కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు/శుద్ధాంధ్రభారతసంగ్రహము-తృతీయాశ్వాసము

తృతీయాశ్వాసము

క. తలఁవులచేతను మఱియుం
బలుకులచే నందరానివాఁడ వయి జగ
మ్ముల నెల్లెడ లోవలను
నెవలుపలను న్నిండియుండి వెలిఁగెడువేల్పా.

వ. శౌనకుండు మొదలుగాఁగల తపనుల కాసూతుం డవ్వలికత నిట్లు
చెప్పందొడంగె.

సీ. కొడుకులు చుట్టముల్ పుడమియేలికలును
బ్రెగడలు మొదలుగాఁ బేరుగలుగు
వారెల్లఁగూలిన వగఁగూరి ధృతరాష్టౄఁ
డడలుచు సెజ్జపైఁ బడికరంబు
సొమ్మవోయియు లేచి జొటజొటఁ గన్నీరు
వఱదలుగట్టంగ వనరుచుండ
విదురుఁడు వ్యాసుండు వెనుక సంజయుఁడును
నెంజలి దీఱిచి నెమ్మదిగను
బొలికలనిఁజూడరమ్మని పలుకుటయును
గొంతియును నాలుఁగోడండ్రుఁ గూడిరాఁగ
వచ్చెనంత యుధిష్టిరుఁ డచ్చెరువుగఁ
దమ్ములను దోడుకొని పెదతండ్రిఁ గదిసె.

ఆ. కదిసి తండ్రికెఱఁగి గాంధారికిని మొక్కి
తక్కుగలుగువారిఁదగఁగఁగాంచి
తియ్యమాటలాడి నెయ్యంబుఁ గడుఁజూపి
కఱ్రియన్న వారి కనలు మాంచె.

తృతీయాశ్వాసము

తే.ఆఁవుకొన్ననునాఁగక యంతకంత
కడరి మదిఁబొంగి పొరలెడునలుకకతన
జమునిపట్టినిదిట్టంగఁజలముపూని
నట్టిగాంధారి నోదార్చె వ్యాసుఁడపుడు.

క.వడముడియును గాంధారికిఁ
గడుఁదీవులు పుట్టునట్టుగా మఱుమాటల్
నొడివి యడంకువ నాయమ
యెడఁదం గలయట్టి కినుక నెల్లను నుడిపెన్.

ఉ.అత్తఱి నామెయానతిని నన్నయుఁదమ్ములు ద్రోవదింగడుం
బత్తిని వెంటఁబెట్టుకొని పాండుకొమారులు తల్లి పాలికిం
గుత్తుకబంటి నెవ్వగలఁగూరి చనంగఁగొమాళ్ళ నెల్లఁ దా
నెత్తికవుంగిలించుకొని యేడ్చె నొకించుకసేపు గొంతియొ౯.

 క.అటుపిమ్మట నడుగులఁబడి
పొటపొటఁగన్నీరుజాఱి బుగ్గలుతడియ౯
గటకటఁఁబడు కోడలి మి
క్కుటముగ నూరార్చి యాపె కుందుడిగించె౯.

సీ.అంతవారందఱు నడలెల్ల విడనాడి
           సరగ నెయ్యంపు ముచ్చటలు నెఱసి
చిట్టపక్కంబులు చుట్టును నడనేర
           వెడలి యందఱు నొక్క పెట్టగాఁగ
ధృతరాఘ్టృ కడఁజేరి తెఱవలు నెయ్యురు
           బంటులు వెను వెంటనంటి రాఁగ
నెల్లవారును గూడి యల్లన నాలంపు
            నేలకు నడిచిరి చాలఁదాల్మి

శుద్ధాంధ్రభారతసంగ్రహము


నెదురఁ బీనుంగులయియున్న యేనుఁగులను
తఱుచు తప్పించుకొనుచును తఱినిగూలి
తిట్టలయియున్న వార్వంపు టట్టగములఁ
ద్రోచికొంచును జని రందుఁద్రోవఁగనక.

క.అప్పుడు గాంధారి యనిం
గుప్పలుగాఁ గూలిపడిన కొడుకులు మొదలౌ
గొప్పవలంతులఁ గనుఁగొని
దెప్పరముగ నిట్లుపెక్కు దెఱఁగులనేడ్చె౯.

సీ.పలుమానికపుఁగోళ్ల పసిడి

తృతీయాశ్వాసము


<poem>తరల.పరఁగ నాఁడటు జూదముక్కటి పన్ని యాడి యుధిష్టిరున్

సరగ లోఁగొని యన్నియుం గొనఁజాలి యక్కట యిప్పుడీ
దురవుజూదమునందు నేరుపుతోఁచ కూకర యోడి మ
చ్చరము హెచ్చఁగ మాద్రిపట్టి కొసంగితే శకునీ యొడల్.

సీ.దుస్సల నిమ్మాడ్కి దొసఁగులపా ల్సేసి

                  చనితివే మముఁబాసి  సైంధవుండ
నినునమ్ము దుర్యోధనునకుఁగా నునుఱులు
                  తొఱఁగితే ద్రోణుండ తోడువచ్చి
యొజ్జలంచునునై న నొక్కింతమోమోట
                  మెన్నక కెడసి రే నిన్ను నేఁడు
మఱచెనొకో మేనమా మనుమాటయు
                 శల్యుండనినుఁజంపు జమునిపట్టి

తండ్రిపోయిన బిడ్డలఁ దగఁగఁ బెంచి

చదువుసాములు చెప్పించి సొకినట్టి
నిన్నుఁబడనేయఁజేయాడెనె యకటకట
పాండుని కొమాళ్ళకోయి భీఘ్మండయిట్లు.

వ.మఱియు నప్పొలికలనియందు.

సీ.మడిసినమగల పై ఁబడి సొమ్మసిలి లేచి

                  యార్పులు మినుముట్ట నఱచువారుఁ
బొలిసిన చెలికాండ్రు దిలకించి కస్తిమైఁ
                  బుడమిమీఁదను బడి పొరలువారుఁ
గన్న బిడ్డలమేను గాకులు పొడునంగఁ
                 గనలేక యెద మోఁదు కొనెడువారుఁ
జాఁనకట్టుగఁబడ్డ సై దోడులను గాంచి
               యెడఁద వ్రయ్యలువాఱి నేడ్చువారు శుద్ధాంద్రభారతసంగ్రహము


నగుచువగచెడు మగువల యడలు టులివు
పుడమియును నాకసంబును ముంచుకొనియె
నేమిచెప్పుదు నదిగన్న నెట్టిరాతి
గుండెవానికి వగ పుట్టకుండ దపుడు.

కే.అప్పుడెంతయుగాంధారి యలుకవొడమి
యిట్టికీడులుమూఁడుట కెల్లఁగుదురు
వెన్నుఁడేయని యాతని తెన్నుదిరిగి
యిట్టలతిట్టెఁగడుఁబెద్దయెలుఁగుతోడ.

క.నేఁటికి ముప్పదియాఱవ!యేఁటను నొండొరులనెదిరి యీతీరుననే
యోటరుదురు నీవారలు!గీటడఁగెద వీవు నట్ల కీడ్పడి యొంటిన్.

ఆ.వీనులారవినియువెన్నుఁడాపలుకుల!కించుకయుఁ దలంక కిట్టు లనియె

మునుపె తిట్టిరిట్లు కినుకను జడదారు!లిప్పుడిందుఁగ్రొత్తయేమిగలదు.

క.ఐనను నన్నూరక యిటు!కానక తిట్టుటను నీదు గరితతనం బో
చాన కొఱఁతవడుఁగాకే!మేనియు మేలొదవఁగలదెయిందున నీకు౯.

క.ఆనినంతట ధృతరాఘ్ణం !డనిలోనం జచ్చినట్టి యలఱేండ్లకు నె
ల్లను నగ్గియియ్యజముకొడు!కునుబనిచిననాతఁడపుడెకొదలేకుండన్.

