కచ్ఛపీశ్రుతులు/హరికథా సారణి
I హరికథా సారణి
౧. అంబరీష చరిత్రము
1. సర్వమత సామరస్యము :
సీ|| అదికారణ మెన్నరాదు కావున స్వభా
వములోకమని చెప్పు బౌద్ధమతము
జగ మంద్దము బ్రహ్మ సత్యం బటంచు నెం
తయు బోధపర్చు నద్వైతమతము
నగుణుడీశుడు ప్రపంచము వాని యిచ్చాని
భూతి యంచు గణించుద్వైతమతము
ఇహమె నిక్కము చ్వరంబెల్ల గల్లయటంచు
దెల్లముసేయు నాస్తికమతంబు
ఇన్నిమతములలో సారమెంఇయెంచి
దయయు నిర్మోహము నృక్తి ధర్మబుద్ధి
నాల్గిటిన్గ్రమముగ బొంది నయము మీఱ
జయము మన మందవలయు నో సభ్యులార!
చం|| మహిగడు నైకమత్యమున మానవులందఱు, నొక్కరీతిగా
సహనమ్ము సర్వభూతదయ సత్యము జ్ఞానముగల్గియొండొరుల్
దహి ననుకూలదృష్టుల ననారతము న్గనుగొంచు సౌఖ్యమీ
యిహమున బొందుచుంట నిక్ నె బతికించెడి భాగ్యమెన్నడో
2. కృత్తి :
సీ|| అభ్ర్ంలిహోదభ్ర నిభ్రమాభ్ర భ్రమ
కృన్నీల దీర్ఘ శరీర మమర
బ్రళయకాలానల ప్రభన్ జక్రీకృతే
క్షణముల రౌద్ర మక్షయముగాగ
ద్రైలోక్య కణ్భళనోత్సాహ సూచక ఘమ
వక్త్ర్రత్రయొగ్రతవాసికెక్క
బర్పు బర్బరకేశ పాశారుణప్రభా
కాల సంధ్యారాగ కొంతిదనర
గ్రకచ కఠిన కత్త్శ దంష్ట్రలు వెలుంగ
బదయుగోద్దూత పాంసువు ల్చదలుగప్ప
నెలబదముల నింగిని నిడ్డతలల
న త్తిగొనివచ్చె గృ తి తా మి తి పగిరి.
౨. గజేంద్ర మోక్షణము
3. సంప్రార్థనము :
గీ|| అన్నిటికి దుద మొదలయి యున్నవాడ!
పలు తెఱంగుల నొకడవై కురగువాడ!
దొరికి దొరకని యట్టుల దిరుగువాడ!
నేను నీవాడజుమ్ము నాలోనివాడ!
గీ|| కోరికల కడ్దుదగీలెడు వారిలోన
గొప్పవాడవుగాన నినొల్వవలనె
అడ్డుదగిలెడు వాడెక్కుడైనయప్డు
వేడుకొనకెమి చేయడు విఘ్ననాధ:
--
గీ|| నాకు మూగి నత్తి లేకుండజేసిన
యమ్మ! నీ దయారవమ్ము జల్లి
నాదుమాట మెత్తనగ దీయ్గా దేట
గా నొనర్చి నన్ను గానరాదె.
సీసార్ధము|| తెలుకలియెద్దు కన్నుల గంత కట్టగ
బడి గాన్గునకు బూన్పడి యెకింత
యను దారితోచక యుండియు నెంతయు
మనికోలఛే దండిబొడువగబడి
చుట్టిన త్రోవనె చుట్టేడు తీరున
మనమును ఘనమోహమౌనను గ్రుడ్డి
వారలమె విధివశమున సంసార
మందు పూన్చగబడి మందలగతి
తెలియకున్నను గాలంబువలన బోట్లు
నడపి చర్విత చర్వణ నర్తనములు
సలుపుచున్నార మిట్టి యజ్ఞానదశను
బొందకుండగ నీశుండు
బ్రోచుగాన వేదుడీ
నీచరతులగాని-నిత్యసంవరనూని
కాచమక్కరగాని-గడుసుతనములూని
యోచనం బికనేల గతి. జూచుకొనినది వేళ తడ
వాచరించుటమేల భవ-మోచనంబగు జాల|| యూశుండు||
దా స భా ర తి
సీ॥ అభ్రంలిహాదభ్ర విభ్రమభ్ర భ్రమ
కృన్నీల దీర్ఘ శరీరమమర
బ్రళయకాలానల ప్రభను జక్రికృతే
క్షణముల రౌద్ర మక్షయముగాగ
ద్రైలోక్యకబళనోత్సాహ సూచకఘన
వక్త్రత్రయోగ్రత వాసికెక్క
బర్పు బర్పరకేశ పాశారుణప్రభా
కాల సంధ్యరాగ కాంతదనర
గ్రకచ కఠిన కరాళ దంష్ట్రలు వెలుంగ
బదయుగోద్దూత పాంసువు ల్పదలుగప్ప
నేలబదముల నింగిని నిడ్గతలల
న త్తిగొనివచ్చె గృత్తి తా మత్తి పగిది.
గజేంద్ర మోక్షణము
గీ॥ అన్నిటికి దుద మొదలయి యున్నవాడ :
పలు తఱంగుల నొకడనై భరగువాడ :
దొరికి దొరకని యట్టుల దిరుగువాడ :
నేను నీవాడజుమ్ము నాలోనివాడ :
గీ॥ కోరికల కడ్దుదగిలెడు వారిలోన
గొప్పవాడవుగాన నిన్నొల్వవలనె
అడ్డుదగిలెడు వాడెక్కుడైనయప్డు
వేడుకొనకేమి చేయుడు విఘ్ననాధ!
-
గీ|| నాకు మాగి నత్తి లెకుండజేసిన
యమ్మ ! నీ దయారవమ్ము జల్లి
నాదుమాట మెత్తనగ దీయగా దేట
గా నొనర్చి నన్ను గానరాదె.
సీసార్ధము|| తెలుకలియెద్దు కన్నుల గంత కట్టగ
బడి గాన్గునకు బూన్పబడి యెకింత
యును దారితోచక యుండియు నెంతయు
మునికోలచే ద్ండిబొడువగబడి
చుట్టిన త్రోవనేచుట్టేడు తీరున
మనమును ఘనమోహమునకు గ్రుడ్డి
వారలమై విధివశమున సంసార
మందు పూన్పగబది ముందలగతి
తెలియకున్నను గాలంబువలన బోట్లు
వడసి చర్విత చర్వణ వర్తనములు
సలుపుచున్నార మిట్టి యజ్ఞానదశను
బొందకుండగ నీశుండు
బ్రోచుగాన వేడుడీ
నీచరతులగాని-నిత్యసంవదమాని
కాచమక్కరగాని-గడుసుతనములూని
యోచనం బికనేల గతి-జూచుకొననిది వేళ తడ
వాచరింఛుటమెల భవ-మోచనంబగు జాల|| యీశుండు||
4. పరిణామము
కాంభోజి-సీసమాలిక
పరిపూర్ణుడగు ప్రరబ్రహ్మ సర్వప్రపం
చాకారుడై తనయందు దానె
యవతరించు యధేచ్చ నడగు, నీ జగమెల్ల
నతనికి నాటపట్టయి వెలుగు,
నొకటి నున్నను గూడియున్నప్డు పదిగతు
లందు పోలిక్ మాఅనొంది యతడు
తొలుతన్ ంబదివేషముల జూపు, నవ్వాని
జాడల జంగ్మ సంఖ్యపెరుగు,
గేవల జలధర జీవులలో జేన
పదివేషములలోన మొదటిమచ్చు,
దీని రెక్కల జాడవాని పై కెగిరెడు
పక్షులు బుట్టె నాపైని, నాల్గు
కాళ్ళతో భూజల గతులందు తాబేలు
రెండవరకముగా నుండు, దీని
వలె పంచనఖముల బరగు సడవి పంది
మూడవయది, దీని ందలు చేసి
తోకలుగల మృగలోక మంతటిలోన
సింహము నాల్గవల్ చెల్వు, తోక
గలుగక చేతులు గాళ్ళేర్పడగ బొట్టి
యగు మేను గల్గి మాటాడగలుగు
మనుజు డైదవ తీరు, మఱివానికన్న దై
ర్యంబు కొంతియు బుద్ది నలచునట్టి
మనుజు డాఱవపోల్కి, జనలోకపాలన
దక్షుడై యుత్తమోత్తముడుగా గ
నెగడు భూభర్త యేడగువేష మదియె వృ
ద్దికి మేర యంతతో దీసివేత,
క్రమముగా సృష్టికి గలుగు నెన్మిదియవ
వేషము మతున వెలయుచుండు.
