కచ్ఛపీశ్రుతులు/శతక సారణి

III శతక సారణి

14. సూర్యనారాయణ శతకము

                    **

76. సూర్యనమస్కారములు:

మ॥ అరవిందప్రియనీవు దూరమగు నష్టయ్యాయ్యే! దుర్దాంత దు
దుస్తర ఘోరాంధితమిన్ర మగ్నమయి భూతవ్రాత మావత్సరం
పదిలం బొందును నీదు తత్వ మెడలింప స్వర్వము మ్శాన్యమౌ
నరయ న్నీవె చరచరంబులు మహాత్మా: సూర్యనారాయణా:

మ॥ కమలాళి న్వికసింపజేనునెడ శృంగారంబు హాస్యంబు, రు
ర్ధమ మందేహతమిస్రమారణమున న్రోద్రార్చుతోద్వీర నం
క్రమ భీరత్పభయానకంబులు, లవత్కారుణ్యముం దానకీ
న మహాభక్తులయందు. సప్తగిరిపోంతన్శాంతి బావంబు నీ
పరమరంజేయుదు నిత్యనిర్గుణుడవై హాసూర్యనారాయణా.

మ॥ తనరంగా భువనైకసుందర వదూదంతచ్చరాస్వాదనం
      బునకై కాదు త్రిలోకరాజ్యవిభవంబుం బొందగా గాదు శా
స్త్రవిరూఢప్రతిభావిశేష మగువల్పున్గోరి కా దక్కటా!
నిను సత్యంబుగ జూడకేడ్చెదను దండ్రీ! సూర్యనారాయణా!

మ॥ ధనమా రాదు, దొరాశ పోదు, నరత త్త్వజ్ఞానమా లేదు, యౌ
వనమా నిత్యముకాదు, వార్ధకమున స్వామాక్షియౌ జెదు, జీ
వనమా యెన్నగ రాదు దు:ఖములకుం, లల్మాఱటు ల్గావున
నిన్ను వే గొల్తు విజేల వాదు దయ గన్మీ సూర్యనారాయణా!

58
దా స భా ర తి

<poem> మ॥ సమత న్లోకుల కెల్ల భూతదయయు స్సత్యంబు బోధించుచు న్రమఱ న్నీదగు కీర్తి రాల్గరగ గానప్రౌడిచే జాటుచు న్రృమదంబొప్ప బరాంగనావిముఖత స్వర్తించుచు న్సృద ర్యము నే వల్పెద నాకు దోడుపడు మన్నా! సూర్యనారాయణా! రు శా॥ ఊహాపోహలు శాస్త్రశోధల్నములు న్యుక్తుల్ర్కతుస్నానము ల్పోహమ్మందు వచించుట ల్వృధలు: సత్యంబుం దయ న్గల్గి యు త్రాహం బొప్పగ భక్తితో భవదురందనామసంకీత్రనం బాహా! సేయక మోక్ష మబ్బుటెవ్టు లయ్యా! సూర్యనారాయణా!

మ॥ అమర నృంగరునుండి దావిదగు చాయ న్వేఱు సేయంగ శ క్యముకసనట్టుల నిజ్జగం బెడరాడమ్యారె విన్నిండి చ క్రమమునం గోఱుమురీత నారయగ నీ త్రైలోక్య మేసారి నా శము నీయందున జెందుచుండు బరిమేశా! సూర్యనారాయణా!

శా॥ ద్వైతంబుండుట యుక్తి కాదు, మఱి యద్వైతంబు ప్రత్యక్షభ

    వసతీతం బటుగాన గర్మములు సేయ న్మానరాదెంతయున్
    ద్వైతాద్వైతనమంబు బ్రహ్మ మనుచున్ ధర్మంబు నిర్మోహియై
   ఖ్యాతి స్పల్పినవాడె యుత్తము డనంగ! సూర్యనారాయణా!

శా॥ పాముల జానదు, కఱ్ఱయు వ్విరుగ దన్యార్తాను సారంబుగా

    సామర్ధ్యంబున వస్తుశోధన యెడ న్శంకాసమాదానము
    ల్పీమం బొందవు గాన జ్ఞానమున దుష్టిం జెందరా దెందున న్స్వామీ! నీ పదభక్తి యోగమున దప్ప స్పూర్యనారాయణా!
/poem>

53

క చ్చ పీ శ్రు తు లు

మ॥ అరయంగా సకల శ్రుతిస్మృతి పురాణాద్యర్ధసారంబు బ
ల్మఱు నా శక్తికొలది జూచి తుద కిమ్మై రూఢి గిఅగొంటి నం
నరణాంబోది దరింపజేయుటకు యుష్మదృక్తి దక్కన్యమీ
నరలోకంబున లే దుపాయ మని యన్నా! సూర్యనారాయణా:

15. సత్యవ్రతి శతకము*

                  ------

77. సత్యవ్రతి :

కం॥ బ్రతుకున సుంకం బెఱుగక
       స్వతంత్ర రాజ్యంబు సేయు ప్రభువువలె బతి
      వ్రతవలె, సహజకవి వలెన్
      సతతము సంతస మొసంగు సత్యప్రతికిన్

కం॥ అతిజార విసుగు బరికిన్
       మతిహీనుడు దనము లొసగు మఱి తిరుపతికిన్
       స్తుతి పొసగు జగత్పతికిన్
       సతతము సకన మొసంగు సత్యప్రతికిన్

కం॥ అతిజార విసుగు బతికిన్
      మతిహీనుడు ధనము లొసగు మఱి తిరుపతికిన్
      సతతము సంతస మొసంగు సత్యవ్రతకిన్.

కం॥ అతుల వికారము మీద మ
      మృతవాదికి శక్తిహీన నెడ సొగసరి
      క్సితి మానృతు నెడ సొగసరి
      సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్.

కం॥ బ్రతుకున జదువులు సందెలు
        చరురికళానిపుణతయును సర్వప్రజ్ఞల్
        నిక మానృత మాడనిచో
        సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్

[* ఈ శతకం ముద్రితమనుట ఆనందగజపతి ప్రభువున కంకితము. నే డలబ్ధము కొలది పద్యముల మాత్రము దొరికినవి. సం.]

66
దా స భా ర తి

16. ముకుంద శతకము

                        -----

78.హృదయ నివేదనము

కం॥ పొందుగ విన్నుల బాడుట
      కుల దప్ప మఱెట్టి వృత్తి గొల్పింపకు న
      న్నుం దయతో నారాయణ!
      కందళితానంద్స మూలకందే! ముకుందా!

కం॥ముల దెట్టులనో! పసితన
      నుంచే నీ భక్తి పొడమె బాగుగ నిది ని
      ల్పం దగురా నారాయణ్ !
      కంద్ళితానంద మూలకంద ! ముకుందా!

కం॥ మందుల మారివి నీ దెన
       డెంద మిటుల బ్రమమౌ జెందెడిన్ విడువక ప్రో
       నదగురా నారాయణ్ !
       కందళితానంద్ మూలకంద! ముకుందా!

కం॥ కందలి లొకిక దంభము
      లందున నా మనశునిల్ప కనవరతము నిన్
      జెంది-పుము నారాయణ!
      కందళితానంద మూలకంద ! ముకుందా!

[* ఈ శతకమునుండి కొలది పద్యములు మాత్రమే నే డుపలబ్దములు. సం.]

61

క చ్చ పీ శ్రు తు లు
17. మృత్యుంజయ శివ శతకము
 [దసుగారికి జీవితమునను కళారంగ వ్యాసంగమునను నిత్యానసాయియైన సహచరునిగ నుండి ఆయనను కంటికి రెప్పవలె కాపాడుచు అవసరమగుచో కర్రపెత్తనము చేయుచు తన యావజ్జీవితము ఆయనతో హరికధలలో పాటకచ్చేరీ లలో సహకారాగానముచేయుచు పెద్దపెద్దపండితుల పేరోలగములలో సెభాషనిపించు కొన్ని గాంధర్వధూర్వహుడు పేరన్నగారు- ఆయన కన్నగారు. వారి అనుబంధము జన్మాంతర సౌహార్ధ బంధురము. ఆ అన్నగారు మృత్యుముఖద్వారమున బడినప్పుడా ప్రక్కనే ఆర్ద్రనయనాలతోనున్న దాసుగారి ఉద్విగ్న హృదయమునుండి ఆలవోకగా ఆశువుగా బాహిరిల్లిన దీ శతకము. అయింతా పేరన్నగారు బ్రతికి బట్ట గట్టిరి. తదుపరి పెక్కేండ్లు దాసుగారి నిర్యాణానంతరమును జీవించిరి.]

79. సహోదర సౌహార్ధము:

కం॥ భోగముల గోర నొల్లము
      భోగీశ్వరభూష! బ్రతుకు పొడిగించినచో
      నీ గానము సంతుష్ఠిగ
      బాగుగ ప్రకటింప నానపడితిమిర శివా!

కం॥ జోడుగ నీడగ దోడుగ
      వేడుకతో శ్రుతుల మేళవించుచు నిన్నుం
      బాడి కసి దీర్చుకొందుము
     వేడెద మాజంట జెందు పెక్కేండ్లు శివా!

