కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు/సత్యరాజా పూర్వదేశ యాత్రలు-ప్రథమభాగము-మూడవ ప్రకరణము
మూడవ ప్రకరణము
నేనునిద్ర నుండిలేచి కన్నులు తెఱచి చూచినప్పటికిఁ బశ్చిమమున సూర్యుఁడుదయించు చుండెనని వెనుకటి ప్రకరణమునందుఁ జెప్పియుంటినికదా? ఏమియుఁదెలియనిక్రొత్తదేశములో తూర్పేదోపడమరయేదోతక్కినదిక్కులేవో సూర్యోదయమును బట్టిగాకమఱియెట్లు తెలిసికోఁగలిగితినని మీలోనికొందరు బుద్ధిమంతులకు .దీనింజదువు వారికిందలి యేవిషయమునందును సందేహముండరాదు గనుక సహేతముగాను తృప్తికరముగాను తగినసమాధానము జెప్పి యిప్పుడేవారి సంశయనివారణము చేసెదను."సంశ్యాత్మావినస్యతి" అనుభగవద్గీతా ప్రమాణము మీతెఱిఁగినదే యగుటచేతదానినెప్పుడును మనస్సులయందుంచుకొని యాస్తికశిరోమణులయినమీరు ప్రమాణబుద్ధితో నావాక్యములను వ్యాసవాక్యములేయని మాఱుమాటాడక విశ్వశించి మేలు పొందవలెను గాని నాస్తికాధములవలె సందేహపడి చెడిపోరాదు సుండీ. నేనుమేల్కనికన్నులువిచ్చి చూచునప్పటికి నేను వీపుమీఁదవెల్లవెలికలఁ బరుండి యుంటిని; అప్పుడు కన్నులపండువుగా సూర్యబింబము రత్నకుంభమువలె భూమికిమూరెడెత్తున నాయెడమవైపున దిజ్మండలము నందెఱ్రగాకానఁబడుచుండెను. అదిచూచి మొట్టమొదట నేను సూర్యుఁడస్తమించుచున్నాఁడని భ్రమించితినిగాని క్రిందికిపోక సూర్యబింబమంత కంతకు పయికిరా నారంభించుటచేత సూర్యోదయమే కాని యది సూర్యాస్తమానము కాదని కొంచెముసేపటిలోనే భ్రాంతినివారణము చేసికొంటిని. కర్మభూమి యైనభరతఖండమునందు కర్మప్రధానమయినబ్రాహ్మణవర్ణములో కర్మిష్ఠులయిన వ్యాసరాయాచార్యులవారికి నుపుత్రుండవయి కులుపవిత్రుఁడనయిన నేను మఱచియైననునిద్రలోసహి తాము సదాచారవిరుద్ధముగా శాస్త్రనిషిద్ధమయిన యుత్తరదిక్కు తల యంపిగా పరుంది యుండననుట నిశ్చయము. పూర్వముత్తరదిక్కునఁ దలపెట్టకొని నిద్రించిన దోషమును బట్టయేకదా తలకోలుపోయిన నిఘ్నేశ్వరుని యెండెమున కతుకుటయి యేనుఁగుతల వఱకఁబడినది! కాఁబటి యిప్పుడు నాతలయున్నడిక్కు తప్పక దక్షిణపుతలగా వెల్లవెకలఁ బరుండియున్నప్పుడు నాకెడమచెతివైపు పశ్చిరుమయి యుండవలెనుగనుక కర్మశాస్త్రప్రామాన్నణ్యమునుబట్టి. సూర్యుఁడుదయించునది పశ్చమమే గాని తూర్పుకాదని తత్క్షణమే నిశ్ఛయించుకోటిని. ఈప్రకారముగా సృష్టిలోని యొక్కయ పూర్య సత్యమును మహాద్బుతముగాక నిపెట్టఁగలిగినందుకు