తొమ్మిదవరూపు వికృత వేషమ్ము, మఱియు
బదియవది మృగనీలతో బరగు దుదకు
భూమిచ్రములు జలముల మున్గు, సృష్టి
యెల్లయును దెగు మిగులు సర్వేశు డొకడు
5. సగుణోపాసన:
ద్విపద|| పతి దూర దేశంబు వట్టినయపుడు
సతి వాని చిత్రంబు సరగునదెచ్చి
కనుగొని యుప్పొంగు గన్నీరు నించు
గొనియాడు మనవి గైకొనుమని వేడు
నతిభక్తి గొల్పు నాధాయనిపిల్చు
బ్రతిమాలు పదములు పైబది సోలు
దన గతిగని పొక్కు ధైర్యంబు దక్కు
తనదు సొమ్ములదీయ ధర్మంబు సేయ
బెనిమిటి చరితంబు వినిపించువారి
గని గారవించు సత్కధల నాలించు
నటువలె మనము నిత్యంబు సర్వేశు
బలమున భావించి బ్రతుకుట మంచి.
6. సూర్యాస్తమయము:
గీ|| తన్ను వెంట దగులుచున్నట్టి కోడె చీ
కటుల కెదిరి నిల్చు కడిమిలేక
దా స భా ర తి
పశ్చిమాబ్దియందుబడి దాగె సూర్యులదు
కాల మొక్కరీతి గడుపగలమె.
7. చంద్రోదయము:
గీ॥ ప్రొద్దు పండుటాకు పొలిక రాలె గెం
జాయ చివురులెత్తె. గోయిల లన
వెలగి కవిసె జీకబులు బూనె: జుక్కలు
పైని జందమామ పండుదోచె.
8. సరోవరము:
చ॥ చవుచవి కొంచె మల్లసిత దారుపయోరుహనన్మరందఖా
దనమదమ త్తబంభర వితాసరవ ప్రతిమానిగానమా
ననియమితోరు భంగపటునాద మృదంగ ధనానుకూల ద
క్రవివహారావతాశ రసరమ్య విశాల పుర: ప్రధానమున్.
9. విపన్న ద్విపము:
ద్విపద॥ నరసులోపల వెయ్యి సంవత్సరములు
సరిగాను మకరితో సల్పెదాబోరు
అంతకంతకు వక్రమధిక సత్యమున
వింతసొంపున హెచ్చి వే దను బట్ట
బహులపక్షపు విధు పగిరి గన్నట్టి
యహమర్ధమగు తిరి నందు మానవుని
నీడపోల్కిని డింది నీటుసుదప్పి
వాడిక్షీణించె నా వనగజ మపుడు
క చ్చ పీ శ్రు తు లు
కాలకింకిరుచేత, గష్ఠాతుపగిది
జాలరి వలబడ్డ రుసము చందమున
జెలగి సంసారంపు జెక్కునబడుచు
బొలుపుమాలిన జ్ఞాని పోల్కిని మఱియు
నప్పులలో మున్గు నలతి చందమున
నప్పులలో మున్గి హస్తీంద్రుడవుడు
చెడుగు వక్రమువల్ల జేడ్పడి కనుల
బడి బుడి కన్నీరు పొడవకింతించె
మ॥ ధరణీ మండలమెల్ల నేలినను విద్యాసాగరుండై నద
త్వరమాద్యక్షుడునైన నెవ్వడయినన్ బ్రారబ్దముల్ దప్పునా
యెఱుగన్వచ్చెను నాకు జూడ మను నింద్రద్యుమ్న భూపాలుడన్
గురుశాపంబున వింతవచ్చె నని యా కుంభీంద్రు డూహింపుచున్
10. విరాడ్రూపము:
మధ్యాక్కర॥ అతడిట్లు నిర్గుణ బ్రహ్మంగిమాత్మలో నలరుచుండ
స్తుతేసి యంతతో దుష్టిబొంద కాతురతనుబొంది
చరురిత్వమూని సర్వేకు వంతటను పగులువిజేసి
యతిభక్తితోడ వర్ణింఛె మతసంబతిశయిల్లంగ
చ॥ బంధుల రోమకూపములు, శల్యము లద్రులు,సూర్యచంద్రుల
లక్షులు,నవనంబు లూరువులు, శుక్లము వర్షము, మిన్నుశీర్ష,మి
య్యిల జఘనంబు, మేను జగమల్లయునై వెలుగొందు నేవిభుం
డలఘు డనంతుడవ్యయు ఉపాది గురుండగు వాని గొల్చెదన్.
గీ|| కానిపావడ జీరాడ కాంచి వీడ
కౌను ఱవ్వాడ నారదమౌని పాడ
మేచకముతోడ దొల్కరి మెరుపుజాడ
వేగుదెంచెను లక్ష్మి సర్వేశునీడ
3.గౌరప్ప పెండ్లి
12 ఆత్మజ్ఞత
సీ|| మురికీ కాయక మిదిమూనాళ్ళ ముచ్చట
గాలిలోని యిలాయి కరణిగదలు
తలచినట్టులరాదు-తగువానివలె మెల
గన దప్పగడువ దీ-గిడ్దబ్రతుకు
తన తోడివారల-న్దానెట్టులైన గుం
దింపక మేల్పొంపు-పెంపుకాదు
ఒరిమిక చొప్పడ-దోరిమి కుదురదు
మెలకువ న్వంతయే-మిగులుదుదకు
అనుచు నెఱిగిన గొప్పవా-రనయము నిను
వేడి చావని పుట్టని వెరవు గనిరి
తొల్లి, యీనాటి కల్లరీం-డ్రెల్ల నిన్ను
మఱచి రెంటికిజెడి పిల్కు-మారుచుంద్రు.
క చ్చ పీ శ్రు తు లు
13. సంగోరు గౌరు:
సీ॥ ఎడమనై పాడురి-కుడి తట్టు మగవాడు
నడుబొంది నిరువుర. బెడగుదోవ
విటు కప్పు గొప్ప కొప్పటు మినువాణ్ పౌ
ల్తుకడాగు వన్పె వెం-డ్రుకల కొండె
యీకృచ్వ బిగిరిక-యా కెలకువ బాస
పేరిటగ చ్చట-బెరుగు డాలు
రెంట త్రాగుడు తిండి-పెంటితే రీవల
నా చక్కి క్రొవ్వాడి-యాలబోతు
విన్నజాబిలి మూడవ-కన్ను నింగి
నేల లేలెడు నేరువు-నిండు తన్వి
యెదురెఱుంగక మఱి మఱి-బ్రతుకువేడ్క
గౌరు ముక్కంటులకు వంతు-గా జెలంగు.
మ॥ ఇటుముక్కంటియు మెట్టునట్టి, కవమై నింపాడు చెల్వంబుతో
నెటు లెందేనియు దాముకాని రినుపే దీలేని యట్లెల్ల ము
చ్చటల న్మచ్చికదోచు చాడు మగయోజ న్గొల్పునవ్వారి బా
సటయై కోరని కోర్కులిచ్చెదరు సెల్ప న్వేల్పు కన్నకులై.
4. జా న కి శ ప ధ ము
14. ప్రబోధము:
సీ॥ పెద్దలమాటలు బెడచెవిబెట్టకు
కార్పణ్యమున నహంకారపడకు
మెట్ట వేదాంతము వట్టి యంతయు మిల్లిత
యని ధర్మలింగముగ నడపకుము
దా స భా ర తి
దేవాలయములందు దీర్ఘసేవలను మా
హాత్మ్యంబు లేదని యార్వబోతు
విపరీతబుద్దివై స్వీయకులాచార
ముల మాని పరమతములను గొనకు
ప్రాణులం జంపనొల్ల కెబృగినైన
మారొనర్చకు మే యపకారికైన
నొరుల గొప్పకు నుల్కకు మో హృదయమ
సర్వము వ్విష్ణుమయమని శాంతిబొందు.
