కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు/రసికజన మనోరంజనము-చతుర్థాశ్వాసము

రసికజన మనోరంజనము

చతుర్థాశ్వాసము

 క. సిరివడఁతి యెడ@ందనెప్పుడుఁ
     గరమలరఁగ గొల్చువారిఁ గడుఁగూరిమితో
     నరయుచు నెల్ల జగమ్ముల
     వెరవారఁగ బ్రోచుచుండు వేల్పుల వేల్పా.

వ. వైశంపాయనుం డటమీఁద నడచినకత జనమేజయున కిట్లని చెప్పం
     దొడంగె నట్లాబూటకంపు నేలవేలుపు సూటిగామాటలాడియా
     చేడియన్వీడ్కొని క్రీడికడకు న్వేడుకమెయిం జనిన వెనుక నమ్మచ్చె
     కంటి తమకంబు హెచ్చిపెచ్చు పెరిగెడి మరుచిచ్చున వ్రేఁగంజొచ్చిన
     నెచ్చెలులెల్ల బెల్లుగఁదల్లడిల్లి యుల్లంబులోని యారటంబు దీఱ
     నూఱడింపుచుండ.

క. పడమటిమల కలుగులలో
     నడఁగిన యిరులను గడంక నవలికిఁదఱుమన్
     వెడలెడి వడుపున నడిచెన్
    బడమటికొండకును బ్రొద్దువడిఁగెంపడన్.

చ. అదనదితప్పి వేఁడివెలుఁగత్తమిలన్ దడమెత్తుపాముగా
      ముదొరవిసంపుమంటలనఁ బొల్పగుఁ బడ్మరసంజకావి,పైఁ
     గుదిరిన సందెచీఁకటులు, చుక్కలొహిందలమానికంబులలౌ.

గీ. గొండ్లిసలిపెడి యురవడి గుబ్బలల్లు
     జడలగుంపులువీడి యీపుడమినెల్ల
     నలముకొనియె ననంగ నలుపుమిగిలి
     కటికిచీఁకటి యెల్లెడఁ గ్రమ్ముకొనియె.

చతుర్ధాశ్వాసము

</poem> చ. అలరెడు రేవెలంది చెలువారఁగఁదాల్చిన కావిరంగుదు

     వ్వలువవదల్చి చందురని వావిరిఁబొందఁగగోరి మల్లెమొ
     గ్లలుగల నీలిచీర మెయిఁగట్టెననంగనుజుడనొప్పెఁజు
      క్క్స్లగమితోడఁజీఁకటులు కన్నులపండువుగాఁగ నయ్యెడన్.

ఉ. గొందులుదూఱుచుంవెడలి గోడలుదూఁకుచుఁ బొంచిపొంచి

     సందడిగాకయుండఁ జిఱుసందుల వెంబడిఁ దావుఁకజేరుచున్
    సందియమంద కాఱడికి సై ఁ చుచు సాముల మోసపుచ్చుచుం
    జెందిరి కోరుకోరికలఁ జేరిబొజుంగులు దొంగలుందగన్.

గీ. తమ్ములకు దాయయౌఱేఁడుతాజగమ్ము

    నందుఁజొచ్చియుంటకుఁగాను ముందుపంపి
    నట్టి తెలిగుడారమనంగ నమరెఁదూర్పు
    దెసను దెలిపన్నె కలువలు తెల్వినొంద.

ఉ. చుక్కలఱేఁడు చీఁకటులసూడు వెలుంగులఱేని జోడు బల్

    జక్కనవుల్గు మొత్తముల సారెకునేచెడువాఁడుచక్కనౌ
    మిక్కిలి కంటిదేవరకు మేల్నగయై తగువాఁడు కల్వలన్
    మక్కువఁబ్రోచుఱేఁడు మరుమామ కనంబడెఁ దూర్పుకొండపైన్.

చ. తఱియనువేఁటకాఁడిరులదండను కోయిలగుంపుఁబట్టఁగాఁ

    బఱిచి వలన్ని గిడ్చెననఁ బర్వెను దూర్పునఁదెల్పు, లోఁజిగు
    ళ్ళెఱకయి పెట్టినట్టు నెలయింపగు, బడ్డ పులుంగనంగళం
    కొఱపగుఁ, గాంచి పర్విడెడు నోప్పనఁ గోయల లేగుజీకటుల్

చ. కొమరు వెలుంగు రేవెలది కొప్పనజీకటి, కొప్పుపూలునా

     నమరును ఱిక్కచాల్, నెలమొయూరపు రాగిడిబిళ్ళయట్లగున్,
     సమకొనుకందు లోనిడిన నల్లనిఱాయన నొప్పు, రాగిడిన్
     జమలిగఁ జుట్టుమల్లెలనుఁ జందురుచుట్టును దెల్పుగన్పడెన్.</poem> 
రసికజనమనోరంజనము

గీ. తమినిరేవెలంది యిడుగందమంబుమేనఁ
      దాఁజలువల ఱేఁడప్పుడు తాల్చెననఁగఁ
       దెల్ల నయ్యెను జందురుండల్లనల్ల
       నెల్లకడలను వెన్నెల లల్లుకొనియె.