కం॥ ఆశ్రితులం నీ కీర్తన
       కే శ్రమ ప్రాణంబు లనక యెల్లదెసలు రా
       గాశ్రితములుగా గనగా
       మిశ్రలయల బాడ జీరము మెలగించు శివా!

కం॥ నే బ్రితికిన సార్ధక మే
       మీ, ఋణములు కాళ్లు కనులు మెడ లెనట్లో
       నాబ్రతుకు, జంట నలరం
       గాబ్రోచిన నిన్ను వాడి కడగందు శివా!
      

62
దా స భా ర తి

IV రూపక సారణి

18 సారంగధర నాటకము

80. తెనుగుతీపి :

ఆ.వె. మొలక లేతదనము, దలిరుల నవకంబు,
       మొగ్గ సొగదనము, పువ్వుతావి,
       తేనె తీయదనము, తెనుగునకేకాని
       పరుష సంస్కృతాఖ్య భాషకేది:

81. బలవా నింద్రియగ్రామ: :

గీ॥ ఒంటిపాటున సొగసరి కంటబడుట
     పలుకరించుట కొక్క నెపము దోకుట
     కలునప్పుడు మోహంబు కనుల గ్రమ్మి
     జ్ఞానులైన వివేకంబు గానలేరు.

గీ॥ ముత్తెపుంజిఱునవు మొల్కలెత్తుచుండ
     చీకటి, మెఱపు వాల్జూపు చిమ్ముచుండ
     కల్కుగుబ్బల పయ్యెదకొంగు జార్చి
     బల్మినెట్టెది జవరాలి నాయందరమె :

82. జగత్తు- భగవంతుడు :

మ॥ కలయుందెత్తెడు మేన దోచెడు జగత్కార్యంబుల జిత్తనం
      చలత స్వాన్తనమందు పోల్కిగనుడీ సర్వప్రపంచంబు న
     జ్ఞాలకు న్నిక్కముగా గనంబడెడు, బ్రాజ్ఞ ల్పూర్ణ భావంబి ని
     శ్శంఘౌటం దనుకన్న వేఱు గన రీశత్యంబు ని
     శ్పులఘౌటం దమకన్న వేఱు గన రీశత్వంబు బ్రపించుచున్

63

క చ్చ పీ శ్రు తు లు

గీ॥ శాశ్వత ప్రకృతిలోన బీజంబు జాడ
     బూర్జతం బట్టి సిన్నగా బోలు బెద్ద:
     పిన్నదీవంబు క్రొవియం దున్న గుణము
     గన్నయటు పిన్నలో బుద్దిఘనత జూపు

గీ॥ తల్లి పై ని వలపు తగిలెనేవియును స
     త్యంబు దాగెనేని: ధరణిలోన
     బావకృతిఅమున కనుభవములెదేనియు
     దేవు డుండెననుచు దెలియటెట్లు:

3. చిత్రాంగి మేడ :

సీ॥ ఇరుదట్ల కీల్బొమ్మ లింపుగ బాడంగ
          స్వర్గంబు నెక్కింపజాలు మెట్లు
     అద్ధంబువలె మేని నంతయు గన్పర్చ
          జాలిన నున్నని పాలగచ్చు
     జీవకళలతోడ జెలగి నవరస్దముల్
         చెలువార జూపెడు చిత్తరువులు
     మాటిమాతికి వింత మాటలాడుచు బంజ
         రములలరించు గోరలు చిలుకలు
    కలుగు నీ మేడపైనుండు కాంచునపుడు
    క్రింద్సి జనములు చీమల చందముగను
    తోటలుం బూరిబయకుల నాటముగను
    గానబడుచుండె దిరిగెడి కన్నుగనకు

4. కులకాంత :

గీ॥ కులముం బొరునముం గల
     తలిదండ్రుల కొదవి తగిన దాంపత్యమునన్

64

దా స భా ర తి

  తెలుగు జవరాండ్ర చిత్తం
  లు చలియించునెడ లోకమున హద్దున్నే:

గీ॥ అగ్ని సాక్షిగ బరిణయ మాడుకొన్న
     చవుని యెదలోన దఱుగని తలపివెట్టి
    బందువుల కెల్లరికి చలవంపు చేసి
    జారగా మనౌటకన్నను జావుమేలు.

85. ఛంద్రుని మొగము :

గీ॥ తా నొనర్చిన చీకటి తప్పెఱిగియు
     మగని విధిలేక కనిపెట్టు మగువ బోలె
     వెలిగిపడి ప్రొద్దుముంగల నిలిచె ఆంద్రు
     డాకసంబు పెనమున మాడాట్టువలెను

86. మేలిముసుగు :

గీ॥ సన్నమబ్బున చోచెడు చందురునివలె
     ఆకు చాటుండిన గులాబి యలదు మాడ్కి
     నీట బ్రతిపలియించు మానికమువోలె
     చీరముసుగున జిత్రాంగి చెల్వుమీఱె

87. దైవోపహతుడు :

గీ॥ ఆపదకు హేతువులు దోచియైన దన్ను
     ప్రాణమిత్రులు వారించి యైన నన్ను
     బోలి తప్పుత్రోవం బడిపోవు గాని
     యకట: దైవోపహతు డెట్టు లాగగలడు:

66

క చ్చ పీ శ్రు తు లు

88 ఋతానృతవై:

గీ॥ వెనరు, దిట్టతనము, నోర్చు, నిర్మలతయు,
     నిశ్చలతయు, దటస్థత, నియమితగతి
     జెందు దృష్టియు, సుష్మితమందవాక్కు
     సత్యవంతుని యాన్యలక్షణము లివ్వి.

గీ॥ దొంగతనము, సిగ్గు, వెంగలితనమును,
      పగలసెగలు పొగలు, వలపుసొలపు
      గొలువు కన్నుగనయు, గొంటెనవ్వుల మాట
      కల్లబోతుల్ ముఖము వెల్లడించు

89. కళాఖళూరిక :

సీ॥ చిఱుణాలపై జిలజిల రాలు సెలయేటి
           నీటిపై లకుముకి రాటు చూచి
     నానాట నలవాటు బూని మెల్లను జేర
           వచ్చు జింకల కూర్మిపాలు చూచి
    మడుగుల జెఱలాడి వెడిదవు బొడ్దుల
          బోలయించు నేనుగుపోటు చూచి
    దువ్వి ముద్దుగొనుచు దొడ్డ పులులతోడ
         నాలాడు చెంచెం నీలు చూచి

   వర్ణనము సేయుచున్ భూరినవములందు
   బలురకంబుల పిట్టల పలుకులకును
   స్వరముగట్టుచు జెట్టుల పట్టలందు
   బద్యములు వ్రాయు భాగ్యంబు పట్టు నెపుడు

86

దా స భా ర తి

19. దంభవుర ప్రహసనము*

90. వేసవి :

ఉ॥ కాలువ కలవులన్ బరగు గాడుపు, లెల్లడ దేశ్లుకుట్టిగ
     గ్లోలుగ నేడ్పు నేడుపులు, కుక్కల వేటలు, దోమకాటులున్,
     ప్రేలెడి సోదెవ్ బూచులును, రేగు విశూచులు, పొక్కు వుండునున్
     గాలెడ నిండ్లు గల్గి నరకంబయి వేసవి వచ్చె నిచ్చటన్

[*ఇది యొక పద్యరూపకమట. 1921 ప్రాంతమున రచింపబాదినదట. ఇంద పాత్రము లానాటి కతిపయ విజయనగర పురప్రముఖులకు ప్రతీకములట. అచ్చయి దని వినికిడి. గ్రంధ మలబ్దము ఎట్లో యీయొక్క పద్యము మాత్రము దొరిదినది.సం.

==

87

క చ్చ పీ శ్రు తు లు

                  ----

V ఆచ్చిక సారణి

20 అచ్చ తెలుగు పల్కుబడి

91. తెలుగు తెలివి :

మంజరి॥ తీయ్లన మెత్తన తేటతల్లంబు
            సుడులతో నచ్చతెనుంగు నయంబు
            అచ్చతెలుగువార లచ్చతెనుంగు
           తెలియవియెడ వారి తెల్వి దొనంగు.

     వేల్పుబాసాడిన వెలయునా మెప్పు
     వేల్పులకే చెల్లు వేలుపు పల్కు
     మానిసిరిం దగు మావిసి కుల్కు
    దయ్యపు నలవింత తగదు మానిషికి
    మనుగడటన్ నాటు మాటలే చాలు
    బ్రతికున్న తల్లి యిప్పటి నాటులాన,

   ఎల్లపల్కుల దెలుగే మేలుబంతి
   ప్రజలలోనన్ వెల్గునాడే వలంతి
   తెన్గువాడే నలుదెసల నాడెమ్ము
   పాట లాటలు తెల్గువారల సొమ్ము.

