ఒక్కమాట..కవితత్వాలు/వనజ తాతినేని
పుట్టినది: మార్చి 12 పోరంకి, కృష్ణా జిల్లా
వృతి: గృహిణి, స్వయం ఉపాధి పథకం ద్వారా ఇతరులకి తోడ్బాటు కల్పించడం
తొలి కవితా సంకలనం "వెలుతురు బాకు” ప్రచురణ దశలో ఉంది.
విజయవాడ ఎక్స్‌రే సాహితీ సంస్థ ఆధ్వర్యంలో "నెల నెలా వెన్నెల” కవితా కార్యక్రమాన్ని ఏడేళ్ళపాటు నిర్వహించారు
http://www.facebook.com/vanajavanamali
vanajavanamali@gmail.com
http://vanajavanamali.blogspot.com
Ph: 9985981666
ఈస్ట్రోజన్ సూదిమందు బారినపడే
తెరమీద బేబీ ఐనా
కసువుూడ్చి... కళ్ళాపిజల్లి ముందు కన్న
పిల్లల్ని సాకుతూనే ఉన్న పేదరికమైనా.
ఇట్టా ఉంటే బాల్యం ఎట్టా బాగుంటాదని నిలదీస్తుంది.
పంజరంలో పక్షిలా మనసే కాదు
జీవితం కూడా స్వేచ్చ కోసం
అల్లాడి పోతుంటుంది అంటుంది.
మట్టిగాజుల చిట్టి తల్లులని
ఆడపడుచులని కాపాడుకోవడానికి
రాళ్ళల్లో వడ్గగింజలా
జీవితం జీవించి చూపాలని, ఇతరుల ప్రేమని
ఆశించకుండా ఉండటం అవసరమని.
కరిగిన ఘన సమయాలను ఒడిసిపట్టుకుంటూ
ఈ నిఖిల చంద్రుడి వెన్నెల వనజ
అనుభవంతో... నొక్కి చెప్తుంది
హృదయంతో..స్పందించి,
మనసులో... మధించి,
ఆలోచన అగ్నికణం రగిలించి,
తేట తేనియ భాషతో.
అక్షర లక్షల సుమాలతో...
నవరస కదంబమాలికలు...అల్లడమే...
కవిత్వం అంటుంది