సీ.సొదలను బేర్పించి సొరిదినందఱ కగ్గి
           యిప్పించి యామీఁద నెల్లవారుఁ

దనవెంట బారులై చనుదేర జముపట్టి
           వినువాఁక కడకేగి మునిఁగి యందు
దుర్యోధనుండును దుశ్శాసనుండును
           లోనైనవారికిఁదానుఁదండ్రి
నువ్వులు నీళ్ళను నెవ్వగ నొకచోట
           వదలుచు నుండంగ వచ్చి కుంతి

తృతీయాశ్వాసము

కన్నుఁగవ నీరుకాఱంగఁ గదిసి యచట
నెల్లరు వినంగఁగర్ణుండు తొల్లి తనకుఁ
బ్రొద్దువలనను గలుగుట పొసఁగఁదెలిపి
యతనికిని వీళ్ళ విడువఁగ నతివవేఁడె.

ఉ.ఆప్పుడు గొంతిపెద్దకొడు కందఱమొందఱ నన్నకై కడుం
దెప్పరమైన నెవ్వగలఁదేలి వితాకునఁదల్లిదూఱుచుం
జెప్పెడి దేమి కర్ణునకుఁజేసెను నూవుల నీళ్ళపోఁతయుం
దప్పక కర్ణునిం దడవి తక్కినవారును గుంది రెంతయున్.

తే.పిదప మిన్నేటిగట్టునఁబెద్దదైన
గుడ్డయిల్లొండు గట్టించి గొంతికొడుకు
బుదుగులుఁజెలుల్ మొదలైనవారితోడ
మూఁడనెలలందు నిలిచెనుమురిపమెడలి

సీ.అచ్చోటి కొక్కనాఁడయ్యుధిష్టిరుఁజూడఁ
           గోరి వ్యాసుండును నారదుండు
కణ్వుండు లోనుగాఁగలిగిన జడదారు
             లరుదేర నెదురుగా నరిగివారిఁ
గొనివచ్చి మరియాద లొనరించి యందఱ
              నొగిఁబీఁటలను గూరుచుండఁబెట్టి
యడుగులఁబడి లేచి యందఱసేమంబు
               లారసి వేర్వేఱ యపుడు జముని

పట్టిచేదోయి జోడించి యిట్టులనియె,
నేను జచ్చిన వారికి నీళ్ళవదలు
నప్పు డమ్మ కర్ణుండు నాకన్న యంచుఁ,
జెప్పె నప్పటినుండియునొప్పదఱిఁగి.

శుద్ధా౦ధ్రభారతస౦గ్రహము


క.ఉల్ల్ల౦ బె౦తయు నడలెడుఁ
దల్లియె నాకిట్టీవెతను దారిచె నటా
బల్లిచు నన్నరు జ౦పుక
యెల్లర ముెగములను ని౦క నే నెటు చూతుక్

తృతీయా శ్వాసము


సీ. చెప్పక కర్ణుని చొప్పును దాఁచిన
తనతల్లి నేమియు ననఁగలేక
యిఁక ముందు పుడమిలో నేకతమెప్పుడు
తలిరుఁబోఁడులవద్ద దాఁగకుండుఁ
గాకయంచును నల్క గడలుకొనగ దిట్టి
కాయగూరలు దించుఁ గానలందుఁ
దానుందునని లేవఁ దమ్ములు ద్రోవది
పెక్కువగలఁ దెల్ప బెడవెవులను

బెట్టి పట్టిన పట్టును విడువకుండె
నంత జడదారు లందఱు ననువుమీఱఁ
బలుదెఱంగుల నాయముల్ పలికి మదికి
హత్త నూఱిపోసినఁగొంతమె త్తనయ్యె.

క. జడదారిదొరల నుడువుల
నెడఁదం గల కలఁక తొలఁగి యీకొనెఁగడకున్
బుడమిం గైకొనియేలఁగ,
నడవుల కేగెడితలంపు లడుగంటంగన్.

చ. తపనులు చుట్టముల్ చెలులుఁ దమ్ములునుం బెదతండ్రి తోడ రా
నపుడ యుధిష్ఠిరుండు తగ నచ్చటువెల్వడి వీడుచేర న
చ్చపుఁ దెలివిం జనెం బజలు సంతసమారఁగభీమునన్న తా
నెపు డరుదెంచు మమ్ము నెపుడేలు నటంచును గాచియుండఁగన్.

వ. మఱియు నంతకుముంగలన యయ్యూరిచార లంతయువిని తంతం తనరాని సంతసంబున.

సీ. కమ్మకస్తురినీటఁ గలయంపి చల్లించి
ముత్యాలమ్రుగ్గులు మొగి నమర్చి
యపరంజికంబాల నరఁటిచెట్లను గట్టి
క్రొమ్మావిదోరణా లిమ్మువఱిచి

శుద్ధాంధ్రభారతసంగ్రహము


కురువేళ్ల పందిళ్లు కొమరొప్ప చేయించి
సరిగంచుచందువాల్ జతనుపఱిచి
నెత్తావిగల పూచుటెత్తులు గట్టించి
యగరువత్తులతావి పొగలువెట్టి
 ప్రోలు గై సేసి రంతటఁబొలువుమీఱ
వెన్నుడును దమ్ములిల్లాలు వెంటరాఁగఁ
బుడమివేల్పులు దీవెన లిడుచునడవ
వేడ్కతో యుధిష్ఠిరుఁడల్లవీడు సొచ్చె.

క. చివురుంబోఁడులు మేడల
చివరల నందముగ నిల్చి చేతులనిండం
బువులుగురియంగ దొరయును
దవుమాడ్కిని దెరువుదాఁటి దఱిసెం గొలువున్.

క. ముత్తైదువలు నివాళుల
న త్తఱిఁ బాటలను బాడి యలరుచు నియ్యం
జొత్తెంచెఁ గొలువుఁ గూటము
తత్తరమునఁ గొంతికొడుకు తద్దయు నెలమిన్.

తే. వెదకి యవ్వీటిజోస్యులు వెట్టినట్టి
మంచిమూర్తంబునందును మించువేడ్క
దొరతనంబును బూనెను సరసనున్న
తనను లొక్కటదీవింపఁదనరి ఱేఁడు.

ఉ. అమ్మెయిఁ బూనఁ దెమ్మెరలు నల్లనఁ బల్మఱు వీచె చేలుపుం
గొమ్ములు క్రుమ్మరించి రొగిఁ గ్రొన్ననమొత్తము నేలవేల్పు లొ
క్కుమ్మడి సేనఁబ్రాలు పయి నూరక చల్లిరి కాఁపు లెల్లరున్
నెమ్మదులందు నంతసము నిల్పి రతం డటు నేలఁ దాల్చుటన్.

తృతీయా శ్వాసము

క. కాఁపుల కెల్లను నేమము
      లేపట్టునఁ గొఱఁతవడక యెలమి యొసంగన్
      గాపాడుచు నందఱు నొక
       రూపునఁ జూచుచు యుధిష్ఠిరుం డరసెఁబజన్.

తే. ఇట్లు కొన్నాళ్లు నేలను నేలుచుండి
       డెందమూఱటఁ జెందక కుందుచుండఁ
       గలఁకవోఁ గృష్ణుఁగనిపాడిగఱపవేఁడ
       నతఁడు కొనిపోయె భీష్ముని యండకతని.

ఉ. తమ్ముల వెంటఁగొం చరిగి తాతనుగన్గొని ఱేఁడు మ్రొక్కఁదా
       నమ్ములపాంపునందు వెతలందుచు నుండియు వెన్నుమన్ననన్
        నెమ్మదిఁ జెంది మన్మలకు నెట్టన దీవెనలిచ్చి యోలిమై
        నిమ్ములఁ దెల్పెఁబాఁడికత లిట్లని భీష్ముఁడు భీము నన్నకున్.

క. కాఁపుల నొప్పింపక తా
      నేపట్టున రవ్వపడక యెల్లరు మెచ్చం
      గాఁపులవలనను బన్నుల
      నోపికతోఁ గొనఁగ వలయు నొడయం డెవుడున్.

క. పుడమిఁ దనకంటె బలియునిఁ
       దొడరిన నెగ్గగును గాన దొరయగువాఁడా
       యొడయనితోడను బొందే
        యొడఁగూర్పఁగవలయుఁజాల నుపమయొసంగన్.