సీ. నెఱతావులుచెలంగ నిండారవిరిసిన
మల్లెపూవులుతోడ వెల్లివిరిసి
కప్పురవుటనంటి విప్పుఁబొరలరాలు
కప్రంపుఁబొడితోడఁ గలసిమెలసి
కమ్మవిల్తునిదాయ కాపురంబైతగు
వెలిమలజిగితోడ వియ్యమంది
కఱివేల్పునిల్లాలిఁ గనిపెంపుగాంచిన
పాలమున్నీటితో మేలమాడి
మెండికొనియుండె బువునిండ వెండికొండ
కొండపిండులఁ జెండెడు దండిహత్తి
పిండికలకండ వెలిఁదమ్మి దండఁదెగడి
పండు రేయెండదండులు నిండుజిగిని.

వ.అత్తిఱి నాబిత్తరి చెలికత్తెలతోడ నత్తోఁటలోనుండి నిండికొన్న పండు
     వెన్నెల తెగల సెగలకుం దాళంజాలక.

ఉ. చెందొవవిందు దందడినిఁ జిందఱవందఱ చెందికుందఁగాఁ
      జిందురువిందఁ, గొందలముచెందఁగ డెందము కందుఁడందపుం
      గెందలిరుం దగందొడుగఁ, గ్రిందుపడందగు పొందికందొగల్
      సందడిచిందఁ దుందుడుకు చందముఁబొంది వెలందివందురున్.

ఉ. నెయ్యపుటొజ్జ లోఁగఱపి నిచ్చలునూల్కొలుపంగ నోరె మొ
య్యొయ్యన సన్నగించి మదినొంటుగనల్ల జగంబుచుట్టమున్

చతుర్ధాశ్వాసము

నెయ్యమునం దలంపుచును నిల్చినచన్నియు మానఁగా నతం
డయ్యెడమ్రోలఁగన్పడెనొయారియువ్రాలెనుగన్నుమూయుచున్.

వ. ఇట్లాతండు తనకన్నులమ్రోలఁనిలిచినట్లయిన మదికలంగి యచ్చెలువ
యొక్క నెచ్చెలితో నిట్లనియె.

ఉ. వీఁడుగదమ్మ నావలపు వీఱిఁడిచేసినవాఁడు, పొన్నపూ
      వీడుగదమ్మ లోఁతయిన యీతనిపొక్కిలి కింకనావెతల్
      వీడుఁగదమ్మ నన్నిపుడు వేయదఁజేర్చిన నీతఁడున్నయా
      వీడుగదమ్మ నేలఁగల వీడులలోపల మేటి బోటిరో.

వ.అని పచ్చనిల్తునినెఱచిచ్చునం గ్రాఁగుచు మఱియుం బలవింపం
     జొచ్చిన నెచ్చెలులు చలువపనులు సేయందలంచి.

సీ. చేడుయయడుగులఁ జిగురాకులుంచిరి
యింతిచన్నులఁబూవుబంతులిడిరి
పొలఁతితొడల నంటిపొరలనంటించిరి
ముగుదపొక్కిటఁ బొన్నవూనిడిరి
యువిదవాల్గన్నులఁ దొవరేకులద్దిరి
చానకెమ్మోవిఁ బూఁదేని యిడిరి
తొయ్యలిచేదోయిఁ దూండ్లనుబెనఁచిరి
కొమ్మకేల్గవవిరిదమ్ములిడిరి

రసికజనమనోరంజనము

కంటికాటుక నీటఁగందైన చెక్కుట
ద్దంబుల గందంబుదార్పవలదు
వలపుచీఁకటిబెంపువాసిన తుఱుము తేఁ
టులసంపెగల్చుట్టఁ దలఁపవలదు
బలువిరాళంపుఁగాఁకలఁ గందు చనునిమ్మ
పండులఁ గప్పురం బలఁదవలదు
దెసల నెల్లను బర్వుచు దిటముచెంది
పిక్కటిల్లుచు వెలుఁగొందు చుక్కల దొర
కాయు వేఁడివెన్నెలలందుఁ గలుకులార
పెట్టవలదు తామరకంటిఁ బెంపుమీఱ.

వ. అని యాచిత్రాంగదవంకం దిరిగి.

సీ. కై దమ్మి మోముచుక్కలరేని సెగఁగందం
జెక్కునఁజియ్యేలఁ జేర్చెదమ్మ
జార్కొప్పుచీఁకటిఁ జనుజక్క వలుగుందఁ
జానరో కురులేల జార్చెదమ్మ
నునుముక్కు సంపెఁగ నూగారుతుమ్మెదల్
బడలంగ మోమేల వాంచెదమ్మ
మినుకుకాటుకనీట నునుఁ జెక్కుటదముల్
మాయఁగన్నీ రేల పఱపెదమ్మ
చేయి దామరచెక్కునఁ దీయవమ్మ
ముంగురుల్ జాఱనీకమ్మ మోము మీఁది
కెత్తవమ్మ కన్నుఁగప నీరొత్తవమ్మ
పలుకువినవమ్మ లేవమ్మ పసిఁడిబొమ్మ.

గీ. గట్టువిలుకానినై నను గడియలోన! క్రిందుపఱుపంగఁజాలిన క్రీడియంత
వానికిని దుంటవిలుకాని బారిపడఁగ!నీకనినుఁగాచుటొకబరువేనెలంత.

చతుర్ధాశ్వాసము

గీ. నేటరేపట నిఁకమన నేలవేల్పు
     మన్నను జక్కఁబడునన్ని మానువెతల
     ననుచు ననబోఁడిఁ గడువేఁడి యందువలన
     నూఱట యెకింతగాన కయువిదమిన్న.

