కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు/సత్యరాజా పూర్వదేశ యాత్రలు-ద్వితీయభాగము-మూడవ ప్రకరణము
మూడవ ప్రకరణము.
లంకాద్వీపము
345
చుండును. అక్కడి వారికి దివ్వజ్ఞానము మాత్రము లేదు. భగవంతుఁడు వారికి దివ్యజ్ఞాన మనుగ్రహించక పోయినందుకు కారణము లేకపోలేదు. కామరూపమును ప్రసాదించిన దేశమునందు దివ్యజ్ఞానమును గూడప్రసాదించినాపక్షమున, దివ్యజ్ఞానముచేత మాయ బట్టబయలయి కామరూపముల వలన ప్రయొజనమే లేకపునని యొంచియేయకరిమిత బుద్ధిమంతుఁడయిన యీశ్వరుఁడు వారికి లోకోపకారార్ధముగా దివ్యజ్ఞానము లేకుండుఁజేసీనాఁడు. వారి కంతకాలము నుండి కామరూపమును వహించిశక్తియున్నను వారేదైన సూక్ష్మరూపమును బొందవలెనన్న బుధ్దిపుట్టినప్పూడు చీమగానో దోమనగో పిల్లిగానో బల్లిగానో మాఱుచుండటయేకాని నావంటి యంగుష్టమాత్రశరీరము గల పురిషుఁడు కావలెనన్నబుద్ధినేటి వరకును వారిలో నోక్కనికి నుదయించక పోవుటచేత నారూపముచూడగాఁనే యెల్లివారికి అద్భుతమును గౌరవమును గనిగెనని చెప్పితినిగదా, నన్నుశోధించిచూచి నాలఖిల్యమ హర్షినిగా నిశ్చియించిన పౌరాణికులును జ్యోతిశాస్త్రవేత్తలు నారాకను గ్రామమునందంతటను ప్రకటించినందున జనులు తీర్ధప్రజలవలె వచ్చి నన్నుదర్శించిపోవ మొదలుపెట్టిరి. అక్కడివారు నాస్తికులుగాక అవతారములను మహామహిమలను నమ్మెడు ప్రమాణబుద్ధిగలభక్తిపరులగుటంజేసి నన్ను దర్శింపవచ్చువారందరును నాయందు భక్తిగలవారయి ఫలములను కానుకలను దెచ్చుచు వచ్చుటచేత మాయింట ప్రతిదినమును ఫలరాసులు పర్వముతో ప్రమానములగుచు వచ్చెను.నాయజమానుఁడు వానినన్నిటినంగడికిఁబంపి యమ్మించుచువచ్చుటచేత తద్విక్రయము కొంతవారకాతనికిని లాభకరముగనే యుండును. నామూలమునతన అ ప్పుడుకుడ తీఱుమాగమేర్పడినందుననాయాజమానుఁడుతనహృదయములో సంతోషించి కొంతకాలమయిన తరువాత దక్షిణలుకూడ నేర్పరుచి యాత్రాపరులను ప్రోత్సాహఱచుచు
44
346 సత్యరాజా పూర్వదేశయాత్రలు
వచ్చెను. ఈప్రకారముగా నేనాదేశమునం దల్పకాలములోనే చిఱు దేవతనయి పోయినాను. నామహిమలు శీఘ్రకాలము లోనే చుట్టుపట్ల గ్రామములోను దూరదేశములోనుకూడ వ్యాపించినందున యాత్రాపరులు రేయింబగళ్ళు విరామము లేక దూరదేశముల నుండి సహితము మహొపహారములను సువణ మంత్రపుష్పములను ధరించి యినుకచల్లిన రాలకుండునట్లు తీర్ధప్రజలవలే రాఁదొడఁగిరి. నేను జంగమదేవతలను గాఁగానే నాయజనూనుఁడు తనమందిరము నందుఁగల యొక్కవిశాలమయిన గదిని దేవాలయమునుగా మార్చి యొక్కమూలఁపీఠకమార్చి మూలవిగ్రహమూవలె నందునన్నెత్తుగాఁగూరుచుండుఁబెట్టి జనుల తెచ్చుకానుకలు మొదలనవానిని గ్రహించుటకయి నాపై నొకయర్చకుని నేర్పరిచి తాను ధర్మకర్తయయి వచ్చిన ధనము నంతను యధేచ్చముగా తన నిమిత్తము పయేగించి కొనుచుండెను. నాయందు జనుల కింతపూజ్యతాబుద్ధి కలిగినందున కింకొక కారణము చెప్పు మరచిపోయినాను. మన్నించివినుఁడు. నేనక్కడకుఁ బోయిన నాలవనాఁడొక వృద్ధకాంత నావద్దకు వచ్చి, వాలఖిల్యాది మహషూలకు దివ్యజ్ఞానమును మహిమలను గలగని పురాణశ్రవణాదులవలన దెలిసికొనిదగుట చేత భక్తిపూర్వకముగా నాకు నమస్కరించి ప్రసవ వేదనపడుచున్న తన కోడలికి కొడుకుపుట్టునో కూఁతురుపుట్టునో చెప్పువలసినదిని ప్రార్థించెను.