క. దండుల నని లేనవుడును,
       మెండుగ నుంచుకొను చెవుడు మెలఁ కువతోఁ దా
       నుండంగావలె నెకిమీఁ,
       డొండు దొరతనంపువింత లొప్పుగఁగనుచున్.

శుద్ధాంధ్రభారతసంగ్రహము

క. మ్రుచ్చులవెత లేకుండఁగ,
      నిచ్చలుఁ బరికించి యెందు నెఱి చెడకుండన్
      హెచ్చుగఁ గాఁపుల మేలును,
       నచ్చుపడం బుడమియేలి కారయ వలయున్.

క. కలిమియుఁ జదువును జాలం,
       గలిగినచో మిడిసిపడక కడు నడఁకువతో
        మెలఁగం జను నెల్లరకును,
         దలకూడును బేరుఁ బెంపుఁ దద్దయు దానన్.

క. చాలఁగఁగీ డగనుపుడును, దాలిమియేపూనవలయుఁదప్పక దానన్
      మేలిమి చెందును మానిసి, నేలంగలవారిలోన నెగులర యడఁగన్

క. నవ్వులకు నై ననుం దగ, దెవ్వనికిని నొప్పి నించుకేనియుఁ జేయన్
      గవ్వల యాటల నైనను, గ్రొవ్వున దబ్బఱలనాడఁ గూడదుసుమ్మీ.

క. కలదానిలోనె చాగము,
      నలువుచు నిచ్చలును బీదసాదల నరయన్
       వలయును దనచేత నయిన,
       కొలఁదిని నొరులకును మేలుగూర్పఁగ వలయున్.

క. ఒరు లొనరించినమేలును,
       గరువంబున మఱవరాదు కలలో నైనన్
       దొరపడి చీటికిమాటికిఁ,
        బొరయం దగ దలుక దానఁ బొదువును జేటుల్.

క. ఒరులేవి తనకుఁజేయఁగ, నరయన్మదిఁ గోరుచుండు నయ్యవియే తా
      నొరులకుఁజేయఁగ వలయును, దిరముగఁదామేలు సెదెందఁదివిరేడునేనిన్

తే. మఱియుమిగిలిననాయంపుఁదెఱగులెల్ల,
       మదికీనాటంగఁదెలిపెనుమనుమనికిని
        భీష్ముఁ డప్పుడచ్చోటికి వేడ్కమీఱఁ,
         దపసిఱేఁడులువచ్చి రాతనిని జూడ.

తృతీయా శ్వాసము

తరల. అచటివారలచేత గారవమంది యాజడదారులున్
ముచటదీఱఁగ నందు వెన్నుని మోడ్పుఁగన్నులఁ జూచి వేఁ
డుచును దద్దయుఁ బ్రొద్దుపుచ్చి కడుం గడుం జముపట్టితో
నెచటనుం గనరాని నాయములెల్లఁ జెప్పిరి కూరిమిన్.

తే. పిదప భీష్ముండుమనుమని వెరవుమీఱఁ,
      బున్నెములజాడలను దెల్పిబుజ్జగించి
      ప్రోలికంచెను వ్యాలుపంపునను నంత,
      నుండి పదియేను నాళ్లతఁ డూరనుండి.

ఉ. ఆవలఁ దోడఁబుట్టువులు నందలిపెద్దలు నూరిపాఱులున్
       బావయుఁ జుట్ట్టముల్ గొలుచువారలునుం బెదతండ్రితల్లియుం
       బ్రోవులుగట్టి వెంబడిని బోరనరాఁగ యుధిష్ఠిరుండు న
       త్తావున కేగుదెంచెఁ దనతాతను గ్రమ్మఱఁ జూచువేడుకన్.

క. ఏతెంచి జోతచేయుడు
      నాతండును మోడ్చుఁగన్ను లరతెఱచి వడిం
       జేతుల నిమురుచు మనుమని
        నాతఱి దీవించి యిట్టులనె ధృతరాష్ట్రున్.

క. కొడుకులపోకకు మది వగ
      గుడువకు మించుకయు నీదు కొదవల నెల్లం
      గడువడి నుడుపు యుధిష్ఠిరుఁ
       డడలక యీతనినె నమ్ముమన్నిటికింకన్

ఆ. అనుచుఁ జెప్పి పిదప నందఱి సేమంబు,
        లరసి కనులు మొగిచి యబ్బురముగ
         మొదలుఁదుదియులేని మొనవేల్పుమదినిల్పి,
          విన్ను వాఁకకొడుకువిడిచెనునుఱు.

శుద్ధాంధ్రభారతసంగ్రహము

ఆ. కొంతసేపు తాత కొఱకును జముపట్టి, కనుల నీరుసించి కళవళించి
వెనుకఁ బెద్దవారి పనుపున నతనికి, నగ్గిపనులు దీర్చెనడలుతోడ.

మ. వెనుకన్ భీమునియన్న తాతకును దానిన్నేటిలో నూవులన్
వనటఁబొందుచు నీళ్లతో వదలియానాఁడేటినిం దాఁటి త్రో
వను నన్నం దనతాతఁ జంపుటకుఁగా వంతం గడుం బొంది కా
ననునుండం జనువాఁడనంచుఁబలుకన్ వ్యాలుండనుం గృష్ణుఁడున్.

తే. పలుదెఱంగులఁ దాల్మిమాటలనుగఱపి,
యింటికియుధిష్ఠిరుని దెచ్చి రెట్ట కేల
కంతవ్యాసుండు జముపట్టి ననువుమీఱ,
వారువపుజన్న మొనరింప నేఱుపఱిచె.

క. పోరున దాయల నటువలె, దోరించిన దోసమెల్లఁ దొలఁగును నీకున్
వారువవు బన్నమున నని, ప్రేరేప యుధిష్ఠిరుండు వెతదిగఁ ద్రావెన్

వనమయూరము. కవ్వడిని గుఱ్ఱమును గావఁగను బంచెన్
నెవ్వడిని జన్నమును నివ్వటిలఁ జేయున్
నవ్వుచును వెన్నువిని వగతాలిమిని దాల్చెన్.

మత్తకోకిల. అన్నపంపునఁ క్రీడి విల్లును నమ్ములుం దనరారఁగన్
దిన్నఁగా నల మావువోయిన తెన్నునం జనుచుండఁగా
మున్నుగా నరుదెంచి జక్కివి మోఁది పట్టు త్రిగ ర్తలం
జిన్నపోరున గెల్చి చెచ్చెరఁ జేరె నొండు విలాతికిన్.

శా. అంతం దత్తడి పోయిపోయి గరువం బారువం బారంగఁ బ్రాగ్జ్యోతిషం
బెంతో నైళమ చేరెఁ జేరుటయు నప్డే వజ్రదంతుండు దా
నంతోసంబున వచ్చి పట్టుకొనియెం జక్కిం జలం బొప్పఁగాఁ
బొంతం గవ్వడి వచ్చి తాఁకెనతనిం బోటొగ్గి వాల్దూపులన్.

తృతీయా శ్వాసము

 క. భగదత్తుని కొమరునితోఁ,
     దగఁబోరాటంబు సల్పి తనదుమగఁటిమి౯
     బొగడఁగ జేజేల్ గవ్వదడి,
     తెగువం గౌరును నడంచిం తెరలిచె నతనిన్.
   
 తే. అపుడు జన్నంబు చూడరానతనిఁబిలిచి,
    వారువము వెంట నచ్చొటువసిక్రిడి
    చేరె లాత్రివిలాతిని సింధువ నెడు,
    పేర ఁబరఁగెడుదానినిఁ బెంపుమిగుల.
 క.

తనతండ్రిఁ జంపినాతఁడు
చనుదెంచె ననంగ గుండె జల్లనవినిగ్ర
క్కున నునుఱులు విడిచెను నిం
టనె స్తెంధవునికొమరుఁడు దిటం బెడలంగన్.
 
తే. అతనికొడుకును నెత్తికొం చచటి కపుడు
    వచ్చి దుస్సల వివ్వచ్చు పజ్జ నిలిచి
    బుడుత నాతని కాళ్ల పై ఁబడఁగవై చి
    కన్నులను నీరు కాల్వలుగట్ట పనియె.