   తేటతీయని యచ్చతెను గనువాడు
   వాసికెక్కిన చదువరి మొనగాడు.
             ----

68

దా స భా ర తి

21. వేల్పు వంద

[ఇది సింహాచల స్వామిపై చెప్పబడిన శతకము. దాసుగారి స్వానుభవ మ: భాష్యము. భక్తికి భండారము. లోకజ్ఞతకు కొటారము.]

92. రెంటత్రాగుడు తిండి మెట్టంటువేల్ప!

సీ॥ నంజుడు కలనైన నమలకయుండుట
           పలుమాఱ్లు నీపేరు తలచుకొనుట
     లాతయిల్లాండ్రపై లలికొగొనకుండుట
         పొన్ను వీదిద్దిడ్ంబున కతుకుట
     తనకొఱకై కల్ల లనుదోవకుండు టె
         న్నాళ్లైన నీతిడునాళ్ల గనుట
     యిర్గుపొర్గులకు పెబ్బర సల్పకుండుట
         నీకుగుర్జాల కావికల విడుట

    తనకు కల్గినదాకో, దవ్విగొనుట
    నీకు నిల్వుదోపిచ్చుట నిక్కువముగ
    మంచినదువడిలేక నిన్గాంచుటెట్లు
    రెంటత్రాగుడుతిండి మెట్లటువేల్ప

సీ॥ మిన్నునేలలనెల్ల మెలగు మైతాల్పుల
        గడు గన్కరమ్ముతో గనినగాని
      తావిల్లి వేగియు స్థనతోడివారికి
         నెమ్మినాకొంట మానిచినగాని
      వెంటల నగళుల న్వీడుల నెందేవి
         నీగొప్ప చాటి వినిచినగాని
      యేకోరికలులేని నీకుగోవెలతిర్వ
           ళికతడునాళ్ళ గొలిచినగాని

69

క చ్చ పీ శ్రు తు లు

 అకట మఱి యెట్టి మంచివా డైనగాని
 తప్పుకొనలే డులియుగొయ్య ద్రిప్పురట్టు
 పగడ నీ నమ్మకమున కే యగడులేదు.
 రెండత్రాగుడుతిండి మెట్టంటువేల్ప!

సీ॥ సారుల, దరుకుల, గౌరుల, గోపుల
            తెలగి గజ్జెలుగట్టి చిందు తీర్చి
     వేడుకతో నొత్తుకాడు, గుమ్మెతకాడు
           తోడరాగొంతెత్తి పాడియాడి
    కుడికయిం జిప్ప మువ్వడుల మ్రోగించుచు
           నెడమకైకన్గవని న్వుడుల దెలిపి
    మందుచల్లి నయట్లు మంది వేలకొలది
             సోల నీ ముచ్చట ల్వేలు చెప్పి

     నాల్గువందలల్యామడ ల్పలువలనుల
     నయిదు ముమ్మాఱు రెట్టింప నయిన యేండ్లు
     హాయిగా నిన్ను గొల్చిన యతడె మేటి
     రెంటత్రాగుడు తిండి మెట్టంటు వేల్ప!

సీ॥ కుడియడ్గువర్విడి, కుమ్మరింపు, పణము
         చాంగలు, చాళియ, చలికి, చేట
      కన్నాత, కల్లము, కళవరము, తిణిగి
          గొంతుమా, ఱ్ఱాబడుగు, మొన, కిల్లి
      తోరహత్తము, తొఱ్ఱి, తొక్కిన పాదము
          రాణింపు, తాళము, దొండివ్రేటు
     సీసము, సమనము, జేబ, కందణం, పె
         ట్లాగు, లోలిత్తరి, లాగురింజ

     రాటము, సురాటము, వృరిపోటు, కెల్లి
     తోమొన, తడకా, ల్కెర్లి, బో లొంకదొట్టి

79

దా స భా ర తి

  యంజమెట్టు దొల్లి నీ యండగొంటి
   రెంటత్రాగుడు తిండి మెట్లంటువేల్ప!

22. వేల్పు మాట

   [ఇది భగవద్గీతకు అనువాదము కాదు. మఱి - మానసపుత్రిక దాసుగారికి దత్తపుత్రిక. దీని పీఠిక చివర దాస్గారి వ్రాయన మిట్లున్నది. "ఇరుపదేడంకెలలో నెద్దియైన నొక యంకెను దలంచుకొని యీ వేల్పుమాట పొత్తములో నెద్దియైన నొక ఎడ తెఱచి మీదినుండి క్రిందివరకు లెక్కింపబడిన యిరువదేడు బంతులలో రా దలంచిన యలకెగల బంటి చదువుకొన్నప్పుడు తాననుకొన్న పని యేమగునో తప్పక తెలియగలదు." అని, వాసుదేవుడు త్మ హృదయమునే గాక వాక్కును గూడా అవేశించి యున్నాడని కాబోలు దాసుగారి విశ్వాసము. ఆ సంఖ్యా నిర్దేశము సాభిప్రయముగ నున్నది. సం.]

93. కోరిక :

బడి* తెల్లముగా నచ్చ తెలుగుతో జెప్పు
        మేల బల్మిన్ జెయు నెగ్గెటింగియును
        మానిషి ! నాయరనుర తీర్పు మచ్చ:
        అవి భిన్ననవ్వున ననె నల్లవేల్పు
        కడముట్టె వెఱ్ఱి తోకలి తలచుట్టు
        మచునట్లు లడిగెదో యబ్బాయి నీకు:
        జెవి పట్టలేదు నా చెప్పినమాట
        మఱువకు సరిగ నీమది నిల్పుకొనుము
        కోర్కె తప్ప నీకు బగవా డెవడు
        నీరూప కోరిక, నీకు నీ వెదిరి
        అద్దము గను పిచ్చుకలు తమకమున
      

  • చిత్రముగా దాసుగారిట్లు తమ విష్ణుసహస్రనామాది కృతులందును 'మంజరి ' ని 'బడి ' యని స్వతంత్ర నామమున వ్యవహరించిరి.

71

క ఛ్ఛ పీ శ్రు తు లు

నీ నీడతోడనే నీవు పోరెదవు.
నను నమ్మలేదు తిన్నగ నీవు గనుక
మదిలోన నీ కరమర తీరకుండె
మఱి వేఱు చూడకుమా వసుందరప్ప
నా రూపు మరియాద నదిపెడు నేర్పు
మరియాద నడువు నీ మార్తుర నోర్చు
ఏకోర్కెయున లేక యెదిరి నడంచు
కోర్కె మానక సమకూరదు మేలు
పనివడి నీ పగవారల నోర్చు
కొనకు నీ కోరని కోర్కె చేకూరు
జగమునకున్ మేలు సలిపడు కోర్కె
జలగుట తగు మావిసికి మరియాద
మరియాద నడుపుము మఱిమాట లెల
నీ బ్రత్కు కీడేరు నీ కోర్కె దీదు
తనియు కోరిక మెయితాల్పు పాఱంబు
కోర్కున్న దనుకజేకూరదు తనివి
కోరిక చేతనె కోరికన్ గొట్టు
వెరవున వినముచే విన మూడ్చవలయు
వినువాడ నీవు, చెప్పెడువాడ నేను
నీకును నాకు లేనేలేదు వాసి
తలపు తనంత గదులుచు నిల్చుండు
కదలిక నీవు, నిల్కడ నెను మఱియు
నీ రూపుఇ కల, నిదుర నా రూపు
పాటూడుము నన్ను బ్రాపింతు నీవు ॥

12

దా స భా ర తి

VI సంస్కృత సారణి

23. శ్రీ హరికధామృతము

94. తత్త్వదర్శనము :

శా॥"కాల స్సన్నిహితో మతి ర్విచలితా తక్షాzzగమ స్పూచితో
      దారాసత్యగతం మనాగపి మనో నాణ్యాపి నందుక్షతే !
      యత్తత్వం కధితం త్వయా బర పరివ్రాడేకవేద్యం మునే
     సూక్షద్వార మనూనవస్త్వివ మను శ్రోత్రం న తద్గఛ్ఛతి."

స్ర॥ స్యాద్రాజ్యం స్వర్గతుల్యం విరహిత సకల జ్ఞాతివైరం సుధర్మం
      కాన్తా సాద్వీ ప్రశాన్తా విరత నవనయేరూపరమ్యా లధేత!
      ఆరొగ్యం సాద్వీ ప్రసాన్తా విరత నవవయోరూప రమ్యా లభేత:
      ఆరోగ్యం సుందరత్వం విపుల భుజబలం వేదశాస్త్రబ్రధా: మ్య:
    నిర్వా ణ్యేతాని సౌఖ్యం నహి దదతి సదా భక్తి సన్మాదవన్య॥

   భూలోకన్త్యేకార్దే వార్దక్యమయం సరే స్వరారుణ్యం
   దర్శయత లోకబంధు: వ్యననోదయయో న్పమానురాగేలు॥

ప్రవృద్ధర్కేందు కిరణై : పరిపూర్ణం దిగన్తమ్:
సోకాసందాశ్రు సంసాతై : ప్రమాతాక్షితలం యధా:

వివన్నమేనం దృష్ట్యా మె కుభ్యతే హృదయం బృసమ్:
తస్యావ్చస్థా మయా ప్రాప్తా దయాzనె బత దుస్సహా:

సీ॥ నంవ్యర్ధమాన తృష్ణా రుజాక్రాన్త న
          యని గలితేzతి మిధ్యా వివేక,
      తన్కరేణానహృత నిజ విశ్వాస వి
         భవ ఇహ జునక భక్తిహెతి.