ఆమె ప్రశ్నయడిగిన కాలమునందులగ్నమురవ: గురుచంద్రులు విషమరాశి నవాంశములయందుందుటచేత.
శ్లో. ఓజర్క్షే పురుషాంశకేషు బలిభిలగ్నార్క గుర్విందుభిః
పుంజన్మప్రవదేత్సమాం శకగతైర్యుగ్మేషు తైర్యోషితగ
గూర్వర్కౌ విషమేనరం శశిసితా వక్రశ్చయుగ్మేస్త్రీయం
ద్వ్యంగస్ధా బుధవీక్షణాచ్చయమళౌ కుర్వంతి పక్షేస్వకే.
లంకాద్వీపము 347
అను బృహజ్జాతక వచనమును బట్టి కుమారుఁడు కలుగునని చెప్పినారు. శాస్త్రము లెప్పుడు నబద్ధములు కావు గనుక వృద్ధాంగన యింటికిఁ బోయిన జాము లోపల కోడలికి నేను చెప్పినట్లు పురుషశిశువు కలిగెను. అక్కడి జ్యోతిష్కులు మాత్రము లెక్కవేసి తమ శాస్త్రప్రకారముగా తప్పుక స్త్రీ శిశువు కలుగునని చెప్పిరఁట. చూచినారా వారి శాస్త్రములకంటె మన శాస్త్రములయం దెంత యాధిక్యమున్నదో ఆవృద్ధాంగన నేను జెప్పిన సంగతి జ్యోతిష్కులకుఁజెప్పుఁ గానే వారందరూ నావద్దకు మహాకోపముతో పరుగెత్తుకొని వచ్చి నీవేశాస్త్రప్రకారముగాకొడుకు పుట్టునని చెప్పినావో చెప్పుమని పట్టుకొనిరి. వారిశాస్త్రములకు విరుద్ధముగానున్నందన శాస్త్ర ప్రమాణమును జెప్పిన స్వదేశాభిమానము చేత శాస్త్రబద్ధలయినవారు నాకేమి హాని చేయుదురో యని జడుసియ సత్యము పలుకుట కిష్టములేనివాఁడనయి వారిప్రశ్నల కుత్తరము చెప్పుక మౌనముధరించి యూరకుంటిని. అందచేత వారు నేఫలములను జ్యోతిశ్శాస్త్రము చేతఁగాక మునులకుఁగల యాంతరదృష్టి చేతనే చెప్పుతినని తమలోఁదాము సిద్ధాంతము చేసికొని యాసిద్ధాంతులు గ్రామములో నా దివ్యజ్ఞానమును గూర్చి గొప్పువారితో నెల్లఁబ్రశంసించిరి. అందు మీదనన్ను ప్రశ్నలడదగుటకయి గొప్పు వారందరును రా మొదలుపెట్టిరి. బుద్ధిమంతఁడను గనుకవాలో నేనాలోచించుకొని జ్యౌతిషభూమియైన యాదేసములో నేమియుతిరము చెప్పినజ్యోతిష్కుల వలన నేమి చిక్కువచ్చునోయని భయపడి యేమియు నుత్తంము చెప్పుక యెవ్వరే ప్రశ్నవేసినను తలయూచి యూరకుండచు వచ్చితిని. తరువాత నావద్దఁజేరిన జ్యోతిష్కులు తమశాస్త్రములనుబట్టి నాశిరఃకంపమున కర్ధముచేసి యడిగిన ప్రశ్నలకన్నిటికినుత్తరములు చెప్పి భక్తలను సమాధానపఱిచి పంపుచుచువచ్చిరి.
