కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు/రసికజన మనోరంజనము-ప్రథమాశ్వాసము

రసికజన మనోరంజనము.


ప్రథమాశ్వాసము.


రసికజనమనోరంజనము

క. కొబ్బెరకాయల మెక్కుచు నిబ్బరముగఁ గొల్చువారి నెఱిఁబ్రోచెడియా గిబ్బవజీరుకొమారుఁడు గొబ్బుననొడఁ గూర్చుగాత ఁ గోరికలెలమిన్.

చ. కలుములచేడెకోడలు నిగారపుఁ దెల్లనిమేనిచానప ల్కులసిరికాటపట్టు బలుకోరికఁబెన్మిటిమెముదమ్ములు దలరెడుకొమ్మ సోయగపు టంచపయిన్నడయాడుచామ దూ నలువవెలంది నిచ్చలును నాలుకఁగాపురముండు గావుతన్.

వ. అని వేల్పులనెల్లం గొనియాడి.

గీ. నన్నయఁదలుచి తిక్కననెన్ని పిదప నెఱ్రప్రగ్గడఁ గొనియాడి యెల్ల తెలుఁగు కబ్బవుంగూర్పరుల మదిగారవించి యెుక్కటను బెడ్దలకునెల్ల మెుక్కులిడుదు.

గీ. నిండు నెమ్మేను విడనాడి వుండులకును నిక్కు నీఁగలవగమాని నీరువిడిచి పాలుగొనునంచ తెఱఁగూని వఱలువిూరు తప్పులఁదొఱుగి నెనరుంచి యెుప్పెగొనుడు.

వ. ఇట్లు వేల్పులం దొల్లింటి తెనుంగు కబ్బంపుఁగూర్పరుల వేర్వేరఁ బేర్కొని నానేర్పుకొలంది నిక్కయబ్బురంపుఁ దెలుంగుకబ్బం బొనఁగూర్పందలంచి మొదలనాకొలంబు తెఱంగించుక వక్కా ణించెద.

సీ. జగములఁగలిగింప నెగడింపఁ బొలియింపఁ గల వెన్నుఁడేవేల్పు కన్నతండ్రి యెలమినెల్ల రకును గలుములుకలిగించు

సిరిచెలియే వేల్పు చెలఁగుతల్లి

ప్రథమాశ్వాసము

చెలరేఁగియందఱవలపించిస్రుక్కించుననపిల్తుడేవేల్పుననుఁగుఁదోడుచదువులకెల్లనుగుదురగుచువెలుంగు వెలిచానయేల్పువెలడిమిన్నయట్టినలువంగడముననమరబుట్టెరాజలింగమనంగనురహీఁదనర్చియతడుబేసికన్నులవేల్పునందుఁగలుగుబత్తికలిమినిసరిలేకవన్నెమీఱె.
గీ.ఊళ్లుఁబల్లెలునేలుచునుండియాతఁడెల్లవారలఁద్నువుచునీగిచేతవాసిగనిగాంచెనుగొలంబువన్నెకెక్కఁజంద్రమౌళియనుకొమారుసాటిమీఱ.
క.అక్కమయనునెలనాగ౯మక్కువతోఁబెండ్లియాడెమఱియాతడుమున్
ముక్కంటిగట్టుకన్నియునక్కఱతోఁదానుబెండ్లియాడినకరణి౯
క.వీరేశలింగమనుకొడుకారయగాజంద్రమౌళికరుదుగబుట్టె౯జేరిమునుపాలకడలికిగారాబపుజందురుండుకలిగినమాడ్కి౯
ఉ.అతడువిద్దెలంగరమునందఱచేతనుమెప్పుపొందిమేల్సేతలనెందునువ్సవతులేకచెలంగికరంబుమేటియైబ్రాతిగనేలఱేండ్లకడబ్రగ్గడయైకడుబేరుపొందితానేతఱిమేటిదేవరనయెంచుచులింగనిమానెఁగొల్వగ౯.

రసికజనమనోరంజనము

గీ.కొమరులనుగాంచెనాకందుకూరికొలపుఁబెద్దవేంకటరత్నమన్ పెద్దకొడుకువెనుకఁజిన్నిసుబ్రహ్మణ్యమనుకొమారునలరుతనచానయైనకామమ్మయందు.
క.అందలసుబ్రహ్మణ్యఁడుపొందుగనెల్లరునుదన్నుఁబొగడఁగసిరులం జెందివెలిగెఁదనసరివారందఱిలోమిగిలనన్నయానకులోనై.
గీ.మున్నుకడలిరాకన్నియఁజెన్నుమీఱవలచివెన్నుండుగైకొన్నచెలువుదోపఁబున్నమయనంగఁదనవారుపొలతిమిన్నసబ్బురంబుగఁబెండిలియాడెనతడు.
క.అయ్యిరువురకునుసంతసమొయ్యనఁజేకూఱనేనునొదవితిమదిలోనెయ్యనమునన్నిలుపుదుమరునయ్యనువీరేశలింగమనఁజనుచుందున్.
సీ.ఏమేటియడుగుఁబొందామరల్ తొలివేల్పుమొదలగువారలుపొందఁజాలరేవేలుపులవేల్పునెదయందుఁబాయకకలుములకొమ్మునిచ్చలునునుండునేదిట్టబొజ్జలోనెల్లజగంబులునొకమూలఁబొందుగానొదిగియుండునేపెనుదంటపేళ్ళదురపుటోర్ంపుఁదపిసిలోనగువారుతలఁతురెపుడు

ప్రథమాశ్వాసము

నట్టివెన్నుండుకనికరముట్టిపడగ నాదుడెందంపుఁడమ్మిలోఁబాదుకొలిపె నాదుకబ్బంబుఁదనకప్పనంబునేయు తలపుపెఱవేలువులనేరిఁదఱియకుండ.