వ. తోడి చేడియలతోడ.

క. మునుకొని మరుఁడీకై వడి
      ననబోఁడి మెఱుంగుఁ జనుల నడుమనె పెడకుం
      జనకుండ గుఱిగనేయుట
      గనవింటికె కన్నులుండఁ గాఁబోలుఁజుఁడీ.

ఉ. చేతులు తమ్మితూండ్లనుచుఁ జేరినయంచలు కొప్పుజూచి వే
       బీతున నల్ల్ల మబ్బనుచు వెన్జనఁ, బంచిన గాలినారు పా
       మే తఱుమంగఁ బువ్విలుతుఁడేమిటఁ జామనుగెల్వలేమిఁద
       ర్వాత నెమళ్ళఁగూర్చెఁ బగవానికొమారుని వారువంబులన్.

వ. అనిచెపి యప్పుడు చెవులుచిల్లులువడఁ గడుఁగూయు కోయిలలు
      మొదలయిన వానింగూర్చి పేర్చిన కినుక పెంపున నిట్లనియె.

సీ. బరులవంచలఁజేరి యున్నట్టికోయిలా
యెందుకునీకింత యెరిగిపాటు
నిలువఁజటునులేక నింగివ్రేలెడు చంద
మామ నీకేలద్రిమ్మరితనంబు
చచ్చిచావనివాని చాడ్పుననున్నట్టి
మరుఁడనీకేటి కీమండిపాటు
కదిసికొమ్మలపాల బ్రదుకఁగాంచిన తుమ్మె
దా యేల నీకింతయదరిపాటు
మీకుమునుబోలె నిపుడు మామెలతతోడిఁ
యొక్కమాటనుంటయును మోమోటమియును

రసిజనమనోరంజనము

     లోని చుట్టఱికంబును జానుమీఱు
     చూపుచెలికారమును గొంతచూడవలదె.

క. కలువలదొర యల్లుఁడవై
      కలువలె తూవులుగఁదాల్చి కరమలరెడు నీ
      కలుకమెయి నక్కటకటా
      యళుకొందిన కలువకంటి నలఁచుటతగునే.

వ. అని మంచిమాటల నెంతవిన్నవించిన నించువిల్కానివలన నించు
      కంతయు నక్కటికంబుగానక కటకటంబడి పడంతియావెడవిల్తునిట్లు
     దూఱందొడంగె.

ఉ. ఒజ్జలకాపురంబు మొకలూడఁగద్రొబ్బిన రేయిద్రిమ్మరిన్
       బజ్జను జేర్చికొంటివఁట ప్రగ్గడగాఁగను గన్నతల్లులన్
       విజ్జునవీడనాడిచెడి వేఁబలుగాకులఁ గూడుపుట్టు గు
       డ్లిజ్జగమందు నీకుదడమేయఁట యింతులదోసమెట్టిదో.

గీ. చేతఁ జెఱుజువిల్లొక్కటి చిక్కఁబట్టి
       కంటఁబడకుండఁ బూఁదూపుగములు నాటె
       దేల నికమీఁదఁ దూపులు నేలఁగలియఁ
       బీల్చినీవిల్లు వేల్మిడిఁ బిప్పియుడుదు.

గీ. తోడఁబుట్టినదనియైనఁ జూడకెపుడు
       నీదు తల్లియిల్సిరిగూల్చి నీదుపగతు
       కడనుదలమానికంబయి గరువపడెడు
       నెలను జెలిఁజేసికొంటచేఁదులువవీవు.

గీ. అని మరు మఱియుదూఱఁగ నతివయొక తె
       కంటఁబడకుండు మరునేలకఱకులాడ
       మింటఁగడుమండు నెల చానమేనుగాఁడ
        ననుచుమరలింపఁ జందురుఁగనుచుఁ బలికె.

చతుర్ధాశ్వాసము

గీ. ఒకటి రెండునాఁడులు చెల్లియున్నాఁడె చూడరాడని నినుఁ బెద్దలాడుచుండ
 బెద్దవాఁడవై మిన్నంది మెలఁగునిన్ను
  జానలకుఁ జూడవచ్చుంనే చందమామ.

 గీ. తమ్మికంటియటంచు మాతలిరుబోఁడి
  నలుక మెయినలంచెద వేమొ యట్టుకను
  కలువకంటియెసుమ్ము మాకలికిమిన్న
  కనికరముచూపి కావుమో కలువ ఱేఁడ.

చ. సిరినిదోడఁబుట్టువయి చెన్నుగ వెన్నునకు న్మఱందివై
  యరిపదిమోములున్న దొర కౌదలనందపు మానికంబవై
  మరునకు మేనమామవయి మన్నన నత్రికి ముద్దుపట్టివై
  కరమలరారు నీకిటులు కల్కులనేఁచి కలంచఁబాడియే.

 చ. ఒరులకు ఁజేరదవ్వగుచు నొజ్జలకొంపనుదీసి తమ్ములం
  గరము బడల్పడంబఱపి కాంచినతండ్రికిఁ బోటు తెచ్చివం
  కరతనమల్ల చిన్నపుడె కాంచి కరంబునునీవు రేయిత్రి
  మ్మరివని పేరుపొంది యిఁక మన్నసఁజూతువె యాఁడువారలక్.

