుండాలి. ఆ సందర్భంలో యూయన రాజావారికి సహాధ్యాయులో, సతీర్థులో అయివుండాలి. ఆ చనువుచేత ఆంతరంగికులుగా వుండడమే కాకుండా యీయన రాజబంధువులకేమి, పండితులకేమి యెందటికో రాజావారిచేత యెన్నో వుపకారాలు చేయించినట్లు వినికి. అంత చనువుండడంవల్ల నిర్భయంగా మాట్లాడుతూ వుండడం వుండేదేమో. దానిలో యేం పొరపాటొచ్చిందో వకపర్యాయం కాబోలును రాజుగారి కత్తికి శాస్త్రుల్లుగారి జుట్టుపిలక పనిచెప్పినట్లు వింటాము. ఆ పిమ్మట కూడా వారిద్దరికీవున్న బాల్యమైత్రికి లోటులేకుండానే జరిగినట్టున్నూ వింటాము. ఆ కారణంచేతనే ఆ శాస్రుల్లుగారెప్పడో మళ్లా రాజాగారు కులాసాగా మాట్లాడుతూవున్న సందర్భంలో యీ జుట్టుకోఁత ప్రసంగం వచ్చేటప్పటికి “మహాప్రభో, నా జుట్టు యెంతో అదృష్టం పెట్టిపుట్టిందికనక మీవంటి మహాప్రభువుల కత్తికి యెరయింది” అంటూ యింకా కొంత మోటుగానే మాట్లాడినట్లున్నూ ఆయుక్తికి రాజావారు చాలా సంతోషించినట్లున్నూ కూడా వినికి.

వకకమ్మకులీనుడు

ప్రసక్తానుప్రసక్తంగా జుట్టుకోఁత ప్రకరణంలోకి దిగాంగనుక యీ ప్రకరణం తరువాయికూడా యేకరు పెట్టేసే ప్రధానాంశంలోకి వస్తాను. గృహస్తులలోకి శ్రీ రాజావారికి మిక్కిలీ ప్రేమపాత్రుఁడైన సంపన్న గృహస్థు వక కమ్మకులీనుని జుట్టుక్కూడా యీ అదృష్టం పట్టిందట. కాని వెంటనే నలభైవేల రూపాయిల సంచులను యేనుఁగుమీఁద వేసికొని రాజావారు ఆ ఆసామీని గౌరవించడానికి స్వయంగా మితపరివారంతో వస్తాదు సహితంగా ఆయన గ్రామానికి దయచేసినట్టున్నూ ఆకమ్మ కులీనుని మేనల్లుళ్లు వగయిరా అసలాయన యెంతచెప్పినా వినక రాజావారిని అవమానించే ప్రయత్నం పూర్తిగా చేసినట్టున్నూ యేలాగయితే యేమి వస్తాదు తెలివి తేటలవల్ల ఆ గండాన్నుండి తప్పించుకొని రాజావారు సురక్షితంగా కోటలోకి చేరుకున్నట్టున్నూ వినికి. కాని అసలు జుట్టుకోతబడ్డ ఆసామీ మిక్కిలీ రాజభక్తుడున్నూ రాజావారి మృదుహృదయమున్నూ తాత్కాలిక కోపమున్నూ యెఱింగినవాడున్నూ అవడంచేత, లేశమున్నూ తన మేనల్లుళ్ల దురాగతానికి సమ్మతింపనేలేదని యేకగ్రీవంగా అందఱూ చెప్పకుంటారు. అయినా తుదకు మేనల్లుళ్లు చేసిన పనికి ప్రతిఫలంగా ఆ ఆసామీ యేడు సంవత్సరాలు కాబోలును కఠిన శిక్ష అనుభవించి విడుదలకాకుండా ఖయిదులోనే కాంబోలును మరణించినట్లు విన్నాను.

సవతినాయనమ్మగారు

జుట్టుకోఁతలలో కొంత గణింపదగ్గది పురుషులకు సంబంధించిందిది మాత్రమే. స్త్రీలకు సంబంధించినవి అంతగా నున్నట్లే లేదు. సవతి నాయనమ్మగారిమీఁద కాబోలును కోపంవచ్చి బాగా చిన్నతనంలో అంటే రాజ్యాధికారం వహించినపిమ్మటే యీ మహోత్సవం జరిగించి తరువాత పస్తాయించికొని వారిలోవారే కనక వక యుక్తిచేసి అది లోలోపలే మాసిపోయేటట్టు చేసుకున్నారని వినికి. యేమిటంటే ఆ యుక్తి- నాయనమ్మగారే కనక, మళ్లా ఆవిడ దర్శనానికి వెళ్లి నమస్కారంచేసి, నేను యీ పని యెందులకు చేయవలసి వచ్చిందంటే, సుమారు 5, 6 నెలలనాండు మీకు మిక్కిలి జబ్బుచేసింది. ఆ సంగతి తమ చిత్తానికి విశదమే. ఆ సందర్భంలో మీరు బ్రతుకరనే సంశయం నాకు తోఁచి, వున్న యీ కాస్త పెద్ద దిక్కున్నూ లేకుండా చేస్తాడేమో భగవంతుడని దిగులుతోంచి “కలౌవేంకటనాయక" అని వుండడం చేత శ్రీ తిరుపతి వేంకటేశ్వరస్వామివారికి నాలో నేనే మీరు నింపాదిగావుంటే “యిలా జరిగింపచేస్తా" నని మొక్కుకున్నాను. కాని యిటీవల యీ మాట మీతో మనవిచేస్తే మీరు సుతరామున్నూ అంగీకరించరని నాకు తెలిసివుండడం వల్ల నైతేనేమి, వకవేళ నాయందువుండే ప్రేమాతిశయంచేత తాము అంగీకరించినప్పటికీ తమకేశపాశం వకమంగలిచేత స్పృశింపఁజేయడానికి దేవతా సాన్నిధ్యంలో అయినప్పటికీ అంతఃపుర మర్యాదకు విరుద్ధంగా వుంటుందని తోcచియేమి, మంచో చెడ్డో నాకీలా తాత్కాలికంగా తట్టి లేనికోపాన్ని తెచ్చుకొని ఆకాస్తా నేనే చేయవలసివచ్చింది. అనేటప్పటికి మనుమడి యుక్తిచమత్కారానికిన్నీ భక్తి తాత్పర్యాలకున్నూ సంతోషించి యొప్పటివలెనే చల్లని దృష్టితోనే ఆదరిస్తూ వుండేవారనిన్నీ పెద్దలవల్ల వినివున్నాను.

యేమైనా, గవర్నమెంటుప్రభుత్వం యింకాబాగా బలపడ్డరోజులు కావకనుక మా రాజావారి ప్రభుత్వం పూర్వపుజమీందార్ల ప్రభుత్వమ్మాదిరిగా నిరంకుశంగానే వెళ్లిపోయిందనడానికి పయిజుట్టుకోంతలు వగయిరా సాక్ష్యమిస్తాయి. జుట్టుకోతపడడమంటే శిరచ్ఛేదం చేయడానికితగ్గ కోపం వస్తేనే జరిగించేవారని తజ్ఞలుచెప్పేవారు. రాజావారి దర్శనానికి వెళ్ళడమంటే పెద్దపులివుండే గుహలోకి వెళ్లడమే అని యెవరిమట్టుకువారే భయపడుతూ వుండేవారట. “తస్మాద్రాజ ముఖం భీష్మం భావుకం" అంటారుకదా? కాని నిరపరాధులను యెవరినిగాని రాజావారికోపం బాధించనేలేదని యిటీవల, అనంగా శ్రీవారి జీవితానంతరం, చెప్పకుంటూ వుండంగా శతథా సహస్రథా వినివున్నాను. అంతకుపూర్వం జమీందార్లకు సివిలు మేజఫ్రేటు అధికారాలు వుండడమున్నూ అప్పడప్పుడే అవి తప్పిపోతూవున్న రోజులవుతూ వుండడముచేత యొవళ్లేనా దివాణం విషయంలో అవిధేయతగా వర్తిస్తే, సామాన్యపు లాకలూకాయ లతోపాటు వారుకూడా మేజస్టేటువద్ద ఫిర్యాదు చేసుకోవడం అనేది నామర్గా అనిపించి రాజావారిట్గా చేసేవారని లోకుల వుత్ర్పేక్ష యిదేనా యీ పిఠాపురపు ప్రభువరేణ్యునకే సాగిందిగాని యింతకన్నా పెద్దసంస్థాన మైనప్పటికీ విజయనగరానికి కూడా సాంగినట్లులేదు. వొక్కొక్క జాతక ప్రభావం వొక్కొక్క హోరగా జరుగుతుంది. గతించిన శ్రీ ఆనందగజపతి మహారాజులుం గారు యావజ్జీవమున్నూ తమప్రభుత్వానికి సివిల్ మాజ స్టేటు అధికార సంపాదన కోసమె యత్నించి తుదకు కృతకృత్యులు కాలేదని వింటాము. వీరట్టి ప్రయత్నం చేసినట్లు లేదుగాని స్వయంగానే సాంగించుకున్నారు.

వక గవర్నమెంటు వుద్యోగి

వక గవర్నమెంటు వుద్యోగికూడా వీరి ఆగ్రహానికి యెఱకావడం తటస్థించిందంట. అది లోలోపల మాసిపోక పై అధికార్ల నోటీసుదాంకా వెళ్లి, తుదకు ఆ వుద్యోగి శృంగార ప్రియుండు కనుక ఆయన ప్రియురాలికి పదిహేనువేల రూపాయీలు యివ్వడానికిన్నీ ఆ వుద్యోగి మొదటతన్ను రాజావారు కొట్టినట్టుచెప్పి యిప్పడు అన్యథాగా చెప్పడంవల్ల వుద్యోగం పోవడం తటస్థిస్తుందిగనక ఆ విషయంకూడా ఆలోచించందగ్గదే అవడంచేత ఆయనకు యావజ్జీవమున్నూ వుదయ వరహా లివ్వడానికిన్నీ యేర్పఱచి ఆ చిక్కులోనుంచి తప్పించుకొన్నట్లు మా తండ్రి గారివల్లనే వినివున్నాను. యింత తపిసీలుగా మా తండ్రిగారికి తెలియడానిక్కారణం:- ఆ వుద్యోగి మా గ్రామం వచ్చినప్పడు మా పశువుల పాకలో మకాంచేసేవారంట. యేంకర్మం, గ్రామంలో బసేదొరికేదికాదా అంటే, ఆయన దాసీప్రియురాలి సహితంగా వస్తే యే గృహస్థింట్లో బసదొరుకుతుంది? వారు అడగా అడగరు. అప్పటి కాలాన్నిబట్టి గృహసులు యివ్వా యివ్వరుకదా? మాతాతగారికి వ్యవసాయం విస్తరించి వుండడంవల్ల, గవర్నమెంటు అధికారిగదా ఆయనతో యెప్పుడేంపని పడుతుందో అని ముందాలోచనచేసి, యింటికి కొంతదూరంలోఉన్న పశువులపాక బాగుచేయించి, ఆ నాలుగు రోజులున్నూ పశువులను యితరత్ర కట్టుకొనే వారంట! అందుచేత యీ రాయబారాలు యావత్తున్నూ మా యింట్లోనే జరగడంచేత మా తండ్రిగారికి బాగా తెలియడానికి కారణమయింది.

గురు శిష్యభావపు వాడితనం

యింతకూ ప్రధానాంశం రాజావారికి గురువుగారి విషయమై పట్టరాని కోపంవచ్చింది. యితరవిషయమైతే యేం జరిగేదో? గురువిషయం కదా? వారి ప్రవర్తన మేలావున్నా శిష్యులు ఆక్షేపించడానికి అవకాశం లేనట్లు, శాస్త్రాలు ఫరోషిస్తూవున్నాయి. రాజావారు పూర్వాచార పరాయణులు. మంచి శ్రుతపాండిత్యం కలవారు. గురువుల విషయంలో తొందర పడతారా? లేదా, మరి యిచ్చచొప్పున లక్షా కుమ్మరిస్తారా పాదపూజకింద? యీ మధ్యనే రాజమండ్రిలో జరిగిందని విన్నాను - వక సంపన్న - ^ గృహస్థింటికి గురువులు వచ్చారు. వారికి సప్లయి చేయడంలో బ్రాందికూడా కావాలని జాబితాయిచ్చారు. శిష్యుండికి ఆ వస్తువు సేవించడం బాగున్నట్లు తోcచలేదు. దానిమీద "స్వామీ యిదిమాబోట్లమేసేవించం, మీరు గురువులు, మీరుసేవిస్తే లోకంపాడయిపోదా?” అని వినయంగానే మనవి చేసేటప్పటికి, గురువుగారికి కోపంవచ్చి, నీవు కులగురువునగు నన్ను ధిక్కరించావు కనుక వంశనాశనమయిపోతావు అని శపించారంట. ఆ శాపాన్ని ఆగృహస్థుతల్లివినినొచ్చుకొని "అయ్యా, యెఱంగండు, అజ్ఞాని, "మీమాటకు యెదురు చెప్పకూడదు” అంటూకోపోపశమనంజేసి జాబితాయిప్పించవలసిం దంటే, శాంతించి వంకపూటకు కాబోలును నలుగురైదుగురికి రు.25-0-0లు బిల్లుచేశారంట! గురుశిష్య భావం అంటే ఇట్టిది. అందులో వైష్ణవసంప్రదాయంలో దీనికి మతీ వాడితనం వుంటుంది. యీ రోజుల్లో అన్నిటితోపాటు దీనికిన్నీ వాడి తగ్గింది కాని యేలాగైనా యింకా యుది అక్కడక్కడ మిక్కిలీ అమల్లోనేవుంది.

సామాన్యగృహస్టే అంతోయింతో గురువుగారి అవ్యక్తతకు యెదురు తిరగవలసివచ్చిందే, మండలాధిపతి యెదురుతిరగడంలో ఆశ్చర్య మేముంటుంది? అయితే యిక్కడ అలాటి అవ్యక్త్యత యేమివుంది? మండలాధిపతి శిష్యుండైనప్పడు గురువు వారితాహతు ననుసరించి పాదపూజ యిమ్మని కోరవచ్చునుగదా? అంటే, యీ ఆశకు పరిమితంటూ వుంటుందా? యెంత పీఠాధికారసులైనా సన్యాసులేకదా? అట్టి సన్యాసుల ఆశ గృహస్టులకన్ననూ మించిపోతే యింక సన్యాసంపుచ్చుకోవడమెందుకు? ᏫᏭQᏇᏇhy సందర్భాలు ఆలోచించి చూస్తే గురువులవారి ప్రవృత్తి సమర్థనీయంకాదు. రాజావారో, లక్షయివ్వడానికేకాదు, యెన్నిలక్షలివ్వడానికైనా తాహతు కలవారే అనుకుందాం. తుదకు రాజావారు చేసిన చమత్కారం చూడండి. అట్టే నిదానించారు. దీనికి వుపాయం యిదే అనుకున్నారు. దగ్గరవుండే ప్రధాన నవకరు బొంగు కిష్టమ్మను, కిష్టమ్మా విభూతిసంచీ యిలా తెమ్మన్నారు. గురువుగారు చూస్తూవుండంగానే ద్వాదశోర్ధ్వపుండ్రస్థానాలకు చతుర్వింశతి విభూతి పెండికట్లు ఆదేశంగా ధరించారు. గురువుగారు ఆశ్చర్యపడి, యాభైవేలూ గంగలో గల్పుకున్నాంకదా అనిలోలోపల అనుకుంటూ వున్నారు. ఆ పట్లాన్ని దిగ్గునలేచారు. స్వామీ అని సగౌరవంగానే గురువుల వారిని సంభావించారు. అయ్యా, నా పేరెవరో తమకు తెలుసునా? అన్నారు. గంగాధర రామారావు; యీ పేరునుబట్టి నాకు తిరుమణితిరుచూర్ణధారణ కెంత ఆవశ్యకత వుందో విభూతి రుద్రాక్ష ధారణకున్నూ అంతే అధికారంవుంది. ఆజ్ఞతీసుకుంటున్నాను, శిష్యుని యందు దయవుంచండి, అనిలేచి కోటలోకి దయచేసినట్లు ప్రత్యక్షంగా చూచినవారు చెప్పగా నే విని వున్నాను.