సీ॥తెలియని సుఖదు:ఖములు బొంది కొన్నాళ్ళు
పొత్తిళ్ళలోంబడి పొరలినావు
తలిదండ్రులకు దప్ప వెలిలోక మొఱగక
తప్పటడుగుల దారినావు
కొన్నాళ్ళు పిమ్మటం గోతిచేష్టలు గల్గి
దుడుకుదనంబున ద్రుళ్ళినావు
అటుపయి గొన్నాళ్ళు లడియాసవలపున
గడు మోసకత్తెలం దడవినావు
ఇప్పు డెఱింగియు నెఱుగక గొప్పకొఱకు
వ్యర్ధ సంసారమున దేవులాడెదీవు
ధరణి నీమీద నేమి కాదలచి నావో
చాలు వికనె వ డెందమా శాంతిబొందు.
సీ॥ ధనము కావలసిన దంభము ల్మోనము
ల్సేన లిచ్చకములు సేయవలయు
కామ సంతృప్తికై కాంతలకున్ తొంగి
కామ సంతృప్తికై కాంతలకున్ వొంది
కాని గడ్లెల్లను గఱుపవలయు
11
క చ్చ పీ శ్రు తు లు
స్వకుటుంబ వృద్దికై వ్యయము ప్రయానంబు
నిడి యాత్మ సౌఖ్యంబులం బెక్కు
దేశంబులం దిమ్మదిరుగవలయు
అల దిగంతపురేఖ యట్టులను మదికి
జేరువై తోచి సంతుష్టి దూరమమగును
దు:ఖమే మిగిలియుండును దుదకు మనకు
గాన విహ భోగముల పయి గాంక్ష తగరు.
15 వేసవి వేళలు:
సీ॥ ఆకైన నల్లాడనీక దిగ్భంధన
ముగ గాని చెమ్మటం బొదవె నుక్క
మిన్నంటి చెల్వకై మెలవుకొడుత గ్రద్ధ
చాలుగ నిరుప్రక్క జాచె రెక్క
ముంగాళ్ళతో జెట్టుమొదట గాతన్ ద్రవ్వి
కుదురుగ బడుకొనె గుంటనక్క
యెండమావుల గాంచు చెంతయు దప్పితో
వాడి పరువునెట్టె లేదిలక్క
యెడకు బుదుకెత్తి తుమ్మెద లుడిగె వద్దు
రగులుకొను నగ్గికిం గనరాదు హద్దు
అడవిపందికి బురదనీ రయ్య ముద్దు
వెలవెల బనిరద్దు నిడువేసవి నడుప్రొద్దు
సీ॥ఉడుకెత్తి పాదుల న్మిడిగిన నీడలు
చల్లగు దూర్చున సాగుచుండె
దా స బా ర తి
వడదాకి తొర్రల నడగిన పిట్టలు
ముదముగ బైటను మ్రోగుచుండె
కడు నెండవేడిమి న్గ్రాగిన గాడ్పు హా
యిగ మంచుకొండకై యేగుచుండె
కొండను దిగి మేతకొరకు బెబ్బులు లుమ్మి
రిగ బల్లమ్ల జెలరేగుచుండె
పాములకు బుట్టలలోనుండి పడగహెచ్చె
మడుపు నెడబాసి యేనుంగు లడవిజొచ్చె
ప్రొద్దు పడమటకు వ్య్రాలి ముద్దువచ్చె
నెగడి జానకి వాలుకన్నుగన నిచ్చె.
సీ॥ ఎల్లపిల్లలు గూళ్ళకెక్కగ గుడ్లగూ
బలు ఋషిపక్షులుం బయలుడాసె
వైదేహి దురవస్థ పరికింపలేనట్లు
ఖిన్నుడై సూర్యుండుకన్నుమూసె
వనవు: గుంకుమము నాకసమున సంజయ
న్పేరావపెద్దమ యారబోసె
అంచెలుగా నక్క లరచుచు దెసలందు
ధరణిజ కష్టంబు నెఱుకజేసె
చీకటిముసుంగునన్ భూమి చింతబండె
చుక్కలు న్పీతకై మింట బొక్కుచుండె
బొదలి దవుదివ్వెలుగ గొండపోళ్ళు మండె
జనకజకు నప్పు ఉష్టమశనియు నిండె
46
క చ్చ పీ శ్రు తు లు
5.ప్రహ్లాద చరిత్రము
----
గీ॥ పూర్వకవు లందరున్ గడు పూజ్యు లందు
భాగవతులయి గోస్తనీ పాకముగను
గృతులొనర్చు నధికుల సంస్కృతమున లయ
దేవు దెనుగున బొతము వెలిసి యెంతు.
సీ॥ పూర్వప్రబంధము పోల్కికై చచ్చిన
యీగ నంటిచెడు హీను డొకడు
ప్రౌఢకల్పన లని పన్ని తనకుదానె
యర్ధం బెఱుగలేని వ్యర్దు డొకడు
కృతిని నిఘంటువు వెతకి ముదురుతాటి
ముంజె వలె న్జేయు మూర్ఖు డొకడు
తేటతెల్లంబని తెన్గుబాసకు బట్ట
తెరచి చూపించెడి దేజె యొకడు.
కవినశంబున శారదకలుషయయ్యె
బిదపకాలంబున దలంపు పిచ్చియయ్యె
అచ్చు చవకయ్యె మూడులు మెచ్చిటయ్యె
నహహ : యెందుకు కవులెరి యాధునికులు
దా స భా ర తి
18. ప్రహ్లాదపాత్ర శీలచిత్రణము:
సీ॥ ఇతరుల మనము నొప్పించ డే కరుణాని
శిష్యుడు తన కంత చెల్లియైన
జోద్యమునకునయ్యు జూడ డే ధృతశాలి
వరకాంత దానెంత సరసుడైన
నఖిలణనంబుల కడకువ జూపు నే
విజ్ఞాని తా దొరబిడ్డడైన
దెలియనియట్లుల దిరుగు నే తత్వవి
స్పూర్తి తా సర్వజ్ఞమూర్తియైన
వ్యసనముల కెదురొచుక్క, సత్యంపుమొక్క
యందపు దుదిమెట్టు, తెలివి కాటపట్టు
జ్ఞానభగతాగ్రణి, దాసవమణీ
యజునకు న్శక్తి నున్న ప్రహ్లాదు నెన్న
19. సదసత్సంశయము:
సీ॥ హరియన నెవడని యందురేవి యతండె
ముఖ్యకారణ మన్ని భూతములకు
అరాశ మట్టుల నంతట నిండియు:
దా నెద్దియుం గాక తనరుచుండు
కల్లను నిక్కంబు గావించి నాతండు
నున్నకు విలువను బన్నునట్లు
అతనికి వేఱైన దదియె శూన్యము దాని
నే మాయ యని మన మెఱుగవలయు
పెక్కులేల యెల్ల వేదాంత సారంబు
తేటతెల్లమగును దెలియనరు
క చ్చ పీ శ్రు తు లు
ఎద్ది కలదొ యరియె యీశ్వరతత్వంబు
ఎద్ది లేదొ యదియె యీ జగంబు
కం॥ కలిమిగలవాని లేమిన్
గలవా డెడు లాశ్రయించి కలిమి దెలుపునో
తెలియదు లేని జగం బిది
యెలయ న్నర్వేశు నొద్ద నున్నలు తోచున్
20. నరసింహావతారము:
సీ॥ గంభీర భీకర గర్జారనంబున
బ్రహ్మాండబాండల్ కర్పరము పగుల
చటుల నటాచ్చటా చలన సంజాత ప్ర
చండ వాతాహతిన్ గొండ లెగయ
కాలానలాభీల కీలాభ జిహ్వా ప్ర
భావశిన్ జగమెల్ల జేపురింప
కురుణేందు భాసుర దంష్ట్రసఖచ్చాయ
లలమి దిక్కులకు వెన్నెంలుగాయ
కరము లురమును శిరము సెంగంబుమాడ్కి
నాలికిన్ గ్రిందిభాగము నరునిపోల్కి
నలర నరసింహురూపున నవతరించె
నాశ్రితపరాయణుండు నారాయణుండు
దా స భా ర తి
6.భీష్మ చరిత్రము
----
21. కర్తవ్యబోధ:
సీ॥ పనుల జన్నమున జంపగనేల నాకలి
గొన్న భూతామ్ముల కన్న మిడుడు
నోరునొవ్వగ వేదపారాయణము లేల
నందఱిమ్రోల సత్యము పలుకుడు
తీర్ధయాత్రల డస్సి తిరుగులాడగనేల
నార్తులకెల్ల సహాయపడుడు
సన్యాసిభిక్ష నెంచగనేల మనకోటి
పాటివారలకునై పాటుప్;అడుడు
ఎందుకిక వేయిమాట లీ యలను సర్వ
జనుల కుపకారముగ నడువని మనుజుడు
జపతపంబులు నిష్టలు సలుపుటెల్ల
బూడిదంబోయ పన్నీటి పోల్కిగాదె.