 సీ.నీదువెలుంగులు నెఱకాఁకలౌటను
                        జాలనీరగునెఱఱాలెతెలుపు
  నీనడతకరంబు నీతంబు తప్పట
                         నువిదఁగోల్పడిన నీయొజ్జతెలుపు

రసికజనమనోరంజనము


నీదువెన్నెలగముల్ నెఱవాఁడులౌటను
                              దలవాల్పు తమ్మిమొత్తములె తెలుపు
  నీరూపు చూపఱకోరువరాకుంటఁ
                           గవవిడియేగు జక్క నలెతెలుపు
నిట్టినీవలనను మేల్మి మెట్టుగలుగు
సరిగనీరూపు నానఁట సన్నగించి
పిదపఁ బడియాఱువ్రయ్యలై పెద్దపాము
నిన్ను రింగిన మ్రింగిన నెలఁతల నెగులుదీరు.

వ. అని చందురుందూఱి యుల్లంబు జల్లన మెల్లన మేనెల్లఁజిల్లులువోవఁ
బెల్లువీచు చల్లగాడ్పుగూర్చి యల్లన నిట్లనియె.

గీ. లేడికన్నులుగలది యీలేమమిన్న
లేడినెక్కుచుఁదిరిగెడువాఁడవీవు
నిట్టి చుట్టఱికంబుండ నింతినేచఁ
దగునె తనదీవె యునురని తలఁచియుండ.

చ.జగమునకీవుడు గడుసల్పుదువంచును దమ్మిచూలి నె
వ్వగనిను నొక్కమూలఁబడవై చెను దాననడంగకున్న నిన్
దగమెసవంగఁ బాములకు నాల్కలు రెండొనరించు వానికిన్
జగమున వేయేఁడులుమనన్ బ్రదుకిచ్చెనుగాదె పయ్యరా.

చతుర్ధాశ్వాసము


పండ్లుకొఱుకుచు నిల్వక యెగసిపడెడు
చిలుకనీబ్రతుకెల్ల ఁ జెట్లఁగలయ
పురుటింటిబూచులపోల్కి నివ్వెఱగొల్పు
తుమ్మెదానీత్రుళ్ళుతుప్పలెక్క
గంతులిడుచును దెరువర్లఁ గలఁచు చుండు
నెమ్మి నీయాటలెల్లను నేలఁబడను
నీళ్ళునములుచు మగువల నెగులుపఱచి
నిక్కు రాయంచ నీతిండినీరుగాను.

వ. ఇట్లు దూఱుచుండ.

ఉ. పిట్టలుగూసెఁజీఁకటుల పెంపెడఁబాసె మెఱుంగు రిక్కచాల్
బిట్టుగమాసె జక్కవలు వేడుకనొండొరుడాసెఁగల్వలె
ప్పట్టునఁదెల్వివాసె వెతవాసిన తమ్ములుపొంగి తేంట్లకున్
నెట్టనవిందుచేసె విలునేర్పునమూసె మరుండువేఁకువన్.

గీ.
వెచ్చకాండ్రమదులవేడుకడిందంగ

పాఱులలరి పగతటిపనులకడర

వడిగఁగాఁపునారు పని పా

రసికజనమనోరంజనము

క. తగువారల వెటంంగొని
      ప్రగడలుచని క్రీడిఁగాంచి వరుసగఁ బలుకం
      దగుపలుకులాడి విందుగ
       నగరికి విచ్చేయవేఁడ నగుచునతండున్.

క. గారవమునఁ దమ్ముందొర
      వారటుప్రగ్గడలఁబంచి వాసిగఁ బిలువం
      గారాకుండుట తగదని
      కూరిమి నేనుంగునెక్కి గొబ్బునఁగదలెన్.

గీ. ఆముటేనుఁగుపై నెక్కి యర్జునుండు
      రాచనగరికిఁబోవుచోఁ జూచువారు
      వేయికన్నుల వేలుపు బిడ్డఁజూడ
     వేయికన్నులెవలెనంచు వింతపడిరి.

గీ పొడుపుఁగొండమీఁదఁ బ్రొద్దువెల్లెడునట్లు
    వెలుఁగుచతఁడు వీట వెడలువవుడు
    మొలఁతుక లపరంజి మేడలపయినుండి
    యలరువానగురిసి రతినిమీఁద.

గీ. క్రీడివేంచేయుచున్నట్టి జాడతెలిసి
    వడిగఁ దగువారితో ఁ జిత్రవాహనుండు
    గౌరుపై న్ ఎక్కి యొదురేగి గారవమునఁ
    దోడుకొనితెచ్చి విడిదిలో దొరనునిలిపె.

గీ. విడిదిచేరినపిమ్మట వేడ్కమీఱ
     నేకతపుటిల్లుచొచ్చి వారిరువురింత
    మంతనంబున నేమేమొమాటలాడి
    యేగుదెంచిరినవ్వుకొంచివలకపుడు.

<poem>

చతుర్దాశ్వాసము

వ. అంతంసంతసంబునఁ జిత్రవాహనుండు తగుపోడిమి గీడినివీడుకొని తన యింటికింవచ్చి పెద్దలంజెచ్చెర రావించి పెండ్లికి దగిన మంచిమూ రుతంబు పెట్టుడని కట్టడయిడి యూరుగై నేయఁ జాటంబంచిన.

