కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు/సత్యరాజా పూర్వదేశ యాత్రలు-ద్వితీయభాగము-ఆఱవ ప్రకరణము

లంకాద్వీపము

తరువాతనెప్పుడునునన్నేసభకునుదీసికొనిపోలేదు.ఓహిందూమహాజనులారా:మీవాఁడొకఁడుబయలుదేఱిదేశదేశములవెంటఁబోయియిక్కడమీకుప్రియతమైనజ్యోతిశ్యాస్త్రమునుస్థిరపఱిచియాచంద్రార్కమైనశాశ్వతకీ౯ని పొం దఁగలిగినందునకుమీరునునమందానందముపొందుఁడు.

ఆఱవ ప్రకరణము.

ఆమఱునాటినుండియు నాకీతి౯లంకాద్వీపమునందు దిగంతవిశ్రాంతముగా వ్యాపించినది. పడిపోవుచున్నజోతిశ్శాస్త్రమును నిలువఁబెట్టితినని విద్వాంసులు వేయినోళ్ళశ్లాఘింపఁజొచ్చిరి. జ్యోతిషమునుపునరుద్దరణము చేసిదేశమునకు మహోపకారము చేసినందునకయి కవీశ్వరులునామీద పాటలనుపద్యములనుజేసి ఈశ్వరునియపరావతారమునని నన్నుస్తుతింపఁజొచ్చిరి. ఇఁకనామిహిమలను విని యానందించి యింటిటనునాచిత్రచరిత్రమును కథగాఁజెప్పుకొనొచు పామరులు చేసినస్తోత్రపాఠము లకుపరిమితియేలేదు. పమరులనోళ్ళ నుండిస్త్రీలచెవులసోకి నూతులవద్దనునీళ్ళరేవుల వద్దనుజరుగుమహాసభలలో చిత్రవిచితముగాపెరిగి స్త్రీలనోళ్ళలోనుండి శాఖోపశాఖలుగావ్యాపించి యంతఃపురములుచేరునప్పటికి నామహిమలునిజముగా కోటిగుణతములయినవి. కొదఱునేనునింహకగర్భము లోఁజొచ్చికాయుముపెంచిన హనుమద్దేవునివలెనాకాయమును పెంచితినని చెప్పుకొనజొచ్చిరికొదఱునేను సురగర్భములోఁజొచ్చి యంగుష్టమాత్ర శరీరుడైబయలు వెడలినహనుమద్దేవుని వలెసూక్ష్మాతిసూక్ష్మమగురూపమును సత్యరాజాపూర్వదేశయాత్రలు

ధరించితిననిచెప్పుకొనఁజొచ్చిరి:
కోందఱునేను శుక్రాచార్యులగర్భమును చీల్చుకొనివెలువడిన
కచుని వలె దీఘ౯రోమునిగర్భగోళమును భేదించుకొని వచ్చియాతని నిమృతసంజీవని విద్యచేతమరలబ్రతికించితి ననిచెప్పుకొనజొచ్చిరి: కొఁదఱునేనుదీఘ౯ రోమునిపాదములుమొదలుకొని శిరస్సువఱకునునడిమికిరెండు చీలుకలుగాచీల్చితరువాత జరయనురాక్షసి జరాసంధునియధ౯దేహములనొకటిగా సంధించినట్లుగా రెండుఖండములను మరలనతికించి మంత్రప్రభావముచేత పునజీ౯వితునిజేసితినని చెప్పుకొనఁజొచ్చిరి. ఇట్టికథలన్నిటిని పూణ౯ము గావివరించినచో నొక్కపెద్దపురాణముకావచ్చును గానిస్వోపకష౯మునుజెప్పుకొనుట యిష్టము లేనివాడనగుటచే వానిని నేనభివణి౯ంచుట మానినాయపూర్వమహిమలను లోకోపకారాథ౯ముగా పురాణారూపమున రచియించియాచంద్రార్కముగా లోకమునవ్యాపింపఁజేసి మనంహషు౯లవలెశాశ్వతకీతి౯ని సంపాదించుకొనెడుపుణ్యమును భక్తాగ్రేసరులకువిడిచిపెట్టుచున్నాను. నాఁటినుండియు నన్నుదర్శింపవచ్చుభక్తులయొక్కయు భక్తురాండ్రయొక్కయు సంఖ్యదినదిననాభివృద్దియగుచు వచ్చినదన్న సత్యమును బుద్దిమదగ్రగణ్యులయినమీతోనేను విన్నవింపవలసియావశ్యకమేలేదుగదా?అయినను మీకింకొకసత్యమును మాత్రమిప్పుడువిని పింపవలసియున్నది. లోకములోమనుష్యుఁడుగొప్పవాఁడయిన కొలదినిగొప్పతనమొతోడఁ గూడకష్టములనుపెరుగుచుండును. భక్తులయిన వారుస్వప్రయోజన పరులయిస్వలాభముకొఱకశ్రాయించిపీడించుచుందురు: అసూయాపరులయినవారు పరోత్కష౯మునునహింపలేక యపవాదములనువేసిబాధించుచుందురు.