క.అట్టికనికరపుగనికిన్
గట్టిగవేలుపులనెల్లఁగాచుచుమదిలోఁ
బుట్టినకినుకన్ రక్కసి
జెట్టులఁదునుమాడూసిరులచేడెమగనికి౯.

క.నెట్టినగొల్లపడంయుల
బట్టలుదొంగిలినచుట్టువాల్దాల్పునకున్
బొట్టెలఁజంపఁగడంగిన
కట్టిఁడిముద్దియఁదునిమినకఱివేల్పునకున్.

క.క్రాలెడునాలున్ బంగరు
సాలున్నెఱచుట్టునాలుఁజాలగనలుపౌ
డాలుంబాలకడలినడి
ప్రోఁలు౯సరిమాలుమేలుఁబొసఁగెడుదొరకున్.

క.మేటికిసిరియెదతామర
తేఁటికిగరువంపుఁబొలసుదిండులదళవుం
గాటవుఁదెమ్మెరనెచ్చెలి
నీటికిఁదెఱగంటిపక్కినెఱుగూటికొగిన్.

క.ఎన్నికగనుకవ్వడియా
లన్నకుఁదొల్వేల్పుపొగరుటావులమెకపుం
గున్నకుఁజెన్నగుజేజే
మిన్నకుబలుగొల్లకొలపుఁబిన్నకునెమ్మి౯

రసికజనమనోరంజనము

తే.గీ.అప్పనంబుగనానేర్చునట్లొనర్పఁ
బూనుచిత్రాంగదయనంగబొలుచునట్టి
మెలతపెండ్లితెఱఁగుజనమేజయుండు
వినెడువేడుకమదిలోనఁగొనలుసాగ.

వ.వైశంపాయనుంగనుంగొని.

తే.గీ.పెద్దయునుమాకొలంబునఁబేరుపడిన
క్రీడియెట్లుచిత్రాంగదకేలువట్టె
వేడుకలుమీఱనాలింతువీనులలర
దాఁచకానతీవయ్యయోతబిసిరాయ.

క.అనజడదారియుఱేనిం
గనుఁగొనిసందియముతీఱగారవమార౯
వినిపింపదొడఁగెగవ్వడి
మునుముద్దియఁబెండ్లియైనముచ్చటయెల్లన్.

సీ.మగఱాలజిగితూలనగఁజాలువగఁగ్రాలు
తెలిడాలుగలమేలుతిన్నెలమరఁ
బెనుగట్టులనురట్టులనుబెట్టునునుగుట్టుఁ
గొనితిట్టఁగనుపట్టుకోటలడర
నలరమ్ముచెలువమ్ములలిఁగ్రమ్మివెలిగ్రుమ్ము
మురిపెమ్మునెరనమ్ముముగుదలలర
నెనలేనిగొనబూనిపెనుకోవలనుదేనె
తెరిలానుదొరలేనితేఁటులొలయ

నెచటఁగనుఁగొన్ననేనుంగులేపచూప
నెల్లచోటులగుఱంబులెసకమెసఁగ
ముజ్జగంబులఁగలప్రోళ్ళమురుపునవ్వి
యలరుచుండునింద్రప్రసమనెడువీడు.

ప్రథమాశ్వాసము

తే.గీ.ప్రోలిహొంబట్టు టేక్కెంపుగాలియడిరి
ప్రొద్దుతేజీలనవ్వలఁ బోవకుండ
నాపఁగాఁగాదె తనతేరికతఁడుకట్టెఁ
బాముగుంపులఁజెలువంపుఁ బగ్గములుగ.

ఉ.చొక్కపుఁబైడిమేడలను సొంపగు పచ్చలచూరుపట్టెలం
   జెక్కినకప్పుఱాలపని చిత్తరువ్రాఁతల పారువంబుల౯
   దక్కెన్నటంచుఁ బట్టుకొన దగ్గరఁమాఁకుల నుండుడేగచాల్
   నిక్కుచు నంతదవ్వెగయ నేరక క్రమ్మఱివచ్చు నిచ్చలున్.

ఉ.ప్రోలికడాని మేడగమిఁబొందుగఁజెక్కినయట్టి పుల్గురా
   ఱాలమెఱుంగు రంగులతెఱంగుఁ గనుంగొని త్రోవకడ్డుగాఁ
   జాలెడుపచ్చికంచు నెదఁజందురుఁడెంచియె దానిమేయఁగాఁ
   దాలిచెనిఱ్ఱిఁగానియెడఁ దాల్పఁగ నాతనికిఱ్ఱియేటికిన్.

చ.నెలయరుదెంచి యుప్పరిగ నిద్దపుసోరణగండ్లు సొచ్చిన౯
   వెలఁదులులేచిచూచి కడువేడ్క మెయిం దమ కేలుదమ్ములం
   దలుపులుమూయఁగట్టువడి తద్దయుసేపట నేలనుండఁగాఁ
  గలుగుటఁజుమ్ముపొల్చె నెలకట్టులనంగను నేలలెంతయున్.

గీ.తద్దయును వేలుపులఱేని దాడికోడి
  గుంపులనుగూడి పఱతెంచి కోర్కులలరఁ
  గడలిడాగవచ్చిన కొండగమియనంగఁ
  గదిసితిరుగు నేనుంగులగడ్తయందు.

క.వీటనుగలగుఱ్ఱంబుల
  గాటపువడికోడిగడ్డి కఱిచెను లేడుల్
  మాటికిపడఁకుచు గాలియుఁ
  బోటరితనముడిగి యొక్కమూలంబడియె౯.