సీ. కస్తురి పన్నీట గలయం పి చల్లించి గోడలుజవ్వాజి తోడనలికి ముగ్గులు కట్టాణి ముత్తియంబులఁబెట్టి నెల ఱాలతోడఁదిన్నియలు వైచి డంబైన పగడంపుఁ గంబముల్నాటించి తెల్లక్రొవ్విరులఁ బందిల్లు వేసి తోరంపుఁబచ్చలఁ దోరణంబులుగట్టి రతనంపుదివ్వెలు జతను పఱిచి కలయ బంగరు పని మేలుకట్లుకట్టి వాడవాడల హొంబట్టు పడగలెత్తితావులమెరున్ <poem> 590 రసికజనమనోరంజనము

వ.అట్లు కదిసియచ్చట నెచ్చెలిమికానితో ముచ్చటలాడుచుండ. 65

చ.పలుకులలాగూ నెమ్మొగము బాగును మిసము నూగు నొక్కటై
     యలరుటకోరై తబ్రపడి యప్పటి పాఱునిఁగా నెఱింగి నె
     చ్చెలిగమిఁజీరి చెప్పె మనచెగటమున్ బువుదోఁట నేరిమిం
     బలికినయల్ల బూటకవు మాటలమూట యితండెయంచటన్. 66

క.తనగుట్టు బయలఁబెట్టక! పనిచేయఁగ నొడయఁడంత వడిహలవాఁడే
     ననబోఁడి గుట్టరయ నీ!యన సింగారించి పంచెనని నగిరిచెలుల్. 67

ఉ.ఆయెడ నింతియెర్తు మదినాఁగక కోర్కులు క్రేళ్ళు దాఁటనే
     మెయనఁబోవు నెచ్చెలిని మెవిపయిం జిఱు నవ్వు మొల్క లే
     పై యిగురొత్త గనయిగ నల్లనమానిచి జాఱుపైఁటఁజం
    దోయికి ఁదార్చుచుంబలికెఁ దొంగలి ఱెప్పల నొప్పులీనఁగన్. 68

గీ.మేలుగూర్చినవారికి మేలెకలుగుఁ
గావూనను మనమిజన్నిగట్టు నిపుడు
తోడఁబెండ్లి కొడుకు ఁజేయఁదొడరవలయ
మనువుకూర్చినపనికి ఁగామగువలార. 69

గీ.అనిన ముసిముసినగవుల నల్లఁబూని
యొండొరుల మెములనుజూచి యొక్క రొకరు
కన్నుసై గల నేనేమొ యెన్ను కొనిరి
క్రీడియునుగూర్మి సంగడి కాఁడునంత. 70

గీ.తేటరతనంపుముక్క లిపీట తెచ్చి
వింతకపురంపుఁ బొడులతోఁ బెట్టినట్టి
ముగ్గులోపల వేయంగబుడమి ఱేఁడు !
వచ్చి కూర్చుండెన ద్దానిపై నినపుడు

సీ. కురులు చిక్కూలుతీసి క్రొత్తసంపెఁగనూనెఁ
దలయంటెఁజిలుకలకొలికియెర్తు
వచ్చకప్రము చాయ పసవునమేదించి
నలుగిడెనెమ్మేను నాతి యేర్తు
    
  

మంచిగందపు దావి మించి గుబుల్కొన నటకలితలనిడె నతివ యెర్తు
బంగారు బిందెలఁ బన్నీరు గొనివచ్చి
జలకంబులాడించెఁజెలువయెర్తు

నీరుముమ్మాఱు తలచుట్టు నెఱయఁద్రిప్పి
తడవుమనుమని దీవించెఁబడఁతి యెర్తు
రతనములపీట దొరదిగి రాఁగానెదుట
నిలిపె బంగరు పావలు నెలఁతయెర్తు. 72

సీ.జిలుఁగు జెంద్రిక వన్నె చేల చెఱుంగువఁ
బెన్నెరుల్త డియొతైఁగన్నేయొకతె
గమగమవలపులు కడలుముంచుకోనంగఁ
జూసరుల్ సిహఁజుట్టె బోటియొకతె
పెళపెళలాడు దువ్వలువపింజెలుపెట్టి
వెసఁజేతికందిచ్చె వెలఁదియొకతె
రతనాలపనిమేలి రవణంపుగుంపులు
నెమ్మేనఁగీలించెఁగొమ్మయొకతె
పొలఁతియొక్కతె జవ్వాజిపూ సెమేనఁ
జెలువయొక్కతె పన్నీరుచిని కెఁబయిని
పూసురటివీచెఁ దలిరాకుబోఁడియొకతె
నిలువుటద్ద మొక నెలంత నిలిపెమెల. 73

గీ.ముద్దుకస్తూరినామంబు దిద్దెనొపటఁ
బెండ్ల పల్లకిలో నెక్కి విడిదివెడలి
యరిగె వియ్యపు వారింటి కచటమున్నె
మించిబోండ్లు చిత్రాంగదఁగొంచు ఁబోయి. 74
 

592 రససికజనమనోరంజన

 గీ. చలువనెలఱాల జలకంపుసాలలోన!
మేలిమివసిండీపీటపై మెలఁతనునిచి
తేళవళ్ళెరమునఁగెంపుదివ్వెపెట్టి!
జవ్వనులు పాటపాడినివ్వాళియియ్య.

