కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు/రాజశేఖరచరిత్రము-పదునాల్గవ ప్రకరణము
పదునాల్గవ ప్రకరణము
సుబ్రాహ్మణ్యముపిఠాపురమునుండివచ్చితండ్రినిదర్శించుట శ్రీశంకరాచార్యులవారియాగమనమునీలాద్రిరాజుసభలోతన వృత్తాంతమునుజెప్పుట.కృష్ణజగపతిమహారాజులుగారురాజులుగారురాజశేఖ రుఁడుగారిమాన్యములనువిడిపించీచ్చుట
సుబ్రహ్మణ్యముపిఠాపురమునుండి బయలుదేఱి,సొమ్ముతోనీలాద్రిరాజువెంటవచ్చుచున్నరాజభటులతోఁగలినభీమవరమునకువచ్చి,అక్కడినుండివారినిపెద్దాపురముపొమ్మనితానొక్కఁడునుతిన్నగానింటికిఁబోయెను.అప్పుడురాజశేఖరుఁడుగారుభోజనమునకు లేవఁబోవుచుండిరి.కొమారుఁడువీధిగుమ్మములోనుండిలోపల నడుగుపుట్టగానేచూచి,అబ్బాయివచ్చివాఁడనిరాజశేఖరుఁడుగారుకేకవేసిరి.ఆకేకతోనే'యేడీ యేడీ' యనిలోపలి వారందఱును నొక్కసారిగా పరుగెత్తుకొనివచ్చిరి. అందఱికంటెను ముందుగాసీత పరుగెత్తుకొనుచచ్చి అన్నగారిని కౌఁగలించుకొనెను. ఇంతలో మాణిక్యాంబ రాఁగాసుబ్రహ్మణ్యయామెనుకౌఁగలించుకొని, తరువాత తల్లిదండ్రుల కిద్దఱికినినమస్కారము చేసి వారిచేత నాశీర్వాదములను బొందెను. ఈనడు మనృసింహస్వామివచ్చి సుబ్రహ్మణ్యముయొక్క చేయిపుట్టుకొనీ 'బావా!' యనిపిలువగానే యతఁడతనిమొగము వంక దిరిగిచూచి మాటరాక యద్భుతపడి చూడసాగెను. అట్లొకనిమిషముచూచి మఱఁది నాలింగనముచేసీ యెప్పుడువచ్చినా' వనియడిగి, మగఁడు జీవించియున్నాఁడన్న వార్తవిని సంతోషించుటకు రుక్మిణికి ఋణము లేకపోయెను గదాయని కన్నులనీరుపెట్టుకొనెను. అంతట రుక్మిణి బ్రతికి యుండుటయు దొంగలుకొట్టిన రాత్రినుండియు నామెకు సంభవించిన యాపదలును 205
- పదునాల్గవ ప్రకరణము
- తుదకు సుఖముగా నిల్లుచేరుటయుఁ జెప్పి, రాజశేఖరుఁడుగారు కొమారుని నూరార్పఁజెచ్చిరి. ఆ మాటలు ముగియక మునుపే సంతోషము పట్టలేక సుబ్రహ్మణ్యము లోపలికిఁబోయి రుక్మిణి నాలింగనము చేసుకొని యామె తన్నుఁ జూచి కంటఁ గడిపెట్టుకోఁగా నూరడిచెను.ఈవలకు వచ్చిన తరువాత నృసింహస్వామి తన కధను సొంతముగా వినిపించెను. పిమ్మట నందరును స్నానములుచేసి యుతికిన మడుగుదోవతలు కట్టుకొని భోజనములకడఁ గూరునుండిరి. భోజనసమయమున సుబ్రహ్మణ్యము పిఠాపురములో రాజుగారిలోపల దొంగలు పడులయు దొంగలను తాను పట్టుకొన్న రీతియు దొరికిన సోత్తులో బైరాగి యెత్తుకొని పోయిన తమ సొమ్ముకూడఁ గనబడుటయు విమర్శన నిమిత్తమయి క్రిష్ణజగపతి మహారాజుగారి యొద్దకు బంపబడిన దొంగలతోఁ గూడఁ దన్నిచ్చటకు బంపుటయు జెప్పి, యిక్కడనుండి వెళ్ళినతోడనే తనకొక మంచి యుద్యోగము నిచ్చెదమని పిఠాపురపు రాజుగారు వాగ్దానము చేసియున్నారని చెప్పెను. అప్పుడు రాజశేఖరుఁడుగారు " మన యింటికి రాకపోకలు చేయుచు వచ్చిన రామరాజే క్రిష్ణజగపతిమహారాజుగా" రని చెప్పి, ఆయన యద్భతచర్యలను తమకుఁ జేసిన యుపకారమును నామూలాగ్రముగా వినిపించి యాయనను పొగడిరి. యింతలో భోజనము లైనందున లేచి చేతులు కడుగుకొని తాంబూలములు వేసికొని తెల్లబట్టలు కట్టుకొని రాజశేఖరుఁడుగారును సుబ్రహ్మణ్యమును బయలుదేరి నృసింహస్వామి వెంటఁ బెట్టుకొని పెద్దాపురమునకుఁ బ్రయాణము పోయిరి.
- వారు పెద్దాపురము చేరి రాజవీధిని ప్రవేశింపగానే యావీధినే దూరమున నొక పల్లకియును దానిముందొక యేనుగును రెండు గుర్రములును బండిమీఁద నొక భేరియును మఱికొన్ని వాద్యములును వెను 206
- రాజశేఖర చరిత్రము
- కను స్వస్తివాచకబృందములును దృగ్గోచరమయ్యెను. ఆ యాడంబరము చూచి రాజశేఖరుఁడుగా రాదిన మేదో దేవతోత్సవము కాఁబోలుననుకొని, కుమారునివంకఁ జూచి యాయుత్సవము శివుని దయియుండునా విష్ణుని దయి యుండునాయని యడిగిరి.
