కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు/అభాగ్యోపాఖ్యానము-హాస్య ప్రబంధము

అభాగ్యోపాఖ్యానము.

హాస్య ప్రబంధము.


క. శ్రీరమణీహృల్లోలా | కారుణ్యలతాలవాల కాంచనచేలా
   ఘోరాహవజయశీలా । శ్రీరాజమహేంద్రవరపురీగోపాలా . ౧

వ. భవదీయికరుణాకటాక్ష వీక్షాసమాసాదిత సరసకవిత్వ పటుత్వంబుపెంపున నేఁగల్పింపంబూనిన హాస్యరసప్రధానంబగు నభాగ్యోపాఖ్యానంబునకుఁ గథాక్రమం బెట్టిదనిన. ౨

క. అడవులలోఁగడునిడుమలు ।
గుడుచుచుధర్మాత్మజుండు కొందలపడఁగన్
వడిఁ బరిహాసకుఁడొకఁడ |
య్యెడకునుజనుదెంచి మ్రొక్కి యీకథచెప్పెన్ ౩

గీ. వింధ్యధాత్రీధరప్రాంత వంధ్యభూమి । జలములేనట్టి యొకపాడుకొలనుదరిని
దండకారణ్యమధ్యంబుఁ దనరఁజేయుఁ ।
బాపసదనంబు వ్యాఘ్రాఖ్య పట్టణంబు.

క. ఆపురము లచ్చియప్పకుఁ ।
గాపురము, జగంబులందుఁ గలపురములలోఁ
గాపురము, పాపనమితికి ।
దాపురము, మహాపురమలదానవతతికిన్ . ౫

క. అన్నగరంబునఁ గరమ ।
భ్యున్న తివహియించుకుజనపుంగవకౌటి
ల్యోన్నతి కోడుటఁ గాదే ।
పన్నగకులమెల్లఁ జేరెఁ బాతాళంబున్ . ౬

సీ. వెలయాలినింటనె నిడియించి దానిచేఁ
దిట్లునుదన్నులుఁ దినెడువారు
తల్లిపోయిననాఁడు దానింట నేయుండి
పనియున్నది దెవత్తున నెడివారు
కన్నెఱికము చేయు కార్యంబునకుఁ బూర్వులార్జించుమాన్యమ్ములమ్మువారు
భోగకాంతలుగాక పొరుగువారల భార్య
లనుజేరి సౌఖ్యంబుగ నెడువారు

విలువసారాయిసీసాలకొలఁదిఁద్రావి
 యొడలు దెలియక వీధులఁబ డెడువారు
నగుచుమర్యాదలనుగాంతు రనవరతము । బ్రాహ్మణోత్తములాదివ్యపట్టణమున. ౭.

చ. కురుబలముం గనుంగొనుచుఁ గోటితురంగ జవంబుతోడ ను
త్తరుఁ డరదంబుడిగ్గి పురితట్టునఁ బాఱియుఁ గ్రీడిప్రేరణన్
మరలఁగఁ బోరికేగుటకు నవ్వుచు నుందురు పోటుబంటులై
పిఱికితనంబునం బురిని బేరువహించిన రాజపుంగవుల్. ౮

గీ. బియ్యమున వడ్లు బెడ్డలు పెక్కుగలిపి
నేతిలో వంటిపండ్లను నెఱయఁబిసికి
తప్పుతూనిక తూచుచుఁ దక్కువగను
గొలుచుచును గోమటులు సొమ్ముఁగూర్చుకొండ్రు. ౯

గీ. కూట సాక్ష్యంబు బ్రాహ్మణగురువలన |
 బాగుగా నేర్చుకొని పాటుపడుటమఱచి
జూదములదొంగతనముల శూరులగుచు ;
శోభఁగాంతురు పురిలోన శూద్రజనులు. ౧౦

చ. తనపలుముండ్లవాఁడిమిని దప్పక వాసవువజ్రమున్ జయిం

    ప నతిదృఢంపుమట్ట లను మైమఱువొప్పఁగనేగి ముండ్లచే
    ననిఁ గులిశంబు గెల్చి తనకడ్డగు వేల్పులకండలొల్చి తా
    నొనరెననంగ బ్రహ్మజెము డొప్పగు నెఱ్ఱనిపండ్లగుంపుతోన్. ౧౧

చ. పురిఁదగుఁ జుట్టునుంగదిసి భూరిభయంకరలీల దట్టమై

    పెరిఁగినగచ్చపెన్‍బొదలు పెట్టనికోటగ లోనియీతచాల్
    బురుజులుగాఁగ, దాపునను బొల్చినతుమ్ములు పెద్దముండ్లతో
    సురియలుదూసి నద్భటులు స్రుక్కక కావలిగాచుతీరుగాన్.