ఉ.పయ్యెదజాఱఁజెక్కూఁగవపై జిఱిచెమ్మటలూరఁబూనరుల్
కయ్యముగోర లేఁగవును గబ్బిచనుంగవ దూఱ జాఱు కో
ప్పొయ్యన వీపుఁజేర వెసనూర్పులు పైపయి ఁగ్రమ్ముదేరఁదా
నయ్యెడ నింతియెర్తు తలయంటఁదొడంగెను వాలుఁగంటికిక్. 76

ఉ.పాయని వేడ్కఁదావి వెలిఁబర్వఁగ సంపఁగినూ నెయంటి క
ప్పై యిరిగుంపు పెంపు గెలువంగల నిద్దవు సోగపెన్నెరుల్
పాయలుతీసిదువ్వి చెలువమ్ముగఁజిక్కులువాపె నింతియె
ర్తాయెడ లేఁత కెంజిగురుటాకుల గేరెడు
కేలుఁదమ్ములన్. 77

గీ.పునుఁగుజెవ్వాదిమేదించి పెనఁచినట్టి!
తావికుంకుముపోళ్లతోదలిరుబోఁడి
మేననలుగులు వెట్టెను మెలఁతయెర్తు!
గబ్బిగుబ్బలవ్రేఁగునఁగౌనువడఁక.

గీ.సోలి సంపఁగినూనెచే సొమ్మసిలిన
పెన్నెరులనెడుతుమ్మెదపిండునకును
వెపనుసేదతేఱగమందువేయుకరుణి!
గురులకటకలియిడెలతకూనయెర్తు

గీ.పసిఁడిబిందెలఁబన్నీరు వరుసనించి
చెలులు రతనంపుగిండ్లతో జలకమార్ప
నెఱులవెండి దిగజాఱు నీరుపొలిచెఁ
గ్రొమ్మొయిలు జోరునను వానగురియునట్లు. 80

చ.తలతడి యొతైనొక్కచెలి తాబెడఁగుం దెలిపట్టుబట్టచేఁ
గలపముమైనలందె నొకకన్నియ కస్తురిబొట్టువెట్టెఁదా
వెలఁదుకయెర్తు నన్నోసట వేసలిఁబూవులుచేర్చే నింతియె
రైలమి నెలంత యొక్కరితె యింపుగఁగాటుకతీర్చెఁగన్నులన్. 81

గీ.విలువరతనంపుఁదొడవులువెట్టిమేన
జిలుఁగుంగరు కెంబట్టు చేలఁగట్టి

   చతుర్ధాశ్వాసము       


 చెలులుగైసేయ నెలమితోఁజెలువనపుడు
పెండ్లికూఁతును జేసిరి పేరటాండ్రు.
                                                82
వ.అంతఁబెండ్లిచావడియందు.
                                                     83
క.లగునమిదె పెండ్లికూఁతును!
నగుఁదేనని యొజ్జబాపనయ్యలుచెలులన్
మిగులందొందరపఱుపఁగ1
ముగుదలుపరుగెత్తి రంతివురికినినొటకన్. 84

చ.అడుగుల కెంపుడాల్పుడమి యత్తఱి నొత్తకయుండ నెఱ్ఱనౌ
మడుఁగులు కాళ్ళకుంబఱుచు మాడ్కినిబవ్వఁగ నిల్వుటద్దముల్
బడిబడిఁజెల్మి కత్తియలఁబ్రక్కల నిబ్బడిఁజేయ సిగ్గుతోఁ
బడఁతుక పెండ్లిన్నెకడవచ్చెనునెచ్చెలిపిండుతేరఁగన్. 85

గీ.కలికినెమ్మెము ఱేనికిఁగానిపించ
కుండముత్తైదువ లైరయొండుపట్ట
వెలసెనయ్యది నిండురేవెల్గునకును
మిగులమాటగుమేటిక్రొమ్మొగిలుకరణి. 86

క.నలుఁగడల వాయిదమ్ములు!చెలఁగంగాఁబేరటాండ్రు సేవలువల్లుక్.
బలుదీవనలిడఁబాఱులు!పొలుపుగఁజనెబెండ్లి యరుగుపొంతకుఱేఁడుక్.

క.కొమరాలినప్పడుటనే !మముతో నానేలఱేఁడిమాంకన్నాంతు
భ్యమహం సంప్రదదేయని !యమరంగా దారపోసె నల్లునకెలమిక్. 87

క.తెఱవలటుమింద్ర మెల్లన తెరనువంప
మిగుల సిగ్గున ముగుదయు మొగమువంచె
మగువచెలువంబుఁగనగ్రీడిమొగముసెత్తఁ
బచ్చవింటినిమరుఁడునుబైకినెతై. 89

గీ.పడఁతిమిన్నలు తెరనల్లవంచినపుడు
కనులు మిఱుమిట్లుగొనఁళ్కుమనియెఁజెలువ
బయలఁగాఱుక్రమ్మిన గొప్పమొయిలునుండి
 మించివెలువ క్రొక్కారు మెఱుముకరణి. 90


594 రసికజనోరంజనము

గీ.తొయ్యలి పిసాళి చూపులన్ తూపుగముల
నోంగానాటియుల్ల మిఱ్ఱాఁతలూఁచి
క్రీడిపయిని వ్రేల్మిడి నిండు గెలువుగాంచి
విరులవిల్తూఁడు కోయిని పేర్చియార్చె. 91

చ.సరగునఁగొమ్మనెమ్మొగము చాయలకుంజి ని సేదతేఱి ని
బ్బరమగు ఱేనిచూవుగవ పైకొకచోటికి సాఁగజూచియున్
గురులను చిమ్మచీఁకటిఁదగుల్కొనియాడకె దారితప్పి బల్
మురిపెపు నవ్వువెన్నెల వెలుంగున వచ్చు చునుండుఁగ్రమ్మఱన్. 92

