సంస్కృత సంధులు: 1. సవర్ణదీర్ఘ సంధి: అ - ఇ - ఉ - ఋ లకు అవే అచ్చులు పరంబగునప్పుడు క్రమముగా వాని దీర్గమేకదేసమగును.

    (లేదా)

అ - ఇ - ఉ - ఋ అనే వర్ణాలకు సవర్ణాలు కలసినప్పుడు దీర్ఘం తప్పనిసరిగా రావడాన్ని సవర్ణదీర్ఘ సంధి అంటారు. 'అ' వర్ణానికి 'అ - ఆ' లు సవర్ణాలు 'ఇ' వర్ణానికి 'ఇ - ఈ' లు సవర్ణాలు 'ఉ' వర్ణానికి 'ఉ - ఊ' లు సవర్ణాలు ఉదాహరణలు: విద్యార్థి = విద్య+అర్థి (అ + అ = ఆ) రామానుజుడు = రామ+అనుజుడు (అ + అ = ఆ) విద్యాలయం = విద్య + ఆలయం (అ + ఆ = ఆ) కవీంద్రుడు = కవి + ఇంద్రుడు (ఇ + ఇ = ఈ) భానూదయం = భాను + ఉదయం (ఉ +ఉ = ఊ)


2. గుణ సంధి: ఏ - ఓ - అర్ అనే వాటిని గుణాలు అంటారు. వీటితో ఏర్పడే సంధి నే గుణసంధి అంటారు. అకారమునకు ఇ - ఉ - ఋ లు పరమైనపుడు వాటికీ క్రమముగా ఏ - ఓ - అర్ లు ఆదేశమగును. ఉదాహరణలు: గజేంద్రుడు = గజ + ఇంద్రుడు (అ + ఇ = ఏ) బకోత్తమ = బక + ఉత్తమ (అ + ఉ = ఓ) మహర్షి = మహ + ఋషి (అ + ఋ = అర్)


3. వృద్ధి సంధి: అకారమునకు ఏ - ఐ లు పరమైనపుడు 'ఐ' కారమును, ఓ - ఔ లు పరమైనపుడు 'ఔ' కారము ఆదేశమగును. ఉదాహరణలు: ఏకైక = ఏక + ఏక (అ + ఏ = ఐ)3. వసుదైక = వసుధ + ఏక (అ + ఏ = ఐ) మూలౌషది = మూల + ఔషధీ (అ + ఓ = ఔ) https://te.wikipedia.org/wiki/%E0%B0%B6%E0%B1%8D%E0%B0%AE%E0%B0%B6%E0%B0%BE%E0%B0%A8%E0%B0%B5%E0%B0%BE%E0%B0%9F%E0%B0%BF%E0%B0%95_(%E0%B0%9C%E0%B0%BE%E0%B0%B7%E0%B1%81%E0%B0%B5%E0%B0%BE_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B2%E0%B1%87%E0%B0%B7%E0%B0%A3) జాషువా కవీంద్రుని కలంనుండి జాలువారిన మరో అద్భుత ఖండకావ్యం శ్మశానవాటిక. మానవులు జీవించి వుండగా వెళ్ళటానికి చూడటానికి యిష్టపడని ప్రదేశాలు రెండు.ఒకటి వైద్యశాల.రెండు శ్మశానం,/వల్లకాడు,/రుద్రభూమి.జాతస్య హి ద్రువం మృత్యు. పుట్టిన ప్రతి వాడు గిట్టక తప్పదు.చావును తప్పించుకున్న వాడెవ్వడూ లేడు ధరణిలో.అందరు ప్రస్దానముకేగవలసిన వారే.

ఈ రుద్రభూమికి చెడ్డవాడు,మంచివాడనే తేడాలేదు.యాజమాని,సేవకుడనే వ్యత్యాసంలేదు.హతుడు హంతకుడు యిద్దరు సమానమే ఈ నేలలో.కవి,రాజు,లేత యిల్లాలి మాంగల్యం,చిత్రకారుడు ఎవ్వరైతేనేమి ఆయ్యుస్సు తీరాక యిక్కడ విశ్రమించవలసిన వారే!.సృష్టికి లయకారుడు శివుడు.ఆయనకిష్టమైనది తాండవం.అట్టి శివతాండవానికి అనువైనది ఈ శ్మశానవాటిక కన్నమిన్న ఏమున్నది. ఈ వాటిక శివుడు తన పిశాచఅనుచరగణంతో నాట్యమాడు రంగస్ధలమంటున్నడు కవి. అంతేకాదు ఈ రుద్రభూమి మరణదూత భూమిని పాలించు బూడితతో చేసిన సింహసనమట! ఎంతలోతు భావం కవిది. కవిహృదయం ఏమంటుందో చూడండి.

 ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని
    కలము,నిప్పులలోనఁగఱగిఁపోయె !
 యిచ్చోట;నే భూము లేలు రాజన్యుని
   యధికారముద్రిక లంతరించె!
 యిచ్చోట; నే లేఁత యిల్లాలి నల్లపూ
   సలసౌరు,గంగలోఁగలిసిపోయె!
 యిచ్చోట; నెట్టి పేరెన్నికం గనుఁగొన్న
   చిత్రలేఖకుని కుంచియ,నశించె!


 ఇది పిశాచులతో నిటాలేక్షణుండు
 గజ్జె గదలించి యాడు రంగస్ధలంబు;
 ఇది మరణదూత తీక్షణమౌ దృష్టు లొలయ
 నవనిఁ బాలించు భస్మసింహాసనంబు

జాషువ ఈకావ్యం మొదటీ పద్యంలో ఈవిషయాన్నే ప్రస్తావిస్తు,ఈ శ్మశానవాటికలో కొన్నివందల,వేల ఏండ్లగా నిద్రిస్తున్నవారు ఒక్కరుకూడా లేచి రాలేదు కదా అంటు ప్రారంభించాడు.ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈచలనంలేని నిద్ర అంటూ వాపోతున్నాడు.ఈ రుద్రభూమిలో తమబిడ్దలను పొగొట్టుకున్న తల్లుల రోదనలతో నిండిన కన్నీళ్ళకు వల్లకాడులోని రాళ్లు క్రాగిపోయ్యాయి అని చింతిస్తున్నాడు. కవిహృదయం చూడండి.

  ఎన్నో యేండ్లు గతించిపోయినవి గానీ,యీ శ్మశానస్ధలిన్
  గన్నుల్ మోడ్చిన మందభాగ్యుడొకఁడైనన్ లేచిరాఁ,డక్కటా!
  యెన్నాళ్ళీచలనంబులేని శయనం? బేతల్లు లల్లాడిరో!
  కన్నీటంబడి క్రాఁగిపోయినవి నిక్కంబిందు పాషాణముల్


https://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B1%81%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AA%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF_%E0%B0%8E%E0%B0%97%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8_%E0%B0%95%E0%B1%81%E0%B0%82%E0%B0%A1%E0%B0%B2%E0%B0%82%E0%B0%AC%E0%B1%81%E0%B0%B2_%E0%B0%95%E0%B0%BE%E0%B0%82%E0%B0%A4%E0%B0%BF#%E0%B0%9B%E0%B0%82%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B8%E0%B1%81

కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి అంటూ సాగే పద్యం బమ్మెర పోతన రచించిన ఆంధ్ర మహాభాగవతము లోనిది. భాగవతంలోని ఈ పద్యం మరో నాలుగు పద్యాలతో పాటు భీష్మస్తుతిగా పేరొందింది. కురుక్షేత్రంలో ఆయుధం పట్టను అన్న ప్రతిజ్ఞ ను, అర్జునుడిపైన ఉన్న వాత్సల్యంతో, పక్కనపెట్టి తనను చంపేందుకు దూకిన కృష్ణుణ్ణి భీష్ముడు వర్ణిస్తూ స్తుతిస్తున్న సందర్భంలోని పద్యం ఇది. పద్యం[మార్చు] సీ. కుప్పించి ఎగసినఁ గుండలంబుల కాంతి

           గగన భాగంబెల్లఁ గప్పి కొనఁగ
   నుఱికిన నోర్వక యుదరంబులోనున్న
           జగముల వ్రేఁగున జగతి గదలఁ
   జక్రంబుఁ జేపట్టి చనుదెంచు రయమునఁ
           బైనున్న పచ్చని పటము జాఱ
   నమ్మితి నాలావు నగుఁబాటు సేయక
           మన్నింపు మని క్రీడి మఱల దిగువఁ

తే. గరికి లంఘించు సింహంబు కరణి మెఱసి

   నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁ గాతు
   విడువు మర్జున! యనుచు మద్విశిఖ వృష్టిఁ
   దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు.

