సరస్వతీ నారద విలాపము.

రంగము-దండకారణ్యము

(వీణులుదాల్చి దుఃఖించు సరస్వతీ నారదులు వేరువేరుగా ప్రవేశించుచున్నారు.) సర-నిట్టూర్పువిడిచి తనలో)

క.ఈపాపులకతమున నా
రూ పెల్లను మాఱిపోయెఁ; గ్రూరాత్ములకున్
జేపడితి  ; మోసపోయితి ;
నేపగిదిం బ్రతుకుఁ గందు నిఁక నే నకటా?
 
క.దాయ లలంకారమిషన్
గాయం బాపాదమ స్తకంబును బొడువన్
గాయపడి మామకాంగని
కాయము నొచ్చెడును దేలుకఱిచినభంగి౯.

(అని విలపించుచున్నది)
                         నార-(తనలో)


క.కటకట! సంగీతంబున
కెటువంటియవస్థ పట్టె నీదేశములో!
పటుతరమోదం బెవరికి
ఘటియింపదు నేఁడు నాదుగానం బుర్వి౯.

క.కటువులె యూహర్తికీర్తన
లటమటమున విటుల కొక్కయర కాసునకు౯
దటుకున మానమె యమ్మెడు
కుటిలాలక లఱచుబూతుకూఁతలకంటె౯?

( ఆలకించి)

సరస్వతీ నారద విలాపము

గీ. వినబడెడు స్ర్తీవిలాప మీవిపినమందు?
      అహహ! మొవ్వరి దొక్కొ యీయాతక్రవము
      శ్రావ్యతర మయ్యెడును గానరసముకంటె
      ఎవ్వరయియిందు రొంటి నిట్లేడ్చువారు?
                     (ముందువంకఁజూచి)
ఉ. అక్కట ! యామె మల్లననియైనసరస్వతియట్ల యున్నదే!
      తక్కొరు లైన నిమ్మధురతాగుణ ముండునె రోదనధ్వనిన్?
      చక్కనిపాటకన్ సొగసి సర్ప మదేమెడచుట్టి యాడెడున్
      గ్రక్కునఁబోయి నే నడిగి కన్గొనువాఁడ విచారహేతువున్.

                  (చేరువకుఁబోయి)

క. ఓతల్లి! యిదె మ్రెక్కెద
     నీతనయుఁడ నారదుండ; నిక్కము చెవుమా
     చేతోవ్యధతోనీకిటు
     నాతల్లి యరణ్యరోదనంబేమిటికిన్?

            సర-(తలయెత్తి చూచి)

క.రనయా! నావలెనేయీ
    వనమున కీ విప్పుడేల వచ్చితివయ్యా?
    నిను నిటఁ గనినంత నె నా
    మనసునఁ గలకలఁక కొంత మానెం జుమ్మి.

క. నారోదనమున గల, కారణ మడిగితివి గానఁ గల తెఱఁగెల్లన్
గూరిమిపుత్రుఁడ వౌటను, గారవమునఁదెల్పు దాన ఘనమతివినుమా.

మ. రమణీయోక్తులచేత నర్ధగుణసారస్యంబు గల్పించుచుం
దమి నాయంగచయంబునన్ సహజసౌందర్యంబు పెంపొందఁగొం
చె మలంకారము లుంచి తొల్లిటికపుల్ చెష్టాచమత్కారభా
గ్యము హెచ్చించుచు దీర్ఘకాలము నమం గాపాడి రర్హ క్రియన్.

సరస్వతి నారద విలాపము

చ. అటు సుఖయింపుచుండఁగ మదాస్యమునందు నిరర్ధకంబులై
     పటపటలాడుశబ్దముల బల్మిని బెట్టి, రసంబు నెట్టి, య
     క్కటికములే కలంకరణకై తవముం గొని మేను కుట్టి, యి
     ప్పటిఘను లార్తి పెట్టెదరు ప్రాము తీసి ననుం గలంచుచున్

క. తెలియదు సుమ్మిప్పుడు నా;
    పలుకులయగ్ధంబు నాకె భావములేమిన్;
    వెలభూషలుగా కివి సం
    కెల లయి కడు నాదుమేనికిన్ వెత నించున్.

నార-క. ఓహో! యెటు చెఱిచిరి నీ
దేహముచెలు వెల్ల జడులు తెక్కలినగలన్!
దేహరుచి గవ్వపేరుల
బాహులవూసల సుకారిభామలు పోలెన్.

క. సూందరబహురసపుష్టి న, మందానందంబు బుధుకమది కిడదేనిన్
      ఛందోబద్ధం బగుపద, బృందాటోపంబు తాఁ గవిత్వంబగునే?

క. రసములె కావే ప్రణము, లసమానకవిత్వకాంత కవనీస్ధలిలో?
రసహీన మైనకవితకుఁ, బొసఁగించునలంకృతి శవమున కిడుతొడవౌ.

క. విను ఛందోబద్ధంబను,
     ఘనకారణముననె బ్రతుకుఁ గన నగు నేనిన్,
     తను వది వదలి వెసం జ
     క్కనిమృతి నొందుటయె లెస్స కవితాసతికిన్.

క. కవితాసతి జావకళన్, శ్రవణోత్సవభాషణంబు సలిపెడునట్లుం
డవలెంగాక యొకప్పుడు, శవములె న్నిద్రితవలెఁ జనదుండంగన్.

సర-క. అవు నది నిజమే యైనను,
భువిలోఁ బ్రాణంబులేనిబొందియె యిపు డీ

సరస్వతీ నారద విలాపము

                                నవమేధావులచేతన్,
                                వివిధంబుగఁ బొగడ@నంబడెడు! విధి నేమందున్?
సీ. దయమాలి తుదముట్టఁ దలకట్లు నిగిడించి
                           ద్గీరుఁడై నన్ను బాధించు నొకఁడు
     పాదంబులోపలఁ బాదంబు లిమిడించి
                           వీరుఁడైనన్ను నొప్పించు నొకఁడు
    ప్రాసంబుపై బెక్కు ప్రాసంబు లడరించి
                         పోటుబంటైనన్నుఁబొడుచునొకఁడు
    బెండుపల్కులుగూర్చి నిండించి నగలంచు
                         దిట్టయై జెవులు వేధించు నొకఁడు
   ఖడ్గచక్రాదిరూపముల్ గానిపించి,
   వర్ణములుమాఋచిననుఁజిక్కు పఱుచునొకఁడు
   కుమతు లొడలెల్లవిఱిచిప్రాణములుతీయ
 నొడలిపసలేకశుహ్కించియున్న దాన.