- సుబ్ర---- అది దేవుని యుత్సవము కాదు. శ్రీశంగరభగవత్పాదులవా రీపట్టణమునకు వేంచేసి యుందురు. వారు నెల దినములనుండి పిఠాపురములో నివాసము చేసియున్నారు. నేను బయలు దేరినప్పుడే వారును ప్రయాణ మయి యీపట్టణమునకు రావలెనని బండ్లు మొదలగు వానిని వాకిట నిలువఁబెట్టియుండఁగాఁ జూచితిని.
- రాజ---- అక్కడ భిక్షలు విశేషముగా జరిగివా?
- సుబ్ర---- మిక్కిలి చక్కగా జరిగినవి. వారింటింటికిని శ్రీముఖములను వ్రాసి తలకొక రూపాయవంతున పోగుచేసినారు. అదిగాక యనేక వితంతువులను ధనవంతువులను పళ్ళెరములలో పండ్లును రూపాయలను వేసుకొని వెళ్ళి పాదపూజ కని సమర్పించుకొనుచు వచ్చిరి. వారు సాష్టాంగనమస్కారము చేసినప్పుడెల్లను స్వాములవారు ' నారాయణ ' యనుచు రాఁగా, చేరువనుండు శిష్యులు పళ్ళెములోనివానిని జాగ్రత్త చేసి వట్టిపళ్ళెములను వారివి వారికి మరల నిచ్చుచుండిరి. గ్రామమునందలి వైదికులందరును జేరి రెండు భిక్షలు చేసినారు; లౌక్యుల యిండ్లలో నాలుగు భిక్షలు జరిగినవి; తక్కిన దినములలో కోమట్లు బ్రాహ్మణ గృహమున భిక్షలు చేయించుచు వచ్చిరి.
- రాజ---- నీ వెప్పుడయిన వెళ్ళి పీఠదర్షనము చేసినావా?
- సుబ్ర---- రెండుమూడు పర్యాయములు చేసినాను. పీఠము నిలువెడెత్తున నున్నది; దానినిండను బహువిధములైన విగ్రహములను పాలగ్రామములును నున్నవి. వెండిపువ్వుల పీట మీఁదఁ గూరుచుండి 207
- పదునాల్గవ ప్రకరణము
- పట్టుశాటి కట్టుకొని స్వాములవా రెప్పుడును కుంకుమముతో పీఠపూజ చేయుచుదురు. ఆ పీఠములో స్త్రీ యంత్రముకూడ నున్నదనియు, వారు పూర్వాశ్రమమునందు సహితము స్త్రీ విద్యోపాసకులే యనియు విన్నాఁడను. అది సత్యమౌనో కాదో కాని వారిప్పుడు మాత్రము రాత్రులు చీఁకటిలో ముసుఁగు వేసుకొని యొక మనుష్యుని వెంటబెట్టుకొని ప్రత్యక్ష మయిన స్త్రీయుపాసనము చేయుటకె బయలుదేరు చుందురని చూచినవారే యొకరు నాతో రహస్యముగాఁజెప్పినారు.
మొన్న నీనడుమ నొక శిష్యుఁడెత్తుకొని పారిపోయినది గాక, యింకను పీఠమునకు రెండువేల రూపాయల వెండిసామగ్రి ఉన్నది.
- రాజ---- వారు గ్రామములో నున్న కాలములో మతసాంకర్య నివారణముగాని మతవ్యాసనముగాని చేయుట కేమయిన బ్రయత్నము చేసినారా?
- సుబ్ర---- అట్టిపను లేమియు చేయలేదుగాని యొక్క ఘనకార్యమును మాత్రము చేసినారు. ఆ గ్రామములో ధనవంతురాలయిన యొక బాలవిధవ యున్నది. ఆమెయేమో భ్రూణహత్య చేసినదని గ్రామము లోని సభావతులు కొందరామెను జాతినుండి బహిష్కారముచేసిరి. తరువాత నామెకు జగన్నాధసతర్పణము చేసినప్పుడు ధనము కాశపడి కొందరు బ్రాహ్మణులు భోజనములు చేసిరి. అందుచేత నక్కడకు భోజనములకు వెళ్ళినవారందరు నొకకక్షగాను, వెళ్ళనివారందరు నొకకక్షగాను నేర్పడిరి. లోకమున కెల్లను ధనమె మూలమగుటచేతను, ఆమె లక్షవత్తులనోము మొదలయిన వ్రతములుచేసి యప్పుడప్పుడు బ్రాహ్మణసమారాధనలు చేయుచు వచ్చుచుండుటచేతను, క్రమక్రమముగా సంఖ్యయం దామె పక్షమువారే బలపడి మొదట వెలివేసిన వారికే యిప్పుడు వెలిగా నుండెను. తరువాత స్వాములవారు విజయం 208
- రాజశేఖర చరిత్రము
- చేసి యారెండు పక్షములవారిని సమాధానపరచి, ఆమె యొద్ద తాము రెండువందల రూపాయలను స్వీకరించి యామెకు పుట్టువెండ్రుకలు తీసి వేయించి, ఆ కేశఖండన మహోత్సవమయిన మరునాఁడే యామె యింట భిక్షచేసి ముందుగా తాము హసోదకము పుచ్చుకొని తరువాత బ్రాహ్మణుల కందరకును నిప్పించి నాటితో నామె వెలి తీర్చివేసిరి.