రసికజనమనోరంజనము


క. ఎప్పుడుఁబూవుందోఁటల
నొప్పగుతావులకుఁజిక్కియొగిఁజలిగాడ్పుల్
తప్పక కాపురముండఁగ
మెప్పొదనఁగఁ జలువలచట మేకొనియుండున్.

చ. వలపులుమీఱనీఱములఁ బ్రాఁకుచుఁ దమ్ముల మొత్తపున్శిరుల్
తొలుతను వెచ్చపెట్టి పువుఁదోఁటను మోవులుతావులాని పె
క్కులు గలిగింతలందనరి కొమ్మలనిమ్ములఁ గూడివీటికిం
దెలదెలవాఱువేళఁ జనుదెంచును దెమ్మెరదంటయల్లన న్.

ఉ. వేలుపుఁమాని క్రొవ్విరుల పెంవలపుల్ గొని విన్ను వాఁకపైఁ
దేలుచు దానిచల్వయును దెమ్మెరతెచ్చియొసంగి చెమ్మటల్
దూలఁగఁజేయునిద్దరను దోఁగిమగల్ జవరాండ్రువేకువన్
హాళినిమేలుకాంతురట నచ్చరబోటుల వీణెపాటాలన్ .

చ. అలయెలదోఁట మొత్త్తముల యందలిఁమాఁకుల పూవుఁదేనియల్
వెలువడి చేలకాలువల వెంబడిఁబాఱుచు నూరిపైరులం
బలువిడిఁ బండఁజేయఁగని మబ్బులుసిబ్బితి డాగనిచ్చలుం
బొలుపగుతావితో సగళునున్ బొగ లాడఁగఁజేయునెమ్ములన్ .

చ. ఎనమఱిలేక ప్రొఁజదువులెల్లను నేర్చుటెకాని లాఁతిచే
తను దలకొట్లనొందెనని తామరచూలిని దూఱి వేయునో
ళ్ళను దుదముట్టఁగాఁ జదువులంగనుటొక్కటె రెండు నాల్కలం
చొనరఁగఁబావఱేని నగియుందురు ప్రోలిని నేలవేలువుల్ .

సీ. చెవులెకన్నులుగాక దవునేలదాల్చరుల్
పలునాలుకలులేని పజదొరలొక
పగవానిఁగనిపాఱి బలుకొండకలుగున
డాగనిపసిఁడిపుట్టంవుదాల్పు

ప్రథమాశ్శాసము

<poem>లొగిఁబగల్ సేయని జగముచుట్టంబులు నడకఁదప్పనియట్టి పుడమిదాల్పు లొక్కనిఁజేరని రొక్కంపుటొడయండ్లు స్రుక్కిమైమఱవని చక్కనయ్య లౌరయని యెల్లవారును నలరుచుండ నలరుచుందురు తద్దయు బలిమికలి మి నాడితప్పక సరిలేనిపాడిగలిగి కొమరుపాయంపు నెఱరాచకొమరులచట. 41

చ.కలచెలి బిచ్చమెత్తుకొనఁగాఁగని యేరిచియున్నయూరునుం

 గులికెడు దాయపాల్వఱిచి కొండలపాలయి మూలఁబడ్డ జ
 క్కుల దొరదూఱి వీటఁగల కోమటులొప్పదు రెల్లనెచ్చెలుల్
 కలుములనొప్పి నిల్లుకదలంబని లేక కడిందిపేరున౯.     42
చ.తెల తెలవోయి కట్టుకొనఁదెల్లనిబట్టయెలేక మందలోఁ

రసికజమనోనంజనము


సీ, ఏనుంగుతలల బాలిండ్లుసొంపుగజేసి యానల్పుకొప్పులనలవరించి
చిందమ్ములనుగొంతు లందమ్ముగాజేసి
యాతెల్పు నవ్వులయందు బెట్టి
మల్లెముగ్గల చాలు మరి పల్వరుస జేసి
యామెత్తన పెదివులందిమిడ్చి
మఱ్రి పండులజన్ని జేసి మడిమలుకావించి
యాయెరు పడుకులయందమర్చి

నలువ యవ్వీటిబోటుల నలువుమీర
జేయబోలుగాకున్న నాసోయగంబు
వీసమంతై నగలుగదే వెతికిచూడ
ముజ్జగములందుగల వువ్వుబోడ్లయందు.

వ. మరిము నవ్వీడు నేడ నీడులేని వేడుకలగూడిమాడి ప్రోడలయి రేనిగాన నేతెంచిన లాతివిలాతుల యెడయండ్ల కడవన్నె బెడంగు బంగరు మగరానగల తెగలు రాపిడిందిగిలి నొగిలి నిగనిగ జిగ మిగుల దిగువంబొడియైకడు బుడమింబది యదరు కడిం దియినుక లెసకమెసగు తెరువులను నింతంతనరాని సంతంసబున బంతులుగట్టి రంతులుసేయుచు నెంతయునింతగా బంతంబున జేమంతి పూబంతుల పొతకు గంతులిడుమేటితేదాటుల తేటపాటలనాటంబయి యిరుగెలంకు బింకంవు గొరవంక తెగలుగల కొలంగదలును నీలిడాలు చేలలంగ్రాలు మేలిజెండాలచాలు గాలింగదలంబొదలు తగులున ముదలు తెగలని నిగిడి మిగుల పొగరున మగిడి నెట్టిన గట్టిడి వుట్టనట్టులం జుట్టుముట్టి కిట్టి పట్టిబెట్టుగ నిట్టూర్పులెడలం గట్టొగ గొట్టి పట్టరాని కట్టలుకంబొట్టలు పగులంగొట్టు బెట్టిదంపు ఖని కట్టిపెట్టి నట్టువంబుసలువుదిట్టనెమ్మిపిట్టల నొప్పియొప్పులుగుల్కు
ప్రద్ధమాశ్వాసము