అప్పటికాలానికీ యిప్పటికాలానికీ వ్యత్యాసం

యీగాథ యావతూ మావీథినే మాయింటికి సుమారు 60, 70 గజాలలో వుండే వైఖానసుల గృహంలోనే జరిగింది కాని, నాకు బొత్తిగా చిన్నతన మవడంచేత యితరులవల్ల విని వ్రాయడమే అయింది. కాని స్వయంగాచూచి వ్రాసిందిమాత్రంకాదు. అయితే ఆ వయస్సులో జరిగినవి కూడా కొన్ని యిప్పటికిన్నీ జ్ఞాపకంవున్నాయి. శ్రీ రాజావారు మా గ్రామం దయచేసినప్పడు ఏవీథిని వెడతారో ఆ వీథినివున్న యిండ్లల్లో వుండే ముత్తైదువులు మంగళహారతు లివ్వడం వండేది. ఆలా హారతిపట్టిన పళ్లేలలో యేదో రూపాయికి తగ్గకుండా ఆ రాజావారు వేయించడం వుండేది. యిది జ్ఞాపకం వుందిగాని మణికొన్ని జ్ఞాపకం లేవు. యిప్పటికీ అప్పటికీ చాలా వ్యత్యాసం. యేవిషయంచూతామన్నా వ్యత్యాసమే. యిప్పటి జమీందార్లు యెవరినేనా ధనికుండుగా వుండేవాణ్ణి మన్ననగా పిలుస్తారు పిలవవలసివస్తే. అప్పుడో కోటీశ్వరుణ్ణినాసరే, వర్ణాశ్రమాచార పద్ధతినితప్ప, జమీందార్లేకాదు, రాజబంధువులే కాదు, రాజోద్యోగులే కాదు పిల్చేవారేకారు, ఆ ధనాఢ్యులేనా యే సందర్భంలోనో జమీందార్లు తన్ను పిల్చి మాట్లాడేండంటేనే సంతోషించేవారు. అంతేనేకాని యేమండీ అన్నారుకారని విచారించినట్లే లేదు. యీ సందర్భం నేను కాకినాడలో వక షాహుకారు సందర్భంలో చూచాను. శ్రీ చెలికాని జగన్నాథరాయణింగారు రాజబంధువులు గాని రాజులుకారు. వీరు మా రాజావారి ఆఖరు మామగారు, అనగా యేడోభార్య తండ్రి అన్నమాట. యింకా కొన్ని చుట్టటికాలు వుంటే వుంటా యనుకొందాం, అప్పటికి అమల్లోవున్న చుట్టణికం అది. యీయన వక పెద్ద షాహుకారుని నీవు అని యేకవచనంగా మాట్లాడడం నేను స్వయంగా విన్నదే. అసలు మా రాజావారు యీ షాహుకారు కంటేనేకాదు, యీ దేశంలోవున్నయే షాహుకారుకంటే కూడా చాలా గొప్పగా వుండి పేరుప్రతిష్టలు గడించిన షాహుకారినే నువ్వనే వారని విన్నాను. ఆ జమీందార్లకాలంవేరు, యీ జమీందార్ల కాలం వేఱు. వీరు యించుమించు సామాన్యప్రజలుగానే మాటిపోవలసివచ్చింది. యీ గవర్నమెంటు ప్రభుత్వంలో కాCబట్టి యిప్పటి దృష్టితో అప్పటి జమీందార్ల చర్యలుగాని అప్పటి దృష్టితో యిప్పటి జమీందార్ల చర్యలుగాని మనం ముచ్చటించుకొంటే "యేతంపెట్టు" గా వుంటుంది గాని లేశమున్నూ సరిపడదు.

కొన్ని చోట్ల శాస్త్రమర్యాదను పూర్తిగా అతిక్రమించిన గౌరవాలున్నూ వుండడం చూచాను. యానాంలో దేవాలయంలో తీర్ధప్రసాదాలు శూద్రులకిచ్చాక కోమట్లకిచ్చేమర్యాద యెన్నాళ్లనుంచో వుంది, బ్రహ్మక్షత్రియ వైశ్యశూద్రులుకాని బ్రహ్మక్షత్రియశూద్రవైశ్యులు కాదుగదా? యిది బలాబలాలనిపట్టి జరిగేమర్యాద. దెబ్బకు దెయ్యం జంకుతుంది కదా? శాస్త్రం కూడా యీలాంటి విషయాలలో పనిచేయదు. జంకుతుంది. యిది విషయాంతరం. పూర్వపు జమీందార్ల మర్యాదలూ వేషభాషలూ యిప్పడు మనం కథలలో చెప్పకోవలసిందే గాని అనుభవంలో కనపడవనేది యిప్పటి ముఖ్యాంశం.

మా గంగాధరరామారావుగారు సర్వవిధాల పూర్వపు తరగతిలో వారు. స్నానము, వారి కేర్పడ్డరీతిని సంధ్య, జపము, తపము, యివన్నీ నెఱవేర్చుకొనేవారు. యే వర్ణస్టుల నెట్లు గౌరవించాలో అట్లే గౌరవించేవారు. కులాభిమానం యెంతవుండాలో అంతా పూర్తిగా వున్నవారు. పండితులయం దెంతవఱకు రాజున కభీమానం వుండాలో అంతా సంపూర్తిగా వున్నవారు. వేయేల, యే విషయ మందున్నూ పూర్వులకు తీసిపోకుండా మన మర్యాదలు లవమున్నూ తగ్గకుండా రాజ్యపరిపాలన చేసినవారని అనుభవజ్ఞలు యిప్పటికిన్నీ చెప్పకుంటారు.

శ్రీవారు రాజ్యానికి వచ్చిన స్వల్పకాలంలోనో, లేక అంతకు పూర్వమో, కొవ్వూరు గోపాలశాస్రులుగారనే షడ్డర్శనీ పారంగతులు కాశీ నుండి దేశానికి దయచేసి గోదావరీతీరమనే కారణంచేత తుట్టతుదరోజుల్లో కొవ్వూరులో మకాం చేశారు. యీ శాస్రుల్లుగారికి షడ్డర్శనాలలో సంపూర్ణ పాండిత్యం ఆలా ఉండగా మంత్ర శాస్త్రంలో మిక్కిలీ పాండిత్యం వున్నట్లు అనేకులవల్ల వినడమే కాకుండా శ్రీ మా గురువరేణ్యులు బ్రహ్మయ్య శాస్రులవారివల్ల కూడా యొక్కువగా విని వున్నాను. యీ శాస్రులవారు నేను యెటింగే కాలానికప్పుడే స్వర్ణతులైనారు. కాని వీరిముఖ్యశిష్యులలో వకరైన శ్రీ అద్దేపల్లి కృష్ణశాస్రుల్లగారిని నేను చాలాసార్లు సందర్శించి వున్నాను. వీరికికూడా మంత్రశాస్త్రంలో యొక్కువ ప్రజ్ఞవుందని సర్వులు చెప్పకోవడం కలదు. గురువుగారి ప్రజ్ఞ యేలాటిదో మంత్రశాస్త్రంలో, శిష్యులు కృష్ణశాస్రుల్లుగారి ప్రజ్ఞకూడా అట్టిదే అని వినికి. గురువుగారి ప్రజ్ఞావిషయం యీ దేశంలోనే కాదు - కాశీలోకూడా చాలా గొప్పగా చెప్పకోవడం నేను స్వయంగా కాశీలోనే వినివున్నాను. వీరి ప్రజ్ఞనుబట్టే వీరికి శ్రీ విజయనగరం సంస్థానంవారు దేవిడీమన్నా చేసినట్లు కూడా మా గురువులు చెప్పఁగా వినివున్నాను.

శ్రీ విజయనగరం ప్రభువు శ్రీ విజయరామగజపతిమహారాజులుంగారు విజయనగరాన్ని సర్వవిధాల కాశీగా మార్చవలెననే వుద్దేశం కలవారని వింటూను. ఆ కారణంచేత ఆ కాశీలో ప్రసిద్దులైన పండితులను రప్పించి తమ సంస్థానంలో వారివారికి తగిన సమ్మానాలేర్పఱచి గౌరవిస్తూండేవారనిన్నీ అందులో యీగోపాలశాస్రుల్లుగా రొకరనిన్నీ యీ శాస్రుల్లుగారియందు ప్రభువు చూపించే గౌరవాతిశయం మిక్కిలీ యొక్కువగా వుండడంచేత తక్కిన పండితులు దాన్ని చూచి సహింపలేకపోయారనిన్నీ ఆకారణంచేత యీ మహావిద్వాంసుcడికి ఆ సంస్థానాన్నుంచి “యేలాగరా? వుద్వాసన చెప్పించడం అని ఆలోచించి ఒక కుట్రపన్ని మహా రాజావారితో యీ విధంగా మనవిచేశారనిన్నీ వినడం. యేలాగంటే “మహాప్రభో! మన గోపాలశాస్రుల్లుగారు యితర శాస్తాలలో నిరుపమానమైన పండితులు సరేగదాండి. వీరు మంత్రశాస్త్రంలో కూడా ప్రత్యక్ష దాఖలా చూపించే పండితులని దేవర విన్నారో లేదో అని మనవిచేసుకుంటూ వున్నాము. యెందుకంటే యీలా మనవిచేసుకోవడం : తమ సెలవైతే ఆలాటి ప్రత్యక్ష దాఖలా వీరు కనుపరుస్తారేమోకాని మాబోంట్లం కోరితే చూపించరు. తమ సన్నిధినివుండి ఆ దాఖల చూద్దామనే కుతూహలంతో యింతగా మనవిచేసుకోవడం" అంటూ శ్రీమహారాజావారితో చాలాసార్లు విజ్ఞాపన చేసుకోంగా చేసుకోంగా, వకరోజున శ్రీవారు శాస్రుల్లు గారిని సగౌరవంగా "శాస్త్రీజీ" అని సంబోధించి "మీమంత్రశాస్త్ర దాఖలా వకపర్యాయం మాకు చూపించాలి" అని కోరేరంట. దానిమీద శాస్రుల్లుగారు “యివి పరీక్షించతగ్గ విషయాలు కావు - నవగోప్యాని కారయేత్ అనే తెగలోవి” అంటూ మనవిచేసుకోవడమైతే జరిగిందిగాని రాజుగారు యేమైనాసరే చూచి తీరాలని పట్టుపట్టినాంరట. “ఆలాగయితే చిత్తం రేపు మా జపం అయేటప్పటికి వక నిమ్మకాయంత బంగారాన్ని నలీ తొలీ లేని ముద్దగా వున్నదాన్ని సిద్ధంచేసి వుంచండి" అని శాస్రుల్లు గారు రాజాగారితో మనవిచేసి ఆజ్ఞ తీసుకుని స్వగృహానికి దయచేశారంట. అయితే శాస్రుల్లుగారు వూరికే ప్రజ్ఞ చూపడమే అనుకున్నారు కాని దీనిలో యేదో పండితులు పన్నిన కుతంత్రం వుందని లేశమున్నూ యెఱగరు. ప్రభువంతకంటే గుర్తించలేదు. ఆ తంత్రం యేమిటో ముందు తేలుతుంది కాబట్టి యిక్కడ విస్తరించేదిలేదు.

అదేరీతిని బంగారం సిద్ధంచేయించారు మహారాజావారు. పండితులందఱితోటి పరివేష్టించంబడి చూస్తూ వున్నారు. ఆ సమయంలో టక్కూ టుక్కూ మంటూ పాంకోళ్ల చప్పడుతో శాస్రుల్లుగారు చిన్న జారీ చెంబు సహితంగా దయచేసి ఆ బంగారు ఘటికమీంద ఆ జారీచెంబులోవున్న వుదకం ప్రోక్షించేటప్పటికి అది రెండుచెక్కలుగా “ఫడేలు" మని శబ్దంయిస్తూ విడిపోయిందంట! దాన్ని చూచేటప్పటికి రాజాగారికి అత్యాశ్చర్యమే కాకుండా మనస్సులో కొంత భయంకూడా కలిగిందంట. పండితులు ఆలోచించిన కుతంత్రము యీలా రాజావారికి భయం కలిగించాలనే. సరే గోపాలశాస్రుల్లుగారు మళ్లా స్వగృహానికి సెలవుపుచ్చుకొని దయచేశారు. పండితులు శాస్రుల్లుగారి ప్రజ్ఞావిశేషాన్ని పొగడుతూ ఉన్నట్లు అభినయిస్తూ రాజావారి మనస్సులోవున్న భయాన్ని మఱింత వృద్ధిచేశారు. మొత్తం రాజావారికి తుట్టతుద కేంతోcచిందంటే: వోహో ఈయన అందఱు పండితుల వంటివారుకారు. యీయన్ని సంస్థానంలో పెట్టుకోవడమంటే పులితో చెలగాటం వంటిది. యెప్పుడేం మనమీద కోపం వస్తుందో : అలా వచ్చేయెడల యినా బంగారు ఘటిక మాదిరిగా మన తలనుకూడా యీయన మంత్రశాస్త్రబలంచేత పగులగొట్టడాని కభ్యంతరం వుండదని నిశ్చయించుకొని, వుపాయంగా సగౌరవంగా వారి మనస్సుకు నొప్పి తగలకుండానే ఈ చిక్కునుండి తప్పించుకోవాలి కనుక, ఫారాలో శాస్తులవారు దర్శనానికి వచ్చినపుడు “మా సెల వైతేనే కాని యీలోగా తాము దయచేయవలసి వుండదు. అవసరమైనప్పడు మేమే కబురుచేస్తా మన్నారు రాజావా రని చెప్పేయేర్పాటు చేశారంట. సరే! జీతం ముడుతూవుంది. ఆలా వత్సరమో, రెండు వత్సరాలో జరిగిపోయాయి. దర్శనం మాత్రమే లేదు. కాని తక్కిన మర్యాదలన్నీ యథాప్రకారంగానే జరుగుతూ వున్నాయి. అప్పటికి శాస్రుల్లగారికి యేలాగో కర్ణాకర్ణికగా తోడి పండితులు చేసిన కుతంత్రంకూడా బోధపడింది. దానితో యింక యీలాటి శత్రుమధ్యంలో యీ వింధ్యభూమిలో వుండడం యెందుకని తోంచి "ప్రభువుల ఆజ్ఞ అయితే మళ్లా కాశీకే వెడతానని మనవి చేయించుకున్నారంట. దాన్ని అంగీకరించి “తాము యొక్కడవున్నా తమకు మా సంస్థానంలో నెలనెలకూ యిచ్చే సమ్మానం పంపిస్తూనే వుంటా” మనిన్నీ “తాము చిరకాలం కాశీ నివాసం చేసే వున్నారు కాబట్టి గోదావరి తీరంలో వుండడం మాకు అభిమత మనిన్నీ కబురుచేశారంట. రాజావారి అభిమతం ప్రకారం గోపాదక్షేత్రమైన కొవ్వూరులో శాస్తుల్లుగారు నిత్య నివాసం యేర్పఱచుకున్నారు. యీ కారణంచేతనే గోపాలశాస్రుల్లుగారి యింటిపేరు కొవ్వూరు వారుగా మారింది. కాని అసలు ఇంటిపేరు ఇదికాదు. ఆపేరు నాకిప్పుడు జ్ఞాపకం వచ్చిందికాదు. వ్రాసే విషయం శ్రీ పిఠాపుర ప్రభువు నాయకమణిగా వుండేది - వ్రాంత విస్తరించి విజయనగరం మహారాజావారిమీదకిన్నీ అక్కడి పండితుల మీందకిన్నీ దొర్లుతూవుంది అనీ చదువరు లనుకుంటారేమో. ప్రస్తుత కథలో శ్రీ పిఠాపుర ప్రభువుతోపాటు యీ గోపాలశాస్రుల్లుగారుకూడా ముఖ్య నాయకులే కావడంచేత వీరిని గురించి కొంత సంగ్రహంగా వ్రాశాననుకోండి. విస్తరించే వ్రాసే యెడల యెంతేనా యీ శాస్రుల్లుగారిని గురించే కాదు - వీరిని సమ్మానించిన శ్రీ విజయనగర ప్రభువును గురించేకాదు - వ్రాయవలసే వుంటుంది. వోపిక వుంటే మటొకప్పుడు ఆ ప్రయత్నం చేసాను.

యీలాగు కారణాంతరాలవల్ల దేవిడీమన్నా అయిన్నీ వారి వంశపారంపర్యాయంగా పోషింపCబడుతూ దర్శనం మాత్రం లేకుండావున్న పండితాఖండలులు మఱికొందఱు విజయనగర సంస్థానానికి సంబంధించిన వారు వున్నారు. వారిలో శ్రీ భాగవతుల హరిశాస్రుల్లుగారు వకరు. వీరు శ్రీ కోటిపల్లెలో నిత్యనివాసంగా వుండేవారు. యిప్పడీ దేశంలో వైయాకరణులంటూ శేషం యేమాత్రమేనా వున్నట్టయితే అది యావత్తున్నూ వీరి విద్యావంశమే అనడంలో లేశమున్నూ అతిశయోక్తి వుండదు. యెనభై సంవత్సరాలకు మించిన వయస్సులో వీరి దర్శనం నేను చేసివున్నాను. వీరున్న సభలో అవధానంకూడా చేయడం తటస్థించింది. ఆ సభలో వీరినిగూర్చి రచించినదే యీ శ్లోకం -

శ్లో. శ్రీమద్భాగవతాన్వయాంబుధి విధూరాజత్కలాపాలకః
పాణిన్యుప్తసుదర్శనశ్చ విబుధారాధ్యాంఫ్రిు యుగ్మాంబుజః
సత్యాసక్తహృదంతరో నిరుపమ శ్చానంతగోవర్ధనః
పాయా దేష హరి ర్యథా సచ హరిస్సర్వాఘ విధ్వంసకః!