నాయొద్దు నుంచఁబడిన యర్చకులు మన దేశములోని పూజారు
348 సత్యరాజాపూర్వదేశయాత్రలు
లవలెనే ధనార్జనోపాయముల యందు మహాబుద్ధిమంతు లగుటచేట నాప్రసాదము సర్వాభీష్టప్రదమని ప్రశ్నలడుగ వచ్చిన వారితోఁజెప్పి యరఁటిపండ్లు మొదలయినవి విద్యచేత చెడిపోని భక్తులచేతులలోఁ బెట్టిధనాకర్షణము చేయుసాగిరి. ఇట్లుండగా నొకనాడుచేరువ పల్లెనుండి చాకలివాఁడొకఁడువచ్చి నాకు సాష్టాంగనమస్కారము చేసితప్పిపోయిన క్రొత్తగాకొన్న తనగాడిద కనఁబడునట్లనుగ్రహించవలసినదని ప్రార్ధించి దక్షిణయును పండ్లను పళ్ళెములోఁబెట్టి యర్చకులకు సమర్పించెను. ఆయర్చకులాదక్షిణను స్వీకరించి తిన్నగాపండని యరటిపండొకటి వానిచేతిలోఁబెట్టి యాదేవతా ప్రసాదమును దేవతా సన్నిధాననునందే పరిగ్రహించి మొక్కిపొమ్మని వానికాజ్ఞయిచ్చిరి. వాఁడాప్రకారముగా ప్రసాదముస్వీకరించిభక్షించి తనయూరికి పోవుచుండగా త్రోవలోనే యాప్రసాదము వరదానమయి, భక్తి పరిశోధనార్ధమయి వానికుడుపులో శూలమునుపుట్టించి విరేచనమిషమిఁద వానినిచెరువు గట్టు మిఁదకి పరుగెతించి యక్కడ తుమ్మచెట్టుక్రింద మేయుచున్న వాని గాడిదనుజూపెను. వాఁడునాప్రసాద మహిమకత్యద్భుతపడితన గాడిదను తిన్నగాతన యింటికిఁదోలు కోనిపోయి తనబంధూల కెల్లనుజూపి నామహిమలనుగాధలుగాపొగడెను.ఇట్లు నామహత్త్వములదేశమంతటనువ్యాపించినందున,గాడిదలు,గేదలు,ఆవులు,మొదలయినవితప్పిపోయినవారందరును, చుట్టుపట్ల గ్రామములనుండి ప్రసాద స్వీకారార్ధమయి నాదర్శనమునకు రాఁదొడఁగిరి.ఆమఱునాఁడే యాచాకలివాని గ్రామమునుండి తనగాడిద తప్పిపోయిన దని వాని చుట్టమొకఁడును,తనయేద్దూ తప్పిపోయిన డని కాపువాఁడొకఁడును రాగా,మాయర్చకులు వారివలన విధ్యుక్తములయిన దక్షిణలను గ్రహించి యరఁటిపండ్లు ప్రసాదమును వారిచేతిలోఁబెట్టి నాయెదుటనే వారిచేతఁదినిపించి పంపివేసిరి.అయి
లంకాద్వీపము 349
నను చాకలివాని గాడిదగాని, కాఁపువాని యెద్దుగాని త్రోవలో వారికి కనఁబడలేదఁట. గాడిదమాత్రము మఱియెప్పుడును కనఁబడనే లేదఁటగాని తరువాత గొన్నిదినముల కెద్దు పొరుగూరి బందెల దొడ్డిలో నుండఁగాకాపువాఁడు బందెయిచ్చి దానినివదల్చి తెచ్చుకొనెనఁట. ఈవాతకా నాచెవిని బడఁగానే యొకరి విషయమున వెంటనే ఫలించిననాప్రసాద మింకొకరి విషయుములో నేలఫలింపక పోవలెననినాలో నేనాలోచించికోన మొదలుపెట్టితిని.తరువాత వచ్చినవారికి నాయెడల నిజమయిన భక్తిదేమెయని సంశయించి లేభక్తియే లేకపోయిన యెడల వారంతదూరము శ్రమపడివచ్చి భూరిదక్షిణలు సమర్పించుట తటస్ధీంపదుగాన వారి కార్యవైఫల్యమునకు భక్తిహినతకారణము కాదనినిశ్చియించి యావిషయమున వారిని నిర్దోషూలనుగా నిణయించినాను.భక్తిహినత కారణము కాకపోయి పక్షమున నాయమెఘప్రసాదము విఫలమగుట కేమికారణమై యుండునని నాలోనేను తలపోయుచు కన్నులు మూసికొని యీశ్వరాధ్యానము చేయుచుండగా మంత్రద్రష్టలైన మహషులకు వేదమంత్రములప్రత్యక్ష మయినట్టె నాకును స్వప్నములోఁగొనొయూహలు సాక్ష్కత్కారముకాఁగా,శాస్త్రజన్నముయెక్క క్రమమిట్టిదేకదా యాని తెలిసికొని తోడనే నొకయభినవశాస్త్ర నిర్మాణమున కారంభించినాము.మేలుకొన్నప్పుడును నిద్రపోవుచున్న ఇప్పుడును స్వప్నరూపమూనునీశ్వరా దేశముచేత సన్నిధి చేసినయూహలనుభట్టియు నాయనుదిన ప్రత్యక్షానిభవమును బట్టియు మూఁడుమాసములలో మహత్తరమయిన ప్రసాదజ్యౌతిశ్శాస్త్రము నొకదానిని సాంగోపాంగముగా సాంతముచేసితిని.ఆశాస్త్రమంతయు వినిపించినచో గురూపదేశము లేనివారికి దురవగాహ మగుటయాలోచించి పూర్వోక్తరహస్యలధమునుబట్టి మిరు గ్రహింపఁగలిగిన మూఁల సూత్రములను ముఖ్యముగా నిందుదాహరించుచున్నాను.