నాలోనేనాందించుచు, కన్నులు మూసుకొని యీక్రొత్తదేశములో నేనోంటిగా నెక్కడకుఁ లోవుదునా భగవంతుఁడాయని యాలోచించుకొను చుండఁగా నింతలో కోంచము మబ్బుపట్టి చల్లగా న్నునందునను మార్గాయాసముచెతను నాకు హాయిగా నిద్రపట్టినది. ఈశ్శారానుగ్రహమువలన నాకానిద్రలో దివ్యనుయిన స్వప్న యొక్కటివచ్చినది, ఆశలలో నెనువెనుక పఱవుమిఁద పోలి నిద్రలో జారినదిమొదలుకొని యిక్కడకు వచ్చువఱకును జరగిన పర్వవృత్తాంతమును కన్నులారా నిదర్శనముగాఁ చుచితిని. ఇదిపరమరహశ్యమయిన యర్ధమేయినను శ్రద్ధాళువులయిన మీకొక్కరికి మాత్రము చెప్పెదను. మీరిమర్మమును కర్మభ్రష్టులకు వేదబాహ్యులకును నా స్తికులకును విశ్వాసహీనులకును జెప్పక గోప్యముగనుంచుఁడు. నేను వెనువాల్చిన యాపఱువు భూమ్యంతరాళిమున సాయంసమయమున ఱకును తిన్నగా నిధోముఖముగా దక్షిణమునకుజారినది. నావలనే పాఠశాలలలోని గోడలకు తగిలించియుండు దేశపటములను జూచియుండిన మీకు పై పై పుత్తరమనియు క్రింది వైపు పు దక్షిణ మనియుఁ దెలిసియుండవచును అటుపిమ్మట చీఁకటిపడిన తరువాత రాత్రి రెఁడుయామములవఱకును భూమిలోపల నడిమిభాగమునందున్న మహావాయుపథములో దేవతా విమానమువలె దిశదిశలకును నూఱు యోజనములు పరచిపిమ్మట మఱియొక గుహాముఖమునందు నేను నా పరుపుతో గూడ వాలితిని. అటుతరువాత నా పరుపు వెనుకటివలెనే పయికి మెల్లగా జాఱనారంభించితిని. ఆ పిమ్మట భగవన్మాయచేత పరుపాకస్మికంగానదృశ్యమైనది. అప్పుడక్కడ నుండి నేను వెనుకటియట్లే పయికి పడ మొదలుపెట్టితిని. అట్లుకొంతిదూరము పడినతరువాత నా శరీరమునకు దుస్సహమయిన వేఁడిసోఁకినది. ఆవేఁడి యంతకింతకు తక్కువగచువఛ్ఛి నేను యోజనదూరము పడునప్పటికి నాకాలికి గట్టిగా నేలతగిలినది. ఆ నేలమీఁద కొంచముదూరమునడచి నేను గుహలోనుండి పయికి వఛ్ఛి భూమిమీఁద నేనింతకుముందుచిప్పిన రాతిమీఁద పరుండునప్పటికి, తెల్లవాఱి సూర్యోదయమయినది.ఇంతలో నాకాస్వప్నముపోయి మెలఁకువవఛ్ఛినది. ఆడుమళయాళమునకి దియే సరియైనదారి. ఓధీమంతులారా! ఇది కలయని భ్రమపడి దీనిసత్యమునుగుఱించి మీరొకవేళ సంశయ పడెదరుసుండీ ! అటు సంశయపడఁగూడదు.ప్రమాణబద్ధులై మీరు దీనిని రెండవ వేదవాక్యమునుగా విశ్యసింపవలెను. ఈస్వప్నమును వేదవాక్యమునుగా నేలవిశ్వసింపవలెనందురేమో చెప్పెదనువినుండి. పూర్వకాలమునందు మంత్రద్రష్టలైన మన మహర్షులకు వేదములు ప్రత్యక్షమయిన విధమెట్టిదే. వారీశ్వరధ్యానముచేచూ కన్నులుమూసుకొని చింతించు చుండినప్పు డీశ్వర ప్రసాదమువలన ఆమహానుభావులకు వేదములు స్వప్నములవలె పౌడ గట్టి సర్వజనులకు పరమప్రమాణములయినవి. ఈశ్వరకటాక్షమాకాలపువారి పైని మాత్రముపడి యీకాలపువారికి లేకపోవునని భావింపకుఁడు. మహానుభావులయిన భక్తులకెప్పుడును భగవంతుని. ఆడుమళయాళము