లంకాద్వీపమునందునందు ప్రాచీనాచార నిష్టాగరిష్టులయిన శిష్టులందఱునునన్ను సనాతనపదారములనుస్థాపింప నవతరించిన

లంకాద్వీపము

ఈశ్వరాంశసంభూతుని గాభావించి బహుకరింపఁ జొచ్చినను, జ్యోతిశ్శాస్త్రమునురూపుమాపదీక్షవహింప బద్దకంకణులయివిఫల మనోరధులయిన నవనాగరికులునన్ను ద్వేషించినాయశస్సునకు భంగముకలిగించుటకును నాకపాయము కలిగించిటకును నానావిధములఁబ్రయత్నించుచుండిరి. ఆరాక్షసుల క్రౌర్యము నెఱిగినాయాజమానుఁడఁయిన మహాకాయుఁడుగారు నాటినుండియునన్నుసభలకుఁ దీసికొనిపోవుట మానివేసిరని యీవఱకేచెప్పియున్నానుగదా; ఆపదలు రానున్నకాలము నందంతఃపురములో దాఁచి సహస్రభటులనుకావలియుంచి ననురాకమానవు. ఆపదలు రారానికాలమునందు సముద్రమధ్య మునందుఁబడవైచిననురావు. నాయజమానుఁడు తనయింట నన్నెంతసురక్షితము గానుంచికాపాడిచుండినను, ఒకనాఁటిరాత్రి నానొక్కఘోరవిపత్తుసంప్రాప్తమయినది. ఓచదువరులారా! విధివిధానమప్రతివిధానమగుట తెలిసికొనినా విషయమయి మీరుచింతిలఁబోకుడు.

ఒకనాఁటియధ౯రాత్రమునందు నేను నాపానుపు మీదసుఖ నిద్రచేయుచుండగా నానడుమెవ్వరోపట్టుకొని నొక్కుచున్నట్టయి యులికిపడిలేచితిని. లేచికన్నులు తెఱచిచూచు నప్పటికికేదో జంతువునన్ను నడుముమొదలుకొనిమె డవఱకును నోటఁగఱచుకొనిపోవుచున్నట్టుదీపమువెలుతురున కనబడినది కానియాజంతువేదో యానావాలుతెలిసినదికాదు. ఆభయములో నన్నువ్యాఘ్రమీడ్చు కొనిపోవుచున్నదనిభ్రమకలిగినది కానిప్రక్కలనుండిదానికాళ్ళునల్లగాకనపడినందున వెంటనే యాభ్రమనివారణమయినది. అటు తరువాతది భల్లూకమో వరాహమోనని తలచియరణ్యములో నుండదగిన యాజంతువులు నట్టింటికికెట్టువచ్చునా యనివిత్కరింపనారంభింపఁగా నింతలో నీటెతో పొడిచినట్లుగా వీపునకుకోఱయొకటి