78

క చ్చ పీ శ్రు తు లు

మహహ నముద్దర్తు మన్యశక్తోభవన్
      దు:ఖ్యన్ పరిభ్రమను దుస్తరభవ,
విపినేz.రినత్త్వ చ్విభీషణ ఈషణ
      కంటకె విబ్రాన్తి కష్టమార్గ.

ఏవ తాపత్రయాభీల-దాన పాన
కావృతే మర్త్య ఉగ్ర మృత్య్వజగరేలు
కబలితో నశ్యతితరాం ప్ర-కంపమాస్య
హే జగన్నాధ నంశ్రిత-హృద్విబోధ॥

స్వచ్చాయాం దర్పణే పశ్యన్ యుద్యతే చటకో యధా:
మాయాయాం స్వం వీక్షమాణ: తధామూడో విముహ్యత:

అవిద్యా నిద్రయా జన్తు: భ్లవిస్వప్నం ప్రవశ్యతి
జాగర్తి శ్రీవతే: నామశ్రవణేన న సంశయ: ॥

హరిభక్తినొకయైన ప్రకటిన సంసారవారధిం తరతి:
ఇతరేణ కర్మణాzzజ్యేనేవ నర: ప్రజ్వలయతి భవవహ్నిమ్॥

లీలామానుషరూపే పరమాత్మని కేశవే వృధైనాబోఒత్
జాంబవత: సామర్ధ్యం జీవన్ముక్తే యధా భవొద్దత్యమ్॥

దరితుం పాతయితుం సంచలయితు
      మయతిష్ట బహువిధోపాయై:
కృష్ణం భల్లూకపతి: కింతు
      ఆకాశ ఇవ హరి రభూదచల:॥

స్థూలం సూక్ష్మం, యిణాం వక్రం స్నిగ్ధం బర్పర మైక్షత:
విపరీతం వస్తుత త్త్వం కుచేలో రధ విభ్రామాత్ ॥

నగుణోzసి నిర్గుణ స్త్వం
   సుశ్యామల విగ్రహోzశరీరోసి:
కార్యమపి కారణమభూ:
   కృష్ణ: త్వాం వేత్తక: శివేన వినా॥

74

దా స భా ర తి

24. రామచంద్ర శతకమ్

                       --

95. భక్త హృదయము:

భుజంగప్రయాతమ్-- "బలం రోదనం బాలకానా" మితి త్వం
     విదన్ మాల సమాశ్వానయా తీవ మూఢం
     నిజానాసి మే తస్తచేత: త్వమేవ
     ప్రసీద ప్రసీద ప్రభో రామచంద్ర॥

    సుఖేస్పాకృత: స్వాత్ ప్రయత్న: ప్రజానాం
     త్వదీయానుకంపాం వినాzనర్ధకారీ,
    భవాను యంత్రీ, అహం యంత్ర వివా స్వతంత్ర:
    ప్రసీన ప్రసీన ప్రభో రామచంద్ర॥

   తరంగోzస్తివర్దొ, నవార్ది న్తరంగే
   తధా విశ్వమస్తి త్వయి, త్వం న విశ్వే:
   త్వమేన ప్రమాణప్రమేయ స్వరూప:
   కధం నిధ్మహే త్వాం ప్రభో రామచంద్ర॥

  మహీజాధరోష్ఠ ప్రవాలేzలి కల్పా
  పురద్విట్ ధను: కాననేzగ్నిచ్చటాబా
  నకృత్కొశికాంఘ్రిస్దినాzంభోజతుల్యా
 చకాస్తే న్మ తే దృక్ ప్రబో రామచంద్ర॥

 సభ అండకో ముద్గరేణేవ భేత్తుం
 పదార్ధస్థితిం తర్కతో వేత్తు మీహే:
 అలం తత్త్వ జిజ్ఞానయా శూన్యదృష్ట్యా
 భవద్భక్తిరేవాసు మే రామచంద్ర॥
 

76

క చ్చ పీ శ్రు తు లు

'బహుస్వామితి ప్రేక్షణేనైన విశ్వం
 చ్వినిర్మాయ మాయామయం త్వయ్యన న్తము '
 సదా క్రీడసే నిర్గుణోzసి స్వభావాత్
 అచింత్య ప్రభావ ప్రభో రామచంద్ర॥

 ముహొరేదశాస్త్ర ప్రభేదా వశేషాన్
 మదీయానుభూతం సమతాద్విచార్య:
 దృడం నిశ్చనోమి ప్రమాణం ప్రమేయం
 వ్రమాతా త్వ మేవేత్యహం నిశ్చనోమి॥

 తులాయాల సమం దుర్దురాం స్తోలయేచ్చేత్
 స్మన్వేతు కామ: శ్రుతీర్ప్రహ్మణి స్వాత్
 కధం వేదితవ్య: న య: సర్వవేత్తాz.
 వ్యలం వ్యర్ధిజిజ్ఞానయా రామచంద్ర॥

 దశాస్యో దరా ప్రాణయుక్త: శరీరీ
 విదేహాత్మజారూప విద్యాzసహోరీ
 భ్రమాబ్దిం నముల్లంఘ్య బ్రహాస్త్రత స్తం
 విజిత్యావ తాం త్వం పునా రామచంద్ర॥

మమ స్వన్నదృష్ట్యంతతో వ్యాసమౌనె
ర్మతం సత్యమద్వైత మెనేతి మన్వే:
తదాపి త్వదీయాలమ్రిభక్తీ రుచిర్మే
యధా జానకీ తే ప్రభో రామచంద్ర॥

అహం శీకర స్త్వం సముద్ర: కరోzహం
త్వమర్కోzస్య హంరేణు రద్రీశ్వర స్త్వం
అహం నశ్వర శ్శాశ్వత్ స్త్వం మృషాzహం
యదార్ధ స్త్వమెవ ప్రభో రామచంద్ర॥

78

దా స భా ర తి

యతో జాయతే యత్తతో లీయతే తత్
యధా మానన వ్యోమత: స్వప్న విశ్వం
మృషైర జ్జగద్బ్రాన్తిజన్యం సమస్తం
భవానెవ సత్యం ప్రభో రామచంద్ర॥

నభో నైల్యవత్ రూప్యవచ్చుక్తికాయాం
త్వయీదం జగత్పర్వ మద్యస్తమేవ:
అనంగో బివాన్ సచ్చిదానందమూర్తి:
త్వయా పాలనీయా వయం రామచంద్ర॥

యధాzంధా గజం జిజ్నిరే శాస్ద్తిలు స్త్వాం
తధైనా విదన్ పౌరుషేయ ప్ర్తమాణై:
అనాజ్మాననం సత్య మాత్మైక వేద్యం
భవద్దివ్య తత్త్వం ప్రభో రామచంద్ర॥

25. కాశీ శతకవ్:

96. కాశీపురి:

శ్రోణీభరాలసా ఘట్ట సోపానన్యవరోహిఅతి:
గంగామపి పురాతీవ స్నాత కాzసి పతివ్రతా॥

మద్రూపేణైన గంగాయాం త్వత్కృతం స్నాన మద్భవేన్ :
తారయేత్ త్వాం భవాబ్దే ర్నౌ: వదన్తీవేత రాజతే॥

శ్యామలత్వం శీతలత్వం సాధుత్వం నామ విండతి
కృష్ణాత్ చంద్రధరాత్ జహ్నో: క్రమార్గంగా భగీరదాత్॥

కాశ్యాం దేశీయభాషాయాం సర్వదా భోజ్యవస్తుమ:
మర్త్యవేషేను సంగీతే సర్వత్ర మధురోరినం: ॥

71

క చ్చ పీ శ్రు తు లు

సౌధస్యాగ్రేzరుంధతీవ మధ్యే సౌదామనీ యధా।
ఆదస్తాత్ పాంచలికేవ కాశ్యాం భాతి కులాంగనా॥

నౌకాస్తిత జనోత్సృష్ట దీపికాzzళి ర్విరాజతే।
గంగాయాం తారకారాజిం హనన్తీవాంబరాశ్రితామ్॥

బహువేపై। బహుమతై। బహుబాషాబిరన్వితా।
వారాణసీ కీర్తయతి విశ్వేశం విశ్వరూపిణమ్॥

త్రిగుణై రేవ సంసారచక్రం భ్రమతి తత్త్వతం


బ్రువ్న్నితీవానడుద్పి శ్శకబో గర్భవతి త్రిభి।॥

విశ్వేశ్వాఅభిషేకాఅ సతి భాగీరధీజలే।
తాశ్యాం కోమాల వాంచతీత నారికేలో నజాయతే॥

భుంక్తే యధేష్టం బలవాన్ భోగాన్ రుదతి దుర్బలే।
శత్రూన్ జిత్యా నశామేత్య బలీవర్ణ।ప్రగల్బతే॥