నిర్హేతుక జాయమాన కటాక్షము కలుగుచుండును. కాఁబట్టి వెనుకటి వలెనే యీశ్వరానుగ్రహమువలన నాకిప్పుడు దర్శనమిఛ్ఛిన యీకడపటి వాక్యములను మీరందరును పరమ ప్రమాణముగా నంగీకరించి గౌరవించవలెను. ఇవి భక్తి విశ్వాసములు గలవారికందరికిని తప్పక వేదములు వలెనే ప్రత్యక్ష్య దృష్టములకన్నను అధిక ప్రామాణికములగును. మరఱియు నేను మొట్టమొదట భూమిమీఁది గుహలో దిగుటయాదిగా పఱుపు మీఁదనొఱగి జాఱుటతుదిగా మేలుకొని యున్నంతవరకు నడిచిన దారి ప్రమాణమంతయు నేను కట్టకడపట గులోని పఱుపును మరల నానుకొనుటమొదలు పయికి భూమిమీఁదకి వఛ్ఛువరకును జరిగిన దారిప్రమాణముతొ సరిగా సరిపోయినందున నాస్వప్న మణుమాత్రమును ప్రత్యక్ష విరుద్దమయినదియుఁ గాదు. అంతేకాక నాకాకల తెల్లవారుజామునఁ గలిగినదగుటచేత అధిక విశ్వాసార్హమయినది. నేనిప్పుడు చెప్పినదంతయు ఆడమళయాళమునకు సరియైనమార్గము. ఈగురుతులు పట్టుకుని యాదేశమున కెవ్యరేనిమిషమునఁ భొఁదలఁచినను. అక్కడి దేశ భాష నేర్చుకొని మరిపోఁదఁలచిన పక్షమున ముందుగా నావదకు వచ్చియారునెలలు శుశ్రూషచేయుఁడు. మిమ్మాభాషలో పండితులనుజేసి పంపెదను. గురుదక్షిణ తరువాత మీయిష్టమువచ్చినంత సమర్పించుకోవఛ్చును. గురుదక్షిణలేక యభ్యసించినవిద్య సఫలముకాదని పెద్దలలో మెలగనేర్చిన మీకే విశదమయియిండును. మీరుకాని చీటీమీఁద నాకుత్తరము వ్రాసినపక్షమున నాయిప్పటివాసస్థానాదులను మీకు వివరముగాఁ దెలిపెదను. ప్రయాణముకథ నింతటితోఁ జాలించి యిఁక దేశవృత్తంతమున కారంభించెదను సావధానముగావినుఁడు. సత్యరాజాపూర్వదేశ యాత్రలు
అప్పుడునేనిలేచి కొంచము దూరమునడచి యొకచెట్టునీడను గూర్చు ండి యేవంకకుఁ బోదునాయని యాలోచించు చుండఁగా, తూర్పువైపునుండి రెండు విగ్రహములు నావంకకు నడచి వచినవి. ఆవఛ్ఛినవారు పురుషులయి యుందురా స్త్రీలయియుందు రాయని నామనస్సునకప్పుడొక గొప్ప సందేహము తోఁచినది. వారిమొగములు చూడఁగా నించుమించుగావారు ముప్పదిసంవత్సరములు ప్రాయము కలవారుగాఁ గానఁబడిరి . వారిమూతులకు గడ్డములుగాని మీసములుగానిలేవు.