శుద్ధాంధ్రభారత సంగ్రాహము

క. అననక్కటికంబెడలోఁ

బెనగొన జెల్లెలిని నెత్తి బిగికవుబింటం
బెనచి కడుం అగారవమునఁ
దనుపుచు నూరార్చి మంచితనమున ననియెన్.

క. అమ్మా నీవేమియు డెం! దమ్మున నందురక వీని దగ గొంచును నీ

నిమ్ములనింటికి నరుగుము! కొమ్మా నేబోయివత్తు గొఱ తెన్నకుమా.

క. అనివారునంబు వెంటను ! జనగానదియు మణలూరు దక్కిని నతనిం

గొనిపోయె గ్రీడి రాకను ! విని యెంతయు సంతసించి వేడుకతోడన్.

చ. కవ్వడింకిం జిత్రాంగ దవలనం గలిగి యెవ్వరుం దనకు సాటి రాకుండ

నిండు మగంటిమి నవ్వీడేలుచుండు బభ్ర్రువాహనుండు

తే. ఎదురుగా వచ్చి కాళ్లకు నెరగి లేచి

యోరనిలుచుండు నాతని దారి గనక
చిన్నపుచ్చిన నలుకయు సిగ్గుగదురఁ
దండ్రితో నాల మొనరింప దలచి నిలచి.

క. పన్నికొనివచ్చి దండుల ! నన్నిటితోడను నెదిర్చి యాలము చేసెన్

వెన్నీకలబభ్రువహనుఁ ! డెన్ని యొవాలమ్ము లతిని యెద నాటంగన్.

సీ. చెచ్చెరఁ దనమీద జిచ్చఱమును నేయ

నీటితూపున దాని నోటు వఱిచి
చలము డింపక పూని మలయలగును నేయ
మగఱాతి వాల్కోలమరలజేసి
మానవి కినుకలో మబ్బుముల్కి నిగుడ్పు
గాలితూపున దానిఁ గ్రమ్మఱంచి
చిఱువిసంబును గ్రక్కు చిలునకోలను దార్ప
గరిడితూపున దానిగండడంచి
తృతీయా శ్వాసము
వేలుపులు మెచ్చఁ బోరాడి వెనుకగ్రీడి
బభ్రువాహనుతూపున బడియెనేల
నంతఁ జిత్రాంగదయువచ్చి యడల దొడఁగెఁ
గొడుకుదూఱుచు మగనిపై ఁబడి కడంగి.

తే. క్రన్నననులూచి పాపజగమ్మునుండి,

మందుగొనివచ్చియిచ్చిన నందముగను
లేచికూర్చుండె గవ్వ్డిచూచి యెల్ల
వారుమరలఁ జచ్చినవాడు బ్రతికెనంచు.

ఆ. తలచి సంతసిలిరి తర్వాత గొడుకును ! దండ్రి కాళ్ళ వ్రాలితడవునిలిచి

తప్పుసైపవేడ దటుకున నక్కున ! గదియు జేర్చి పట్టి గౌరవించె.

చ. అటుపిదపం గొమార నల రాగంగ వీడ్కొని యొండుచోడికిం

దటుకున బోయి కానలను దత్తడితోడను జొచ్చి యేఱులన్
దిటమున దాటి యెండకునుదెమ్మకు నోర్చుచు గ్రీడి కొన్ని నా
ళ్ళటునిటు నూరకే తిరుగులాడుచు గుఱ్ఱమువెంట బిమ్మటన్.

క. చొచ్చి జరాసంధునిప్రో,

లచ్చత నాతని మనుమని నాలములో ని
వ్వచ్చుడు లోగొని కానుక,
లచ్చువడం బుచ్చుకొనియె నాతనివలనన్ .

తే. పిదప గాంధార మనునేల బేర్మితోడుం ,

గ్రీడి జన్మ పుగుఱ్ఱబుతోడఁ జొచ్చి
గోర మగుపోర నచ్చటివారి నోర్చి,
వారికడసొమ్ముఁగొని వెనకవంకమరలె.

ఆ. అంతఁ గ్రీడి రాక నటమున్నె వన్నుండు,

జమునుపట్టితోడ నమరఁదెల్సె
శుద్ధాంధ్ర భారతసంగ్రాహము
సంతసంబు మీఱ జనుదెంచెఁ గ్రీడియు,
నూరునేరఁ జాల నొడమిఁ గొనుచు.

ఉ. తమ్ముని రాకకు మదిని దద్దయు నెంతస మంది యక్కునన్

నెమ్మిని గారవించి తగునేమముతోడను మావుజన్నమున్
నెమ్మది జేయగా దివితి నేలను గల్గిన జన్ని గట్లకున్
సొమ్మును గొల్లగా నొసగి చొచ్చి యుధిష్టురుడల్లజన్నయున్.

క. ఎల్లరుమెచ్చగ నొనరిచి, యుల్లము తల్లడము దీఱి యొజ్జల నీవిం

బెల్లగు మన్ననల దనిపి, యెల్లర ఁ దగవీడుకొల్పి యెలమింబొంచెన్.

తే. రహిని గాంధారికిని ధృతరాష్ట్రునకును,

బనులు సేయుచువారలబ్రాతి బడసి
కావులెల్లను దన్నెప్డు గన్నతండ్రి,
వడువుననుజూడజముపట్టి పుడామినలె.

సీ. తెల్లవారదడవ యల్లనఁ బాండుకొ

మారులు సేమంబులారయంగఁ
గొంతియు గోడండ్రుఁ గూమితోవచ్చి
పలుమాఱు నిచ్చలుఁ బనులు సేయఁ
గొలువుడు కాండ్రెల్ల నలసట యెఱుగక
కెలనగాచుక యుండికొలువుసేయ
నారగించినవెంక నరుదెంచి పాఱులు
కదలక వేడుకకతలు సెప్పఁ
గొడుకు లెల్లను బోయినకొఱత యించు
కేనికానరాకుండంగనెసగుచుండె
దానుధృతరాష్ట్రుడు డల్ల గాంధారిగూడి,
జముని కొమరుండు తగ్గినట్లు జరువుకతన.
తృతీయా శ్వాసము

క. బీదకు పాదకు బాపల, కాదటఁ దామిచ్చుచుండు రముదుపళ్ళున్

గాదనక కానునీసము, ప్రోదిగఁ గొడుకియ్య బండువులఁ బబ్బములన్.

సీ. ఇఆమాడ్కిఁ గొన్నియేం డ్లేమిటను గొఱంత

లేకుండ నచట మేలిమగనుండి
యొకనాడు ధృతరాష్ట్రుడొంటిగ వచ్చిన
జముపట్టి నొద్దకు జక్కబిలిచి
యెవ్వరు వినకుండ నేకతంబున జెప్పె
నాతండ్రి నీవుల్లు నడుపుచుండఁ
గొడుకులు గలనాటి వడూవునకంటెను
జాల మేలుగ బ్రొద్దు జరుగునాకు
నిచటి సుగముననెల్ల ను నిచ్చతీఱం ,
గుడిచినాడను నేండ్లును గడేచె జాల
నింక బెఱజగమ్మను గోరిటితపు నాకు,
నడవికినిబోయి యుండగ నానతిమ్ము.

తే. అనిసగుండేలు బ్రద్దలై యతడు కొంత

వడివితాకున బెదవులు డడ్వుకొనుచుఁ
బలుకగా లేకయెట్ట కేనెలుగు తెచ్చు,
కొనియుధిష్టిరు డలతండ్రికనియెనిట్లు.

క. మీరడవులకుం జనగా,

నేరను నేనుండ నిచట నేనునుమీతో
గారవమున వచ్చెద నిదె
యీరలు నను గూడ గొంచు నేగుడు వెంటన్

క. పోవలదని పలుదెఱగులు, గా విన్నపమును నొనర్చి కాళులమీదన్

లేవక పడగావ్యాసుడు, తా వచ్చి యుధిష్టిరుఁ గని తగనిట్లనియెన్.
శుద్ధాంధ్ర భారతసంగ్రహము

తే. అరయనీతండు పెద్దవడై నవాడు,

బలసి పుడమిపై బెక్కేండ్లు బ్రతుకబోడు
కానలోనుంట యేయింక గరము లెస్స,
యితనినంపుమియొండా డకిపుడుఱేడ.