యేనకేనాప్యుపాయేన బహ్వన్నం ప్రాప్నుయాదితి।
పునస్సమ్ముషితం వస్త్రం దదాత్యన్నాయ వానర।॥

మాత్రేణోత్జస్తమాకాళే వీక్ష్య శ్యేన।పతంగకమ్।
న్రహర్తుల తం ప్రయతతే సహతే క।నరోన్నతమ్॥

ఆరోగ్య ప్రతికూలాzపి కాశీ సంపేవ్యతే సదా।
ముముక్షుణా, zదుష్టోzసి భర్తేనోత్తమ భార్యయా॥

యమునా ప్రముఖా నద్యోగంగాయాం ముప్రవేశనాత్।
తస్మా నామై వాప్నునంతే వత్యుర్గోత్రం యధాస్రియ॥

వినీలకాచవలయ రాశీనాభాతి జాహ్నవీ ।
ళకో కనీవికేనాపి శశిరర్తౌ వినిర్మలా॥

71

దా స బా ర తి

మాదృశ: పాతక: త్వాదృక్పావనీ నైవ విద్యతే।
దిష్ట్యాzzవయే స్పమావేశో గంగేzద్య నమభూదహో॥

తారకమ్

97. ఈశ్వరతత్త్వము:

భేదో యధా కాండ తరంగయో ర్న
స్యాత్తేzన్య లోకన్య తధైవ దేవ
సర్వ: ప్రవంచ: త్వయి కల్పితొనా
స్థాణౌ భవే ద్దన్యురిన భ్రమేణ॥

దృశ్ల్యవ్యదృశ్యా నదనత్ప్యరూపా
త్వదీయ మాయా భ్రమకారణం సా
దిగంత రేఖాన దతీంద్రియంతే
తత్త్వం జగన్నాటక సూత్రధారి!

భక్తైన తేzదీశ్వర దేవతాzఇ
శక్నోతి వేత్తుం అరమార్ధ తత్త్వం
దృష్టి స్వరూపం ముకురశ్రయైన
విలోకితుం శక్యత ఆదిదేవ!

ఏకత్వసంఖ్యా ప్రతిపాదకోzంక:
నిరంతరం బోధయతే బహుత్వం
బింద్వన్విత: సుష్టు యధా స్వబావ
యశ: త్వ మేకోని తధాzసి దేవ॥

79

క చ్చ పీ శ్రు తు లు

98. ఆదర్శ పురజనులు:

చంద్రికా ధనలచ్చాయా స్తత్రర్యా రేజిరే జనా।
అన్యొన్య మైత్రీం కుర్వంత: సంజానంతో యధాయధమే
విద్యయా సమయాకృత్య ప్రియాకృత్య మహుర్గురూన్
           .... ..... .....
ఏకతానా: సాలాగీనా: నాగ్నినో హృదయాలవ।
క్షేమంకరా మహోత్సాహ: ఉరస్వంతో యశస్విన।
నమానపంక్తి భూక్తార। నమవర్ణివిభూషితా।
సామాన్య భాషా వక్తార। సమానాచార వర్తిన ।
నయ। పరిణయ్హం స్రీణాం విద్యాభ్యాసం స్వతంత్రతాం
ప్రాపయంత। .... .... ....
సామాజికా ఆస్తికా న్సత్క్లీనా ధార్మికా బురా।
శాకాహారా వానదూకా। కృతిన।పురుషోత్తమా।
తత్రత్య్హకా బభూవ స్త్రీ వీరమాతా సులక్షణా
గృహకార్యపరా ప్రాజ్ఞ బుధమాన్యా పతివ్రతా
వీధిఈ ర్వికాలా అమలా జలయంత్ర పరిష్కృతా।॥

99. సుకవి:


<poem>
న దేవతాదీన మన।ప్రవృత్తి।
స్వాతంత్ర్య సంకల్పిత చారుకావ్య।
దయార్ద్ర చిత్తోzంచిత సత్యవాక్య।
కతారణ। సత్కచ్విరేన నాzన్య।॥

నవరుచివేదీ సర్వభూతానువాదీ
లలిత చరణదారీ సాధ్యలంకారహారీ
నరవశ సుఖయోగ శ్చిత్రసంకల్పభోగ॥
కవి। .... ..... . .....

90

దా స భా ర తి

VII అనువాద సారణి

27. నవరస తరంగిణి

100. షేక్స్పియరు సొగసులు:

[గీర్వాణాంద్రములలో అనువాదము]

మూలము:
A. To guild refind gold, to paint the lily
    To throw a perfume on the violet
    To smooth the ice, or add another hue
    unto the rain bow, or with of heaven to garnish
    Is wasteful and ridiculous excess।
                         [King John -Act IV Sc.ii]

1 అను: శ్లో॥స్వర్ణే హెమవిలేపనము, నమదికే రక్రోత్సరే రంజనం,
   చాంపేయప్రనవే సుగంధకలనం, హైమోసలే స్నేహనం.
   దేవేంద్రన్య శరాననే నముదితే వర్ణాంతరస్రావణం,
   దీపే నార్కరుచిప్రదీపనవ మతివ్యర్ధ మ్ర్బహాసాస్పదం

2. ద్వి॥ బంగరుపూత మేల్పంగారమునకు,
          తెంగలునకు రంగు, సేత, నెత్తావి
          సురవున్న కెరవుతె-చ్చుట, మంచుగడ్డ
          మఱి నున్పుసేయుట, మరియొక రంగు
          నగవిఅరి వింట నొనర్చుట, నట్ట
          నగతలు వెలింగెడు.భానుని కాంతి
          హెచ్చింప జెవత్తి నెత్తిపట్తుటయు
          నచ్చపు నగుబాటు-నరికము వృధయు.

3. He was a man, take him for all in all
          I shall not look upon his like again.
                          (Hamlet-Act I. sc.ii)

81

క చ్చ పీ శ్రు తు లు

1.శ్లో॥ సోzభూత్సుమా న్సర్ఫదైవ
        సంపూర్ణ మగుణాకర॥
        నాహం కదాపి వీక్షిష్యే
        తవ్య ప్రతివిధిం పున। ॥
2. ద్వి॥ పురుషు డాతండు సం-పూర్ణగుణుండు
           వరయ బోవ నిక నే-నతనికి సాటి,

Ca. O, She doth teach the torches to burn bright।
      It seems she bangs upon the cheek of night
     Like a rich jewel in an Ethiop's ear
     Beauty too rich for use, for earth too dear।
     So shows a snowy dove trooping with crow
     As yonder lady O'ur her fellows shows.
             (Romeo and Juliet -Act I. sec.ii)
1.శ్లో॥అత్యంతంప్రణ్వలితు మబలా శిక్షతేzహోప్రదీపాన్
       రాత్రౌ కాళీశ్వవణ విదలద్రత్నభూషేన భాతి
       సౌందర్యంచానుభవిత్ మతిశ్రేష్థ ముర్వ్యా అమూల్యం
       నాయసౌఘే చరతి నరటాన త్సభీమండలే సా.

2.గీ॥ చిలుకలకొలికి దివిటీల-వెలుగనేర్పు
        గలిగి వజ్రంబు మాది జీ-కటిని మఱయు
        నందమంద నత్యధికంబు-నవని కరుదు
        కాకులం దంచ యది తోది-గరితలందు.

D. Cowards die many times before their deaths।
     The valiant never taste of death but once.
                   [Julius Caesar - Act I, Sc.ii]
ఆ.వె. ఎన్న బిఱికివారి లెన్నియోమాఱులు
        చచ్చుచుండ్రు తాము చావక మును
        పెన్నడైన దైర్యమున్న జనులు చావు
        చవి యెఱుంగ రొక్కసారి తప్ప.

E.Friendship is constant in all other things
   Save in the office and affairs of Love:

82

దా స భా ర తి

Therefore, all hearts in Love use their own tongues;
Last every eye negotiate for itself
And trust no agent; for beauty is a witch;
Against whose charms faith melteth into blood
         [Much Ado about Nothing-Act II, Sc.1]

చ. వలపున దప్ప మైత్రి పెరస్తువుల నన్నిట నుండు నిల్కడన్
    వంచిన యెల్ల డెందములు వాడుట మేల్ దను నోళ్ల గావునన్
    దెలుపుత దన్నుగూర్చి ప్రతిదృష్టి తనంతట నమ్మ కన్యువిన్
    బొలుపొక మంత్రకా డతని బూమెల నెమ్మి కరగు మర్లుగాన్.

F. That ever death should let life bear his name
    Where life hath no more interest but to breathe?
      [Titus Andronicus-Act III, Sc.1]

ద్వి॥ ఊపిరి తీయుటే యొక పని యైన
       బాపురే చావేల బ్రతు కనరాదు!