ఈ శ్లోకంలో శ్రీకృష్ణునకును హరిశాస్తుల్లుగారికిన్నీ విశేషణాలు సమంగా అన్వయించుకోవాలి. యీలాంటి మహాపండితులు యెందరో వుండే ఆ కాలం యిక మనకు రాదనుకుంటాను. దానికి ముఖ్యకారణం నూటికి ముప్మె అయిదో నలభయ్యో మార్కులతో శిరోమణులూ ఉరోమణులూ బయలుదేరడానికి అవకాశంకూడా యేర్పడ్డది. వెనకటివాళ్ల పాండిత్యాలంటే యేలాటి దీక్షతో సంపాదించుకొన్నవో వక వుదాహరణ మచ్చుకు యిక్కడ చూపిస్తాను, పరిశీలించండి.

ముంగండ కాపురసులు శ్రీ పుల్లెల దక్షిణామూర్తిశాస్రులుగారు కాశీలో శ్రీ జాగేశపండిట్జీ వారివద్ద చిరకాలం విద్యాభ్యాసంచేసి గృహస్థాశ్రమాని కభిముఖులై వస్తూ వస్తూ తోవలో కొన్ని సంస్థానాలలో పాండిత్య ప్రకటనం చేసుకొంటూ మాడుగుల ప్రభువు కృష్ణభూపతి దర్శనానికేమో వెళ్లారంట. అక్కడ భాష్యమంతా సంధ్యావందన ప్రాయంగా కంఠపాఠముగానున్న శ్రీ యింద్రగంటి గోపాలశాస్రుల్లు గారితో వాదంవచ్చి ఎక్కడో వోడు తటస్థించిందనిన్ని దానితో మళ్లా వెనక్కి తిరిగి కాశీ వెళ్లి పదిపండ్రెండు సంవత్సరాలు కృషిచేసి గోపాలశాస్రుల్లు గారిని జయించే తలంపుతో మాడుగుల సంస్థానానికి వచ్చారనిన్నీ అప్పటికి సదరు గోపాలశాస్రుల్లుగారు స్వర్గస్టులవడంచేత "అయ్యో మనకోరిక తీరకపోయెనే” అని దక్షిణామూర్తిశాస్రుల్లుగారు విచారించారనిన్నీ వినికి. ఆయీ కథలవల్ల అప్పటి పాండిత్యాలకున్నూయిప్పటి పాండిత్యాలకున్నూ వుండే తారతమ్యాలు తెలుస్తాయని కొంచెం వుదాహరించాను.

ప్రస్తుతం కథానాయకులలో ఒకరైన గోపాలశాస్రుల్లుగారు చాలా గొప్పవారని విని మన పిఠాపురం రాజావారు వీరికిన్నీసుబ్బత్రయంలో వకరైన శ్రీ తణికెళ్ల సుబ్బన్నశాస్రుల్లు గారికిన్నీ శాస్తార్ధంపెట్టి జయాపజయాలు చూద్దామనే కుతూహలంతో సబహుమానంగా రప్పించారంట. సుబ్బత్రయమంటూ వకమాట వ్రాసివున్నాను. నవద్వీపాన్నుంచి తర్కం చదువుకొని వచ్చినవారిలో ముగ్గురుపండితులు మన తెలుగుదేశపువారు సుబ్బన్న లేక, సుబ్బయ్య అనేపేరుగలవా రుండేవారనిన్నీ యెవరేనా తర్కంలో పేరుతెచ్చుకోవాలంటే యీత్రయాన్ని సందర్శించి వీరిమెప్పను పొందాలనిన్నీ గురువుగారు చెప్పంగా విన్నాను. యీత్రయంలో వకరు తణికెళ్లవారు, రెండు-అక్షతలవారు, మూCడు - యెవరోగాని వారి యింటి పేరు జ్ఞాపకం వచ్చిందికాదు. యీ త్రయంలో వకరు శ్రీగద్వాల సంస్థాన పండితులు అయ్యవారిపల్లెలో కృష్ణాతీరాన్ని వుండేవారు. తక్కిన యిద్దఱున్నూ బహుశః యీ మన కృష్ణాగోదావరీ తీరాలలోనే యేవో గ్రామాల్లో వుండేవారు - నాకు తపిసీలు తెలియదు. యిందులో ప్రస్తుతం గోపాల శాస్రుల్లుగారితో వాదం పెట్టందలచుకొని శ్రీ పిఠాపురంరాజావారు ఆహ్వానించిన సుబ్బన్న శాస్రుల్లుగారి శిష్యులు యించుమించు మా పరమగురువులు చర్ల బ్రహ్మయ్యశాస్రుల వారికి సమకాలికులు. వీరు కిర్లంపూడి సంస్థానమునకు సమీపంలోవున్న ధర్మవరంలో ළී బుచ్చి సీతాయమ్మగారు స్థాపించిన ధర్మపాఠశాలలో వుపాధ్యాయులుగా వుండి యెంతమందినో విద్వాంసులను చేసిన మహావిద్వాలసులు. మావిద్యార్థిదశనాఁటికి యీలాటి పాఠశాలలున్నూ యీ విద్యార్థుల పోషణకుగా యేర్పడ్డ ధర్మసత్రాలున్నూ కొన్ని వుండేవి. చదువుకోవడంవల్ల యేదో సంపాదన మనకు అవుతుందనే వుద్దేశంతో చదువుకునే ವಿದ್ಯಾಲ್ಟಿಲು ವಿನ್ಸಿಲ್ಲ నేను లేశమున్నూ యెఱుగను. చదువుకోవడం మనకు విధి అనే వుద్దేశంతోనే అప్పడు చదువుకొనేవారు. "బ్రాహ్మణేన నిష్కారణో ధర్మష్టడంగో వేదోg_ ధ్యేయో జ్ఞేయశ్చ" అనే శ్రుతికి వుదాహరణంగా వుండేది అప్పటివాళ్ల చదువు. డిగ్రీల లెక్క జ్వరం వచ్చినప్పడుకూడా అప్పడు ತೆನೆತೆಜು. అట్టి స్థితిలో చదువు కెక్కడనుండి వస్తుంది? యీ డిగ్రీలనుగూర్చి నా యిటీవలిచర్యలో కొంత వ్రాసివున్నాను - అందులోనుంచి వకపద్యం వుదాహరిస్తాను. -

తే.గీ. “ఇంగిలీషు"తో పాటుగా నిపుడు సంస్కృ
తమ్మునకుఁగూడ "డిగ్రీల తంపి వచ్చె
నట్లు "ప్యా సగువారలయం దెవండొ
తకం దక్కినవారు శుద్ధజడమతులె.

ఈ "ప్యాసు"లు కూడా చాలా తంత్రాలతో చేరివుంటాయి. అవన్నీ యిక్కడ యెత్తుకుంటే తేలదు. నూటికి ముప్బెయయిదో నలభై యో మార్కులు తెచ్చుకున్నారే అనుకుందాం. మిగిలిన మార్కు లెవరు తెచ్చియిస్తారు. అందుచేతేకాCబోలు శ్రీ కసూరి శివశంకరశాస్రుల్లుగారు "హైయస్టు" నూఱుమార్ములైతే కొందఱికి నూటపదిదాంకా వేయడం వుండేదంట! శివశంకరశాస్రుల్లగారంటే సామాన్యులుకారు. పుల్లెల దక్షిణామూర్తి శాస్రుల్లుగారుకూడా వీరివద్ద అంతోయింతో పుస్తకం పట్టినట్లు వింటాను. ఆర్డు కాలేజీలో o శ్రీ కం|| వీరేశలింగంపంతులవారు తెలుంగు పండితులుగా వుండే రోజుల్లో వీరు అక్కడ సంస్కృత పండితులు. "హైయస్టు" కన్న అధికంగా వేశారేమని అడిగితే విద్యార్థి అంత అనుకూలంగా వ్రాశాండు కాబట్టి ఆలా వేశాను పొమ్మని “ప్రినిసిపాల్ గారికి జవాబు చెప్పేవారంట. యీ శివశంకరశాస్రుల్లుగా రేమి, బందరులో శ్రీ కోరాడ రామచంద్రశాస్రుల్లు గారేమి, యింకా మణికొందఱు పండితులేమి పై అధికార్లకు జంకుతూ వుపాధ్యాయత్వం చేసినవారు కారని యెడింగినవారు యిప్పటికిన్నీ చాలామంది వున్నారు కాCబట్టి విస్తరించేది ෂීඨ. చెప్పొచ్చే మాటేమిటంటే; నిజమయిన పాండిత్యము నూటికి నూటపదులు మార్కులు తెచ్చుకొన్నదేగాని ముప్బె అయిదూ, నలభయ్యీ తెచ్చుకొన్నది కాదనిన్నీ యిప్పుడు ముచ్చటించుకొనే కథలో పండితులు నూటికి నూటపదిమాత్రమేకాక నూటపదహార్ల తరగతిలో వారనిన్నీ ఆలాటిపండితులు శాస్రార్థం చేస్తూవుంటే విని సంతోషించడానికితగ్గ శ్రుతపాండిత్యం మా పిఠాపురం లేటు రాజావారికి వుండేదనిన్నీ తెల్పడానికే యీ వ్యాసం నేను వ్రాయడానికారణం.

ప్రస్తుతం శ్రీ రాజావారు గోపాలశాస్రుల్లుగారికిన్నీ సుబ్బన్న శాస్రుల్లు గారికిన్నీ ముఖాముఖీని వాదం పెట్టి విని ఆనందించందలంచుకున్నారు. వీరిద్దటి మధ్యనూ జయాపజయాలు నిర్ణయింపదగ్గ పండితులు మూcడోవారు కూడా వుండాలికదా? వారెవరంటె; మండపేట కాపురస్టులు હૈં యొడవల్లి చంద్రశేఖర భట్టాచార్లుగారో, లేక వీరికుమాళ్లు జానకిరామ శాస్తుల్లుగారో అని గురువుగారు చెప్పారు. వీరుకూడా కాశీపండితులే. యిక రేపోయెల్లుండో శాస్తార్థపుసభ జరుగుతుందనంగా సుబ్బన్న శాస్రుల్లుగారు శ్రీ రాజావారితో "మహాప్రభూ? నాతోటి తర్కంలో పూర్వపక్షసిద్ధాంతాలు చేశేవారు యీ దేశంలో మాత్రయంలో తప్ప మటొక్కరులేరు. యిది చెప్పక తప్పనివిధిచే మనవి చేసుకుంటున్నాను. కాCబట్టి ఆత్మస్తవంగా తాము అభిప్రాయపడకూడదు. గోపాల శాస్రుల్లుగారు ఆఱుశాస్రాల్లో పండితులు. నేను ఒక్క తర్కంలో మాత్రమే పండితుణ్ణి. నాకున్నూ ఆయనకిన్నీ ఈ తర్కంలో ఏతం పెట్టుగా వుంటుంది. పోనీ దేవరవారి వినోదానికి అంగీకరించి కూచుందామంటే; గోపాలశాస్రుల్లుగారు ఆఱు శాస్తాలలో పాండిత్యం అలావుండంగా మంత్రశాస్త్రంలో అఖండులు. వోడు వచ్చిందంటే ఆయన వూరుకోరు. కాబట్టి మనవి చేసుకున్నాను" అనేటప్పటికి రాజావారు “అలాటిభయం మీరు లేశమున్నూ పడనక్కఱలేదు. ෆුධි వినోదార్థం జరిగే సభగాని మఱివక మోస్తరుదికాదు. ఈ విషయమై వారితో మేము మాట్లాడుతాము. తాము లేశమున్నూ జంకవలసిందిలే దంటూ ధైర్యం చెప్పారంట. కాని ఎంత ధైర్యం చెప్పినా సదరు గోపాల శాస్తుల్లుగారి మంత్రశాస్త్ర పాండిత్యం సుబ్బన్నశాస్రులుగారికి వినికివల్ల పూర్తిగా తెలిసివుండడంచేత గుండెలు తటతట \ కొట్టుకోవడం మాత్రం మానలేదు. అయితే వాదం మానుకోరాదా?" అంటే : కారణాంతరం చేత మానుకున్నప్పటికీ అసలు పాండిత్యంలోనే లోటుండి మానుకున్నట్టు లోకం భావిస్తుందికదా? అందుచేత - “యశోవామృత్యుర్వా' అని అంగీకరించక తప్పిందికాదు. పైగా రాజావారు సెలవిచ్చారంట : "ఏదేనా మీకు చిక్కే తటస్థించే యెడల తరతరాల వఱకున్నూ మీకుటుంబాన్ని పోషించేభారం మా మీంద వుందనుకోండి" అన్నారట. అయితే రాజావారికి మంత్రశాస్త్రంలో పూర్తిగా నమ్మకం వున్నప్పటికీ "గోపాలశాస్రుల్లుగారి వల్ల సుబ్బన్న శాస్తుల్లుగారికి అపకారం జరుగుతుందని మాత్రం లేశమున్నూ అనుమానం లేదనుకోవాలి మనం. అనుమానమేవుంటే; వారికీ వీరికీ వాదం పెట్టకుండానే వుండేవారేమో. రాజావారికి మంత్ర శాస్త్రంలో పూర్తిగా నమ్మకం వుందనుకోవడానికి శ్రీయింగు రామస్వామిశాస్రుల్లగారికి మా గ్రామ సమీపంలో జేగురుపాడు గ్రామంలో యిచ్చిన పధ్నాలుగుపుట్ల భూదానమే, అనంగా నూట పండ్రెండు ఎకరాలే సాక్ష్యమిస్తాయి. ઉ9 ટૂંઝ૦30 యిప్పటికిన్నీ వారికి అవ్యాహతంగా జరుగుతూ వుంది. ఆ భూదానం యెందుకు జరిగిందో వ్రాస్తే చాలా పెరుగుతుంది.

ఇంకొకటికూడా సాక్షాతూగాక పరంపరగా సాక్ష్యమిచ్చేది యీలాంటి భూదానమే వుంది. విజయనగరపు సంస్థానంలో అంతఃపురం లోనే అనుకుంటాను. వకగ్రహం కామినీతరగతికి చెందినది పట్టుకొని పీడిస్తూవుందంట. యిక్కడకూడా కొంచెం వ్రాయాలి, మనకు విద్యలో స్కూలుఫైనలు వగయిరా తరగతులలాగే గ్రహాలకికూడా తరగతులున్నాయి. & గ్రహాలలో “కామినీ" తరగతికి చెందినదంటే చాలా గడ్డు. పురుష గ్రహాల్లో “బ్రహ్మరక్షస్సు" గడ్డు. యీ గ్రహాలు యేలాటి మంత్రశాస్త్ర వేత్తలకున్నూ లొంగవు. వాట్లకు యేదో యితరజన్మం రావడానికి తగ్గంత తపస్సు ధారపోస్తే వదిలిపోతాయని వినడం. సామాన్యగ్రహాలు చేసే చేష్టలకన్నయీ కామినీగ్రహాలుచేసే చేష్టలు అద్భుతంగావుంటాయి. యేమనిషిని యీ కామినీ పట్టుకుంటుందో ఆ మనిషిని తీసుకుపోయి అడివిలోవుండే అతి గహనమైన వెదురుడొంకలు వగయిరా గహనప్రదేశాలలో పెట్టడం కూడా తటస్థించడం చెప్పంగా విన్నాను. ఇంతదాంకా కాదుగాని, వక కామినీగ్రహం చేసేచేష్టలు ముప్పదియేండ్లకు పూర్వం నేనున్నూ కళ్లారా చూచివున్నాను. ప్రస్తుతం వినండి. ఆ గ్రహాన్ని వదల్చడానికి కొదవేమిటి? “రాజు తలచుకుంటే యేంలోపం కనక పెద్దపెద్ద మంత్రగాళ్లంతావచ్చారు. కొందఱు గ్రహంచేత చెంపకాయలు తినడం కూడా తటస్థించింది. మహారాజావారికి యేమీ తోcచడంలేదు. అట్టిస్థితిలో ఆగ్రహానికే యెంతోcచిందో?... “రాజా! యీలాచూడు" మని పిల్చి, “యీమంత్రగాళ్లు నన్ను వదిల్పించ లేరు గాని నీకో వుపాయం చెపుతాను. అలా చేయంగలవా?" అందంట. చెప్పవలసిందన్నారంట రాజాగారు, “అయితే విను. శ్రీ అజ్ఞాడ అన్నంభౌట్లుగారు వకరోజరాత్రి రెండు జాములవేళ వక మాలవాడికిచేసిన అన్నదానఫలితాన్ని నీవు ధారపోయిస్తే నాకు దానివల్ల మంచిజన్మ వస్తుంది. తద్వారాగా నాబాధ మీకు తప్పతుంది. అని చెప్పిందంట. అప్పుడు ఆ ప్రభువు అజ్జాడ అగ్రహారం తమ సంస్థానంలోదే కనక, ఆ అన్నంభోట్లుగారిని సగౌరవంగా ఆహ్వానించి “అయ్యా తమవల్ల మాకీవుపకారం కావా" లంటూ ప్రార్ధించారంట. దానిమీంద "అయ్యా నేను నా కర్తవ్యాన్ని నెఱవేర్చుకున్నానేకాని దాన్ని మళ్లా వకరికివిక్రయించే తలంపుతో గాని దానంచేసే తలంపుతోంగాని చేయలేదన్నారట. రాజావారు మిక్కిలిదీనంగా ప్రార్థించారంట. దానిమీంద యేమీ ప్రతి చెప్పలేక ఆ పుణ్యాన్ని ధారపోశారంట. అంతతో ఆ బాధ నివర్తించిందట.