దీనినిబట్టవారు క్రొత్తగా క్షురకర్మచేయించుకొనిరని మీరుభావింపఁకూడదు. మన స్త్రీలకువలెనే వారికినిమొగములమీఁద గడ్డములును మీసములును భగవంతుఁడే ప్రసాదించలేదు. నారిద్దఱును చామనచాయగలిగి, పొడవునందున కంటె పిడికెడెక్కువగానుండిరి. వారికాభరణములేవియు లేవు,· మొగమునబొట్లులేవు". కింటఁగాటుక లేదు·ఏకరీతిగా వారిరువురును నిడుదలైన నల్లని లాగులును, ఎఱనికుఱుచ చొక్కాలను,తలలకు గడ్డితోనల్లిన తెల్లకుళ్ళాయలును ధరించిరి; కాళ్ళకు చెప్పులు తొడుగుకొనిరి. వారినడుముచుట్టును పట్టుదట్టీలు బిగింపఁబడి యున్నవి. పట్టుదట్టిలకు ముందువైపున నేనోయక్తరములు చేక్కిన యిత్తడిబిళ్ళలున్నవి. వారిచేతులలోతెందేసిమూరల పోడవుగల గండ్రనిరెండు విరుగుదు చెవకగ్రలునవి. ఈలక్షణములు ననిటినిబట్టి వారెవ్వరో రాజభటులనియు వారు మొట్ట మొదట నాతోనేమియు మాటదక, వయస్సులొనునన్న క్రొత్తస్రి యెవ్వతెయైనను వీది కనఁబదినప్పుడు మనదేశములో పురుషులు దానియెగము వంకనెగదిగా చూచున్నట్టుగనే వారును నాముగమువంక చూచి, తమలోనేమో మెల్లగా గుసగుసలాడుకొని తరువాత వారిలొ నోకఁడు నాసమీపమునకువచ్చి తూమీ ఆడుమళయాళము
భూభే?" అని యేదో ప్రశ్న వేసినట్లు పలికెను. నాకామాట ఆర్ధమయినదికాదు. అయినను పెద్దమనుష్యుఁదేదోయడిగినప్పుడు ప్రత్యుత్తరము చేపకుండుట ధర్మముకాదని తలఁచి అతఁడు నాపేరెవరని యడిగియుఁడని యూహించి, తెలుఁగు భాషలలో "నా పేరు సత్యరాజాచార్యులు" అని చేప్పితిని. వాఁడు కోంచము సేపాలోచించి మరల భిగ్గరగా "తూమిభూబే" అని పలికెను. నేను వానికిఁదెనుఁగు తెలియదనిగ్రహించి, హిందూస్థానీ బాష సమస్త దెశములలోను దెలియునుగదా యనినేను విజయనగరములో మహారాజుగారి వెంట కాశీనగరమునకు వెళీవచ్చిన వారితోడి సహావాసమునుబట్టి మాటాడ నెర్చుకోన యాభాషతో "మేరానాం సత్యరాజాచార్" అని చెప్పితిని. వాఁడామాటను సహిపము గ్రహింపక "తూమిభూభే" అని మరల మరింత బిగ్గరగా నఱచెను. అందుమిఁద నేను వానికీభాష తెలియకపోయినను ఈకాలమునందు సర్వత్ర వ్యాపించియున్న యింగ్లిషయినను దెలిసియుండునని "మైనేం ఈజ్ సత్యరాజాచార్య" అని చెప్పితిని. వాఁడాభాషను సహితము తెలిసుకోలేక కోపముతో మరల నెప్పటిప్రశ్లనే బేసెను. ఆఏయిని నాకేమి చేయుటకును తోఁచక దేశభాషలు తెలియకపోయినను బేవభాష తెలియునేమోయని సంస్కృతముతో "అహం సత్య రాజాసార్యనామక