G. His words are bonds, his oaths are oracles;
    His love sincere, his thoughts immaculate;
    His tears pure messengers sent from his heart;
    His heart as far from fraud as heaven from earth.
     [Two Gentlemen of Verona-Act II, Sc.vii]

ఉ॥అతని నుళ్లొడంబడిక, లాతని యెట్టులు దేవవాక్కులొ,
     నాతని ప్రేమ నిష్కపట, మతని యూహ లకల్మషంబులౌ.
     నాతని మానస ప్రచలితామల దూతలు వాని యశులొ,
     నాతని యాత్మ వంచనకు నొ దవు స్వర్గము భూమికింబలెన్.

H.My crown is in my heart, not on my head।
   Not decked with diamonds and Indian stones।
   Nor to be seen: my crown is called content;
   A crown it is, that seldom kings enjoy.
               [Henry VI- Part II Act III, Sc.i]

గీ॥ నా కిరీటము నాదు డెందమున నుండు
     నా కలన్ గాదు, వివిధరత్నముల జెక్క

88

క చ్చ పీ శ్రు తు లు

బడగలే, దద్దియున్ గానబడగబోదు
తనివి నా మౌళి-దొర లది కనుట యెరుదు.

I. If thou remember'st not the slightest folly
   That ever love did make thee run into
   Thou hast not loved :
   Or if thou hast not sat, as I do now,
   Weaning thy hearer in thy mistress' praise
   Thou hast not loved:
   Or if thou hast not broke from company
   Abrupthy, as m passion now makes me,
  Thou hast not loved.
                 [As you Like It -Act II, Sc.iv]

సీ॥ ఉరువడి ననవిల్తు డ్నికొల్పగా నీవు
        నెఱపిన యేపాటి నేరమైన
     మఱచిపోయితినెని మఱి నీవు వలచియుం
         డగలేదు; నీవిప్డు నా తెఱగున
     గూర్చుండి నీ చెలిన్ గూరిచి పొగడును
         వినువారల నెల్ల విసుకు కలుగ
     సలుననిచో నీవు వలచియుండగ లెదు
         కొంచెమెనం బరికించి చూడ:

    చెలగి నా మరు లిపుడు నన్ జెసినట్లు
    కతము చెప్పక నీ చెలికాండ్రనుండి
    యీవు దబ్బున విడబది యేగవేని
    వెండియ్లున్ నీవును వలచియుండలేదు.

J.I would have broke eye-strings, cracked them, but
   To look upon him, till the diminuition
   Of spaces had pointed him sharp as my needle;
    Nay, followed him, till he had melted from
    The smallness of a great to air; and then
    Have turned mine eye, and wept.
                 [Cymbaline- Act>I, Sc.iii]

84

దా స భా ర తి

గీ॥ దూరమున సూది మొనయంత తోచువఱకు,
     నఱుపుకంటెను దగ్గి మాయ మగుదనుక,
     నరములు తెగునంతకును గన్గనను విప్పి
     వాని గనుకొని విదన నె నగచియుందు.

K. When most I wink, then do mine eyes best see,
    For all the day view things unrespected;
    But when I sleep, in dreams they look on thee
                        [Sonnets]

కం॥ కనుఱెప్ప మూసినప్పుడె
      కనెడున్ నా కన్నుదోయి కర, మెమన బ్రొ
      ద్దున గాంచువాని సరకు
      న్గొన దరి, నినుజూడు-నేను గూర్కిడ గలలోన్

I. The iron tongue of midnight hath told twelve,
   Lovers, to bed : It is almost fairy time.
        [Midsummer-night Dream-Act V, Sc.i]

కం॥ నడిరేయి యినుప నాలుక
      మడివెం లన్నెండు-వలపు నూల్కొను మీరల్
      పదుకొందు పెజ్జలం ది
      ప్పడు గడు గంధర్వవేళ పొనరుచునుండెన్.

M.Love is a smoke made with the fume of sighs;
   Being purged, a fire sparkling in lovers' eyes;
   being vexed, a sea nourished with lovers' eyes,
   What is it else? a madness most discreet,
   A choking gall, and a preserving sweet.
          [Romeo And Juliet - Act.I, Sc.i]

గీ॥ వల అనగ నెచ్చమార్పుల గలిగిన పొగ,
     కాముకుల కన్నులందున గ్రాలు నెగ్గి,
     నాయికాయకాశ్రులన్ బ్రలలు కడలి,
     వెఱ్ఱియున్ జంప బెంప బెంపగ విష మమృతము

85

క చ్చ పీ శ్రు తు లు

N. That man that hath a tongue, I say, is no man
    If with his tongue he cannot win a woman.
        [Two Gentlemen of Verona- Act III, Sc.i]

ద్వి॥ మాటాడువా డెల్ల మగవాడుకాడు
       మాటలచేత బామల గెల్వకున్న.

O.What seest thou in the ground? hold up thy head:
   Look in my eyeballs, there thy beauty lies
   Then why not lips on lips, since eyes in eyes?
     [Venus and Adonis.]

గీ॥ ఎందు కటు క్రిందు జూచెద నెత్తు సిరము
    చూడు నా కంటిపాప లచ్చొటను నీదు
    సొగసు నెలకొను -జూపుల జూపు లెనయ
    నేల పెదవులు పెదవుల నెనయరాదు?

P. Men are April when they woo, December when they wed;
    maids are May when they are maids,
    but the sky changes when they are Wives
           [As You Like It -Act IV, Sc.i]

న॥మగవాండ్రు తము బెండ్లాని కన్నియల
    బతిమాలుకొను నప్పుడు చైత్రమాసమువంటివారు.
    కాని పెండ్లియైన పిదప శూన్యమాసమువలె నుందురు:
    కన్నియలు తమ కన్యాత్వమందు వైశాఖముం బోలెదరు.
    కాని వా రిల్లాండ్రైన పిమ్మట నా కాలముమాఱును

Q. But virtue, as it never will be moved
    Though lewdness court it in a shape of heaven
    So lust, though to a radiant angel linked,
    Will sate itself in a celestial bed
    And prey on garbage.
                    [Hamlet - Act I, Sc.V]

గీ॥ అలమి పోకిరితనము స్వర్గాకృతి గొని
     కోరిన జలింపబడదు సుగుణ మొకప్డు

86

దా స భా ర తి

దివ్యమూర్తిల్ని గలిసియున్ దృప్తిపడక
గుహ్యచాపల్య మెంగిలి కూళ్లు గుడుచు.

R. Base men being in love then a nobility
    in their natures more than is native to them.
                        [Othello- Act.II, sc.i]

స॥ వీరుల వలపున మంటచే దమకు నిక్కముగ
     నున్నదానికంటె బెచ్చుగ నొక గొప్పదనముం
          దమ స్వభారములం దగిలియుందురు.

S.She either gives a stomach and no food-
   such are the poor, in health , or else a feast.
   And takes away the stomach, such are the rich
   That have abundance, and enjoy it not.
                 [Henry IV- Part II : Act IV sc.iv]
గీ॥ ఆక లెంతో గొలిపి దైవ మన్న మితడు
     నెలయు నారోగ్యమున గడు బేదవాడు
     కదిసి బువ్వ నొసంగి యంగన తెఱిచెడు
     గుడువ జాలడు భాగ్యవంతుడు కలిగియు.

T. When beggars die there are no comets seen;
    The heavens themselves blaze forth
                          the death of princes.
                     [Julius Caesar - Act II, Sc.ii]

కం. కనుపడవు తోకచుక్కలు
     మిను చక్కిన్ బిచ్చగాండ్రు మృతులైన యెడన్
     పనివడి రాజుల చావున్
     జనములకు దనంత బయలు చాటుచునుండున్

U. Suspicion always haunts the guilty mind :
    The thief doth fear each bush an officer.
                  [Henry VI -Part III: Act V.Sc.vi]

ద్వి॥ దురితంబు గల మదిన్ దొడరు నదియము
       బరి యెల్ల పొద రాజభటునిగ వెఱచు॥

87

క చ్చ పీ శ్రు తు లు

V. For what is wedlock forced but a hell
    An age of discord and continual strife ?
    Whereas that he contrary bringeth bliss
    And is a pattern of celestial peace.
                  [Henry VI- Part I : Act V.Sc.v]

గీ॥ బలిమి నొనరింపబదిన పెండిలి నరకము
     కలత బ్రతుకును, మఱియు నిచ్చలు జగడము
     సలుపు: ఇష్టానుసారము జరిగిన నది
    నంతనము, దివ్యశాంతిని సంతరించు.

W. 'T is beauty that doth off make women proud:
     'T is virtue that doth make them most admired:
     'T is government that makes them seem divine
     [Henry VI - Part III : Act I, Sc.iv]

గీ॥ స్త్రీల దఱచుగ గర్వింపజెసెడు నది
     సౌగను: వారల మిక్కిలి పొగడబడగ
     నలుపునది సద్గుణంబు: వేల్పులుగ వారి
     దెలియబడజేయునది జితేంద్రియత యగును.