సీ. మార్దవం బంగ నామణులచన్నులయంద సాహసంబాహారసమయమంద ౧౨ ప్రజ్ఞయంతయును దంభములు కొట్టుటయంద బంటుతనము వంటయింటియంద మితభాషణము శాస్త్రతతులచర్చలయంద కలిమి పురంద్రులకౌనులంద నిలుకడ నెలఁతల నేత్రయుగ్మములంద ధైర్యంబు పెద్దలఁదఱముటంద వడి లతాంగుల వంకరెనడలయంద | శాంతి యెంతయు దుష్కర్మసహనమంద కానిమఱియెందువెదకినఁ గానరాద | నంగఁ దద్దయు నాపట్టణమువెలుంగు. ౧౩

గీ. తివిరిపాప పుంజంబు మూర్తీభవించి నచ్చిగుమిగూడి ప్రోల్చొరఁబాఱుకరణిఁ బందిగున్నలు చెరలాడు సందులందు | దున్నపోతులకైవడిఁ జెన్నుమీఱి. ౧౪ గీ. చేరినిల్చిన నంటయిల్ చేరినిల్చుఁ | గానవచ్చినఁ బరువెత్తి కానసొచ్చు డంబుమీఱిన భటసమూహంబుతోడ | సాటియౌదురె మాననకోటినెవరు. ౧౫

గీ. వీటఁగల్గిన ఘోటక కోటితోడ | నిలిచిప్రాఁకంగ నేరక నీరుసొచ్చె వెఱచి తాఁబేటిగుంపులు వేయునేల ; పురినిబుట్టిన సుక్కైనఁబుచ్చిపోవు. ౧౬

చ. దనుజులు మర్య్తులందునిమి తత్తనుమాంసము మెక్కి పోవఁగా నెనసి పురంబునల్గడల నెమ్ములరాసులు భూధరంబుల ట్లనుపమలీలనుండఁ బ్రమథావళితోడ మనోజవైరి యా మనికికి వెండికొండయని మాటికివచ్చుఁ బరిభ్రమమింపుచున్. ౧౭

ఉ. కొంపలమీఁదితుక్కెగరఁగొట్టుకుపోవఁగఁ దూముకాల్వలోఁ గంపునుగూడి తోఁటలనుగల్గిన కుక్కపొగాకుచెట్లబల్ గుంపులవాసనంగలిగి కుప్పలు నిప్పులు రాల వేఁడిలో ముంపుచు వాయువుల్ పొలయు ముక్కునవెండ్రుకలలెల్లమాడఁగన్. ౧౮

ఉ. అంగన లూర మెల్లఁ జనునప్పుడు కూడెదమంచు లేళ్ళుఁ జి వ్వంగులుఁజేరి యోటువడువారినిఁ గెల్చినవారు మ్రింగఁగాఁ బొంగుచుఁబన్నిదంబడఁచి పోవఁగ జాలక లేడులో డెఁజి వ్వంగులు గెల్చెఁ గానియెడ వానికి లేళ్ళనుజంపనేటికిన్. ౧౯

ఉ. ఆపురమేలు రాక్షసమహాకులవారిధి బాడబుండు, కా శీ పురనాథవిష్ణుసరసీరుహసంభవపాదభక్తసం తాపకరుండు, పుణ్యవసుధాధర వజ్రధరుండు, ప్రోల్లస త్పాపధనంజయానిలుఁడు, దానవుఁ డొక్కఁ డభాగ్యనాముడై. ౨౦ <poem>ఆబాగ్యొపాఖ్యానము


సీ. వానిదుష్కీర్తితొ  వాసిచెండఁగఁ  బూని
                             కుందుచుచుఁజీఁకట్టు  గుహలనడఁగె
 వానిమైబిగితొడ    వాదులడగాఁబూది
                             ఖడ్గమృగంబులు   కానడాగె
  వానిచెపలముతొఁ బ్రతిఁబొందగాఁ  బూని
                             వాసరజూలబు   వనముదూఱే
 వానిమాంద్యముతొ   సమానంబురాఁబూని
                           దున్నలు  బురదలొదొర్లిఁదొడగె
  వానిక్రార్యంబుతొ  దినూనఁబూనిఁ
  జడసి  వ్యాద్రుంబు   లడవిలొనంచరించె
  వానికంతస్వరబుతొ   వాదుపూని
  పొరలె  గార్దభబృందంబు  బూదిలొన.
 క  నిరతము  కెంభునిపూజలు
     కర  మొనరుచుచుండు   పజ్క్తికంకుడు   సరియే
     పరమాదమగుణుఁదగునీ
     హరదూషణ్పరున    కదని   వ్యభిచారమున.
క. వదలక  వారలమ్మతి
    ముదమున  దినమొకని  బకుఁడుపొలియించెను
    డదరక  బలవంతంబుగఁ
    బడుగుర   గూడ్వురదినంబుఁ  బట్టినదించు
 క. దీరహితుండె  తగియున
      దీరహితుందె  దరిత్రి   దినర  నెలె
      గ్రూరాగ్రెనరుఁ   డాబిలు
      దారాతి  తనదుచరిత    మతిచిత్రముగాన్. <poem>అభాగ్యొపాఖ్యానము
ఉ. అతనికిఁ   బొట్టకొసినను   నక్షరమొక్కటిలెదు:   కాగడ
     నెతకినఁ  దెల్విలెదు:  దయ  విసమునుం  గలనైనలెదు:  ప్రొ
     న్నతనయద్వలెదు    పడునాల్గుపుట్టబులు  వెట్టికాల్చిన:
     జతురత   వాతపెట్టనను   సత్యముజిహ్వకు   రాదొకప్పడు.
వ. ఆతండొక్కనాఁడు.