సత్యరాజాపూర్వదేశయాత్రలు గ్రుచ్చుకొని తీవ్రవేదననుకలిగించినది. ఆవేదనకుభయముతోడ్పడి నన్నుకొంతసేపుమూర్చలో ముంచినందుననావలనేమి జరగినదోనేనుచెప్పలేను. మూర్చతేఱినేనుమరలకన్నులు విచ్చిచూచునప్పటికి చుట్టునునంధకారబ్ంధురముగానుండెను; ఏప్రక్కఁజూచినను నాకంటికేదియుకనఁబడలేదుగాని నాముక్కునకు మాత్రముముఱికి కాల్వలోనుండివచ్చునట్టి నన్నాజంతువుమాయింటి దారితూముకాల్వలోనుండి యీడ్చుకొని పోవుచున్నదినేనుహించినాను, ఇట్లనుకొనుచుండగానే నాకాదుగ౯ంధవిముక్తికలిగినదికాని యాసౌఖ్యమును చిరకాలముండి నదికాదు. జంతువునన్ను నోటఁగఱచుకొనిమాయింటి వారితూము కాల్వలోనుండి మఱియొక రియింటిలోనికిఁ గొనిపోయి దీపమువెలుగుచున్న యొకగదిలో నన్నుక్రిందదింపినది. ఇదియంతయుఁ జూచి యీకపటకృత్యమం తయునాకు శత్రువులుగానున్న కామరూపులయిన యానపనాగరికుల పనియని నేనుమనస్సులో నిశ్చయించుకొన్నాను. దీపమువెలుగు నన్నీడ్చుకొనివచ్చినజంతువును నల్లగా నాకంటికిస్పష్టముగాఁ గనఁబడినదిదానినిజూచునప్పటికి నామేను నిలువునను జెమిర్చిప మొందఁజొచ్చినది. అది మనదేశమందలి యెలుఁగుబంటి యంతయున్నది; ఎలుగుగొడ్డునకువలె దాని శరీరిమందంతటను బొచ్చులేదుగాని వరాహమునకున్నట్లుగా మెడమీఁద మాత్రము దబ్బనములున్నవి. మీరయిన పక్షమున దానిని పెద్దయడవిపందియని భ్రమించి యుందురుగాని యాదేశపుజంతువులపరిమాణముల నెఱిఁగియున్న నేనెప్పుడొక్కనిమిషములోనది పందికొక్కని

                లంకాద్వీపము 399

  
యది మాంసభక్షకజంతువు కాదని యంతరంగమునఁ గొంత సంతోషించినాను. అప్పుడొక్క మూలుగు మూలిగి నన్నుఁ గొసివచ్చిన జంతువు నన్నునట్టింట దిగవిడిచి తానొక కన్నములో నుండి యానలికిఁజోయెను. అంతట నమస్తాభరణభూషితు రాలయియున్న యొక కాంతమంచుము మిఁదినుండి దిగి వచ్చి మనపిల్లలు చందనపు బొమ్మను పయికెత్తినట్టుగా నన్ను తనకుడిచేతిలో పయికెత్తి రెండవచేతిలోని యంగవస్త్రముతో నాశరిరమంతయు తుడిచి నన్ను తన మంచమిదఁగూరుచుండఁబెట్టి తానును నాకెదురుగాఁగూరుచుండెను. కాళికాశక్తివలె వెదురుఁగూరుచున్న యామెమొగము జూడఁగానే నామనస్సులో పరిపరిలాగు నాలోచనలు పుట్టఁజొచ్చినవి. నాశత్రువు లెవ్వరైన నన్ను బాధించిచంపుటకయి యిట్లు తెప్పించి యుందురని మొట్టమొదటతోఁచినది. తరువాత నొకటి తరువాత నొకటిగా ననేకాలోచనలు కలిగినపిమ్మట కట్టకడపట రాక్షసాంగనయైనయామె నన్ను మెహించి బాణాసురుని కూఁతురైన యుష్యాకన్య యనిరుద్దని చిత్రలేఖచేతఁదెప్పించుకొన్నట్లుగా నన్నీ మూషక రాజుచేతఁ దనయెద్దకు రప్పించుకొని యుండనాయని సంశయము తోఁచినది. తరువాత మాయిరువురకున నడిచిన సంభాషణమును బట్టి నాయీ కడపయూహయే సిద్ధాంతముయినట్టు మిరిప్పుడే తెలిసికొనఁగలరు. ఆకాంత యద్భతపడి చూచుచున్ననాకు తన్ను తెలుపుకొని,తనపేరు త్రిజటయగుట చెప్పి యిట్లనియెను...........