క. అని యెట్లో యొప్పించిన, వినియందఱు నెఱిగి వచ్చి వెలవెలవోవన్

జనుదెంచి కుంతి యడవికి బనివడి తా బావనెంట బయనంబయ్యెన్

క. మానుప జాలక యామెను, గానకు గాంద్ధారి తోడ గలగకపంపం

గానొడ బడీతికొమాళ్ళును, మేనులు వడకంగానోరు మెదలు మెదలుపకోర్మిన్

సీ. అప్పుడు ధృతరాష్ట్రుడు డనిలోన మున్నట్లు

చచ్చినవారికై చాగములను
జేయంగ గోరిన జెప్ప నలవిగాని
రొక్కంబును యుధిష్టురుండొసంగ
వచ్చలవిడి నేల వేల్పులకును నిచ్చి
చెప్పి యెల్లర వద్ద సెలవువడసి
నారచీరలు గట్టి నాతిగాంధారియు
సంజయుండును గొంతి నరప విదురుఁ
డరుగు దేరంగ వెల్వడి యదవి కేగఁ
జాలదవ్వుగ నాతని సొగ నంపి
తాను దమ్ములు వీడ్కొని తల్లి నచట
వీడు చేరెను జముపట్టివెనుకవచ్చి.

మానిని. తల్లియు నాధృతరాష్ట్రుగానకు దద్దయు వేడుకతో జనగా

నులాముపల్ల టిలగను గుందుచు నొక్కట నుండి యుధిష్టిరుడున్
బెల్లుగ నారలఁ జూచెడు కోరిక వేగిరపెట్టగ దమ్ములతో
నిల్లట వెల్వడి వారల రోయుచు నేగెను నందఱు నున్నెడకున్
తృతీయా శ్వాసము

తే. ఇట్లు జను దరిలోనొక్క యెదనువిదురుఁ,

డుండె వెఱ్ఱివాడును బోలెనొప్పుదఱిగి
యతని గనియిదెనినుఁ జూడ నరుగుదెంచి,
నాడనంచుయుధిష్టిరుడు డాడునంత.

తే. బదులు పల్కక యొకచెట్టు మొదల జేరి

మీదుం చూచుచు నఫుడ మేను విడిచె
నతనికొఱకయి కొంతసే పచట నుండి
వనట జముపట్టి చనె దనవారిఁ జూడ

క. చని విదురుని చావెల్లరు,

వనఁగా జెప్పినను వారు వెత హెచ్చంగాఁ
బనవి రతనిని దలంచుచు
మునుకొని జముపట్టి యాత్రంముం జెందంగన్.

తే. వగపు లుడిగినపిమ్మట దగినకరణి,

దద్దయును వేడ్కతోనాటి ప్రొద్దుగడపి
రెల్లవారలు జడదారు లోపిక పూని చెప్ప .

క. ఈ కరణిని నొకనెలయట, నీకొని జముపట్టి నిలువ నెల్లరు నెలమిం

జేకొని కొఱంత యేమియు , లేకుండగ నుం డిరందు లియ్యముగాగన్

తే. అట్టులుండంగనొక్క నాడరుగుదెంచి ,

వ్యాసుడొక రేయియచ్చట వారితోడ ఁ
గడపిమఱునాడు ప్రొద్దునఁగదియఁ బిలిచి,
చీకు ఱేనికిహితపును జెప్పిచనియె.

తే. సాగి వ్యాసుడచ్చటినుండి చనకమున్నె,

యతనియానతిఁ దలబూని కతనమునను శుద్దాంద్రబారతసంగ్రహము
   703  

అంతధృతరాఘ్ట్రఁ డెంతయు మంతనమునఁజెంతకునుభీమునన్ననుజేరఁజీరి 105

      త. పోలుతెఱఁగున నొక్కింత బుధ్దిగఱపి
          నేర్పుమాటల నాతన నేలయేల
          నొయ్య వీటికిఁబోవంగనియ్యశొలిపి;
          యంచెఁదమ్ములతోఁగూడ నతని మరల  106
       
       క.వచ్చి యుధిష్టిరుఁడొప్పుగ,
          నిచ్చటఁగొన్నాళ్ళు నేలయేలుచు నుండన్
         వచ్చి యొకనాఁడు నారదుఁ
         డచ్చుపడం జెప్పె నంగలార్చుచునిటులక్.  107
      సీ.ఒడయండ నీవట్లు నడతెంచినంతట
                 నీతండ్రి కుంతిని నెలఁతఁగొనుచు
         వేల్సుతటేకిఁ బొంత వెలయుకానను జేరి
                 యాకుటింటను నెమ్మియలర నుండి
        మఱఁదలుఁదెఱవయు మఱివెంటఁబడిరాఁగ
                    నడవిలోనొకయెడనడచుచుండ
         గాఱుచిచ్చెల్లెదఁగ్రమ్మి మంటలు నింగి
                     ముట్టంగ నల్దెస లట్టెకవియ
           నాఁడువారును జీకును నుయునకతనఁ
          బోవఁగాలేక మూవురుఁబొలిసిరందు
          నేను నచ్చటివారిచే దీనివించు
          నరిగి చూచితిఁ బీనుంగు లైనవారి
       తే.కాలుగలవాఁడు గావునఁ గమరిపోక
సంజయు డొక్కకొండను సరగ నెక్కి 108
తృతీయాశ్వాసము
707


         వేమఱును ధృతరాఘ్ట్రచే వేఁడఁబడుచు
         నునుఱులను గాచూకొనియెఁదానొక్కరుండు. 109

      క.అని చెప్పుడునేలంబడి,
         కనుఁగొలుకులనుండి నీరు కాలువపొఱం
        గను నేడ్చెఁ దల్లిఁ దండ్రిని,
       బెనుగొంతున, దలఁచి వేర్వేఱకడున్. 110

    తే.వారలిద్దిఱికొఱకు గాంధారికొఱకు,
       మిక్కిలిగ మమ్మిలించియమ్మేటిఱేఁడు
       నారదుండూఱడించిన గారమూన,
     డెందమున నొక్కయించుక కుందువాసె. 111

  క.ధృతరాఘ్టృనకును గొంతికి, వెత గాంధారికిని వేఱువేఱుగ నగ్గుల్
    జతనుపఱిచి నూవులతో, జతనంబున నీళ్ళు విడిచిచాగములిచ్చన్
 సీ.బవరంబు నడచి యిప్పుటికిని బదునెన్మి
            దేఁడులుగడచెనొక్కింతలోన
     మఱిపదియేడేండ్లు మానుగ జముపట్టి
             పుడమినేలెను వగలెడఁద బలియ
    ముప్పుదియేనేండ్లు ముగిసిన నొకనాఁడు
          వెన్నునిఁజూచెడువేడ్కతోడ
  ద్వారక కల్లవిశ్వామిత్రుఁడును నార
           దుండును గణ్వుండుఁదొడఁగి వచ్చి

   యూరిబయలనునడయాడుచుండఁజూచి,
   దుడుకుఁదనమునవెన్నునికొడుకులెల్ల
    జాంబవతికిని బుట్టిన సాంబునకును,
    నాఁడువేసంబు నమరించి యాగడమున.113
 

. 708 శుద్ధాంధ్రభారతసంగ్రహము

 తే.కడువుతో నున్న లాగునఁగానఁబడఁ,
బుట్టములుచాలఁ బొట్టకుఁజుట్టఁబెట్టి
పలువురును గూడిచుట్టుగుంపులుగనపుడు,
నవ్వుచునువాడవాడలఁ గ్రొవ్వుమిఱ. 114

క.తిరుగుచు నా జడదారుల, సరకుఁగొనిపొయి వాని సాగిలఁబడఁగా
వేరవున నొనరిచి కడుఁబో, తరముననిట్లనిరికన్నుఁదమ్ముల నగుచున్

మధ్కాక్కర.జడదారులార యీకొమ్మ సరిగాను దొమ్మిదిలనెలల
కడుపుతోనున్నదీని కడువునఁ గూఁతు రొదవునొ
కొడుకు పుట్టునొ చెప్పుఁడయ్య కోరిక లొడఁగూడ నన్న
నొడలు మిక్కిలిమండి వార లొయ్యన నిట్లని గలుక. 116