రాచిల్కపల్కులం జెలువుగులుకు సింగారంపుఁదోఁటలును హెచ్చుగ
నిచ్చులు మెుచ్చులుగుల్కు వచ్చంపు ఁ బచ్చలతిన్నెలఁ జె న్నగునెన్న
రాని తిన్నని పగడంపు ఁ గంబంబు గుంపుల పొంపులునింపు పెంపగు
కొలువుకూటంబులునుం గలిగి మావులుం దావులుంగలిగి యెుల
దోఁటసాటిని ముత్తెసరులు బంగారుతీగెలునుంగలియుం దగవులేక
సిరికాటపట్టుయి పొల్కడలివడువునఁ దగవుకగియుం దగవులేక
గోతులచే నొప్పియు గోతులులేక యెుప్పి కొట్ట్లుండియు గొట్ట్లులేక
కరంబు డంబువిూఱు.

.క. అవ్వీడు యుదిష్టిరుఁడను
   పువ్విలుతునిఁ బోలుఱేఁడు పొందుగ నేలు౯
   జవ్వనము బలిమికలిమిని
   దవ్వలదొరలెల్ల ఁ దన్నుఁ దద్దయుఁగొలువన్

సీ. కడునొప్పుతనదు చాగవునీటియెుటీకిఁ
                             గడలికొండొక పిల్లకాల్యగాఁగ
    గ్రాలుతనయసంపుఁ బాలవెల్లికి ముజ్జ
                           గంబులు దీవులడంబుసూపఁ
    దనదు మార్తురకును దట్టంపుటడవిచా
                           లిఱుకైనచాలని యిండ్లుగాఁగఁ
దనిదుమార్తు రకును దట్టంపుటడవిచా
                          నేతెంచుదొరలకు నిమ్ముగాఁగ

 నొప్పు గాఁవుల కెల్లను నోముపంట
పాఱులకు సాదులకు గొప్పపట్టుకొమ్మ
బీదసాదలపాలిటి వేలల్పు చెట్టు
జగములందెల్ల మేటి యజ్జమునికొడుకు.

రసికజనమనోరంజనము

గీ. అడుగువెట్టిన మారుతుం డడుగుపట్టు

      మైమఱువిడిన ఁ బగతుండు మై మఱువిడుఁ 
      గొమరు దళుకొత్తు నారాచకొమరుఁబోలు
      ఱేఁడుగలఁడె  యెందును వలఱేఁడుదక్క.

ఉ. మెండియు ఁబైడియుం బుడమివేల్పుల కెన్నికవిూఱఁదెచ్చి కై

     కొండని ఱేఁడొసంగఁగని కుందుమది ం  నెలికొండవేలుపుం
     గొండలు గట్టువిల్తుఁ గడుఁగొల్చిన నిల్లును విల్లుఁగాఁగొనె౯
     మెండుగఁగొల్చిరే నతఁడు మేకొనియేలఁడె యెట్టివారలన్

చ. జగమునఁబుట్టి పుట్టుకయె సారకనుంగొను నెఱ్రవాఱుచుం

      బగ లొనరించుచు౯ బయలువ్రాఁకుచు నిల్కడలేక యెప్పుడుం
      దగఁజెరలాడుచుంబుడమిఁదద్దయు వేఁడిమిచూపి త్రాగనీ
      రగపడకుండఁజేయు జమునయ్య మహ సరియౌనెతేజునన్. 
ప్రధమాశ్వాసము

చల్లఁదనంబును బెల్లీవిగల్గుట
                              జాబిల్లి కొలమౌట సాటుచుండఁ
           జక్కఁదనంబును మిక్కిలి పరువంబు
                              వేఁగంటికొడుకౌలు వెల్లడింప
           నక్కటికంబును ననదలఁగాచుట
                               వెన్నుని చెలియౌట విన్నవింప
           నసమునువడిగల్లి యలరుటమిన్నేటి
                               ముమ్మనుమండౌట పూని తెలుప
          నన్నమాటయన్న నడుగుదాఁటక పిన్న
          పెద్దయంతరువుల పెంపుదెలియు
          మేటి క్రీడికెవరు సాటి ముజ్జగముల
         నతనికతఁడె సాటియగునుగాక.

         ఆతనిసోయగంబు చెవులార వినంగనునట్టి ముద్దియల్
         చేఁతలఁదొట్రుపాటెనయఁ జెల్వునినాతనిగాఁగ నెమ్మదిన్
         బ్రాఁతిగ నెంచి కూడుదురు బాపురె నిచ్చలుచూచిరేని యా
         నాతుల చేఁతలంగలుగు నానలుకందుఁడు కొల్లవెట్టఁడే.
         
         ఆతండొక్కఁడు ప్రొద్దువోక యొకనాఁడందందుఁ బూఁదోఁటలోఁ
        జేతుల్ చేతులు సేర్చికొదఱుచెలుల్ సేమంబునన్వెంటరా
       లాఁతుల్బారులుగట్టి చెంగలువ కేళాకూళి లోద్రోవలన్
       వాతోడై చనుదేరఁ గ్రుమ్మరితగన్ జాబిల్లిఱాతిన్నెపై.
    