      త్రిజ - ఓరుషివర్యా !నావంక వెఱగుపడిచూడకు. ముల్లోకములను జయించిన సార్వభౌముని వంశములోని రాజ కన్యకు జీవితేశ్వరుని గాఅవించి ధన్యుని చేయుతలంపున నిన్నిటకు రావించితిని గాని హానిచేయుతలంపున రప్పింప లేదు ఇంద్రుని జయించి యింద్రజిత్తని పేరుపొందిన మేఘనాదుడును రావణపుత్రునకు నేను ముని మనవరాలును.

400 సత్యరాజాపూర్వదేశయాత్రలు

  
సత్య_అమ్మా!నీకు నామిఁదఁగల యనుగ్రహముచేత నేను నిజముగానేధన్యుఁడనయినాను. నాపేరు సత్యరాజాచార్యూలు.నేను ఋషివర్యుఁడను పేరునకర్హుఁడనుగాను.
 
త్రిజ_నీపేరిదియైనను గానిమ్ము:నీవొక్కఋషివనిమాత్రమే కాక యంగుష్టమాత్ర శరీరులయి నిరంతరమును సూర్యుని రధముచుట్టును తిరుగుచుండెను క్రతుపుత్రులైన యఱువదివేల వాలఖిల్యులలో నొక్కఁడవనికూడ నేనెఱుఁగుదును.ఇఁకనావద్ద నేమియు దాఁచఁబోకు.
     
సత్య_మిరట్లన్న నేనేమి చెప్పుగలను!
     
త్రిజ_నేమియుఁజెప్పునక్కఱలేదు. ఇకరాత్రియెంతోలే. మాటలతో వృధాకాలహరణము చేయక కార్యాంశము వినుము. నీయెక్క మహామహిమలను నాచెలికతైలవలన విని నీకు వలచి చిక్కినదానను. గాంధర్వవిధిని వరించి యిప్పుడే నన్ను చరితాధరాలిని జేయుము.
     
సత్య_అటువంటి మాటలు మిరూ సెలవియ్యకూడదు.
    
త్రిజ_దీనురాలనయి ప్రాధించుచున్న నాకోరిక వృధ పుచ్చుట మికు ధర్మముకాదు. మిఋషులయెక్కయు దేవతల యెక్కయు గుట్టంతయు నేనెఱఁగుదును. రాక్షస స్త్రీలమాట యటుండఁగా తిర్యగ్జంతువులతో సంభోగించుటకు సహితము సంశయింపలేదు.
    
  
సత్య_వంశయింపనివారెవ్వరు!మహషులా!
      
త్రిజ_ఒక్క మహషులు మాత్రమేకాక వారి దేతలను సంశయపడలేదు. మందపాల మహషి లావుకపిట్టతో సంభోగించి సంతానము కనేను. విభండకమహషి లేడిని పొందిఋశ్యశృంగుడను కొడుకును గనెను మివాయు దేవుఁడు కేసరియను వానరుని భార్య వలన హనుమంతుని గనెను. సూర్యఁడశ్వమునుజేరి యశ్వనులను