విప్రః" అని స్పష్టముగాఁ జెప్పితిని. ఆమూర్ఖుఁడదియును తెలిసికోలేక రెండవవాని కేసి తిరగి యేదో భాషతో ననెను. ప్రసిద్ధమయిన నాపేరుఁ దెలియఁబఱుపకుండుట నాకిష్టిములేకయఱవదీఅశమునకు సమీపముననుండుటచేత ద్రావిడభాషయైనను దెలియునేమోయని "ఎన్ పేర్ సత్యరాజాచారిన్” అని చెప్పితిని. ఈయఱవములోఁదప్పున్నయొడల దీనింజదివెడి యఱవవారు నన్ను మన్నింపవలెను. నేనువెనుక పొగ బండిలో యాత్రచేయునప్పుడు నాలుగఱవ ముక్కలు మాబ్రాహ్మణుని వలన నేర్చకొన్నాను. కాఁబట్టి యాతనిచేతిలోఁబడ నాసొమ్మటతఁడు గురుదక్షణగా గ్రహించినట్లయినను మిరూహింప వచును.వారికీయఱవగోడును దెలిసినదికాదు. నేనపుడు నాస్వభాషయైన కన్నడములోఁజెప్పిచూతమని ”నమ్మ–” అనియారంభించునప్పటికి వారిరువురును నావద్దకు వచ్చి చేయిపట్టుకొని ననులెమని లాగిరి. నేనెప్పుడు నాభాషాపాండిత్యము చూపుటకదిం సమయముకాదని మౌనము దరించి, మీవెంటవచ్చెదను నన్ను లొగవలదనియు మాయూరు విజయనగరమనియు నా పేరు సత్యరాయెచార్యులనియు నేను సద్రుబణుఁడననియు సమస్తము చేస్తె గచెసిచేప్పి, చివాలున లేచి వారివెంట నడువ నారంభించితిని ఊరను పేరును వంశమునుగూడనెట్లు సైగచేసితినని మిలొఁదెలియనివరికిఁ గొందఱికి సందేహము కలుగవచును గానియా సంశయుము నేను చేసైగచేయుచుండఁగ శ్రద్ధతోఁ జూచిన వారికి నివారణము కావలసిన దెశని చేప్పటవలన విడిపోదు. ఆ రాజాభటులలో నోక్కడు ముందు నడవఁగా మన దేశములోని గొప్ప రాజికియెద్యోగివలెనే వాని వెనుక నడుచు చుండెను. ఇట్లు కొంచెము దురము నడుచు నప్పటికి మేమొక పట్టణము యెుక్క రాజవీధి లోఁబ్రవేశించితిమి. అప్పుడు వీధిపొడుగునను మనుష్యులు నాకు కనబడఁజొచ్చిరి. వారి ధరించుకొన్న బట్టలు మొదలయినవి వివిధములుగానున్నను వారిలొ నొక్కరికిని గడ్డములును మీసములును లేవు. అట్టి విచిత్రమైన సృష్టివలన నాకప్పుడు గలిగిన యద్భుతానందములకు పరిమితి లేదు. ఆఘటనాఘటన సామర్ద్యము గల సర్వేశ్వరుఁడాదేశములో మగవారికి మూతికి మీసములు లెకుండ నేలచేసేవాయని త్రోవపొడుగుంనను నాలొ నేను వితర్కించుకొను చుంటిని. ఆసమయమునందు నాకాకస్మికముగా మఱియెుక సంగతి స్మరణకువచ్చినది. ఇది యాఁడుమాళయాళము గదా యిందు బురుషులెట్లుందురని నా మనస్సునకుఁ దగులఁగానే నేను జూచిన వారందఱును స్త్రీలే యనియు, ఈదేశమునందుఁ బురుషులు లేరనియు, గాలికే బిడ్దలు పుట్టుదురనియు, స్త్రీ మళయాళమును