సీ. ఒకదిక్కుననుగుక్కలొకగాఁగూయ

                            నొకచెంతబలుదుంతలొలసియార్వ్

నొకమూలఖర జల మురుతీలనొండ్రీంప

                            నొకచొట   గుడినెటియువతులడల

నికదండముది ముండ లొకదడుగాఁగూడ

                           నొకవంశవలుకుంక   లొదిగియుండ

నొకపుంతఁగడముంత లొకదొంతరగ నుండ

                           నొకక్రెనమదుసెవ    లొనజెయఁ

వెంతపొగులు జీవుళ్ళుం బెడకుప్పఁ లలుకుగుడలుఁ గొడియికలునుదవర దంబుమీజీవ కునకాసనంబునందుఁ గొలువులొఁ జచ్చినట్టులు కూరచుడె.

ఉ. ఆగతిఁ  గొల్వులొన    డనుజాదముఁడుండి  గులమునొక్కని
     వెగమపిచ్చి   వెంతపయి   వెడుకనాకిపుడుద్బవిల్లె   నె
     వెగమ   వెఁటకాండ్ర    మనవెపులఁ దొడొనిరమ్ము  నావుడను
     సాగి  యతండు   చచ్చిచెడి      చాలఁగజెప్పినరితిఁ  జెసిన
గీ. ముడ్డి మెండిమున    మొద్దుగుముమిఁద
    గదలకుండంనెక్కి   కాళ్ళునెలఁ
    దగులగూరుచుండి    తక్కినవారలు
    బెనుకఁ జెరితొల    వెడలెనతఁడు. <poem>అభాగ్యొహబ్యానము

వ. అట్లమిడిమిడిమొడం గాళ్ళుగాల నెత్తిమాడఁ బురంబువెడలి.

చ. మలమున ముఁగునీఁ గలక్రమంబునఁ బినుగుచుట్టుఁ జెరున క్కలగతిఁ బుల్లెపైఁగనియుకాకులకై పడి వెటక్రాండఁ గు క్కలు సరదార్లు నల్గడల గ్రమ్మిరయంబున నేగు దేర గా వెడలె నతండు కాకముల దెవులు నక్కలు గూయంచుడఁగన్


వ. అంత

చ. దనుజునిఁడ సూక్ష్మతర దారుణ నెంత్ర యెకర్తు ముందుగా

     నెనసిన   మొడిగొదపయి   నెక్కిన  ముదుయయేర్తువచ్చితా
     వెనకకుఁదొచె   నందునను   నెమ్ములు   రాలగుడిమా
     నిని   వెసమూర్చపొయెవడి  నెచ్చలు    వెడిచిరొక్కి  పెట్టునన్

ఉ. నితలిరొజ యెక్కరిత చె దనుజుంగన గొడయెక్కి యు

    ర్వీతలమందు బాఱీపడిరింగున   దొర్లును  దైత్యుఁజెరెని
    ర్బీతమనొబ్బయై   కలన   బిరమున   దనుగెల్వఁ  జాలుబం
    బ్రాతుల   డించి  తన్నుఁగొని  గ్రక్కునఁ    బొమ్మని  నెడవచెనన్

ఉ. బాడిదచెట్టు ళుస్కకుచబాగ యొకరు నరాశమున్

   జూదగానెక్కి    దమ్మహిజసూనచయం  బొంగి   నెండుకాయలం
   గూడి  నుపర్వనెరింపయ    గుపులుగాఁ   బడూపెంపుంనొల్చెఁ   బె
   నెఁడిమ  మింట    దైత్యుపయి   వెలువులుల్కలు    రాల్చిరొయన్