       కలయంగఁబన్నిరు చిలికినకురువేళ్ళ
                              వీవనయొక్కండు వీచుచుండఁ
      బచ్చకవ్రపుఁదాని మెచ్చుగుబుల్కొను
                           పండాకుమడువు లొక్కండొసంగ

రసికజనమనోరంజనము

ముత్యాలకుచ్చులఁ బొదలుచిత్తరువ్రాఁత
                                  కెంబట్టుగొడుగొక్కఁ డెమ్మెఁబట్ట
    జిలుగుజరీచెట్లు తలగడతొడ క్రిందఁ
                            బదిలంబుగనొకండు కుదురుపఱకు
    
   వలపుగొలిపెడు చిఱుగాడ్పు లొలయుచుండఁ
   గెలనికొలఁకుల తేఁటులు వలుకుచుండఁ
   జెలులతో ముచ్చటల్ సల్పు చెలమితోడఁ
   జెన్నుమీఱంగఁ గూర్చుండి యున్న యెడను.

సీ. వేల్పురాయఁడు తన బిడ్డయొద్దికిఁబంపు
                               పొలుపొందు పచ్చలబొమ్మలనఁగఁ
     బ్రోలిటెక్కెపుఁ జేలగాలిని నేలపై
                               గూలు జేజేచెట్లకొమ్మలనఁగఁ
బ్రొద్దుమావులు మేయఁబోజాఱి వుడమి పైఁ
                                   బడు పచ్చిగడ్డిజొంపంబులనఁగఁ
బువుఁదోఁటగవ్వడిఁ బొడఁగాంచి మరుఁడంచు
                                   జేరుపూవిల్తు తేజీలనంగఁ

      జిలుకలొక రెండు ముద్దులు చిలుకుచుండ
      దిన్నె పై నున్న యెకిమీని కన్ను దోయి
      విందు చెందంగ ముందఱ నందమొందు
      పొన్న గున్నకు మిన్ను నఁదిన్నడిగియె.

క. ఆకై వడిడిగి కొడొక
     మ్రాఁకునుఁ గూర్చుండిలేచి మగుడని మదితో
    నాకవ్వడికన సొగనుల
    ప్రోకలనం జిల్కలల్లఁ బుడమికి డిగుచున్.

ప్రథమాశ్వాసము

చ. ఉడుగని వేడ్కతోడ మనమోచెలి యింతకుముందు త్రోవలో
               నెడననుకొన్న దాని కితఁడేతగుఁ గన్గొని ముచ్చటాడి వే
               వెడలుట మంచిమేలుగద వేయని యందొకచిల్క సంతనం
               బడరఁగఁబల్కెఁ గవ్వడికి నల్లవిసంబడఁ దోడిచిల్కతోన్.

సీ. అట్లు నేలకు డిగ్గి యాతండుగన్గొన
                       మురువుఁజూపుచుఁ గొంతపొంతయెల
   మ్రోలసంపఁగిచెట్టు వాలుగొమ్మను వ్రాలి
                          చూడ్కికింపును సొంపుఁజూపుచుండ
   నంతవివ్వచ్చుండు చెంతఁజిల్కలఁగాంచి
                            రాచిల్కలార మీరలనుకొన్న
   దెయ్యదిత్రోవలో నెవ్వనితో ముచ్చ
                            టింపఁగావలెనిందు నెందులకును
   మీరలేపని కరుగుచున్నారలిపుడు
   పయన మొకయింత గుదియించిపలుకనైన
   నదియుమాకుఁ జెప్పఁగవచ్చు నదియెయైన
   నించుకంతనిలిచి వినిపింపవలయు.

క. ఇందఱముందఱ నిందది
   పొదుగఁ జెప్పంగమీకుఁ బోలనిదైనన్
   సందడిడిందఁగ నాతని
   నెందైనఁగొనిచని ముచ్చటింపఁగఁ జెల్లున్.

క. మీయందము చందము కం
    దోయికి విందు గొలుపుచును దొందరనొందం
    జేయుచునున్నది మీపొం
    దేయడ నెడఁ బాయజూఁతురే యెవరైనన్.

రసికజనమనోరంజనము


గీ. తడయ మీపనియేమైనఁ జెడునొయబుచు

      నిపుడు మిమ్మింతగా వేగిరిపవలసెఁ
      గాని మీచెల్వు కన్నారఁగాంచుచున్న
      నెంతసేపైనఁ జూడనే యిచ్చవొడము.

చ. అనవిని చిల్కపల్కు నిటకారయ మేమరుదెంచుటెవ్వరిం

      గనుఁగొని మాటలాడనయ! గట్టిగ దేవరవారితోడనే
      మనవియనర్ప వచ్చితిమిమామదిఁగల్గినదెల్లఁ బై నము౯
      జనుటయె కర్జమైనఁ జనఁజాలము నీకొలువింతసేయఁగన్.

క. ననుమీరడిగిన దంతయు

      వినుఁడిఁక వినుపింతుమీకు వేడుకమీఱం
      గను మంజువాణియందురు
      నను నాచెలియె మృదువాణినాఁబడు నిదియు౯.

సీ. చిత్రవాహనుఁడనఁ జెలఁగుచుండెడు ఱేని

                                       వినియుందురాతని వీటినుండి
      పలుకుచేడియఁజూడఁ దొలివేల్పు జగమున
                                        కేగుచునున్నార మెలమితోడ
     ఱెక్కలునిమురుచు మక్కువవెలిచెన
                                         చక్కెరతినిపించు చక్కుఁజేర్చి
     తనబిడ్డలుగనెత్తి తడవుగనిన తల్ల్లి
                                         నెలెఁ బెంచుచుఁదనంతీవారిఁగాఁగ
    నొద్దఁగూర్చుండఁనెట్టుక ముద్దుచేతఁ 
    జనువుమీఱంగ నామెయె చదువుచెప్పి
    చక్కఁ దిద్దుకొనియెఁగానఁ జదువులెల్ల
నొనర నఱచేతినివై యుండుమాకు.
ప్రథమాశ్వాసము

గీ. అదియటుండనిండిఁక వేగనరిగి యచటఁ
       బల్కుపూబోడగాంచి పల్కులాడి
       మరలిరావలెఁగావున మాకునివుడ
       సెలవొసంగుము పోయివచ్చెదమటన్న.