అయితే రాత్రి రెండుజాములవేళ వక మాలవాడికి పెట్టిన పుణ్యానికి అంతవిలువ యెందువల్ల కలిగిందో కొంత వ్యాఖ్యానం చేయాలి. తూర్పున కొండయేళ్లు చాలావుంటాయి. అవి వర్షాకాలంలో అంతల్లో ప్రపంచమంతా ముంచేటట్టు పొంగడమున్నూ మళ్లా వెంటనే కుంగడమున్నూ అందఱూ యెఱిఁగిందే. ఆలా పొంగే సమయంలో యేదో వూరినుంచి ఒక మాలవాండు అజ్ఞాడమార్గంగా వస్తూ వక తిప్పలో చిక్కుకున్నాండు. క్రమంగా తిప్ప మునిగింది. వీడుకూడా మునిఁగిపోయే అవస్థ వచ్చింది. రెండుజాములరాత్రి అయింది. అంతా పరుండి నిద్రపోయేవేళ కనక “మొట్టోచస్తున్నాను. ఆకలికూడా బాధిస్తూవుంది బాబో" అంటూ గట్టిగా ఆ తిప్పలోనుంచి అఱచాండు. మేడమీద పరున్న నిరతాన్న ప్రదాత అన్నంభోట్లుగారు విన్నారు. ఆపట్టాన్ని లేచి సుమారు శేరుంబావు బియ్యం అన్నమున్ను ఆవకాయముక్క వగైరా రసవర్గాలున్నూ మునకాల కఱ్ఱ లావు.వి రెండు పొగచుట్టలున్నూ అవి కాల్చుకోవడానికి వక యెండుగడ్డితో చుట్టి నిప్పంటించిన లావాటి తూట కట్టానున్నూ పట్టుకొని, ప్రామ్లమీస్తాన్ని తైగ్రేస్తూవున్న ఆ కొండకాలువను తెప్పమీంద అడిచినుక్తూప్రొడ్రిచిస్తుకుగా వున్న వానలో యీCదుకొని మళ్లా మాలాడిని ముట్టుకోకుండానే యీవలివొడ్డు చేర్చడానికి తోవాసం యింకో తెప్పకూడా తెప్పకి తగుల్చుకొని తిప్పమీదకి వెళ్లి, సుష్టకృత్తుగా అంటే తృప్తాస్థగా వాడికి భోజనంపెట్టి, చుట్టకాల్చుకున్నాక వాడిసహితంగా యీవలివడ్డుకు వచ్చి చేరారంట. ఆ మహానుభావుండు యెన్ని వేలమందికో అన్నదానం చేసినప్పటికీ ఆనాటికి హరిజనుండికి చేసిన అన్నదానం ఆ కామినీగ్రహానికి గణనీయం అయింది. ఆలోచిస్తే బ్రాహ్మణులు కులాచారాలు చెడకుండానే మాలమాదిగల యెడలకూడా యేలాటి దయాదాక్షిణ్యాలు చూపించేవారో యీ మహాపురుషుని చరిత్ర వేనోళ్ల సాక్ష్యమిస్తుంది. అంతేకాని యెవరో తండ్రి ఆబ్లీకంనాండు ఇద్దఱు హరిజనులను భోక్తలుగాపెట్టి లేవనెత్తారనిన్నీ యేమో చేశారనిన్నీ చెప్పేమాటలు బొత్తిగా విరుద్ధాలవడంచేత దయాదాక్షిణ్యాలలోకి చేరవు సరిగదా అవ్యక్తపుపనులలో చేరతాయి కూడాను. యివి "చక్కని రాజామార్గాలుండగా సందులుదూరడం” వంటివి. యూ మహాపురుషుణ్ణిగూర్చి యీ రెండక్షరాలున్నూ వ్రాయడం వల్ల నా జన్మ తరించిందని నేను సంతోషిస్తూవున్నాను.

యిప్పడుకూడా యిలాంటి అన్నదాతలు మాజిల్లాలో సకృత్తుగా వున్నారు. మా బంధుకోటిలో మంచి పండితులు శ్రీ నృసింహదేవర పేరు శాస్రుల్లుగారినిగూర్చి పలువురు యీలాగే చెప్పకుంటారు. యీయనవయస్సిప్పడు డెబ్భైకి పైమాట. యిట్టి వార్ధక్యంలో ఆకాలాన్ని అనంగా రాత్రి యే రెండుజాములవేళో వచ్చిన యేనిమ్నజాతికేనాసరే వకళ్లని శ్రమపెట్టడం యెందుకని యింటోవాళ్లని లేపక తామే స్వయంగా వండికూడా భోజనం పెడతారని వినికి. కొడుకులూ కోడళూ మనుషులూ బోలెండు బలగంతో యీ పుణ్యపురుషుండు ధర్మపత్నీ సహితంగా ఆలమూరులో యీ దీర్ఘసత్రాన్ని జరుపుతూవున్నారు. మన పూర్వపు ధర్మాల పద్ధతి యిది. ఇప్పటి పద్ధతి యింకోమాదిరిగా వుంటుంది. కాని నవీన పద్ధతిలోకూడా కొన్ని గౌరవించతగ్గవి లేకపోవు. కాని యీ ధర్మవ్యవస్థ తెలుసుకోవడం చాలా కష్టం భారతంలో యెల్దన్నగారు వక పద్యాన్ని వ్రాశారు.

క. ఈలోకము యగుంగొందఱ
కాలోకము కొందఱకు, నిహమ్మను బరమున్
మేలగు గొందఱ, కధిపా!
యేలోకము లేదుసూవె? యిలగొందఱకున్.

మన పూర్వులలో ప్రాజ్ఞల ధర్మాధర్మాలు సర్వమున్నూ ఈ పద్యార్థంలో యిమిడి వున్నాయి.

విషయం విషయాంతరంలోదిగి అంతరిస్తూవుంది. యీ అజ్జాడ అన్నంభౌట్లుగారి యశస్సునువిని మారాజావారు పిలిపించి వారిని బలవంతపఱచి పిఠాపురం యెస్టేటులో మల్లవరం చెఱువు క్రింద మంచిభూమిని, - యెన్నియకరాలో చెప్పంజాలను, విస్తారమే వుంటుంది - పరిగ్రహింప చేశారు. నాకు కూడా ఆ చెఱువుకుసంబంధించిన భూమి మంచిదయితే కాదుగాని వూషరక్షేత్రం వుండడంచేత వీరి భూమినిగూర్చి కొంత నాకు తెలుసును. వారి కుటుంబంవారికి యింకా ఆ భూమి జరుగుతూనేవుందని విన్నాను. ఆ కాలానికింకా - “యీడిగముత్తికి జోడు శాలువలిస్తి" అనే మాదిరి దానాలు ప్రారంభం కానేలేదు కనుక మా రాజావారు చేశారంటే చేసిందల్లా పాత్రదానంలోకే చేరడం తటస్థించింది. యీ రాజావారి యింకొకదానాన్ని గూర్చి వ్రాసి ప్రధానాంశానికి వస్తాను.

పిఠాపురానికి సమీపంలో, గోరస, కొమరగిరి, అని రెండు గ్రామాలున్నాయి. ఆ గ్రామాల్లోవకదానిలో మదూరి దీక్షితులుగారనేవారు వేదాధ్యయనపరులు, నిరతాన్నదాతలు, నప్రతిగ్రహీతలు వకరు వుండేవారు. వారు చాలావృద్దులైవున్నప్పుడు మా గురువుగారితో వెళ్లేరోజులలో వారి దర్శనం నేనుకూడా చేసివున్నాను. సదరు దీక్షితులవారి యోగ్యతను శ్రీరాజావారు కూడా విని వారిని ఆహ్వానించి సమ్మానించాలని అనుకోవడం శ్రీ రాజావారి ఆంతరంగిక స్నేహితులని యిదివఱలో మొదటి వ్యాసంలో వ్రాసిన శ్రీపొక్కునూరి వేంకటశాస్రుల్లుగారు విని వుండడం చేత దీక్షితులవా రేదో పనిమీద పిఠాపురం వచ్చినప్పుడు రాజావారి దర్శనానికి వెంటఁబెట్టుకొని వెళ్లారట. అప్పుడు శ్రీవారు స్నానగృహంలో వున్నారట. యీ వ్రాయంబోయే సంగతులలో నిజమెంతో, లోకులకల్పితమెంతో - బాల్యంలో నేను యేలావిన్నానో ఆలాగే వ్రాస్తాను. మధ్య సంగతి సందర్భాలమాట యేలావున్నప్పటికీ ప్రధానాంశంమాత్రం నిజం. దీక్షితులవారు రాజావారి సన్నిధికి వెళ్లేటప్పటికి, రాజావారేమో స్నానానికి ప్రారంభించారనిన్నీ వేంకట శాస్రుల్లుగారికి వుండే చనువు సర్వసామాన్యమయింది కాకపోవడాన్నిబట్టి 《원9 స్నానగృహం ੱਤੰ వెళ్లి ప్రభువుతో సంస్కృత భాషతో - “దీక్షితాస్తావత్ ఆగతా వర్తంతే, తేషాందర్శన మవశ్యం దాతవ్యమ్" అని పొక్కునూరి శాస్రుల్లుగారు మనవి చేశారనిన్నీ దానిమీంద “ఇదానీమేవవా?" అని రాజావారు చిఱునవ్వుతో సెలవిచ్చారనిన్నీ వేంకట శాస్రుల్లుగారు "ఇదా నీమేవ దాతవ్యం, నచేత్కాలాంతరేతే సమాగచ్ఛంతివా నవేతిసందేహః" అన్నారనిన్నీ వినడం. పిమ్మట శ్రీవారు కొంత తడిసి తడియని కట్టుబట్టతోనే సదరు దీక్షితులవారికి దర్శనమిచ్చి యేవో రెండు మూడు మాటలు మాటలాడి ఆదరించి అప్పుడే వాచాయిచ్చినభూమి యిప్పడేమి వసూలౌతుందో తెలియదుగాని అప్పడు మాత్రం సాలువకంటికి ఆఱువందల రూపాయలు వచ్చేదిగా వుండేదని చెప్పడం నేను యెఱిఁగిందే. ఆ యీ సందర్భంవల్ల ఆ రాజావారి కృతయుగ దాతృత్వం వెల్లడికావడమే కాకుండా ఆ ప్రభువు దాతృత్వానికి సమయాసమయా లక్కఱలేదనీ కూడా తెలిపినట్లవుతుంది. మటిన్నీ శ్రీ రాజావారంటే యితరులకే కాని పండితులకు భయపడవలసి వుండేది కాదేమోనని పై గాథలవల్ల చదువరు లభిప్రాయపడతారేమో. వక్కపొక్కునూరి వేంకటశాస్రులుగారికి తప్ప ఇతర పండితుల కెవరికిన్నీ ఇట్టిచనువు లేదు. యీయన శ్రీ రాజావారికి సతీర్డులో సహాధ్యాయులో అయియుండడంచేత ఇంతచనువు కలిగివున్నట్లు వెనుకటివ్యాసంలో వ్రాసేవున్నాను. శ్రీ పిఠాపురపు పూర్వ ప్రభువంటే - “తస్మాద్రాజముఖం భీష్మం భావుకమ్” అనే శ్రుతికి ప్రథమోదాహరణమని పలువురు పండితులు చెప్పగా వినివున్నాను. యిందుకు చిన్న యితిహాసం వుదాహరిస్తాను.

మాజిల్లాలో మా గురువుగారి కారులో వుండే పండితులలో, మార్కొండపాడు చతుష్టయం, ర్యాలిషట్కం, లేక బొమ్మగంటిషట్కం, అంటూ కుటుంబపండితులు వుండేవారు. మొదటివారు నలుగురు సోదరులున్నూ వ్యాకరణపండితులే అవడంచేత వారి కాపేరు వచ్చింది. రెండో వారు ఆరురున్నూ వకటేశాస్త్రమందు కాకపోయినా మొత్తం భిన్న శాస్త్రాలలోనేనా పండితులే అవడంచేత ఆ సోదరులకు ఆపేరు వచ్చింది. వకరి నివాసం మార్కొండపాడు, రెండోవారి నివాసం ర్యాలి, యిప్పటికిన్నీ యీ కుటుంబ పండితులలో కొందఱు శేషించి ఉన్నారు. వంశంలోకూడా కుటుంబవిద్యను వదలకుండా చదువుకున్నవారేకాక ఉపాధ్యాయత్వాన్నిచేస్తూ పూర్వులపేరు నిలుపుతూవున్న వారున్నూ వున్నారు. యిందులో మార్కొండపాటి చతుషం వార్షికం నిమిత్తం శ్రీరాజావారి దర్శనార్థం వెళ్లారట. మనవిచేయించుకున్న మీందటదర్శనం అయింది. సగౌరవంగా కూర్చోపెట్టడం జరిగినతరువాత రాజావారు నవుకరుతో “వొరే అక్కడ పదునైనచాకువుంది పట్టుకురా. పండితులు వచ్చారు" అన్నారంట. దానితో “మనలో యెవరేమి లోపంచేసినట్లు శ్రీవారి నోటీసులోకి యెవరిద్వారా వెళ్లిందో యీవాళ మనకు యేదో అవమానం జరుగుతుంది కాబోలును" అని మిక్కిలిగా భయపడ్డారంట. అదంతా రాజావారుచూచి కొంతసేపు తూష్ట్రీభావంగా గంభీరంగా వుండి మళ్లా నవకరినిపిల్చి మామిడిపళ్లు తీసుకు రమ్మన్నారంట. ఆ మాట వినడంతోనే పండితుల ప్రాణాలు కుదుటబడ్డాయట. “బ్రతుకుజీవుండా" అనుకుంటూ గుప్పెట్లో పెట్టుకున్నప్రాణాలను గుండెల్లోకి చేర్చుకుంటూ వుండంగా ప్రభువు స్వయంగా ఆ మామిడిపళ్లు కోసి “పుచ్చుకోండి" అని సెలవిచ్చారంట. అప్పటిపండితులు యిప్పటి కొందఱు పండితుల్లాగా కవులలాగా - పండ్లే అనుకోండి (కాఫీ గీఫీ ఉప్మాగిప్మాలు కావే అనుకోండి) - యేబట్టలతోం బడితే ఆ బట్టలతోడి యొక్కడCబడితే అక్కడ పుచ్చుకునే ఆచారంలేదు. యిప్పడో? పెద్ద కర్మనిషులమనిన్నీ వైదిక సంప్రదాయం వారమనిన్నీ పైCగాయితరులు అనాచారంగా వుంటారనిన్నీ చెపుతూ ఆక్షేపిస్తూవుండేవారు సైతం యొక్కడCబడితే అక్కడ కూర్చుని కాఫీ పానంచేయడం నేను స్వయంగా చూచివున్నాను. అప్పటికిన్నీ యిప్పటికిన్నీ చాలా భేదం వుంది. యింతదాంకా యెందుకు? యజ్ఞానికి శ్రాతులంటూ వస్తారు. సోమపానం మాట దేవుండెఱుంగునుగాని ఆ శ్రాతులు వుదయ మయ్యేటప్పటికల్లా కాఫీపానం లేకుంటే బ్రతుకలేనివారే నూటికి తొంభై తొమ్మండుగురు. మా చిన్నతనంనాంటికిన్నీ యిప్పటికిన్నీ మాబోటి అనాచారులమాట అల్లావుండంగా సదాచారులవైఖరి యెంతో మాటింది. కప్పగంతుల రామశాస్రుల్లుగారు తాంబూలం వేసుకోవడంకూడా మడిగట్టుకొనే వేసుకొనేవారు యిది నేను స్వయంగా చూచినదే. మళ్లా ఆయన శుద్ధ చ్ఛాందసులేమో అనుకుంటే - పెద్ద పండితులవడం అట్లా వుండంగా అఖండ లౌకికులు. వీరిప్పడు సజీవులే. యిప్పడుకూడా విత్తనాలు నిల్వచేసినట్లు భగవంతుఁడు అక్కడక్కడ పైమాదిరివారిని దాంచికొనివున్నాడు. పెద్దవిద్వాంసుడు గాని, కర్మిష్ఠిగాని కాఁడుగాని మా పెద్ద వియ్యంకుడు అంటే మా పెద్ద చిరంజీవిమామగారు పైని వుదాహరించిన రామశాస్రుల్లుగారితో పాటు తాంబూల చర్వణాదులు జరుపుకోవడమే కాకుండా పగలు నిదుర పోవడంకూడా మడిగట్టుకునే పోతూవుంటాండు. ఆహార విషయంలో యితరశాఖలకన్న వైష్ణవులలో చాలా కట్టుబాటువుంది. తక్కిన సదాచారాలు వారిలో చాలా మృగ్యం అంటే తప్పలేదు. దీనిక్కారణం నిజాందేశం తిరిగేటప్పుడు గోచరమయింది. ఆదేశంలో దృష్టిదోషం బొత్తిగాలేదు. రాజసంస్థానాలలో సంతర్పణలు జరుగుతూన్నప్పడు రాజుగారుగాని, రాజబంధువులుగాని విస్తళ్లువేసే పర్యంతమున్నూ పంక్తులలోనే తిరుగుతూ వుంటారు. వడ్డన అయ్యే సమయానికి అక్కడ నుంచి తప్పకుంటారుగాని యెదురుగుండా వుండి "యేమండోయి మీరింకో రెండు లడూలు వేసుకోండి" అంటూ హెచ్చరిస్తూ వుంటారు. వైష్ణవులీ కారణంచేతే కాcబోలు తెరవేసుకోవడం మొదలెట్టారని ననుకున్నాను. ఆ దేశంలో మేము వంటచేసుకుంటూ వుండంగా వక శూద్ర స్త్రీ ఆ చోటికే వచ్చింది. యిదేం కర్మం, వంట చేసుకునేచోటికి వచ్చావంటే జవాబు చెప్పిందికదా : "యేమయ్యోయి! నీవేమేనా శ్రీవైష్ణవుండవా? రాకపోవడాని"కంది. కథ కంచికే వెడుతూ వున్నట్లుంది ప్రస్తుతానికి వస్తాను. రాజావారు మామిడి పండ్లు కోసి తినమంటే తినకపోతే ఆ చాకుతో యేం మర్యాద చేస్తారో కదా అని భయం. పోనీ తినేసివేద్దామంటే తీరా తిన్న తర్వాత “ఏం బ్రాహ్మలయ్యా? యొక్కడపడితే అక్కడే తింటారా?" అని ప్రశ్నిస్తే యేం జవాబు చెప్పేదిరా భగవంతుడా అని సందేహమాయె. సేయ ముభయతః పాశారజః" తుట్టతుదకు రాజావారి వార్షికంతో ఫలహారాన్ని కూడా స్వీకరించి యేలాగో యీవలపడి తల తడివి చూచుకున్నామంటూ మా గురువుగారు బ్రహ్మయ్యశాస్రుల వారితో ఆ పండితులే చెప్పేటప్పుడు విన్నాను. యీ చెప్పడంలో యే స్వల్పమో కల్పితం వుంటే వుందేమోకాని అసలు తమామున్నూ కల్పితంకాదు. ఆ రాజావారి లక్షణం కాళిదాసుగారు వర్ణించినట్లు “అధృష్యశ్చాభిగమ్యశ్చ" అనే తరగతిలో వుంటుంది. కాని అభిగమ్యత్వంకన్న అధృష్యత్వమే ప్రధానం. వీరి సన్నిధానంలో వక్కపొక్కునూరి వేంకటశాస్రుల్లుగారు వినాగా నిర్భయంగా మాట్లాడినవారే లేరని నా వినికి.