చ. అటుచని యూరబైటఁ గలయంజరించుచు నొక్క తావున

   బెటుకున    ముందుగా   జెవులపిల్లిని  గంనొని   కుక్క   గుంపుల
   బటుమతి  దానిపై  గతియఁ బంపగ  నవ్వియు    నెగీక్రమ్మఱన్
   దటుకున వచ్చె గాట్లుపడి తత్పురికుక్కల్క్వ ధైర్యమేమనన్
 ఉ. అవ్వల   నూరఁబందియొక  టడ్డమువచ్చినఁ  దద్బటావళుల్
      చివ్వకు  నీకులంగొనుడు   శింరును  పర్విడఁ  బంది    వారలన్ <poem>అబాగ్యొపాఖ్యానము

దవ్వులఁజూచి లొ బెదరి దారునబింగిని రింపగా నెవ్వడిఁ బాఱీరాబట్టులు నిల్వక దానికిలొంగ కుక్కున.

గీ. పందిఁ బొడువంక వచ్చినభటచయ్ంబు

    బెండుపడిపంట   లొడనె   బెదరియుఱీకె
    శశముఁ బట్టంగ  వచిన   సారమెయ
    విటతి  శశకంబుతొడన  వెనుకఁ దిరిగె.

వ. ఇట్లు భటశ్వానిసంబు బెదరి చెదరిస రాక్షసాద్యండు రూక్షవిక్ష ణుండయి కుక్కుర మర్కుటమార్జల శశకాద్య నెకాక్షద్రమృగ కులంబులఁ బొలియించి మృయానినొదంబు సలుపుచుండునొక్చచొ నొకతిరుక్షువు విక్షించి తురంగబు భయకులాంతరంగంబయి యికీలించుచు నవరాహ్ణసమయంయబున బురదనెల నతనిం గూలవైచి చనిన యనతంబర యింతకుమున్న విట్చరంబుచెఁ దఱనుంబడి యచ్చట దాఁగియున్న భృత్యుండొక్కరుండు చనుదెంచి లెపనెత్తిన

గీ. బురద  తుడిచుకొనుచు    బొక్కుచు   జనుదెంచి
    యతని  గ్రుచ్చియెత్తి    యాదరించి
    పందిచెత ఁబడక   పచివచ్చినయతి
    పొరుషంబుకొంత   బ్రస్తుతించి.
వ. అట్లసెదతె  తీరస్దీతనటనుహీరుహచ్చాయం  జెరి భృత్యసహితం

బుగా నందు విశ్రమించుయున్న యవసంబున.

చ. తునకమరొదంబుగతి సూకరనాదముభంగి గార్దభ

   స్వనమునిదంబు న   బ్రబలసైరిభరావము   పొల్కి  దవ్వుల
   నినఁబదె     రాక్షపాదమునివినుల   కెంతము   విందుసెయుచు
   భువనదంబు    భూమిదరగహ్వరజాలను    మాఱుమ్రోయఁగన్ <poem>అబాగ్యొపాఖ్యానము
 శా. అనాదం  బతఁడాలకిచి   తుదినాహయంచు   బావించి   చి
        త్తానందంబున భృత్యునింబిలిచి   నినాచప్పుడతెంచును
        స్దానంబారసి  వెగ  మాద్వని   ప్రభూతంతొటకుం   గారణం
       బాసదంబున   జెర  బుయి    కనిరమ్మా   యెస్వరట్వార్చిరొ.

క. అనాదము విన్నతనె,

    మానసమున   కెన్నరాని    మమతజనిచెను
    శ్వాననిరాదమొ  యొకఖర
    యాననినాదంబొ     వెగ   నారసి  చెపూమా.
చ. అనివిని  భృత్యుఁ డాక్షనము     యాసతిగై  గట్టుడిగి

ళ్ళను బెనుముండ్లు గ్రుచ్చుకొనలాగు మొగ్గురు వెగలెచుచున్ జనినిచని డొంకముండ్లు మెయి సర్వముఁ జిరుకుపొన నొర్చుచ్చు బొనుపరుచున పాడుగుడిపొంతను మొద్దగుచాపరాతిపైన్.

