భూమిక

రచయితల సహకార సంఘము అధ్యక్షునిగా, నా ప్రోత్సాహముతో శ్రీ యస్వీ జోగారావుగారు "ఆధిభట్ట నారాయణదాస సారస్వత నీరాజనము" అను గొప్ప గ్రంథమును తమ సంపాదకత్వమున నిర్మింప ఒల బృహత్ప్రణాళిక వేసి అనేక కవి, పండితులచే వ్యాసములు వ్రాయించి, వాటిని చూచు సమయమున, శ్రీ నారాయణదాస రచనల నన్నిటిని ఆమూలాగ్రముగ చదివి, ఆకళింపు చేసుకొనిరి. శ్రీ జోగరవుగరు ఒక పని తలపెట్టిన, అహర్నిశములు వాని వెంబ బడి పూర్తిచేయువరకు నిద్రింపని దృడదీక్షాపరులు, అటులనే ఎన్ని పనితొందరులున్నను, వాటి నన్నిటిని వెనుకపెట్టి దాన సాహిత్యమును మధించి ఈ రత్నములు వెలికితీసి ప్రతి పద్యమునకు సరియైన నామకరణముచేసి, ఆ పద్యములన్నియు అచ్చువేయుటకు అనువుగా తిరిగి వ్రాసి, వ్రాయించి, ముద్రణ ప్రతులలోని తప్పులుదిద్ది, యావద్భారము తన నెత్తిన వేసుకొని, ఈ పుస్తకమును ఇంతటి మనోహరరూపమున అందించినందులకు వారికి నాకృతజ్ఞతాఃభివందనములు.

అంతియేగాక, శ్రీనారాయణదాస సమగ్ర స్వరూపమును లోకమునకు అందజేయ వాంచతో, వారి సూక్తులు, జీవిత పంచాగము, నారాయణదాస గ్రంధావళి వాటియొక్క స్వరూప స్వభావములు వెల్లడించుచు, చక్కని చిక్కని భాషతో ప్రతి గ్రంధ స్వరూపమును సంక్షిప్తముగా పఠితల ఉత్సాహమును ఇనుమడింప చేయునట్టుగా సమీక్షించి తుదివి అనుబంధ రూపమున ప్రకటించిరి. సాహిత్యాచార్యులుగా శ్రీనారాయణదాస కవిత్వముపై ఒక సమగ్రమైన సాహిత్య సమీక్ష చేసి చదివి దాస స్వరూపమును పూర్తిగా అవగాహనచేసుకొనుటకు వీలుగా తెలుగు M.A.విద్యార్ధులకు సైతము అనువుగా ఒక చక్కని ప్రౌఢమైన సాహిత్య విమర్శనముకూడ వారి సంపాదకీయమున మన కందించిరి. తమ అమూల్య కాలమును వెచ్చించి శ్రీనారాయణదాసుగాని యందలి భక్తిశ్రద్ధలతో వారి గ్రంధములన్నియు అమూలాగ్రము చదివి, శ్రీ దాస జీవితము, వ్యక్తిత్వము, సాహిత్యవైభవము, మున్నగు సర్వవిషయముల గురించి ఒక పరిశోధన సంపాదకీయ రూపమున తెలుగు పాఠకులకు ఇట్లు అందించినందులకు వారికి మరియొకమారు నామన:పూర్వకాభివందనములు. ఈపుస్తకము అచ్చువేయుటకు తోడ్పడిన శ్రీతడవర్తి బసవయ్య గాదు, మాయొక్క సముద్దేశము ను వారికి విన్నవించిన వెంటనే, మాకు చేయూతనిచ్చి సుమారు 60 పుటలు ఉషశ్రీ ముద్రణాలయమున అచ్చువేయించి మాకు ఇచ్చి, ఈ కార్యక్రమము వెంటనే ప్రారంభించుటకు కారణభూతులైరి. వారికి మా ప్రత్యేకాభివందనములు.

తెలుగు పాఠకులు శ్రీ దాస కవిత్వము చదివి, ఆకళింపు చేసుకొని ఆనందించి మా ప్రయత్నమును సార్ధక పఱతురుగాక!

కర్రా ఈశ్వరరావు
ప్రకాశకుడు