గూర్చి మనవారు చెప్పినదంతయు సత్యమేయనియు, నేను నిశ్చయించుకొంటిని. నామనస్సులో నీయాలోచన ముగియునపటికి మెముక్కయిల్లుచేరితిమి. ఆయింటి గుమ్మము వద్దను లోపలనుగూడ నన్నుఁదీసికొసివచ్చిన వారెవంటివేషములు ధరించుకొన్న పేడిమూతి రాజభట్టు లనేకులుండిరి. మొదటి యిద్దఱు రాజ భటులును నన్నులొపలకిఁ గొనిపోఁగా లొపలివారందఱును గుంపులుగుంపులుగా వచ్చి యడవి మృగమును జూచ్చినట్తుగా నన్ను తేఱిపాఱఁజూడసాగిరి. అంతట వారిలో వారెమో యాలొచించుకొని నన్ను దురముగాఁ దీసికొని పొయి మూలగాన్నున యెుక కొట్టులోఁబెట్టి పయిని తలుపు వేసిరి. అంతట రాజభటులు కొంద ఱొకరు విడిచి యెుకరు తలుపు వద్దకువచ్చి దానికి నిలువుగా వేయబడిన యినుప కమ్ముల సందు నుండి బోనులోనున్న యడవి జంతువును జూచ్చినట్లుగా నన్ను తొంగి తొంగి చూచుచు నావలకుఁ బోవుచువచ్చరి. ఇట్లువచ్చుచుఁ బోవుచుంటయు వారిలో నేమోయాలోచించుచుకొనుచుంటయు చూడగా మన దేశములోని పోలిసుభటులు సంగతి నాకు జ్ఞప్తికి వచ్చి వారికేదో దురుద్దేశముకలినట్టు నాకు పొడకట్టినది. కాని నేను స్త్రీనిగాక పురుషుఁడనయినందున అట్టియనుమానముతోఁ బనిలేదని మనస్సమాధానము చేసికొంటిని. ఈరీతిగా రాజభటులులలో నేదో యాలోచన జరుగుచుండఁగా నింతలో వారి యజమానుఁడక్కడకు వచ్చెను. ఆతనిని దూరము నుండిచూచి వారందరను తమతమ యధాస్థనములకు బోయిరి. అటు తరువాత నతఁడు తనపనిని చేసికొని, తాను మొదట వచ్చినప్పుడు నాకొట్టుముందు భటులు గుంపుగూడి పరిగెత్తిపోవుట కనిపెట్టినవాఁడగుటచేత నందేదో వింత యున్నదని యూహించి, నాకొట్టువద్ద కువచ్చి తలుపుతీయించి, రాజభటులు నామీఁద నేమి నేరము మోపుదురో యని భయపడి వజవజ వడుగుచున్న నన్నుఁజూచి నన్నేదో ప్రశ్న వేసి నా వలన ప్రత్యుత్తరముగానక తనభటులనేమో యడిగి తెలిసికొని, నా యందు నిర్హేతుక జాయమాన కటాక్ష్యము గలవాఁడయి తనవెంట నన్ను తన యింటికిఁ దీసికొనిపొయెను. ఈశ్వరానుగ్రము చేత నేట్లు గారాగృహ విముక్తుఁడయి మంచి యింటఁ బడఁగలిగితిని. ఆతఁడు దయారసము గలవాడగుటచెత నన్నాదరించి, తనయింటిలో వీధివైపున నాకొకగది యిప్పించి, నాకు పరుండుట కాగదిలో మంచమెుకటి వేయించి, తన సేవకుని చేత భోజన పదార్థములు తెప్పించి నా ముందు పెట్టించెను. వారేజాతివారో తెలియకపొవుట చేత వారు తాఁకిన పదర్థములవు తినుటకు నేను మొట్టమొదట సంకోచించి తినిగాని, ఏదైనను