వ. ఆవలంతి చిలుక మేలుబంతుల కాతండిట్లనియె.

గీ. తొలుతనేలకుడిగ్గుచుఁ ద్రోవలోన
       దవ్వులను మనమనుకొన్న దానికితఁడ్
       తిగును జెలియరో యంటివి దారిలోన
       నేమిచెప్పుకొంటీరి దేని కేనతగుదు.

గీ. అయ్యదిటువంటిదనిచెప్ప ననువుపడినఁ
       గొఱఁతవెట్టక యానతీఁగూడుననిన
       నలువలంకలుఁ దిలకించి చిలుకకలికి
       కలికిపలుకుల వలవులు చిలుకఁబలికె.

గీ. మంతనంబున మాటాడు మాటయదియుఁ
       బలుకవచ్చునె యౌనుగా మంచితఱియు
       నెవరుపెఱవారు లేరుగా యిందులోన
       నన్నమనవారలెగదయీయున్నవారు.

వ. అనిన నతందు.

గీ. కలికిచూపునఁ గొలువెల్ల గలయఁజూడ
      నేకతముగోరు నన్నగా నెల్లరెఱిఁగి
      చూపుతోడన వడిలేచి చుట్టునున్న
     తోడివారలు దవ్వులఁ దొలఁగిచనిరి.

వ. అంత మఱింత చెంతకుంజరగి ఱేని మొగంబునన చూపునిలీపి ముద్దులు గులుకు కలికిపలుకులు వీనులకువిందుగొలుప నాచిలుక యల్లన నిట్లు చెప్పందొడంగె.

రసికజనమనోరంజనము
ప్రధమశ్వాసము


లిటులువేల్పులదొంతియైయెసఁగుచున్న
కొమరుఁబాయంపుముద్దియఁగూడఁగల్గు
మేలుసమకూడెంనేని యోనేలఱేఁడ
కోరు కోరికలెల్లఁజేకూఱుటరుదె.

గీ. తలిరులింతియొడలిమెత్తతనముకోడి
యొడలులేనట్టివానికే యూఁచలయ్యొఁ
దొడరియేనుంగు లెలనాగ నడకకోడి
నడకతప్పిన కొండలకడనుజేరె.

సీ.వాలుమించును మించువాలును నడలించు
               మెలఁతుకకందొయి మెఱుఁగుటారు
వింటిబెళ్కును బెళ్కువింటినినడలించు
              నాతుకకంబొమల్ నడుమతీరు
తమ్మికెంపును గెంపుఁదమ్మినినదలించుఁ
              బడఁకవాతెఱయడుగుదొయి
మెఱుఁగుబంతిని బంతిమెఱుఁగునునందలీంచుఁ
               గన్నియనెమ్మెనుఁజన్నుదొయి

  వెలఁదిసొయంగబేమని విన్నవింతు
నచ్చరలయందు జక్కులమచ్చెకంటు
లందుఁజిలువారకన్ని యలందు నెంచు
గనియ వినియునెఱుు౦గనీకలికికీడు.


ఉ.చందురుమామ తమ్ములను జామమొగంబునిబోలముందుగాఁ
గందును మేడ్పుఁబాపుకొన గాల్కొనితామరసొటివచ్చె నె
మ్మిం దగ వేఁడివేల్పు నెఱమొప్పల నిల్కడలెకకుండు నా
చందురుఁడువచ్చుటకుఁ జాలక మారుతఁడయ్యె దానికిన్.

రసికజనమనోరంజనము

క. ఎలనాగ వాలుగన్నులు కలువలనుచుఁ జేరు తేఁటిగములనదల్పన్ దెలిచాన నడుమనుంచిన యలరెడు సంపంగి మొగ్గయన ముక్కుమరున్

శా.నేలంగల్గు పులుంగులేల్ల నెపుడున్ జెల్వారఁబల్కంగ నే నేలా పల్కగ నేరనైతిని మొం తేఁగెంపుకభుల్గుతా లోలోనందలపోసి నేర్చెనవలొలోఁజేరికాదంటిరే నేలా కోయిలపల్కులండ్రు వినువారెల్లంబువుంభోఁడికిన్ .

చ.కలువలు లేళ్ళు వాలుగలుఁ గాటుకపిట్టలుఁదేంటిచాలుఁదూ పులుఁదెలిదమ్మి ఱేకులనుముత్తేపుఁజిప్పలుమంచుగ్రొలువు ల్గులునననొప్పుతోమ్మిదియు గుభ్భెతకన్నులకోడెనంచుఁగ్రే వలఁజెలువారఁదొమ్మిదుల వ్రాసిరనంగను వీనులొప్పగున్ .

గీ.అతివాచననుపూవుగుత్తుల యండంజేరఁ ప్రధమా శ్వాసము


మ. కనుచేఁకుల్ బిగిగుబ్బజక్కల వీఁకంజూచి లోజంకి వే
డ్కను జేరంజని మోముచందురుని యండంకేకనూగారు పా
మనికింబొకిలి పుట్టవేవెడలిడాయంగాంచి వేఁడంగ వ
వచ్చిన జాబిల్లియనుంగుకొమ్మలన మించెన్ ముత్తియంపున్సరుల్.

గీ. మల్లె మొగ్గలజిగిఁబోలుఁ బలుమెఱుంగు
బలుమెఱుంగునుబోలుఁ గమ్మమెయితేట
లోలిమెయిఁదేఁటులనుబోలు వాలు నెఱులు
వాలునెఱులనుబోలు నప్పడఁతియారు

చ. మెలఁతుక చన్నుఁగొండలకు మీఁదను జిందపుదిట్టనెంతయున్
జెలువుగఁగొల్చి గొంతువెసఁజిందపు దిట్టతనంబువూనఁగా
బొలుపుగఁ జట్టువాలుదొరఁబొందెఁబిఱుదులు సైపలేకనే
ర్పలవడవెన్నుఁ జేరె నలపై దలికీల్జడ వింతదోపఁగన్.