లంకాద్వీపము

గనెను, శ్రీకృష్ణుఁడుజాంబవంతుఁడను భల్లూకరాజుయొక్క పుత్రికనువరించెను. దేవేంద్రుడును సూర్యుడును బుక్షవిరజుఁడనుమర్కటమును కామించి వాలిసుగ్రీవులను గనిరి. మీవారిగుట్టునాకుతెలియదనుకొన్నావా?ఈమాటలను నప్పటికారాక్షసియొక్క పురాణపరిజ్ఙానమునకు నాకత్యాశ్చర్యము కలిగినది. మనపురాణములలోని రహల్యములన్ని యాయాఁడుదాని కెట్లుతెలిసినవో! శ్రీరాములవారికి తరువాతనేనొక్కఁడనుదక్క భరతఖండవాసులు మఱియెవ్వరును లంకాద్వీపమునకు వచ్చియున్నట్లు నేనువినియుండలేదు. ఇఁకనెవ్వరీమెకీగాధను జెప్పియుందురు? ప్రపంచమునందంతటను లోకానుగ్రహాధముగా తిరుగుచుండెడు హిమాలయభ్రాతలయిన మహాత్ములెవ్వరోయీమెను శిష్యురాలినిగా నంగీకరించిగుప్తవిద్య నీమెకుపదేశించియుందురు.ఇది నిశ్చయముకాకపోయినయెడల లంకాద్వీపములో నంతగ పురములయందుండెడు రాజకన్యకిట్టి శాస్త్రమర్మము లెట్లుతెలియును? ఎటువంటిమహాత్ములు చెప్పినను పరదేశస్థులకు మనవారిమహిమలు నవిస్తరముగాఁదెలియవు. ఈమె చెప్పున విషయములలో నెన్నో ప్రమాదవచనములున్నవి. ఊర్వశినిజూచుటచేతస్నానము చేయుచున్నవిభండక మహషికిజలములో వీర్యపతన మగుటయు లేఁడియానీరుత్రాగి గర్భముధరించి బుశ్యశృంగునికనుటయు తెలిసికోలేక విభండకుఁడు లేఁడినిపొందినట్లుచెప్పినది. బుక్షవిరజుఁడునీటిలో మునిఁగివానరస్త్రీ యైనప్పుడింద్రసూర్యులుకామించినకధ తెలియకవారు పురుషరూపముతోనున్న బుక్షవిరజునినే కామించినట్లు చెప్పినది.ఇట్టివ్యత్యాసములనుగూర్చి నాలోనేనా లోచించుకొనుచుండఁగా వారాక్షసాంగన కొంతసేపూరకుండిమరల ప్రశ్నలువేయుట కారంభించినది. సత్యరాజా పూర్వదేశయాత్రలు

త్రిజ- ఓమునీంద్రా! నేనడిగినదానికి ప్రత్యుత్తరముచెప్పక మౌనము ధరించియూరకిన్నావేమి? శ్రీఘ్రముగా సమ్మతిని తెలుపునదుత్తరమును జెప్పుము.


సత్య-నేనేమనియుత్తరముచెప్పగలను? వారు మహషులును దేవతలునయినందున వారికెట్టి పనికయిననుసామర్ధ్యముకలిగినది. మనిష్యమాత్రుఁడనయిననాకెట్లుకలుగును?

త్రిజ- నీవునిజముగా మనుష్యుఁడవయినను సందేహింప వలసినపనిలేదు. రాక్షసస్త్రీలను వివాహము చేసికొన్నమనుష్యులును మీలోననేకులున్నారు. భీముఁడు హిడింబయనురాక్షసితో సంభోగించి ఘటోత్కచునిగనెను.ప్రద్యుమ్నుఁడు వజ్రనాభదైత్యునికూఁతురైన ప్రభావతిని బొందిపుత్రునిగనెను. అనిరుద్ధుఁడు బాణానురపుత్రియైన యుషాకన్యనువరించెను.ఇఁక మాఱుమాటాడకస్థూలరూపమును ధరించినన్ను కృతాధురాలిని జేయుము.కామరూపములను ధరించి యిష్టకామోపభోగములను పొందిన మీఋషుల మహిమలు నాకపారముగాఁదెలియును.

సత్య-పూర్వకాలపు మహర్షులవద్దనే కానియిప్పటి వారి కటువంటిశక్తులులేవు. కామరూపమును వహించు సామర్ధ్యము నావద్దలేదు.