సత్యరాజా పూర్వదేశయాత్రలు
గీ. క్రొత్తగాడిదఁబోఁగొట్టుకొన్నవాఁడు
వాలఖిల్యప్రసాదంబు పచ్చియరఁటి
పండ్లు దక్షిణయిచ్చి సాపడియె నేని,
దొరకు గాద౯భంబది యింటిత్రోవలోనె.
గీ. గోవృషంబులఁ బొఁగొట్టుకొన్నవాఁడు
వచ్చి కదళీఫలంబుల వాలఖల్య
సన్నధినిబుచ్చుకొన్నఁబక్షంబుగోన
దొరకు గొవది బందెలదొడ్డిలొన.
గీ. తనదుగాదఁ బో గొట్టు కొనినవాడు
వచ్చి రాహుకాలంబున భ క్తితోడ
వాలఖిల్య ప్రసాదంబుఁబడసెనేని,
కంటఁబడ డెప్పుడును వానిగాద౯భంబు.
మూలనూత్రములు దేవభాషయందే యున్నను స్రీశూద్రులు వానిని పరింప రాదని సర్వజనొపయోగాధ౯ముగా వానినిట్లు తెనిఁగించినాను. ఈయభినవ మహశాస్త్రమునకు ప్రసొదజ్యోతిశ్శాస్త్రమన్న పేరెట్లు సర్దక మగునొ మిరేయూహించి తెలిసకోవచ్చును. వాలఖిల్య ప్రసాదమువలనఁ గలుగు ఫలములను దెలుపుశాస్త్రమగుటచేత ప్రసాదశాస్త్రమును, ఆయాఫలములకు జ్యోతిశ్శాస్త్ర సంబందమును గల్పించుటచేతఁ గొంతవఱకు జ్యోతశ్శాస్త్రమునూయి యీపేరీయపూర్వశాస్త్రమున కంవ్వధ౯మయినది. ప్రసాదమును స్వీకరించుకాలమును బట్టివారదోషములు, తిధిదొషములు, నక్షత్రదోషములు, రాహుకాలదోషములు, మొదలయిన కాలదోషములన్నియు నియపూర్వశాస్త్రము నందు జొప్పింపఁబడియున్నవి, మొట్ట మొదటవచ్చి నచాకలివాఁడుతనగాడిద తప్పిపొయి నందునకయి ప్రశ్నయడుగుటకు శుక్రవారమునాఁడు పదిగడియల ప్రొద్దెక్కివచ్చి ప్రసాదస్వీకారము చేసినందున, నాఁడు
లంకాద్వీపము
రాహూకాలము ౧౧ గడియల కగుటచేత వానికార్యము సఫలమయినది.మఱునాఁడు శనివారమునాఁడువచ్చిన చాకలివాఁడును పదిగడియల ప్రొద్దెక్కీయేవచ్చి ప్రసాదస్వీకారముచేసినను వాఁడు రాహుకాలము 24గడియల కె వచ్చినందునవాని కార్యము విఫలమయినది.
“సూ″విధు స్సౌరీ భృగుసుతజ జివభౌమార్క″ త్రిపాద త్రిణీవృద్ది″” ఆను ముహూర్తదిపికా సిద్దాంతమునుబటి రాహుకాలము, సోమవారము ౩గడియలకును, శనివారము గడియలకును శుక్రవారము ౨౧ గడియలకును, బుదవారము ౫గడియలకును, గురువారము ౧౮౬గడియలకును, మంగలవారము ౨౨గడియలకును, ఆదివారము ౨౬ గడియలకును, మూఁడుగడియల మిప్పావు వృద్ది చొప్పునవచ్చుచుండును. ప్రసాదిజ్యొతిశాస్త్రములోని జ్యోతిశ్శాస్త్రనున్న యంతిమ శబ్దసారస్యములన, అభినవవాలఖిల్య మహర్షివయిన నాసిద్దాంతము ననుసరించి యే పూర్వమహర్షులును మన దేశములోని జాతక ముహూర్తభాగములు నేర్పఱిచిరన్న పరమరహస్యమునుగూడ బుద్దిమంతులూహించి తెలిసికోవచ్చును. ఈప్రసాదజ్యొతిశ్శాస్త్రము బహుఫల ప్రదమయినదగుటచేత శాస్త్రవిశ్వాస మహనీయులయిన మన దేశపు పెద్దలు దీనిని గురుముఖమున నుపదేశమునొంది భరతఖండమునందు వ్యాపింపఁజేసి యానేత హిమాచలమున సర్వజనులకును దనివలని యనంతములెైన ఫలములను శీఫ్రికాలములోనే కలిగింతురనుటకు సందేహము లేదు. అయినను వాలఖిల్య మూర్తి ప్రస్తుతిమునమనదేశమునందును లేకపోవుటయొక ప్రతిబందకము గాఁగనఁబడి దూరాలోచన లేనివారికి వాలఖిల్య ప్రసాదశాస్త్రము వ్యాపింపఁజేయుట దుస్సాధ్యమని తో చవచ్చును ; గాని , రామకృష్ణాదుల విగ్రాహములను ప్రతిగ్రమమునందును ప్రతి
సత్యరాజా పూర్వదేశయాత్రలు
ష్టిచి యనంత ఫలప్రదమయిన తత్ర్పసొదశాస్త్రమును వ్యాపింపఁ జేయుట పరమసాద్యమే యని స్పురించకపొదు. నేను వ్రాయుటకుఁదగిన దుకులు గాని గంటములు గాని యాదేశములో లేనందున నా ప్రపొదజ్యొతిశాస్త్రమున కదిక గౌరవము కలుగుటకయి నేను దానినివాగ్రూపకముగనేయుంచి మన మహర్షులు వేదమును కాపాడినట్లు కాపాడుచున్నాను. ఆదేశమునందలి గంటములు మన గునపములకంటె మూడురెట్లు పొడుగును రెండురెట్లు లావును గలిగియుండుతచేత వాని నెత్తుటకే మకు నాద్యాముకాదు. ఇఁకనక్కడి తాటాకన్ననో మనపెద్ద పరుపులంతచేసి వెడల్పుకలవయి వానికంటె దశిగుణములునిడిని కలవిగా నుండును.