మ. కనిమెక   దానవదూత  సూక్షనయనన్   గాలాంతకాకార
      ర్దనజిప   ఖరవాణి    గిశసనుసక్త న్   రక్తపణాకాదమన్,
     గనదుద్యద్వసుదాదరాంచితవలగ్న   భూరినిలదరన్
     భుసదెహ  లసదుస్ఠ యాన    విలసత్కాంతాకదంబాదమన్.
చ. కనుగొని   దైత్యుచెంగతికి    గ్రమ్మవచ్చి   యతండువల్కె   నొ
      దనుజకూలపతంపను    ముదంబున  నీపటు   నిన్ను  ఁబపంగా
     ఘనమగుముండ్లు  చెట్ల నక   కంకరరాళ్ళన  కెంతదూరమొ
    చనిచని    పాదు దెవళముచక్కిని   నెను   మహద్బుతంబు.
సీ. పొడలుగల్గన  యట్టి  భూరిబహుయుగంబు
                                  జిగికొంద చిల్వలయుగము గాఁగ
    నెత్రాంతములనుండి   నెవ్వడఁబతెంచు
                                     కన్నిళ్ళు   సెలయేటిగములుగాఁగ.                        అభాగ్యోపాఖ్యానము

గర్ణరంధ్రములు ఘనవక్తృబిలమును

                                 రమమణీయతరగహ్వరములుగా 
అభాగ్యోపాఖ్యానము

గీ. కొమ్మగాదది మేటిపెద్దమ్మగాని
           బాలగాదది యముచేతికోలగాని
           కన్నె గాదది జనులకుమారిగాని
           నారిగాదది జనుల కుమారి గాని.

గీ. అట్టి కన్నియయును నీవు ననఁ పెనఁ
     కనరులేనట్టిమమతలఁ గలసిరేని
     యొందునీత చెట్టుపయిఁ గోరిందతీఁగె
      యల్లుకొనురీతిగాదె యోయమరవైరి.

                                                                అభాగ్యోపాఖ్యానము


<poem>:ఉ. దీనిని నేను వేడిననూ దిట్టునో కొట్టునో లోని కేగునో

మానినిఁ బల్మి బట్టుటయు మంచిదిగాదని యూరకుండి నే
నూనశరార్తి నెక్కరణి స్రుక్కుదు నేవిధినై నిప్పుడీ
చానను గూడువాడనని జప్పుడు సేయక మెల్ల మెల్లగాన్.
చ. వెనుకకు వచ్చి చేయొడిసి వేగనుబట్టిన లేచిదానవుల్
గనుఁగొని కొమ్మ తానెడమ కాలున ముందరిపండ్ల్లురాలఁ దా
చినదగనోర్చి నెచ్చెలియు చ్చీయన వెండియు గౌగిలింపజూ
చినఁ జెలి భీతి గర్భగుడిచేరెను దల్పులువైచి గొబ్బునన్.
ఉ. అంతట దైత్యుడుం దలుపుబల్లనగుద్దుచు నిన్నుఁ గూడ కొ
క్కింతయుఁ దాళలేననుచు నేడ్చుచులబ్బున మొత్తుకొంచు మి
న్నంతయుగూలి పై బడినయట్లు వితాకునగూరు చుండ నా
చెంతకు దార్పుకత్తెయొకచేడియ వచ్చె మెలంతనారయన్.
గీ. వచ్చి గుడిచెంతఁగూర్చున్న వారిఁగాంచి
మీరు ర క్తవర్ణాలక సై రిభాంగి
మర్కటానన పర్వతమధ్యభార
వనితనెందైనఁ గంటిరేయనుచునడుగ.
ఉ. దానివభ ర్తవల్కు వనితా వినుమిచ్చిటి కేను వేఁటకై
నేనలఁ గూడివచ్చి గుడిచెంగట నేడ్చుచునున్న దాని నీ
వానితియిడ్డలక్షములన్నియుఁ గల్గినదాని నొక్కకీ
శాననఁగాంచి కేలొకటనంటీన నీగుడిచూఱె నివ్వఱన్.
ఉ. ఆకనుదోయిసూక్ష్మతయు నాచనుతిత్తులమార్దవంబు నా
మైకటినత్వసంపదయు మానిని నేఁ గనుఁగొన్నయంత నే
సూకరగాత్రిపై మనసుసొచ్చెను నిక్కువమెట్టులైన నా
కాకవీవక్తఁ గూరిచి రయంబున నేలుము నీకుఁమెుక్కెదన్.

<poem>

అభాగ్యోపాఖ్యానము

ఉ. ఎయ్యదియూరు దీనినిభుఁడెవ్వఁడు పుట్టినవంశమెద్ది పే
    రెయ్యది మెంటిగా నిచటి కేటికివచ్చె నిటేడ్వఁగారణం
    బెయ్యది నాకుఁజెప్పఁగదవే కలరూపు కిటీంద్రయాన నీ
    వెయ్యదిగోరినన్ సరగనిచ్చెద దానినినన్నుఁగూర్చినన్.

చ. అన నదివల్కు నోజవవరా ఖరగామినిరీతిఁ జెప్పెద
        న్వినుము నుబుద్ధినాఁబరఁగునీయమభ ర్తయతండు రూపునన్
        మనసీజుగెల్పునైనఁజెలి పల్లవసంగతి యెప్డుకోరు గ్ర
        క్కునఁ బొరుగింటిపుల్లనగుకూరయుఁ దారుచిగాదె యేరికిన్.