దండిభట్ల విశ్వనాథశాస్రుల్లుగారు వీరి దర్శనానికి వెళ్లినప్పడొక చిత్రం జరిగిందట. రాజావారికి సంస్కృతంలో మంచి శ్రుతపాండిత్యం వుందని యిదివఱకే వ్రాసివున్నాను. అందుచేత రాజావారు యేలాటి పండితులు దర్శనానికి వచ్చినా వారితో సంస్కృతభాషతోనే మాట్లాడే ఆచారం. ఆ ఆచారాన్ని బట్టి సదరు విశ్వనాథ శాస్రుల్లుగారితోకూడా సంస్కృతాన్నే ప్రసంగించడానికి ఆరంభించేటప్పటికి ఆ తృణీకృత బ్రహ్మపురందరుఁడన్నాండంట : 'రాజా, నీవు తెలుఁగులో మాట్లాడితేతప్ప, నీ రాజ్యమంతా నాకు తలకట్టినా నేనిక్కడ నిమిషమేనా వుండేదిలే దన్నాండcట! దానికి రాజావారు లేశమున్నూ కోపగించుకోక అలాగే అంగీకరించి వారిని సమ్మానించి పంపించారని వినికి. విశ్వనాథశాస్రుల్లుగారి చర్యలు యీ రాజావారి చర్యలవలెనే అత్యద్భుతంగా వుంటాయి.

గీ. రాజులచరిత్రలును కవిరాజచరితములును
గ్రంథమ్మలకు వన్నెగలుగఁజేయు;
నందులో నామనమ్మన కరసిచూడ
కవులకతలకు రాజులకతలు లొచ్చు.

సంస్కృతం మాటలాడడమంటే సామాన్యంగాదు. అబ్బో.! దానిలో యెన్నో చిక్కులున్నాయి. ముఖ్యంగా కారకవిషయం. అంటే ఆయా విభక్తులు వాడడం కొంతకష్టం. సమాసవిషయంకూడా కష్టంలోదే. సమాసాంత ప్రత్యయాలవల్ల కలిగే మార్పులు చాలావుంటాయి. అన్నిటి కన్నా ధాతువులు వాడడంలో చిక్కులు చాలా వున్నాయి. సేట్టులనిన్నీ అనిట్టులనిన్నీ వుంటాయి. ఆ భేదంలో వకప్పడు మహామహా పండితులే తప్పటడుగులు వేస్తారు. ఆత్మనేపదమంటే పరస్మైపదమంటే అలావుండCగా ఉభయ పదులైన ధాతువులుకొన్ని వున్నాయి. వీట్లని వాడడానికి లక్షణప్రవర్తకులు కొన్ని నియమా లేర్పఱచివున్నారు. ఆ నియమాలు కాళిదాసాది మహాకవులే పాటింపలేక పోయారు. ఆయీ విషయమైన రహస్యాలు బాగా తెలియక యిప్పడు కొందఱు వృథాగా కొందరిని ఆక్షేపించడం అలావుండగా అంతో ఇంతో ఈ రహస్యం యెరిగిన వాళ్లు దీని సందర్భం ఇట్టిదని వక్కాణిస్తే దాన్ని విశ్వసించకపోవడం అట్లావుండగా పైంగా వక్కాణించిన వాళ్లకేమీ తెలియనట్లున్నూ, తమకేమో తెలిసినట్లున్నూ అపహాస్యంచేస్తూ వ్రాయడానికారంభిస్తారు. ఆ యీవిషయం “కాలీన శబ్దాన్ని గూర్చి వ్రాసేసందర్భంలో అన్యత్ర వ్రాసివున్నాను. కాCబట్టి యిక్కడ యెత్తేదిలేదు. -

రాజావారు సంస్కృతం మాట్లాడుతూవుంటే యేవో లోపాలున్నాయని కదా విశ్వనాథశాస్రుల్లుగారు వద్దని నిషేధించింది? రాజుగారివలె కాకపోయినా ఇతర పండితులకు కూడా సంస్కృతంలో త్వరగా సంభాషించే సందర్భంలో కొన్ని లోపాలు ఉండి తీరతాయి. యీ సంస్కృతాన్ని మెయిల్టైనులాగ నడిపించిందల్లా యేలేశ్వరపు నరసింహ శాస్రులుగారు మాత్రమే. అయితే వీరి ధోరణిలో దోషాలుండేవికావా అంటారేమో? ఇలాటి శంకకు శ్రీహరిశాస్రుల్లుగారేం ᏋBöᏇᏈᏋᏇᏇ చెప్పేరంటే: ఆ మహా ధోరణిలో యొక్కడో మనం శంకిద్దామని గొంతుక సవరించుకునేటప్పటికి ఆయనకు కొన్ని వందలో వేలో మాటలు నడిచిపోతాయి. కాCబట్టి ఆ ధోరణికి అడ్డు తగలడం శుద్ధ తెలివితక్కువ అని జవాబు చెప్పారంట. శ్రీబులుసు పాపయ్యశాస్తులవారి ప్రథమపుత్రులు - "పుత్రాదిచ్ఛేత్పరాజయం" అన్న సూక్తిని తండ్రిగారియందు సమన్వయింపఁజేసిన మహా విద్వాంసులు. ఆ నరసింహశాస్రుల్లుగారిలాగ మాట్లాడడాన్ని కొంతవఱ కభ్యసించినట్లు వింటాను. కాని కృతకృత్యులయినట్లు వినలేదు. దీన్ని యిక్కడికి ఆపుదాం. కథ కాదంబరిలాగున్నూ దశకుమారచరిత్రలాగున్నూ అగమ్యగోచరప్పంథలో పడుతూవుంది. యొక్కడికి తీసుకువెళ్లి అసలు ప్రధానాంశానిక్కలిపితే బాగుంటుందో మళ్లా వెనుకనుంచి చదువుకుంటేనే కాని నాకే అవగత మయ్యేటట్టులేదు. ఇంక యీ పిచ్చి వ్రాంత చదువరుల నేమి రంజింపC జేస్తుందో కదా! కానివ్వండి. రాజావారు మహాదాతలు, పండితులు పండితగోష్ఠి ప్రియులు, అన్నదగ్గరనుంచి మళ్లా మొదలెట్టుకుందాము. అదికాక తొట్టికి "రేవేమిటి?"

తణికెళ్ల సుబ్బన్న శాస్రుల్లగారికిన్నీ కొవ్వూరు గోపాలశాస్రుల్లగారికిన్నీ తర్కశాస్త్రంలో వాదం జరుగవలసి వుంది. సుబ్బన్నశాస్రుల్లుగారు “గోపాలశాస్రుల్లుగారు తనకైతే వాదంలో వోడిపోవడం తప్పదుగాని ప్రయోగంచేసి తన్ను కడతేరుస్తారనే భయంలో వున్నారు. ఉపాసనాశక్తికలవారు యిదివఱలో అక్కడక్కడ వుండేవారు. పుల్లెల దక్షిణామూర్తి శాస్తుల్లుగారికిన్నీ అద్దేపల్లి కృష్ణశాస్రులుగారికిన్నీ యేదోవిషయంలో కొంత చర్చ నడిచిందనిన్నీ కృష్ణశాస్రుల్లుగారి వాదం వెనుక తగ్గిన కారణంచేత ఆయన మీద యీయన మూCడోకన్ను తెరిచారనిన్నీ వక జనశ్రుతి వుంది. దక్షిణామూర్తిశాస్రుల్లుగారు యితర శాస్తాలతోపాటుగా యీ మంత్రశాస్త్రంలో కూడా మహాప్రజ్ఞకలవారు. అట్టివారై వుండీనిన్నీ అద్దేపల్లి కృష్ణశాస్రుల్లుగారి ప్రయోగంవల్ల నెల్లాల్లో రెండునెలలో కట్టువస్త్రంకూడా యెఱంగనిస్థితిలో వుండి చిక్కుపడుతూవుండగా వక గుజరాతీ దేశస్తుడు వచ్చి ఆ ప్రయోగాన్ని మళ్లా మళ్లించినట్లు విన్నాను. యిదంతా మా రోజుల్లో జరిగిందే. అయితే వక శంక : యిద్దఱూ మంత్ర శాస్త్రజ్ఞలేకదా, వీరి దానికి వారెందుకు లొంగిపోవలసి వచ్చింది,-అని. వినండి యీ వుపాసనలలో కొన్ని కేవలం పరానికే వుపయోగిస్తాయంట. కొన్ని యిహానికే. వీట్లనే శాబరాలంటారు. కొన్నో వుభయానికిన్నీ పనికివస్తాయCట. కృష్ణశాస్రుల్లుగారి మంత్రాలు తుట్టతుది తరగతిలోవి. దక్షిణామూర్తి శాస్రుల్లుగారివి మొట్టమొదటి తరగతిలోవి అంటూ చెప్పగా పెద్దలవల్ల విన్నాను. అసలు సందర్భం యీలాటిదే అయినా కొందఱు అసమర్థులైనవైద్యులు రోగాన్ని చక్కగా నిర్ణయించుకోలేక "ప్రయోగ" మనడంకూడా కలదు. కొందటో! పిశాచమని మొదలెడతారు. రెండూ వకటేకాని, పిశాచం దానంతట అది ఆవహించేదిన్నీ రెండవది యెవరో మంత్రశక్తిచే పంపిస్తే వచ్చి ఆవహించేదిన్నీ యింతేభేదం. పిశాచాదులను బొత్తిగా నమ్మనివారే పలువురు. వీరు నేడేcకాదు పూర్వమున్నూ వుండేవున్నారు. నేనుకూడా చాలాభాగం యీ తరగతిలోకే చేరతాను. కాని యే కొంచెమో నమ్ముతాను. యీ మధ్య మాయింటిలోనే యీ పీడ తటస్థించింది. సామాన్యులు కొందరువచ్చి "హాత్తు హూత్తు" అంటూ జడిపించారు. రక్షరేకులు కట్టి వెళ్లారు. లక్ష్యపెట్టలేదు. నా పినతల్లికుమారుడు యీ విషయమై ప్రవేశం కలవాఁడున్నాండు. అతడు వచ్చి ఒక రోజు మాత్రం జపంచేసి యేవో అంకెలువేసి బంగారపు రక్షరేకు కట్టి వెళ్లాడు. అంతటితో ఆ పీడ ఆగింది. కాని ఆ గ్రహం ఆ పిల్లమీందకు మాత్రం రాకుండానే ఆ రక్షరేకు పనిచేస్తుంది కాని, అసలు గ్రహాన్ని వూల్లో లేకుండా చేయలేదట. ఆ గ్రహమే మాకు సంబంధించిన విద్యార్థి భార్యను ఆశ్రయించినదని అన్నారు. రక్షరేకు ఇచ్చినాడు. ఆపెకున్నూ నివర్తించినది. ఇక దీనిలోకి దిగితే తేలదు. లేదని మాత్రం నేను చెప్పలేను. వుందనే చెపుతాను. ప్రస్తుత చరిత్ర దీన్ని వప్పుకొనే విశ్వాసం మీందే ఆధారపడివుంది.

సరే, మహాసభలో యిదివరలో వుదాహరించిన పండితులిద్దటికీ వకరోజున శాస్రార్థం జరిగింది. యెవరు పూర్వపక్షం చేయడం?- సిద్ధాంతం చేయడం యెవరు?- అనే ప్రశ్న వచ్చింది. యిక్కడ కొంత వ్రాయాలి; పూర్వపక్షం చేసేవారికంటె సిద్ధాంతం చేసేవారికి గౌరవం హెచ్చు. కాబట్టి పూర్వపక్షకోటిలో చేరడానికి మహాపండితులు అంగీకరించరు. గోపాలశాస్రుల్లుగారు "నాది సిద్ధాంతకోటి" అన్నారు. సుబ్బన్న శాస్రుల్లుగారు "అలాఅయితే నేనే పూర్వపక్షం చేస్తా" నన్నారు. కాశీలో యేంచేస్తారంటే; యిలాటి సందర్భాలలో యెవరో విద్యార్ధిచేత ముందుగా పూర్వపక్షాన్ని వుపపాదన చేయిస్తారు. దానిమీంద ఆయా పండితులు అందుకుంటారు. ఇది సామాన్యంగా వినోదార్థం జరిగే సభల ముచ్చట. ವಿಟ್ಟು పటాంగాల మీంద జరిగేవయితేనో : “నే పూర్వపక్షంచేస్తే నీవుచెప్పఁగలవా?" అని యెవరంటారో వారిదే పూర్వపక్షకోటిగా వుంటుంది. సుబ్బన్న శాస్రుల్లుగారు యొక్కడో వకచోట పూర్వపక్షం వుపపాదించారు. బహుశః వక అరగంటసేపు దానికి పట్టివుంటుంది. లేదా ఒక గంట పట్టి వుంటుంది. మాధ్యస్థ్యంచేసేవారు పూర్వపక్షాన్ని యావత్తున్నూతమస్వంత మాటలతో సంస్కృతంలోనే అనువాదంచేసి సిద్ధాస్తంచెప్పేవారికి తెలియపరచాలి. బహుశః యీయన జడ్డీగారికోటి బోధపడితేనా ఆ పూర్వపక్షధోరణి? అందుచేత మండపేటనుంచి మాధ్యస్థ్యానికి వచ్చిన పండితులున్నూ తెల్లపోవలసి వచ్చింది; సిద్ధాంతం చెప్పాలని కూర్చున్న గోపాలశాస్తుల్లుగారున్నూ తెల్లపోవలసివచ్చింది. అంటే వీరిద్దఱున్నూ మహా గొప్పవిద్వాంసులే అయినా తణికెళ్ల సుబ్బన్నశాస్రుల్లగారు చేసిన పూర్వపక్షానికి జవాబు చెప్పడంమాట దేవుండెఱుంగునుగాని, ఆ మహామహుండు చేసిన పూర్వపక్షం యిట్టిదనికూడా - తెలిసికోలేక పోయారనడంవల్ల ఆ సుబ్బన్న శాస్రుల్లు గారు ఆ శాస్త్రంలో యెంత ప్రజ్ఞ గలవారో లోకులు తెలుసుకుంటారు. గోపాలశాస్రుల్లుగారే పూర్వపక్షం చేస్తే కొంతసేపేనా రాజావారి కుతూహలం తీరేది. అలా జరక్కపోవడంచేత మొట్టమొదటే శాస్తార్థం ఆగిపోయింది. “ప్రథమ కబళే మక్షికాపాతః".