త్రిజ-నీమాటనేనునమ్మను; ఆలస్యముచెసి స్త్రీహత్య కొడిగట్టక స్థూలరూపమునుపొందుము. తెల్లవాఱఁబోవుచున్నది.మంచిమాటలచేత నాప్రాధననువివనిపక్షమున బలాత్కారముగానైన నామనోరధము తీర్చుకొనెదను కొన్నిదినముల క్రిందటనీవుదీఘరోమునిగర్భములోఁ జొచ్చివెక్కసముగా పెరిగి పొట్టచీల్చుకొని పయికీవచ్చినకధనేను వినలేదనుకొన్నావా? ఇఁకనావద్ద నీమాయమాటలు మాని నీకామరూపమహిమచేత స్థూలాకారమును ధరింపుము.
లంకాద్వీపము


అపడు నాకేమిచేయుటకును తోఁచలేదు. బ్రాహ్మణులకు రాక్షసస్త్రీని గాంధర్వవివాహమున కలియుగమునందు స్వీకరింపవచ్చునా యన్నధర్మసందేహమొక్కటి నామనస్సును భాధింపఁజొచ్చినది; రాక్షస స్త్రీలను వరించిన భీమాదులకు క్షత్రియులు; అది ద్వాపరయుగము. ఈ ధర్మ సందేహమును విడిచి లంకాద్వీపమునందు మన ధర్మ శాస్త్రముతో పని లేదని యంగీకరించి యొప్పు కొన్నను, మనదేశము నందలి గ్రామ దేవతలను సహితమును పొత్తులలోని చంటిపిల్లలనుగా గణింపఁదగినంత మహాకాయము గల యీ రాక్షిసిని వరుఁడు కాఁదగినంత పొడుగు నేనెట్లెదుగఁగలను ? ఆ చిన్నది యిది గాంధర్వవివాహమని చెప్పుచున్నను నాద్రష్టికిది కేవల రాక్షస వివాహముగాఁ బొడకట్టుచున్నది. మన దేశములో కన్యను పరుసెత్తుకొని పోవుట ధర్మము; ఈ రక్షస వివాహమున కన్యయే వరుడెత్తుకొని వచ్చుట తటస్ధించినది. హా! నేనేమి చేయుదును ? కామ దేవుఁడు కల్పించిన యీయాపద నెట్లు తప్పించు కొందును ? ఏంతచదువుకొన్నను స్త్రీలబుద్ధి యెప్పుడును పెడదారినే పోవునుగదా? మహా విద్వాంసులారా! ఈ చిన్న దానికి నన్ను తనంత స్ధూలరూపము వహించుమని నిర్బంధించుటయే కాని తాను నాకుఁదగిన సూక్ష్మరూపమును ధరింపవలెనన్న యాలోచన తోఁచినదికాదు. ఇక్కడ నింకొక ధర్మసూక్ష్మత యున్నది. రతిసమయమునందు స్త్రీలు నిజరూపమున పొందుదురని పెద్దలు చెప్పుదురు. అది యాలోచించియే యీమెనన్ను స్ధూల రూపము పొందుమని నిర్బంధించుచున్నదేమో! రాక్షస విగ్రహములుగల హిడింబాదులను పొందునప్పుడు భీమాదు లేమిచేసిరో! ఓభరతఖండవాసులారా! మనుష్యులైన భీమదులే పెరిగి రాక్షస రూపమును ధరించిరో, రాక్షసులైన హిడింబాదులే చిక్కి మనుష్యరూపమును ధరించిరో, పురాణములను శోధించి నాకు తెలుపుఁడు;