తాత్పర్యం[మార్చు] రథం మీద నుంచి కుప్పించి ఎగసి నేల మీదకి దూకేటప్పుడు కృష్ణుని చెవుల రత్నకుండలాలు కిందికీ పైకీ ఊగి వాటి కాంతి ఆకాశమండలాన్నంతటినీ కప్పుకున్నది. ఎగిరి దూకేసరికి ఆయన కుక్షిలో ఉన్న భువనాల బరువుతో జగత్తు అదిరిపోయిందట. చక్రాన్ని చేపట్టి వేగంతో పరుగెత్తే ఆయన భుజాల మీద ఉన్న పీతాంబరం ఒకవైపు ఆ ఒడుపుకు జారిపోతున్నదట. అనూహ్యమైన ఈ చర్యకు అర్జునుడికి రోషం వచ్చింది. తనూ దిగి కృష్ణుని ఒక కాలును పట్టుకుని నిలిపే ప్రయత్నం చేసి రోషంతో-నా యోగ్యతను నగుబాటు చెయ్యకని వేడుకుంటున్నాడు. ఏనుగు మీదకి లంఘించే సింహంలా ఉరకలు వేస్తూ – ‘ఇవాళ భీష్ముణ్ణి చంపి నీ మార్గాన్ని నిష్కంటకం చేస్తాను, నన్ను ఒదిలిపెట్టు అర్జునా’ అంటూ – ముందుకొస్తున్న ఆ దేవుడు – నా బాణాల దెబ్బకు వడలి, ఉత్తేజితుడైన ఆ పరమేశ్వరుడు – నాకు దిక్కు అగు గాక! సందర్భం[మార్చు] కుప్పించి ఎగసిన... ఆదిగా కలిగిన ఈ పద్యం పోతన వ్రాసిన శ్రీమదాంధ్ర భాగవతం లోనిది. కురుక్షేత్రంలో 11 రోజుల పాటు యుద్ధం చేసి, గాయాలతో అంపశయ్య మీద పడుకుని ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వేచిచూస్తున్న భీష్ముడి వద్దకు కురుక్షేత్రం ముగిశాకా కృష్ణుడు, పాండవులు వస్తూండగా వారితో బ్రహ్మర్షులు, రాజర్షులు, మహర్షులు తమ శిష్యసమేతంగా వచ్చారు. ఆ సందర్భంలో భీష్ముడికి భారతయుద్ధంలో మూడవరోజు తన విజృంభణకు అర్జునుడు ఆగలేకపోగా, కృష్ణుడు ఎలా తనమీదకు చక్రధారియై వచ్చాడో గుర్తుకువచ్చింది. ఆ ఘట్టాన్ని వర్ణిస్తూ కృష్ణుడిని స్తుతించాడు. అటువంటి సందర్భంలోని పద్యం ఇది.[1]

https://te.wikipedia.org/wiki/%E0%B0%9A%E0%B0%BF%E0%B0%B2%E0%B0%95%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF_%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%8D%E0%B0%AE%E0%B1%80%E0%B0%A8%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BF%E0%B0%82%E0%B0%B9%E0%B0%82


చిలకమర్తి లక్ష్మీనరసింహం భరతఖండంబు చక్కని పాడియావు హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు బిగియగట్టి

https://te.wikipedia.org/wiki/%E0%B0%A1%E0%B0%BF%E0%B0%9C%E0%B0%BF%E0%B0%9F%E0%B0%B2%E0%B1%8D_%E0%B0%B2%E0%B1%88%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B0%E0%B1%80_%E0%B0%86%E0%B0%AB%E0%B1%8D_%E0%B0%87%E0%B0%82%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8B%E0%B0%A8%E0%B0%BF_%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81_%E0%B0%AA%E0%B1%81%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2_%E0%B0%9C%E0%B0%BE%E0%B0%AC%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BE_-_%E0%B0%B0


https://te.wikipedia.org/wiki/%E0%B0%85%E0%B0%AE%E0%B1%81%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4_%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82%E0%B0%A5_%E0%B0%9A%E0%B0%BF%E0%B0%82%E0%B0%A4%E0%B0%BE%E0%B0%AE%E0%B0%A3%E0%B0%BF

భర్తృహరి సుభాషితములలోని ఈ క్రింది పద్యము ప్రచురింపబడింది.

విద్య నిగూఢగుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్ విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశబంధుఁడున్ విద్య విశిష్టదైవతము విద్యకు సాటి ధనంబులేదిలన్ విద్య నృపాల పూజితము విద్యనెఱుంగని వాఁడు మర్త్యుఁడే


సీ. బ్రతికినన్నాళ్లు నీ - భజన తప్పను గాని మరణకాలమునందు - మఱతునేమొ యావేళ యమదూత - లాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి - పట్టునపుడు కఫ వాత పైత్యముల్ - గప్పగా భ్రమచేత గంప ముద్భవమంది - కష్టపడుచు నా జిహ్వతో నిన్ను - నారాయణా యంచు బిలుతునో శ్రమచేత - బిలువలేనొ

తే. నాటి కిప్పుడె చేసెద - నామభజన తలచెదను, జెవి వినవయ్య! - ధైర్యముగను. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!




శార్దూలవిక్రీడితము

  పవి పుష్పంబగు నగ్నిమంచగు నకూపారంబు భూమీస్థలం
  బవు, శత్రుండతిమిత్రుఁడౌ విషము దివ్యాహారమౌ నెన్నఁగా
  నవనీమండలిలోపలన్ శివశివేత్యాభాషణోల్లాసికిన్
  శివ నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వరా!