నాధర్మకర్తయైన మహకాయుఁడొకవాఁడు నాపద్ద నియమింపబడిన యర్చకులు నాకు య్రెక్కుకొనువారు చెల్లించు ముడుపులుతానుకులు దక్షిణలు నిలువుదొపులు మొదలయిన వానినిగూర్చి క్రమమయిన లెక్కలుంచి వచ్చినసొమ్మంతయుప్రతిదినమును సరిగా ధర్శకర్తకుఁబంవుచున్నారో లేదో విచారుంచుటకయి నన్నుంచిన యాల యమునకువచ్చి నాయాదాయస్యయములను విమర్శించి వారిండ్లకుఁబంపివేసి తరువాత వారు స్వామిసొమ్ము నేమయిన సవహరించుచున్నారాయని నన్నడిగెను. నెను చిఱునవ్వునవ్వి యడిగినదానికి తగిన సదు త్తరమియ్యక క్ష్యాతిషభూమిలొఁ దమకు విశదముగాని దేమున్నాదని పలికి, జ్యోతిశ్శాస్త్ర ప్రశంసచేసి మొదటిసంగతి మఱపించి మెల్లగానతనిని శాస్త్రచర్చకుదింపితిని. తిరుమల;మొదలయిన దివ్యస్దలములలో భక్తులు సమర్పించు దేవుని సొమ్ములోపూజారులు మొదల యినవారు నిత్యకృత్యముగా చేసెడుకెంకర్యరహస్యములు మికు కొట్టింపిండియగుటచేతి మికాడేవరహస్యములను తెలపవలసిన యావశ్యకము మొదలే లేదుగదా? నేను శాస్త్రచర్యకు దింపినతరువాత మహకాయఁడు జ్యోతిశాస్త్రమునందు మహభిమానమును సంపూ
లంకాద్వీపము
ర్ణవిశ్వాసమును గలవాఁడయ్యును, తిమదేశమునందిప్పుడు గ్రహగతి యనుకరాలముగా లేనందునకుఁగొంత సంతాపవడి యిట్లు సంభాషణ కారంభించేను;—
మహ—పూర్వమునందు మా రావణమహరాజుకాలములో గ్రహములన్నియు సదా మంచి స్దలములయందుండి యొల్లవారికీని సత్ఫలములనే యిద్చుచుండెను.ఆమహరాజుపొయివిభిషణుఁడు రాజ్యమునకు వచ్చినతరువాత గ్రహములు కోంటిభయమువిడిచి యధేచ్చముగా సంచరించుచు తమ యిచ్చవచ్చిన ఫలములనే యిచ్చుచున్నవి. అయినను జ్యొతిశాస్త్రమునం డఖండపాండిత్యములగల మహనుభావుల యనుగ్రహములవలన గ్రహగతులవలని ఫలాఫలములమాత్రము మాకిప్పుడు తెలియుచున్నవి.
సత్య—గ్రహముల గతిదొషములను తప్పించుకొనుటకయయీదేశమునందు సాధనములన్నవా‽
మహ—ప్రయాణాదులయందు మంచి ముహూ ర్తముల పెట్టించుకొని పని యారంభించుట యొక్కసాధనమగుపడుచున్నది. అంతెకంటె వేఱుగతిలేదు.