- రాజ---- ఆ స్వాములవారు పూర్వాశ్రమములోనేగ్రామనివాసులు?
- సుబ్ర---- వారి నివాసస్థలము ముంగొండయగ్రహారము. ఆయనకు నలుగురు కొమాళ్ళున్నారు. ఆశ్రమమును స్వీకరించిన తరువాతనే స్వాములవారు మునుపు మాన్యములమీఁద నున్న ఋణములను దీర్చివేసి నలుగురు కొమ్మాళ్ళుకును వివాహములు చేసి కోడండ్ర కొక్కొకరికి రెండేసివందల రూపాయల యాభరణము లుంచినారు.ఇప్పుడీస్వాములవారిపేరు శ్రీ చిదానందశంకర భారతిస్వామి యఁట.
- అని మాటాడుకొనుచు వారు రాజసభకుఁ పోవునప్పటికి రాజుగారు కొలువుగూటమునకు విజయంచేసి సింహాసనాభష్టితులై కూరుచుండియుండి మంత్రి తెచ్చియిచ్చిన విజ్నానపత్రికలను జదివి చూచుకొని పిఠాపురమునుండి వచ్చిన దొంగలను తమయెదుట బెట్టుటఁకు తరవుచేసిరి.ఈలోపల రాజశేఖరుఁడుగారును సుబ్రాహ్మణ్యమును నృసింహస్వామియు సభ ప్రవేశించి తగినచోటులఁ గూరుచుండిరి; రాజభటులును దొంగలునుగొనివచ్చి ప్రభువునెదుర నిలువఁబెట్టి తాము ప్రక్కలను కత్తులుచూసుకొని నిలుచుచుండిరి. అప్పుడు రాజుగారు సభ కలయఁ జూచి ' యీదొంగలను పట్టుకొన్నవారెవ ' రని ప్రశ్న వేసిరి. సుబ్రాహ్మణ్యము లేచి నిలువఁ బడి ' నేను ' అని మనవిచేసెను. తోడనే ప్రభువువారు రాజశేఖఁరుడు గారివంక దృష్టిబరపి "యీతడు
209
పదునాల్గవ ప్రకరణము
మీకొమారుఁడుకాఁడా" అని యడిగి "చిత్తమని " యాయన బదు
లుచెప్పగా విని యెడమప్రక్కను గూరుచున్నవా రెవరని మరల నడిగిరి.రాజశేఖరుఁడుగారు చేతులు కట్టుకొని నిలుచుండి యీతఁడు తమ యల్లుఁడగుటయు గిట్టనివాఁడొకడు ఆతడు వారణాసీపుర ముననున్న కాలములో వచ్చి మృతుఁ డయ్యెనని వట్టిప్రవాదము వేయుటయు రుక్మిణి దొంగలచేత దెబ్బతిని మూర్చపోయియుండఁగా తన్నందఱును దిగవిడచిపో యిన తరువాత మూర్చ తేఱి పురుషవేషము వేసికొని సీతనెత్తుకొనిపోయిన గ్రామమునుండి చెల్లెలితోఁ గూడ వచ్చుటయు సమగ్రమముగా విన్నవించిరి .రాజుగారు హర్షమును దెలుపుచు శిరఃకంపముచేసి , కొంతసే పూరకుండి యావంకఁదిరిగి మీరేమి చెప్పుకొనెదా రని యడిగిరి.
నీలా----సర్వమును దెలిసిన దేవరవారికడ మేము వేఱుగ చెప్పుకోవలసిన దేముండను ? మేము నిరపధులమని చెప్పుఁబోము. దేవరవారు దయాపూర్ణ హృదయులు గనుక ఆదయారసమును మామీఁదఁ బ్రసరింపజేయ దీనత్వముతో వేడుకొనుచున్నాము.
కృష్ణ---నీది యేదేశము? చిన్నప్పటినుండియు.నీ వెక్కడ నున్నావు? నీ చరిత్రమేమి? నీలా----నాచరిత్రము మిక్కిలి యద్భుతమయినది.నేను దానిని చెప్పుకొనుటకు సిగ్గుపడవలసియన్నను దేవరయంతటివా రడుగువచున్నారు గాన దాఁచక విన్నవించెదను.ఈవఱకు నేను జేసిన దుష్కృత్యము లన్నిటిని లీఱికగలిగి యున్నప్పుడెల్ల నాకు స్మరణఁకుదెచ్చి నామనస్సు పలువిధముల నన్ను బాధించుచున్నది; రాత్రులు నన్ను నిద్రపోనియదు ;కలలోసహితము నేను జేసిన ఘోరకృత్యములకు రాజభటులు నన్ను ఁగొనిపోయి శిక్షించుచున్నట్టు 27
- రాజశేఖర చరిత్రము
కనఁబడి యులికి పడుచుందును. అంతేకాక నాకిప్పుడు వారర్ధికమువచ్చి యున్నది. కాఁబట్టి చిరకాలము బ్రతుకఁబోను. ఆ సంగతిని తలఁచు కొను నపుడెల్ల నాకు యమభటులవలన భయముచేత దేహము కంప మెత్తుచున్నది. రాజదండనను పొందినవారికి యమదండనలేదని పెద్దలు చెప్పుదురు.కాఁబట్టి నేను చేసిన పాపమునకు మీవలన శిక్షను బొంది సుఖంపఁగోరుచున్నాను.