చ,. మరుఁడను వేఁటకా డతిపబల్ చనుగొండలయండ ముత్యపు
న్సరులను బియ్యమాసలఁ బెనంగఁగ మచ్చిడి యదగాండ్ర య
బ్బురమగు డెందపు బులుగు మొత్తఁముబట్టుచు నీరుద్రావడ
గ్గరఁ జనుబొడ్డుడిగ్గియకుఁ గట్టినబంగరుమెట్టు లత్తఱుల్.
 
               
గీ. జవ్వనవుదఱిఁ గన్నియచన్నుదోయి
కౌనుకలిమిదోఁచుకొనియెఁ గాక యున్న
నింతలోగుబ్బలకుఁ గల్మియెట్టులబ్బె
నేమికతమున నడుముకు లేమికలిగె.

గీ. జవ్వనవుదఱిఁ గన్నియచన్నుదోయి
కౌనుకలిమిదోఁచుకొనియెఁ గాక యున్న
నింతలోగుబ్బలకుఁ గల్మియెట్టులబ్బె
నేమికతమున నడుముకు లేమికలిగె.
 

రసికజనమనోరంజనము


 గీ. చెలఁగి పలుచాలుఁగేలు మైజిగులఁబోలు
    నాసదానిమ్మయు నిగుర్లు నలరు మొదలు
    నడుముఁ దుదిలేని వేలుపుఁ గడఁగికొలిచి
    తామునట్లె చనులఁ గొప్పుఁ దఱులఁ బోలె.

ఉ. పోలఁగవెన్ను చూపె వరిపొట్టులు నేనుఁగు కేలుమోడ్చెఁ దా
   మేలును బొట్టలోన దలపెట్టుకొనెం దలవంచెనంటులున్
   దూలుచు లేళ్ళుగడ్డితినెఁదొయ్యలి పిక్కలఁ జన్నుదోయి మీఁ
   గాళుల నిద్దవుందొడలఁ గన్నులఁబోలఁగ జామింజుమీ.

క. నెలయా మొగంబుజిగి వె
  న్నెలయా తెలినవ్వుజవ్వు నెఱబంగరు గి
  న్నెలయా చన్నుంగవతి
  న్నెలయారె పిఱుందుదోయి నెలఁతకుఁదలఁపన్.
   
గీ. కాలియందెలన్ పాదులఁగలయఁబెరుగు
   నరఁటికంబంబు లెన్నంగ నతివతొడలు
   దాని యాకువీపు చలువదలఁచిపాదు
  కదిసినట్టి తాబేళ్ళు మీఁగాళ్ళుతలఁప.101

గీ.చెలువ నెమ్మోము చందురు గెలువఁజూచి
  యడుగుఁదమ్ములిదియె మంచియదనటంచు
  నతని కొమ్మలనీడ్చి తెచ్చి తమలెంక
  లుగ నొనర్చికొనెనన గోళ్ళొగిఁ జెలంగు.102

చ.చిలుకలకొల్కి నెన్నడుము సంగపుఁ జెల్వముఁజూపుఁ రూ
వులపసమించు మించులకుఁ బోఁడిమిమై జిగినించు నించుమి
క్కిలినగుఁబల్కు పల్కుదురె కెంపులసొంపులు మావు మావు వె
న్నెలలఁగని నవ్వునవ్వు జిగిఁనిద్దమెఱంగు మెఱుంగుఁ జెక్కిళుల్‌.103

ప్రధమాశ్వాసము 521

 గీ.మిలనేలఁజాలు వాలుఁగన్నులడాలు
మిన్ను చెన్నుఁదన్నుఁగన్నెకౌను
మించుమించుమించు నంచయాన యొడలు
పొగరుకొనరుచిగురు ముగుదకేలు. 104

సీ.వెన్నెలగువ్వల వెలయించుఁజెలినవ్వుఁ
        జన్నులునిడువాలుఁకన్నుదోయి
పుట్టతావులమిఱుఁబొలఁతుకపొక్కిలి
        మేనునుజెలువారు మెఱుఁగుటారు
పసిఁడితిప్పలనేలుఁబడఁతుకమైజిగి
        పిఱుఁదులుసిబ్బెంపు బిగువుఁజనులు
కెంపుఁదమ్ములసిరిగెల్చుఁగన్నియమెబి
       కన్నులునునుపారు కలికియడుగు
శౌర యాముద్దరాలి రూపమరఁగన్ను
నడవిలోఁగాయగసరుల నారగించి
చెట్టునీడలఁబవళించునట్టి తపను
లైనఁజేరికొల్వరె యింతియడుగుదోయి.
                                                                        105
చ.చెలువయె మావిగున్న యలచెల్వపుఁగొమ్మలె గొమ్మలె చేతు లండవుం
దలిరులె కేలుదోయి నెఱతావులపూవులె గోళ్ళుతేనియల్
దొలఁకెడుపండ్లె గుబ్బగవ లోఁతగుతొఱ్ఱయె బొడ్డు పండ్లకై
చెలువుగఁదొఱ్ఱవెల్వడిన చీమలబారులె యారు కన్గొనన్. 106

ఉ.తమ్మూలుకన్నుదోయి బలితిమ్ములు మేలిపిఱుంచు లెంతొ గు
త్తమ్ములు గుబ్బ లేనుఁగులతమ్ములునెన్నడలెన్న మించు మొ
త్తమ్ములుమేను కెఁవుసయితమ్ములుచేతులు కమ్మవిల్తు చే
తమ్ములు చూపు వీనులకితమ్ములు పల్కులు ముద్దు గుమ్మకున్. 107