సత్య—ఈదేశస్దులు ప్రయాణాది సమస్తకార్యములయందును మంచి ముహూర్తములు పెట్టించుకొని శుభలగ్నమునందే కార్యారం భము చేయుచున్నారా‽
మహ—సాద్యమయినంతవఱకు చేయుచునేయున్నారు. మఱిమిదేశమునందొ‽
సత్య—మాదేశము నందును జనులు శాస్ర్తబద్దులయి నడుచు కినుచు న్నారు కాని—
గుహ—ఏమో‘కాని’యనుచున్నావు. మివారు శాస్త్రవి
సత్యరాజా పూర్వదేశయాత్రలు
శ్వాసము లేనివారయి కొందఱు విహితధర్మములను మిఱి నడుచుచున్నారా‽
సత్య—మావా రెప్పుడును బుద్దిపూర్వకముగా శాస్త్రమర్యాడలను మిఱువారుకారు. అయినను మాదేశమునం దిప్పుడు ప్రభుత్వముచేయుచున్న హూణులు క్రొత్తగానావిరియంత్రములను కల్పించి, నీటి యావిరియొక్క బలముచెత నినుపదారులమిద తిధి వార నక్షత్రహొరాత్రనియమును పాటింఫక నిణి౯త సమయముయందు ప్రతిదినమునుపొగబండ్లను వాయువేగమున నడిపించుచు జనులశాస్త్రచొదితాచారములకు భంగము చేయుచున్నారు. అందుచేత జనులిప్పుడు శాస్త్రమర్యాదల నంతగా పాటింపక ప్రయాణసౌలభ్యమునుబట్టి పొగబండ్లలో నెక్కి జ్యోతిష్కులు పెట్టినముహూర్తములనుమాని జాతివా రేర్పఱిచిన వేళ్లలోనే యాత్రలుచేయ మొదలు పెట్టినవారు.
మహ—ప్రయాణసౌలభ్యమును భట్టి శాస్త్రవిదుల పతిక్రమించుట మహదొషము. అందులోను జ్యోతిశాస్త్ర సిద్దాంతములను మిఱిన పాపమునుమించిన మహపాతకము లోకములో మఱియొకటియండదు. మఱియేపాపమున కైనను నిష్కృతికలదుగాని యీపాపమునకు నిష్కృతిలేదు. దేశాభిమానులందఱును జేరిపొగభండ్లలోపొయినవారిని జాతినుండి బహిష్కారము చేసెదమని దొషజఞపమయముచేయరాదా?
సత్య—శిష్టాచార సంపన్నులయిన శ్రొత్రియశిఖమణు లనే కులు పొగబండ్లలో ప్రయానము చేయుట పాపమని భొదించినవారు గాని జనులుయనదరమువలనను ధర్మ సంస్దాపకులయిన ప్రభువులులేని లోపమువలనను వారి యుపదేశములన్నియు సరణ్య రొదనము అయిపొయినవి.ప్రయాణములకు మహూత౯ములు పెట్టించువారు
లంకాద్దీపము
లేక విదివిహితమయిన తమవృత్తికే భంగమురా నారంభించినందున జ్యొతిష్కులడఱును జేరి ముహూత౯ములు పెట్టించుకొనకుండ యాత్రలుచెయుట పాతకములలో నెల్ల ఘూరపతకమనియు కాలజఞలయిన విప్రొతములు జీవనాదరమును మూలచేదమనిమ చేయులషములలో నెల్ల మహదొషమనియు ఘొషఫెట్టీకి.రాజావలంబము లేకపోవుటచే వారఘొషము లన్నియు చేవిటివానిముందఱి శంఖఘొషములే యయినవి,
మహ—ఆహహా;మిదేశమున కిప్పుడెంత కష్టమువచ్చినది; అయ్యో; శాస్త్రమన్యాయముగా చెడిపోవుచున్నదే జనులను సన్మార్గముననడిపించుతకు మిదేశములో మతగురువులులేరా పీఠాదిఓతులులేరా ఎవ్వరును లేకపొయినను మతాభిమానులందరునుజేరి పొగబండ్లనుప్రతిస్దలమునుండియు రాహుకాలములను వర్జ్యములను వారశూలలను గ్రహవేదలను నక్షత్రదోషములను తారాబలములను చంద్రబలములను విచారించి మరి బయలుదేరదీయునట్లు శాసనమేర్పరువ వలసినదని ప్రభుత్వమువారికి సంఘవిజఇపనములు పంపులొనరాదా
సత్య—ఈ యాలోచన సర్వోత్తమముగానున్నది. ఇటువంటి మంచి యాలోచనయీవరకు మావారలబుద్దులకు గోచరము కాలేదు.మాదేశము చేరఁగానే యీసంఘనిజాఇపనల విషయమయి నేనుకృషిచేసి దొరనమువా రొకవేళ నామొర వినకపోయినను నాదేశాభిఅమానమాననీయతను గనఁబరిచి దేశమునకు మహహొపకారము చేసెదను.
మహ—అట్లుచేయుము. అక్కడమికేగాని మిప్రభుత్వము వారికి జ్యోతిశాస్త్రవిశ్వాసము లేనటున్నది.