కృష్ణ---నీచరిత్రమంత యద్భుతమయిన దయ్యెనేని, ససాకల్య ముగా వినిపింపుము.ఇచ్చట నున్నవారంఱును విని యానందించెదరు. నీలా---నాజన్మస్థానము కాళహ స్తి. నా తల్లిదండ్రులంతగా ధనవంతులు కాకపోయినను శూద్రకులములలో మిక్కిలి గౌరవమును కాంచిన వంశమునందుఁ బుట్టినవారు.నాతల్లిదండ్రులకు నేనొక్కఁడనే పుత్రుఁడను గనక నన్ను వారు మిక్కిలిగారాబముతోఁ బెంచుచుం డిరి.నేనేదికావలెనన్నను తత్క్షణము తెచ్చిపెట్టుచుండిరి.అయిదేండ్లు వచ్చినతరువాత న న్నొకన్నాఁడు చదువవేసి,పంతులకు దోపతుల చావును గట్టఁబెట్టిరి.ఆ పంతులేవిధమునను దనకు జీవనము జరగనం దున పీనుగులమోయు వ్యాపారమునఁ బ్రవేశించి ముసలివాఁ డయి తాను చిన్నప్పుడైనను చదువుకొన్నవాఁడు కాకపోయినను తుదకు చదువులబడిని జీవనోపాధిగా నేర్పఱుచుకొని మాగ్రామమును జేరెను ఆఁతడుచెప్పెడు చదువొక్కముక్కయైననులేకపొయినను గొట్టెడిదెబ్బలు మాత్ర మక్షరలక్షగా నుండెను. ఆయిన నాతఁడు ధనమిచ్చిన వారి యెడ మిక్కిలి ప్రేమ గలవాఁడు గనుక నాతల్లిదండ్రులు చిఱుతిండి నిమిత్తమయి నాకిచ్చెడిసొమ్ములో సగము పంతులకిచ్చి దెబ్బలు తప్పించుకొంటిని.అందుచేత పంతులు నామీఁద నత్యంత ప్రేమగల వాడై నాకు బడి పెత్తనమిచ్చి, నాతల్లిదండ్రులతో మీకొమారు 211 పదునాల్గవ ప్రకరణము
నంతటి బుద్ధిమంతుఁడు లేఁడని చెప్పుచుండును. చిన్నప్పటినుండియు నేను నిజముగా సూక్ష్మబుద్ధికలవాఁడను నేర్పుకలవాఁడను ఆవుదును. నా నేరుపరితనమువలన మావారి కెప్పుడును నష్టమేకాని చిల్లిగవ్వ యైనను లాభముకలుగకపోయినను నాజననీజనకులు నన్ను నేరుపరిని గానేయెంచి సంతోషించుచుండిరి.ఏలయనిన,నేను నానేరుపంతయు నితరులను మోసముచేయుటయందే యుపయోగించుచు వచ్చితిని. నేను మోసములను నేర్చుకొనుటలో నిచ్చినశ్రద్ధలో సగమైనను ఏదో యొకవృత్తిని నేర్చుకొనుటలో నిచ్చియుంటినేని, నేనీపాటి యెంతో భాగ్యవంతుడనై యుందును. ఆసంగతి నట్లుండనిండు.నాకు బడి పెత్తనము వచ్చుటచేత పంతులతో చాడిచెప్పి కొట్టించెద ననిపిల్లలను బెదరించి తినుబడిపదార్దములను లంచముపుచ్చుకొనుచుందును.ఇట్ల్లుం డఁగా నాదురదృష్టవశమున ఆపంతులు కాలముచేసెను.ఆకాలములో పంతులెంతవిస్త్థారముగా దెబ్బలుకొట్టుచున్న నంతగట్టిగాఁ డనిపించు కొనుచుండును గనుక చదువుకొన్నపంతు లదివఱకే మాయూర బడి పెట్టుకొనియున్నను,అఁతడు పిల్లలయందు ప్రేమగలవాఁడై నిష్కారణ ముగా కొట్టుటకు పాలుపడనందున,పిల్లలనెవ్వరున్నతనిబడికిఁ బంప కుండిరి.ఇప్పుడు గ్రామములో రెండవపంతులు లేనందున,మాబడి లోని పిల్లలనందఱను విధిలేక యక్కడకే పంపవలసివచ్చెను.ఈకొత్త పంతులవద్ద మునుపటివలె నాయాటలేమియు సాగినవికావు.ఇంతలో మాతండ్రియు నాకస్మికముగా గుండెలో నొప్పివచ్చి లోకాంతర గతుఁడయ్యెను. ఆతఁడు తనధనము నెక్కడనో పాతిపెట్టి మరల కాలమునందెవ్వరితోను చెప్పకయే కాలముచేసినందున పెద్దమ్మ వారు మమ్ము మఱింత శీఘృముగా వచ్చియాశ్రయించెను.