ఉ.వేఱొక చోటికిం గదల వేమఱువెల్వడి యెందుఁబోవఁగా
నేరక క్రమ్మఱన్మొగమునే వడిఁజేరెడు చూపుమొత్త ము
య్యారవుఁజన్నుఁగొండలను నవ్వలఁదవ్వులఁగాంచి వానిఁబొం
గారఁగ నానవాలుగొని గంతిడి పాయకని ల్చి నచ్చటన్. 93

వ.అటుపిమ్మట. 94
చ.మురుగులుజాఱఁజెమ్మటలు ముద్ద మొగంబున ఁగాఱ ముత్యపు
నరులొకయెరఁజేరఁజిఱునవ్వులు మొల్కలుదేర నంటూజో
ళ్ళిరుదెసలందు ఁజెక్కులవపయినడిఁదూఁగుచు డాలువాఱ నా
దోర తలఁబ్రాలువోసి నలతొయ్యలి యౌఁదలమిద దోయిటన్.

ఉ.కౌనసియాడ ముంగురులు గ్రక్కునఁజెక్కూలమిఁదఁగూడఁబెం
వూనిన గుబ్బదోయి పయినోక్కట పేరులు త్రొక్కులాడఁబై
పైని బయింటయూడ నునుబంగరుగాజులు పట్టు వీడ నా
చానయుఁగ్రీడిమిఁదను వెసం దలఁబ్రాలనుబోసె దోయిటన్. 96

క.మదిలో పల ఁగలకూరిమి
నిదె నేఁబయిచేయియగుదు నిదెయేనగుదున్
వదలక కనుఁడనుక్రియ వా
రొదుగక తలం బ్రాలు పోసి రొండొరుల పయిన్. 97

చతుర్థాశ్వాసము

గీ.ఒండొరుల మేనుసోకుటనొక్కసారి
కన్నెకును ఱేనికిని మేను గగురుపొడువ
దాళిగట్టె నాతడు జవరాలి మెడను
నేలవేల్పుల దీవనల్నింగిముట్టు.

గీ.అగ్గినెలకొల్పి మఱి వారలందులోన
నేయివ్రేల్చిరి పిమ్మట నేలఱేడు
పట్టి సన్నెకల్ ద్రొక్కించెబడతిచేత
నంత బేలాలు వ్రేల్చెనయ్యింతిమిన్న.

సీ.ఎలుగెత్తిపాడెడి యింపైనపాటలు
గండుగోయిలపిండు గరువమడప
పలుకునప్పుడుతోచు పల్వరుసలడాలు
నలువలంకులను వెన్నెలలనింప
పళ్లెమందలిదివ్వెబటువైనమగరాల
మెడ పేరులకు గెంపుబెడగుగూర్ప
మేనిబంగరునిగ్గు మేలిమిబంగారు
పళ్ళెరంబునకును బసిమియొనగ
వారిమోముల కెనరామిబట్టి నెలను
దిగదుడువు పెట్టు కై వడి మొగములకును
జెలికి జెలువునకైదువ లలరువేడ్క
గప్పురపుటారతులనిచ్చి రొప్పుమిఱ

గీ.మొదటినాటితంతు ముగిసినపిమ్మట
బాకెవయును నాగవల్లిమఱియు
వేఱ జరగవలయు వేడుకలెల్లను
వరుసజరిగె నెల్లవారు చెలగ.

రసికజనమనోరంజనము

గీ.నాగవల్లియు లోనుగా నడచినంత
బెండ్లినాడులు గడువంగ బేర్మితోడ
నాలుమగలను గలువంగ నపుడుతలచి
మేటివేడుక నాలవనాటిరేయి.

సీ.కమ్మతావులుగ్రమ్ము కవురంపువిడెములు
పసిడిపళ్ళెరముల బొసగనుంచి
కస్తురి జవ్వాజి గందంబు బన్నీరు
రతనంపుగిండుల రమణనుంచి
పటికంపుగోడల పజ్జనిర్వంకల
నిలువుటద్దంబులు నెలవుకొలిపి
పగడంపునునుగోళ్ళ పచ్చలపీట పై
వట్టివేళ్ళసురటి పెట్టియుంచి
వెండితబుకులబండ్లు వేర్వేరపెట్టి
గొప్పరతనంపుదివ్వెలు కుదురుపఱిచి
మేలిచొక్కవు బంగారుమేడలోని
వింతగదిని సింగారించి రింతులంత.

గీ.పడకగదిలోని రతనంపు బసిడికోళ్ళ
దోమతెర పట్టెమంచంబు పై మెఱుంగు
టంచ దూదిపాంనున బవ్వళించియుండె
నతివరాకను మదిగోరియల్ల ఱేడు.

వ.అంతకమున్న.

చ.కలవమలంది నెన్నొసట గస్తురిబొట్టమరించి చేరలన్
గొలువగజాలు కన్ను గవకుంగగాటుకవెట్టి క్రొవ్వెదన్
వలపుగ్రమ్ము పూసరులు వావిరిజుట్టి పసిండిపుట్టము
జెలువుగ గట్టి చెల్వగయిసేసిరి సొమ్ములు వెట్టి నెచ్చెలుల్.