X. The lunatic, the lover and the poet,
    Are of imagination all compact:
    One sees more devils than vast hell can hold:
    That is the mad man : the lover all as frantic,
    Sees Helen's beauty in a brow of Egypt;
    The poet's eye, in a fine frenzy rolling
    Doth glance from heaven to earth,
                          from earth to heaven:
    And, as imagination bodies forth
    The forms of things unknown, the poet's pen
    Turns them to shapes, and gives to airy nothing
    A local habitation and a name.
       [Midsummer Night's Dream-Act V, Sci]

మ. వెడగున్ గాముకుడున్ గవీందుడు మనోవిభ్రాంతి మూర్తుల్ గదా
      నెడగెందున్ గనరాని దయ్యముల గన్పెట్టున్; గురూపిన్ దగు
     
    

88

దా స భా ర తి

ల్వడి రంభన్ నిరసించు గాముకు డహా స్వర్గంబునందుండి యి
క్కడి కిందుండి కవీంద్రు దృష్టి దివికిన్ వాని గంటమ్ము పే
ర్లిడి యాకారము లున్కిన బ్లొనగు నెం దేమైన లేకుండనీ॥

Y. Virtue itself turns vice, being misapplied,
                 [Romeo and Juliet - Act II, Sc.iii]

గీ॥ గుణమె దోషంబుగా మాఱు గొన్నిచోట్ల
     కర మనప్రయక్తం బగు కారణమున
     విరచనా కొళలంబున మఱియు నొక్క
     కాలమందున దోషమే గణుతికెక్కు

z. your greatest want is, you want much of meat;
   Why should you want? Behold, the earth hath roots
   Within this mile break forth a hundred springs:
   The oaks bear mast, the briers scarlet bips:
 The bounteous housewife, nature, on each bush
 Lays her full mess before you. Want ! why want?
      [Timon of Athens - Act IV, Sc.iii]

క॥ మీకున్న గొప్పకోరిక
     యాకలికిన్ దగినయంత యాహారముగా
     మీ కెందు కీ కొఱత-యా
     లోకింపుడు కలవు భూమిలోపల దుంపల్

ఉ॥ ఇందుక దవ్వులోన సెలయేఱు లనేకము లుబ్బి పాఱెడున్
      మంచి పలంబుల గలిగి మ్రాకులు పెక్కు రకబు లొప్పు-దా
      నెంచిన తేనెదిండి బొదరిండ్ల నమర్చతు బెట్టు పోతలన్
      మించిన యాలుగా బ్రకృతి-మీకు గోఱంత యికెంచు కుండెడున్:
  

88

క చ్చ పీ శ్రు తు లు

101. కాళిదాసు సొగసులు :

[అచ్చ తెనిగింపులు]

మూలము:
1.వేదాంతేమ యమాహు రేకపురుషం వ్యాన్య స్థితం రోదసీ
  యష్మిన్నీశ్వర ఇత్య నవ్యవిషయ శబ్దో యధార్దక్షర॥
  అంతర్యశ్చ ముముక్షుబి ర్నియమిత ప్రాణాదిబి ర్కృగ్యతే
   న స్థాయి స్థిరభక్తియోగ నులబో విశ్శ్రేయసాయాన్తువ:॥
       -విక్రమొర్వశీయము (నాందీశ్లోకము)

అనువాదము:
తరువోజ॥ పలికెద రెవ్వవి బ్రాజదువుల కొనల
               మిన్ను మన్ను నిందనగు నొక్కనిగ
            గలుగ కొడునకు నిక్కంగ నెవ్వాని
              యెడ జెల్లుచుండెడు నెలిక బిరుదు.
           నెడద మనుఱు బిగియించి ముత్తికయి
              తడగు వారల వెదుకంబడు నవడు,
           కలిగింతు బత్తిజోగమునకు సుశువు
              గా జిక్కునట్టి ముక్కంటి మేల్మీకు.

2.హృదల్య మినుభి: కామస్యాంత న్పశల్య మిదం తత:
   కదమువలభే నిద్రాం న్వప్నే నమాగమకారిణీం
   వచ నువచనా మాలేఖ్యేz-సిప్రియాం నమవాన్యతాం"
   మమ నయనయో రుద్పాష్పత్వం నభే వ భవిష్యతి.
         -విక్రమోర్వశీయము

చ॥ మది నవనిల్తుతూపులను మాటికి గాయము లందుచుండగా
     విదురెలుపోవగా గలను నెచ్చెలిమి గలనైన బొందజా
     లుదు నన బోని చిత్తరువు లోనయిన న్వరివ్రాసి చూడగ
     ల్గుదునన నీరు నాకనులలో నెటు నిండకమాను సంగడి॥

 

    

80

దా స భా ర తి

పాతుం నప్రధమం న్వవన్వతి జలం యుష్మాన్వపీతేషు యా
నాదత్తే ప్రియమండనాయ భవతాం స్నేహేన యా వల్లనం
అద్యే న: కుసుమప్రసూతి సమయే యస్యా భవత్యుత్సవ:
సేయం యాతి శకుంతలా పరిగృహం సర్వై రిమజ్ఞాయతాం.
                  అభిజ్ఞాన శాకుంతలము

ఉ॥ ఎవ్వతె ముందు మిమ్మి చవియించక త్రాగడు
 నీరు దాల్ప బో
దెవ్వతె మీషయిం జెలిమి నింపయినం జివురాసొమ్ము, మీ
పువ్వు సమర్తి యెవ్వతెకు బొల్పగు పండువుచెల్వ విందు నా
జవ్వని యీ శకుంతల యెనంగు నొనంగుడి యాన నెల్లరున్.

అ॥ ఉగ్గలిఅ దబ్బకబలా మిఆ పరిచత్త ణఛ్ఛణా మోరా।
    ఓనరి అవణ్ణుసత్తా ము అంతి అన్పూనిఅ లదాఓ॥
                   అభిజ్ఞాన శాకుంతలము

గీ॥నోళ్ళ తెల్లజార్చి లేళ్ళు, నాటల నాడ
    కుంది నెమలిగములు, పండుటాకు
    తెల్ల రాల్చుకొనుచు నెల్లెడ దీగెలున్
    గంటినీరు గార్చు కరణివయ్యె.

5॥అర మధునవితానాం నేత్ర నిర్వేశనీయం
    మనపిత తరుపుష్పం రాగబంధ ప్రవాలమ్:
    ఆకృతకవిధి నర్వాంగీన మాకల్పజాతం
    విలసిత నదిమాద్యం యౌవనం న ప్రపేదే॥
                        -రఘువంశము 13-52

గీ॥ అంత జెలువల కన్గవ లానుకల్లు
     చిగురు నిల్తుడన్ ంరాకుపూ తగులు తలిరు
     తొడ నాడ్లికెల్ల చనకుదా దొచు గడన
     హోయలు తొలి టెంకి జవ్వన మొందె నతడు.

91

క చ్చ పీ శ్రు తు లు

6. అనాఘ్రాతం పుష్పం కివలయ మలూనం కరరుహై
    రినావిధ్దం రత్న మ్మదు నన మనాస్వాదిత రనం
    అలందం పుణ్యానాం ఫలమివ చ తద్రూవ మనఘం
    నజానే భోక్తారం కమిహ సమువస్థాస్యతి విధి:॥

                   

--అభిజ్ఞాన శాకుంతలము



ఉ॥ క్రోలని క్రొత్తతేనె, గ్రుచ్చని మావికె, గొరునాటులన్
     దాలచనట్టి లేజువురు, తావిగొనంబడనట్టి పూవునుం
     బోలిన దాని సోయగము ముందిటి నోముల మేటివంటగా
    బోలును దాని నేలుటకు బుట్టిన యాతని దెంత పున్నెమో॥

చ॥ గ్రీవాబజ్గాభిరామం మహురనుపతతి న్వందనే బద్ద దృష్టి:
     పశ్చార్దేన ప్రవిష్టశ్శరపతనభియా భూయసా పూర్వకాయం
     దర్పై రిర్ధావలీడై; శ్రమ వివృతముఖ భ్రంశిబి॥ కీర్ణ వర్త్మా
     వశ్యోదగ్ర ప్లుతత్వా ద్వియతి బహుతరం స్తోకముర్వ్యాం ప్రయాతి॥

--అభిజ్ఞాన శాకుంతలము



ఉ॥ వెంబడు తేరి వంకమెడవెట్టి పొరింబొరిజూచు, నము పై
     నిం బడు నంచు వెన్దలకు నివ్వెర ముందటి మేను కుందు బొం
     తం బఱువు న్పగంబు తిను దబ్బము డయ్యుచు నోరువిప్పి, యే
     గుం బరికించుమా దిగువ గొద్దిగ మెండుగ మింటదాటులన్

8. మంద। కవి యశ। ప్రార్ధీ గమిష్యా మ్యవహాస్యతాం
     ప్రాంశు లభ్యే ఫలే లోభా దుద్భాహురివ నామన:॥

--రఘువంశము 1-3


కం॥ వెడగున్ గయిపెంపు న్నే
      బడయంగా గోరి నవ్వబడియెద నానన్
      బొడవగు నతనికి బొందం
      బడు పండునకు గయి చాచు మఱుగుజ్జువలెన్

92

దా స భా ర తి

9. అకార సదృశ: ప్రజ్ఞ: వ్రజ్ఞయా సదృశాగమ:।
    ఆగమై న్పదృశారంభ ఆరంభ నదృశోదయ॥

రఘువంశము 1-15



గీ॥ సొగసునకు దగునట్టి తెల్విగలవాడు
     తెలివికిందగు చదువుల వెలయువాడు
     చదులకు దగిన పనిని సల్పువాడు
     పనికిదగినట్టి పెంపున దనరువాడు.