ధనికుఁ డైన మా పొరుగువారి పిల్లవాఁడొకఁడు మా బడిలోనే చదువుకొను 212 ;రాజశేఖర చరిత్రము చుండెను;ఆఁతడు చదువునందు మిక్కిలి యాశక్తికలవాడు;ఆతనిలో నేను మైత్రిచేసికొని మిక్కిలి నమ్మకమిచ్చి మెలఁగుచుంటిని. కొందరు నమ్మకమిచ్చినప్పుడు మనసుకుడనిచ్చి యూరకుందురు; నేను తెలివిగలవవాఁడను గనక ఆలాగున జేయక వేయినమ్మకము లిచ్చినను మనసుమాత్ర మియ్యక దాఁచుకొంటిని.ఈప్రకారముగా నుఁడి యతనిని పలువిధముల మోసముచేసి ధనమార్జించు చుంటిని. ఆది యేమి మాయయేకాని నేనెన్నివిధముల మోసముచేసి ధనము సంపాదించుకొనుచున్నను బీఁదవాఁడనుగాను,అతడు ధనవంతుఁడు గాను ఉంటిమి. అతఁడు విద్యయందు వృద్ద్ధిపొందినకొలఁది,నేను ద్యూతవిద్యయందు పాండిత్యమును పొందనారంభించితిని.చెడుపిల్ల వాండ్రతోడి సాంగత్యమువలనఁ జదువు మానివేసి డబ్బుపెట్టి జూద మాడమొదలుపెట్టి యావ్యసనములోఁబడి యింటఁగల వస్తువులను దొంగతనముగాను బలవంతముగాను దిసీకొనిపోయి జూదగాండ్రకు సమర్పించుచుందును.ఇట్లుండియు మాపొరుగు చిన్నవానితోడి చెలి మిని మాత్రము మానలేదు. ఆతనిపేరు భాస్కరుడు, నాపేరు పద్మనాభుఁడు.ఇట్లు జరుగుచుండగా నాకు పదియాఱుసంవత్సరములు దాఁటినవి; నామిత్రుడు పెద్దవాడై గృహ యాజమాన్యమును వహించి విద్యాభిరుచి గలవాఁడై సదాపండితులగోష్టిని ప్రొద్దుపుచ్చు చుండెను.నేనొకనాఁ డితనియొద్దకు బోయి నాస్థితిగతులను జెప్పు కొని నాతండ్రియు వర్తకుఁడే గనుక నాకు వ్యాపారము చేయ నిష్టముకలదనియు మూలధనము క్రింద నేమైనఁబెట్టుబడిబెట్టీ సాయము చేయవలసినదనియు కోరితిని.ఆతఁడు తానుగూడ పాలికుండెదనని చెప్పి రెండువందల రూపాయలను నాచేతకిచ్చి నేను పనిచేయుటకును తాను వడ్డి పుచ్చుకొనకుండుటకును వచ్చిన లాభముతో చెఱిసగము 213:పదునాల్గవ ప్రకరణము చూచుకొనుటకును నన్నడ బఱిచి పంపెను .మాకు వచ్చిన లాభము స్వల్పమే యైనను పనిచేయువాఁడను గనుక నాకెక్కువ లాభము కావలెనని నేను నా మిత్రునితో కలహము పెట్టుకొన జొచ్చితిని.రాజు లనుభవించుటకు రాజ్యములున్నను,ఒకరితో నొకరు పొట్లడిచత్తురు;సన్యాసులకు క్ౌపీనము క్ంటె నధిక మేమియు లేకపోనను పోరులేక సంతుష్టీ పొంది యుందురు. దైవము దయచేసినదానితోఁదృప్తి పొందియున్న నేకలహములును గలుగవు.తృప్తిలేక యాశా పిశాచముచే నావహింపఁబడిన చో నేల్ల కలహములును గలుగును.అయినను నా స్నేహితుఁడు మిక్కిలి మంచివాఁడును ఉదారసాహసము కలవాఁడును గనుక,ఒకనాఁడు నన్ను తనదగ్గఱకుఁబిలిచి యిట్లనియెను.
నీవు మొదటినుండియు వర్తకుఁడవుగా నున్నావు గనుక
నీకుసొమ్మునందే యిష్టము;నాకు విద్యాధనమునందు మాత్ర మిష్టము.త్యాగబోగముల కక్కఱకు రాకపోయినను ధనమునుజూచు కొనుచున్నను నీకు సంతోషము కలుగును.నాకు ;గౌరవముతో జరగుట కున్నంజాలును.కాఁబట్టి యీ రెండవందల రూపాయలను నీవు పుచ్చుకొమ్ము.
అనియాతఁడు పెట్టుబడి పెట్టిన సొమ్మును నాకు విడిచిపెట్టెను.