తే.మికొలంబున కెల్లను మిత్తియైన,
పెద్దరా యొక్కఁ డీపెకు వేగఁ బుట్టుఁ,
బొండు మామాట తప్పదు పొండనంగ,
వెడలి రింటికి మోములు వెల్లవాఱ. 117

క.వారందఱు వగచుచు నిలు,
నేరం జని సాంబు కట్టుచీరను విప్పం
గా రా యొక టూడిపడెన్,
వారలయుల్లంబు లెల్ల ప్రక్కలుగాఁగన్. 118

క.పొడగిదానింగొని చని,
వడివడిఁ బొడుముగ నొనర్చి వదలక దానిం
గడలిం గలిపిరి యంతటఁ,
బొడవడఁ గెడు నంచు నెంచి పూనికి మిఱన్. 119

సీ.అట్టులు వారలఁ దిట్టినతపసుల
నోరెట్టిదో కాని నునుపుమిఱ

తృతీయాశ్వాసము
709

 
నామఱుసటినాఁడె యాచోటనెల్లను
        బెల్లుగాఁగ్రోవ్వాఁడి ఱెల్లుమెలిచెరిక ల్విడనాడి చేరి రడవి
నొకనాఁడు బలరాముఁడుద్ధవుండును బోయి
        కోరికల్విడనాడి చేరిరడని
వెన్నుండు మిలినినవీటివారల నెల్ల
      జాతరనేయంగ సంద్రమునకు
వెంటఁగొనిపోయె వారిలో వేనవేలు,
కల్లుద్రావూట మైకము గప్పి మిగుల
నొడలు తెలియక తూలుచు నొకరి నొకరు,
      తిట్టుకొంచునునూరకకొట్టుకొంచు.
ఆ.అన్నలనక తమ్ములనకండు నొండొరుల్,
తప్పుఁద్రాగి కాళ్ళఁదాఁచుకొనుచుఁ
జొంత ఱెల్లు పెఱికి చేతులకొలఁదిని,
గొట్టుకొనఁదొడఁగిరికొందఱందు.
ఉ.వారిని జూచి వారు తెగువం గలయంబడి రెండుపాయలై
నోరికొలంది నొండొరుల నూఱులు కాఱులు ప్రేలుకొంచు నె
వ్వారిని జీగికింగొనక వాఁడితనంబునఁ బోరియొడ్డునం
గోరముగాఁగ నేలపయిఁగూలుచు నీల్గిరి ఱెల్లుదెబలన్.
క.కృతవర్మయు సాత్యకియుం,బ్రతుకుల కేమియును నాసపడ కెప్పుడివో
కతలపుడు త్రవ్వుకొంచును,వితగాఁబోరాడియాడివిడిచిరి యుసుఱుల్.

క.నెఱిఁబ్రద్యుమ్నుఁడుసాంబుఁడు,
మఱియుం గలయట్టిమేటిమగల తెగలునుం
గొఱమాలిన యాలంబునఁ,
మఱివోయిరి లేనిపోని పట్టింపులచేన్.


           710


శుధ్దాంద్రభారతసంగ్రహము

క.పోరను జావఁగ మిగిలిన,
వారువముల నేనుఁగులను వరుసను గొనుచున్
ద్వారక కేగెను వెన్నుఁడు,
దోరినవారినిఁ దలంచి త్రొక్కటపడుచున్. 125

వసంతిలకము.వెన్నుండు చుట్టముల వేలకొలంది చావన్
గన్నారఁగాంచి వెతఁగవ్వడిఁజూచుకోరిన్
బన్నాంబు నొందియును బంచెను నాఁడెపోవం
జెన్నారదారకునిఁజెచ్చెరఁగ్రీడీఁదేరన్.
                                             126

ఆ.ఇట్టు లతనిఁబంపి యేమియుఁదోఁచక,
కొంతతడవు లోనఁ గుందుచుండి
కడకు నిల్లువెడలి కానుల కొక్కట,
నన్నమున్ను పోయినట్ల తాను. 127

కమలవిలసితము.
చని యడవులకును సరగనునన్నున్,
గనుఁగొని జరగినఁకతఁదెలుపంగన్
విని యతఁడు నపుడె విడిచెను మేనిన్,
వనటను మఱిమఱి పనువుచువారిన్ 128

తే. అన్న పోయినపిమ్మట వెన్నుఁడడవిఁ,
దిరుగుచెందుఁ గాల్నిలుపకదిగులుతోడఁ
జెట్టు మొదలికిమేనును జేర వైచి
యొదలు వడఁకంగఁదద్దయునడలుచుండె.

తే. కాలు గదలుట దవ్వులఁగాంచియొక్క
బోయ యది యొక్కమెకమని బుద్ధిఁదలఁచి
వింటఁబలుతూపుగూరిచి వేసెనతనిఁ
జెల్లె వెన్నుండు నాదెబ్బచేత నపుడు.



    తృతయాశ్వాసము
సీ.వెన్నునిచే నల్లు మున్ను పంపఁగఁబడి
                                  దారకుఁడరుదెంచి తగినయట్లు
 సాండునికొడుకుల దండకుఁజని వారి
                            కందఱకును జోత లమరఁజేసి
 ద్వారకలోఁగృఘ్ణ బలఁగంబు మడియుట
                             యెల్లను వగచుచు నెఱుకపఱిచి
వెన్నుండు సరగను నిన్ను ఁజూడఁగఁగోరి
                          నన్నుఁబంచెనని యర్జునునకుఁజెప్పు
 నపుడు పయనమై వినచ్చుఁడన్న యొద్ద
  సెలవు గైకొని ద్వారక చేరయందుఁ
 గృఘ్ణఁగానక వందురి కీడుమిఁది
 కీడుగా వసుదేవుడు కెడయఁజూచి
 యతనికిని నగ్గికర్జంబు లపుడ తీర్చి. 131

క.అడవులఁబడి కవ్వడి వడి,
   నడులుచుఁ జెలికానికొఱకు నందును నిందున్
   దడఁబడ నడుగులు దడవుచుఁ,
   బొడగ నెఁబీనుంగు జెట్టు మొదలనునొకచోన్. 132

తే. అట్లు కని మొదల్నఱికిన యరఁటివోలె,
      నేలఁబడి గోలుగోలునఁజాల నేడ్చి
      తన్ను దఱివార లూరార్పఁదాల్మిపూని,
     కడకుఁబీనుంగుపైఁబడి కౌఁగిలించి. 133

తే. లేచివెనుకటినెయ్యముల్చెప్పికొనుచు
      నడుగులొకకొన్ని వారితోనడచిమెలఁ
     గాంచి బలరాము పీనుంగుఁ గదిసి దాని
    వగపు సంద్రంబులోపల మిగులమునిఁగి. 134

712 శుద్ధాంధ్రభారతసంగ్రహము

తే. తాలిమియె తెప్పగా దాని దాఁటి యచట
     చిరుగు లెల్లను నేఱించి సొదలుపేర్చి
     పీనుఁగులరెంటి నందుంచి పెట్టి చిచ్చు
     తిన్నఁగా వారి నిద్దఱ మన్నుసేసె. 135

సీ. చేసి యచ్చట నుండి చెచ్చెర వెల్వడి
                              మరల ద్వారక జేరి మఱుఁగు వెట్ట
  కందఱితోఁగృఘ్ణఁడన్న యు సముయుట
                              చిన్న మొగముతోడఁజెప్పి వైచి
  గుఱ్ఱఁబులను నేనుఁగుల నావులను వెంట
                               నడపించుకొని క్రీడి కడలి గట్టు
 చేరె నంతట నేమని చెప్పువాఁడ
 నప్పు డగంద లొంటిరా వనెడునట్టి
 సమెత నిజంబుగానుప్పు సంద్రమునను,
 మునిఁగిపోయెను ద్వారక మొదలుముట్టి. 136

ఉ.అక్కడి నుండి క్రీడి తగనందఱిఁదోడ్కొని వచ్చు దారిలోఁ
     దెక్కలికాండ్రు బోయ లొగిఁదెన్నున కడ్డమువచ్చి కవ్వడిం
    జిక్కఁగఁజేసి కైరువులు చేకొని వెండియు ఁగూడవచ్చునా
   చక్కెరబోండ్ల సొమ్మూలను జాలఁగదోఁచుకపోయి రొక్కటన్.