10. వర్ణ ప్రకర్ష సత కర్ణకారం
     ధునోతి నిర్గందతయాష్మ చేత:
     ప్రాయేణ సామగ్ర్య నిరొ గుణానాం
     వరాజ్ములీ విశ్వస్మజ: ప్రవృత్తి:॥

--కుమార సంభవము 8-53



గీ॥ కారుమబ్బు గ్రమ్మకయె కురిసెడువాన
     పువ్వు కానరాక పొడము పండు
     తలకు మీర లిట్లు దరిసెన మిచ్చట
     యౌర : నాకు గొరినట్టి కోర్కె.

12. ఇన్దీరేణ నయనం, ముఖ మంబుజేన,
     కుందేన దంత, మధరం నవపల్ల వేన,
     అంగాని చంపకరలై న్ప విదాయ వేదా:
     కాంతే కధం ఘటితవా మనలెన చేత:॥

--శృంగార తిలకము

93

క చ్చ పీ శ్రు తు లు

గీ॥ నల్లగలువ జూడ్కి, నగుమోము దమ్మిచే,
     మొల్లచేత బల్లు, మో విగురున
     గడమ మేను సంపగల జేసి యా బమ్మ
     చెలువ! జాత నెట్లు నలిపె నెడద।

12. ఆదర్శనా త్ర్పనిష్టా సా మే సురలోకమందరీ హృదయం
     బాణేన మకరకేతో: కృతమార్గ మనంధ్యసాతేన॥

--విర్కమోర్వశీయ



గీ॥ పచ్చనిల్తుని తప్పిపొవక తగిలిన
     తూపుచే జేయబడినట్టి త్రోవగల్గు
     నాదుడెందంబు లోపల న్పాదుకొనియె
     గన్న యంతనె యావేల్పుటన్ను మిన్న

14. యదాలోకే సూక్ష్మం వ్రజతి నహసా తద్వివులతాం
      యదర్దే విచ్చిన్నం భవతి కృతసంధాన మివ తత్
    ప్రకృత్యా యద్వక్రం తదై సమరేఖం నయనయో
    ర్నమే దూరే కించి తలుమై న పార్శ్వే రధజవాత్

--అభిజ్ఞాన శాకుంతలము.



గీ॥ తమ్మి పొలుసారు నాచున దగిలియైన
     మెఱుగు నిడు కలుషయ్యు ఇందురుని మచ్చ

84

దా స భా ర తి

నార చీరైన నీమె చెన్నరు నంద
మైన రూపులకు దొడవు కానిదెద్ది.

16. గచ్చతి పూ శ్శరీరం ధావతి పశ్చా దనంస్తుతం చేత॥
     చీనాంశుకమిన కేతో: ప్రతివాతం నీయమానన్య॥

అభిజ్ఞాన శాకుంతలము


కం॥ బొంది మును నడుచున్నది
      డెంద మెఱుక లేక పారెడి న్వెనువెన్కన్
      దొందరగ నెదురు గాలిన్
      జెంది పడగనున్న పట్టుచీర నితమనన్ ।

10. తన కనుమశరత్వం శీతరశ్మిత్వ మిందో
     ర్ద్వయ మిద మయదార్ధం దృశ్యతే మద్విధెషు
     వినృజతి హిమగర్బై రగ్ని మిందు ర్మయాభై
     స్త్వమపి కుసుమభాణా స్వజ్రసారీ కరోషి।

అభిజ్ఞాన శాకుంతలము


ఉ॥ పూవుల యమ్ములు గలుగు ప్రోడవు నీవట! చల్లనైనవా
     డా విరితమ్మిగొంగ యట! యచ్చెరువొ ననుబోలునట్టినా
     రీ నెడమాట నమ్మగలరే యలరేదొర చల్లుఇ నిప్పులన్
    నీవును బూల ముల్కులను వింతువుగా మది చూసిపోవగన్.

18. యాత్యేకతోz స్తశిఖరం పరిరోషరీనా
     మావిష్కృతోzరుణ పురస్పర ఏకతోzర్క।
     తేజోద్వయన్య యుగన ద్వ్యసవ్చోదయాభ్యాం
     లోకో వియమ్యత ఇవాత్మశాంతతేషు॥

అభిజ్ఞాన శాకుంతలము


గీ॥ ఒక్కవైపు గ్రుంకుచుండెను జాబిలి
     నెగడు నొక్కప్రక్క జగము కన్ను
     మించుజంట కీడుమేలులచే బజ
     తెలువబడునటు తన దెవజమార్చు

85

క చ్చ పీ శ్రు తు లు

19. రమ్యాణి వీక్ష్య మదురాంశ్చ విశమ్య శబ్దాన్
     వర్యుత్సుకోభవతి యత్సులితోzపి జంతు।
     తచ్చేతసా న్మరతి నూన మబోధపూర్వం
     భావస్థిరాణి జననాంతర సౌహృదాని.

అభిజ్ఞాన శాకుంతలము


గీ॥ అందములజూచి తీయ సధాలకించి
     వనరు సుకమున్న నజ దేనివలన నా క
     తలంబుచే దొలిపుట్టులందలి యితరముల
    దెలియ కెద నాటినని మదిం దలచుచుండు.
20. స్త్రీణా మశిక్షిత పటుత్వ మమానుషీషు
     నందృశ్యనె కిముత యా। ప్రతిబోధవత్య।
     ప్రాగంతరిక్ష గమనాత్ స్వమనత్యజాత
     మన్యైర్ద్విజై। వరభృతా।ఖలు పోషయన్తిం॥

అభిజ్ఞాన శాకుంతలము


కం॥ చెలులకు మన్నని నేరువు
      వలనగు మానిసులు కాని వానన్, నెఱజా
     ణల జెప్పనేల తమ సి
     సిల్లల గోయిల రొండు పిట్టలం బెంపించున్

21. శరీరం క్షామాం స్యాదనతి దయితాలింగన సుఖే
     భవ్చేత్పాస్రం దక్షు, క్షణమసి న సా దృశ్యత ఇతి
    తయా సారంగాక్ష్య్తా త్వమసి న కదాచి ద్విరహితం
    ప్రసక్తే నిర్యాణే హృదయ సరిరానం వ్రజపి కిమ్॥

--మాలవికాగ్ని మిత్రము


గీ॥ చెలియ కౌగిలి దొరకక చిక్కు మేను
     నెలత గానక కనులు నీరునించు
     గాని మంతయు బాయవు గన కలికిని
     డెందమా! నీవు నలవంత బొందనేల।

86

దా స భా ర తి

28. ఉమర్ ఖయాం రుబాయత్*

102. కర్తవ్య వర్తమానము :

1. పార్శీ మూలము:
Bashiguft Shigofa mal blykn al seql
Dust as small Zuhd bidder al seql
Murgi garddna der rahash par mizand.

2. ఆంగ్లము:
Come, fill the cup, and in the fire of Spring
Your Wintger-garment of Repentance fling
  The Bird of Time has but a little way
To flutter- and the Bird is on the Wing.

a. సంస్కృతము శ్లో ॥
పాత్రం సంపూర్యాహాహి కిం తనన్యసి యౌవనే।
వ శ్యోడ్డీ నోమ్మబో జీవపక్షి దోదూయతే బలాత్॥

గీత॥ నవ నవ వికసిత పుష్పానచ్వ మదృత మానయేమమయి పాత్రి।
      సత్వర మేహి దునీహి క్రతువ్రత కఠోర కర్మహే పాత్రి॥
     భుజంగి॥ డయిష్యన్ దునోతి।స్వవక్షా సతత్రీ।

8. తెనిగింపు : మూపు1॥ జరిగిన పనికై నగనకు
                  మరుదుగ నీ కోరుకొన్న హాయి కుడుపు మూ
                 సిరులు గెగిరిన నీ కది
                 దొరకదు మఱి మిగుల దనివితోడ న్మమమా॥

చెండు2॥ సీవిరి న్దెమ్ము విచ్చెడు ననె నవలు
            మూలకు ద్రొక్కు నోము న్గోవు చెలియ।
            వెడలిపో ఱెక్కలు విదిలిచె న్పులుగు॥
                     

  • ఇందలి ఆంగ్లపద్యం ఫిట్జ్ గెరాల్డుగారిది. సంస్కృతాంద్రములు దాసుగారివి

1.'మూపు ' అనగా కందము, అది 'స్కంద శబ్దభచ్వము.

2.'చెండు ' అనగా మంజరి.