సుబ్బన్న శాస్రుల్లగారి దర్శనం చేయలేదుగాని శ్రీకర్ణాట సీతారామ శాస్రుల్లగారిని మట్టుకు నే నెఱుంగుదును. యీ దేశంలో తర్కంలో మహాపండితు లనిపించుకోవడమే కాకుండా యెందఱినో మహావిద్వాంసులను చేసిన పండితులు, వారుచెప్పేపాఠాన్ని అవగాహనచేసుకోలేకపోయారంటూ పెద్దలవల్ల వినడం. యిందులో కొన్ని మాటలు మూఢభక్తికల్పితాలుంటాయి. కాని ఏమేనా కర్ణాట సీతారామశాస్తుల్లుగారి ప్రతిభ అద్వితీయం అన్నమాట స్వభావోక్తి కాకపోదు. యీ శాస్రుల్లుగారిబుద్ధి మిక్కిలి తీక్షణమయినదని గురువుగారు చెప్పేవారు. “గురుడు బ్రహ్మయ్యశాస్త్రి కొనియాడు నెవని కర్ణాట సీతారామసాటిచేసి" అని నేను మా తి| శాI గారిని గూర్చి చెప్పినమాట ఈ సీతారామశాస్త్రిగారికి సంబంధించిందే. ఆ సీతారామశాస్రుల్లగారు నీలదేవపండిజీవారి శిష్యులంట. లోకాతీతులైన యీ మహామహుణ్ణిగూర్చి - "సీతారామ్కూబ్ జాన్రీహై" అని పండిజీవారు సెలవిచ్చేవారంట. తర్కశాస్త్రంలో పండితులనిపించుకోవడం చాలా అరుదు. వ్యాకరణం మొట్టమొదట మిక్కిలీ కష్టంగా ఉన్నట్లు కనబడుతుందిగాని యే నాలుగైదు మాసాలో శ్రద్ధపుచ్చికొని అభ్యసిస్తే క్రమంగా పేలపిండివైఖరిగా ఉంటుంది. యిటీవల వ్యాకరణాన్ని తర్కశాస్త్రంలో పూర్తిగా మిళితం చేయడంచేత ఇదికూడా కొంత దుర్బోధంలోకి వచ్చింది. కాని, మొట్టమొదట - అనంగా - కౌముదీరచననాంటి వరకున్నూ అంత దుర్భోధస్థితి వ్యాకరణానికి రాలేదు. కాశికావృత్తి నాంటికి చెప్పనక్కరలేదు. ఆ కారణంచేతనే అప్పటి పండితులు చాలామంది సాంగంగా వేదం అభ్యసించిన వాళ్లుగానే వుండేవారు. యిప్పడో వకటివస్తే రెండోది రానివాళ్లే తఱచుకనపడతారు. కారణం ఒక్కొక్క శాస్తానికి సుమారు పదేళ్లకు తక్కువ కాలం పట్టదు. యావత్తున్నూ సరిగా కృషిచేయరుగాని, చేసేయెడల ఓంకారంలో సర్వవేదాలు యిమిడినట్లు తర్కశాస్త్రంలో సర్వశాస్తాలూ యిమిడాయని చెప్పవచ్చును. ప్రత్యక్షఖండ మాటట్లావుంచినా అనుమానఖండ వక్కటితప్ప యెవరోగాని ఉపమాన శబ్దఖండలుకూడా చదవరు. ఉపమానఖండలోదే అలంకారశాస్త్రం యావతూ అనుకోవచ్చు. వ్యాకరణం శబ్దఖండంలోదిగదా? యిక కావలసిందేమిటి? వక్క వేదంతప్ప తర్కంలో సర్వమున్నూ గతార్థమవుతుంది. పైCగా దాన్ని చదివి పూర్తిపాండిత్యాన్ని సంపాదిస్తే వారిముందర బ్రహ్మాండనాయకుండుకూడా నిల్వనేలేడు. తిమ్మిని బ్రహ్మినీ, బ్రహ్మిని తిమ్మినీ చేసేశక్తి తార్మికులకుతప్ప వేటెవ్వరి కుంటుంది.? చూడండి- ఆ శాస్త్రంలో విజ్ఞలైనవారి ప్రతిజ్ఞలు

శ్లో. విదుషాంనివహై రిహైకమత్యా
ద్యదదుష్టం నిరటంకి యచ్చ దుష్టం
మయి జల్పతి కల్పనాధినాథే
రఘునాథే మనుతాం తదన్యదైవ.

ప్రపంచంలోవున్న పండితులంతా దేన్నికాదంటే దాన్ని తాను ఔననిచెప్పి సమర్ధిస్తాననిన్నీ అవునన్న దాన్ని కాదనిచెప్పి సమర్థిస్తాననిన్నీ యీ రఘునాథపండితుని ప్రతిజ్ఞ- యితర శాస్తాలలోవున్న పండితుల కీ లాటి స్వాతంత్ర్యం కుదురదు.

ప్రస్తుతం గోపాలశాస్రుల్లగారు యితరశాస్రాలల్లో పూర్ణపండితులై కూడా యీ తర్కంలో మహాసముద్రులు. సుబ్బన్న శాస్రుల్లుగారో? తామెక్కడ పూర్వపక్షం యెత్తుకున్నారో ఆ సందర్భంకూడా యీ మహా సముద్రుండికి అంతు తెలియనీయనంత ప్రజ్ఞావిశేషం కలవారు. యీలాటి వారినిగూర్చి నావంటివాఁడు వ్రాయవలసివస్తే వట్టి పొడిపొడి మాటలు పడతాయిగాని అసలు వుపయోగించతగ్గ మాటలు పడతాయా? అయినా యేవో వ్రాసినందుకు విద్వల్లోకం క్షమించాలి.

ప్రస్తుతాన్ని రెండుమాటలు వ్రాసి యిక ముగిస్తాను. ముగించడానికేముంది? యెప్పడు సుబ్బన్నశాస్రుల్లుగారి పూర్వపక్షం అయోమయప్పంతలో వున్నట్టు తోంచిందో అప్పుడే గోపాలశాస్రుల్లుగారికి అవమానం సిద్ధమేకదా? దానితో కోపాగ్ని భగ్గున హృదయంలో వక్కసారిగా మండింది. ఆ మంట నేత్రగోళాల ద్వారా సుబ్బన్నశాస్రుల్లుగారి మీంద ప్రసరించింది. దానితో సుబ్బన్నశాస్రుల్లుగారు “అదుగో బాబూ ప్రయోగించారు దేన్నో అంటూ పడిపోయారు. వాక్కుమాత్రం లేకుండా, పది పన్నెండురోజులు జీవించి స్వర్గతులైనారు. యీ సందర్భం రాజావారు పూర్తిగా గమనించడంచేత అదిమొదలు తమ సంస్థానంలో పండితుల వివాదాన్ని పెట్టి చూడడానికి అంగీకరించకుండానే కాలక్షేపం చేసినట్లు వినికి. గోపాలశాస్రుల్లుగారిని యేమేనా గట్టిగా అనేయెడల రాజావారిక్కూడా భయమేకాCబట్టి యేకొంచెమో మందలించారేమోకాని విశేషించి కలుగజేసికొన్నట్లు వినడంలేదు. సుబ్బన్నశాస్రుల్లుగారి కుటుంబానికి తగిన యేర్పాటుచేసి ఆదరించివుంటారు కాని, దాన్ని గుణించి తపిసీలు తెలియదు. మంత్రశాస్త్రంలో అలాటిప్రజ్ఞకలవారు కూడా వుండేవారా అన్నశంక చాలామందినిబాధిస్తుంది. కాని కొంచెం వోపికపట్టి విమర్శించుకుంటే, ఆశంకనివర్తిస్తుంది. పురాణాల్లో సర్వత్రా విమానాలున్నట్లు కనపడేది గదా? అది నిజమని అనుకునేవాళ్లు అనుకున్నా కవులకల్పన అనుకునే వాళ్లేందరుండేవారు? ఇప్పడో అందరూ నమ్ముతారుగదా? ఆలాగే గోపాలశాస్రుల్లుగారివల్ల మంత్రశాస్త్రం చాలావఱకు ఆ కాలంలో ఋజువివ్వడం కలిగిందనుకోండి. ఆయన మాత్రమేకాక ఆయనకు ముఖ్యశిష్యులైన అద్దేపల్లి కృష్ణశాస్రుల్లుగారివల్లకూడా కొంత యీశాస్త్రంబుజువిచ్చే వున్నట్లు వినికి. వకగొప్ప షాహుకారు కృష్ణశాస్రుల్లుగారివల్ల రావలసిన కొన్నివేల పరిమితిగల అప్పపత్రాన్ని భయపడి యిచ్చేసినట్లు చెప్పుకోవడం నే నెఱుంగుదును. యిప్పుడు మనం మంత్రశాస్త్రప్రజ్ఞనే విచారించి సంతోషించడమా కావలసింది?- గోపాలశాస్రుల్లుగారు చేసిన అకార్యాన్ని నిరసించడమా?- అంటే, దేనికదే వుంటుందికాబట్టి దాన్నీ ఆలోచించవలసిందే, దీన్నీ ఆలోచించవలసిందే. మహాపండితులై వుండి బ్రహ్మహత్యకు సిద్ధమయినారు కనుక గోపాలశాస్రుల్లుగారు యిప్పట్ల దూష్యులే. అయితే వూరికే ఆయనకువుండే ప్రతీతినిపట్టి సుబ్బన్న శాస్రుల్లుగారు "రజ్ఞసర్పభ్రాంతి"గా హడిలి బేజారై వాక్కుపడిపోవడమే కాకుండా క్రమంగా స్వర్గతులవడంకూడా తటస్థించిందేమో, అంటారా? అయితే గోపాలశాస్రుల్లుగారు దూష్యలుకారు. పాపం పుణ్యం పరమాత్ముడికే యెఱుక. మనకు ముఖ్యంగా కావలసినది సుబ్బన్న శాస్రుల్లుగారి పాండిత్య ప్రసంగం. అది నిరుపమానం అనే సంగతి ఆనాటి సభవల్ల ತೆಲಂದಿ.

యీ సుబ్బత్రయాన్ని మెప్పించినవారు కురుగంటివారిలో వకరు వుండేవారంటూ గురువుగారు సెలవిచ్చేవారు. వారిపేరు వేంకటరామ శాస్రుల్లుగారని విన్నట్లు జ్ఞాపకం. తాడెక్కేవాణ్ణి తలదన్నేవాఁడున్నూ వుండవచ్చునుగదా? విద్యావివాదాలంటూ యిప్పడున్నూ పత్రికలలో జరుగుతూ వుండడం అందఱికి అనుభూతమే. కాని యిప్పటివారికి మంత్ర శాస్త్రప్రజ్ఞలు లేకపోడంవల్ల వోడుకలగటం తటస్థిస్తే వట్టి శాపాలు మాత్రం పెట్టడం తటస్థిస్తూవుంది. ఆ శాపస్వరూపం పత్రికలలో చదువుతూనే వున్నారు కాCబట్టి యిందులో యెత్తిచూపలేదు. అవమానం మహాచెడ్డది. కొంచెం నామరూపాలు కలవాళ్లు దాన్నిబొత్తిగా భరింపలేరు. మృచ్ఛకటికలో యేమన్నారో చూడండి

"నిస్తేజాః పరిభూయతే పరిభవాన్నిర్వేద మాపద్యతే నిర్విజ్ఞశ్ముచమేతి శోకపిహితో ಬುದ್ಧ పరిత్యజ్యతే నిర్బుద్ధిః క్షయమేతి-"

తుట్టతుదకు అవమానం మరణాన్ని కూడా సాక్షాత్పరంపరయా కలిగిస్తుంది. కాcబట్టి అది తటస్థించినవారు యొదటివాళ్లను శపించడానికిదిగడం తప్పదనుకుంటాను. దీనిలో వకవిశేషం గమనించవలసివుంది. యేమిటంటే విద్యావిషయంలో జరిగేవాదోపవాదాలలో జయాపజయాలు నిర్ణయించడానికి తగ్గ శక్తిసామర్థ్యాలు యెవరికోగాని వండవు, వారుకూడా ఆ జయాపజయాలు తెలుసుకోవడానికి యీ శాపాలు ఆధారమవుతాయి. యెవరు తిట్లకువుపక్రమిస్తారో వారికి అపజయం కలిగినట్లు సుళువుగా తేలుతుంది. ప్రస్తుతం రాజావారు యెవరికి వాదోపవాదాలు పెట్టివున్నారో వారి తారతమ్యం మంత్రశాస్త్ర ప్రయోగంవల్లనే సుళువుగా గ్రహింపగలిగారనుకోవచ్చు. లేకపోతే మాధ్యస్థ్యం చేయడానికి వచ్చిన పండితులకేమి వాదించడానికి కూర్చున్న గోపాలశాస్రుల్లుగారికేమి లేశమున్నూ అవగాహనకాని విషయం యెంత శ్రుతపాండిత్యం వున్నప్పటికీ రాజావారికి తెలియడం తటస్థింపవలసివుండదు. యితర విషయాలయితే శ్రుతపాండిత్యానికి లొంగుతాయేమోకాని శాస్త్రవిషయం లేశమున్నూ శ్రుతపాండిత్యానికి లక్ష్యపెట్టదు. “అనభ్యాసే విషంశాస్త్రం" అని వూరికేనే అన్నారా పెద్దలు? అందులో తర్క శాస్త్రం చెప్పనే అక్కరలేదు. యితర విషయాలుకూడా కొన్ని చిక్కగానే వుంటాయి. ఉదాహరణకి కొన్నిచూపి యీ వ్యాసం ముగిస్తాను.

భారతంలో ద్రోణాచార్యవధ ఘట్టంలో “అశ్వత్థామా హతఃకుంజరః" అని పల్కినవాండు సాక్షాత్తూ ధర్మరాజా? మరివకరా? ధర్మరాజే కదా! పాండవ విజయంలో హిడింబతాలూకు పరిజనంలో రాక్షసుండెవరో కామరూపం కలవాండు ధర్మరాజు రూపంతోవచ్చి ఆ అబద్ధం ఆడినట్లు కల్పించంబడ్డది. యిది శాస్త్రసంప్రదాయం తెలియక కేవలమున్నూ భారతకధా సందర్భమే యెరిగివున్న శ్రుత పాండిత్యం కలవారికి శుద్ధ తప్పగా తోంచితీరుతుంది. ఆలాగే మురారినాటకంలో వాలిన్నీ శ్రీరాముండున్నూ యెదుటCబడి యుద్ధంచేసినట్లున్నూ ఆ యుద్ధంలోనే వాలిహతమైనట్టున్నూ వుంది. నాటక సంప్రదాయం తెలిస్తే తప్ప యిదిన్నీ కేవలం విరుద్ధంగా తోంచకమానదు. ఆలాగే ప్రభావతీ ప్రద్యుమ్న నాటకంలో గదుడు శ్రీ కృష్ణమూర్తి తమ్ముఁడనక కొడుకని కల్పింపబడివుంది. ఆయీకల్పనలకు కొన్ని వుపయోగాలు వున్నాయి. మొదటిదాని కేమి వుపయోగమంటారా? ధర్మారాజంటే లోకానికి చాలా గౌరవించతగ్గ వాడుగదా? అవసరాన్ని ಬಲ್ಲಿ అట్టి మహాపురుషుండే అబద్ధమాడినట్లు నాటకంలో వుండేయెడల, -అది దృశ్యప్రబంధ మవడంచేత పలువురు పండితులుమాత్రమే కాక పామరులుకూడా నాటకం చూడటానికి వస్తారుగదా, - వాళ్లందఱున్నూ “ధర్మరాజంతవాండే అవసరాన్నిబట్టి అబద్ధమాడితే సామాన్యులం మన మెందుకాడగూడదనుకొని దుర్నీతిపరులవుతారు. కాబట్టి, అట్టికల్పన చేయవలసివచ్చింది. అలాగే వాలిన్నీ రాముండున్నూ, యుద్ధంచేసేసందర్భమున్నూ వకలోకంకాదు, పద్ధాలుగులోకాలున్నూ, నెత్తిమీంద పెట్టుకొనే శ్రీరాముండువాలిని చెట్టుచాటునుండి-అంతేకాక యితరుcడితో పోట్లాడుతూవున్న సమయంలో వధించాడంటే యెంతేనా తప్పిదంగా వుంటుందికనక నాటకంలో మార్గాంతరంగా ఆ కళంకాన్ని తొలగించాడు. ప్రభావతీ ప్రద్యుమ్ను నాటకంలో ప్రద్యుమ్నుండున్నూ గదసాంబులున్నూ, వెరశి ముగ్గురున్నూ వజ్రనాభ, సునాభులనే రాక్షససోదరులయొక్క కొమార్తలైన ప్రభావతీ చంద్రవతీ గుణవతులనే ముగ్గురిని అప్పాచెల్లెళ్లను గాంధర్వరీత్యా పరిగ్రహించి వున్నారు. పినతండ్రి పెత్తండ్రికొమార్తలైన యీకన్నియలను పెండ్లాడిన వీరలుముగ్గురును అన్నదమ్ములవావివారుగా వుండడమే అర్దమో, తండ్రీ కొడుకులవావివారుగా వుండడమే అర్హమ్లో, ఆలోచించవలసివుంటుంది. ఇందులో వక వరుడు కృష్ణమూర్తికి తమ్ముడున్నూ తక్కిన యిద్దరున్నూ కొడుకులున్నూ, అయేపక్షంలో యిద్దఱు తల్లికి మొగుళ్లు కావలసివస్తుంది. యిదిన్నీ యిలావుండగా యించుమించు సమానవయస్సులోవుండే ΟDJo కన్యకలకు సమానవయస్సులో వుండే భర్తలైతేనే అనుకూలదాంపత్యంలోకి చేరుతుంది కాని దాంపత్యం, లేకపోతే ముదురు మొగుడున్నూ లేత పెండ్లాముగా వుండడం తటస్థించి రసాన్ని చెడగొడుతుంది, పోనీ యీ దాంపత్యాలేమేనా యిప్పడు లోకంలో ధనాపేక్షచేత ముసలాడికి పసిపిల్లను కట్టిపెట్టే రకంలోకి చేరతాయేమో అంటే, అట్టివికావు. పరస్పరమున్నూ గుణవయోరూపాదులను పురస్కరించుకొని యేర్పఱచుకున్నవి. కృష్ణమూర్తికి తమ్ముడైన గదుండే పెళ్లికొడుకులలో వకండుగా వున్నట్టయితే అతCడు కృష్ణమూర్తికి యెంత కడగొట్టుతమ్ముడైనా ప్రద్యుమ్నాదుల వయస్సులోవాడు కాండని వారివీరి జన్మసందర్భాలను విమర్శిస్తే తేలుతుంది. చచ్చిచెడి యెట్లో వయస్సు యించుమించులో సరిపెడదామన్నప్పటికీ వావి కుదరదు. ఆయీ సందర్భాలు అన్యత్ర విస్తరించందలంచుకొని వూరికే స్ప ృశించి విడుస్తూ వున్నాను.