ఆ.మగనిచావు క్రీడి మొగమున రుక్మిణి,
      మొదలుగాఁగఁ గలుగు ముద్దరాండ్రు
      సొరది నాకించి సొదపేర్చుకొని చొచ్చి,
      కాలి చచ్చి రొండు క్రచ్చులుడిగి. 138

                             తృతీయాశ్వాసము 718

తే.సత్య మొదలైన తక్కినచాన లెల్ల
     గోరికలఁగోసి యడవి యాకులను మేసి
     యిచటి సుగమున నెడఁబాసియెసఁగఁదలఁచి
    యపుడ యడవులపాలైరి యడలుతోడ. 139

క.తక్కిన వారలఁదోడ్కొని,
మిక్కిలి వెసనంబుతోడ మే నదరంగా
నెక్కుడు పయనంబుల ఁదన,
యిక్కకు నరుదెంచి చేరె నెల్లరతోడన్. 140

క.అచ్చటికి వ్యాసుఁడప్పుడు,
వచ్చినఁగనలేక మొగము వంచుకొనుచు వి
వ్వచ్చు ఁడు పలుకం జాలక,
వెచ్చున నూర్చుచును జెమట వెల్లువగట్టన్. 141

తే.కాళ్ళపయి వ్రాలి యేడ్చుచుఁగదలకున్న,
లేవఁగానెత్తి మదిలోన ఁజేవవూన
నూఱుతెఱఁగులనాతల నూఱడించి,
యిప్పగిదిఁగుందఁగతమే మొచెప్పమనియె 142

మ.అనినం గాన్నుల నీరునించుచును నేయంబొప్ప నన్నేప్పుడుం
దనయట్లే కనుఁగొంచుఁబోర ననుఁబెద్దంజేసి తామావులం
జనిగాఁదోలుటకైన నోప్పుకోని నక్ సై దోడుకన్నం గడు ం
బనిగాఁబ్రోచిన కృఘ్ణఁడిప్ణు మడిసెం బల్కుల్ మఱింకేటికిన్. 143

క.బలరాముండును దక్కుం,
     గల వెన్ను నివంక వారుఁగడతేఱిరి మొ
    క్కలముగ నొండొరువులతోఁ,
    జలమునఁబోరాడి కల్లు చవిగొని యుంటక్. 144

తే.కడకు ద్వారకముని గెనుగదలిలొని
జొచ్చినె వెన్ను ని ల్లాంద్ర ఁదెచ్చు చుండ
భోయ లెదిరించి యా వువ్వు బొ ద్ల నగలు
దొ చు కొ ని సొ యీ రంద ఱదొద్ద వెట్టీ
             
తే.అనుచు దెల్పిన వ్యానుండూ ననువు మిఱ
నిక మిద నీజగమున నీర లుంట
తజవు కాదని ఖీడీతొ దరి మి చెప్పి,
తానుదన దారి బొయెన త్త వసి రేఁడు

లయ గ్రాహి. అంత నది యంతయు ను వింతగను నర్జునుడు
గొంతి తొలి పట్టీ కిని జెంత జని చె ప్పన్
వంత మెయీ నేల బడీ వందుర గ
బొంత దగువారతని నెంతయును దే ర్ప
దొంతరగ బై కుబు కు వింతగ లెల్లనొక
గంతు నను బోనుడీ పి యీంతి గొని వేగన్
సంత స ము తో దగురు పంతముగ నేవు రిక
రంతు వడ కేగుట నంతటను నెంచెక్
      

అనుచు దలపోసి తమ్ముల నాలి .బిలిచి
మను ము మను వు లు చా లి ంపమంచిదింక
నడవులకు వత్తు రేయని యడుగ వారు
మంచి దనియీయ్య కొనొరి యమ్మా టలకును

అంతట నూ రి వారలను నందఱ బిల్వగనంపి వారితో
నెంతయు నెమ్మి మి ఱ దమ యీ ప్పటీ పూ నికి యెల్ల జె ప్పి యా
వంతయు వంత నొంద కె ద వా ట నుండగ నాన తి చ్చి యొ
క్కింత యు గొంకు మాని చన నెంచి రి యేవురు నన్న దమ్ములున్

          తృతీయాశ్వాసము 715

తే.కృపుని రావించి తనఁబరీక్షితుని నతని,
కొప్పగించి కరమ్మును గొప్పచేసి
పుడమి నేలంగ సభిమన్యుకొడుకు నిలిపి,
జన్నిగట్ల కొనర్చి చాగములను. 150

క.బాపండొక్కఁడు కవ్వడి, దావునకు నచ్చి విల్లు తడయక నీవీ
ఱేపకడనే విడువుమన నా పగిదిని గాండివంబు నతఁడిడెఁగడలిన్.

సీ.రాచఱికంబున రహిఁబరిక్షితుఁబెట్టి
                                   ప్రోలివారల వీడుకోలు వడసి
చిత్రాంగదను బిడ్డ చెంతకుఁ బంపించి
                              వడి నులూచిని దండ్రికడకుఁబంపి
ద్రోవాదిఁదమతోడఁదోడ్కోని పయనమై
                             పొరిఁబాండుకొమరు లేవురునుగదలి
కానలఁబడి మెల్లఁగాఁజనుచుండంగ
                             వేపియొక్కటి వారివెంటఁబడియె

నంత దహయు నాఁకలి చూడ కరుగవారు
కాఱుకానలలో పలగండ్లు ముండ్లు
గాళ్ళఁదవులగంబడలిక గదిరి మిగుల,
వెనుకఁబడిసోలిద్రోవదివిడిచెమేను. 152

సీ.బడలిక కడలు తోడ్పడ వెనరాలేక
                                 సహదేవుఁడొకచోటఁజచ్చిపడియెఁ
దమ్ముఁడు చావంగ ఁదడఁబడి కాళ్ళాడ
                                    కొకచోట నకులుండు నొఱగి కూలి
మూపురపాటును బోవుచుఁదిలకించి
                                  యెదవ్రయ్యఁగవ్వడి యెదుర నీల్గెఁ

716 శుద్ధాంధ్రభారతసంగ్రహము

దమ్ముల నాలిని దలఁచుచు దగదొట్టి
భీముండు నొకచోట బిద్దివ్రాలె

నిట్లు తమ్ములు నలువురు నిఁగురుఁగోఁడి
సమసి పడినను దా నేమి సరకుగొనక
పోవుచుండెనుజముపట్టిపోవదయ్యెఁ,
గుక్క యొక్కటి యునువెంటఁగూడముట్టి 153

తే.కుక్క వెంబడిఁ జనుదేర ఁగొంతదవ్వు,
వెడల జముపట్టి కెదురను వేల్పుఱేఁడు
తేరి నొకదానిఁగొనివచ్చి తెరువునందు,
నిలిపి యాతని తోడను బలికె నిట్లు. 154


క.ఎకిమిఁడ యిదిగొ నరదము,
నొకదానిని నీకిఁగాను నోయన నిటకున్
గికురింపక కొనివచ్చి తి,
సుకముగ నిదియెక్క రమ్ము నులువుగనాతోన్. 155

వ.అనిననావేలుపఱేని కానేల ఱేఁడెంతయు నొదుంగుపాటునఁజేతులు
జోడించి జోతచేసి యిట్లఁయె. 156

తే.నన్నుఁగనిపెట్టుకొని వచ్చు చున్న దిద్ది,
చాల దవ్వులనుండియు జాగిలంబు
    దీనిఁగూడ నాతోడ నీతేరినిఁదఁ,
    దేచ్చూటకు నానతిమ్ము

నేవచ్చువాఁడ. 157

ఆ.అనిన వేల్పు రాయఁడల్లన నిట్లనె@,
    గుక్కయేడ వేల్పుటిక్క యేడ
    దీనిఁదేరిమిఁదఁదెచ్చుట తన దన్న,
   నింత నవ్వి యొడయఁడిట్టులనియె. 158