ఆసొమ్ము చేతికందిన సంతోషముచేత,మఱింత యుల్లాసముతో దుకాణము కట్టిపెట్ట్టి రాత్రియు పగలునుకూడ జూదమాడసాగించి కొన్నిమాసములలో సొమ్ముంతయుఁ బోఁగొట్టుకొని జోగినైతిని.తరు వాత పసశ్చాత్తాపపడి,తిండికిసహితమూ జరగక యిబ్బందిపడుచు నొక నాఁడు మాసికలువేసిన బట్టలతో స్నేహితునియొద్దకుఁబోయి యాతఁడు చేసిన యుపకారమును బహువిధములఁ గొనియాడి నాకు
మ్
- 214 రాజశేఖర చరిత్రము
సంభవించిన దురవస్థయంతయు ఁ జెప్పుకొంటిని.అతడు నాస్థితిని విని మిక్కిలి విచారపడి,సొమ్ము చేతనుంచియెడల పాధుచేయుదు నని యెఱిఁగి,యొకస్నేహితునకు జాబూవ్రాసి నన్నచెటికిఁబంపెను.నేనా యుత్తరమును దీసికొనిపోయి చూచినతోడనే యాతఁడు నన్ను మధ్యా హ్నమున రమ్మనిచెప్పి నాకు నెలకు పదిరూపాల జీతముగలపని నొకదాని నిచ్చెను.నేనాపనిలో రెండమాసము లుండువరకు నాకది యొంతో భారముగా కనఁబడెను.ఒంటరిగానున్నప్పుడు నాకంటఁబడిన వస్తువులనెల్లను హ స్తలాఘవమునుజూసి నేను మాయముచేయుచు వచ్చినందున,నాయజనఁడు వారిమీఁదనుపెట్టి వీరిమీదను పెట్టి నన్ను దిట్ట్టుచుండెను.అంతియకాక యెకరికి లోఁబడియుండి వారు చెప్పినటెల్ల పనిపాటలు చెయుట నాస్వభావమునకు సరిపడినదికాదు. నాకు స్వభావముగా మహారాజువలె నుండవలెనని యాశగనుక, ఆపనిని విడిచిపెట్టివచ్చి యింటివద్ద కాలిమీద కాలువేసుకొని కూరు చుండి నన్ను నమ్మినవారికడ నెల్లను ఋణములుచేయుచు,ఆప్పపుట్టి నంతకాలము సులభమూగా జీవనము చేయుచుంటిని .ఈప్రకారముగా నిరుద్యోగముగా జీవనముచేయుచున్న కాలములో నేనితరులు చేయు హితభోధ నెప్పుడును వినకపోయినను,అడుగుటయందు మాత్రము విశేషశ్రద్ద వుచ్చుకొని విశేషనీతివాక్యములనునేర్చుకొంటిని.ఆటుతరు వాతనానీతివాక్యములు నాకేమియుఁ బనికిరాకపోయినను ఇతరుల కై నఁ బనికివచ్చునని యెంచి మూఢులకు హితోపదేశములు చేసి గొప్ప వాఁడనని పేరుపడి ధనమార్జింప నారంభించితిని.అప్పుడుసహితము నానడత తిన్నగా నుండనందున నొకనాఁడొక భక్త్తుఁడువచ్చీ 'మీరిన్ని నీతులను జెప్పుచన్నారుగాని మీప్రవర్తనము తిన్నగానున్నదా?" యని నన్ను ఁబ్రశ్నచేసెను. 'నాకుఁబనికి రావనియేకదా యీనీతు పదునాల్గవ ప్రకరణము 215
లన్నిటిని మీకు వదలివేయుచున్నాను; నాకే పనివచ్చిన యెడల నొక్క వాక్యమయిన నాకుక్షిలోనుండి పైకి రానిత్తునా? 'యని సమ యేచితముగా బ్రత్యుత్తరము నిచ్చి, యిక నందు నిలుచుట కార్యము కాదనుకొని శిఘ్రముగా మాగ్రామము వదలివేసి దేశాంతరమునకు ఁ బోవలెనని బయలు దేఱితిని .ఆట్లుబయలుదేఱి గ్రామైకరాత్రముగా శయనించుచు భోజనముచేసినయూకఁ బరుం డక నిత్య ప్రయాణములు చేయుచు,ఒకనాఁ డొకగ్రామముపఱగడ గొప్పమేఁకలమంద నొకదానిని జూచి ఇన్నిమేడలను వాఁడెట్లు కాపాడఁగలడాయని గొల్లవానియందు మిక్కీలి కనికరము తోఁచి కొంతభారము తగ్గించినను తగ్గించుటయే యని రెండు మేఁకపిల్లలను ఋజముమీఁద వ్రేసికొని నడవనారంభించితిని;అప్పుడు వాని వెంటనే తల్లియు నఱచుచు రాసాగెను;అదిచూచి తల్లిబిడ్డల నెడఁబాసిన పాపము వచ్చునని కొంతభూతదయ గలవాఁడనై యాపిల్లల తల్లినిగూడ ధోలుకొని పోవుచుంటిని.ఆ సంగతి నేలాగుననో కనిపెట్టిగొల్లవాఁడు నా వెనుక 'దొంగా!ఆగూ'మని కేకలువేయుచు నడచివచ్చుచుండెను. ఆదివరకును పయిగ్రామము నెంతప్రొద్దెక్కి చేరుదునోయని భయ పడుచుంటిని గాని,వానికేకలతో నిమిషములో నూరుచెరి సంతో షించి తిరిగిచూచితిని;వాడు నాపరుగు కలిసికోలేక తక్కినమేఁకల నెవ్వరెత్తుకొని పోదురో యని యప్పుడే వెనుక మరలిపోయెను.నేనా మేఁకనుపిల్లలను పోరుగూరులోవక్రయించి యాసొమ్ము దారిబతై మున కుంచుకొని,కొన్నిదినములలో కొండవీడుచేరి యచటయేగినై యుండి,నాయెద్ద సీతారామయంత్ర మున్నదనియు దానిని జూచిన వానికి సమస్త సంపదలు గలుగననియుఁజెప్పి,యొకబొమ్మరాతిని గదిలోనుంచి రహస్యముగా డబ్బుడబ్బు చొప్పునఁఋచ్చుకొని చూప 216 రాజశేఖర చరిత్రము
నారంభించితిని. ఏపాడువస్తువు నయిననునరే రహస్యముగా నుంచుట
వలన దానియందు గౌరవము హెచ్చును. దివ్యక్షేత్రములయందలి
దేవాలయములలోని విగ్రహములను పామరులు పూజారులకు దక్షణ
లిచ్చి స్వామి యెంత బాగుండునో యని చూచులాగుననే యెల్లవా
రును నాకును కానుకలను సమర్పించి యాబొమ్మరాతిని మూఁకలుగా
వచ్చి జనులుచూచి పోవుచుండిరి; చూచినతరువాత చేతకాని పని
వాని చేతఁ జెక్కఁబడిన యాకురూపముగల విగ్రహములందువలెనే
యారాతియందును వీధిలోఁగనఁబడెడి బొమ్మరాయియేయని యెల్ల
వారికిని సనాదరము కలుగనారంభించెను.నిజముగా నేను సీతారామ
యంత్రమని లోపలఁబెట్టిచూపిన శిలను ఒకదినమున వీధిలో ఁబెట్టి
చూపినచో మఱునాడెవ్వరును దాని మొగమువంకనైనఁ జూడఁ
గోరరు. నేనాప్రకారముగా యేగినిగా నున్న కాలములో ప్రయేగ
విద్యయందును భూతవైద్యమునందును మిక్కిలి ప్రసిద్ధి కెక్కినవాఁడను
కాఁబట్టి నామహత్వము నల్లవారును చెప్పుకొనుచుందురు.నేను వద
లింపఁబూనుకొన్నదయ్యముల కధలనుబలె నాకధలనుసహితమెల్ల వారును సత్యాదరులై వినుచువచ్చిరి కాని యినియువానివలెనే విను వారిభయమును మఱింత వృద్ధి పఱుచుటకే వినియేగపడుచు వచ్చి నందున, గ్రామములో నందరు నే నేమిప్రయేగము చేసిపోదు నేమో యని నాకు జడియుచుండిరి.