సీ॥ బ్రతికియున్నంతకు స్వర్గనరకముల
సంగతి దెలియ నసాధ్యముగద
తరలినవారలు పరలోకవార్తల
జెప్పినా మనతోడ నెప్పుడైన
మర్త్యుల నోళ్ళలో మలయ వేదములకు
గనగన నొక ముక్కుమొనయు గలదె
17
క చ్చ పీ శ్రు తు లు
దీపమాఱినయట్లు తెవ్వి శూన్యంబగు
దేహాంతములయందు దెల్లముగను
మనకు గగనారవింద వరనము లేల
యిహమునందున స్వమతాభివృద్ది మీఱ
నెల్ల రన్యోన్యమైత్రికి హేతువైన
ధర్మవర్తన మెపుడైన దప్పజనదు.
గీ॥చెలగి తలిదండ్రుల యభీష్టములను దీర్చు
పుత్రులకు నిశ్చయంబుగ బొందరాని
పదచ్వులుండెనె ధరణిలోపల సమస్త
జనులకుం బితృభక్తి రసాయనంబు.
గీ॥ చెల్లునని పెద్దలమని తోచిన విధమున
తెలగి సంసారులకు బాధ సలుపరాదు
నీతిమాలిన యపుడు మన్నింపదగదు
గురువులనైన మరెట్టి భూసురులనైన
గీ॥ తమకు లాభ మెదియు పోయ కెంతయు
బరులకొఱకు పాటుపడుచునున్న
పిన్నవారికైన బెద్దలకైనను
మంచిచెడ్డ దెలుప మనసె సాక్షి.
22.భవనిరాసము:
సీ॥ తల్లిగర్భమునం దొదవినట్టి కష్టము,
పొత్తిళ్ల లోపల బొరలుబాధ
దా స భా ర తి
పసితనంబున నవ్యవశతదే విజృంచి
యౌవనంబున గామయాతనయును,
వార్ధక్యమున వ్యాధివలన వేదన, క్షిత్పి
పాపల నంటినపట్ల నిడుమ,
నతత మంతర్పహిశ్శత్రుజనిత పీడ,
తాపత్రయంబున దగులుచింత్గ
బ్రతుకు నిఖిలల బిదియె సుఖాభాస మక్లు
దు:ఖపూరిత మటుగాన దురితదూర:
వాసుదేవ:ముకుంద;యీ భవము మఱల
జెందనీయక నన్ను రక్షించు కృష్ణ!
23. కర్మము:
సీ॥ పాతాళగంగ నుపాయంబునం పైకి
రప్పించవచ్చు యంత్రములచేత
మెలవున జీవనదుల గాల్వల్ం దీసి
నీరు వలయుచోట్ల నింపవచ్చు
పర్వతముల గల బఱు నీటిధారల
నెప్పట్టులంకునైన ద్రిప్పవచ్చు
కర్మమున గానిపెద్దియు గానరాదు
కర్మమే దైవతము జగత్కారణంబు
కర్మవశమున స్వర్గాధికార మందు
వాని కిటు లంచమిచ్చుట వటి నెఱి.
క చ్చ పీ శ్రు తు లు
24.భక్తలక్షణము:
సీ॥ నీవె సర్వంబని నిశ్చయించినవాడు
భవరోక మంటదో పద్మనాభ:
త్వద్దివ్య నామామృతము గ్రోలునాడిహ
భోగంబు లొల్లడో భోగశయ్న:
నీ పదాంబుజ భక్తినిరతుడౌ వాడన్య
కర్మము ల్సేయడో జ్ఞానరూప:
నీదు దాసులతోడ నేస్త మందినవాడు
పరుల సేవించడో పరమపురుష!
నీవలన బ్రతుకున్ గాంచు నేను నిన్ను
మోసపుచ్చగ బూనితి మూఢుడ నయి
అక్కటాగ్రుడ్దు పిల్లను వెక్కిరించు
నట్లు మాధచ్వ: గోవింద: హరి: ముకుంద:
25.మూర్తి చిత్రణము:
సీ॥ చిరుగుంట కల్గిన చెక్కిలితోడుత
నద్దిరాయద్ధ మెట్లగును సాటి
ముక్కుప్రక్క మొదలు మోవి మూలవరకు
బొల్పారుల్ వంక కే పోల్కిగలదు
హోయలుగ బల్చాలు నొకవైపు గన్పర్చు
పిన్ననవ్వున కెటు వెన్నెల యెన
నడుమ చక్కనినొక్కు తొడ్రిన గడ్డము
పోలువున కెద్దాని బోల్చవచ్చు
భళిర యత్మైకవేద్య స్వభావమహిమ
నుపమ లుత్ప్రేక్షలుం దమ యూహ బన్ని
దా స భా ర తి
తప్పుబల్కుట గాక సత్యమున దరమె
యజునకై నను మఱి వాని యబ్బకైన
8. మార్కండేయ చరిత్ర
--------
26.అభ్యుదయాభాసము:
సీ॥ జనులార మన పిన్నతనమున మనకు గ
ల్గిన హాయి, యాప్పటి మన యవస్థ
గనుగొంటిరే వాడు కనులకు జీమప్రా
కుట సైత మెంతయో గొప్ప చోద్య
ముగద యెంతటి యాకలి గొనియైనం జప్ప
టులు విన్నయంత నేడ్పు దొలగుగద
నేడు మోదము సేయ నేరవెవ్వియు మన
చూపులకైనను శ్రుతులకైన
వక్కటా: యీడుతోడుత నాసపురుగు
పెరిగి చెలరేగి సంతుష్టి తెరచుచుండె
జ్ఞాన మేపారె సజ్జాన మనుచు
జెప్పుకొనుటకు లోలోన సిగ్గుపుట్టె.
27. మనుషుల పోక్లి
గీ॥ ఎఱ్ఱచీర జూచి వెఱ్ఱియెనలు బెట్టి
పరుగులిడుచు నార్చు బ!ఱ్ఱెబోలి
ప్రతిభ గాంచి యోర్చు ప్రాజ్ఞత లేమి బై
కుబ్బిన శక్తిహీను లుల్కుచుండ్రు
2
క చ్చ పీ శ్రు తులు
గీ॥ పాలకులు తనకిచ్చు జీవనముకన్న
రెండు రెట్టులు గుఱ్ఱపుబ్ండికొఱకు,
సానిపాపకు, మఱియు సీసాలకుఱకు
నిచ్చు నుద్యోగి కప్పెచ్చువచ్చునెట్లు?