సరే తినుమని యాఁకలి దేవత నా కడుపులో దూఱి నన్ను బాధించుట చేతను, ఆ దేశములో బ్రాహ్నణులున్నారన్న జాడయే లేకపోవుట చేతను, పూర్వకాలము నందాపత్సమయమున విశ్వమిత్రాదులు ఛండాల గృహమున శ్వమాంసాదులను దొంగలించి క్షుత్తు తీర్చుకొనుట పురాణములో చదివి యుండుట చేతను ఆత్మరక్షణము పరమధర్మమని మన శాస్త్రములు చేప్పియుండుట చేతను, స్వదేశము చేరిన తరువాత ప్రాయశ్చిత్తము చేయించుకొని బ్రాహ్మణ సంతర్పణము చేసి శూద్ధుఁడను కావచ్చునని నాటికి భోజనము చేసితిని. ఆ దినము నోటికి తిన్నగా మెతుకులు పోయినవి కావుగాని తరువాత క్రమక్రమముగా నలవాటు పడుటచేత మనుగడుపు పెండ్లి కొడుకువలె బోజనప్రియుఁడనై తేరబోజనములు చేయసాగితిని. మా గృహయజమాని పేరు "భాంఢీభంగీ!" అతడు బ్రహ్మణభక్తి చేతఁ గాకపొయినయి మంచిహృదయము గలవాఁడగుటచే నాకు సమస్తోపచారములును జరుగునట్లు చేసి, ఆరంభములో తమ భాషను నాకు స్వయముగనే నేర్పుచువచ్చెను. నేను గోడలు, మేడలు, ఉప్పు, పప్పు అల్లము, బెల్లము, బట్టలు, తట్టలు, ఆవులు, మేకలు మెుదలైన వానిని జూపి వాని పేరు లేమని సైగచేయుచురఁగా నాతఁడు చెప్పుచు వచ్చెను. ఆ పేరులన్నియు నేను వేంటఁగోనిపోయిన తెల్లకాగితముల పుస్తకము మీద తెలుఁగులో వ్రాసికొని వల్లించుచు వచ్చితిని. మెుదట దినమున నేనమాటలను వ్రాయుచుండగా నతఁడుచూచి యత్యాశ్చర్యపడెను కారనము మీకు ముందుచెదను. మికు విసుకు దలగా నుండును అంతేకాక ఇటువంటి వర్ణముల వలన మీకును నాకును గూడ లాభము లేదు. విశేష ప్రయాస పడి మూడు మాసములలో వారి బాష నొక రీతిగా నేను ధారాళముగా మాటాడుటకు నేర్చుకొన్నాను.
నాల్గవ ప్రకరణము
ఒకనాఁడు సెలవు దినమున బోజనము చెసి కూరుచున్న తరువాత నా యజమానుఁడైన ఫాండీ భంగీ నన్నుఁజూచి జాలితో నీపత్నిపోయినది కాదాయని రంఢిభాషలో నడిగెను. వారి దేశమును మనము స్త్రీ మళయాళమన్నను స్వదేశస్థులు దానిని రంఢీదేశమని వాడుదురు. నన్నతఁడా ప్రశ్న యడుగఁగానే యాతని జ్ఞానమునకు నేనత్యాశ్చర్యపడి, అతని జ్యొతిశ్శాస్త్ర పరిజ్ఞానము వలననే యీ సంగతి తెలిసినది యెంచుకొని, ఆ శాస్త్రమును గ్రహింపవలెనను తలంపుతో “అయ్యా! నా భార్య స్వర్గస్థరాలైనసగంతి మీకెట్లు తెలిసినది?" అని యడిగితిని.
ఫాంఢీ: (చిరునవుతో) నీ పత్ని పోయినసంగతి మత్రమే కాక యామె నీచిన్నతనములోనే పోయినదని కూడ నీ రూపము చేతనే నేను గ్రహించినాను.