చతుర్థాశ్వాసము

గీ.చెలులు కయిచేసి తరసింప సిగ్గుకతన
బడతినెమ్మోమువంచి తానడువకున్న
బుద్దులనుజెప్పి మఱిమఱి బుజ్జగించి
వూవుబోడులు బలిమిమై బొదిగిపట్టి.

క.ననబోడి నొకటలాగుచు
బెనిమిటికడ జేర్పదివురవింతగనాజ
వ్వని తాబోక పెనంగిన
గనుగొని యొకచెల్వ యనియె గన్నులనగుచు

గీ.ఇచట మాతోడ బెనగిన నెవ్వరిందు
జూచిమెచ్చుదు రాతండచూచిమెచ్చు
బులువుతీఱంగ బడకింటిపొంతజేరి
వెనుకతీయక మగనితో బెనగరాదె.

క.అనుటయు సిగ్గును జెలిపై
గినుకయు జిఱునవ్వునొకట గిరికొన నవుడ
న్ననబోడి నట్టెవైచెను
గనుదోయిం గెంపుదోప గై విరిదండన్.

గీ.చెలిమికత్తెలు ముందుకు సిగ్గొకింత
వెనుకకునుద్రోయ మెల్లన వెలదినడిచి



గీ.అంతటను గ్రీడీ ముద్దియ నల్ల ఁజెరి
మేను చెమరిఁపఁ గెంగేలు మెల్లఁబట్టి
మగుద వెరి పాపఇకి రాఁదిగిచికొనుచు
పంచుకొనియున్న నెమోము పఇకినెతి.

క.వలపుబయల్ప డముద్దడి
వెలదుఁకతో ఁగూడిరెయి వేడూకనుడన్
బెలుచనఁ గొకోరొకోయని
వెలుపలఁ దగఁగోళ్లుకూ వేకువ తెలియన్.

గీ.తడవు `ఱ్`నితోశడను దనరియుండీ
వెడలఁబోయెడుతరిని రేవెలఁదివిప్పు
కొప్పునందుండీ దిగజా`ఱి` కూలినట్టి
విరులబంతి నాఁ దోతేంచ్ వేఁగుఁజూక్క.

చ.వగలొనరించుసాటిదొరవచ్చి దెసల్ వెసఁ గ్రమ్మునంచు నె
వ్వగఁదనతేజుగోలుపడి పాఱ్`డుదుక్కలఱ్`నిజూచి లో
దిగులునఁదెల్వఁబాసెననఁదెల్లపడెంగడురికా గుంపూలన్

చతుర్థాశ్వాసము

గీ.తమ్మిచెలికాడు చీకట్లదఱుమువాడు
కలువగుంపులనూడు రేవెలుగుజోడు
గాములకు నెకిమిడు జక్కవలఱేడు
పొడుపుగొండను జూపట్టె బ్రొద్దుపిదవ.

గీ.అంతకంతకు వింతయొయ్యారమమర
నరమరలు లేని వలవుల ననగిపెనగి
చెల్వుడును జెల్వయును గూర్మి చెన్నుమిఱ
హాయిగా నుండిరచ్చోట సొఱునెలలు.

క.ఈలోపల నాతోయ్యలి
చూలాలయ్యెను మగండు జుట్టములునెదన్
హాళింబొందగదండియు
జాలగొలమునిల్చునందు సంతనపడగ

చ.చనుమొనలు నల్లపడియెను
జనజనవేవిళ్ళు హెచ్చె జవిమంటివయి
గననయ్యె నెలలునిండిన
గనియెనుముద్దుల కొమారు గన్నియయెలమిన్.

గీ.పుడమివేల్పులిడిన మంచిమూర్తమందు
బభ్రువాహనుండనుచును బౌగుమిఱ
బేరువెట్టిరి యాపసిబిడ్డకెలమి
బెరుగుచుండె నతడు తాతయిరవునందె.

క.అనివై శంపాయనుడిటు
జన మేజయునకు గరంబు సంతపమెదలో
నెనయగ జిత్రాంగదకత
వినిపించిన వినియతండు వేడుక బొదలెన్.

రసికజన మనోరంజనము
కందము.ముక్తపదగ్రస్తము.

సిరిఱొమ్మునఁ దాల్చినదొర
దొరలేనిబలిమిఁ బగతురఁదునుము వెరవరీ
వెరవఱినవారిఁ బ్రోచెడు
గరువా, గరువంబులేని కఱదుల వేల్ఫా.

                                  తోటకవృత్తము.

పొలుపొందిన బీరముపూనిజగం
బులనెల్లను నేఁచుచు ముద్దియలా
ర్వలలిం జెఱఁబెట్టింన రావణు నౌ
దలలెల్లనుద్రుంచిన దండిదొరా.

                                        గద్యము.

ఇదిశ్రీమదాసస్తంబసూత్ర లోహితసగోత్ర శుద్ధాంధ్ర నిరోష్ఠ్య నిర్వచన నైషధమహకావ్య రచనాచాతురీధురంధర పద్యశోబంధుర కందుకూరివంశ పయఃసారావార రాకాకై రవమిత్ర సుబ్రహ్మణ్యామాత్య పుత్ర సుజనవిధేయ వీరేశలింగ నామధేయప్రణీతంబయిన రసిక జనమనోరంజనం బను ప్రబంధరత్నంబు నందుఁ సర్వంబును జతుర్ధాశ్వాసము సంపూర్ణము.