సీ॥ ఒకచోటసాధులద్రికమకలం బెట్టి
బాధించి మను న్యాయవాదిజనము
లొకచోట రాజులయెద్ద నిచ్చకముల
బల్కుచు నెగడు విద్యుక్తులమ్ము
నొకచోట లంచము రొడిసి మ్రింగుచు నంత
మెయ్యన జూపు నుద్యోగిగణము
నొక్కచో వెలిసేత లెక్కించుకొనుచు రూ
కల దీయుసీరాధికారిబలము
లక్కటా వీరలే యిపు డపనియందు
సకలజన సూత్రధారులై సాగుచుండ్రు
మారికివ్వలె వీరికి మనుజులెల్ల
వడకుచుందురు కలికాల వశమిచేత
ఉ॥ అప్పెగవేయకుండ మరి యర్ధము దొంగిలకుండ శత్రువు
లొన్బడకుండ పాలకులు జూచినగాని సమస్తసౌఖ్యము
ల్పప్పునబారద్రోలి యవశంబయి వచ్చెడు చావుదయ్యము
న్ర్పొప్పగజాలినట్టి చతురుం డొకడైన గనంగవచ్చెనే!
28. సుత్యమృత్యుంజయము:
శా॥ గౌరీచిత్త సరోజభృంగత్రిజత్కశ్యాణవాసంగసం
సారద్వాంతపతంగ।త్రిజగత్కళ్యాణదాసాగ।నం
సారద్వాంతసతంగ।మూర్ఖవిచలత్స్వర్గానగాభంగకే
దా స భా ర తి
<poem> యూరప్రాస్తభుజంగ।మర్ధితలలో గ్రోద్దండమాతంగ।తా రారబ్బ్రజ్వలితోత్తమాంగ।లలితార్ధస్వాంగ।మృత్యుంజయా
మ॥చటులాంభోదిగభీరభాష।విచలత్స్వర్యాహినీభూష।సం కటసంసారవిశోష।దృష్టివిలపత్కారుణ్యసీ యూష।దు ర్ఘటరక్షోజవభీష।భక్తజనహృద్రాజీవనంతోష।సో త్కటగౌరీరమణియవేష।దురితాంధ:పూష।మృత్యుంజయా.
మ॥రవిచంద్రావలనేత్ర।దుర్ఘటమహారక్ష।పురీజై త్ర।సిం ధురచర్మాంచితచేల:మూర్ధవిలనద్ద్యోవాహినీకూలు:న ద్గిరిజూచిత్తవిలోలభక్తజనహృద్వీదీనటచ్చీల।భఆ స్వరదక్షిణయశోవిశాలశఋఇరాబత్పాలమృత్యుంజయా।
మ॥విరతశ్వేతగిరీంద్రగేహ।ప్రమదోన్నిద్రాశ్రితవ్యూహ।లం ధుర్గోనాయకవాహదుష్టదనుమాంసోటనొత్సాహ।దు స్తరరక్ష:పురదాహ:పర్వతతనూజాబద్ధసమ్మోహ:సిం ధురదర్మాంచితదేహ:భక్తిజనబందుస్నేహ!మృత్యుంజయా
మ॥అరుణాంబోరుహవీక్ష!దైత్యకులాడ్ద స్తీంద్రహర్యక్ష:దు ధరహాలాహలభక్ష! నంచకితభ ప్రాణసంరక్ష!దు
/poem> 23
క చ్చ పీ శ్రు తు లు
ర్భరసంసారవిపక్ష।సర్వసుమన:రస్థానవాద్యక్ష!సిం
దురిదేహాంచితకక్ష!భూమిదరరాడ్తుక్పక్ష!మృత్యుంజయా
మ॥ నతబృందభయల్దాన!ఫాలతలనివ్యస్తోడురాట్పూన!సం
తతిసామాగమగాన!యోగిజనహృద్యన్యోక్షనంధాన!ప్రో
ద్దతహాలాహలపాన! రక్షితకపద్దాక్షాయణీమాన!స్ం
గతకారుణ్యనదీన!శశ్వదపరోక్షజ్ఞాన!మృత్యుంజయా!
మ॥పరిపుష్టాబ్బభవాండ!శిక్షితసురప్రత్యర్ధివేదండ!సం
సరణచ్చేదనశౌండ!కల్మషతమిన్రస్తోమమార్తాంద!దు
ర్భరరక్షోజనదండ! దారితమదోగ్రక్రూరపాషండ!బం
ధురవేదాళికరండ!శూలవిలవద్దో ర్ధండ!మృత్యుంజయా
8.యధార్ద రామాయణము
--------- 29.రాకాసి:
సీ॥ పదఘట్టనమునకు బెదరి జంతులు పాలు
బెను హుంకృతికి దెస ల్పీటరేఖ
వ్రేలాడు కొప్పున వెదురుడొంకలు చిక్కు
పడి నేల నూడ్చు చప్పుడు నొనర్ప
గాళ్ళకుదగులు వృక్షంబు లన్నియు గడ్డి
కాడలవలె జాపకట్టుకొనగ
అడుగడ్గునకు మధ్య నాపాటి యీపాటి
యేశులుం గుట్టలు నిముడుచుండ
దా స భా ర తి
లోనికిం బైటి కూర్పు పుల్గులనులాగ
నరకపాల ముక్తాభరణంబు లెనగ
నగ్నికుండము లట్లు రక్తాక్షు లలర
వచ్చి తాటక పిడుగులుపడగ బల్కె
30. తత్త్వము:
గీ॥ లేని దున్నయట్లు లీలకై తలపోసి
పురుషు డందు బంధమోక్షములను
బిల్లకాయ మాడ్కి నెల్ల జగం బిది
వచ్చు బోవు నతని యిచ్చకొలది.
గీ॥ ఎటుల భావింప నటు తోచు నిజ్జగంబు
ఆత్మ తప్ప మఱే వస్తువైన లేదు.
కలుగు దనయంత జ్ఞాన మజ్ఞానమట్లు
శాశ్వతంబగు నాత్మకు సహజమిది.
గీ॥ కలదనిన లేదు, లేదన్న గలదు జగము
నభమునందున గన్పడు నల్పు మాడ్కి
నిర్గుణుడు విత్యు డాత్ము డనిశము ప్రకృతి
నంట డంటియు నీ రామరాకు వలెను.
31.ప్రభాతము :
సీ॥ తప్పు బయల్పడ్డ చొప్పున నోడిన
వెరపున: జంద్రుడు వెల్లబాఱె
25
క చ్చ పీ శ్రు తు లు
---------------------
సిరిదొఱంగినవాని పరివార మటు నన్న
నన్నంగ జుక్కలు సాగదొడగె
గ్రొత్తగా గవగూడుకొన్న దంపతులకు
గుడియల్ ఝుల్లన గోడి కూసె
దవ్వెంత యేగియు దలక్రిందుపిట్టలు
దారితప్పక తా తావుచేరె
గలువలు న్వాడె దమ్మిపొవులును వీడె
ఋలుగులున్ బ్రొద్దునకు మేలుకొలుపు పాడె
బన్ను లే కెల్లరిగి నబ్బె బై రుగాలి
తెల్లముగ దూర్పు బళ్ళున దెల్లవారె.
2.నవవధూవర చేష్టలు:
సీ॥ పరులకు గనరాని నెరపున నొండొరు
పాలపున గ్రేగంట్ఘ జూచుకొంట
వంగిలేచుచు బరస్పరము లాఘవమున
దోసిళ్ళ దలంబ్రాలు పోసికొంట
లంకెపడిన చెంగుల స్పప్తపది ద్రొక్కు
తడబాటున మిధము తగులుకొంట
మనసుల గల్పిన కనుల కన్యోన్యమున్
జల్వకప్రపు బుక్క జల్లుకొంట
బలు వసంతపు బెందెవ్లో బరగు నుంగ
రంబు వెడకుచు గెంగేలు రాచుకొంట
మొలకనవ్వులు నవ్వుచు ముద్దుగొంట
నవవధూవర చేష లందముల పంట
సీ॥ తలపుతెఱచుపాట తడబడి యెండొరుం
బేర్కొన సిగ్గున న్బెనగులాట
దా స భా ర తి
కెంగేలు గలిపిన సింగారపు పచారు
నడ్గడ్గున నివాళి నందు పౌరు
అఱకోర్మి మడుపుల నందించుకొను నేర్పు
నిముసమ్ములోన వేసముల మార్పు
ఇక్కువల బువుచెండ్లేయు జాణతనంబు
నెగనక్కెముల మొల్కనగుల డంబు
గడుసుముద్దు వినీవినపడని సుద్దు
కన్నుమెలపు కడు న్గుత్తకొన్న వలపు
క్రొత్త యాలుమగలు గయికొన్న వగలు
పూని గడియించు టెటు నల్వయైన గాని.