సత్య—లేదు, వారికి ముహూతములులేవు; జాతకములులేవు; ఎమియులేవు.
మహా-గ్రహములు వారిని బాధించవా?
సత్య-బాధించవు. అమావాస్యనాడు బయలుదేఱినమ వారికి కార్యసిద్ధి యగుచున్నది. శూన్యమాసములో శనివారమునాడు దుర్ముహూర్తపువేళ లగ్నముపెట్టి వివాహము చేసికొన్నను దంపతులు సంతానవంతులయి వర్ధిల్లుచున్నారు. గ్రహములుకూడ వారికి భయపడినట్లు తోచుచున్నది.
మహా-నీకు తోచుచున్నది సత్యమే. పంచభూతములను లోబఱుచుకొని నిప్పుచేతను నీళ్ళచేతను బండ్లులాగించువారికి గ్రహములు భయపడి లోపడుట యాశ్చర్యముకాదు. ఏమియు భయముచేత కార్యసిద్ధిచేసినట్లు భక్తి చేత చేయవు. వెనుక మారావణునికిని భయముచేతనే కదా సూర్య చంద్రాది గ్రహములను వాయువైశ్వానరాది భూతములను చెప్పినట్లనుండి సేవచేయుచు వచ్చినవి.
సత్య-అది సత్యము. ఆహా ! ఏమి మీబుద్ధివిశేషము ! మీకు గల వర్ణ నీయమయిన శాస్త్రాభిమానము మీబుద్ధి విశేషమునకు వన్నె తెచ్చుచున్నది !
మహా-దేనిని విడిచినను శాస్త్రాభిమానమును మాత్రము విడువరాదు.శాస్త్రవిశ్వాసముచేత నేను విధ్యుక్తమూఅ వివాహము చేసికొన్న ధర్మపత్నిని సహితము తృణప్రాయముగా విడిచిపెట్టినాను.
సత్య-ఓహో ! మీరు త్రిలోకపూజ్యులుగా కనబడుచున్నారు. మీచిత్రచరిత్రయును నాశ్రోత్రపేయముచేసి నన్ను చరితార్ధుని జేయుడు. :మహా-నా ప్రధమభార్య వృషభలగ్నమున లగ్నమందు చంద్రుడును సింహమందు సూర్యుడును వృశ్చికమందు గురుడును ప్రంభమందు శనై శ్చరుడును ఉండగా ప్రధమకుమారుని గన్నది. అట్టి లగ్నమందు బుట్టినవాడు జూరజాతుడని శాస్త్రదృష్టిచేత జూ వినవాడనయి గుణపతియైన యాభార్యను తత్క్షణము త్యజించినాను.
సత్య-"వృషస్ధేందౌలగ్నే సవితృగురుతీక్షాంకుతనయై స్నుహృజ్ఞాయోఖస్తైర్భవతినియమాక్మావవపతి" అను వరాహమిహిరవాక్యమునుబట్టి మీరుచెప్పిన రాజయోగమునందు బుట్టినవారు జారజుడుకాక మానవపతికావలెను...
మహా-ఆ విషయమయి చర్చ యక్కరలేదు. కారజుడు మానవపతిఉఐనను విసర్జింపవలసినదే.
సత్య-మీ భార్యయందు జారత్వదోష మున్నట్టు మీవఱకెన్నడయిన విన్నారా?
మహా-పుత్రజన్మముచేత శాస్త్రము చెప్పువఱకును నాభార్యయట్టిదని నేను స్వన్నావస్ధయందును ననుకోలేదు. అది మహాపతి వ్రతమనియే యెల్లవారును నేటివఱకును విశ్వసించి, నేను దానిని నిష్కరుణుడనయి నిష్కారణముగా పరిత్యజించితిని నన్నూరక నిందించుచున్నారు. జారత్వమెప్పుడును గూఢముగా జరుగునదిగాని యొకరికి దెలియునదికాదు. సర్వఙ్ఞ కృతమయిన శాస్త్రవిశ్వాసము గలవాడనయి జనులనిందలను లక్ష్యముచేయక ప్రత్యక్షపాక్షియైన శాస్త్రమును బట్టి భార్యపరిత్యాగముచేసి నేను మావంశపరిశుద్ధతను నిలువుకొన్నాను.
సత్య-పాపము! ఆ మెగతి యేమయినది?
మహా-దాని కేమిలోపము? దానికితగిన భరణమేర్పఱిచి నేను మఱియొక కన్యను పాణిగ్రహణము చేసికొన్నాను. నాద్వితీయ భార్యకు నిర్దోషమయిన సుముహూర్తమునందు ప్రధమపుత్ర జనన మయినది. ఆశిశుజన్మమైనది యెఱుగుదువా? వాని జనన సమయమునందు బృహస్పతి యేక రాశిగతులయిన సూర్య చంద్రులను చూడక చక్కగానున్నాడు.