ఉ. నిన్నటిరాత్రి యీమె యొకనీచభుజంగునిఁ గూడుచున్న చోఁ
       గ్రన్ననవచ్చి వల్లభుఁడు కన్గొని కోపముతోఁడవీఁడు నేఁ
       డిన్నడిరెయి యొంటి మనయిల్లుచొరంగ నిమిత్తమేదియో
       యున్నది యున్నయట్లు చెపుమూరకదాపక యన్నవిన్ననై.

గీ. బొంకుటకుఁజేతఁగాక యీఱంకులాడి
       నోర గుటకలు మ్రింగుచు నూరకున్నఁ
        గాంచి కోపించి యొకపెద్దకఱ్ఱతోడ
        వీపుబద్దలుగాఁగొట్టె వెలఁదినతఁడు.

ఉ. కొట్టిన మొత్తుకొంచు వడిగ్రుడ్డుల నీరొగిఁగ్రుక్కుకొంచుఁబెన్
     ఱట్టులఁ బెట్టివీధిఁబడి ఱాగతనంబునఁ బాఱివచ్చి యీ
     కట్టిఁడిఱంకులాడి తనకాపురమూడుటకోర్చి దేవళం
     బిట్టులుదూఱెఁ గన్గొనఁగ నిట్టివెయౌఁగద జారిణీగతుల్.

వ.అనికురంగగమన నవిస్తరంబుగా నామెఱుంగుబోఁడితెఱం గెఱిం
గించి తలుపుచేరి యిట్లని పిలువందొడంగె.

ఉ. డాయనుభీతిఁబొంద మగఁడా యనుఁ, దల్పులు తీయరాదె రం
     డాయనుఁ, బల్కవేమి చెవుడాయను సొమ్ములువెట్టు ఱంకుముం

డాయను వేగరావె మొఱడాయను లోవల జేరి యేడ్వగా
డాయను సిగ్గు బూనుటి వు డాయను నెచ్చె లి మా టీమాటికిన్. 72
           
తే. గొంతు పగులంగ వినువారి కెంతొచెవులు
తడకలునుగట్ట నాలుకపిడచవాఱ
నెంత యార్చి న ఁజెనిఁజొరనేకయుండె
దున్న పో తుపై వర్షంబు తొరగినట్లు. 73

చ.తడిసిననుల్క కక్కి గతి దామశిరో రుహ యంతకంతకుం
గడు బిగి యంగజూచి త ట కాపడి గుండె ను రా యిపడ్డ వే
నడ వఁగ లేక గో తి దరినక్క తెఱంగుఁగాచి యున్న యా
చెడు దను జుండు నెత్తి కిక జేతు లు వ చ్చె నటంచు రోజుచు 74
 
ఆ. కొంత సేపు పాడు గుడి చెంత గూర్చు ండి
రోదనంబుచేసి రోసి కూర్కి
తలు పు తిఅ యు జాడ గలనైనం గానక
విసిగి దూ తిగొంచు వెడలెగుడిని 75

చ.అటువలె దేవళంబవుడె యాయమతో డను దానవేంద్రుంచు
త్కట మగు కిన తో వెడలి గా ర్ద భ గామినిమిది ప్రేమ చేఁ
దటుకును బాయలేక మది దాలిమి దాలిచి పొంతనిల్చి మి
క్కు ట మగుధీన భావమున గూ ర్మి బయల్పడ దూతి కిట్లను . 76


క. ఓసీ ననునీ వివుడీ కాసరనిభగా త్రి తో డ గలి పె దవే ని
గాసు లపే రి చ్చె ద నీ యా సకు దగి న ట్టి రొక్క మటు లుండంగన్ 77
 
తే. అనిన నదియెంత వని యని య వు డె బయలు
దేరి దేవాలయంబు ను జేర బో యి 78
మెల్ల గా మి త్రు రాలి ని మేలి మొ ప్ప
బిలిచి వంత నె యా జెంత తలుపుతీసె.

క.తలువును దీ సి న వెనుకను

  బలుకులు చెవి లో న  ఁగొన్ని బహరమ్యముగా 
  నలు నొ ప్ప గజెప్పిన విని 
  యల ఖ రవాణి యు వి చా మంతయదీఱ,

క.చెలిక త్తి యతో గుసగుస

  బలు మారు నుమటలాడి  బహధన ము ను సొ 
  మ్ములు వలువలు ను రాక్షస 
  కులబాడబు ఁడి య్య నొప్పు కొన్న నువార్త .