33.వనవాస రాజభోగము:
సీ॥ ధరణి తివారి, వితానము విను, వ్రేల
బడు దీపగోళము లుడులు వెల్గు
చూపెడు దివిటీలు సూర్యచంద్రులు, కొండ
గాలి అంత్రము, తలగడలు రాలు,
సౌధరాజము పర్ణశాల, కార్కెకములు
ద్వారపాలురు, మంటియరుగు గద్దె,
కరములు బంటులు, కాళ్ళు గుఱ్ఱములు, దుం
పలు భోజనము, చేతుపట దుసు,
జడలు సొమ్ములు, ధర్మరక్షణము ధనము,
దుర్గము గుహ, యధాలాభతుష్టి మౌళి,
శమము మిత్రము, శుద్ధసత్వము సచివుడు
యడవి రాజ్యము, మఱి మన మధిపతులము.
27
క చ్చ పీ శ్రు తు లు
34.కష్టసుఖములు:
గీ॥ కష్టసుఖములు మబ్బుల కరణి వచ్చు
నరిగెడు దమంత నవియు జింత్యములు కావు
ఏది యెట్లుండినప్పటి కీ బ్రత్కున
ధర్మపద్దతి నుంతయు న్దప్పరాదు.
35.భగవంతునికొలత:
సీ॥నలయరేఖకు బోలి వశమె తెల్పంగ నీ
కాదిమధ్యాంతము లప్రమేయ:
యెల్లజగంబుల కీవె యాధారము
లెక్కల కన్నింటి కొక్కటివలె
ధర్మమువైసె పె యెంతయు జోగుచుందువు
బలుపువంక స్ధ్రాసుములు విధమున
బెఱగవు తఱుగవు విభజింపబడవు శూ
న్యాంకమువలె సకలంకచరిత:
పిన్నకుంబిన్న పెద్దకుంబెద్ద నీవు
కొలతకందవు నిన్నెన్న నలవికాదు
చెలగు సరిచేసియై నీవు తలచినంత
భ కమందార భవదూర పరమపురుష:
36. రామభక్తి:
గీ॥ రామచంద్రుని కన్న శరణ్యు డెవండు
రామనామము కంటె దారిక మికెద్ది
రామభక్తిని మించు సామ్రాజ్యమేది
దయను సెలవిండోహో రామదాసులార:
37. హనుమద్విక్రమము:
సీ॥ ఉబికితివేని నస్తోర్ద్వ లోకంబులు
గిరగిర నుడివడి తిరుగుకున్నె
త్రొక్కితివేని యదో భువనము లెల్ల
దట్టముగా నట్టగడ్దుకున్నె
యూదితివేని మహాదధు లన్నియుం
జిఱుతుంపురై మింట జెదరకున్నె
గ్రుద్దితివేఇ మేరుధరాదరం బైన
మఱి తుములై ముచ్చమాయకున్నె
సత్యసంకల్పుడవు మనోజవుడ వీవు
కామరూపి వప్రతిహతగతిని నెవు
నీ మహత్వ మొకింతయు న్నీవెఱుగవు
గాని హనుమంత:నీవు సాక్షాచ్చివుడవు.
38. కుంభకర్ణుడు:
సీ॥ సంజకెంజాయచే నంజనాచల మటు
కానిదుస్తుల నీలకాయ మమర
నిరుగడ మేరుశిఖర మినచంద్రుల
వలె దలకుండలంబులు వెలుంగ
గ్రొమ్మెఱుంగుల తోది క్రొక్కారు మబ్బట్లు
తారహారముల నెద నెత్త
గొండల న్మల్లెపూచెండుల గతి నెత్త
జాలిన శూలము కేల దనర
ప్రళయభైరవువలె దాండవము సలుపుచు
నట్టహాస మశవిశబ్ద మవహసింప
గోటగోడ నొక్కడుగున దాటి కుంభ
కర్ణు డేతెంచె గవులు నల్గడలబాఱు
30
క చ్చ పీ శ్రు తు లు
రుక్మిణీ కళ్యాణము
------
39.అరుణకిరణము:
గీ॥ తొంటికొండకు జేగురు కొడుకుండ
చేతులంజాచివచ్చిన లేతయెండ
జగములకు నెల్ల వాచి పద్దగను దోచి
దిన్నయౌటకు వేడి మెంచెను మరీచి.
10. సావిత్రి చరిత్రము
40 శోకహతలోకము:
సీ॥నిరుపేదకు గుక్కమురికి సంతానమ్ము
కోటీకు నాలికి గొడ్డఱికము
చేతనైన కురూపి జేరనీఅదు చెల్వ
యందకానికి లోని యంగు సున్న
మృష్టాన్న మారోగ్యహీనుల కుండును
దివగలవారికి దిండిలేదు.
దాతను ముంగాళ్ల దన్న యేగెడు కల్మి
కడు లొబివానిని గౌగినించు
ఉన్నవా రున్నరని యేడ్వ నుర్విలోన
లేదనుచు గుండెదరు సిరిలేనివారు
చూడ నీ లోకమంతయుశోకహితము
సత్యముం దయ గల్గిన జనము తప్ప.
దా స భా ర తి
ఉ॥ ఎన్నగ గోరనప్టు లభియించును సంపద జాతిబొమ్మకున్
నన్నుతపూజమాడ్కి బెలుచం దమగోరిన రాదు లచ్చి బల్
చన్నులు మాసమమ్మకటు, చావక తీరని గూనిపంపు లా
గున్నది స్వేచ్చలేని బ్రతు కో ఇనులారయి కేటి సౌఖ్యముల్
సీ॥ శ్వాససంగతి యటు సంసార మిది సౌఖ్య
మామీద బహుశ దు:ఖాకరంబు
పానకాల్రాయని బలుడప్పివలెను బో
గేచ్చ యెన్నటికి శాంతింప బోదు
ఆకాశమందుసల్పటు తనపై బాంద
నప్రీతి గల్గుట భ్రమకృతంబు
ఎనుముతోకలబట్టి యీతకు దిగినట్లు
క్షోణిపతుల నమ్మి గొల్చుచుంట
అనుచు రూఢిగ దెలిసి సత్యంబు దయయు
గడిమి దప్పక ధర్మార్ధకామములను
పరహితంబుగ సల్పెడి భాగవతులు
సంతతానంద పదవికి సాగుచుండ్రు
41. క్రతునిరాసము:
సీ॥ స్వర్గములోన రంభాభోగ మిట బహు
మానము గొన యజమాను: డొకడు
దక్షిణకై బకద్యానంబు సల్పుచు
బండితమ్మన్యుడొ బ్రహ్మ యెకడు
సకలక్రియల బ్రుదగ్జనముల నియమించి
దంభుడై తిరుగు నధ్యర్యు నొకడు
31
క చ్చ పీ శ్రు తు లు
కడుపు కక్కుర్తికై కంరుకంపు కోర్చి
యుక్కిరిబిక్కిరౌ హోత యొకడు
శ్రుతుల పారంబు దెలియక క్రతువులందు
లశుపులం జంపి సౌజ్య మల్పంబు గొందు
రుచిత మెఱుగక యిదియె విద్యుక్త మంచు
గ్రూరకర్ములకుం దయ దూరముకర.
సీ॥ మొరి 'నహింస్యా త్పర్వభూతాని ' యని శ్రుతి
నాదరింపక 'పశుమాలచేత '
యనునట్టి యధమ మంత్రానుసారంబుగ
నల నీచకులము చెల్లమ్మకొఱకు
బలులిచ్చు తెలుగును బండితమానులై
విప్రులమందును విఱ్ఱవీగి
జన్మంబునం బేద జంతువులం జంపు
కటిక యాజులకును గలదె ము కి
ఉపనిషత్తులు శ్ర్రుతికాంత కూర్ద్వభాగ
మం దహింపను స్థాపించు నదియె గర్మకాండ
మూని పశుహింస దెల్పు నపాన మచట.