దీనిమీద పట్టేశంకలు చాలా వున్నాయి. (1) కృష్ణమూర్తికి గదుండనే పేరుగల తమ్ముఁడే వున్నాండు గాని గదుcడనే కొడుకున్నాండా? (2) అయితే యీ మార్పు కవికులాగ్రేసరుండైన పింగళి సూరన్నగా రెందుకు చేయలేదు? యిత్యాది శంకలకు చక్కని సమాధానాలున్నూ వున్నాయి. కృష్ణునికొడుకు లెందటో, వారివల్ల ఆ వంశం యెంత అభివృద్ధి చెందిందో, ఆ సంతానంలో భాగవతాదులలో యెన్నోవంతు వారిపేర్లు వుదాహరింపబడ్డాయో యెఱిఁగినవాళ్లు పై శంకలు చేయరు. యాదవ కుమారులకు విద్యాభ్యాసం చేయించే గురువులు మూడుకోట్ల యెనభైయెనిమిదివేలని కాబోలును భాగవతంలో వుంది. ఒక్కొక్క గురువు యెందఱికి పాఠంచెపుతాడో ఆలోచించి ఆ సంఖ్యనుబట్టి ఉపాధ్యాయుల సంఖ్యను గుణిస్తే సుమారు ముప్ఫై కోట్లేనా సంఖ్య తేలుతుంది, ΟΟΟΟ ముప్టెకోట్ల యాదవకుమారులకున్నూ మూలపురుషులైన కృష్ణునియొక్కానున్నూ ఆయన సోదరులయొక్కానున్నూ కుమాళ్లు అధమం వక లక్షవరకేనా వుండవలసి వస్తుంది. ఆ లక్షలో కృష్ణుడికుమాళ్లు వక వెయ్యేనా "అట్టీస్టు" వుండరా? ఆ వేయి మందిలో గదుడనే కొడుకుకూడా పినతండ్రి పేరింటి వాండు వుండంగూడదా? యిత్యాదికం వూహించుకోవాలి. యీలాటి అభూతకల్పనలు నాటకాలలో చాలావున్నాయి. ఆలాగ ఆయాకవులు కల్పించడానికి కారణం కొన్నిచోట్ల అధర్మాన్ని తొలగించడానికిన్నీ అని పొడకడుతుంది. కొన్నిచోట్ల అదీ యిదీ కాకుండా ఆ కవులు నిష్కారణంగానే మార్చినట్లున్నూ సూలదృష్టికి కనపడుతుంది. జానకీ పరిణయం, బాలరామాయణం మొదలైనవి దగ్గిఱపెట్టుకొని కుశాగ్రబుద్దులైనవారు విచారణచేస్తే సంగతి సందర్భాలు తేలుతాయి. శ్రుతపాండిత్యం మాత్రమే వున్నవారికిగాని, నూటికి ముపెృఅయిదు వారికిగాని నాటకంలోవుండే కల్పనావిశేషాలు బోధపడక, కవి కథతెలియక పాడుచేశా డనుకుంటారు. అట్టిస్థితిలో తర్కంలో మాట్లాడే పండితుల తారతమ్యాలు శ్రుతపాండిత్యం యెంతవున్నా శ్రీ రాజావారు గ్రహించడం తటస్థించేదేకాదు కాని, - గోపాలశాస్రుల్లుగారు ప్రయోగం చేశారో లేదో దేవుడికెఱుక- వారు కళ్లెల్టజేసి చూడడంవల్ల తాత్కాలికంగా గోపాలశాస్తుల్లుగారికి కల్గినకోపం వ్యక్తమయింది; దానితో అంతకుముందే మనవి చేసుకొన్న సుబ్బన్నశాస్రుల్లుగారి మాటలు తార్మాణంగా రాజావారికి తోcచాయి. దానితో విశేషించి పండితాదరంకల ఆ రాజన్యునకు పండితులంటే అసహ్యం కలిగింది.

పాండిత్యానికి వుండదగ్గ లక్షణం ముఖ్యమయింది సత్యం. అట్టి సత్యాన్ని మన్నించేవారే అయితే గోపాలశాస్రుల్లుగారు రాజావారితో "అయ్యా నేను ఆరుశాస్తాలలో ప్రజ్ఞకలవాణ్ణి. సుబ్బన్న శాస్రుల్లుగారు వకటే తర్కంలో యావజ్జీవమున్నూ కృషిచేసినారు, అందుచేత దానిలో వారిని సాక్షాత్తున్నూ గౌతముండో కణాదుండో అయితేనే తట్టుకోగలరేమో కాని ఇతరులు తట్టుకోలేరంటూ కొన్నిమాటలు తత్కాలోచితంగా మనవి చేస్తే రాజాగారున్నూ సంతోషిస్తారు. సుబ్బన్నశాస్రుల్లుగారున్నూ“అయ్యా నాకన్న గోపాలశాస్రుల్లుగారే గొప్పవారు; యేమంటే : ఆఱుశాస్తాలలో పూర్ణ పండితులుగదా వారు?” అని చెప్పిస్తుతిచేసివుందురు. అలాకాక రసాభాసంగా లోకులు చెప్పకొని కళంకాన్ని ఆపాదించే తోవలోకి గోపాలశాస్రుల్లు గారు దిగి, తమకేకాక పండితలోకానికంతకున్నూ తీరనికళంకాన్ని దెచ్చిపెట్టారని వ్రాయకతప్పదు. పాండిత్యమెంత ఉన్నప్పటికీ లౌకిక జ్ఞానం కొంతవుండాలి. యుక్తినైపుణ్యం కొంత వుండాలి. అప్పడుగాని ఆ పాండిత్యం శోభించదు. యీ సందర్భాలన్నీ ವಿನ್ಸಿಲ್ಲು వక్క బులుసు పాపయ్యశాస్రుల్లు గారినే పండితమండలి యేకవాక్యంగా అంగీకరిస్తుంది. మచ్చుకు ప్రకృతానికి సంబంధించిందే వక యితిహాసం వుటంకించి వ్యాసం ముగిస్తాను.

విజయనగరంలోనే శ్రీ పాపయ్యశాస్తుల్లుగారు మహా పండితసభలో వేదార్థం చెపుతూవున్నారంట. యొక్కడో సంశయంగా ವೊವ್ಲಿಲ್ಲು తోcచి కొవ్వూరు గోపాలశాస్రుల్లుగారు, “బావగారూ! ఆ స్థలంలో మళ్లా సెలవియ్యండీ” అని పృచ్చచేశారంట. దానిమీద పాపయ్యశాస్తుల్లుగారు- "బావగారూ, యీ తరవాయి మనవిచేశాక తుట్టతుదకు సావకాశంగా తమరడిగిన సందర్భానికి జవాబు మనవిచేసుకుంటానని యుక్తిగా అప్పటికి దాంటుకుని అదిపూర్తికాగానే, అంటే గంటకో రెండుగంటలకో అన్నమాట, “యేదండీ బావగారూ! తాము యిందాకా అడిగిన సందర్భం?" అన్నారట. గోపాలశాస్రుల్లు గారు ఆ పనసలో వాక్యం వుచ్చరించి యిక్కడనే నేనడిగిందని చెబుతూవుండంగా పాపయ్యశాస్రుల్లు గారు చెవులు మూసుకొని “నారాయణ, నారాయణ, నారాయణా” అంటూ ముమ్మాలు స్మరించారంట! గోపాలశాస్రుల్లుగారు వెలవెలపోయారంట! కారణమేమిటంటే; పాపయ్య శాస్రుల్లుగారు వేదానికి యెంతవఱకవసరమో అంతవఱకే ఆయా శాస్రాలలో కృషిచేసినారు. గోపాలశాస్రుల్లుగారో? వేదంలో యేకొంచెమో ప్రవేశం చేశారో లేదోగాని ఆయా శాస్తాలల్లో సమగ్రంగా పనిచేసిన మహామహోపాధ్యాయులు. ఈ సంగతి మహాలౌక్యులైన పాపయ్య శాస్రుల్లుగారికి తెలుసును. ఆయన అడిగినప్పడే ఆశంకకు జవాబు చెప్పేటట్టయితే "లక్కికి లక్కి వాదంలోకి దింపి గోపాలశాస్రుల్లుగారు, పాపయ్యశాస్రుల్లుగారిని వోడించడం యేలాగున్నూతప్పదు. కాCబట్టి "అటునుండి నఱుక్కురమ్మన్నారని అప్పటికి మృదువుగానే తప్పకొన్నారు. తిరిగీ ఆ స్థలం అడగడంలో పాపయ్యశాస్తులవారి యుక్తి పూర్తిగా గోచరిస్తుంది. గోపాలశాస్రుల్లు గారికి పుట్టిన వుద్దేశ్యంలో కొంత దోషంవుంది. యేమిటా దోషమంటే యేదో గవడగొయ్యలోకి దింపి పాపయ్యశాస్రులుగారి వాగ్గాటికి అడ్డుకల్పించి గొప్ప సంపాదిద్దామనుకోవడమే. పాపయ్యశాస్రుల్లుగారు దాన్ని కనిపెట్టి యీయన శిరోభారం తగ్గించే వుపాయం యిదికదా అని యీ యుక్తిచేశారు. శాస్త్రంలో కొంతవఱకేనా పాపయ్యశాస్తుల్లుగారు లేశమున్నూ పనిచేయ లేదుగదా? తక్కినదల్లా వుండంగా వుచ్చారణలోనే అనంగా స్వరవిషయంలో తప్పపట్టుకుంటారు. ప్రస్తుతం జరిగిందిన్నీ అదే. వకవేళ 'గోపాలశాస్రుల్లుగారు మహామంత్రవేత్త-మహాజిపిత-ఆమాత్రం వేదవాక్యాన్ని సరిగా ఉచ్చరించనేలేకపోయారా?" అని కొందఱికి శంక కలగవచ్చును. ఉచ్చరించ లేకేమి? ఉచ్చరించే వుంటారు. పాపయ్యశాస్రుల్లుగారు సరియైనదాన్నే కాదంటారు, కాదంటే సమర్థించుకొనేశక్తి ఆభాగంలో గోపాలశాస్తుల్లుగారికి వుందా? “నహి సర్వ స్సర్వం విజానాతి" కదా? ముందు దురుద్దేశంపుట్టిన దెవ్వరికి? గోపాలశాస్రుల్లుగారికి. ಹಿಮ್ಮಿಟ దురుద్దేశంపుట్టడం పాపయ్య శాస్రుల్లు గారికి. వీరు నిజానికి ఛాందసులే అయినా ఆ షడ్డర్శనవేత్తను వోడించినట్లయింది. యథార్థం ఆలోచిస్తే వారున్నూ మహానుభావులే వీరున్నూ మహానుభావులే.

సామాన్యలోకానికి యా ధోరణి పనికిరాదు. కాబట్టి యెంతవారైనా జయాపజయాల కోసం కొంత పెనుగులాట పూర్వం సర్వసమ్మతంగావుండేది. ఇది యినా జన్మంలోనేకాక వుత్తర జన్మానిక్కూడా సంబంధించివుండేదన్నట్టు శ్రీహరుండు (నైషధగ్రంథ కర్త) గారి తండ్రి శ్రీ హీరుడుగారికిన్నీ ఆయన బావమఱందికిన్నీ జరిగిన వాదోపవాదాలకు సంబంధించిన యితిహాసంవల్ల మనకు తెలుస్తుంది. దీనియందు పూర్వపురాజులకు యెంత ఆసక్తిన్నీ లేకపోతే

"పగులంగొట్టించి తుద్భట వివాదప్రాధి గౌడడిండిమభట్టు కంచుఢక్క"

అనే శ్రీనాథునిపద్యపాదం మనకు ఆదరపాత్ర మవుతుందా? శ్రీనాథుండు ఆంధ్రంలో గ్రంథాలు వ్రాసినప్పటికీ సంస్కృతంలో సామాన్యుఁడు కాడు. గౌడడిండిమభట్టు సంస్కృతంలో జయసూచకమైన కంచుఢక్కా రూపమైన బిరుదచిహ్నం కలవాడు. శ్రీనాథుండేమో కవి సార్వభౌమ బిరుదాంకితుండా యె. యీ రెండుచిహ్నాలున్నూ రజోగుణప్రధానాలే అవడంచేత వీరిద్దరికిన్నీ వాదంపడింది. శ్రీనాథుండు జయించాండు. ఢక్కా పగుల గొట్టించాడు. యిప్పటి నాగరికులే అయితే యెందుకీ పిచ్చివాదాలందురు. అందురేమిటి? అనేతీరతారు. ఫీజుపుచ్చుకుని స్వార్థంకాకుండా పరార్థం యెంతగానో పోట్లాడుకుంటూ కోర్టుల్లో బల్లలుగుద్దుతూ వుండేవారినో - యిప్పటివారు లేశమున్నూ యెత్తుకోరు. అది “ఉదరనిమిత్తం బహుకృతవేషం" కింద జమకట్టుకుంటారు. పండితులో కవులో పెట్టుకొనే వాదాలైతే వీరు పూర్తిగా యేవగించుకుంటారు. కొందరు యేవగించుకోవడంతో సరిపెట్టక తూలుమాటలుకూడా వ్రాస్తారు. అయితే యీ పండితులలో కూడా కొన్ని లోపాలు లేకపోలేదు. యేవిషయమై వాదం ప్రారంభమయిందో దాన్నిగురించి మాత్రమే యుక్తులు వుపయోగించక, అతనికి వకకన్ను లేదనిన్నీ యితనికి స్నానంచేయడం చేతగాదనిన్నీ అతనికి బోదకాలు వుందనిన్నీ యేమేమో యెంచడం మొదలుపెడతారు. తక్కిన వేవేనా యెంచితే కొంతవరకు సహించవచ్చు నేమోకాని దైవకృతమైన అంగవైకల్యాదులను కూడా విద్యావివాదాల్లో యెత్తుకోవడం పరమాసహ్యం అనడానికి సందేహంలేదు. పూర్వం మహారాజసభలలో యీ వాదోపవాదాలు జరిగేవికనక యీలాటి అవ్యక్తప్రసంగానికి అవకాశం వుండేదికాదు. యిప్పడో? మహారాజులే చాలావఱకు తగ్గివున్నారు. ఉన్నవారిలో యే వకరిద్దరోతప్ప పండితగోష్టికి చెవియొగ్గేవారు కనపడరు. అన్నిటికీ ఆధారం పత్రికలున్నాయి. ఆ పత్రికలలో కొన్ని కొంత మంచీచెడ్డా విమర్శించి ప్రచురించేవి వున్నప్పటికీ యేదో మేటరుదొరికితేనే చాలు అనుకొనడంవుంది. అందుచే పండితులవాదాలు బొత్తిగా రసాభాసప్రకరణంలోకి దిగుతూ వున్నాయి.