పయిమిషచేత ధన మార్జించి యాగ్రామములో సుఖజీవనము
చేయుచుండఁగా నన్ను వ్యాధి యాశ్రయించినందున, నే నదివర
కెందఱో మరణమున బ్రహ్మైక్యమే కాఁబట్టి సంతోషింపవలయు
నని బోధించువచ్చినను చచ్చిపోదునని భయపడఁజొచ్చితిని.మీరే
యేగిని బిలిచి మీకు మరణ మన్నభయ మేమైనఁ గలదా యని
- 217 పదునాల్గవ ప్రకరణము
యడిగినను తడవు కోకుండ లేదని చెప్పునుగాని యాతనికిఁ గొంచెము
రోగము వచ్చినప్పుడుమాత్ర మాతని చర్యవలన మూఢూలకుండ దాని
కంటే నెక్కువభయము కలిగియుండుటను గనిపెట్టవచ్చును.నేనట్లు
యేగివేషము వేసికొనియున్న కాలము నితరులే యేగిని ప్రశంసించి
నను,నేనాతఁడెంతవాఁడని తృణీకరించుందును.సాధారణముగా
యేగ్యులు తాము కీర్తిని బొందవలెనని కోరుచుండఁగా అయే
గ్యులు వారికీర్తిని పాడుచేసి తమకీర్తితో సమానమైనదానినిగాఁ
జేయఁ జూచుచుందరుగదా? నేనిట్లనేక వేషములు వేసి కడపట
బైరాగినై వీరినిద్దఱిని శిష్యులనుగాఁ గైకొని చిదానందయేగియను
పేర ధవళేశ్వరము ప్రవేశించి, యీ రాజశేఖరుఁడుగారినే స్వర్ణము
చేసి యిచ్చెద నని మాయచేసి యిప్పుడుతమయేదకు ఁదెచ్చిన నగలనే
యపహరించుకొని పోతిని,అక్కడనుండి పోయినపిమ్మట గడ్డమును
మీసమును గొఱిగించుకొని నీలాద్రిరాజు నయి పిఠాపురము ప్రవే
శించి, వీండ్రసాయము చేతనే రాజుగారి ధనాగారములోని ధనమును
తరలించితిని. ఈరెండుచోట్లను నేను జరిగించిన యద్భుతచర్యలును
నానటనమును రాజశేఖరుఁడుగారును కొమారుఁడును చక్కగాఁ
చెప్పఁగలరు.కనుకను, ఆత్మప్రశంస యనుచిత మగుటచేతను,ఇంత
టితోఁ జాలించు చున్నాను. అని యూరకుండెను.
కృష్టజగపతి మహారాజులుగా రాతనిచరిత్రము విన్నతరువాతను నిమిష మాలోచించి,పద్మనాభునివంకఁ దిరిగి నీవిప్పుడు బుద్ధితెచ్చు కొని నిజముగాఁబశ్ఛాత్తప్త్తుఁడ వైనాఁడవు గనుక నినొక్కసంవ త్సరము కారాగృహమునందు బెట్టింప నిశ్చయించినా మని చెప్పి , కారాగృహాధికారి కట్టియు త్తరువును వ్రాసి యాతనిని రాజభటుల వెంబడి చామర్లకోటకుఁ బంపివేసిరి. తరువాత పిఠాపురపువారి ధనము
- రాజశేఖర చరిత్రము
వచ్చటికి వెంటనే పంపివేయ మంత్రి కాజ్ణచేసి, దొంగతనమును పట్టు కొన్నందునకు సుబ్రహ్మణ్యమును శ్లాఘించి, రాజశేఖరుడుగారివంక దిరిగి రాజుగా రిట్లు చెప్పిరి:----
మీ రిదివర కెనన్నొకష్టముల ననుభవించి యా యాపదల నన్ని
ట్టిని గడచి మరల సుఖము ననుభవించుదశకు వచ్చుచున్నారు.
కాఁబట్టి మీకు నేను కొన్నిహితవాక్యములను జెప్పుబోవుచున్నాను.