గీ॥ చెఱకు దీపి యనగ జేరి యద్దానిని
వేళ్ళమోయ నమలు వెడగు నగిరి
వేదవాక్కు లెల్ల విధులని పశుహింస
నలుపు కూశ భోగములను గోరి.
42. ఉత్తములు:
సీ॥ ఉత్తము లగువార లుర్విలో దలిదండ్రి
మాటలకు జవదాటలేరు
దా స భా ర తి
పెద్దల బొడగాంచి విషయంబు గంపర్తు
తార్తులకు న్హితమాచరింత్రు
కలనైన నవ్వులకైన గల్లలు వల్క
దొరులగొప్పం జూచి యుల్కరెపుడు
ప్రాణిహింసను జేయ రే నెపంబుననైన
దమ కులాచారము ల్దప్ప బోరు
వ్యభిచరించరు, కొనరు దుర్వసనములను
జ్ఞాను లవుదురు, సోమరుల్లారు, గర్వ
మమదరు. బ్రతికెదరు స్వకష్టార్జితంగ.
నీశ్వరును, గోర్కెమాని భణించుచుండ్రు.
43. విశ్చరూపిణి
సీ॥ చేమంతిపూవుగ శీతాంసు గీరించి
యొప్పగ గగనంబు గొప్పుబెట్టి
చందోయిగామేరుమందరముల జేర్చి
జలధితరంగము ల్వకులుజేసి
రోమావళి న్యనస్తోమంబు గావించి
మనజఘనము భూమిగానొనర్చి
తన యధ:కాయ మఖిలపాతాళ మగుచు
నశ్వపతి జ్ఞానదృష్టియం దవతరించె
విశ్వరూపంబు తోడుత వేదమాత
పాబితాశ్రితవర్ణ సువర్ణదుర్గ
సీ॥ కంటికి రెప్పట్టు కడు జాగరూకతల
బిల్లల గని పెంచు తల్లి నీవు
88
క చ్చ పీ శ్రు తు లు
అన్నదమ్ముల గని పెన్నిధులని కూల్మి
లెక్కించు నక్కచెల్లెండ్రు నీవు
నాయమ్మ నాయయ్య నాకన్నవారని
గొబ్బున ప్రేమించు కూతునీవు
ప్రాణంబు లన్నియు భర్త కర్పించి యి
ల్మర్యాద కాపాడు భార్య నీవు
కార్యహేతువు నీవు, జగమ్ము నీవు
నీవె యంతయు, నెద్దియుం గాచ్వు నీవు
నీదు తత్వంబు దెలిసి వర్ణీంపదరమే
యాశ్రితజనార్తిభర్గ : మాయమ్మదుర్గ
44. పుంసాం మోహనరూప:
సీ॥మొకరితుమ్మెదల నార్బోసిన యట్టులు
ముంగురు ల్నొసటిపై ముద్దులూర
తెలిదమ్మిరేకుల దెగడు నాల్గందోయీ
నెమ్మియు నోరువు నెనరు దెలుప
పలుదాలు మల్లెమొగ్గలు, చివుర్వాతెర,
కార్బొంపము బనిరిగడ్డ మమర
కుంచ్పుమొదలటు గొప్పమెడయు బెద్ద
తలుపువలె న్రొమ్ము తనరుచుండ
భళిర: ముంగాళ్ళ చాటు చేతులున్ మరియు
నడుము పిడికిల నిముడ్కుకుందనవు బాయ
యొడలు తిన్నని యేరానియొడ్డు పొడవు
ఆడ్చేమితనిని మగవాడె వలచు
సీ॥ కలదున్న పున్నమ చందురు గాచంటి
మో నీని మోమున కునమ యేది
దా స భా ర తి
యబ్జము ల్వాడు నతన్న నిక్కందోయి
కగు నెచ్చట విదర్శనాతిశయము
ఏన్గుతొందమ్ము లిస్సీ వంక లన వీని
హస్తమ్ములకును దృష్టాంతమున్నె
మరి యనంగుం డగు మరుని కితనితోడ
నకియరో సుంతైన సమ మదెట్లు
సహజ సద్గుణ సౌందర్యశాలికైన
సతతిదోషాధిక కురూప యుతునకైన
దాని: యెంచు కలంకార శాస్త్రగరిమ
యంశనీ యందకాని వర్ణించుటెట్లు.
45. ఆ మ ని :
సీ॥ చెవులకు జల్లగ: జెలగి కోయిల కూసె
సందడి పెండ్లిబాజాలు మ్రోసె
కన్నెవేనయు దొగర్గున్నస్సమర్తాడె:
జలివేంద్ర దాపున సంగగూడె
కమ్మ మామిడితోట కాపుల వని హెచ్చె
బిల్లగాల్లు మురిపించి వచ్చె
గొడుగులు, జో ళ్ళెండాచిడిముడి లల్లార్చె
దాటిముంజులు కడు దప్పిదీర్చె
కారడవి వెల్గె బుడనవికాదు గల్గి
నండె లింపాయె గౌతిట ల్వడలిపోయె
ప్రొద్దు లెపారె, మావులు పొట్టివారి
ఆమని మొదలుపెట్టెటల్ హాయివుటె
85
క చ్చ పీ శ్రు తు లు
16. భూత భూతేశతత్త్వము:
సీ॥ పెనిమిటికడ ముద్దుగునిసెడి గువ్వ న
దేల పాశునడేగ యెగర దన్నె
నచ్చగ జివుతించి బలసిన డొంకల
కెగబ్రాకి మేమపో తేలమేనె
నీటియెడ్డున ద్రుళ్ళి పాటబాడెడుకప్ప
లెట్టివి నామేల నట్టిమ్రింగె
కొండను ఢీకొను కొమ్ముల విదళించు
నేన్గును సింగ మదేల చంప
ఇజ్జగంబున నన్యోన్య హింసవలన
బ్రజలు భూతంబు లిడి స్వభావంటుగానం
గానిప్రకృతిపలకులు కార్యమైన
యీశుతత్వము దయ నా కినట్లు వచ్చె
ఉ॥జంగమజీవు లెల్ల మఱి స్థానరభక్షుణజెసివేడ్కలు
ప్పొంగ బరస్పరంబు హితము లచరింపుచు జావులేక ని
ష్టంగొని దైవభక్తులయిజ్ఞానవిభోగముల నృమానులై
రంగుగ నున్నయపు భళిరా సుఖియించెర నెమ్మనంబునన్
47. విజయలక్ష్మి వివాహము:
సీ॥ భూమి పీఠము, నభంబు న్మేటివంచిరి
బహుసాస్త్రతతి సాక్షినహ్నిగాగ
మకుట తనుత్రాణమ్ల నుండి డుల్లెడు
రసముత్తము ల్బలప్రాలుగాగ
జంబున స్వస్తివాచకౌలకు శత్రుల
తెలబేంతియ పంప్రదానములుగ
భా ర త ర మ ణి
గూలెడి భట హయ కుంభి భూరిధ్వను
లోని బాజాబజంత్రీలుగాగ
బలు వనంతము నెత్తురువరదగాగ.