అప్పటి రాజులను గూర్చిన్నీ పండితులను గూర్చిన్నీ గురుముఖతః విన్నమాటలలో జ్ఞాపకమున్నంతవరకు ooJo వ్యాసంలో యేకరు పెట్టివున్నాను. అప్పటికన్న ఇప్పడు విద్య సర్వతోముఖంగా వ్యాపించి వుందనడం సర్వానుభవ సిద్ధమే. కాని వక తేడావుంది. ఇప్పటి విద్య ప్రస్తుతం రష్యాలో జరుగుచున్న సామ్యవాదంలోకి డేఁకుతుంది. అంతో యింతో విద్య వచ్చినవారు యిప్పడు వేలకొలందిగా ఉన్నమాట సత్యం. అప్పటి విద్వాంసులవంటి వాళ్లు మాత్రం లేరు. చూడండీ యిప్పటివారి పాండిత్యాలేలావున్నాయోను.

వకచోట, “మహస్తరణులు” అని పడడానికి బదులు “మహాస్తరణులు" అని అచ్చులో దీర్ఘంపడింది. దాన్ని సవరించుకోవడం చేతకాక వకరు “గొప్పదైన ఆసనము కలవారు" అని అర్థం వ్రాసియున్నారు. యీ అర్థంలో లేశమున్నూ యోగ్యతలేదు. “మహః=తేజస్సుచేత, తరణులు-సూర్యులు" అని కవి తాత్పర్యం. యీ తాత్పర్యాన్ని గ్రహించగలిగినవారే అయితే ఆ హకారంమీదవున్న పొల్లు ముద్రాప్రమాదమని గ్రహించగలుగుతారు. గాని ఆ మాత్రం పిండిలేనివారికి అది సాధ్యంకాదని వ్రాయనక్కఱలేదు. యింకొకచోట

"తనయుల సనయుల మనుమల ఘనముల మునిమనుమల సైతము" అనివుండగా"మనుమలన్" అనునది మహద్వాచకముగాన, దానికి "ఘనములన్" అనే అమహత్తును విశేషణం చేయకూడదంటూ వకరు వెక్కిరిస్తారు. యీ కాలపు పాండిత్యాలు యిలా వున్నాయి, “ఘనము-ఘనములు" అనుకోకపోతే, ఘనా-మా-లక్ష్మీః - యేషాంతే ఘనమాః. ఆఘనమశబ్దానికి ప్రథమైక వచనం ఘనముండు, బహువచనం ఘనములు, రాముండు రాములు అన్నట్లే అగుననిన్నీ దాని ద్వితీయైకవచన బహువచనాలు “ఘనమునిన్" “ఘనములన్” అవుతుందనిన్నీ తెలిసి కోఁజాలని వారిప్పుడు కవులు కవులే కారు, ఇంకా యెవరో యెవరో యెవరో, ఆకాశంమీంద వుండేవారు. దీన్నిబట్టి అప్పటిపాండిత్యాలకూ యిప్పటి పాండిత్యాలకున్నూ కల భేదం వ్యక్తంగావడంలేదా? యింకొకటి మచ్చుకి చూపి వ్యాసాన్ని ముగిస్తాను.

"ఆత్మ ప్రభుతన్ సాగింపంగాcజొచ్చెన్"

అనివున్నది వకచోట. “ఆత్మప్రభుతన్ అన్నది సిద్ధసమాసమనుకొని “ఆత్మ అన్నది గురువుగావడానికి బదులు లఘువయిందంటోవకరు లిఖిస్తారు. యేమనుకొనేది? రేఫయుక్తమైనద్విత్వం పరమందుంటే పూర్వం వికల్పంగా లఘువవడానికి ప్రీవీకౌన్సిలుతీర్పు లున్నాయి. అవి అన్యత్ర విస్తరించడమయింది. యిక్కడ ఆత్మ-తత్సమం, ప్రభుతతత్సమం, ఈ రెండిటికిన్నీ సాధ్యసమాసం చేసుకుంటే నచశంకా నచోత్తరంగదా? హరి ప్రభుత్వంఅంటే అది సిద్ధమున్నూ కావచ్చును, సాధ్యమున్నూ కావచ్చును. యీమాత్రంకూడా తెలియనివారిప్పడు కవులు, మహాకవులు, చక్రవర్తులు, ಮಿಟ್ಟುಲು, వ్యాఖ్యాతలు. - పాండిత్యానికి దుర్దశపట్టింది. అందుచేతనే నేను తుట్టతుదకు వ్యావహారికభాషలోకి దిగింది. దీనిలో వ్రాస్తే తప్పనే వారుండరుకదా? సలక్షణమైనభాషలో వ్రాసినప్పటికీ దాన్ని గ్రహించడానికితగ్గ శక్తిలేక తప్పని అనడం యేలాగా తప్పదని దీనిలోకి దిగాను. యిదియిలా వుంచి పూర్వపువారి పాండిత్యాలకున్నూ యిప్పటి పాండిత్యాలకున్నూ హస్తిమశ కాంతరమనిన్నీ అప్పటి రాజాధిరాజులు పండితుల వాదోపవాదాలను వారి యుద్ధాలతో పాటు గౌరవించేవారనిన్నీ అందుకే మాపిఠాపురం రాజావారుకూడా గోపాలశాస్రుల్లు గారియొక్కానున్నూ సుబ్బయ్యశాస్రుల్లు గారియొక్కానున్నూ వాదోపవాదాలు వినడానికి సభచేసివున్నారనిన్నీ ముఖ్యంగా మనం తెలుసుకోవలసి వుంటుంది. ಅಲ್ಲಿ మహా రాజులేవుంటే “పిడివాదాలు” వాదించేవారిబండారం తేలుతుందిగాని పత్రికలవల్ల లేశమున్నూ తేలదు. మాఅదృష్టంమంచిదికనక శ్రీఆత్మకూరిలో వచ్చినవాదంలో

"దేవతలు ధర్మవర్తులు"

అన్న ప్రయోగాన్నిమేమిచ్చినప్పుడు "ధర్మవృత్తులు" అనిదిద్దుతామన్నవారి పిడివాదాన్ని సాగనీయని ప్రభువుండడం తటస్థించింది గాని- యిప్పుడు- "మనుజుల విప్రుండు" అన్న ప్రయోగాన్నిదిద్దుతామనే పిడివాదాన్ని మానిపించడానికి దగ్గ ప్రభు వేండీ? లేడుగదా? లేకేమి, రాజన్నారెడ్డన్నావకటే, యశముగాంచె యీ రెడ్జెయ్య ప్రభువు మాకిప్పుడు దిక్కుగా కనపడ్డాండు. యిది విషయాంతరం.

యింకా యీ పిఠాపురపు గంగాధర రామారావుగారికి సంబంధించిన గాథలు కొన్ని వున్నాయి. మరొకప్పడు వ్రాస్తాను. వెనుక వ్రాసిన సంగతులలో “జుట్ల" విషయమై కొంతసవరణను పెండ్యాల వెం| సు। శాస్రుల్లుగారు వుపపాదించి వున్నారు. కృతజ్ఞతను పత్రికాముఖమున తెల్పి వున్నాను. కృతజ్ఞతా ప్రకటనానంతరం తలవని తలంపుగా మద్రాసుకు వెళ్లడం తటస్థించింది. అక్కడ సదరు గంగాధర రామారావుగారికి దత్తత రీత్యా మనుమలున్నూవారిపేరిటవారున్నూనాతో చెప్పినారుగదా : మీరు సవతినాయనమ్మ గారిని గూర్చి వ్రాసిన విషయాన్ని తాము సవతితల్లిగారికి జరిగిందని విన్నా మన్నారు. అసలే జరగలేదని శాస్రులుగారు లిఖించి వున్నారు. మా గ్రామంలో వెలంవారు పలువురున్నారుగాని వారిలో నా కన్న వయస్సు మించినవారిప్పడు వక్కరున్నూ సజీవులుగాలేరు. నేను వ్రాసే సంగతులు శ్రీ మాతండ్రిగారి వల్లనేకాక మావూల్లోవుండే వెలము వృద్దులవల్లకూడా విని వున్నవి. మావూళ్లో జరిగిన "లక్ష-యేభైవేల” వాదమే కాదన్నారు శాస్రుల్లుగారు. దానికి ధుండిగారు చెప్పిన శ్రీరంగంలో సంగతిని వుదాహరణంగా చూపివున్నాను. అదిన్నీ సత్యమైవుండునుగాని మా గ్రామంలో మా వీథినే జరిగిన లక్ష-యేభైవేలు “విభూతిరుద్రాక్ష ధారణమున్నూ అసత్యం కాదేమో అని యిప్పటికిన్నీ నాకు సందేహం. కమ్మగృహస్టు విషయంకూడా శాస్రుల్లుగారు అన్యథాకరించివున్నారుగాని అది తగినంత యుక్తియుక్తంగా కనుపడడంలేదు. ఆయన్ని శ్రీరాజావారు అవమానించ కనేపోతే ఆయనమేనల్లుళ్లు శ్రీ రాజావారి విషయంలో కొందఱు రౌడీలతో దౌర్జన్యాన్ని చూపడం యేలావస్తుంది? దాన్ని వస్తాదు వారించడం యేలావస్తుంది? యీవిషయాన్ని పురస్కరించుకొని కమ్మగృహస్టును రాజావారు ఖైదుచేయించడం యేలావస్తుంది? ఆయన ఖైదులో మృతిచెందలేదన్నంతవఱకు సత్యమైతేకావచ్చునుగాని, తక్కినయావత్తున్నూ అసత్యమని నాకు విశ్వాసం లేదు. శాస్రుల్లుగారేనా నాయిడువారేకాని యొక్కువ పెద్ద కారు. వారున్నూ ఆయిరాసంగతులు వినేవుంటారుకాని చూచి వుండరు. వారివినికినిబట్టి వారు సవరణను వుపపాదించివున్నారు. మునిగిపోయిందేముందని నేను నమస్కృతులతో స్వీకరించివున్నాను. శాస్తుల్లుగారి తాతగారిని గూర్చిన సహాధ్యాయిత్వం మొదలైన విషయాలమాటెట్టావున్నా అసలువిషయం అసత్యమని వ్రాయడానికి కారణాంతర మేమేనావుండి వుండునా అని నా కిప్పటికిన్నీ అనుమానమే. ఆ విషయం నేను శతధా సహస్రధా విని వ్రాసిందికాని మటొకమాదిరికాదు. సహాధ్యాయులో మట్టొకరో అన్న విషయం నేనే సంశయిస్తూ వ్రాసివున్నానుకదా? వారి యెడల నాకు ద్వేషభావం వుండి వ్రాసినట్లు శాస్రుల్లుగారున్నూ వ్రాయలేదు. మొత్తం మన మేలా అనుకోవాలంటే : ఆయాచరిత్రలు పలువురనోళ్లలోC బడి పలువిధాలుగా మారిపోతూవుంటా యనుకోక తప్పదు. వాల్మీకి సీతాదేవి లంకలో నిరాహారిణిగా వుందని వ్రాశాడు. దేవీభాగవతంలో ఇంద్రుండు పంపిస్తూవున్న కామధేనువుపాలు ప్రాణధారణానికి తగ్గన్ని పుచ్చుకుంటూ వుండేదని వ్రాసివుంది. రామదాసు బొందితో వైకుంఠానికి వెళ్లేండనిన్నీ వెళ్లేటప్పుడు - "తరలిపోతాము చాలదయలుంచండీ –యింక- మరలీజన్మాలకురామూ మదిలో నుంచండీ" అని గానంచేస్తూ మఱిన్నీ విమానాన్ని అధిష్టించాcడని భక్తులు గానం చేస్తూవున్నారు. చరిత్రకారులో? రామదాసుగారిని వురి కాంబోలును తీసినట్లు చెపుతారు. కాcబట్టి వీట్ల సత్యాసత్య నిర్ణయం చాలాకష్టం. శాస్రుల్లువారేనా బాగా కనుక్కొని సవరణను వుపపాదిస్తే అది యొక్కువ వుపకారం అవుతుందని మటీమణీ మనవిచేస్తున్నాను. శిఖావిషయాలు అసలే “సున్నకిసున్నా హళ్లకి హళ్లీ అంటే లోకం బొత్తిగా విశ్వసించటం లేదు కనక యింతగా మనవిచేసుకోవడం. యిటీవల యీ సంగతిని కొందటితో సంప్రతించి నేనింతగా మనవిచేసుకుంటూ వున్నానుగాని వాద తాత్పర్యంతో కాదు. యిప్పటి నా వోపికనుబట్టి, వొప్పలైన ప్రయోగాలను యెవరేనా తప్పలంటే నే ఔదాసీన్యం వహించే స్థితిలో వున్నాను. అట్టి సందర్భంలో యెవరివల్లనో విని వ్రాసే వ్రాంతల్లో యెవరో కాదంటే వాదం పెట్టుకుంటానా? పెట్టుకొనేది లేదు. మావూల్లోనే జరిగిన యింకొక శ్రీవారి చర్యను కొంచెం వుటంకించి యీ వ్యాసాన్ని ముగిస్తాను. మా కడియంలోవుండే గ్రామదేవతకు రంగువేయించవలసిందని రాజావారు ఠాణాదారు తాండ్ర కొండయ్యగారికి ఆజ్ఞాపించారట. కొన్ని మాసాలు జరిగాక రంగుప్రసక్తివచ్చింది. యేకారణంచేతనో రంగువేయించడము జరిగిందికాదు. దానిమీంద రాజావారు ఠాణాదారుగారిమీఁద కారాలూ మిర్యాలూ నూఱుతూ వున్నారంట. ఆకోపం చూచితీరవలసిందే కాని విని వ్రాసే వ్రాతలవల్ల అవగతం కాదని చదువర్లు తెలుసుకోవాలి. అట్టి సమయంలో యెవళ్లు గాని కిక్కురుమనకుండా వుంటే కొంతసేపటికి శ్రీ నృసింహమూర్తి కోపంలాగున దానంతట అదే చల్లారుతుంది. మళ్లా యెప్పుడైనా దగ్గరవుండే విదూషకులద్వారా తమ కోపాన్ని అభినయింపజేసి వారిని విశేషించి సత్కరించడం కూడా వుందని విన్నాను. ఆ కోపాన్ని నిర్భయంగా రాజావారియెదుట అభినయించి బహుమానాన్ని గ్రహించిన రామభౌట్లుగారి పేరిప్పటికిన్నీ ప్రసిద్ధిగా చెపుతారు. చెప్పేదేమంటే : అలా మీర్యాలూ నూరుతో వుండంగా వక నియోగిగృహస్టు ఉద్యోగాది సంబంధ כגeסססs లేశమున్నూలేని కడియం కాపురస్టుడు యేదో ఠాణాదారుగారి తరపున కొంచెం సవరణ మాటలు మాట్లాడడానికి వుపక్రమించేటప్పటికి ఆ ఠాణాదారుగారిమీంద వుండే దూCకుడు యీ సంపన్న గృహస్టుమీదికి వచ్చి వూరిపిడుగు సామెతను జ్ఞప్తికితెచ్చినట్లు చెప్పకుంటారు. ఆయీ కథలలోవుండే కోపపుసంగతులు వగయిరా మన మిప్పటి నాగరికతని మనస్సులో పెట్టుకొని చదువుకుంటే హృదయంగమంగా వుండవు. అధమం వక అర్ధశతాబ్దమైనా వెనక్కి వెళ్లాలి. అంటే యీ సంగతులన్నీ ఆనకట్టకు పూర్వపుగాథలు. ఆనకట్టకట్టబడి రమారమీ నూరేండ్లు కావచ్చింది. అప్పటికింకా "నావిష్ణుః పృథివీపతిః" అనే సూక్తి అమల్లోనేవుంది. అప్పడు రాజాగారు వచ్చేరంటే విష్ణుమూర్తి వచ్చినట్లే గ్రామం యావత్తు తలంచేవారు. రాజుగారివల్ల సమ్మానింపఁబడనే అక్కఱలేదు. అవమానింపఁబడితేకూడా కొంత గౌరవంగానే లోకులు భావించేవారు. యిందులో అతిశయోక్తి లవమున్నూలేదు. రాజుగారితో యేమాత్రం మాటలాడటం తటస్థించినా అదే మహమ్మేరువుగా భావించేవారు. ఆ కారణంచేత ఆ గృహస్టు ప్రసక్తిగాని ప్రసక్తిలో దిగి కొంత అవమానంపొందడం తటస్థించింది. కాని, విశేషమైన అవమానం వరకూ రాలేదు. సామాన్యంతో తేలిందని చెప్పకుంటారు. యింకా, లకుందాసు వేంకటాచలం అనే నాన్బ్రామిను సంస్థానపండితునికి సంబంధించినవిన్నీ, దివాన్ వాద్రేవు చెలమయ్యగారికి సంబంధించినవిన్నీ దిగవల్లి శివరావు దివాన్ గారికి సంబంధించినవిన్నీ మామగారు శ్రీ యినుగంటి ప్రకాశరాయణిం గారికి సంబంధించినవిన్నీ గాథలుచాలావున్నాయి. అవకాశాన్ని పట్టి అప్పడు వ్రాస్తాననిమనవి చేసుకుంటూ ఇప్పటికి దీన్ని ముగిస్తాను.

★ ★ ★