ఉ.తిన్నఁగ విన్న పి మ్మట ను దీ యని మాటలు చెప్పి వాని తోఁ గొన్ని వికార చే ష్టలను గూ డుట కుబ్బున సమ్మతించె నా చెన్నన ఁటి దూ తియు న్మారల శీష్రుముగా దను జాధ మా ధ ము ౯ దెన్ను న గాంచిసర్వ మును దెల్పి సు రాలయబాహ్య భూమికిన్

తే . తో డు కొనివచ్చి గుడిలోన దూ ఱుమనుచు

      సైగచేసిన వాఁడును వేగ ఁజొచ్చి 
      తలుపు లో పల బిగియించి తగినయంత 
      గబ్బిలపు పెంటగమ్మునఁగంవు కొట్ట.

తే. ఉక్కలోనా పెతో సౌఖ్యమొందు చుండె మిగులఁ దనలోనగుటకలు మి ంగు కొనుచు జేతు లొండొంటితో జేర్చి దూతిక యును గడపముందట గావలి కాచుచుండె.

తే . ఈకధానాయిక యయిన యిగురు బోడి మగ డుకొత్తిన వేధులు మాఱు మో బెద్ద పెట్టున నేడ్చుచు వీ డు వెడలి పో యి యెందు ను గన రాక మా యయిన .

సీ. ఏనూతిలోపల నేగికూ లెనొందు
భయపడి మగడు ను బంధు వులును
వీధి వీధుల వెంట వెదకుచు బ ఱతెంచి
జాడల బట్టి యాపాడు గుడిని
జేరియచ్చో టను జి డుము పొక్కులు గో కు
కొందుచు గడపలో గూ రుచున్న
దూ తిక బొడగాంచి దుర్మార్గురాలైన
యీలంజెముది ముండమూలముననె

మనకు నిన్ని పొటులువచ్చె నను చు బలికి
యంద ఱును జేరి యా దూ తినంట గట్టి
నెనుక సున్నములోకి నెముక లేక
యుండ దరించి పిడీ గుద్దు లొక ట ఁబఱపి .

గీ. అటుపిదప నర్ధ చంద్ర ప్ర హారములను
దానియబ్బతోడను జెప్పు కోనుబంచి
వెనుక దేవాలయ ముతల్పు వేసియుంట
కాంచి లోపల నెవ్వరొ కలరటంచు .

క. ఊహించి తలపు లొక్కట
బాహాబల మొప్పగుంజి పగిలిన మిద
సాహసమున లో జొర బడి
దేహంత బంత యు జెమర్ప దిగులునమూ లన్

గీ. ఒదిగివడ కుచున్న యుష్ట యాన ను రాక్ష
సాధ మునిని జూచి యలుకతోడ
వీ సెగు ద్దు లొకట వేన వేల్ కు రిపించి
కొప్పు జుట్టు బట్టిగుంజి యీ డ్చి.

<poem>

అభాగ్యోపాఖ్యానము

గీ. వెలుపలికిదీసికొనివచ్చి వీపుమీద
ముఖముమీదను మెడ మీదముక్కుమీద
మణుగుగుద్దులవానలు మచ్చుచూపి
పిండిపెట్టి రభాగ్యుని నిన్ డుగాను.
గీ. దెబ్బలకుఁదాళ జాలక దితిజవరుఁడు
తిరుగబడి బండతనమునఁ దెగువచేసి
వారితోడను బోరాడ వడిగడంగ
వారలందఱు నా గ్రహావార్యవ్రుత్తి.
తటుకునఁ జుట్టుముట్టి పదతాడనకూర్పరఘట్టనంబుల౯
జిటిపొటిమొట్టికాయలను జేరల నిండిన చెంపకాయలన్
బటుతర ముష్టిఘాతములఁ బల్మఱునుంవెదచెల్లి దేహమం
తట రుధిరమ్ము గ్రమ్మఁ గఱిదైత్యుని నెఱ్ఱనివానిఁ జేసినన్.
ఉ. తాళగలేక సొమ్మసిలి దానవుడల్లనమూర్చవోవగా
బాలిక బందువుల్గని యభాగ్యుఁడు చచ్చెంటంచు నెంచి యా
భీలతఁ జాపలోపలనుబెట్టి యభాగ్యునిఁ జుట్టికట్టి దే
వాలయపూర్వ భాగమునయందలిగోతను వైచిరొక్కటన్.
క. వైచి పురంబు తలారులు
చూచిన మోసంబువచ్చుఁ జూడకయుండ౯
వేచన వలె ననిగొబ్బున
నాచంచలహ్రుదయఁ గొంచు నరిగిరివురికిన్
వ. అంత నిచ్చట.
గీ. విట్చరంబుతఱుమ వెఱచిపర్విడివచ్చి
గోతియందుదాఁగి కూరుచుండి
పందిగుంపులచట బయలనుదిరుగుచు
సునికిఁ జేసి పయికిఁజనఁగ నోడి.