నాకబలిమ్రుగ్గులట్టు లాంత్రములు మెఱయ,
మఱియు బగయెఱ్ఱ రంకృత్తిమంత్రములన
బెండ్లియాడుదు నన్నోహో విజయలక్ష్మి
48. వీరాలాపము:
న్రగ్ధర॥ కఠినజ్యాఘోష మాశామనకరటిఘటా కర్ధముల్వ్రవింపన్
నితర ప్రోద్భూత దవాగ్నినిబిడ పరదాణ్ణీరసాగాళి గాల్చను
జఠరీభూతారినూత్నేష్ణరుదిరోవృత్తి భూతలకు లార్విన్
వికరు ల్త్ఫోత్రింప నన్మద్విలయయశము దిగ్భిత్తుల న్వెల్లవైతున్
తొలిచూపులో వలపు:
సీ॥ సలలిత పాదాంబుజాతంబులందున
గొదమతుమ్మెద గనగూడునట్లు
భాసుర నిన్నునాభీ సరోవరమున
గుండుబేడిన జోడు గలయ భంగి
ప్రదిత సీనోన్నతోర: ప్రవేశంబున
అంజరీటము జతగట్టు మాడ్కి
కమనీయనక్త్ర రాకొసుదాకరు నజ్ఞ
ఘనచకోరము జంట నెనయ కరణి
ఏకముగ వలపుజిగురించిన నెదలనదికి
సన్నిదిం జెరనకొలంది చనువు మిగిలి
రెప్ప లెగసిన క్రమమున గొప్పమీరి
దంపతుల చూపు రొండొంట దారనివలె
87
క చ్చ పీ శ్రు తు లు
11. హరిశ్చంద్రోపాఖ్యానము
విద్యాగర్వము
గీ॥ తా నెఱుంగుదు ననెడు విద్యలకు మేర
యల దిగంతపురేఖ హద్దట్లు తోచు
గాన సంపూర్ణ పాండిత్య మూనితి నని
యులికి సభ నాడుటలు పిచ్చికళలు గావె
ధనలోభదంభము:
మ॥ధనభోగంబుల యాశచే బొడము నీ తత్వప్రబోధంబు లీ
వినయంబు, ల్మడిపంచెలుం, గరిముల న్వ్రేలాడు మాలబ్రొనం
టను నామంబులు, చేత బొత్తములు కంఠంబందు రుద్రాక్షలున్
ధనవాంచ న్విడనాడు వారలకు నీదంభంబు నింకేటికిన్
భరతఖండము:
సీ॥ సర్వ శ్రుతిస్మృతి శాస్త్రంబులకు మూల
కందమై విఖ్యాతి జెందె నెద్ది
సంతత జనతన స్వార్యాయ సత్యవ్ర
తాపనీసురులచే వలసె నెద్ది
స్వచ్చంద రాజ్యసంపద గల్గి పాపన
చరితులొనృపతుల వరలె నెద్ది
గణియించుటకు నశక్యంబైన కాలంబు
నుండి నాగరికత నిండె నెద్ది
దా స భా ర తి
గూలెడి భట హయ కుంభి భూరిద్వను
బోలిబాజాబజంత్రీలుగాగ
బలు వసంతము నెత్తురువరదగాగ
నాకబలి మ్రుగ్గులట్టు లాంత్రమ్లు మెఱయ,
మఱియు బగయెజ్జ కలకృతమంత్రములన
బెండ్లియాడుచు నన్నోహో విజయలక్షి.
48. వీరాలాపము:
స్రగ్ధర॥ కఠినజ్యాఘోష మాశాఘనకరటిఘటా కర్దము ల్వ్రక్క వింపన్
విభరస్రోద్బూత నానాగ్నినిబిడ పరరాణ్ణీర్సాగాళి గాల్చెన్
జఠరీప్రోత్నోష్ణ రుదినమదిరోన్మత్తి భూతలంబు లార్వన్
నిరతరుల్త్పోత్రింప సస్యద్విజయయశం దిగృత్తుల
న్వెలనై తున్
49. తొలిచూపులో వలపు:
సీ॥ సలలిత పాదాంబుజాతంబులందున
గౌరమతుమ్మెద గ్ంగూడునట్లు
భాసుర నిమ్ననాభీసరోవరమున
గండుబేడిన జోడు గలయు భంగి
న్రధిత సీనోన్నతోర॥ ప్రదేశంబున
అంజరీటము జతగట్టు మాడ్కి
,కమనీయవక్త్ర రాకాసుధాకరు నజ్జ
మనచకోరము జంట నేనయి కరణి
ఏకముగ వలపుజిగురన వెదలనదికి
సన్నిధిం జేరినకొలంది చనువు మిగిలి
రెప్ప లెగసిన క్రమమున గొప్పమీరి
దంపతుల చూపు లొండొంట దారసిలె
11. హరిశ్చంద్రోపాఖ్యానము
----------
50. విద్యాగర్వము :
గీ॥ తా నెఱుంగుదు ననెడు విద్యలకు మేర
యల దిగంతపురేఖ హద్దట్లు తోచు
గాన సంపూర్ణ పాండిత్య మూనితి నని
యలికి సభ నాడుటలు పిచ్చికళలు గావె
51. ధనలోభదంభము :
మ॥ ధనభోగంబుల యాశచే బొడము నీ తత్వప్రబోధంబు లీ
వినయంబు, ల్మడిపంచెలుం, గరముల న్వ్రేలాడు మాల ల్నొనం
టను నామంబుల చేత బొత్తములు, కంఠంబందు రుద్రాక్షలున్
ధనవాంచ న్విడనాడు వారలకు నీ ఢంభంబు నింకేటికిన్
52. భరతఖండము :
సీ॥ సర్వ శ్రుతిస్మృతి శాస్త్రములకు మూల
కంఠమై విఖ్యాతి జెందె నెద్ది
సంతత జపతనస్వాధ్యాయ సత్యప్ర
తానవీనురులచే నలరె నెద్ది
స్వచ్చంద రాజ్యసంపద గల్గి పావన
చరితులౌ నృపతుల వరలె నెద్ది
గఱియించుటకు నశశ్యంబైన కాలంబు
నుండి నాగరికత నిండె నెద్ది
మొదట దేవుని యున్కి నీ భూజనముల
కందఱికి నెద్ది చెల్పెనో యట్టి బరత
ఖండమున జెట్టువచ్చెడ్లు కాలమునకు
మరుగు సిలదెలవలె నిప్డు పుట్టె జనము
53. మాంసాశన నిరాసము :
గీ॥ ఆయురారోగ్యకరములై యతిశయిల్లి
పాలు చక్కెర దాన్యముల్ ఫలము లుండ
జంతువులబట్టి తిననేల జాతిమాలి
జ్ఞానవంతుల మనుకొను మానవులకు.
54. సత్యదౌర్గత్యము :
సీ॥ ధనముల నాశించి తగని నేరము చెప్పు
వర్తకు నోటికి పడకీపడకి
దీనుల కొంపలు దీసెడు ప్లీడరు
కూటసాక్ష్యంబుల గుందికుంది
మిగుల లంచము మేసి నిగిడెడు నుద్యోగి
కలమున గన్నీరు గర్చికార్చి
సోమరిపోతులై సోదెలు పల్కెడి
మతగురువుల చెంత మాడిమాడి
యెట్టులుంటిని చెప్పుమా యెల్ల ఏద
నరములం బొల్పు రాయంచ సాధిమైత్రి
గడపు చుక్కాని: సత్కులాంగనల సొమ్మ!
మప్రతమ్ముల ముఖ్యమ్మనూనృతమ్మ!
55. శ్మశానము :
సీ॥ వెదురు నిచ్చెనలపై బీనుంగు లొకచోట
నొకచోట గుండాల నులుకు మంట
కటికయెజ్జల మంత్రికర్మంబు లొకచోట
నొకచోట వత్తెన రుడుకు తంపి
చచ్చినవాండ్లం శకునముల్దీర్చు కా
కు లొకచో నేడ్చు బందు లొకచోట
బాతిన శవముల బైరాగు నక్క లొ
క్కెడ నొక్కచో ద్రేవు లీడ్చు గ్రద్ధ
లుండు ఘోరశ్మశానము దండజేరి
తనదు దుస్థితి దలపోసి తలయ నూచి
వెల్లబల పైకి జూచి నిస్పృహత నవ్వి
యీశ్వరు నపు డతండు ప్రార్దించెనిట్లు
56. పౌషతోషము :
సీ॥ ముంగిట వాకిళ్ళ ముగ్గులు తెన్నొందు
గల్మికూర్పుల నెలగంట ముందు
అత్తవారింట్లో నల్లు తున్న పసందు
వెల్గుచూపుల బోగి వేగు నందు
పెతల కెల్లరికి బేర్వేరున బిలునందు
రచ్చపండు నగు సంక్రాంతిపొందు
పాటలాటలు దక్క లనులన్నిటికి బంధు
కనుమజాతర పేదకాపు విందు
ప్రొద్దుతాకకు నిట్టూర్చు పోగలజిమ్ము
క్రొత్తచావును వడ్లును గుత్తకమ్మ
కుంపటబుల్ గౌగిటల్ గోరుకొన్న సొమ్ము
పౌషమాసమ్ము సర్వ సంపోషణమ్ము