కడగనుటే సౌఖ్యముగాక (రాగం: ) (తాళం : )

ప|| కడగనుటే సౌఖ్యముగాక యీ- | తడతాకుల నెందరు చనరిట్లా ||

చ|| నిలచినదొకటే నిజమనితెలిసిన- | తెలివే ఘన మింతియకాకా |
కలకాలము చీకటి దవ్వుకొనెడి- | వలలభ్రమల నెవ్వరు వడరిట్లా ||

చ|| పరహిత మిదియే పరమని తెలిసిన- | పరిపక్వమె సంపదగాకా |
దురితవిధుల గొందుల సందుల బడి | ధరలోపల నెందరు చనరిట్లా ||

చ|| ఘనుడీ తిరువేంకటపతియని కని | కొనకెక్కుట తేకువగాకా |
పనిమాలిన యీపలు లంపటముల | తనువు వేచు టెంతటిపని యిట్లా ||


kaDaganuTE sauKyamugAka (Raagam: ) (Taalam: )

pa|| kaDaganuTE sauKyamugAka yI- | taDatAkula neMdaru canariTlA ||

ca|| nilacinadokaTE nijamanitelisina- | telivE Gana miMtiyakAkA |
kalakAlamu cIkaTi davvukoneDi- | valalaBramala nevvaru vaDariTlA ||

ca|| parahita midiyE paramani telisina- | paripakvame saMpadagAkA |
duritavidhula goMdula saMdula baDi | dharalOpala neMdaru canariTlA ||

ca|| GanuDI tiruvEMkaTapatiyani kani | konakekkuTa tEkuvagAkA |
panimAlina yIpalu laMpaTamula | tanuvu vEcu TeMtaTipani yiTlA ||


బయటి లింకులు

మార్చు




అన్నమయ్య పాటలు  
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |


"https://te.wikisource.org/w/index.php?title=కడగనుటే&oldid=9681" నుండి వెలికితీశారు