<poem>

అభాగ్యోపాఖ్యానము

క. భటులిరువురు గర్తమునం

దటు నిటువీక్షించుచుండి యదటునదమపై
నటు దయ్యమువలె శవమొ
క్కటిపడినన్మూర్ఛ పొంది ఘటికాద్వయికిన్.

 క. తెలివొంది కనులువిప్పుడు
నలశవముం గలదజొచ్చె నాళూరులకున్
గళవళ మినుమడికాగను
బెళపెళ యని చాపచుట్టు బిట్టుగ మ్రోయన్.

ఉ. అంతట నాభిటద్వితయ మాత్మదలంకుచు బైకిబోయినన్
గంతునవచ్చి ఘుర్ఘరము గ్రక్కున జంపునొ క్రిందనుండినన్
సంతస మాఱ దయ్యమిది చంపునొ యక్కట మేమి బుధి యం
చెంతయు జింతనొంది పనియేమియు దోచకయుండ నింతలోన్.

గీ. చాపలోనుండి "ఘనులార! చాపకుండ
బంధములువిప్పినన్నింత బ్రతుక జేయు"
డనెడువాక్యంబు విననై ననానవాలు
పట్టి తమరాజుస్వరమౌట వడీనెఱింగి.

గీ. కట్లు విప్పితీయ గాయంబునిండను
గాయములు చెలంగ గనులువిచ్చి
దై త్యనాధుడపుడు తనప్రాణభృత్యుల
యాననముల జూచె దీనవృత్తి.

క.అన్యోన్యముఖాలోకన
ధన్యత్వము జెంది భటులు దనుజేంద్రుండున్
నవ్యస్తభయభ్రాంతత
నన్యోన్యక్షేమవార్త లారసి రల్లన్.

అభాగ్యోపాఖ్యానము

క. అరసి తమకొదవినయా
               ఘోరాపదలెల్ల్లఁ బాసి కుట్టూపిఱితో
                ధారుణిభోఁ గ్రమ్మఱఁదా
                మీరీతిన్మె

అభాగ్యోపాఖ్యానము

క. శయినింపజేసి యిద్దఱు

దయతోడ న్మూపుపై నిఁ దద్వాహనమున్
గయికొని పరమపదంబున
కయి చేర్చు మహనుభావుకరణిని నృవునిన్.

వ. వహించి మృగ యావినోద మహోత్సవంబు నిర్వర్తి మచి పునఃపుర

ర్పవేశంబు చేయ నవధరించు నవవీధపుంగవుం బురవీధుల నూరే
గించు మహావైభవంబపూర్వంబై యుండ నాసమయంబున.

సీ. అత్యద్భుతంబైన యావహనంబును

వీక్షించికుర్కురవితతి మొఱుగ
వీధివెంటనుబోవు విధంవాగనలుచూచి
శవమని వెనుకకు సరగనరుగఁ
బయనుండిబాధచే వడిమూల్గుటాలించి
తమచుట్టమని ఘూకతతులు చేరఁ
గ్రొత్తగా శవవాహకులు వచ్చి రెందుండి
యని ప్రతవహకు లడుగుచుండ
శ్వాననినదంబు మాగధ స్తవముగాగగ
అభాగ్యోపాఖ్యానము</cemter>

గీ. వైద్యులను బిల్వనంపించి వారిచేత
    నౌషధంబులుచేయించి యక్కజముగ
     బాధకుసహింపలేక యభాగ్యనృపుఁడు
     మందుపట్టింపక శరీరమందొకింత.

క. వరుసగ మొలయునుదలయును
     శిరమును గరములంనువాచి చెప్పంగఁ గవీ
     శ్వరులెవ్వారును నొల్లని
     మరుదశమావస్ధ నతఁడు మానకచెందె౯.

క. ధరణి నభాగ్యమహాసుర
     చరితము విన్నట్టిపుణ్యచరితులకెల్ల౯
     బరావనితారతిచెడునని
     పరిహాసకుఁ ఢానతిచ్చెఁ బాండుసుతునకు౯.

మాలిని. అనుపమగుణసాంద్రా యాదవాంభోధిచంద్రా
      జనఘననుతిపాత్రా సజ్జనాంభోజమిత్రా
      వనధికృతవిహారా వల్ల్లవీచిత్తచోరా
      దనుజచయవిరామా దర్పితారాతిభీమా.

                                                గద్యము.

      ఇదిశ్రీమత్సకలసుకవిజననిధేయ కందుకూరి వీరేశలింగ
      నామధేయ కల్పితంబయిన యభాగ్యోపాఖ్యానంబను
                  హాస్యప్రబంధంబునందు సర్వంబును
                                  నేకాశ్వాసము.