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! వజ్రాయుధము కూడా పుష్పమాలికవుతుంది, అగ్ని మంచులా మారుతుంది, సముద్రము నేలగా పరిణమిస్తుంది, అత్యంతశత్రువు మిత్రుడవుతాడు, విషము ఆహారమౌతుంది కదా ప్రభో "శివ శివా" అని సదా నీ నామ సంస్మరణము చేయువానికి సర్వమూ వశ్యమవుతుంది.


https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%8B%E0%B0%A4%E0%B0%A8_%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81_%E0%B0%AD%E0%B0%BE%E0%B0%97%E0%B0%B5%E0%B0%A4%E0%B0%AE%E0%B1%81/%E0%B0%85%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A0%E0%B0%AE_%E0%B0%B8%E0%B1%8D%E0%B0%95%E0%B0%82%E0%B0%A7%E0%B0%AE%E0%B1%81/%E0%B0%97%E0%B0%B0%E0%B0%B3%E0%B0%AD%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%A3%E0%B0%AE%E0%B1%81 శి క్షింతు హాలహలమును భ క్షింతును మధురసూక్ష్మ ఫలరసము క్రియన్ ర క్షింతుఁ బ్రాణి కోట్లను వీ క్షింపుము నీవు నేఁడు వికచాబ్జముఖీ!

మ్రిం గెడి వాఁడు విభుం డని మ్రిం గెడిదియు గరళ మనియు మే లని ప్రజకున్ మ్రిం గు మనె సర్వమంగళ మం గళసూత్రంబు నెంత మది నమ్మినదో!







శార్దూలవిక్రీడితము

   "అమ్మా! యయ్య!" యటంచునెవ్వరిని నేనన్నన్శివా! నిన్ను నే
   సుమ్మీ నీ మదిఁ తల్లిదండ్రులనటంచు న్జూడఁగాఁబోకు నా
   కిమ్మైఁ దల్లియు దండ్రియున్‌ గురుఁడు నీవేకాన సంసారపుం
   జిమ్మంజీకటిఁగప్పకుండఁ గనుమా! శ్రీకాళహస్తీశ్వరా!

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! అమ్మా, అయ్యా అని నేను ఎవ్వరిని పిలిచినా అది వేరే ఎవరినో అని నీ మదిలో చూడబోకు. ఈ జన్మకు నాకు తల్లీ, తండ్రీ, గురువు, దైవమూ అన్నీ నిన్నుగానే భావించినాను. అట్టి నీవే ఈ సంసారము అనే పెను చీకటి నన్ను ముంచివెయ్యకుండా కాపాడు. ప్రభో! ౨౭[మార్చు] మత్తేభవిక్రీడితము

   కొడుకుల్‌ పుట్టరటంచు నేడ్తురవివేకు ల్జీవనభ్రాంతులై
   కొడుకుల్‌ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్‌ వారిచే నేగతుల్‌
   వడసెం బుత్త్రులులేని యా శుకునకున్‌ బాటిల్లెనే దుర్గతుల్‌
   చెడునే మోక్షపదం బపుత్త్రకునకున్‌ శ్రీకాళహస్తీశ్వరా!

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! కొడుకులు లేరు అని జీవితము మీది అనురాగముతో అవివేకులై జనులు ఏడ్చెదరు. ధృతరాష్ట్రునికి ౧౦౦ మంది కొడుకులు కలిగికూడా ఏ గతులు పొందినవాడయ్యెను. పరాశరుడు ఒకడే కొడుకున్న శుకమహర్షికి దుర్గతులు కలుగలేదు కదా ప్రభో!


అష్టదిగ్గజములు

అల్లసాని పెద్దన | నంది తిమ్మన | ధూర్జటి | మాదయ్యగారి మల్లన | అయ్యలరాజు రామభధ్రుడు | పింగళి సూరన | రామరాజభూషణుడు | తెనాలి రామకృష్ణుడు


ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిన పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము


6. కనకదుర్గాస్తుతి

ఉ. అమ్మలఁ గన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె ద్దమ్మ సురారులమ్మ కడుపాఱడి వుచ్చిన యమ్మ తన్ను లో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నండెడి యమ్మ దుర్గ మా యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్.(1-8)


కం. పలికెడిది భాగవతమట, పలికించెడివాఁడు రామభద్రుండఁట నేఁ , బలికిన భవహరమగు నఁట, పలికెద వేఱొండు గాథఁ బలుకఁగ నేలా. (1-16)

"https://te.wikisource.org/w/index.php?title=ఐమోన్స్&oldid=206035" నుండి వెలికితీశారు