522 రసికజనమనోరంజనము
ఉ.అనగుమోము చక్కఁదనమాతళుకుంజిగి చెక్కుదోయి యొ
     ప్పా నిరుపేదకౌను సొగపావెలితళ్కు పిసాళిచూపుడం
    బానిడవాలుగన్బెళుకు లాజిగినిద్దపు మేనిసోయగం
    బానునుసోగపెన్నెరుల యందమయారె యొయారికే తగున్. 108
క.అమ్మచ్చెకంటి చక్కఁద
    నమ్మంతయుఁజెప్పఁదరమె నాతిపిఱుఁదు నం
   దమ్మెన్నఁగ నొకనాఁడౌ
    నెమ్మెగమ్మెన్నంగ నొక్క నెలయౌఁజుమ్మీ. 109
గీ.అనుచువెండియు నేమిమెయనఁగడంగు
   చిలుక నరచేతనేమాన్చి చెలువుమీఱఁ
   బలికెనాతండు తాళుమోచిలుకరాయ
  వలదు నీమాటకడ్డంబు వత్తునివుడు. 110
గీ.నన్నుసైరించి నేనివుడెన్నఁబోవు
    పలుకువిని దానికిని మాఱు పలుకవలయు
   వింతదోఁపంగ నాతోడ నింతదనుక
  తేటగానీవు పలికిమాటలందు. 111
క."వెలిచాన నడుమనుంచిన
      యలరెడు సంపంగిమొగ్గ"యనిచెప్పితివా
   చెలువను నామెయొనర్చెనో
   కలుగునొ వేఱొండుతెఱఁగు కలయదిచెపుమా. 112
గీ.అనిన జిలుక పలుక నౌ చెలిచానయె
  చేసె నానెలంతఁజెప్ప కింత
   వఱకు నునిసైపవయును బయనంపుఁ
   దోందర మును చెప్పుఁదోఁచదయ్యె.

ప్రధమాశ్వాసము 528

 నలువరాణియుఁదానుగొలుపుండియొక్కనాఁ
                                డచ్చరల్ చనుదెంచియాడిచనిన
పిమ్మటఁగొంతసేవమ్ముద్దుగుమ్మల
                                చక్కఁదనంబున చాలఁబొగడి
మాటవెంబడి వారిసాటివారలఁజేయఁ
                              దనకెగా కొరులకుఁదనముగామి
మాటికిఁజెప్పున మగఁడుఁదానునుజేయ
                              రాదు వచ్చుననెడువాదుసల్పి

 వారిమిఱువారినిజేయవచ్చుననెడు
 మాటపట్టింపుఁబట్టి యమ్మచ్చెకంటి
 యీచెలినొనర్చిపంతునెగ్గించుకొనియె
నలువగరువంబుదిగజాఱెనాఁటినుండి. 114
ఈయతివఁబోల నలువకుఁ
జేయంగాఁదగిన నేర్పు చేకుఱమినిజం
బోయెలిక చేకుఱెనే
నాయన యెందైనఁజేయఁడామున్నెపుడున్.

దారినేతెంచుచుఁదడవోండొరులతోడ
వెలఁదిచక్కదవంబె వేయినోళ్ళుఁ
బొగడిమెచ్చుచు నామెసొగసున కెవ్వండొ
తగుమగండనియింతతడవుమేము
పరికించుచుని నిప్పట్టున మిము8ఁగాంచి
మిచెల్వుకనులారఁజూచిచాల
మదినచ్చెరువుఁబూని మాలోననేఁడుగా
కలికికీడగువానిఁ గంటిమనుచు

524                           
రసికజనమనోరంజనము

   సంతసము పట్టఁజాలక సరగడిగుచు
వంటిమితండ తగునని మిటివిగద
గడియయును మాకూనిచ్చటఁదడయఁదీఱ
దీగివత్తుము మఱచిపోయెదవుసుమ్ము.

క. అనివీడ్కొని రాచిల్కలు
వినుత్రొవన మిఁదికెగసి వెసఁజూవునకున్
గనఁబడక సాగిపోయెను
గనుచుండెడిఱేనిచూడ్కి కళవళపడఁగన్.

వ.అనిన తరువాతికత చెప్పుమని జనమేజయుండడుగుటయు.
మగందివృత్తము.

  పొన్నగున్న నెక్కి గొల్లపువ్వుబోండ్లతోడుతక్
  వన్నెమిఱఁజేతులెత్తి పల్వురొక్క చెల్వునన్
  జెన్నుమిఱమొక్కకున్న ఁజేలలియ్యనందు నాఁ
 డన్నపంతు గెల్చుకొన్న తట్టిదిట్టవేలుపా.

కందము, గోమూత్రికాబంధము.
దరివిసమిడఁజనుకొమ్మం
బొరిగొని తెలివొందు పైఁడిపుట్టమురాయా
పొరిఁగసవొడలను గ్రమ్మం
దెరిపిని జెలినందుఁగూడి దిట్టగురాగా.

గద్యము.

ఇది శ్రీమదాపస్తంబసూత్ర లోహితసగోత్ర శుద్ధాంధ్ర నిరోష్య నిర్వచన
 నైషధమహాకావ్య రచనచాతురీధీరంధర నద్యశోబంధుర కందు
   కూరివంశయఃపారావార రాకాకై రవమిత్ర సుబ్రహ్మణ్యామాత్య
   పుత్ర సుజనవిధేయ వీరేశలింగ నామధేయప్రణీతంబయిన
                        బ్రధమాశ్వాసము.