ఓంకారం సకలకళా శ్రీకారం

జగద్గురు ఆదిశంకర (2013)

ఓంకారం..ఓంకారం..
ఓంకారం సకలకళా శ్రీకారం
చతుర్వేద సాకారం
చైతన్య సుధాపూరం
జ్నానకమల కాసారం
జ్నానపరిమళాసారం
మధుర భక్తి సింధూరం
మహాభక్త మందారం
భవభేరీ భాంకారం
హృదయశంక హుంకారం
ధర్మ ధనుష్టంకారం
జగద్విజయ ఝుంకారం
అద్వైత ప్రాకారం
భజే..హం...

ఆండాకారాండపిండ
భాస్వద్ బ్రహ్మ్హాండ భాండ
నాదాలయ బ్రహ్మాత్మక
నవ్యజీవనాధారం
వర్ణరహిత వర్గమధిత
లలిత లలిత భావ లులిత
భాగ్య రచిత భోగ్య మహిత
వసుధైక కుటీరం...

కామితార్థ బంధురం
కల్యాణ ఖండరం
సద్గుణైక మందిరం
సకలలోక సుందరం
పుణ్యవర్ణ పుష్కరం
దురిత కర్మ దుష్కరం
శుభకరం సుధాకరం
శురుచిరం సుధీపరం
భవకరం భవాకరం
త్రియక్షరం అక్షరం
భజే..హం...

మాధవ మాయా మయబహు
ఖటిన వికట కంటకపద
సంసార కానన సుఖ జ్నాన శకట విహారం

అష్టాక్షరీ ప్రసిస్థ పంచాక్షరీ విశిష్ట
మహామంత్ర యంత్ర తంత్ర మహిమాలయ గోపురం
ఘన గంభీరాంబరమ్ జంబూ భూబంబరం
నిర్మలయుగ నిర్ధరమ్ నిరుపమాన నిర్ఝరం
మధుర భోగి కుంజరం
పరమయోగి పంజరం
ఉత్తరం నిరుత్తరం
మనుత్తరం మహత్తరం
మహాకరం మహంకురం
తత్వమసీ తత్వరం
తధితరత్త మోహరం
మృత్యోరను తత్వకరం
అజరం మమరం అకారం ఉకారం మకారం

ఓంకారం... ఆద్వైత ప్రాకారం...