శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలుగు కీర్తనలు

రాగం: షడ్విధమార్గిణి                   తాళం: తిస్రనడ

పల్లవి:
ఓ జననీ! నీ పదమే నా శిరసుననూ
నీరజదళమై నేడు మెరసెనూ

ఈ నవనవ రాత్రుల గల పావనమహిమా
నా పెదవుల ఈ పదముల సాగెను వినుమా
నువు గదా! తెలివివీ శివసతీ లలామా!

ఆకసమున సాగరమున భూస్థలముననూ
నీ మెరపుల నీ నగవుల నీ సొగసులనూ
కనుగొనీ శుభమనీ మురిసితీ మరీనూ

లక్ష్మివి నువు - కాళివి మరి వాణివి జననీ!
నీ సరి తులతూగరు సురలో కరుణధునీ!
తెలియగా సచిదానందదవుగా భవానీ!

[ఈ పాట MP3]