తృతీయాశ్వాసము 717

సీ.తమ్ములు నిల్లాలుఁ దారెల్లనను ఁబాయఁ
దానొక్కటియు వెంటఁదవిలియుండి
నమునమ్ముకొని వెంటఁ జను దెంచినట్టియి
వేపిని నడవిలో విడువఁజాల
నను నెప్డుఁ గనిపెట్టుకొని యున్న వారిని
నడవుల పాల్చేసి యరిగి నేను
సుగ మొందుచుండుట తగవౌనె నేనును
దప్పకయికానఁదపసి నగుచు
నుండి దీనినర యుచుందు నోరెమిడుచుఁ,
బిదప నిన్ను మెప్పించి నే వెనుక వత్తు
వేట్పుటిమ్మున కిప్పుడో వేల్పు ఱేఁడ, యరదమునుగొంచుఁగ్రమ్మఱనరుగుమివు. 159

క.అని మెమెడక పలికిన.
వినియచ్చెరుపడియెఁగరము వేలువుఱేఁడ
ల్లన నప్పుడె జాగిలమును,
దనరూపును బాసి జమువితంబును దాల్చెన్

తే.జాడ జముపట్టి తగవును జూడఁగోరి,
యట్లుచేసిన గుదెదాలు పలరె మదిని
వేల్పు ఱేఁడును నొడయని వెంటఁగొంచు
దేరిపైనెక్కియప్పుడెదివికిఁజనియెన్ 161

ఆ.ఇట్టు బొందితోడనే వేల్పుజగమున,
కేగి నారదుండు నెల్ల వేల్పు
లొలసి తన్నుఁజట్టి యుండంగనొడయండు పలుకులాడుచుండిపలికెనడుమ. 162

718 శుద్ధాంధ్రభారతసంగ్రహము


క.నాసై దోడుల బిడ్డల,
వేసాయము చూపవచ్చి బిద్దిన దొరలన్
వాసిం గనుఁగొన నాకిపు ,
డాస పొడమెఁజూపరయ్య నందఱె నిచటన్

చ.అనవుడు మంచిదంచు నపుడాతనిఁదోడ్కోనిపోయి యొక్క చోఁ
బెనుపగు గద్దితన్ సుగము పెల్లుగఁ జెందు సుయె ధనుం దగం
గనుఁగొనుమంచుఁ జూపిరది కనొని యాతఁడు డెందమందుఁదాఁ
గినుకయు నీసునుం బడియేఁగ్రేవను నారదు ఁడుండిచూడఁగన్.
              
ఉ.పుట్టిననాఁటఁగోలె నొకవున్నెముఁజేసి యెఱుంగనట్టి యి
కట్టిఁడి యిందు హాయఁగనఁగా గతమేమొకొ నాకు నారదా
గట్టిగ దెల్పు మం చడిగి గండున మార్కోని పోరిలోపలన్
గీట్టుటయే యనం దనివినిం గనఁడయ్యె సతం డొకింతయన్.
                      
తే. అవలఁదమ్ముల నెయ్యుర నయినవారిఁ
జూప జము పట్టి వేఁడి నఁజూఅడుమంచుఁ
గరము దవ్వుగ ఁగొనిపోయి కాఅనిపించి
రొక్కచోటను నలమట నొందువారి
      
క.అదిగని యేవయుఁగనలుచు,
మదిలోఁబొదలంగఁ జూచి మఱిమఱి పగపుం
గదురఁగఁబొగిలెను దమ్ముల,
కదలని బెడఁదఁ దలచి కలఁతం బడుచున్.
          
సీ.ఇటు కొంతవడిపోక్కి యిట్లనె జముపట్టి
యిదియేమి నారద యింతగోర
మిట్టిదే పరికింప నీవేల్పుజగమున
జరపెడు తగవుల చంద మెల్ల

<poem>తృతీయా శ్వాసము 719

నింతవఱకుఁజూడ కేనేమొ యనుకొంటి తెలిసిపోయెను మిదు తెఱఁగు నేఁడు పొడగంటి నేఁడు మా పుడమిలోనెన్నఁడు విని కని యెఱుఁగని వింతలిచట పున్నెమెట్టిదొ యెఱుఁగని ములుచలకును సుగముల నోసంగి యెప్పుడుఁదగవుగలిగి మెలఁగువారికి దొసఁగులు గలుగఁజేయఁ దగ వగునె యించు నోవేల్పు తపసిఱేఁడ. 168

క.అనొ వేలుపు టొడయనిపైఁ, గనలించుకవొడమి యతఁడు కావలసినవా రిని జూపిటకయి తనతో, బనిచినవాని మరలంగఁ బంచె వెనుకకున్. 169

తే.వాఁడు వడి ఁబోయి జముపట్టి పలుకులెల్ల వేల్పు ఱేనికిఁ దిన్నఁ,గా విన్నవించె నపుడ పరువెత్తుకొనివచ్చి యతనిఁగాంచి యచటఁదెఱగంటి పామియిట్లనియెదొరకు. 170

సీ.కొలదిపున్నెముచేసికొన్నవా రదిమున్నుపొందుచుసుగమొందుచుందురించు బదపడి యదిదీఱఁబలువెతల్ ఘుడుతురట్లౌట దుర్యోదమం డట్టులుండెఁ జెడ్డపనులను గొంచెముగాఁగజేసిన వారు తొల్తను వెతపడుదు రిచట గావున సీతమ్మ లీవెత లందరి ముందువీరలు సుక మొందఁగలరు కుంద కేమియు దీవికిడెందమందు !నీవు నొక కాల్ల మాటను నెపమువెట్టి పలికి యొజ్జల నని ఁగోలుపడితి కాన !వలపె నీకుమ నీవారియలఁతఁజూడ.

అ.అనుచుఁదెలియఁజెప్పి యాయనఁగన నీవు మొదల నేటియందు మునుఁగుమనివ మిన్ను వాక లోన ఁగ్రన్ననఁగ్రుంకిడి తనరియతఁ,డు వేల్పుతనము పూనె. 172 శుద్ధాంధ్రభారతసంగ్రహము

తే.అపుడేయా కలియునుడప్పియతనికుడిగి!వింతగానల్క ప్రేముడివిడిచిపొయె

మఱియుఁ గల్గిన తొల్లింటికఱత లెడలి! కలఁకలేనట్టియొకవింత తెలివియొదవె.

క. అంతటఁ దోఁబుట్టువులను! వింతియుఁ దలియునుదండ్రియుయెల్లయనుఁగుల్

చెంతలఁ బొలిచిరి తమతమ! వింతగుగద్దియలమీఁద వేడుకగాఁగన్.

తే. వారిఁగమఁ గొంచు సంతసమారమందు!నెన్నినాళులు నెలచుక్కలెసఁగుమింట
నన్నినాళ్ళును సుగముల నందుచుండు!జముని కొమరుండు వేలుపుజగమునందు.

క. అని పాండుని కొడుకులకత! కొనముట్టఁగ విటు నకుండునుమునుగాఁ
గనుగల జడదారులకును!వినిపించిన పిదప ననియె వెససూతుండూన్.

తే. దీనివ్రసినఁ జదివినఁదెలియయెనిన! వారవెల్లను దగు నడవడినేర్చి
దానిచేతను సిరులనుదద్దఁదసరి! యిందు నందున బెనుసుగ మొందుచుంద్రు.

క.లెక్కకు వెక్కసమగుచును,
బిక్కటిలు జగమ్ము లెల్లఁబెల్లుగ నీలో
నొక్కయెడ న్నెరసులవలె,
నిక్కగొని వెలుంగ నెపుడు నెసఁగెడువేల్పా.
తోదకము. నేలను నింగిన నీటి మెకలన్
మేలిపులుంగుల మీలను వర్సన్.

గద్య. ఇది శ్ర్రీమదప స్తంబసూత్రలొహితసగోత్ర శుద్ధాంధ్ర నిరోష్ట్య నిర్వచన నైషధకావ్యరచనాచాతురీధురంధర సద్య శోబంధుర కందుకూరివంశపయః పారావార రాకాకైరవమిత్ర సుబ్రహ్మణ్యామాత్యపుత్ర సకలసుజనవిధేయ వీరెశలింగ నామధెయ ప్రణీతంబైన యచ్చతెనుఁగు భారతనందుఁ సర్వంబున దృతీయాశ్వసము.