మీరు నామాటలను సావకాశముగా వినవలెను. పడినతరువాత
లేచుట గొప్పతనముగాని యెప్పుడును పడకుండుట గొప్పతనము
కాదు. మీ రితిని మనసునం దుంచుకొని వెనుకపడిన కష్టములకై
విచారపడకుండవలయును.ఇతరులుచేయు ముఖస్తుతుల కుబ్బి, ఆదాయమునకంటె నధికమైన ధనము దానము చేయకుండ వలయును. ఒక్క కుటుంబములోవారు పలువురు పదిమందిలో నత్యంతమైత్రి కలిగియే యున్నను గృహము చేరినతోడనే గర్భశత్రువులుగా నుందురు.కాఁబట్టి మీకుట్టుంబమునం దట్టికొఱఁత కలుగకుండఁ కాపాడుచు రావలయును. విరోధమును సాధించుటకు మంచియుపాయము శాంతినివహించుటయే. మనకవ్వరిమీఁద నై నను పగతీర్చుకోవలె నని బుద్ధి పుట్టి దానిని మరలించుకో లేనియెడల మనము పగతీర్చుకో శక్తికలిగియుండియు క్షమింతుమేని,శత్రువులు సహితము మనలను జూచిబుద్ధి తెచ్చుకొని జ్ణానవంతులగుదురు.కప్ప కఱవవలెనని ప్రయత్నముచేసిన నెంత ప్రయోజనకారియగునో బీదవాఁడు గొప్పవానినిపగసాధింపఁ దలఁవుగొన్న నంత ప్రయోజన కారిగానే యుండును.వట్టిబెదరింపులతోనే ముగిసెడుకోపము నెవరు లక్ష్యము చేయుదురు? ఆట్టికోపమువలన మనకార్యమును సాధించుకోలేపోవుట. యటుండఁగా మీఁదిమిక్కిలి నష్టమునుకూడఁ బొందుదుము.మీరు శోభనాద్రి
;219 పదునాల్గవ ప్రకరము
రాజుమీఁద తొంరపడి మీకోపమును చూపినందునకేకదా మీకు కారాగృహబంధనము సంభవించినది. కాఁబట్టి యిఁకముం దెప్పుడును మీరు మీకంటె నధికులైన వారిమూఁద మీకోపమును కనఁబడును కుండవలయును. కొందణు మతిహిఅనులు పూర్వకాలమే మంచిదని పొగడి మీరుచేయుదోషములను కాలమునందారోపించి మిమ్మ నిరుత్యాహులను జేయుదురు ; కాని చక్కగా ఆలోచించి నాకుఁ తోఁచు చున్నది. పుంణ్యపాపములు మనుఝ్యల బ్రవర్తనములో నున్నవికాని కాలములో నేమియు లేవు. కాఁబట్టి మీరు చేసినదోషములకు కాలమునుదూషింపక మీప్రవర్తనమును తిన్న పఱచుకొనుటకే ప్రయత్నపడవలయును. మీకు గౌరవముతో జీవనము జరుగుటకు చాలినంత సొమ్మున్నచో విశేషముగా లేదని మీరెప్పుడును చింత పవకుండ వలయును. ఈరీతిని దెలిపెడి పూర్వకథ నొకదానిని మీకుఁ జెప్పిదను వినుండి. పూర్వమొకధనవంతుఁడు శరీరమునిండ రత్న ఖచితము లైన స్వర్ణాభరణములను ధరించుకొని వీధినిబడిపోపుచుండఁగా, బీదవాఁడొకఁ డాతనిని వెంబడించి నగలను జూచి మాటిమాటికి నమస్కరింప నారంచించెను. ఆధనికుఁ అంతవిని జూచి 'నానగలలో నేనేదియు నీకియ్యలేదే. అందున కట్లు చేయుచున్నా' వని యడిగెను. ఆనగలు నాకక్కఱలేదు; మూరు నన్ను నగలను చూడనిచ్చినారు గనుక నమస్కారములు చేసినాను; మీరును చూచుకొని సంతోషించుటయే కాని నగలవలన వేఱొక ప్రయోజనమును పొందఁజాలరు ; మీరు నగలను కాపాడుకొనుటకై అంతము శ్రమపడు చున్నరు; నాకాశ్రమ యక్కఱలేకయే సంతోషము లభించుచున్నది; మీకును నాకును గలవ్యత్యాస మిదియే' యని వాఁడు
రాజశేఖర చరిత్రము
బదులుచెప్పి పోయెను. ఈహేతువునుబట్టియే నేను మీకు విశేష ధనము నియ్యఁలవఁడ నయ్యును, ఇయ్యక మీమాన్యములను మాత్రము విడిపించి యిచ్చుచున్నాను వానితో మీరు తృప్తిపొంది సుఖజీవనము చేయుచుండుఁడు.
అని చెప్పి కృష్ణజగపతిమహారాజుగారు మీకు మఱియేదియైన గోరికకలదాయని రాజశేఖరుఁడుగారి. ఆయన ప్రభువువారి సుగుణసంపత్తిని వేయివిధములఁ గొనియాడి, తన కుటుంబమునకుఁ జేసిన మహోపకారమును స్మరించి తానుచెఱసాలలో నున్నకాలములో విజ్ఞానపత్రికను వ్రాసి పంపుట యొదలగు పనులలోఁ దన కత్యంత సహాయుఁడుగా నున్న మంచిరాజు పాపయ్యను చెఱనుండి విడిపింపుఁడనివేడుకొనెను. తన కపకారముచేసి శత్రువునందుకూడ దయ గలిగియుండుటను. శ్లాఘించి, రాజుగా రప్పుడే అతనిని విడిచిపెట్ట విజ్ఞాపత్రికను బంపి తాము కొలువు చాలించి యంతఃపురమునకు విజయంచేసిరి. అంత రాజశేఖరుఁడుగారు మొదలగువారు కొలువుకూటమునువిడిచి తమతమ యిండ్లకు బోయిరి.