- సత్యరాజా పూర్వదేశయాత్రలు
సత్య-ఆహా! ఏమి మీశాస్త్రవిశ్వాసము!
మహా-ఏమి? నాశాస్త్రవిశ్వాసమయిన కంతయాశ్చర్య పడుచున్నావు! మీ దేశమునందు శాస్త్రవిశ్వాసములేదా?
సత్య: కావలసినంత యున్నది. మాతుల మరణ యోగమునందు శిశువులు పుట్టినపక్షమున తమగండములను తప్పించుకొనుటకయి మేనమామలు మొదలయినవారు శాస్త్ర విశ్వాసముచేతనే మంత్రసానులకు లంచమిచ్చి శిశువులను చంపించి వేయుదురు. అయినను మాదేశమునం దింగ్లీషు చదువుచేత నట్టి సత్యములనునమ్మని నాస్తికులు కొందఱిప్పుడు బయలుదేఱు చున్నారు.
మహా-కలికాల్మహిమచేత నట్టిబౌద్ధులు మాద్వీపమునందును కొందఱు వెలసి జ్యౌతిష మబద్ధమని కుత్సితబుద్ధి వాదములుచేయుచున్నారు.ఈసారి నిన్ను వారిసభలకు దీసికొనిపోయెదనులే.
సత్య-ఆ నాస్తికాధముల సభలకు నన్ను గొనిపోవుటకంటె ముందుగా మీరీవఱవఱకు వాగ్దానముచేసియున్న ప్రకారముగా నన్నొకసారి శాస్త్రవిశ్వాసము గల పండితసభకు దీసికొనిపోయి జ్యోతిష్యులు న్యాయముతీర్పు విధమును జూపుడు.
మహా-మంచిది. ఈమాటలసందడిలో నీకు శివపూజసమయము మించిపోయినట్టున్నది. ఆకలిచేత నీకన్నులు గుంటలు పడిపోయినవి. నేను లోపలికి బోయి మందోదరిచేత నీకు నైవేద్యము పంపెదను. భక్తులు దేవతాదర్శనమునకు వచ్చెడువేళకూడ నగుచున్నది.(అని లోపలికి బోయెను)
ఆమహాకాయుడు చెప్పినదానినిబట్టి యాతని రెండవభార్యకు పుట్టినకొడుకు జారజాతుడని యెఱిగినవాడవయి,
శ్లో|| స్వలగ్న మిందంచగురుర్ని రీక్ష తే నవా శ శాంకంరవిణాసమాగత్
వపాప కోర్కేణ యతోధవాశశీ పరేణజాతంప్రవదంతి నిశ్చయాత్.
అని యేకరాశి గతులయిన సూర్యచంద్రులను బృహస్పతి చూడకున్న కాలమున బుట్టినవాడు నిశ్చయముగా జూడజుడన్న బృహజ్జాతక వచనమునకు ప్రత్యక్ష విరుద్ధముగానున్న వారిశాస్ర్తము సత్యము కాదని నాలో నేననుకొని, అతనికి గోపము వచ్చునన్న భయముచేత నతనితో నేతద్విషయమును గూత్చి ఒతస్తావింపక వారిది రాక్షస్ శాస్త్రమగుటచేత నట్లు వ్యత్యస్తముగా నున్నదని నిశ్చయము చేసికొని యప్పటి కూరకుంటిని.
నాల్గవ ప్రకరణము.
వెనుకటి ప్రకరణమునందు జెప్పిన ప్రపంచము నడిచిన నాలుగు దినముల కొకనాటి మధ్యాహ్న స్మయమునందు నా యజమానుడయిన మహాకాయుడుగారు నాయొద్దకువచ్చి, నేడు రాజసభ జరగబోవుచున్నది గనుక జ్యౌతిషవిద్వాంసులు చెప్పు తీర్పులయొక్క రీతిని జూచి యానంద్ంచుటకయి నీకోరిక ప్రకారముగా నిన్నక్కడకు గొనిపోవ వచ్చినానని సెలవిచ్చును. నే నాయనయాజ్ఞను శిరసావహించి తత్క్షణమే యుచిత వస్త్రాదులను ధరించి యరగడియ లోపలనే ప్రయాణమునకు సంసిద్ధుడను కాగ నా యజమానుడు నాయాలయముయొక్క తలుపులు మూయించినన్ను గొనిపోయి తన గుఱ్ఱపుబండిలో తాను గూరుచున్న మెత్త మీద నన్ను తన కుడువైపున గూర్చుండబెట్టుకొనెను. నేనెక్కిన బండి రాక్షసిబండి యనియు, దానికి గట్టబడిన గుఱ్ఱములు రాక్షసి గుఱ్ఱములనియు, నేనిప్పుడు నేఱుగ జెప్పనక్కఱలేదుగదా ! ఆబండి ధవళేశ్వరపు కొండంతయున్నది; దానికి గట్టబడిన గుఱ్ఱములను ఒక్కొక్కటి పదియేనుగు