సత్యరాజా పూర్వదేశయాత్రలు

నేనీమాట లనుకొనుచుండఁగా త్రిజట నామీఁద చేయివేసి వేగిరము స్థూలరూపము పొందుమని నన్ను నొక్కెను. అప్పుడు నా బ్రతుకు సింహపుపెండ్లికొడుకు కాలిక్రిందఁ బడి నలిగిన యెలుక పెండ్లి కూతురుబ్రతుకు కాఁగా, ఆనఖక్షతమునకు సహింపలేక నేను బావురని పెద్దపెట్టున నేడ్చితిని. ఆశూఁత విని వెలుపలినుండి యెవ్వరో " అమ్మాయీ ; ఆపిల్లికూఁత యెక్కడిది? " అనియడిగిరి. ఏమియులేదని చెప్పి త్రిజట యెవ్వరైనను వచ్చిచూచిపోదు రన్న భయముచేతఁ గాఁబోలును నన్ను మంచముమీఁదినుండి దింపి గోడమూలనున్న మందసము తాళముతీసి నన్నందులోఁబెట్టి మరల తాళమువేసెను. ఆ మందసము చిన్న గదియంత యున్నది. తాళముచెవి పెట్టురంధ్రము గవాక్షమంత యున్నందున్న లోపలికి తగినగాలి వచ్చు చుండుటచేత నేనాయాస పడక యొకబట్ట మడతమీఁద నొరగి కొచెముచేపు నిద్రపోయినాను.ఆనిద్రలో మహాకాయముగల వానరమొకటివచ్చి నన్నీడ్చుకొని పోవుచున్నట్లు కలగని యులికిపడిలేచితిని.స్వప్నములో కోఁతినిగాని వరాహమునుగాని చూచినపక్షమున భయముకలుగునని స్వప్నశాస్త్రాభిజ్నులగు పెద్దలు చెప్పుదురు గదా! ఈ కలవేకువజామున వచ్చినదగుటచేనెలదినములలోనే దానిఫలము కలుగునని నేను మఱింత భయపడఁజొచ్చితిని."దుస్స్వప్నే దుర్జనస్పర్శే స్నానమేవ విధీయతే" యన్న శాస్త్రప్రకారముగా స్నానము చేయవలెనన్నను పెట్టెలో మూయఁబడి యుండుటచే నాకదియు సాధ్యమైనదికాదు.

శ్లో.రామం స్కంధం హనూమంతం వైనతేయం వృకోదరం
శయనే యః స్మరేన్నిత్యం దుస్స్వప్నం తస్య నశ్యతి.
అన్నశ్లోకమును నేను రాత్రి పరుండఁబోవున్నప్పుడు పఠింప మఱచి పోయిన దోషముచేత నాకీదుస్స్వప్నము సంప్రాప్తమయినది. కామరూవులయిన రాక్షసులయొక్క యీదేశమునందు దీనికేమి ప్రతిక్రియ లంకాద్వీపము

చేయవలెనో తెలియకున్నది; ఈపెట్టెలోనుండి ముందుగా నీవలనఁబడినఁగదా తరువాత ప్రతిక్రియమాట యాలోచింపవలెను? నాశత్రువు లెవ్వ రేరూపమును ధరించివచ్చి నా కేయవాయమును సేయు దురోయని వాయుల్లము తల్లడిల్లుచున్నది. హా: దైవమా: ఏమిచేయుదును? కామరూపమునుపొందు శక్తిని మాభరతఖండవాసుల కెప్పుడును ప్రసాదింపకుము. ఈకామరూపధారణము దుష్టులకు మాయవేషములు వేసుకొనివచ్చి సాధువులకు హానిచేయుట కొఱకేకాని మంచివారి కేసత్కార్యములు చేయుటకొఱకును నావశ్యకమైనది కాదని నాకిప్పుడనుభవము వలనఁ దెలియుచున్నది.

ఏడవ ప్రకరణము.

ఆ పెట్టెలోనే నొకబట్టమడతమీఁద గూరుచుండి పైని చెప్పినట్లు నాలోనే నాలోచించుకొనుచుండఁగా నేదో తేల్లుకుట్టినట్టు నావడ్డిమీఁద నొకపోటుపొడినది. ఆపోటుతో నాధ్యానమంతయు చెడినందున నిప్పుతొక్కిన క్రోఁతివలె నొక్క యెగిరెగిరి యులికిపడి లేచి నాలుగుమూలలను గంతులువైచుచునిది యాదుస్స్వప్న ఫలమని భయపడుచు ముందుకు తిరిగిచూచునప్పటికి నాకన్నులయెదుట మన మూవకమంత జంతువొకటి మహాభయంకరముగా కానఁబడెను. అది యెలుకవలెనున్నను దానికి తోఁకగాని వెనుకవైపున కాళ్ళుగాని యేమియులేవు, అవయవరహితమై తోలుకప్పిన యెముకలులేని నల్లని మాంసపుమద్దవలె నున్న యాచరమకాయమే దానిశరీరములో నాలుగింట మూఁడువంతులున్నది: ద్రాక్షసారాయము పోసిన తోలుతిత్తివలె